ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి | Puttaparthi Student Selected As 15th Dalai Lama Was Fake News | Sakshi
Sakshi News home page

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

Published Tue, Jul 16 2019 3:41 PM | Last Updated on Tue, Jul 16 2019 3:41 PM

Puttaparthi Student Selected As 15th Dalai Lama Was Fake News - Sakshi

సాక్షి, హైదరాబాద్ : 15వ దలైలామాగా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపికయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. సత్యసాయి పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల దావావంగ్డి 15వ దలైలామాగా ఎంపికయ్యాడంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దలైలామా ఆఫీసు కొట్టిపారేసింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, 15వ దలైలామాగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దావావంగ్డి సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందినవాడే కాదని తేలింది. అతనికి సత్యసాయి స్కూల్‌తో ఏ మాత్రం సంబంధంలేదని స్పష్టమైంది.

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ప్రేమవంగ్డి,పంజూరాయ్‌ల కుమారుడు దావవంగ్డి కాగా.. 2016 లో అతన్ని ‘ద్రాక్త్సే రిన్పోచే’ అనే బౌద్ధ గురువు యొక్క అవతారమని 14వ దలైలామా గుర్తించినట్టు ‘జీ న్యూస్’  ఓ కథనంలో పేర్కొంది.  కానీ తననే ఇప్పుడు 15వ దలైలామాగా ఎన్నుకున్నట్టు  మాత్రం ఎక్కడా సమాచారం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement