puttaparthi
-
పుట్టపర్తిలో దారుణం..
-
భారతీయ సంస్కృతిపై విదేశీయుల ఆసక్తి
సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు. శనివారం శ్రీసత్యసాయి 99వ జయంతి సందర్భంగా విదేశీయులతో ‘సాక్షి’ మాటామంతీ.. ప్రశాంతతకు మారుపేరు పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు. – ఒట్టావి, ఫ్రాన్స్ సంప్రదాయాలు బాగున్నాయి తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు. – డానేలా, ఇటలీసాయిబాబా వ్యక్తి కాదు.. శక్తి 1980 నుంచి పుట్టపర్తికి వస్తున్నా. సాయిబాబా ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ శక్తి. ఇక్కడ చాలామంది పరిచయమయ్యారు. సొంత బంధువుల్లా ఆదరిస్తారు. తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నా. – లిండా, లండన్ సాయిబాబానే బతికించారు ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. నేను మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. బాబానే బతికించాడని నమ్ముతున్నా. ఏటా బాబా జయంతి వేడుకలు మిస్ కాకుండా వస్తా. దోశ అంటే చాలా ఇష్టం. – ఫెర్నాండో, ఇటలీ అతిథులకు లోటు రానివ్వం భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం. ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా సాదరంగా స్వాగతిస్తాం. వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. బాబా ఆశయాల సాధన మేరకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు ఉన్నాయి. చిన్న గ్రామాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి భగవాన్ శ్రీసత్యసాయిబాబా. – ఆర్జే రత్నాకర్రాజు, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ -
పుట్టపర్తిలో భారీ చోరీ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సాయి సందీప్ విల్లాస్–2లో భారీ చోరీ జరిగింది. పుట్టపర్తి రూరల్ సీఐ సురేష్, ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు... సాయి సందీప్ విల్లాస్–2లోని 40 నంబర్ ఇంట్లో పుట్టపర్తి వ్యవసాయాధికారి వెంకట బ్రహ్మం, కొత్తచెరువు అగ్రి ల్యాబ్ ఏవో శ్రీవాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారు బుధవారం రాత్రి తమ ఇంట్లోని పై అంతస్తు గదిలో నిద్రించారు. అర్ధరాత్రి వేళ కింద హాలులో చప్పుడు రావడంతో వెంకట బ్రహ్మం కిందకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తెరిచి ఉంది. బెడ్ రూంలోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. ఆయన వెంటనే అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పుట్టపర్తి ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ కృష్ణమూర్తి వచ్చి దొంగల కోసం చుట్టపక్కల వెదికినా కనిపించలేదు. గురువారం ఉదయం రూరల్ సీఐ సురేష్ ఘటనాస్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. ఏడో తరగతి చదువుతున్న తమ కూతురుకు ప్రతి జన్మదినం రోజున బహుమతిగా ఒక బంగారు నగ చేయిస్తామని, ఆ విధంగా చేయించిన లాంగ్ చైను, పూసల దండ, డాలర్లు, కమ్మలు, చైన్లు కలిపి మొత్తం 37 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదును దొంగలు అపహరించారని వెంకట బ్రహ్మం, శ్రీవాణి దంపతులు తెలిపారు. దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. విల్లాస్‌లో ప్రవేశించిన దొంగలు తొలుత ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారని, ఆ ఇంట్లో ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న వెంకట బ్రహ్మం ఇంట్లో చోరీ చేశారని గుర్తించారు. కాగా, దొంగలు విల్లాస్‌లోకి ప్రవేశించే సమయంలో అదే కాలనీలో ఉన్న ఒకతను గుర్తించి సెక్యూరిటీని అప్రమత్తం చేశారని, అయినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. -
పార్థ.. అవినీతి మేత
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం..అంతా అక్రమాల కలబోతే.అవినీతి మేతే. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. రూ.కోట్లు మేసేశారు. ‘కియా’ ఏర్పాటు సమయంలో రైతులను నిండా ముంచేశారు. మైనింగ్, ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరి పోయారు. ఎమ్మెల్యేగా వెలగబెట్టినప్పుడే జనాన్ని నిండాముంచిన ఆ టీడీపీ నేత ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌కే పోటీ చేస్తున్నారు.సాక్షి, పుట్టపర్తి: బీకే పార్థసారథి.. టీడీపీలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. అవినీతి, అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. రౌడీలు, మద్యం అక్రమ రవాణా దారులు, మైనింగ్ మాఫియా వ్యక్తులను అనుచరులుగా చేర్చుకుని అడ్డదిడ్డంగా సంపాదించాడు. ‘కియా’ కార్ల పరిశ్రమ రాకతో ఎంతోమంది రైతులను మోసం చేశాడు. తక్కువ ధరలకే భూములు కాజేశాడు. కొందరికి పరిహారం ఇవ్వకుండా బెదిరించి లాక్కున్నాడు. గత టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ దోపిడీ చేశాడు. అల్లుడిని రంగంలోకి దింపి రూ.కోట్లు వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో పెనుకొండ ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.కమీషన్ల కక్కుర్తి..‘కియా కార్ల పరిశ్రమ కోసం భూ సేకరణ, చదును పనుల్లో పార్థసారథి బాగా నొక్కేశాడు. ఎకరా భూమికి రైతుకు రూ.10.5 లక్షలు ఇస్తే.. భూమిని చదును చేయడానికి ఎకరాకు రూ.25 లక్షలు ఖర్చు ెచూపి.. కమీషన్లు తీసుకుని చంద్రబాబు.. లోకేశ్‌కు వాటా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇక సోమందేపల్లి సమీపంలోని పెద్దకొండ చాలా మహిమాన్వితమైందని స్థానికులు భావిస్తారు. అందుకే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరు. కానీ ఆ కొండకు అవతలి వైపు ఉన్న క్వారీలకు వెళ్లేందుకు బీకే పార్థసారథి పెద్దకొండపైనే రోడ్డు వేయించాడు. ఇందుకు గానూ క్వారీ నిర్వాహకులతో.. రూ.కోట్లు దండుకున్నాడనే ఆరోపణలున్నాయి.రైతుల పాలిట యముడిలా..‘కియా’ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించకుండా.. బీకే సైంధవుడిలా అడ్డుపడ్డారు. గుట్టూరుకు చెందిన రైతు వడ్డే సుబ్బరాయుడు మరణానికి కారణమయ్యాడు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ‘కియా’ సమీపంలో రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా కొనుగోలు చేశారని, ఎందరో రైతులను మోసం చేశాడని వెంకటగిరిపాళ్యంకు చెందిన రైతులు పార్థసారథిపై పలుమార్లు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.తప్పులెన్ని చేసినా..సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద పార్థసారథి అల్లుడు శశిభూషణ్.. తన క్వారీలో ఓ కూలీపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అయితే టీడీపీ పెద్దల సహకారంలో కేసు లేకుండా తప్పించుకున్నాడనే ఆరోపణలున్నాయి. బీకే పార్థసారథి అనుచరుడిగా ఎదిగిన సిద్ధయ్య చీప్ లిక్కర్ వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా నిత్యం సిద్ధయ్యను వెంట పెట్టుకుని పార్థసారథి పర్యటిస్తుంటారు. అలాగే బీకే వెంట నడిచే మరో మహిళ నేత కూడా నాటుసారా వ్యాపారం చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.ఎస్సీల భూముల్లో క్వారీటీడీపీ హయాంలో రొద్దం మండలం కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల శివార్లలో బీకే క్వారీ నడిపేవాడు. ఇందుకు కొండ సమీపంలోని 16 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన 40 ఎకరాల భూములను కాజేశాడు. ఏడాదికి ఎకరాకు రూ.4 వేలు ఇస్తానని నమ్మబలికాడు. లీజుకు ఇవ్వకుంటే లాగేసుకుంటామని బెదిరించాడు. చివరకు ఆ రైతుల భూములు సొంతం చేసుకున్నాడు.అల్లుడికి ఆరు శాతం కమీషన్లు..బీకే చేసే అక్రమార్జనలో ఆరు శాతం తన అల్లుడు శశిభూషణ్‌కు ఇస్తారు. గత టీడీపీ హయాంలో నుంచి ఈ దందా కొనసాగుతోంది. అందుకే అప్పట్లో నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా ముందు కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ దందా తట్టుకోలేక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. దీంతో పెనుకొండ అభివృద్ధి కుంటుపడింది.ప్రజాధనం లూఠీ..టీడీపీ హయాంలో ‘స్వచ్ఛభారత్’ పథకం కింద పెనుకొండకు భారీగా మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే మరుగుదొడ్లు నిర్మించకుండానే బీకే పార్థసారథి బిల్లులు స్వాహా చేశాడు. అర్హులకు పథకం అందకుండా.. స్వచ్ఛభారత్ పథకానికి అప్పట్లోనే స్వస్తి పలికాడు. ‘నీరు–చెట్టు’ పథకంలో రూ.కోట్లు కొల్లగొట్టాడు. దీంతో ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.రూ.వందల కోట్ల ఇసుక మేత..టీడీపీ హయాంలో పెనుకొండ పరిధిలోని పెన్నా, జయమంగళి, చిత్రావతి నది పరీవాహక ప్రాంతాలను బీకే పార్థసారథి చెర బట్టారు. రోజూ వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తోడేశాడు. ఐదేళ్లలో ఇసుక అక్రమ రవాణా ద్వారానే రూ.500 కోట్లపైనే సంపాదించాడని టీడీపీ నేతలే చెబుతున్నారు. -
చట్ట ప్రకారమే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటు
సాక్షి, అమరావతి: హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని ఆ జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అదే విధంగా.. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటిగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను, రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సమర్థించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్లు)ను హైకోర్టు కొట్టేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, తదనుగుణ ఉత్తర్వులు ఎంతమాత్రం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అభ్యంతరాలను ఆహ్వానించడమే కాక, వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుందని తేల్చిచెప్పింది. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ జారీచేసిందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై పిల్లు.. హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని జిల్లా ప్రధాన కేంద్రంగా మారుస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హిందూపూర్ అఖిలపక్ష కమిటీ కన్వినర్ బాలాజీ మనోహర్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పుట్టపర్తిని కాకుండా హిందూపూర్‌ను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే, అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రాన్ని రాయచోటిగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి అన్నమయ్య జిల్లా కన్వినర్ టి.లక్ష్మీనారాయణ 2022లో పిల్ దాఖలు చేశారు. రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదే అభ్యర్థనతో అడ్వొకేట్స్ జేఏసీ రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు న్యాయవాదుల సంఘంతో పాటు చార్టెర్డ్ అకౌంటెంట్ సాధు సుబ్రహ్మణ్యం పంత్ వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ వై. వీరవెంకట సత్యనారాయణ రామరాజు అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఈ ఏడాది జనవరి 3న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా.. గురువారం తన తీర్పులను వెలువరించింది. జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో తమ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే, ప్రభుత్వ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. తీర్పు ప్రధాన పాఠం ఇలా.. జిల్లాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు.. ‘2014 పునరి్వభజన చట్టం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు. 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టంలోని సెక్షన్ 3 (1) ప్రకారం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచెయ్యొచ్చు. పాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం సెక్షన్ 3 (2) కింద కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు ఏర్పాటుచేయవచ్చు. అంతేకాక.. జిల్లాలో, రెవెన్యూ డివిజన్లో, మండలాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు. అలాగే, ఈ సెక్షన్ కింద నోటిఫికేషన్ జారీచేసి జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం విస్తీర్ణాన్ని పెంచొచ్చు, కుదించవచ్చు. సరిహద్దులను కూడా మార్చొచ్చు. సెక్షన్–4 కింద నిబంధనలను రూపొందించవచ్చు. ఈ చట్ట నిబంధనల కింద రాష్ట్ర ప్రభుత్వం 2020లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసే విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి సహకరించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలనూ ఏర్పాటుచేసింది. అభ్యంతరాలను పట్టించుకోలేదన్నది పిటిషనర్ల ఆరోపణ.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలను ఆహా్వనిస్తూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి అనుగుణంగా పిటిషనర్లు తమ అభ్యంతరాలను తెలిపారు. అయితే, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో చట్ట విరుద్ధంగా వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అయితే, ప్రభుత్వం మాత్రం వీరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారమే వ్యవహరించామని చెబుతోంది. ఈ విషయంలో మేం ప్రభుత్వ కౌంటర్లను పరిశీలించాం. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నోటిఫికేషన్ జారీచేసిందని ప్రభుత్వం తన కౌంటర్లలో పేర్కొంది. అంతేకాక.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కూడా మార్చిన విషయం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియనే కోర్టులు పరీక్షించగలవు.. ప్రభుత్వం కేవలం అభ్యంతరాలను ఆహా్వనించడమే కాకుండా పిటిషన్ల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ తరువాతే తుది నోటిఫికేషన్ జారీచేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు రఘుపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఇచ్చిన తీర్పును ఉదహరించడం అవసరం. ప్రభుత్వం మండల ప్రధాన కేంద్రాల ఏర్పాటులో జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో ఇదే హైకోర్టు జోక్యం చేసుకుంటూ, ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మండల కేంద్రం ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వ పాలన నిర్ణయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే స్థిరపరిచిన న్యాయ సూత్రం ప్రకారం అధికరణ 226 కింద న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాన్ని పరీక్షించజాలవు. ఆ నిర్ణయ ప్రక్రియను మాత్రమే పరీక్షించగలవు. ప్రస్తుత కేసులో జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించలేదు. అందువల్ల ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
పచ్చ కుట్ర భగ్నం.. టీడీపీ నేతలే చంపారు
-
పుట్టపర్తిలో నీటి కష్టాలు తీర్చింది సీఎం జగన్
-
క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరం: ద్రౌపది ముర్ము
Updates.. ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరం, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక చింతనతో సమాజసేవ చేయాలి. సత్యసాయి బాబా సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం. విద్య, వైద్యం, తాగునీరు, ఆధ్యాత్మికత విస్తరణకు బాబా బాగా కృషి చేశారు అని అన్నారు. ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ►పుట్టపర్తి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ ►బాబా మహాసమాధికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ ►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి, గవర్నర్. ►పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్ ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ►భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 1.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3.05 గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. -
పుట్టపర్తిలో నేడు రాష్ట్రపతి పర్యటన
పుట్టపర్తి అర్బన్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 2.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.05 గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. -
బడుగు బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన వైనం
-
మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
-
నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలనే అడుగులు వేశాం: సీఎం జగన్
-
అన్నదాతలకు అండగా నిలిచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి. వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం జగన్ సభకు జన సునామి
-
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు మీ బిడ్డ జగన్‌లా సంక్షేమం అందించలేదు: సీఎం జగన్
-
రైతులు ఇబ్బందుల పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది: సీఎం జగన్
-
ఈ రైతన్న మాటలకు సీఎం జగన్ ఫిదా
-
ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం: సీఎం జగన్
సాక్షి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరుసగా ఐదో ఏడాది రెండో విడతలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. పుట్టపర్తిలో బటన్ నొక్కి ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘దేవుడి దయంతో మంచి కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతన్న ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది. పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ఈనెలలోనే అవి కూడా వస్తాయి. ప్రతీ విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం. మొత్తం రూ.33,209.81 కోట్లు సాయం అందించాం. 14 ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నాయకత్వంలోకి తీసుకొచ్చాం. నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలనే అడుగులు వేశాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి. సామాజిక సాధికార యాత్రకు విశేష స్పందన వస్తోంది. బాబు హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు. మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. ఈ నాలుగేళ్లలో రూ.7800 కోట్ల బీమా అందించాం. ఈ క్రాప్ ద్వారా ప్రతీ రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం. ప్రతీ గ్రామంలో నేడు ఆర్బీకే కేంద్రాలు పనిచేస్తున్నాయి. గడచిన నాలుగేళ్ల కాలంలో రూ.60వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే. దేవుడి దయతో గత నాలుగేళ్లలో కరువు మాటేలేదు. మన ప్రభుత్వంలో పంట సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెప్తూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం. గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కంపెనీకి లాభాలు పెరిగాయి. రైతులకు ఎందుకు మంచి జరగలేదు’ అని ప్రశ్నించారు. -
పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల భారీ జనసందోహం (ఫొటోలు)
-
మమ్మల్ని తిట్టడమే మీ పని.. పుట్టపర్తి ఎమ్మెల్యే
-
వైఎస్ఆర్ రైతు భరోసా ముఖ్య ఉద్దేశం ఇదే!
-
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన పుట్టపర్తి సభ..
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
సీఎం జగన్ పాలన ఎంతో భరోసానిస్తోందంటున్న రైతులు
-
పురందేశ్వరి మీటింగ్ లో తన్నుకున్న బీజేపీ లీడర్లు
-
తప్పించుకు తిరుగుతున్న పల్లె రఘునాథరెడ్డి
సాక్షి, పుట్టపర్తి: మాజీ మంత్రి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పల్లె రఘునాథరెడ్డి సొంత పార్టీ నేతల చెవిలో పూలు పెట్టాడు. 2019 ఎన్నికల సమయంలో చేబదులుగా సొంత పార్టీ నేతల నుంచి రూ.లక్షల్లో నగదు తీసుకుని వాటిని ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. చేసేది లేక సదరు తెలుగు తమ్ముళ్లు పల్లె రఘునాథరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. బాధితుల కథనం మేరకు... గత ఎన్నికల సమయంలో ఖర్చుల కోసమంటూ పల్లె రఘునాథరెడ్డి టీడీపీలోని బీసీ వర్గానికి చెందిన పీసీ గంగన్న, ఒ.లక్ష్మినారాయణ వద్ద రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన పల్లె రఘునాథరెడ్డి వారి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో నెలరోజుల తర్వాత వారే పల్లె రఘునాథరెడ్డి వద్దకు వెళ్లి అడగ్గా.. రూ.25 లక్షల చొప్పున రెండు చెక్కులు రాసి ఇచ్చారు. అయితే బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా.. రెండు చెక్కులు చెల్లలేదు. తనకిచ్చిన చెక్కుకు సంబంధించి సదరు బ్యాంకు ఖాతాలో నగదు లేదని అధికారులు చెప్పారని పీసీ గంగన్న, ఇచ్చిన చెక్కులో సంతకం మ్యాచ్ కాలేదని బ్యాంకర్లు చెక్కు తిరస్కరించారని లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత వెళ్లి పల్లె రఘునాథరెడ్డిని డబ్బుల విషయమై నిలదీసినట్లు బాధితులు వివరించారు. ‘డబ్బులు కావాలంటే వేచి ఉండాలి. పార్టీ లో కొనసాగాలి. లేదంటే మీ ఇష్టం’ అని పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. తప్పించుకు తిరుగుతున్న ‘పల్లె’ చెక్కులు బౌన్స్ అయ్యాయని భావించిన పీసీ గంగన్న, లక్ష్మినారాయణ లాయర్లను ఆశ్రయించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి నోటీసులు ఇచ్చారు. సరైన చెక్కులు ఇవ్వాలని, లేనిపక్షంలో నగదు రూపేణా బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు పంపించారు. కానీ ఆ నోటీసులను తీసుకోకుండా పల్లె రఘునాథరెడ్డి తప్పించుకు తిరిగారని బాధితులు చెబుతున్నారు. లాయర్లు, పోలీసులను అడ్డు పెట్టుకుని తమ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీలో బీసీలమైన తమకు అన్యాయం జరిగినా పార్టీ పెద్దలు ఏ ఒక్కరూ నోరుమెదపకపోవడమ దుర్మార్గమంటున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. నా చెక్కులు మిస్ అయ్యాయి 2019 ఎన్నికల సమయంలో నా చెక్కులు రెండు మిస్ అయ్యాయి. వాటినే పీసీ గంగన్న, లక్ష్మీనారాయణ తీసుకున్నట్లు అనుమానం వచ్చింది. ఆరా తీయగా వారు ఒక్కో చెక్కులో రూ.25 లక్షలు రాసుకుని బ్యాంకుకు వెళ్లి నా డబ్బు కాజేయాలని చూసినట్లు సమాచారం వచ్చింది. అంతేగానీ చెల్లని చెక్కులు నేను ఎవరికీ ఇవ్వలేదు. నేను ఎవరితో అప్పు కూడా చేయలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. అనవసరంగా కేసులకు వెళ్తే భయపడేది లేదు. – పల్లె రఘునాథరెడ్డి -
ఒరేయ్ దద్దమ్మ...నీకు దమ్ముంటే రా...నువ్వో నేనో తేల్చుకుందాం
-
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై రాళ్లు రువ్విన టీడీపీ నేతలు
-
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ నేతల దౌర్జన్యంతో పుట్టపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలో సత్యమ్మ ఆలయం వద్దకు శ్రీధర్ రెడ్డి చేరుకోగా.. టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఏకంగా శ్రీధర్ రెడ్డి పైకి దూసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా కారుపైకి ఎక్కి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు పల్లె. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె సిద్ధమా? ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె రఘనాథ్‌రెడ్డిలు సిద్ధమా అని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఐదేళ్లు అధికారంలో ఉండి పుటపర్తికి పల్లె రఘునాథ్ ఏం చేశారో చెప్పాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పల్లె రఘునాథ్‌రెడ్డి కనుమరుగైన రాజకీయ నేత అని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పుటపర్తి జిల్లా ఏర్పాటు చేసుకున్నామని, పుటపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి -
పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు..
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతుల కలబోతగా ప్రతిబింబిస్తోంది. విదేశీ అతిథులు తమ సంప్రదాయాలను వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్‌ను ఇష్టపడుతుంటారు. మన వంటకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ జీవనశైలిని పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో సంప్రదాయాలను అనుసరిస్తారు. సుమారు 150 దేశాల నుంచి యాత్రికులు పుట్టపర్తి వస్తుంటారు. విదేశీ సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు మన సంప్రదాయాలను అనుసరిస్తారు. భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇదో గర్వకారణమని పుట్టపర్తివాసులు చెబుతున్నారు. సాయిబాబా చలువ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విదేశీయులు మెచ్చే విధంగా పుట్టపర్తిలో వసతి అందుబాటులో ఉంది. హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సంగీత పరికరాల అంగళ్లు ఉన్నాయి. విదేశీయులు మెచ్చే విధంగా హోటళ్లలో అలంకరణ కనిపిస్తుంది. సుమారు 10 లాడ్జిలు, 30 హోటళ్లు విదేశీయులకు నచ్చేశైలిలో అందుబాటులో ఉన్నాయి. భారత దేశానికి వచ్చినా.. ఇక్కడి దర్శనీయ స్థలాలను చూసినా వదిలి వెళ్లలేమని విదేశీ అతిథులు అంటున్నారు. ఇక్కడ పాటించే ఆచార వ్యవహారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతున్నారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
ప్రకాష్‌ను చంపేందుకు స్వామిజీతో కలిసి నాగమణి స్కెచ్.. క్షుద్రపూజలు!
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంటలో సంచలనం రేకెత్తించిన గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్ వెల్లడించారు. ఏం జరిగిందంటే.. నల్లమాడ పోలీసు సర్కిల్ పరిధిలోని వంకరకుంట గ్రామానికి చెందిన రైతు వెంకటాద్రి పొలంలో గుప్త నిధుల కోసం ఈ నెల 14న కొందరు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై రైతు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు అప్పట్లో నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ యశ్వంత్ పర్యవేక్షణలో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పట్టుబడింది వీరే.. గుప్త నిధుల తవ్వకాల కేసులో పట్టుబడిన వారిలో ఖమ్మం నివాసి నిజాముద్దీన్, నల్లమాడ మండలం చెరువు వాండ్లపల్లికి చెందిన శివశంకరరెడ్డి, నరేంద్ర రెడ్డి, హైదరాబాద్ నివాసి శ్రీనివాసులు, పుట్టపర్తికి చెందిన విజయ్, తమిళనాడుకు చెందిన చాంద్‌బాషా, మురుగన్, సురేష్, అనంతపురానికి చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ భార్య నాగమణి ఉన్నారు. వీరి నుంచి గుప్త నిధుల తవ్వకానికి వినియోగించిన ఇనుపరాడ్లు, బండను తొలగించేందుకు ఉపయోగించే 20/30 పౌడర్, పూజకు వినియోగించిన ముడుపు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. హత్య కుట్ర వెలుగులోకి పట్టుబడిన నిందితులను విచారణ చేయడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. ప్రకాష్, నాగమణి దంపతులు. ప్రకాష్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను నిర్లక్ష్యం చేయడమే కాక, వేధింపులకు గురి చేస్తుండడంతో ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్‌తో కలిసి భర్త హత్యకు నాగమణి పథకం రచించింది. దీంతో తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును అనంతపురం పోలీసులకు బదిలీ చేశారు. కాగా, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నిరంజన్‌రెడ్డి, నల్లమాడ, ఓడీసీ, బుక్కపట్నం, అమడగూరు ఎస్ఐలు వలీబాషా, గోపీకుమార్, నరసింహుడు, వెంకటరమణ, సర్కిల్ సిబ్బందిని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ అభినందించారు. -
Palle Raghunatha Reddy: పుట్టపర్తిలో ఓటమి భయం.. కదిరిలో టికెట్ కష్టం
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రానున్న ఎన్నికల్లో బరిలే నిలిచేందుకు ఆయన సిద్ధమవుతుండగా, అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. పైగా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై స్పష్టత లేదు. పుట్టపర్తిలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. అందువల్లే కదిరి నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందన్న దానిపై వ్యక్తిగత సర్వే చేపట్టినట్లు సమాచారం. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ మనుగడ కష్టంగా మారింది. రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీలో పని చేసినా.. ప్రస్తుతం తగిన గుర్తింపు లేకపోవడంతో పార్టీలో కొనసాగాలా? వీడాలా? అనే సందిగ్దంలో పడ్డారు. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందో? లేదో? తెలియని పరిస్థితి. దీనికి తోడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా.. గెలుస్తామన్న నమ్మకం లేదు. దీంతో ఆయన అనుచర వర్గం కూడా అయోమయంలో పడిపోయారు. పల్లె వెంట నడవాలా? వద్దా? అనే అనుమానంతో స్తబ్ధతగా ఉండిపోయారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేసేందుకు పల్లె రఘునాథరెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే టీడీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరుతారనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఆయన వెంట నడిచేందుకు టీడీపీ కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. అసమ్మతి నేతల బెడద.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి భారీ వ్యతిరేకత ఉంది. మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న టీడీపీ హయాంలో కూడా పల్లెపై తిరుగుబాటు చేశారు. దీనికి తోడు రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకత ఉంది. నల్లమాడ మండలానికి చెందిన సైకం శ్రీనివాసరెడ్డికి పల్లె రఘునాథరెడ్డికి పడదు. అంతేకాకుండా సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తికి చెందిన పెదరాసు సుబ్రమణ్యం టీడీపీకి అనుకూలంగా ఉన్నా... పల్లెకు వ్యతిరేకం. ఇప్పటికే రెండుసార్లు ప్రెస్మీట్లో తన అసమ్మతి బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ పుట్టపర్తిని వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్వం వైఎస్సార్సీపీ కైవసం.. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ, అమడగూరు మండలాలు గతంలో టీడీపీకి అనుకూలంగా ఉండేవి. అయితే 2019 నుంచి ఈ రెండు మండలాల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. అమడగూరు మండలంలోని పది పంచాయతీ సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిసార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్.. పల్లె రఘునాథరెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన అల్లాబకాష్, ఇస్మాయిల్ కూడా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ‘పల్లె’కు సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ‘పల్లె’ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కదిరి నుంచి పోటీ?.. పుట్టపర్తిని దాదాపుగా వద్దనుకుంటున్న పల్లె రఘునాథరెడ్డి వచ్చే ఎన్నికల్లో కదిరి నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన సొంత మండలం తనకల్లు కావడంతో కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అధిష్టానం కందికుంట వెంకటప్రసాద్‌ను కాదని.. పల్లెకు కదిరి టికెట్ ఇచ్చే సాహసం చేయదు. అందువల్లే ‘పల్లె’నే దీనికి ప్రత్యామ్నాయ మార్గం సూచించినట్లు సమాచారం. కందికుంట వెంకట ప్రసాద్‌ను ధర్మవరం నుంచి బరిలో దింపి.. తనకు కదిరి టికెట్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది. వెంటాడుతున్న ఓటమి భయం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడంతో ఈప్రాంత వాసులంతా వైఎస్సార్ సీసీ వెంట నడుస్తున్నారు. ఇక జాతీయ రహదారి 342కు శ్రీకారం, బెంగళూరు నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి శ్రీకారంతో జనం ఆలోచనా విధానం కూడా మారింది. అభివృద్ధికే పట్టం కట్టాలని వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులనే జెడ్పీటీసీ సభ్యులుగా గెలిపించారు. ప్రజాభిమానంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లోని 15 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో ఓటమి భయం వెంటాడుతుండగా.. పల్లె ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. (క్లిక్ చేయండి: పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?!) -
శాస్త్ర,సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి సాధిస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గతంలో రాకెట్ ప్రయోగాలు, డిజైన్, తయారీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లమని, ప్రస్తుతం సొంతగా రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్నామని చెప్పారు. భారతదేశం త్వరలోనే అతిపెద్ద ఐటీ, మెడిసిన్ ఎగుమతిదారుగా మారనుందన్నారు. అనంతరం 22 మంది విద్యార్థులకు డాక్టరేట్లు, 17 మందికి బంగారు పతకాలు అందజేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కిషన్ రెడ్డి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున∙తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. సత్యసాయిబాబా 97వ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్, మల్టీమీడియా షోను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సత్యసాయి బాబా జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఈ షో ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. -
పుట్టపర్తి వైభవం.. ఖండాంతరం!
పుట్టపర్తి అర్బన్: నాలుగు దశాబ్దాల క్రితం పది పూరి గుడిసెలతో ఉన్న కుగ్రామం నేడు బహుళ అంతస్తులకు కేంద్రీకృతమైంది. ఒకప్పడు రోడ్డు పక్కన కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచి చూసిన జనం.. నేడు కేవలం గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా విమానంలో చేరుకునేలా ఏర్పాటైన విమానాశ్రయాన్ని చూస్తున్నారు. కుగ్రామం నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన పుట్టపర్తి ప్రస్థానంపై సత్యసాయి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి.. పుట్టపర్తి ఆవిర్భావం వెనుక పురాణ కథను స్థానికులు నేటికీ గుర్తు చేస్తుంటారు. ‘కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, కర్ణాటక నుంచి వచ్చి చిత్రావతి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతంలో పది ఇళ్లు మాత్రమే ఉండేవి. గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి గొల్లపల్లి అని పిలుచుకునేవారు. జీవనం కోసం ఎక్కువగా గోవులను పెంచేవారు. ఓ ఆవు పాలు ఇవ్వకుండా మొరాయిస్తుండడంతో దాని యజమాని నిఘా ఉంచాడు. ఓ మధ్యాహ్న సమయంలో ఆవు పుట్ట వద్దకెళ్లి నిల్చోన్నప్పుడు పొదుగు నుంచి పాలు పుట్టలోకి ధారాపాతంగా కారుతుండడం గమనించాడు. ఇది గమనించిన యజమాని బండరాయితో ఆవును కొట్టబోగా అది తప్పించుకుంది. అదే సమయంలో పుట్టలోని నుంచి వెలుపలకు వచ్చిన పాముకు బండరాయి తగిలి చనిపోతూ గొల్లపల్లి పుట్టల మయంగా మారుతుందని, పాడి పశువులు కనుమరుగవుతాయని శపించింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శాప విమోచనం కోసం పుట్ట ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించి వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు’. అలా గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా రూపాంతరం చెందింది. సత్యసాయి ఆవిర్భావంతో మహర్దశ.. గొల్లపల్లిలో 1926 నవంబర్ 23వ తేదీన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ.. 1940 అక్టోబర్‌లో అవతార ప్రకటనతో సత్యసాయిగా మారారు. ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం 1948లో ప్రశాంతి నిలయానికి సత్యసాయి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23 నాటికి ప్రశాంతి నిలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. సత్యసాయిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయి. వచ్చే భక్తులకు విడిది, ఇతర సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ పరిధి విస్తరించింది. దీంతో 1964లో పంచాయతీగా పుట్టపర్తి మారింది. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ 1980 నవంబర్‌లో సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధి కోసం 1981లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 1984లో నిర్మాణ పనులు చేపట్టి 1991లో అన్ని రకాల సదుపాయాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1990లో ఆర్టీసీ బస్టాండ్, 1991 నవంబర్‌లో సత్యసాయి విమానాశ్రయం, 2000 నవంబర్‌లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. 1995 జూలైలో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. 1995 జూలైలో సాయికుల్వంత్ మంటపాన్ని నిర్మించారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్(పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. (చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష) -
అనంత వర్షాలు...
-
ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే..
సాక్షి, పుట్టపర్తి(సత్యసాయి జిల్లా): పుట్టపర్తి... సత్యసాయి నడయాడిన ప్రాంతం. ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయంగా భాసిల్లిన ప్రదేశం. దేశవిదేశీ భక్తులతో కళకళలాడిన పట్టణం. ఇక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో పలికేది. కానీ సత్యసాయి భౌతికంగా దూరమయ్యాక ప్రాభవం తగ్గింది. విదేశీ అతిథుల రాక తగ్గగా వెలవెలబోయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీసత్యసాయి పేరుతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మళ్లీ కాంతులీనుతోంది. చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? చుట్టూ కొండ ప్రాంతాలు. ఎటు చూసినా భూములు. ఓ వైపు చెరువు. మరో వైపు నది. ఇంకో వైపు గుట్టలు.. పుట్టపర్తి పేరు చెబితే కళ్లముందు కనిపించే దృశ్యమిది. అయితే పుట్టపర్తిని శ్రీ సత్యసాయి పేరుతో జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో స్వరూపమే మారిపోయింది. గతంలో సత్యసాయిబాబా భక్తులతో రద్దీగా కనిపించినా అభివృద్ధి ప్రశాంతి నిలయం వరకే పరిమితమైంది. సత్యసాయి శివైక్యం తర్వాత ప్రాభావం మసకబారుతూ వచ్చింది. కానీ జిల్లా కేంద్రం ప్రకటనతో అభివృద్ధి కొంతపుంతలు తొక్కుతోంది. రహదారుల వెంట అభివృద్ధి పరుగులు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. మామిళ్లకుంట వరకు నాలుగు లేన్ల మార్గం ఉండగా రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు విప్పుకుంది. బెంగళూరు వైపు పెడబల్లి వరకు.. ధర్మవరం వైపు కొత్త చెరువు వరకు భూములకు రేట్లు పెరిగాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోనే ఏపీఐఐసీ వంద ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగడంతో ధరలు రెట్టింపు అయ్యాయి. ♦కొత్తచెరువు చుట్టూ రోడ్డు పక్కన సెంటు రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో ఇక్కడ రూ.4 లక్షలు మించి పలికేది కాదు. ♦మామిళ్లకుంట క్రాస్‌లో సెంటు రూ.10 లక్షలు పైగానే ఉంది. ఇక్కడ కూడా గతంలో సెంటు స్థలం రూ.3 లక్షలు మాత్రమే ఉండేది. ♦సూపర్ స్పెషాలిటీ చుట్టూ కిలోమీటరు మేర సెంటు ధర ప్రస్తుతం రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో సెంటు రూ.4 లక్షలు మించి పలికేది కాదు. ♦విమానాశ్రయం సమీపంలో భూములు డబుల్ రేటు పలుకుతున్నాయి. ప్రస్తుతం సెంటు రూ.15 లక్షల వరకూ పలుకుతోంది. అభివృద్ధికి సర్కారు అండ పుట్టపర్తి ప్రాంత వాసులు గతంలో వర్షాధార పంటలు మాత్రమే పండించే వారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళతో చాలామంది రైతుల భూముల్లో రెండో పంట పండిస్తున్నారు. అంతేకాకుండా బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీతో అందిస్తుండటంతో చాలా మంది భూములనే నమ్ముకుని సంతోషంగా జీవిస్తున్నారు. నీటి సౌకర్యం... దిగుబడులు బాగా పెరగడంతో పొలాల ధరలూ భారీగా పెరిగాయి. ఆయా గ్రామాల్లో ఎకరా రూ.కోటి వరకు ధర పలుకుతోంది. గతంలో అభివృద్ధి అంతా ఒకేవైపు.. గతంలో పుట్టపర్తి బస్టాండు చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి జరిగింది. ప్రశాంతి నిలయం ఉండటంతో అక్కడక్కడే పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి అనుకూలంగా అక్కడే నివాసాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో పుట్టపర్తి చుట్టూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎటు వైపు చూసినా భూముల ధరలు పెరిగాయి. దీనికి తోడు మున్సిపల్, పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూడా ఎత్తైన భవనాలకు బదులు విశాలమైన భవనాలను ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా పట్టణం నలువైపులా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అద్దె ఇళ్లకూ డిమాండ్ జిల్లా కేంద్రంగా ప్రకటించడం.. ప్రభుత్వ కార్యాలయాలు తరలి రావడం.. ఉద్యోగులు చేరుకోవడంతో పాటు పలు వ్యాపారాల కోసం పుట్టపర్తికి వలస వచ్చేవారి సంఖ్య అధికమైంది. దీంతో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. గతేడాదిలో రూ.2 వేలకే ఇల్లు అద్దెకు దొరికేది. ప్రస్తుతం రూ.5 వేలు పెట్టినా సౌకర్యాలు అంతలా లేవు. అపార్ట్మెంట్లలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌కు రూ.5 వేలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్‌కు రూ.10 వేల దాకా అద్దె ఇవ్వాల్సి వస్తోంది. అయినా ఖాళీగా ఉండే ఇళ్లు కనిపించడం లేదు. -
ఆడియో వైరల్: బండ బూతులు తిట్టుకున్న టీడీపీ నాయకులు
ఓడీ చెరువు/నల్లమాడ(శ్రీసత్యసాయి జిల్లా): పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీ చెరువు, నల్లమాడ మండలాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు ఫోన్లో బండబూతులు తిట్టుకున్న ఆడియో శనివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ విషయం నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీలో వర్గవిభేదాలు తార స్థాయిలో ఉన్నట్లు మరోసారి రుజువైంది. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీలో మరో నాయకుడు సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్ ఈ నేపథ్యంలో ఓడీ చెరువు మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సైకం శ్రీనివాసరెడ్డికి దగ్గరై అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. శనివారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడుకు ఇరువర్గాలకు చెందిన నాయకులు తరలివెళ్లారు. ఈ క్రమంలో నల్లమాడకు చెందిన పల్లె అనుచరుడు ఓడీ చెరువుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధితో ఫోన్లో మాట్లాడతూ ‘పల్లె భిక్షతో ప్రజాప్రతినిధి అయ్యావు. ఆనాడు పల్లె రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని మైనార్టీ వర్గానికి చెందిన నీకు పదవి ఇచ్చాడు. ఆ పదవిని అడ్డుపెట్టుకుని మండలంలో కార్పొరేషన్ రుణాల్లో భారీగా దండుకున్నావు’ అంటూ రాయలేని భాషలో బండబూతులు తిట్టిన ఆడియో వైరల్ అయ్యింది. పల్లెకు వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నావంటూ ఆక్రోశం వెళ్లకక్కాడు. తీవ్రస్థాయిలో తిట్లు దండకంతో ఒకరినొకరు ఎత్తుపోసుకున్నారు. ఈ ఆడియో విన్న పలువురు టీడీపీలో వర్గవిభేదాలు తార స్థాయికి చేరాయని చర్చించుకుంటున్నారు. -
Puttaparthi: ఆ ఏనుగంటే సత్యసాయికి ఎంతో ప్రేమ
పుట్టపర్తి అర్బన్(శ్రీసత్యసాయి జిల్లా): సత్యసాయి బాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఏకంగా ఆలయాన్నే నిర్మించారు. నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ‘గజరాజు’ ఆలయం పుట్టపర్తిలో నక్షత్రశాల పక్కనే ఉంది. ఈ ఆలయ నేపథ్యాన్ని పరిశీలిస్తే సత్యసాయి బాబా సకల జీవుల పట్ల చూపిన అంతులేని ప్రేమ స్ఫురణకు వస్తుంది. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. చదవండి: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు! ప్రశాంతినిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని కోసం ప్రత్యేకంగా మావటీలను ఏర్పాటు చేసి, చిన్న షెడ్డులో ఉంచి సంరక్షించేవారు. ప్రతి రోజూ మావటీలు ఏనుగును వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడడంతో 2007 మే 23న ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్రశాల పక్కనే దాన్ని సమాధి చేశారు. 10వ రోజున వైకుంఠ సమారాధన సైతం ఘనంగా నిర్వహించారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత పక్కనే ఖననం చేశారు. నిత్య పూజలు చేస్తున్న మావటి పెద్దిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి సాయిగీతకు మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించాడు. నిత్యం మేతగా చెరుకులు, నేపియర్ గడ్డి, రావి ఆకులు, మర్రి ఆకులు, అరటి గెలలు అందించేవాడు. ప్రతి రోజూ ఏనుగును సుమారు నాలుగు కిలోమీటర్లు వాకింగ్‌కు తీసుకెళుతుండేవాడు. ఏనుగు వచ్చినప్పుడు భక్తులంతా రోడ్డుకు ఇరువైపులా నిలబడి నమస్కరించేవారు. పెద్దిరెడ్డి ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు చేస్తున్నారు. సాయిగీతకు మావటిగా పని చేయడం అదృష్టం సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంత మంది భక్తులు ఉన్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా. – పెద్దిరెడ్డి -
చీప్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి అర్బన్(శ్రీ సత్యసాయి జిల్లా): మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చీప్ ట్రిక్స్‌కు తెరలేపారు. శుక్రవారం కొత్తచెరువు మండలం బండ్లపల్లికి చెందిన సర్పంచ్ గీతాబాయి మామ తిరుపాల్‌నాయక్ వీధిలైట్ల కోసం బండ్లపల్లికి వెళ్తుండగా...అదే సమయంలో సోమందేపల్లికి వెళ్లున్న మాజీ మంత్రి అతన్ని దారిలో ఆపాడు. బలవంతంగా టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని టీడీపీ వాట్సాప్ గ్రూపులకు పంపారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపాల్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి వివరించారు. చదవండి: వైరల్ వీడియో: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి, సీఎం జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అంతేగాని పల్లె చీప్ ట్రిక్స్‌కు లోనయ్యే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్యేగాను, వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో బండ్లపల్లి సర్పంచ్ గీతాబాయి, రూప్లానాయక్, తిరుపాల్ నాయక్, తలమర్ల మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. -
Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?
అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ‘పల్లె’ మెడకు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. అనంతపురంలో అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టడం, విద్యా సంస్థల్లో భారీఎత్తున స్కాలర్షిప్లు స్వాహా చేయడం, సొసైటీ పేర్లతో అందిన కాడికి డబ్బు వసూలు చేయడం వంటివి పల్లె ప్రతిష్టను దిగజార్చాయి. దీనికితోడు ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటాపోటీ విమర్శలతో ఇద్దరూ బజారుకెక్కారు. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ అధిష్టానం పొమ్మన లేక ‘పల్లె’కు పొగ బెడుతోందని టీడీపీ కేడర్లోనే చర్చ సాగుతోంది. సాక్షి, పుట్టపర్తి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ఆయన తీరుపై ఒకవైపు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం నెత్తుటి పుండుపై కారం చల్లిన చందంగా తయారైంది. పల్లెకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి టీడీపీ టికెట్ వచ్చే ప్రసక్తే లేదని జేసీ మీడియా సాక్షిగా కుండబద్దలు కొడుతున్నారు. విజయవాడ నుంచి అనంతపురం దాకా పల్లె చేసిన అక్రమాలు, అన్యాయాలన్నింటినీ బయటపెడతానని పేర్కొంటుండడంతో మాజీ మంత్రి అయోమయంలో పడ్డారు. పుట్టపర్తి టీడీపీ టికెట్ తన మద్దతుదారుడైన సైకం శ్రీనివాస రెడ్డికి ఇప్పిస్తానని జేసీ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో పల్లెకు టికెట్ రాకపోతే మన పరిస్థితి ఏంటని అనుచరులు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. 2009లో అనుకూలం... నేడు ప్రతికూలం జేసీ ప్రభాకర్ రెడ్డి ధోరణి విపరీతం. 2009లో పుట్టపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండసాని సురేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అప్పటి అధిష్టానం కడపల మోహన్ రెడ్డిని బరిలో దింపింది. కొండసానికి టికెట్ ఇవ్వలేదనే నెపంతో కడపల మోహన్ రెడ్డిని ఓడించడానికి జేసీ బ్రదర్స్ పావులు కదిపారు. అదే సమయంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పల్లె రఘునాథ రెడ్డి బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారు. అప్పుడు పల్లె ఎమ్మెల్యే కావడానికి జేసీ బ్రదర్స్ పరోక్షంగా దోహదపడ్డారు. కానీ తాజాగా పల్లెకు టికెట్ రాకుండా వారు చక్రం తిప్పుతున్నారు. దీంతో పుట్టపర్తిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ‘ఉజ్వల’ అంశంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన జేసీని అడ్డుకోవడానికి పల్లెతో పాటు ఆయన అనుచరులు తాపత్రయపడ్డారు. దీంతో జేసీ మరింత పట్టుదలగా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..) పొమ్మనలేక పొగ పుట్టపర్తి టీడీపీ అభ్యర్థిగా పల్లె పనికిరాడని ఆ పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఆయనపై కొన్నేళ్లుగా జేసీ గుర్రుగా ఉండడం టీడీపీ అధిష్టానానికి కలిసివచ్చింది. 99.99 శాతం పల్లెకు టికెట్ రాదని జేసీ పదేపదే చెబుతుండడం ఇందుకు నిదర్శనం. పార్టీ అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లె రఘునాథరెడ్డి అక్రమార్జనతో రూ.వందల కోట్లకు పడగలెత్తడం, విద్యా సంస్థల్లో కోట్లాది రూపాయల స్కాలర్షిప్లు స్వాహా చేయడం, అనంతపురంలో భారీగా ఆస్తులు కూడబెట్టడం, సొసైటీ పేర్లతో కళాశాలలు ఏర్పాటు చేసి అందిన కాడికి ఫీజులు వసూలు చేయడం తదితర అంశాలపై జేసీ సమగ్రంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది. పార్టీ మార్పునకు అనుచరుల ఒత్తిడి పుట్టపర్తి టీడీపీ వ్యవహారంలో జేసీ జోక్యం చేసుకున్నా పార్టీ అధిష్టానం వారించలేదు. పైగా జేసీ రోజూ ప్రెస్మీట్లు పెట్టి పల్లెపై చులకన భావన ప్రదర్శిస్తున్నారు. ఎవరి నియోజకవర్గ పరిధిలో వారు పరిస్థితులు చక్కదిద్దుకోవాలని పార్టీ అధిష్టానం అక్షింతలు వేయకుండా జేసీకి మద్దతివ్వడం పల్లెను బయటికి పంపడంలో భాగమేనన్న అనుమానం టీడీపీ కేడర్లోనే వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పార్టీ మారితే గౌరవం అయినా దక్కుతుందని అనుచరులు పల్లెపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యే, ఒక దఫా మంత్రి, ఒక దఫా ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్ హోదాలో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే కారణంతో టికెట్ రాకపోతే అవమానమని అనుచరులు వాపోతున్నారు. ఏది ఏమైనా జేసీ తన అనుచరుడు సైకం శ్రీనివాస రెడ్డికి టికెట్ ఇప్పించే అంశంలో పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
MLA Nandamuri Balakrishna Reaction on AP New Districts: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. చదవండి: (కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన పురందేశ్వరి) -
Puttaparthi: పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా
అనంతపురం విద్య / శ్రీకంఠం సర్కిల్/పుట్టపర్తి: విస్తీర్ణంలో దేశంలోనే ఏడో అతి పెద్ద జిల్లా అయిన అనంతపురం ఇక మీదట రెండు జిల్లాలు కానుంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. బుధవారం నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశముంది. అనంతపురం జిల్లా పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలోకి అనంతపురం అర్బన్, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ వస్తాయి. కొత్తగా ఏర్పాటయ్యే సత్యసాయి జిల్లాలోకి పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అనంతపురం జిల్లా విస్తీర్ణం 11,359 చదరపు కిలోమీటర్లుగా, సత్యసాయి జిల్లా విస్తీర్ణం 7,771 చదరపు కిలోమీటర్లుగా ఉండనుంది. ఎన్నెన్నో అనుకూలతలు పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు భౌగోళిక, ఆధ్యాత్మిక తదితర అంశాలు దోహదపడ్డాయి. పుట్టపర్తి ఇప్పటికే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. సత్యసాయి బాబా నడయాడిన నేల కావడంతో పాటు ప్రకృతి రమణీయత, అందాలొలికే నిర్మాణాలు, విద్య, వైద్య సౌకర్యాలు, జిల్లా కేంద్రం అవసరాలకు అనుగుణంగా భూ, నీటివనరులు అందుబాటులో ఉండడం తదితర అంశాలు కలిసొచ్చాయి. సత్యసాయి జిల్లా ఏర్పాటు ఎంతో మంది బాబా భక్తుల ఆకాంక్ష కూడా. ఇప్పుడది కార్యరూపం దాల్చడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఇక 26 జిల్లాలు) పారిశ్రామిక ప్రగతికి ఊతం సత్యసాయి జిల్లా ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతికి కూడా ఊతం ఇచ్చినట్లు అవుతోంది. విశ్వనాగరిక నగరం బెంగళూరుకు కేవలం 154 కిలోమీటర్ల దూరంలోనే పుట్టపర్తి ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే 131 కిలోమీటర్ల దూరమే. ఇప్పటికే పుట్టపర్తిలో విమానాశ్రయం ఉంది. దీనివల్ల పారిశ్రామిక, పాలనాపరమైన కార్యకలాపాలు సులువుగా నిర్వహించుకోవచ్చు. పెనుకొండ సమీపంలోని కియా కార్ల కంపెనీ, కొడికొండ వద్ద ఏర్పాటైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాంతాలు కూడా పుట్టపర్తికి దగ్గరగానే ఉంటాయి. దీంతో కొడికొండ చెక్‌పోస్టు నుంచి కియా కంపెనీ వరకు పరిశ్రమలు వృద్ధి చెందడానికి, మిగిలిన ప్రాంతాల్లోనూ పరిశ్రమల స్థాపనకు సత్యసాయి జిల్లా దోహదం కానుంది. సేద్యపు సిరులు..చారిత్రక వైభవాలు సత్యసాయి జిల్లా పరిధిలో ఆయకట్టున్న చెరువులు సింహభాగం వస్తున్నాయి. బుక్కపట్నం చెరువు 2,971 ఎకరాలు, పరిగి చెరువు 2,851 ఎకరాలు, ధర్మవరం చెరువు 1,922 ఎకరాలు, కొట్నూరు చెరువు 1,508 ఎకరాలు, హిందూపురం చెరువు 1,130 ఎకరాలు, గొట్లూరు చెరువు 642 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నాయి. యోగివేమన, చిత్రావతి, పెడబల్లి రిజర్వాయర్లు, హంద్రీ–నీవా ప్రాజెక్టు పరిధిలోని గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు ఈ జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. వీటితో పాటు చారిత్రక ప్రాంతాలైన పెనుకొండ, లేపాక్షి, హేమావతి, ఖాద్రీ లక్ష్మీనృసింహుని క్షేత్రం, తిమ్మమ్మమర్రిమాను వంటివి ఈ జిల్లాలో ఉంటాయి. తప్పనున్న వ్యయప్రయాసలు పాలనా సౌలభ్యం కోసం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే హిందూపురం పార్లమెంట్ పరిధిలో సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల వారికి ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రం సుదూరంలో ఉంది. ఎన్పీ కుంట వాసులకు 120 కి.మీ, మడకశిర వాసులకు 115 కి.మీ. దూరంలో ఉండడం గమనార్హం. పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు వల్ల వీరికి దూరం తగ్గి వ్యయప్రయాసలు తప్పనున్నాయి. -
సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌రావు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్‌రావును ఎంపిక చేశారు. చాలా కాలంగా ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తోన్న అనుభవం ఉండటంతో ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆదివారం తెలిపింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జి.చలంను సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా నియమించారు. -
‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా'
సాక్షి, పుట్టపర్తి అర్బన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పుట్టపర్తి మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు కనుముక్కల ఆదాం (49) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పుట్టపర్తికి చెందిన కనుముక్కల ఆదాం.. టైలరింగ్‌తో పాటు ఓ చిన్న గదిలో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య మహబూబ్‌బీ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రితమే కుమార్తెకు వివాహం చేశారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబం.. కరోనా లాక్డౌన్ సమయంలో వ్యాపారం బోసిపోయి కుదేలైంది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. బుధవారం తెల్లవారుజామున వాకింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆదాం.. తర్వాత ద్విచక్ర వాహనంలో పుట్టపర్తి మండలం ప్రశాంతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ ఎదుట ద్విచక్ర వాహనాన్ని నిలిపి కొత్త చెరువు వైపుగా పట్టాలపై నడుచుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సుమారు ఓ కిలోమీటరు వెళ్లిన తర్వాత సెల్ఫీ వీడియో ముగించి ఎదురుగా వస్తున్న గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై హిందూపురం రైల్వే ఎస్ఐ బాలాజీ నాయక్ కేసు నమోదు చేశారు. సల్మా.. నన్ను క్షమించు! ఆత్మహత్యకు ముందు తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఆదాం సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘సల్మా! (కుమార్తె) నన్ను క్షమించు. మీకు ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా చావు తర్వాత కుటుంబసభ్యులను, మిత్రులను ఎవరినీ పోలీసులు ఇబ్బందులు పెట్టొద్దు. నా చావుకు పూర్తి బాధ్యత నాదే. అందరికీ సలాం!’ అంటూ సందేశమిచ్చారు. అనంతరం ఈ వీడియోను పుట్టపర్తిలోని వాల్మీకి గ్రూపులోకి షేర్ చేశారు. పార్టీలోకి చేరగానే సముచిత స్థానం.. టీడీపీలో క్రియాశీలక నేతగా ఉన్న ఆదాం.. ఆ పార్టీలో ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆ సమయంలో ఆయనను అన్ని విధాలుగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రోత్సహిస్తూ వచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆదాంకు కో–ఆప్షన్ సభ్యుడిగా సముచిత స్థానం దక్కేలా చేశారు. ఆదాం మృతి చెందిన విషయం తెలుసుకోగానే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకులు కొండారెడ్డి, లోచర్ల విజయభాస్కరరెడ్డి, నెడ్‌క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, మండల కన్వీనర్ గంగాద్రి, వైస్ చైర్మన్ తిప్పన్న, కౌన్సిలర్లు చెరువు భాస్కరరెడ్డి, సూర్యగౌడ్, మాజీ కౌన్సిలర్లు నారాయణరెడ్డి, నాగిరెడ్డి, రంగారెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఆదాం కుటుంబసభ్యులను పరామర్శించారు. -
పుట్టపర్తిలో 6 జెడ్పీ స్థానాలు వైఎస్సార్సీపీ వశం
సాక్షి, అనంతపురం: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అనంతపురం జిల్లా మొత్తం వార్ వన్ సైడ్‌గా మారింది. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఆమడగూరు, ఓబులదేవచెరువు, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి ప్రజలు భారీగా ఓట్లేశారని పేర్కొన్నారు. ప్రజారంజక పాలనకు మరోసారి ప్రజలు అఖండ విజయం అందించారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. -
రాజుల కాలంనాటి బంగారు పూసలని రూ.15 లక్షలు తీసుకున్నాడు.. తీరా చూస్తే
సాక్షి,పుట్టపర్తి: తక్కువ ధరకు మేలిమి బంగారం ఇస్తామంటూ నమ్మబలికి రూ.15 లక్షలతో ఉడాయించిన ఘటన బుక్కపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మంగలి కుమార్‌కు కొంత కాలం క్రితం ఫోన్ ద్వారా కర్ణాటకకు చెందిన గణేష్ పరిచయమయ్యాడు. తాను జేసీబీ డ్రైవర్‌నని ఇటీవల కర్ణాటకలో పైప్‌లైన్ పనులు చేస్తుంటే లభ్యమైన రాజుల కాలం నాటి 3 కిలోల బంగారు పూసలను రూ.15 లక్షలకు ఇచ్చేస్తానని నమ్మబలికాడు. తక్కువ ధరకు మేలిమి బంగారం వస్తుందని కుమార్ ఆశపడ్డాడు. రూ.15 లక్షలు తీసుకుని పుట్టపర్తికి వస్తే తాను అక్కడకు వచ్చి బంగారు పూసలు ఇస్తానని చెప్పడంతో అలాగేనని సోమవారం సాయంత్రం కుమార్ పుట్టపర్తికి చేరుకున్నాడు. తర్వాత కొత్తచెరువులో తానున్నట్లు గణేష్ తెలపడంతో అక్కడకెళ్లాడు. అనంతరం బుక్కపట్నం ఆస్పత్రి వద్ద ఇద్దరూ కలిశారు. తన వద్ద ఉన్న కొన్ని బంగారు పూసలు చూపించడంతో వాటిని పరిశీలించి, మేలిమి బంగారంగా కుమార్ ధ్రువీకరించుకుని రూ.15 లక్షలు అప్పగించడంతో పూసల గుచ్ఛను చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత వాటిని మరోసారి పరిశీలించుకోగా నకిలివిగా తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు బుక్కపట్నం, కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: తుప్పల్లో యువతి చెయ్యి.. మిస్టరీని ఛేదించిన పోలీసులు -
పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సర్వీసులను నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పుట్టపర్తి విమానాశ్రయం ద్వారా అనంతపురం జిల్లాకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాన్ని ప్రభుత్వం తీసుకొని నిర్వహించడానికి గల మార్గాలపై సత్యసాయి ట్రస్ట్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం జిల్లాకు ఈ విమానాశ్రయం మరింత కలిసి వస్తున్న నేపథ్యంలో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ నెల 5న సత్యసాయి ట్రస్ట్ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రానున్న 6 నెలల్లో పుట్టపర్తి విమానాశ్రయాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీఏడీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. రన్‌వే విస్తరణకు, ప్రహరీగోడ నిర్మాణానికి, 100 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా టెర్మినల్ భవనాన్ని విస్తరిస్తే సరిపోతుందని, ఇందుకోసం కొంత స్థలం సేకరించాల్సి ఉంటుందని ఏపీఏడీసీఎల్ అధికారులు తెలిపారు. డ్రోన్ హబ్‌గా పుట్టపర్తి డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి పుట్టపర్తి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి పట్టణాలకు దగ్గరగా ఉండటంతో పుట్టపర్తిని వేగంగా డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దవచ్చని భరత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కంటికి కనిపించనంత దూరం వెళ్లే డ్రోన్ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
సాయి సత్య బోధ
మనిషి జీవితంలో సైన్స్‌కి అందని విషయాలు చాలా ఉన్నాయి... రామాయణ.. మహా భారతాల్ని కల్పితాలు అని వాదించే నాస్తికులు, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం సత్యసాయి దర్శనం చేసుకుని ఆయన బోధలను ఆలకించినవారే! సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే వాటిని ఆయుధాలుగా చేసుకుని.. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని తన బోధనల ద్వారా ప్రజల్లో ప్రేమ తత్వాన్ని నింపారు సత్య సాయి. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే...అదే ప్రేమ... మీ ప్రేమ నాకు కావాలి.. అంటూ ఉండేవారు సత్యసాయి. భౌతికంగా ఆయన మనకు కనుమరుగై కొన్ని ఏళ్లు గడిచినా ఇప్పటికీ పుట్టపర్తిలోని ప్రశాంతినిలయంలో భగవాన్ జయంతి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరూ ఇక్కడ 10 నుంచి 15 రోజులు సేవ చేస్తూ ఒకే కుటుంబంగా ఉంటూ వచ్చిన వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. పదాహారేళ్ల పిల్లలు... ఎవరో తిని తాగిన ఎంగిలి విస్తళ్లు, కప్పులు మేము తియ్యడం ఏమిటా అనుకోకుండా ఒకరితో ఒకరు సేవలో పోటీ పడుతూ సంతోషంగా చేస్తున్నారు. కరోన కారణంగా సామాజిక దూరం పాటించడం కోసం మందిరంలో... ఇంకా చాలా చోట్ల వృత్తాలు గీసి ఉంచారు. బాబా తన బోధలలో ఎక్కువగా ఒక విషయం చెప్పేవారు... చావుకు భయపడద్దు... చెప్పుడు మాటలు నమ్మద్దు... భగవంతుడిని విడవద్దు... అని. బహుశ వీటిని దృష్టిలో పెట్టుకునే కాబోలు... ఎంతోమంది ఈ కరోన సమయంలో కూడా సేవకు వచ్చారు. సత్యసాయి బోధామృతం.. ►రోజును ప్రేమతో మొదలు పెట్టు... ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి. ►కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది. ►దైవమే ప్రేమ. ప్రేమలో జీవించు. ►ప్రతి అనుభవం ఒక పాఠం ప్రతి వైఫల్యం ఒక లాభం ►ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ►ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. – ఇన్పుట్స్: పోరంకి లక్ష్మీప్రసన్న (నవంబర్ 23 సత్యసాయి జయంతి) -
నవవధువు అనుమానాస్పద మృతి
సాక్షి, పుట్టపర్తి : వెంగళమ్మచెరువు గ్రామంలో నవ వధువు గీతాంజలి (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే చిత్రహింసలు పెట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు మెట్టినింటి వారిపై ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, పుట్టపర్తి, కొత్తచెరువు ఎస్ఐలు దాదాపీర్, వెంకటేశ్వర్లు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బకు చెందిన బొగ్గు కుళ్లాయప్ప, అలివేలమ్మ దంపతుల పెద్ద కుమార్తె గీతాంజలిని ముదిగుబ్బలోనే నివాసముంటన్న బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన ముసలప్ప, గంగమ్మ దంపతుల కుమారుడు అయిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సురేష్‌కు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.1.5 లక్షలు కట్నం కింద అందజేశారు. అయితే తమకు అదనంగా మరో రూ.లక్ష కావాలంటూ మెట్టినింటి వారు వేధించేవారు. నవదంపతులు శనివారం ఉదయం గంగిరెడ్డిపల్లి ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చి సాయంత్రం వెంగళమ్మచెరువులోని సురేష్ చిన్నాన్న చిన్నప్పయ్య ఇంటికి చేరుకున్నారు. చిన్నప్పయ్యకు చెందిన నూతన ఇంటిలో వారికి పడక ఏర్పాటు చేశారు. పొద్దుపోయిన తరువాత సురేష్ తన ముగ్గురు మిత్రులతో కలిసి పూటుగా మద్యం తాగాడు. ఇదే సమయంలో గీతాంజలి తన తల్లికి ఫోన్ చేసి తనకు భయమేస్తోందని, ఎవరో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని ఏడుస్తూ చెప్పింది. ఇంతలో సురేష్ ఫోన్ అందుకుని ‘ఏమీ లేదులే అత్తా.. నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చి పెట్టేశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే గీతాంజలి ఉరికి వేలాడుతోంది. సురేష్ ఇంటి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇరుగుపొరుగు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, కొత్తచెరువు ఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. చదవండి: నెల రోజుల క్రితం వివాహం.. కొద్ది రోజులకే మృతిపై అనుమానాలు.. ఆదివారం ఉదయం కుమార్తె మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో వెంగళమ్మచెరువు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న గీతాంజలిని చూసి బోరున విలపించారు. కంటి పక్కన, కుడి కాలిపైన, గొంతుకింద, గాయాలతో పాటు చేయి విరిగిన ఆనవాళ్లు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన అల్లుడు, వారి మిత్రులు, అతడి చిన్నాన్న కుటుంబ సభ్యులు కలిసి చిత్రహింసలు పెట్టి గీతాంజలిని చంపి.. తర్వాత ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గ్రామంలోని ఉన్నత పాఠశాల వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. పోలీసులు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి బొగ్గు కుళ్లాయప్ప ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్ -
‘అనంత’లో డ్రోన్ ప్రయోగాలు
సాక్షి, అమరావతి: సుదీర్ఘ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు, ఇతర వస్తువులను సరఫరా చేసే పరీక్షలకు అనంతపురం జిల్లా వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా కంటికి కనిపించనంత దూరంగా (బీవీఎల్వోఎస్) డ్రోన్లను పరీక్షించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులిచ్చింది. రాష్ట్రానికి చెందిన వాల్యూథాట్‌తో పాటు కర్ణాటకకు చెందిన ఇన్ డ్రోన్స్ సంస్థలు కన్సా ర్షియంగా ఏర్పడి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌తో కలిపి అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో ఈ ప్రయోగాలు నిర్వహించనున్నాయి. డ్రోన్‌కు సుమారు 8 కిలోల బరువున్న వస్తువులను అమర్చి 27.5 కి.మీ దూరం రిమోట్ సాయంతో పంపి పరీక్షలు నిర్వహించనున్నట్లు వాల్యూ థాట్ సీఈవో మహేష్ అనిల్ నంద్యాల ‘సాక్షి’కి వివరించారు. జీపీఎస్ ద్వారా డ్రోన్ తీసుకెళ్లిన వస్తువులను నిర్దేశిత గమ్యానికి సురక్షితంగా చేర్చి తిరిగి వచ్చిందా లేదా పర్యవేక్షిస్తామని, ఈ విధంగా 100 గంటలు ప్రయోగం చేయాల్సి ఉంటుందని సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వంశీ మాదిరెడ్డి తెలిపారు. ఈ ప్రయోగాలకు అనుమతులు, ఏర్పాట్లను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అందిస్తుంది. పుట్టపర్తి ఎయిర్‌పోర్టు సమీపంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థలాన్ని ప్రయోగానికి వేదికగా నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రకృతి విపత్తులు, సరిహద్దుల రక్షణ, అత్యవసర మందులు, ఆహార సరఫరా వంటి కార్యక్రమాల్లో డ్రోన్స్‌ను విరివిగా వినియోగించుకోవచ్చు. -
ఇష్టం లేదంటున్నాపెళ్లి.. ఆత్మహత్య
అనంతపురం, పుట్టపర్తి టౌన్: తనకు ఇష్టం లేదంటున్నా పెళ్లి సంబంధం చూస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అర్బన్ సీఐ వెంకటేష్‌నాయక్ తెలిపిన మేరకు... పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డు బీడుపల్లిలో ఈడిగ జనార్దన కుమార్తె శ్వేత (27) ఎంబీఏ పూర్తి చేసింది. తనకు పెళ్లి ఇష్టంలేదని, ఇప్పుడే చేసుకోనని తల్లిదండ్రులకు పలుమార్లు తెలిపింది. అయినా తల్లిదండ్రులు కూతురు జీవితం బాగుండాలని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాలుగురోజుల క్రితం వద్దన్నా పెళ్లి సంబంధం చూస్తున్నారంటూ శ్వేత మనస్తాపం చెందింది. తన చావుకు తల్లిదండ్రులు కానీ, ఇతరులు కానీ కారణం కాదని లేఖ రాసి మంగళవారం రాత్రి ఇంట్లోనే చీరతో ఫ్యానుకు ఉరివేసుకుంది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేవగానే ఉరికి వేలాడుతున్న శ్వేత కనిపించింది. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ వెంకటేష్‌నాయక్ తమ సిబ్బందితో వచ్చి పరిసరాలు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. -
'మరింత ప్రజాసేవ చేయాలని కోరుకున్నా'
సాక్షి, అనంతపురం : పుట్టపర్తి సత్యసాయి 94వ జయంతి వేడుకలకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి తన భోదనలతో మానవునిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్పారని తెలిపారు. విద్య, వైద్య, తాగునీటి రంగాలకు సత్యసాయి అందించిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ప్రతి మనిషి సేవ, ప్రేమ భావనలను పెంపొందించుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలనేదే సత్యసాయి అభిమతమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నాకు మరింత ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని సత్యసాయిని వేడుకున్నట్లు తెలిపారు. -
పుట్టపర్తి కళికితురాయి.. ఈ శివాలయం
సాక్షి, పుట్టపర్తి : పుట్టపర్తిలో సత్యసాయి జన్మస్థలంలో వెలసిన శివశక్తి స్వరూప ఆలయం చాలా అరుదైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి మూలవిరాట్‌ను తన స్వహస్తాలతో బాబానే ప్రతిష్టించినట్లు ప్రతీతి. నిత్యం పుట్టపర్తిని సందర్శించే భక్తులు తప్పనిసరిగా ఈ శివాలయంలో అర్చనలు, అభిషేకాలు చేయించుకుని తరిస్తుంటారు. 125 దేశాల భక్తులతో పూజలు అందుకుంటున్న అరుదైన ఆలయంగా ఆధ్యాత్మిక చరిత్ర పుటల్లో ఈ ఆలయం స్థానం దక్కించుకుంది. పుట్టపర్తిలోని సత్యసాయి నివాసానికి సమీపంలో 1976లో శివశక్తి స్వరూప పేరుతో శివాలయాన్ని బాబా నిర్మించారు. సాధారణంగా శివాలయం అనగానే అందులో శివలింగాన్ని భక్తులు సందర్శిస్తుంటారు. అయితే శివశక్తి స్వరూప ఆలయంలో ఏకశిలా పాలరాతితో చేయించిన శివుడి ప్రతిమను సత్యసాయి ప్రతిష్టించారు. పుట్టపర్తికి వచ్చే 125 దేశాల భక్తులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నిత్యమూ ఇక్కడ అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. ఇక కార్తీక మాసంలో ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకూ అభిషేక పూజలు ఉంటాయి. ప్రతి నెలా వచ్చే మాసశివరాత్రి నాడు ఉదయం 5 నుంచి 7.30 గంటల లోపు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. బహుళ అష్టమి నాడు చండీ హోమాలు ఉంటాయి. పుట్టపర్తిలో మరో కళికితురాయి దేశంలో రెండవది, రాష్ట్రంలో మొదటి ఎత్తైన శివలింగ మందిరంగా పుట్టపర్తిలోని శివశక్తి స్వరూప ఆలయం ఖ్యాతి గడించింది. ఇక్కడ ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల నిర్మాణ పనులు పూర్తి చేసుకొని పూజలందుకోవడానికి సిద్దంగా ఉన్న మరో శివలింగాకార మందిరం పుట్టపర్తి కీర్తి మకుటంలో కళికితురాయిగా నిలవనుంది. ఇది రాష్ట్రంలోనే ఎత్తైన శివలింగ మందిరంగా గుర్తింపు పొందినట్లు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యాజమాన్యం పేర్కొంటోంది. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పుట్టపర్తికి ఏడు కిలోమీటర్ల దూరంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందు కోసం సుమారు రూ.కోటి వెచ్చించారు. దాదాపు 75 అడుగుల ఎత్తుతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ఆలయంలో మ్యూజియం, మెడిటేషన్, లేజర్‌షో ఏర్పాటు చేశారు. ఈ మందిరం చుట్టూ దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను అందంగా పెయింటింగ్ వేయించారు. లోపల శ్రీకృష్ణుని లీలలు, రేపల్లె అందాలు, గోపికల విన్యాసాలు ఆకట్టుకునే బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. ఈ మందిరానికి ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కినట్లు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యాజమాన్యం తెలిపింది. -
ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్
పుట్టపర్తి టౌన్: పోలీసులు తన ఆటోకు నంబర్ కేటాయించలేదన్న కోపంతో డ్రైవర్ ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటు చేసుకుంది. పుట్టపర్తిలో తిరిగే కొన్ని ఆటోల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని భావించిన పోలీసులు కొత్త పద్ధతి తీసుకొచ్చారు. ఆటోలకు నంబర్లు కేటాయించి.. వాటిని మాత్రమే పట్టణంలో తిరిగేందుకు అనుమతులు ఇచ్చారు. ఇంకా 150 ఆటోలకు వివిధ కారణాలతో నంబర్లు కేటాయించలేదు. ఇలా నంబర్ లేని డ్రైవర్లు తమ ఆటోలకు నంబర్లు కేటాయించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డీఎస్పీకి, సీఐకి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో పుట్టపర్తిలోని సాయినగర్‌కు చెందిన నాగేంద్ర ఆదివారం మధ్యాహ్నం తన ఆటోకు నిప్పుపెట్టుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ఆటో కాలిపోయింది. దీంతో పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు. -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ము స్వాహా
సాక్షి, పుట్టపర్తి : నగర పంచాయతీలోని బ్రాహ్మణపల్లి స్టేట్ బాంక్‌లో ఖాతాదారుల సొమ్ము రూ.3 లక్షలను తాత్కాలిక ఉద్యోగి రమేష్ స్వాహా చేశారు. మేనేజర్ శివనాగ లింగాచారి వివరాల మేరకు.. బ్యాంక్‌లో సిబ్బంది తక్కువ ఖాతాదారులెక్కువగా ఉండడంతో తాత్కాలిక ఉద్యోగికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పారు. బడేనాయక్ తండాకు చెందిన మంజులాబాయి రమేష్ సహకారంతో 2015లో రూ.1.2 లక్షలు, రూ.80 వేల చొప్పున రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీ) చేసింది. అయితే గతేడాది అక్టోబర్‌లో డబ్బు అవసరం ఉండటంతో ఎఫ్డీలపై రూ.1.5 లక్షలు రుణం తీసుకుంది. డబ్బు సరిపోవడంతో 15 రోజుల తర్వాత రుణం చెల్లించాలంటూ రమేష్‌కు నగదు అందజేసింది. రమేష్ బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఆమెకు నకిలీ ఎఫ్డీ రసీదు ఇచ్చాడు. ఆమెకు ఉన్న పరిచయంతో కొద్ది రోజులకు ఆమె ఇంటికి వెళ్లి ఒర్జినల్ ఎఫ్డీ రసీదు తీసుకొచ్చి బ్యాంక్ సిబ్బందితో ఉన్న నమ్మకాన్ని ఆయుధంగా చేసుకొని ఫోర్జరీ సంతకాలతో రెండు లక్షలు స్వాహా చేశాడు. ఆమె తిరిగి ఈనెల 5న నకిలీ ఎఫ్డీ రసీదు తీసుకుని బ్యాంకుకు వచ్చి డబ్బు అడగడంతో రమేష్ బాగోతం బయటపడింది. ఇదే తరహాలో సుబ్బరాయునిపల్లికి చెందిన సత్యమ్మకు రూ.1 లక్ష టోకరా వేసినట్లు బాధితురాలు వాపోయింది. విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి పరారుకావడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారులు విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇది చదవండి : సాక్స్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకొని సచివాలయం పరీక్షకు.. -
నా రూటే.. సపరేటు !
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. అయితే పుట్టపర్తి తహసీల్దారు గోపాలకృష్ణ రూటే సపరేటు... అందరు తహసీల్దార్లకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరణ అన్ని చోట్ల జరుగుతుంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ముఖ్య గమనిక అంటూ ‘‘ప్రస్తుతం రేషన్‌కార్డులకు దరఖాస్తులను స్వీకరించబడవు మీ సేవలోనే ప్రభుత్వ వెబ్సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి’’ అని ఏకంగా నోటీసు బోర్డులో ఉంచారు. దరఖాస్తులు కచ్చితంగా తీసుకోవాలి కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని కచ్చితంగా స్వీకరించాలే తప్ప తిరస్కరించకూడదు. కలెక్టరేట్‌తో సహా జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాల్లోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలా వచ్చిన దరఖాస్తులను మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. అంతే కాకుండా వాటిని పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తిస్తారు. ఇది ప్రక్రియ. అయితే పుట్టపర్తి తహసీల్దారు మాత్రం ఇందుకు భిన్నంగా దరఖాస్తుల స్వీకరించబోమని నోటీసు ఉంచడం చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో అతికించిన నోటీసు మీ–సేవలో దరఖాస్తు విధానం లేదు కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ప్రస్తుతం అమలులో లేదు. కార్డు కోసం మీ సేవలో దరఖాస్తులను స్వీకరించరు. అందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా లేదు. అయితే పుట్టపర్తి తహసీల్దార్ ఇందుకు భిన్నంగా... మీ– సేవలోనే ప్రభుత్వ వెబ్సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. దరఖాస్తులు స్వీకరించాలి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చేసుకుంటున్న దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయాల్లో స్వీకరించాలి. అంతే తప్ప వాటిని తిరస్కరించకూడదు. వచ్చిన దరఖాస్తులను పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తాం. పుట్టపర్తి తహసీల్దార్ అలా ఎలా నోటీసు ఉంచారో తెలీదు. ఆయనతో నేనే స్వయంగా మాట్లాడాతాను. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి, పౌర సరఫరాల శాఖ -
ఫేక్‌న్యూస్ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి
సాక్షి, హైదరాబాద్ : 15వ దలైలామాగా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపికయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. సత్యసాయి పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల దావావంగ్డి 15వ దలైలామాగా ఎంపికయ్యాడంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దలైలామా ఆఫీసు కొట్టిపారేసింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, 15వ దలైలామాగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దావావంగ్డి సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందినవాడే కాదని తేలింది. అతనికి సత్యసాయి స్కూల్‌తో ఏ మాత్రం సంబంధంలేదని స్పష్టమైంది. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు చెందిన ప్రేమవంగ్డి,పంజూరాయ్‌ల కుమారుడు దావవంగ్డి కాగా.. 2016 లో అతన్ని ‘ద్రాక్త్సే రిన్పోచే’ అనే బౌద్ధ గురువు యొక్క అవతారమని 14వ దలైలామా గుర్తించినట్టు ‘జీ న్యూస్’ ఓ కథనంలో పేర్కొంది. కానీ తననే ఇప్పుడు 15వ దలైలామాగా ఎన్నుకున్నట్టు మాత్రం ఎక్కడా సమాచారం లేదు. -
రూ.10 వేలిస్తే... లక్ష మీకే!
సాక్షి, పుట్టపర్తి అర్బన్: ప్రధాని రుణాల పేరుతో యువకులు మోసం చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డిపాజిట్ చేస్తే రుణాలు మొత్తం ఇచ్చేస్తామంటూ నమ్మబలికి నగదు తీసుకున్నాక ఉడాయించేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. పుట్టపర్తి మండలం పెడపల్లి చిన్న తండాకు చెందిన రైతు హనుమానాయక్, క్రాంతిబాయి దంపతులు. వయసు పైబడటంతో ఇంటి వద్దే ఉంటున్నారు. కొడుకు, కోడలు అనంతపురంలో నివాసం ఉంటున్నారు. వృద్ధ దంపతుల ఇంటికి శుక్రవారం ఓ యువకుడు బైక్‌లో వచ్చాడు. ‘మీకు ప్రధాని మోదీ రూ.లక్ష నగదు మీ ఖాతాలో వేశాడు. ఇదిగో లక్ష రూపాయల కట్ట. మీరు రూ.10 వేలు డిపాజిట్ చెల్లిస్తే నా వద్ద ఉన్న రూ.లక్ష మీకు ఇస్తా’ అని నమ్మబలికాడు. నగదు పోయిందని వాపోతున్న వృద్ధ దంపతులు సదరు రైతు ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం పరిశీలించి, వారి వద్ద నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. బ్యాంకు ఖర్చుకు మరో రూ.2 వేలు కావాలని అడిగి తీసుకున్నాడు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాక రూ.లక్ష ఇస్తామనడంతో రైతు షర్ట్ మార్చుకుని వద్దామని లోనికెళ్లగానే.. ఆ యువకుడు బైక్‌లో తుర్రుమన్నాడు. రుణం పేరుతో తమకు టోకరా వేశాడని గ్రహించిన వృద్ధ దంపతులు లబోదిబోమన్నారు. క్రాంతిబాయి ఏడుస్తూ పెడపల్లి బస్టాండ్‌లో ఉండగా కొంతమంది విషయం ఆరా తీసి.. యువకుడి కోసం ద్విచక్రవాహనాల్లో వెళ్లి గాలించినా ఎక్కడా కనిపించలేదు. సబ్సిడీ విత్తన వేరుశనగకాయల కోసం అప్పు తెచ్చి పెట్టుకున్న సొమ్మును దుండగుడు దోచుకెళ్లాడని వృద్ధులు విలపించారు. సరిగ్గా పది రోజుల క్రితం ప్రాథమిక పాఠశాల సమీపంలోని చిన్న అక్కులప్ప అనే ఓ రైతు నుంచి కూడా ఇలాగే చెప్పి రూ.10 వేలు టోకరా వేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం గీల్యానాయక్‌వద్ద నుంచి రూ.4 వేలు తీసుకొని పరారైనట్లు సమాచారం. అయితే దుండగుడి వివరాలు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. -
ఆరు సూట్‌కేసుల్లో కోట్ల రూపాయల డబ్బు..
సాక్షి, అనంతపురం : ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపింది. కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి ఓటర్లను లోబర్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి పోలీస్ యంత్రంగాన్నే ఇష్టా రాజ్యంగా వాడుకుంటుంది. తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరులో ఓ ఇన్నోవా కారులో కోట్లు తరలిస్తుండగా స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సమాచారం అందగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మీడియా అక్కడికి వెళ్లగా పోలీసులు మాత్రం దగ్గరకు రానివ్వలేదు. కారులోని ఆరుసూట్కేసుల్లో కోట్లలో డబ్బు ఉందని తెలుస్తోంది. పై అధికారుల సూచనల మేరకే పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ పుట్టపర్తి అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు టీడీపీ నేతలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా.. కేవలం కృష్ణారెడ్డి అనే కార్యకర్తపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. -
పరిటాల శ్రీరామ్‌కు చేరవేస్తున్న నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్ : మంత్రి పరిటాల సునీత కుమారుడు, అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు చేర వేసేందుకు సిద్ధం చేసిన రూ.24 లక్షలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడి ప్రధాన అనుచరుడు తన డ్రైవర్ ద్వారా నగదు పంపేందుకు ప్రయత్నించారు. నగదు చిక్కిన విషయం తెలియడంతో టీడీపీ కీలక నేతలు, ఏపీ ప్రభుత్వ అధికారులు సైబరాబాద్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. రాప్తాడు మండల పరిషత్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా (ఎంపీపీ) ఉన్న దగ్గుపాటి వెంకట ప్రసాద్ పటాన్చెరులో డీవీ పాలిమర్స్ పేరుతో ఓ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు రూ.24 లక్షలు సమకూర్చడానికి సిద్ధమైన ప్రసాద్ ఈ మొత్తాన్ని పోలీసుల కంటపడకుండా తరలించడానికి పథకం వేశారు. వ్యక్తిగత వాహనాల్లో తీసుకువెళ్తే చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరిగితే పట్టుబడే ప్రమాదం ఉందని భావించి తన డ్రైవర్ సంతోష్‌రెడ్డికి డబ్బు అందించాడు. ఓ టావెల్స్ బస్సులో డబ్బు తరలిస్తున్న సంతోష్‌రెడ్డిని పోలీసులు సోమవారం ఆరామ్‌ఘర్ చౌరస్తా ప్రాంతంలో తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఈ డబ్బుకి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి రసీదులు, లెక్కలు లేకపోవడంతో పోలీసు స్టేషన్‌కు తరలించారు. తన యజమాని ప్రసాద్ సూచన మేరకే డబ్బులు తరలిస్తున్నట్లు సంతోష్‌రెడ్డి అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. గెలుపు కోసం మాజీ మంత్రి పల్లె అడ్డదారులు అనంతపురం : మరోవైపు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా తన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టపర్తిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. నియోజకవర్గంలోని యువతను ఆకర్షించే ఎత్తుగడలో భాగంగా భారీగా క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రీడా పరికరాల పంపిణీకి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. -
కాస్త వదులు ‘బాబూ’.. దిగిపోతా..!
సాక్షి, అనంతపురం : ఎన్నికలొచ్చాయ్.. ఓటర్లు దేవుళ్లై పోయారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎన్నికల వేళ రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఆ వరుసలో ఏపీ సీఎం చంద్రబాబు ముందుంటారు. అయిదేళ్ల పాలనలో కనిపించని ప్రజలు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయనకు ఒక్కసారిగా గుర్తుకు వచ్చారు. ఓవైపు హామీల నాటకాలకు తెరతీస్తూనే మరోవైపు ప్రచార వేదికలపై తెచ్చిపెట్టుకున్న ‘అనురాగం’ చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఎవరినీ చేతితో కూడా తాకటానికి ఇష్టపడని చంద్రబాబు తాజాగా ఓ వృద్ధురాలి పట్ల ఎడతెగని ప్రేమ కురిపించేశారు. ఓ అవ్వను సైకిల్‌పై ఎక్కించుకున్న చంద్రబాబు అక్కడున్నవారికి అభివాదం చేశారు. ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. దీంతో బాబును దీవించేందుకు ఆ వృద్ధురాలు ఆయన తలపై చేతులు పెట్టగా.. ఆమె చేతులను బలవంతంగా తీసివేశారు. దీంతో ఖిన్నురాలైన పెద్దావిడ వదిలితే దిగిపోతా అన్నట్టు చూసింది. అంతలోనే.. ఇక చాలులే అన్నట్టు తెలుగు తమ్ముళ్లు ఆమెను సైకిల్ దించేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం బాబు ఎన్నికల స్టంట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడు సైకిల్ ఎక్కించుకుంటారు. గెలిచాక దానికిందే వేసి తొక్కిపడేస్తారు అని అంటున్నారు. -
ఆధ్యాత్మిక పరిమళం..పుట్టపర్తి
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం.. చిత్రావతి నది ప్రవహించే పుణ్యభూమి.. చదువుల తల్లి(డీమ్డ్ యూనియవర్సిటీ)కి నెలవు. అద్భుత దృశ్యాల(నక్షత్రశాల)కు కొలువు.అతి పెద్దచెరువు(బుక్కపట్నం) ఉన్న ప్రాంతం... లక్షలాది మందికి ప్రాణం పోస్తున్న వైద్యాలయం (సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి) కలిగి ఉన్న దివ్యభూమి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న నియోజకవర్గం. ప్రశాంతతకు మారుపేరుగా.. మంచితనానికి నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. భగవాన్ సత్యసాయి బోధనలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. మొత్తం ఓటర్లు 1,90,930 పురుషులు 95,877 మహిళలు 95,046 బుక్కపట్నం: పుట్టపర్తి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. 2004కు ముందు పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మండలాలతో పాటు చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాలు, ముదిగుబ్బ మండలం మంగళమడక, గరుగుతండా కొంత భాగం, ధర్మవరం మండలం నేలకోట, ఏలుకుంట్ల, బుడ్డారెడ్డిపల్లి గోరంట్ల నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువులు మండలాలు కలిపి పుట్టపర్తి నియోజకవర్గంగా ఏర్పడ్డాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983, 1985, 1995, 1999 మినహా ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. 1978లో మాత్రం పాముదుర్తి రవీంద్రారెడ్డి తన వదిన కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి అయిన పద్మాభాస్కర్రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 1978, 1989, 2004లో మూడుసార్లు గెలుపొందగా 1983, 1985లో టీడీపీ నుంచి డాక్టర్ కేశన్న విజయం సాధించారు. 1995, 1999లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలిచారు. ఇక 2004లో నిమ్మల కిష్టప్పపై కాంగ్రెస్ అభ్యర్థి పాముదుర్తి రవీంద్రారెడ్డి కేవలం 184 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె రఘునాథరెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కడపల మోహన్‌రెడ్డిపై 1058 ఓట్ల స్వల్ప మెజారిటీతో పల్లె గట్టెక్కారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తకోట సోమశేఖర్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి గెలుపొందారు. ప్రధాన సమస్యలు మారాల రిజర్వాయర్ ఉన్నా పిల్లకాలువలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు 18 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా ఉంది. కృష్ణా జలాలు కళ్ల ముందే పారుతున్నా చెరువులు నింపకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికితోడు సాగునీరు లేక వేలాది ఎకరాలు బీడుగా మారాయి. అమడగూరు మండలంలో సైన్స్ సిటీ భూములు దాదాపు 10 వేల ఎకరాలు వృథాగా ఉన్నాయి. పరిశ్రమలు లేకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు పొట్టకూటి కోసం కర్ణాటక, చైన్నై లాంటి ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. పుట్టపర్తి విమానాశ్రయ విస్తరణ ఆచరణకు నోచుకోవడం లేదు. పుట్టపర్తిని జిల్లాగా చేయాలన్న ఇక్కడి ప్రజలు ఆశలు నెరవేరడం లేదు. గోరంట్లలో పాముదుర్తి వంశీయులదే హవా గోరంట్ల నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరుగగా ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిశారు. గోరంట్ల నియోజకవర్గంలో బుక్కపట్నం మండలం పాముదుర్తి వంశీయులదే హవా సాగింది. పాముదుర్తి పెద్ద బయపరెడ్డి హిందూపురం పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించగా ఆయన సోదరుడు పాముదుర్తి రవీంద్రారెడ్డి 1978, 89, 2004లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో ఈయన తిరులేని నేతగా ఉన్నారు. బుక్కపట్నం మండలంలో నేటికీ అనేక గ్రామాలలో రవీంద్రారెడ్డి కుటుంబీకుల ప్రభావం ఉంది. రెండ్లు సారి గెలిచినా ‘పల్లె’ చేసింది శూన్యం పల్లె రఘునాథరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని నియోజకవర్గ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల బరిలో నిలవడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పుట్టపర్తిలో విమానాల విడిభాగాల పరిశ్రమ ఏర్పాటు, సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు, కృష్ణా జలాలతో నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామన్న హామీలు ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. ఇక ఒకటి, రెండు చెరువులను అరకొరగా నింపినా ఒక ఎకరా కూడా సాగులోకి తేలేకపోయారు. దీంతో ఎమ్మెల్యేపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుక్కపట్నం చెరువు ముంపు భూముల రైతులకు ఒక్క పైసా పరిహారం ఇప్పించలేకపోయారు. సుమారు రూ.30 కోట్ల మేర నిధులు మాంజూరైనా పనులు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారని, దీంతో ఆ నిధులు వెనక్కు వెళ్లి పోయాయని అసమ్మతి నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న బహిరంగంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉండగా పల్లె సొంత పార్టీ నుంచే సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పీసీ గంగన్న ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించగా నియోజకవర్గంలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ రెస్కో చైర్మన్ న్యాయవాది రాజశేఖర్ తన అనుచరులతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరారు. అటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇటు సొంత పార్టీ నుంచి అసమ్మతి పెరిగిపోవడంతో ‘పల్లె’ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సేవా కార్యక్రమాలతో ‘దుద్దుకుంట’ ప్రజలకు చేరువ 2014వ నుంచి పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని నియమించారు. ఆయన నాటి నుంచి నేటి దాకా తన ట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. గ్రామాల్లో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా, నియోజకవర్గంలో 40 వేల మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించటంతో పాటు చదువులో ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. రావాలి జగన్..కావాలి జగన్, నిన్ను నమ్మం బాబు కార్యక్రమాల ద్వారా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ఇంటింటా వివరించారు. నవరత్నాల పథకాలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. దుద్దు్దకుంట సేవకార్యక్రమాలు, నవరత్నాలతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్సార్సీపీ కలిసివచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నామినేషన్
-
పుట్టపర్తిలో ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్సీపీ శ్రీకారం
-
మా గ్రామానికి రావద్దు
సాక్షి, అమడగూరు : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చుక్కెదురైంది. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో రోడ్లను ప్రారంభించడానికి శుక్రవారం విచ్చేసిన ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఏ పుట్లవాండ్లపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వెళ్లగా ఊరిబయటే వేచి చూస్తున్న గ్రామస్తులు ఎమ్మెల్యే వాహనాలు రాగానే అడ్డగించారు. గ్రామంలో చాలా మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, మా గ్రామానికి మీరు ఏం చేశారని నిలదీశారు. అలాగే లోకోజుపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి వెళ్లగా డ్వాక్రా సంఘాల మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పసుపు–కుంకుమ కింద చెక్కులు ఇచ్చారు కానీ వాటికి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పది రోజులు క్రితం అమడగూరులో పంపిణీ చేసిన చీరల కోసం తామంతా వచ్చినా ఒక చీర కూడా ఇవ్వలేదని, ఆ రోజు తిండి కూడా లేక కడుపు మాడ్చుకుని ఇళ్లకు వచ్చామన్నారు. అలాగే గుండువారిపల్లికి వెళ్లగా అక్కడ కూడా గోబ్యాక్ పల్లె అంటూ నినాదాలు చేశారు. అర్హులైన వారి ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టని వారికి బిల్లులు ఇచ్చారని, సబ్సిడీ రుణాల్లో, ఆవులషెడ్ల మంజూరులో అర్హులకు అన్యాయం చేశారని గ్రామానికి రావద్దని అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన పల్లె వెనుతిరిగారు. -
‘పల్లె’కు పుట్టపర్తి టికెట్ ఇవ్వద్దు..
సాక్షి, అమరావతి : టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పుట్టపర్తిలో ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదని టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ముందు ఆందోళన చేపట్టారు. రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పల్లె రఘునాథరెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వాలని మరికొంతమంది నినాదాలు చేశారు. అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా మరో వర్గం పోటాపోటీగా నినాదాలు చేశారు. కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య తోపులాట సైతం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడినుంచి పంపించేశారు. నవ్యాంధ్రలో పుట్టపర్తి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఈ నాలున్నరేళ్ల కాలం పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి ఏనాడూ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరుకు సొంత పార్టీలోని వారిని సైతం నిర్లక్ష్యం చేస్తూ తానొక్కడే ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. అక్రమాలతో ప్రజాధనాన్ని మూట గట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో అతనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇప్పటికే పల్లెకు టికెట్ ఇవ్వరాదంటూ పలువురు నేరుగా టీడీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. తనకే టికెట్ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు, ఇతర నాయకులను కలిసి బుక్కపట్నంకు చెందిన పెదరాసు సుబ్రహ్మణ్యం పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నకేశవులు, తదితరులు జిల్లా మంత్రి దేవినేని ఉమాను గత బుధవారం కలిసి పల్లెకు ఈసారి టికెట్ ఇవ్వరాదంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పల్లె సరికొత్త ఎత్తుగడలతో ప్రజల ముందుకు వచ్చారు. -
పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థులకు గాయాలు
అనంతపురం, పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలో చిత్రావతి రోడ్డులోని గంగమ్మ గుడిపక్కనున్న మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోవడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం రేడియో పాఠం వినిపించేందుకుగానూ ఉపాధ్యాయులు మూడో తరగతి పిల్లలను గదుల్లోంచి బయటకు పిలిపించి ప్రహరీకి కాస్త దగ్గరలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఆ పాఠశాల పక్కన భవనం నిర్మిస్తున్న కాంట్రాక్టరు సుబ్బరాజు జేసీబీతో మట్టి తీయిస్తున్నారు. అయితే ఆ జేసీబీ పొరపాటున ప్రహరీకి తగలడంతో గోడ కూలిపోయింది. ఆ రాళ్లు పడి పాఠశాల లోపల గోడ పక్కన కూర్చుని ఉన్న లావణ్య, మణికంఠ, పవన్, విష్ణు గాయపడ్డారు. ఉపాధ్యాయులు వెంటనే స్థానికుల సహాయంతో వారిని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుసత్రికి తరలించారు. విష్ణు తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఈ దుర్ఘటనపై ఉపాధ్యాయురాలు సునందాబాయ్ అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పుట్టపర్తిలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం
-
షాంఘై రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి
సాక్షి, పుట్టపర్తి/అనంతపురం : బతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లిన జిల్లావాసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన చైనాలోని షాంఘైలో జరిగింది. వివరాలు.. కొత్తచెరువు మండలంలోని తిప్పబట్లపల్లికి చెందిన కోలాటి తిప్పన్న, వెంగమ్మ కుమారుడు కిశోర్ పొట్టకూటి కోసం కొంతకాలం క్రితం చైనా వలస వెళ్లాడు. అక్కడ షాంఘైలోని రెస్టారెంట్లో పనిచేస్తున్న కిశోర్ పనిముగించుకొని ఇంటికి చేరుతుండగా అతని వాహనం డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కిశోర్ ప్రాణాలు విడిచాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పల్లె రఘునాథరెడ్డికు స్వల్ప గాయాలు
-
టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, అనంతపురం: టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో ఏపీ మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నడుపుతున్న బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లె రఘునాథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. జిల్లాలోని నల్లమడ మండలం దొన్నికోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ ర్యాలీలోనూ అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోగా.. ఆయన తలకు స్పల్పగాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన సైకిల్ యాత్రను పూర్తిచేశారు. -
అనంతలో జేసీ దివాకర్ రెడ్డికి ఝలక్
-
బంగారు రథంపై సత్యసాయి
పుట్టపర్తి: సత్యసాయి జయంతి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన జోలోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి చిత్రపటాన్ని బంగారు రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యజుర్వేద మందిరం నుంచి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, ప్రసాదరావు, చక్రవర్తి, నాగానంద, మోహన్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణతో పాటు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ సభ్యులు రథాన్ని లాగుతూ సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం మహా సమాధి వద్ద వెండి ఊయలలో బాబా చిత్రపటాన్ని ఉంచి జోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపిస్తూ సత్యసాయిని స్తుతించారు. సంగీత విద్వాంసులు అభిషేక్, రఘురాముల సంగీత కచేరి ఆకట్టుకుంది. మహామంగళ హారతి అనంతరం భజనలు చేపట్టారు. -
వేడుకగా సత్యసాయి జయంతోత్సవాలు
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు శనివారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.45 గంటల సమయంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, ప్రసాదరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌పాండే, రాష్ట్ర అధ్యక్షుడు చలం తదితరులు ప్రశాంతి నిలయం ఉత్తర ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. దారి వెంట సాయి నామస్మరణతో పుట్టపర్తి హోరెత్తింది. అంతకు ముందు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అక్కడే సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్టించి ఊరేగించారు. కాగా, ప్రశాంతి నిలయం నార్త్ బ్లాక్ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 55 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం 25వ తేదీ వరకు కొనసాగుతుందని సత్యసాయి ఐడిల్ హెల్త్‌కేర్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 20, 21 తేదీల్లో అంతర్జాతీయ వేద సమావేశం దేశంలో తొలిసారిగా పుట్టపర్తిలో నిర్వహణ సాక్షి, అమరావతి: ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి వేదాల్లో సూచించిన పరిష్కారాలపై రెండు రోజుల అంతర్జాతీయ వేద సమావేశాలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదిక కానుంది. ఈనెల 20, 21 తేదీల్లో జరిగే ఈ అంతర్జాతీయ వేద సమావేశంలో వేద పండితులతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నట్లు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ (ఇండియా) అధ్యక్షుడు నిమీష్ పాండే తెలిపారు. సత్యసాయి బాబా 92వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వేదాలపై పరిశోధన చేసి వేద పండితులు ప్రస్తుత సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో చర్చించనున్నట్లు తెలిపారు. మంచి నీటి ఎద్దడి, వ్యవసాయం, వాతావరణం, ఆహార కొరత వంటి సమస్యలకు వేదాల్లో పరిష్కారాలపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. 1,500 మందికిపైగా సత్యసాయి శిష్యులతో పాటు 42 దేశాలకు చెందిన 600 మంది సామూహిక వేదపారాయణంలో పాల్గొననున్నారు. -
డెంగీ లక్షణాలతో యువకుడి మృతి
పుట్టపర్తి అర్బన్: డెంగీ లక్షణాలతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... రామగిరి మండల కేంద్రంలోని కొత్తగేరికి చెందిన లక్ష్మన్న కుమారుడు పవన్‌కుమార్ (29) కొంత కాలంగా పుట్టపర్తిలోని స్టేట్‌బ్యాంకు ఎదురుగా ఉన్న జియో సెల్‌షాపులో పని చేస్తున్నాడు. పవన్‌కుమార్ సమీపంలోని ఒ గదిలో అద్దెకుంటున్నాడు. గత సోమవారం తీవ్ర జ్వరం రావడంతో సత్యసాయి ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స పొందాడు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మెడికేర్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. -
ఉపాధ్యాయురాలి తోసివేత
బుక్కపట్నం (పుట్టపర్తి) : తోటి ఉపాధ్యాయురాలిని మరో ఉపాధ్యాయురాలు తోసివేసింది. కిందపడిన ఉపాధ్యాయురాలు అపస్మారకస్థితికి చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. బుక్కపట్నం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు ‘విద్యార్థుల చదువు, ఎదుగు’ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం ఉదయం ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్ వరలక్ష్మి ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. ఆమెను హెచ్ఎం రాధాశ్రీదేవి తన చాంబర్‌కు పిలిపించి వివరణ కోరారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన వైజయంతి అనే మరో టీచర్ ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నపళంగా వరలక్ష్మిని కిందకు తోసేశారు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కాసేపటి తర్వాత తేరుకున్న వరలక్ష్మి సెలవు పెట్టి ఇంటికెళ్లిపోయారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులు అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై హెచ్ఎం, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఈఓ లక్ష్మీనారాయణ డైట్ కళాశాల ప్రిన్సిపల్ జనార్ధన్‌రెడ్డిని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డైట్‌కళాశాల ప్రిన్సిపల్ పాఠశాలకెళ్లి హెచ్ఎం, టీచర్లను విచారణ చేసి డీఈఓకు నివేదించారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్‌నాయక్ పాల్గొన్నారు. -
ముంపుకు గురైతే నష్ట పరిహారం ఇస్తాం
పుట్టపర్తి అర్బన్ : హంద్రీనీవా నీళ్లతో గాని, వర్షపు నీళ్లతో గాని బుక్కపట్నం చెరువు నిండినప్పుడు భూములు ముంపు గురైతే తప్పకుండా నష్ట పరిహారం ఇప్పిస్తామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మంగళవారం పుట్టపర్తిలో హంద్రీనీవా కాలువ పనులను ఆయన పరిశీలించారు. పుట్టపర్తి సమీపంలో 9వ ప్యాకేజీలో పెండింగ్‌లో ఉన్న భూమిని చూశారు. అక్కడ సాగులో ఉన్న రైతులతో మాట్లాడి వెంటనే కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చూడాలని ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి సూచించారు. ఇక బుక్కపట్నం చెరువుకు నీళ్లు వస్తే పెద్ద కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు మంపుకు గురయ్యే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడకు వచ్చిన కమ్మవారిపల్లి రైతులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన సుమారు 90 ఎకరాలు మంపుకు గురవుతుందని కదిరి ఆర్డీఓ వెంకటేషు, తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతానికి హంద్రీనీవా నీళ్లు రాక పోవడంతో చెరువులో నీళ్లు సైతం ఎండిపోతాయని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో భూములు ముంపుకు గురికావని, వర్షాలు వచ్చే సూచన కూడా లేకపోవడంతో మీ భూములు క్షేమం కాబట్టి ప్రస్తుతం నష్ట పరిహారం ఇవ్వలేమన్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే పల్లె కల్పించుకొని ఎప్పటికైనా ముంపుకు గురవుతాయని, ఇప్పుడే నష్ట పరిహారం అంచనా వేసే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని కలెక్టర్‌కు చెప్పడంతో ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ రైతులకు చెప్పారు. అప్పటి వరకు రైతులంతా పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. -
మహాసమాధిని దర్శించుకున్న పూనం మాలకొండయ్య
పుట్టపర్తి టౌన్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. శనివారం ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గాన ప్రశాంతి నిలయం చేరుకున్న ఆమెకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ప్రసాద్‌రావు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి, తహసీల్దార్ సత్యనారాయణలు ఘనంగా స్వాగతం పలికారు. శాంతిభవన్ అథితి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆదివారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించి అక్కడి వైద్యసేవలను పరిశీలించనున్నారు. -
బీఈడీ కళాశాలలో వివాహిత ఆత్మహత్య
పుట్టపర్తి అర్బన్ : అమడగూరు మండలం కంచరవాండ్లపల్లికి చెందిన కిష్టప్ప భార్య జూటూరు కళావతి(26 పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లి సమీపంలోని విజ్ఙాన్ బీఈడీ కళాశాలలో శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధనుంజయ తెలిపారు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ బీఈడీ కళాశాలలో చేరి స్వీపర్లుగా పని చేసుకుంటూ జీవనం సాగించేవారన్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారన్నారు. అయితే కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న కళావతి జీవితంపై విరక్తితో ఫ్యాన్‌కు ఉరేసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టిందని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పుట్టపర్తికి చేరిన ఇండోర్ భక్తుడి పాదయాత్ర
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సేవలు, ఆధ్యాత్మిక బోధనల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సత్యసాయి భక్తుడు సతీష్ చేపట్టిన పాదయాత్ర బుధవారం పుట్టపర్తికి చేరుకుంది. 2016 అక్టోబర్ 20న ఇండోర్‌లో పాదయాత్ర ప్రారంభించిన ఆయన సత్యసాయి చిత్రపటాన్ని, ఆయన బోధించిన బోధనలతో కూడిన ప్ల కార్డులతో పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఆయనకు సత్యసాయి పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన సేవాస్పూర్తిని, ఆధ్యాత్మిక బోధనలతో అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్గ మధ్యలో ప్రజలకు సత్యసాయి చరిత్రను వివరించానన్నారు. గతంలో ఇండోర్ నుండి మహారాష్ట్రలోని షిర్డీకి, హిమాచల్‌ప్రదేశ్‌లోని వైష్టోదేవి ఆలయానికి పాదయాత్ర చేపట్టానన్నారు. -
‘జావా’తోవిద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
పుట్టపర్తి టౌన్ : జావా లాంగ్వేజ్‌పై పట్టు సాధిస్తే సాఫ్ట్వేర్ రంగంలో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చునని ఆస్ట్రియాకు చెందిన వియన్నా యూనివర్శిటీ ఐటీ విభాగం ఉపన్యాసకుడు పౌల్స్పెసిబర్గర్ అన్నారు.సంస్కృతీ విద్యాసంస్థలు, వియన్నా యూనివర్శిటీ అనుబంధంగా కళాశాల విద్యార్థులకు అందిస్తున్న నాలుగు సంవత్సరాల ఐటీ కోర్సులో ఉత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్థులకు పౌల్ స్పెసిబర్గర్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో జావా లాంగ్వేజ్‌లకు విపరీతమైన ఆదరణ ఉందన్నారు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్కృతీ విద్యాసంస్థలలో నాలుగు సంవత్సరాల ఐటీ కోర్సును విద్యార్థులకు అందజేస్తోందన్నారు. ఇందులో కంప్యూటర్ లాంగ్వేజస్‌కు ప్రాధాన్య ఇస్తున్నామన్నారు. ప్రతిభ కనబరచిన వారికి ఆస్ట్రియాకు చెందిన రైజ్ కంపెనీలో మంచి పారితోషికంతో ఉద్యోగం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
పుట్టపర్తిలో ఘనంగా YSRCP ప్లీనరీ సమావేశం
-
నా శాఖలను దానం చేశా: పల్లె
పుట్టపర్తి టౌన్: తాను మైనారిటీ శాఖను సీఎం చంద్రబాబుకు, ఐటీ శాఖను లోకేశ్‌కు, టూరిజం శాఖను అఖిల ప్రియకు, సమాచార శాఖను కాలవ శ్రీనివాసులుకు, ఎన్ఆర్ఐ శాఖను కొల్లు రవీంద్రకు దానం చేశానని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని పర్తిసాయి ధర్మశాలలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినాయకుడు చంద్రబాబు కోరిన వెంటనే తాను పదవికి రాజీనామా చేశానన్నారు. అనంతరం పుట్టపర్తి నగర పంచాయతీ టీడీపీ కన్వీనర్ పదవికి ఆశావహుల పేర్లను సేకరించారు. పార్టీ నిర్ణయం మేరకు కన్వీనర్ పేరును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు రమణారెడ్డి, చైర్మన్ పి.సి.గంగన్న, పుడా మాజీ చైర్మన్ కడియాల సుధాకర్, వైస్ చైర్మన్ కడియాల రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్య్వస్థీకరణలో రఘునాథరెడ్డి మంత్రి పదవిని కోల్పోయారు. తనను కేబినెట్ నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
సింహవాహనంపై చౌడేశ్వరీ అమ్మవారు
అమడగూరు (పుట్టపర్తి) : మండలంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంగరంగ వైభవంగా సింహవాహన ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమాన్ని ఎప్పటి లాగానే కొత్తపల్లికి చెందిన పొట్టా శివశంకర్‌రెడ్డి కుటుంబీకులు ఆర్భాటంగా నిర్వహించారు. శివశంకర్‌రెడ్డి రథసారథిగా చౌడేశ్వరమ్మను పూలపల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం నుంచి ఊరేగిస్తూ గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వద్దకు తీసుకెళ్లి భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. ధగ ధగ మెరిసే నగలతో, పట్టు వస్త్రాలతో అభయమిస్తున్నట్లు కనిపిస్తున్న చౌడేశ్వరిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్కల భజనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చలపతి బందోబస్తు నిర్వహించారు. మంగళవారం హంసవాహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పార్వతమ్మ, రాఘవరెడ్డి, అనూష, నిర్మలమ్మ, సుగుణమ్మ, అరుణమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
మరో ముగ్గురికి గాయాలు బుక్కపట్నం (అనంతపురం) : బుక్కపట్నం మండలం కొత్తకోటలో మంగళవారం పిడుగుపాటుకు ఓ యువకుడు దుర్మరణం చెందగా, అతడి తల్లితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... కొత్తకోట గ్రామానికి చెందిన చిత్ర కేశప్ప భార్య ఆదిలక్ష్మమ్మ, కుమారుడు జయచంద్ర గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి చింతచెట్టు కాయలు దులిపేందుకు సమీపంలోని కొండకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో చెట్టుపై పిడుగుపడింది. దీంతో చెట్టు కింద ఉన్న జయచంద్ర (21) అక్కడిక్కడే మృతి చెందగా, అతని తల్లి ఆదిలక్ష్మమ్మతో పాటు గ్రామానికి చెందిన నారాయణ, నరసమ్మలు గాయపడ్డారు. పిడుగుపడిన గంట తర్వాత సమీపంలోని గొర్రెల కాపర్లు వారిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ ఉషారాణి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆర్డీటీ బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడు జయచంద్ర బుక్కపట్నంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. -
పుట్టపర్తిలో నేడు సత్యసాయి గిరిప్రదక్షిణ
అనంతపురం: సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద సత్యసాయి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించనున్నారు. గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ఆర్వీజే పెట్రోల్ బంక్, చింతతోపులు మీదుగా పట్టణంలో ప్రవేశించి మంగళహారతితో ముగుస్తుంది. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
సాయి పథం.. సకల జనులకు పుణ్యపథం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి చూపిన మార్గం సర్వజనులకు పుణ్య పథమన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ విద్యార్థులు నిర్వహించిన ‘సత్యసాయి పథం’ నాటిక భక్తులను పరవశింపజేసింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన అదిలాబాద్ సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి తన భక్తులకు బోధించిన నవసూత్రాల సారాన్ని, అవి మానవాళిని సన్మార్గంలో నడిపేందుకు దోహదపడుతున్న తీరును వివరిస్తూ ‘సాయిపథం’ నాటిక సాగింది. చివరగా సత్యసాయి బోధించిన నవసూత్రాలను పాటించడం మూలంగానే తను సత్కర్మలు పొందానని, తద్వారా మానవులకు ముగ్గురు జ్ఞానులు చేసిన సేవలను తానొక్కడే చేయగలిగానని తెలియజెప్పే ఘట్టంతో ముగిసింది. -
బాబా మహాసమాధిని దర్శించనున్న గవర్నర్
పుట్టపర్తి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం మధ్యాహ్నాం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన 12.20 గంటలకు గవర్నరు పుట్టపర్తికి చేరుకుంటారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని శాంతిభవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇక్కడి నుం చి రోడ్డుమార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళతారని అధికారులు తెలిపారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి మిరుపురి సంగీత కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత సంగమం పేరుతో కచేరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భక్తిగీతాలను చక్కటి స్వరాలతో ఆలపించారు. విద్యార్థుల కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరంలో ఆశీనులైన భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లారు. -
పరవశభరితం చిన్నారుల సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చిన్నారులు ఆలపించిన గీతాలు భక్తులను పరవశింపజేశాయి. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వివిధ దేశాలకు చెందిన చిన్నారులు క్రిస్మస్ గీతాలు ఆలపించారు. తొలుత బాలయేసును సత్యసాయి మహాసమాధి చెంతకు తీసుకువచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచి మహాసమాధి చెంత ప్రణమిల్లి వరణువేడారు. ఈసందర్భంగా ఏసుక్రీస్తు జీవితచరిత్ర అంశాలను, బో«ధనలను వివరిస్తూ చక్కటి గీతాలను ఆలపించారు.చిన్నారుల చక్కటి స్వరాలతో నిర్వహించిన ఆలాపనతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరంవిద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
బయటపడ్డ టీడీపీ నేతల భూబాగోతం
-
కాలువలు పూర్తికాకనే నీరెలా ఇస్తారు?
వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నల్లమాడ: ‘పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువుకు నీరు విడుదల చేయాలంటే మూడు రైల్వే క్రాసింగ్‌ల్లో బ్రిడ్జిలు నిర్మించి కాలువ తవ్వాల్సి ఉంది. బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతి తీసుకోలేదు. చెరువు ముంగిట ఉన్న పెద్దకమ్మవారిపల్లి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి కాకుండానే నీటి విడుదల ఎలా సాధ్యమని’ వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెరువుల్లో పూడిక తీస్తేనే నీటి సామర్థ్యం పెరుగుతుందన్నారు. పిల్లకాల్వలు తవ్వకుండా నీరు విడుదల చేసినా రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. రూ.100 కోట్ల తెల్లధనం, భారీగా బంగారు నిల్వలతో పట్టుబడిన శేఖర్‌రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా చంద్రబాబు నియమించారంటే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో విచారణాధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖ రాయడం ద్వారా పెద్ద నోట్ల రద్దుకు చంద్రబాబు కారణమయ్యారని, ఫలితంగా సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో రోజుకో డిజైన్ మారుస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
కరణం రామకృష్ణ ఆచూకీ లభ్యం
పుట్టపర్తి టౌన్ : కొంత కాలంగా పుట్టపర్తిలో వివాదాస్పదంగా తయారైన కరణం రాజగోపాలరావు కుమారుడు కరణం రామకృష్ణ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఇటీవల పట్టణ పరిధిలో ఆయనకు చెందిన రూ.కోట్లాది విలువైన ఆస్తులపై కన్నేసిన స్థానిక టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చరచ్చ చేశారు. ఈ వ్యవహారం వివాదాలకు, ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ విషయం తెరపైకి వచ్చింది. కానీ ఆయన ఎక్కడున్నారో తెలియలేదు. ఎట్టకేలకు బెంగళూరులో తన కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలుసుకున్నారు. స్థానికుల కథనం మేరకు... దాదాపు 30 సంవత్సరాల క్రితం రామకృష్ణ పుట్టపర్తిని వదిలి వెళ్లిపోయారు. 2000 సంవత్సరంలో ఆయన తండ్రి గోపాలరావు హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా ఆయన రాలేదు. తర్వాత గోపాలరావు ఆస్తిని వారసులు లోక్‌అదాలత్ ద్వారా పంచుకున్నారు. రామకృష్ణ వాటాగా వచ్చిన 18 ఎకరాలను అలాగే ఉంచారు. అయినప్పటికీ ఆయన పుట్టపర్తికి రాలేదు. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే ఆ ఆస్తిని కుటుంబ సభ్యులతోపాటు, పలువురు స్థానికులు కూడా ఇష్టారాజ్యంగా అమ్మేసి అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు కూడా చేయించేశారు. ఇటీవల ఆ డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో కొనుగోలు చేసిన ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీనికితోడు పుట్టపర్తిలోని రామకృష్ణ కుటుంబ సభ్యులు కొందరు ఆయన ఆచూకీ, ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని, విచారించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల పాటు పట్టణంలో దీక్షలు సైతం చేపట్టారు. రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును, ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు ఆస్తుల వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసి రామకృష్ణ ఆచూకీ కోసం విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ అత్తను విచారించి ఆయన భార్య కృష్ణకుమారి, కుమారుల అచూకీ కనుగొన్నారు. కృష్ణకుమారి గుంతకల్లులోని రైల్వే క్వార్టర్స్‌లో నివశిస్తున్నట్లు తెలుసుకుని ఆమెను విచారించారు. కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలతో మానసికంగా కృంగిపోయిన రామకృష్ణ కొంతకాలంగా బెంగళూరులో సాఫ్్టవేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఆయనను పుట్టపర్తికి రప్పించేందుకు సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తన బృందంతో మంగళవారం బెంగళూరు వెళ్తున్నారు. కొసమెరుపు : ఈ ఏడాది నవంబర్‌లో రామకృష్ణ భార్య, కుమారుడు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి పుట్టపర్తిలో విలువైన తమ ఆస్తులను కొందరు అన్యాక్రాంతం చేస్తున్నారని, రామకృష్ణ చనిపోయాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే సత్యసాయి జయంతి వేడుకలలో బిజీగా ఉన్న అధికారులు ఆ ఫిర్యాదుపై దృష్టి సారించలేకపోయినట్లు సమాచారం. -
పుట్టపర్తిలో పెళ్లి సందడి
పుట్టపర్తి అర్బన్ : లండన్‌కు చెందిన సత్యసాయి భక్తులు అనిల్ పటేల్ దంపతుల సహకారంతో పుట్టపర్తికి చెందిన చల్లా సోదరులు సాయిక్రిష్ణ, భీమరాజు, విజయసాయిల ఆధ్వర్యంలో గురువారం పర్తి సాయి ధర్మశాలలో సామూహిక ఉచిత వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 72 జంటలు పెళ్లి పీటలపై కూర్చున్నాయి. తొలుత బంగారు తాళిబొట్టు, గిన్నె బొట్టు, వెండి మెట్టెలు, పట్టు వస్త్రాలను అందజేశారు. బంధు, మిత్రుల సమక్షంలో పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య వధువుల మెడలో తాళి కట్టారు. ముఖ్య అతిథులుగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్ రాజు, డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి, పుడా చైర్మన్ సుధాకర్, నగరపంచాయతీ చైర్మన్ పీసీ గంగన్న, ప్రశాంతి గ్యాస్ సూర్యనారాయణ, అహ్మద్, మంగళకర ఏఓ ప్రకాష్, వైస్ చైర్మెన్ రాము తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనిల్ పటేల్ మిత్ర బృందం కూడా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులకు సామగ్రిని అందజేశారు. -
సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న శివరాజ్‌పాటిల్
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి మహాసమాధిని కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్‌పాటిల్ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి ఆయన బెంగళూరు నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకొన్నారు. గురువారం ఉదయం సత్యసాయి మహాసమాధిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాంతిభవన్ అతిథి గృహంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్యసాయి చిత్రపటాన్ని అందజేశారు. అనతరం శివరాజ్‌పాటిల్ 9 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. -
ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరిప్రదక్షిణను చేపట్టారు. ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద సత్యసాయి చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలాపనతో గిరిప్రదక్షిణలో భక్తులు ముందుకు సాగారు.గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ఆర్వీజే పెట్రోల్ బంక్, చింతతోపుల మీదుగా పట్టణంలో ప్రవేశించి తిరిగి ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద మంగళహారతితో కార్యక్రమం ముగిసింది. పుట్టపర్తి పరిసర ప్రాంతాలతోపాటు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణలో పాల్గొని తరించారు. -
ఘనంగా అయ్యప్ప గ్రామోత్సవం
పుట్టపర్తి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో శ్రీమణికంఠ సేవాసమితి ఆధ్వర్యంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి వేలాదిమంది అయ్యప్ప మాలధారులు నారాయణ సేవలో పాల్గొన్నారు. అయ్యప్ప కన్నెస్వాములు అయ్యప్ప విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు 2,000 మంది అయ్యప్పలు, గ్రామస్తులు హాజరయ్యారు. సాయంత్రం పట్టణ వీధుల్లో అయ్యప్ప, సత్యసాయి చిత్రపటాలను ప్రత్యేక అలంకరణతో పలకీని తయారు చేసి ఊరేగించారు. మాలధారులు అయ్యప్ప భక్తి పాటలు పాడుతూ ముందుకు సాగారు. నారాయణసేవను నగర పంచాయతీ అద్యక్షుడు పీసీ గంగన్న ప్రారంభించారు. కార్యక్రమాన్ని యర్రంశెట్టి సూర్యనారాయణ దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప గ్రామోత్సవం సందర్భంగా పట్టణం సందడిగా మారింది. -
ధర్మపరిరక్షణార్థమే సత్యసాయి అవతరణ
సత్యసాయి బోధనల ఆంగ్ల అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ పుట్టపర్తి టౌన్ : మానవతా విలువలు అంతరించిపోతున్న తరుణంతో ధర్మపరిరక్షణార్థం సత్యసాయి భూమిపై అవతరించారని సత్యసాయి అంగ్ల బోధనల అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ అన్నారు. సత్యసాయి 91వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సోమవారం ఉదయం ఆయన ప్రసంగించారు. సత్యం, ధర్మ, శాంతి, ప్రేమ మానవ జీవింతలో మూలస్తంభాలని, వాటిని సత్యసాయి బోధించి, ఆచరించి చూపారన్నారు. ప్రతి ఒక్కరూ సత్యసాయి బోధనల అనుసారం సన్మార్గంలో నడవాలని కోరారు. సత్యసాయి మొబైల్ వైద్యసేవల వాహనాలు ప్రారంభం సత్యసాయి సంచార వైద్య సేవల్లో భాగంగా హైదరాబాద్, విజయనగరం జిల్లాలో గ్రామీణ రోగులకు సేవలందించేందుకు రెండు నూతన మొబైల్ వైద్య వాహనాలను సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సోమవారం ప్రారంభించారు. సత్యసాయి జయంతిలో భాగంగా సోమవారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహనాలను ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, నాగానంద, ఏపీ మిశ్రా, టీకేకే భగవత్, కార్యదర్శి ప్రసాద్‌రావు, సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య, ప్రశాంతి కౌన్సిల్ చైర్మ¯ŒS డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, మాజీ డీజీపీ హెచ్‌జే దొర పాల్గొన్నారు. -
అంబరమంటిన దీపావళి సంబరం
ప్రశాంతి నిలయంలో దీపావళి పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలాగే గుజరాతీయుల నూతన సంవత్సర వేడుకలు సైతం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత వేద మంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం గుజరాత్ భక్తులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన సత్యసాయి యూత్ సభ్యులు మహాసమాధి చెంత ‘జర్నీ ఆఫ్ రిథమ్’అన్న పేరుతో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. అలాగే గుజరాత్‌లోని నవసారికి చెందిన బాలవికాస్ విద్యార్థులు శ్రీరాముడిని కొనియాడుతూ భక్తిగీతాలతో నృత్యప్రదర్శన నిర్వహించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
అమ్మను మరిపించిన సత్యసాయి
వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ పుట్టపర్తి టౌన్: ఆదిపరాశక్తి అమ్మను మరిపిస్తూ లోకకల్యాణార్థం అవతరించిన సర్వాంతర్యామి సత్యసాయి అని వేదాంతి మల్లా ప్రగడ∙శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానవాళి సర్వతోముఖాభివృద్ది కోసం సత్యసాయి తన లీలావైభవాన్ని కొనసాగించారన్నారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమను బోధిస్తూ పరిమిత రూపంలో జన్మించిన సత్యసాయి కాలంంతోపాటు అపరిమిత రూపంగా మానవాళిని సన్మార్గం వైపు నడిపే ఆదిపరాశక్గిగా విరాజిల్లారన్నారు. అనంతరం భక్తులు సత్యసాయి భక్తులు మహాసమాధిని దర్శించుకున్నారు. నేడు విజయదశమి వేడుకలు ప్రశాంతి నిలయంలో మంగళవారం విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రశాంతి నిలయంలో చేరుకున్నారు. దసరా వేడుకల్లో భాగంగా విశ్వశాంతి కోసం ఏడు రోజులుగా ప్రశాంతి నిలయంలో బ్రహ్మశ్రీ కొండావధాని నేతృత్యంలో పుర్ణచంద్ర ఆడిటోరియంలో జరుగుతున్న వేదపురుష సప్తాహ యజ్ఞం పూర్ణాహుతితో మంగళవారం ముగియనుంది. అనంతరం భక్తులు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.అలాగే తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న సత్యసాయి గ్రామ సేవ కార్యక్రమం సైతం ముగియనుంది. మంగళవారం ప్రశాంతి నిలయంలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
హత్యకేసులో వాచ్‌మన్‌కు యావజ్జీవం
హిందూపురం అర్బన్: పుట్టపర్తిలో సత్యసాయి సేవ కోసం వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన టోనీబెర్లి (75)ని హత్య చేసి, తన పొలంలోనే పాతిపెట్టిన సాయిగౌరి అపార్ట్మెంట్ వాచ్‌మన్ భగవంతుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సోమవారం హిందూపురం జిల్లా అదనపు జడ్జి రాములు తీర్పు చెప్పారు. ఈ కేసును పబ్లిక్‌ప్రాసిక్యూటర్ రాజశేఖర్ వాదించగా జడ్జి పలువురు సాక్షులను విచారణ చేసి వాచ్‌మెన్‌కు యావజ్జీవంతోపాటు రూ.10వేల జరిమానా విధించారు. సాక్షులను తారుమారు చేసిన కేసులో 203 సెక్షన్ కింద మరో 2సంవత్సరాలు జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్ తెలిపారు. -
సీఎం హామీలు నీటి మీద రాతలే
డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ పుట్టపర్తి టౌన్ : సీఎం చంద్రబాబు పుట్టపర్తి పర్యటనకు వచ్చినపుడు మరో వాటికన్ సిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారని,అయితే పుట్టపర్తిలో మాత్రం ప్రభుత్వ సంస్థలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ విమర్శించారు. పట్టణంలో సాయిఆరామం టూరిజం హోటల్‌కు అనుబంధంగా కొనసాగుతున్న లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని త్వరలోనే మూసివేయాలని నిర్ణయించడంతో సోమవారం ఆయన ఆ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, పర్యాటక మంత్రి గీతారెడ్డి తదితరులు సత్యసాయిపై గౌరవంతో ఇక్కడ టూరిజం హోటల్, లేపాక్షి హస్తకళల భవన సముదాయాన్ని చేపట్టారన్నారు. సత్యసాయిచే ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దడానికి బదులు ఉన్న వాటిని తరలించడానికి పూనుకుంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా పుట్టపర్తిలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి నిదర్శనమన్నారు. లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని ప్రభుత్వం తరలించే కుట్రలు చేస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. -
పుట్టపర్తిలో టీడీపీ నేత దౌర్జన్యం
అనంతపురం : రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పుట్టపర్తిలో టీడీపీ నేత కోళ్ల రమణ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నారాయణరెడ్డిపై కోళ్ల రమణ మంగళవారం దాడి చేశాడు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేత దాడి చేసి నారాయణరెడ్డిని గాయపర్చాడు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రేక్షకపాత్ర వహించారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు
పుట్టపర్తి అర్బన్: ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ హెచ్ఓడీలు అనిల్ కె.గుప్తా, కన్నన్ పేర్కొన్నారు. పుట్టపర్తికి మంగళవారం విచ్చేసిన వారు ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావును కలిశారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై వారు చర్చించారు. అనంతరం సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం, శిల్పారామంను సందర్శిం చారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల ప్యాకేజీని అందించే అవకాశం ఉందన్నారు. ఇందులో రాయల సీమ టూరిజం స ర్యూట్కు రూ.100 కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నా రు. అనంతరం వా రు సత్యసాయి మ హా సమాధిని ద ర్శించుకున్నారు. కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ శ్రీధర్, డివిజనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శనరావు, డీఈ ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
భద్రతా వలయంలో పుట్టపర్తి
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళ, బుధ వారాల్లో పుట్టపర్తిలో యూత్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఉత్సవానికి 69 దేశాల నుంచి 3000మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అనంతపురం జిల్లాలో టైస్టు కదలికల నేపధ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారు. పుట్టపర్తిలో అణువణువూ గాలిస్తున్నారు. ఉత్సవానికి వచ్చేవారి కదలికలపై నిఘా పెట్టారు. -
విద్యాజ్యోతి పథకాన్ని ప్రారంభించిన వెంకయ్య
అనంతపురం : అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమైనాయి. ఈ ఆరాధనోత్సవాల్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యాజ్యోతి పథకాన్ని ప్రారంభించారు.అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... సత్యసాయిబాబా సేవలు అభినందనీయమన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ఈ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు గర్వకారణమని వెంకయ్య పేర్కొన్నారు. -
జపనీస్ పిల్ల.. అగ్గిపుల్ల.. సిగరెట్ మళ్లా
వేలమైళ్లు ప్రయాణించి తెలుగు నేలపై అడుగుపెట్టింది. ఆమెను గిరీశం ఆవహించాడు. పైగా మరుజన్మలో దున్నపోతై పుట్టడం ఇష్టంలేదామెకు. అందుకే పెదవులమధ్య సిగరెట్ ను బంధించి.. చాకచక్యంగా అగ్గిపుల్లతో వెలిగించుకుని.. గుండెల నిండా(నిజానికి కడుపు నిండా అనాలేమో!) పొగపీల్చి, గుప్పున వదిలింది. అలా ఓ ఐదారు దమ్ములు. అంతే, గిరీశం ఆమెను వదిలిపెట్టి వెళ్లాడు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని సత్యసాయి ఆలయానికి వచ్చిన జపనీస్ మహిళా భక్తురాలు అకానే ష్నోమియా.. మార్గం మధ్యలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద బహిరంగంగా ధూమపానం చేస్తూ కంటపడింది. బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి, మహిళా స్మోకర్లు మన దేశంలో చాలా తక్కువ కాబట్టి, ఆమె వచ్చిందొక ఆథ్యాత్మిక క్షేత్రానికి కాబట్టి.. అకానే చర్య వార్త అయింది. -
సాయి స్మరణం
-
అప్పులబాధతో దంపతుల ఆత్మహత్య
పుట్టపర్తి రూరల్ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా పుట్టపర్తి రూరల్ మండలం కప్పలబండలో ఆదివారం ఉదయం అప్పులబాధతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శివశంకర్(40, నాగలీల(35) దంపతులు గొర్రెలను మేపుకుని జీవనం సాగించేవారు. అప్పులబాధతో దంపతులు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం విగతజీవులై పడి ఉన్న వీరిని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గన్నేరుపప్పు తిని ఆత్మహత్య
పుట్టపర్తి అర్బన్ (అనంతపురం) : కుటుంబ కలహాలతో ఓ వివాహిత గన్నేరుపప్పు తిని ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పుట్టపర్తి మండలం నిజమామిడి గ్రామానికి చెందిన తులసి(35) మంగళవారం మధ్యాహ్నం గన్నేరు పప్పు తినగా, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సాయంత్రం మృతి చెందింది. తులసి భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో ఇంట్లో గొడవలు జరిగినట్టు తెలిసింది. -
చిన్నారిపై మృగాడి పైశాచికత్వం
-
ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి
పుట్టపర్తి(అనంతపురం): అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రశాంతి నిలయంలో శుక్రవారం ఉదయం ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల గురు వందనంతో వేడుకలు మొదలయ్యాయి. దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. ఈ వేడుకలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, మాజీ మంత్రి గీతారెడ్డి హాజరయ్యారు. -
అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి
అనంతపురం : పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. కాగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. బెళుగప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద పంపింగ్ హౌస్, అక్విడెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల పనుల తీరుపై నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తారు. -
అంధకారంలో పుట్టపర్తి
పుట్టపర్తి (అనంతపురం జిల్లా) : ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ను నిలిపివేయడంతో పుట్టపర్తి అంధకారంలో మగ్గుతోంది. వివరాల ప్రకారం..గత కొన్ని నెలలుగా పుట్టపర్తి నగర పంచాయతీ విద్యుత్ బకాయిలను చెల్లించడంలేదు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు నగర పంచాయతీకి నోటీసులు జారీ చేశారు. అయినా సరే నగర పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదు. రూ.1.14 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేశారు. దీంతో గురువారం రాత్రి ట్రాన్స్‌కో అధికారులు నగరపంచాయతీ కార్యాలయానికి, వీధి దీపాలకు విద్యుత్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం పుట్టపర్తి నగర పంచాయతీ అంధకారంలో ఉంది. బిల్లులు చెల్లించకపోవడం, నోటీసులను బేఖాతరు చేయడంతోనే విద్యుత్‌ను నిలిపివేసినట్లు ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. -
పుట్టపర్తిలో ఘరానామోసం
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో ఓ ఘరానామోసం గురువారం వెలుగుచూసింది. ఆస్ట్రేలియాకు చెందిన గాయాస్టార్ స్థాపించిన సాయిప్రశాంతి ట్రస్ట్ ఆక్రమణకు గురైనట్టు తెలిసింది. సాయిప్రశాంతి ట్రస్ట్‌కు చెందిన ఆస్తులను శ్రీనివాస్ అనే వ్యక్తి ఆక్రమించినట్టు తెలుస్తోంది. అతనికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత గంగన్నలు ఉన్నట్టు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపధ్యంలో ట్రస్ట్ ఆక్రమణ విషయమై పీఎమ్ఓకు, అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దాంతో శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు బుక్కపట్నం పోలీసులు తెలిపారు. -
పుట్టపర్తిని సందర్శించిన గవర్నర్
అనంతపురం: గవర్నర్ నరసింహన్ పుట్టపర్తిని సందర్శించారు. అనంతరం ఆయన సత్యసాయిబాబా మహాసమాధికి నివాళులర్పించారు. ఈ రోజు రాత్రి ఆయన పుట్టపర్తిలోనే బసచేయనున్నారు. -
పుట్టపర్తిలో విదేశీయుడి ఆత్మహత్య
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం రాత్రి ఓ విదేశీయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. డీఎస్పీ శ్రీనివాసులు కథనం మేరకు.. రష్యాలోని పీటర్స్బర్గ్కు చెందిన కుచ్మిస్త్రీ వ్లాదిమిర్ (36) తల్లి కెలోడినా గత ఏడాది పుట్టపర్తిని సందర్శించి చిత్రావతి గుట్టమీద ఉన్న ప్రశాంతి హిల్‌వీవ్ అపార్ట్మెంట్లోని 803 (8వ ఫ్లోర్) నంబర్ గదిని లీజుకు తీసుకుంది. 4 నెల ల క్రితం ఆమె స్వదేశానికి వెళ్లిపోయింది. ఈ ఏడాది అక్టోబర్ 28న వ్లాదిమిర్‌కు భారత ప్రభుత్వం వీసా మంజూరు చేయడంతో నవంబర్ 26న ఆయన పుట్టపర్తికి వచ్చి తల్లి గదిలోనే ఉండేవాడు. శుక్రవారం రాత్రి తన గదిలోని కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. -
ప్రేమస్వరూపుడు పుడమిపై పుట్టిన వేళ...
రత్నాకరం సత్యనారాయణ రాజు... ఈ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు కానీ, భగవాన్ సత్యసాయిబాబా అని చెబితే మాత్రం ప్రతిఒక్కరికీ తెలుసు. 1923, నవంబర్ 23న అనంతపురం జిల్లా గొల్లపల్లి గ్రామంలో (నేటి పుట్టపర్తి) ఈశ్వరాంబ, పెదవెంకమరాజు దంపతులకు జన్మించిన సత్యనారాయణరాజు భగవాన్ సత్యసాయిబాబాగా మానవతా విలువలతో కూడిన విద్యనందించిన విద్యాదాతగా... ప్రేమ, కరుణ, దయ, మానవత్వంతో కూడిన వైద్యం అందించిన ఆరోగ్య ప్రదాతగా... అధ్యాత్మ విద్యను సర్వమానవాళికి బోధించిన జ్ఞానదాతగా... నమ్మిన వారికి స్వామిగా... సాయి భగవానుడిగా... అఖండమైన కీర్తిని గడించారు. కోట్లాది మంది భక్తుల హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అజరామరమైన బోధనలతో, అనితర సాధ్యమైన సేవానిరతితో బాబా కీర్తిప్రతిష్ఠలు జిల్లాలు, రాష్ట్రాలే కాదు... ఖండాంతరాలు దాటి, విశ్వవ్యాప్తమయ్యాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే సనాతనధర్మాలను బోధిస్తూ, ఆచరిస్తూ, అనతికాలంలోనే పుట్టపర్తిని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. తోటివారికి సాయపడటంలోనే భగవంతుడున్నాడని బోధించిన సాయి, అదే విధానాన్ని తాను అక్షరాలా ఆచరించి, అతి సామాన్యుని నుంచి అసామాన్యుడి దాకా, చిరుద్యోగి నుంచి, సీఎం వరకు, ప్రభుత్వోద్యోగి నుంచి ప్రధాన మంత్రి వరకు, దరిద్ర నారాయణుని నుంచి దేశాధ్యక్షుని వరకు, కార్మికుని నుంచి, క్రీడాకారుల వరకు... కొన్ని కోట్ల గుండెల్లో కొలువుదీరారు. నేడు ఆయన మన మధ్య లేకున్నా, ఆయన అందించిన మకరంద బిందువులు కొన్ని... కులం, మతం, జాతి, ప్రదేశం, దేశం... ఇవన్నీ మనం గీసుకున్న పరిధులు. వీటన్నింటి మధ్య సమన్వయం ప్రధానం. సంఘర్షణకు తావులేని రీతిలో మన ఆలోచనలు సాగాలి. నేను ఆత్మనని తెలుసుకోవటమే సత్యం, పవిత్ర జీవనమే శివం, ఆదర్శజీవితమే సుందరం. ఆత్మ నిగ్రహం అన్నింటికన్నా ముఖ్యం: రాముడు 34 విద్యలలో ఆరితేరితే రావణుడు 64 విద్యలు అభ్యసించాడు. రామునికంటె అధికంగా చదువుకున్నప్పటికీ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం మూలంగా రావణుడు రాక్షసుడయ్యాడు. ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉన్న రాముడు దేవుడయ్యాడు. నమ్మిన దైవం యెడల దృఢవిశ్వాసం, దృఢమైన బలం కలిగి ఉండాలి. నిర్మలత్వం ఇందుకు తోడుగా ఉండాలి. ఆధ్యాత్మికతనే అంటిపెట్టుకోవాలి: ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను వదలనిది, నీ దగ్గరనుంచి కదలనిది, నిన్ను అన్ని విధాల సన్మార్గంలో పెట్టేది ఆధ్యాత్మిక ధనమొకటే. దైవం కోసం పరితపించాలి: లౌకిక విషయాలను కాకుండా దైవాన్ని మాత్రమే కోరుకున్నప్పుడు విజయం వరిస్తుంది. మాలిన్యాన్ని వదిలించుకోవాలి: తుప్పు పట్టిన ఇనుమును అయస్కాంతం ఆకర్షించనట్లే మనసులో మాలిన్యం ఉన్న వానికి భగవంతునిపై ఆసక్తి ఉండదు. మంచిని మాత్రమే వెదకాలి: ఇతరుల తప్పులను వెదకడం గొప్ప కాదు, వారిలోని మంచిని గుర్తించి, ప్రేమించాలి. సమర్థించుకోవడం కాదు... సమర్థతను పెంచుకోవాలి: మనలో దోషముంచుకుని, దానిని కప్పిపుచ్చుకునేందుకు దారులు వెదకటం తప్పు, సమర్థతను పెంచుకోవాలి ఆయన బోధనల ప్రకారం ఆకలిగొన్న వారికి అన్నం పెట్టటం, ఆపదలో ఉన్న వారికి ఆసరా ఇవ్వటం, కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవటం, సేవ చేసేందుకు మార్గాన్ని వెతుక్కుని, సేవతోనే జీవితాన్ని లీనం చేయడమే భక్తులు ఆయనకు సమర్పించే పుట్టిన రోజు కానుక. - డి.వి.ఆర్. సేవార్తుడు తాగేందుకు గుక్కెడు నీరు లేక దప్పికతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు కొన్ని వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి, 1700 గ్రామాలకు తాగునీరందించిన అపర భగీరథుడు సత్యసాయి. ఈ వితరణను తన జిల్లాకే పరిమితం కాకుండా కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, ఉభయ గోదావరితో సహా మరికొన్ని జిల్లాల ప్రజలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా దాహం తీర్చిన సేవార్తుడు. ఈ సేవామూర్తిని, ప్రేమస్వరూపుని సందర్శించటానికి దాదాపు 180 దేశాలనుంచి భక్తులు పుట్టపర్తికి వచ్చేవారు. సాయి కుల్వంత్ హాలులో ఎత్తై ఆసనంపై నుంచి తనను సందర్శించటానికి వచ్చిన వేలాది భక్తులకు ఆశీస్సులందించిన సత్య సాయి నేడు మన మధ్య లేరు. అయితేనేం... ఆయనను నమ్మిన వారికి ఆయన మహాసమాధే అనంతమైన ఓదార్పుగా... కొండంత అండగా నిలుస్తోంది. -
దేవునిపై విశ్వాసంతో కృషి చేయాలి
పుట్టపర్తి: ప్రతి మనిషి దేవునిపై విశ్వాసం ఉంచి లక్ష్య సాధనకు పాటుపడితే విజయం తప్పక వరిస్తుందని ముంబయి విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ స్నేహలత దేశ్‌ముఖ్ అన్నారు. సత్యసాయి 89వ జయంత్యుత్సవాలలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 19వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దేశ్‌ముఖ్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత, ఆధ్యాత్మిక చింతన, మానవతా విలువలను ఆచరిస్తూ జీవనయానాన్ని సన్మార్గంలో సాగించాలన్నారు. మహిళా లోకానికి సత్యసాయి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యురాలు మాధురీ నాగానంద్ మాట్లాడుతూ ప్రతి తల్లి.. తన బిడ్డను సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాలని, అప్పుడే ఉత్తమ సమాజ స్థాపన సాధ్యమని అన్నారు. అనంతపురం మహిళా కళాశాల క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ మధు కపాణి మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని భావించిన సత్యసాయి మహిళా విద్యను ప్రోత్సహించారని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థుల సంగీత కచేరి ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యురాలు మల్లికా శ్రీనివాసన్, దేశ విదేశాలకు చెందిన సత్యసాయి సేవా సంస్థల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇకపై యజుర్వేద మందిరాన్ని సందర్శించ వచ్చు
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నివాసమైన యజుర్వేద మందిరాన్ని ఇకపై ప్రజలు సందర్శించ వచ్చని సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ రాజు వెల్లడించారు. 2015 ఏప్రిల్ 23 నుంచి ఈ మందిరాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతి ఇస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మంగళవారం పుట్టపర్తిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 118 గ్రామాలకు తాగునీటి పథకం పూర్తి చేశామని తెలిపారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామని రత్నాకర్ రాజు వెల్లడించారు. -
రూపాయి కూడా కట్టం
* అప్పుడు కట్టొద్దని ఇప్పుడెలా అడుగుతారు? * డ్వాక్రా మహిళల మండిపాటు.. రాస్తారోకో పుట్టపర్తి: ‘ఎన్నికలప్పుడు మా గ్రామానికి వచ్చిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. డ్వాక్రా మహిళలెవరూ రుణాలు కట్టొద్దని చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమే.. రుణాలన్నీ మాఫీ చేస్తామని మారెమ్మ దేవత సాక్షిగా హామీ ఇచ్చారు. ఇపుడు అధికారులు వడ్డీతో సహా రుణాలు చెల్లించాలంటున్నారు. వడ్డీతో కట్టమంటే పైసా కూడా చెల్లించం. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్దతండాకు చెందిన డ్వాక్రా మహిళలు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు స్థానిక ధర్మవరం-బెంగళూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముందుగా స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లారు. తండాలో అన్ని సంఘాలకు కలిపి రూ. 4 లక్షలకు పైగా రుణాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ పోను మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు. అయితే.. రూ.3 లక్షలకు అసలు, వడ్డీ కలిపి సుమారు రూ. 3.5 లక్షలు చెల్లించాలని వెలుగు అధికారులు సూచించారు. దీనికి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చేతగానితనం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని వాపోయారు. అక్కడే రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వెలుగు నిడిమామిడి క్లష్టర్ సీసీ సుధాకర్ రాగానే.. ఆయన్ను పక్కనే ఉన్న మారెమ్మ ఆలయం వద్ద నిర్బంధించారు. ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ ఇళ్లకు వెళ్లిపోయారు. -
పుట్టపర్తిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 వేల రూపాయల విలువైన నోట్లు, 2 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. -
డబ్బు కోసమే ఆస్ట్రేలియా మహిళ హత్య
అనంతపురం: పుట్టపర్తిలో దారుణ హత్యకు గురైన ఆస్ట్రేలియా మహిళ టోనీ బేయిర్ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. శనివారం అనంతపురంలో జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బేయిర్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం అనంతపురంలో వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే వారు ఆమెను హత్య చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుట్టపర్తిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే పట్టణంలోని అన్ని అపార్ట్మెంట్లు, దుకాణాలలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పుట్టపర్తి వాసులకు సూచించారు. పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు అన్ని విధాల భద్రత కల్పిస్తామన్నారు. అందుకోసం అవసరమైతే సత్యసాయి ట్రస్ట్ సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఎక్కడ బస చేస్తున్నారో ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్బంగా విదేశీయులకు ఎస్పీ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు. -
పుట్టపర్తిలో విదేశి మహిళ అదృశ్యం
-
పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యం!
అనంతపురం : అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియకు చెందిన టోని అన్నేగేట్ గత కొంతకాలంగా పుట్టపర్తిలోని సాయి అపార్ట్మెంట్లో నివాసముంటుంది. అయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి టోనీ కనిపించకుండా పోవడంతో ఆమె స్నేహితురాలు గ్రైట్ డీ సుట్టర్ 20 రోజుల క్రితం పుట్టపర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బెంగళూరు, కేరళలోని పర్యాటక ప్రాంతాల్లో టోనీ ఆచూకీ కోసం గాలించారు. అలాగే పుట్టపర్తి వివేకానందనగర్‌లోని సాయిగౌరీ అపార్టుమెంట్‌లోని టోనీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె నివాసం ఉంటున్న సాయిగౌరీ అపార్టుమెంట్ వాచ్మెన్... టోనీని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాచ్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా టోనీ హత్య విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. త్వరలోనే టోనీ అదృశ్యానికి సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
‘నోటీసులిచ్చినా రుణాలు చెల్లించొద్దు’
పుట్టపర్తి: వ్యవసాయ, డ్వాక్రా రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చినా ఎవ్వరూ చెల్లించవద్దని రైతులు, మహిళలకు రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు, డ్వాక్రా రుణాలను ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుందని చెప్పారు. రైతులు, మహిళలు ఒక్కపైసా కూడా చెల్లించవద్దన్నారు. వ్యవసాయ సాధికార పరిషత్ ద్వారా రైతు రుణాలు చెల్లించి తిరిగి అప్పులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా 20 శాతం రుణాలు చెల్లించడమేగాక 20 శాతం కొత్త అప్పులు ఇచ్చేలా బ్యాంకు అధికారులతో చర్చించామన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ వల్ల రూ.8,800 కోట్లు ప్రభుత్వానికి అదనపు బరువు పడుతుందని చెప్పారు. గ్రామాల్లో ఎక్కడైనా పారిశుధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఐదెకరాల నిబంధనతో ఎవరికైనా పింఛన్ కట్‌చేసి ఉంటే తిరిగి అందేలా చూస్తామన్నారు. సర్కార్ జిల్లాల ప్రాంతంలో అర ఎకరా భూమి రాయలసీమలో 15 ఎకరాలకు సమానమని చెప్పారు. గ్రామ కమిటీల్లో కక్షసాధింపుతో అర్హుల పింఛన్లు తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఇదివరకు చెల్లించిన డిపాజిట్లన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయాయని, వాటిని తిరిగి రాష్ట్రానికి తెప్పించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. -
కలకలం
పుట్టపర్తి అర్బన్ : భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, రైలు కింద పడి తనూ ఆత్మహత్య చేసుకున్న ఆర్ఎంపీ వైద్యుడి ఘటన బుధవారం పుట్టపర్తిలో కలకలం రేపింది. పుట్టపర్తి ప్రశాంతి గ్రామంలోని ధర్మశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి అర్బన్ సీఐ వేణుగోపాల్, బంధువులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. నల్లమాడ మండలం కొత్తపల్లి తండా వాసి, ఆర్ఎంపీ వైద్యుడు మురళీధర్ నాయక్(30)తో, కదిరి సమీపంలోని పట్నం రాచువారిపల్లికి చెందిన నీలాబాయి(28)కి 2007లో వివాహమైంది. అనంతరం ప్రశాంతి గ్రామంలో కాపురం పెట్టారు. వీరికి కుమారుడు మోక్షిత్(5) కుమార్తె లాస్య(2) ఉన్నారు. ధర్మశాల దగ్గర్లోని బీడుపల్లి గ్రామంలో క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. ఐదు నెలల క్రితం ధర్మశాల వద్దకు మకాం మార్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం యథావిధిగా క్లీనిక్‌కు వెళ్లాడు. కుమారుడు మోక్షిత్ ఇంటి సమీపంలోని ఇంగ్లిష్ మీడియం స్కూలుకు వెళ్లాడు. 11 గంటలకు ఇంటికి వచ్చిన మురళీధర్ నాయక్, వచ్చీ రాగానే భార్యను పిడిబాకుతో మెడ, చేతులు, పొట్టలో, పలుచోట్ల కసిదీరా పొడిచాడు. ఆమె అరుపులు బయటికి వినిపించకుండా టీవీ వాల్యూమ్ బాగా పెంచాడు. ఇంట్లో ఆడుకుంటున్న కూతురు లాస్యనూ చంపేందుకు కడుపులో పొడిచాడు. భర్త బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇంట్లోని మూడు గదులూ రక్తసిక్తమయ్యాయి. కూతురు కూడా చని పోయిందని భావించి వదిలేశాడు. అనంతరం తనూ బెడ్ రూంలోని ఫ్యాన్ కొక్కేనికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కానీ మనసు మార్చుకుని రక్తపు మరకలున్న దుస్తుల్ని విప్పేసి వేరే దుస్తులు ధరించి, టీవీ కట్టేసి, ఏమీ ఎరుగనట్లు ఇంటికి తాళం వేసి క్లీనిక్‌కు వెళ్లాడు. అక్కడ తలుపులు తెరవకుండా కొద్దిసేపు అటూఇటూ తిరిగి.. ద్విచక్ర వాహనంలో ప్రశాంతి రైల్వే స్టేషన్(పుట్టపర్తి రైల్వే స్టేషన్)కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతని తల, మొండెం వేరయ్యాయి. కాగా హత్యానంతరం ఇంట్లోనే వదిలి వెళ్లిన పిడిబాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం తీసుకెళ్లే క్రమంలో తోటి మహిళలు నీలాబాయి రాకపోవడంతో ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లోంచి పాప ఏడుపు వినిపించడంతో తలుపు వద్దకు వెళ్లి ఎంత పిలిచినా పలకలేదు. అనుమానంతో వారు ఇంటి వెనుక వైపున ఉన్న కిటీకి అద్దం పగులగొట్టి లోపలకు తొంగి చూశారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న నీలాబాయిని చూసి నిశ్చేష్టులయ్యారు. వీరి సమాచారంతో పుట్టపర్తి అర్బన్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగుల గొట్టారు. పొట్టలోంచి పేగులు బయటపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి లాస్యను 108 వాహనంలో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అనంతపురంలోని చిన్నారి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ హరిప్రసాద్ చిన్నారికి చికిత్స చేశారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు, బంధువులు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పుట్టపర్తి జిల్లా ఏర్పాటుకు కృషి: మంత్రి పల్లె
పుట్టపర్తి: కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాను రెండుగా విభజించాలని యోచిస్తోందని, అలా చేస్తే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటయ్యేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా అయిన అనంతపురాన్ని రెండుగా విభజిస్తే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందన్నారు. సోలార్, విండ్ ఎనర్జీతో పాటు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, నిరుద్యోగ భృతి, పేదలకు రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీటిని అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాలను మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అమలు చేస్తామన్నారు. పారిశ్రామికాభివృద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని రాయితీలను అందించేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. -
‘క్యాంపు విహారం’లో అపశ్రుతి
ఘట్కేసర్/ఘట్కేసర్ టౌన్/ గుత్తి: ‘క్యాంపు విహారయాత్ర’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎంపీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న మినీబస్సు బోల్తాపడడంతో 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఈ నెల 4వ తేదీన ఘట్కేసర్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్కు చెందిన 18 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు వారి కుటుంబీకులను కొందరు సోమవారం రాత్రి అనంతపురం పుట్టపర్తికి విహారయాత్రకు తీసుకెళ్లారు. అర్ధరాత్రి గుత్తి శివారులోని ఓ హోటల్ వద్ద బస చేశారు. మంగళవారం ఉదయం అక్కడే టిఫిన్ చేసి ప్రయాణమయ్యారు. బస్సు అతివేగంగా వెళుతూ అదుపు తప్పింది. మిడుతూరు - రామరాజుపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎంపీటీసీ సభ్యుడు మంకం రవి, మేడిపల్లి ఎంపీటీసీ స్వరూప భర్త సుభాష్‌నాయక్, వెంకటాపూర్ ఎంపీటీసీ కల్పన భర్త బుర్ర వెంకటేష్, చెంగిచెర్ల ఎంపీటీసీ బింగి భాగ్యమ్మ భర్త జంగయ్య, బోడుప్పల్ ఎంపీటీసీ జంగమ్మ భర్త నత్తి మైసయ్య, పీర్జాదిగూడ ఎంపీటీసీ మానస భర్త బృందాకర్ తదితరులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు ఓ అద్దె వాహనంలో వెనక్కి తిరిగి వెళ్లారు. సంఘటన స్థలాన్ని గుత్తి, పామిడి, పెద్దవడుగూరు పోలీసులు పరిశీలించారు. పెద్దవడుగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డీజీపీ రాముడు మనోడే
ఎస్కేయూ/బత్తలపల్లి/పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన జేవీ రాముడు మన జిల్లా వాసి కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తాడిమర్రి మండలం నార్శింపల్లిలో 1954 ఆగస్టు 1న జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ (1971-74 బ్యాచ్) పూర్తి చేశారు. ఎస్కేయూలో ఎంఏ (ఎకనామిక్స్) మొదటి సంవత్సరం (1974-75), ఎస్వీ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం(1975-76) పూర్తి చేశారు. 1978లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇది వరకు ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీ (ఆపరేషన్స్)గా బాధ్యతలు నిర్వర్తించారు. జేవీ రాముడు డీజీపీగా నియమితులు కావడంతో మండల కేంద్రమైన బత్తలపల్లిలో నార్శింపల్లి గ్రామస్తులు, ఆర్డీఎఫ్ పాఠశాల సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చారు. కేక్ కట్ చేశారు. జేవీ రాముడు గ్రామాభివృద్ధిని, ప్రజల క్షేమాన్ని కోరుకునే వ్యక్తి అని, ఆయన పెద్ద పదవి చేపట్టడం ఆనందంగా ఉందని వారు అన్నారు. ఆయన వల్ల తమ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు ఎంపిక కావడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఆయన సోదరి వెంకటలక్ష్మమ్మ, బావ రామయ్య అన్నారు. వీరు పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లిలో నివసిస్తున్నారు. డీజీపీగా జేవీ రాముడు బాధ్యతలు స్వీకరించడంతో సోమవారం గ్రామస్తులతో కలసి బాణాసంచ కాల్చారు. మిఠాయిలు పంచి పెట్టారు. -
హైనాను కొట్టి చంపిన 'అనంత' వాసులు
పుట్టపర్తి: అనంతపురం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అడవి జంతువు హైనాను స్థానికులు కొట్టి చంపారు. పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల్లో 25 మందిపై దాడి చేసి గాయపరిచిన హైనాను పట్టుకుని కొట్టి చంపారు. పొలానికి వెళ్లిన పలువురు రైతులపై హైనా దాడి చేసింది. హైనా దాడిలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే రైతులపై దాడిచేసింది చిరుతపులి అని ముందు అనుకున్నారు. చివరకు హైనాగా గుర్తించి పట్టుకున్నారు. హైనాను కొట్టి చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
అకాల వర్షంతో అతలాకుతలం
పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. గాండ్లపెంట మండలంలో షెడ్డు గోడ కూలి ఒకరు మృతి చెందారు. అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎన్పీకుంట మండలం పెడబల్లి రోడ్డులోని మదార్‌వలి, సక్కుబాయి, రహీం ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ధాన్యం, ఇతర వస్తువులు తడిచిపోయాయి. రెడ్డివారిపల్లి, చిన్నసానివారిపల్లి, ఎన్పీకుంట, దిగువపల్లి, నాయినివారిపల్లి తదితర గ్రామాల్లో సుమారు 40 ఎకరాల్లోని మొక్కజొన్న, 20 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 20 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రూ.20 లక్షల దాకా నష్టం సంభవించి ఉంటుందని రైతులు చెబుతున్నారు. బుక్కపట్నం మండలం గశికవారిపల్లి, కొండాపురం, బోయముసలయ్యగారి పల్లి, చింతలయ్యగారిపల్లెల్లో దాదాపు 80 ఎకరాల్లోని మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి తదితర పంటలు దెబ్బతిన్నాయి. అధిక పెట్టుబడులు,అర కొర నీళ్లు, ఉండీ లేని కరెంటుతో అష్టకష్టాలు పడి సాగుచేసిన పంటలు గాలి, వానతో తుడిచిపెట్టుకుపోయాయని రైతులు ప్రతాప్‌రెడ్డి, నారాయణమ్మ, నారప్ప, జయరామిరెడ్డి తదితరులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కదిరికి చెందిన అస్లాం (52), అతని స్నేహితుడు సాధిక్ సహా సుమారు 20 మంది ఆదివారం వైఎస్సార్ జిల్లా వెలిగల్లులో జరిగిన వలిమా కార్యక్రమానికి ద్విచక్రవాహనాలపై వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా హఠాత్తుగా గాలీవాన ప్రారంభమైంది. దీంతో రక్షణ కోసం వారంతా రోడ్డు పక్కనే సుబాన్ కు చెందిన పొలంలో నిర్మిస్తున్న కోళ్ల షెడ్డులోకి వెళ్లారు. గాలి ఉధృతికి షెడ్డుపైనున్న రేకులు ఎగిరి పోవడంతో వారంతా బయటకు పరుగులు తీశారు. గోడ పక్కనే ఉన్న అస్లాం నుదిటిపై ఇనుప కమ్మీ పడడంతో తీవ్ర గాయమైంది. ఇంతలోనే షెడ్డు గోడ కూలి అతనిపై పడడంతో అక్కడిక క్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతని స్నేహితుడు సాధిక్ కుడికాలు విరిగింది. డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌బాషా, ఎస్ఐ రాఘవేంద్రప్ప సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిథిలాల్లోంచి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలాన్ని ట్రెయినీ డీఎస్పీ ఉషారాణి, కదిరి రూరల్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి పరిశీలించారు. గాండ్లపెంటలో ఆదివారం రాత్రి 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
దాడులు నిర్వహించింది వాస్తవమే: ఎస్పీ
అనంతపురం : పుట్టపర్తిలో మావోయిస్టుల కోసం దాడులు నిర్వహించిన మాట వాస్తవమేనని అనంతపురం ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వరీ మహంతిపై దాడి కేసులో నలుగురు అనుమానితులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారని, వారికి తాము సహకరించినట్లు ఆయన తెలిపారు. అదుపులోకి తీసుకున్న నలుగురిని ఒడిశాకు తరలించినట్లు సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 21న ఒడిశా మంత్రిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. -
పుట్టపర్తిలో నలుగురు మావోయిస్టులు అరెస్ట్
-
పుట్టపర్తిలో నలుగురు మావోయిస్టులు అరెస్ట్
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులు ఒడిశా మంత్రిపై కాల్పులకు పాల్పడిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. పట్టణంలోని ఓ లాడ్జిలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు లాడ్జిలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అందులోభాగంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సదరు వ్యక్తులు తాము మావోయిస్టులమని ఒప్పుకున్నారని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 21న ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వరీ మహంతిపై మావోయిస్టులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. -
తెల్లారిన బతుకులు
‘కేకలు.. ఆరుపులు.. కాపాడండంటూ ఆర్తనాదాలు.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. టాయ్‌లెట్ వాకిలి తెరిచి బయటకు తొంగిచూస్తే పొగ గుప్పుమంది.. ఏదో జరగరానిది జరిగిందని భయపడుతూ అడుగు బయటకు పెట్టాను.. ఆలోచించడానికే సమయం లేదు.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ఇక్కడే సజీవ సమాధి ఖాయం.. వాకిలి తెరుచుకోలేదు.. తిరిగి టాయ్లెట్లోకి వెళ్లి కిటికీని గట్టిగా కాలితో నాలుగు తన్నులు తన్నాను.. అద్దం పగిలిపోయింది.. బోగీ లోపల మంటలు ఎగిసిపడుతూ మీదకొస్తున్నాయి.. అందరూ ఇటు రండంటూ గట్టిగా కేకలు వేశా.. అప్పటికే ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.. కిటికీలోంచి దూకేయండంటూ పురమాయించాను.. వేడిమి భరించడం వీలుకాక నేనూ బయటకు దూకేశాను’ అంటూ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శరణ్ బసవ బెంగళూరు - నాందేడ్ రైలు బోగీ దగ్ధమైన ఘటనను భయం భయంగా వివరించారు. ఈ ఘటనలో ఆయన తన భార్య, మామను మాత్రం కాపాడుకోలేకపోయాడు. సంఘటన స్థలం మరుభూమిగా మారింది. మృతదేహాలు ఒక్కోటి బయటకు తీస్తుంటే స్థానికుల ఒళ్లు జలదరించింది. దేవుడా.. ఇక ఆ బోగీలో మృతదేహాలు ఉండకూడదంటూ ప్రార్థించారు. కొత్తచెరువు/పుట్టపర్తిటౌన్, న్యూస్‌లైన్ : శనివారం తెల్లవారుజాము.. అప్పుడప్పుడే తొలి కోడి కూసింది.. రైతు కుటుంబాల వారు నిద్రలేస్తున్నారు. అంతలోనే రైలు బోగీ అంటుకుందన్న వార్తతో కొత్తచెరువు, పుట్టపర్తి వాసులు ఉలిక్కి పడ్డారు. పరుగు పరుగున సంఘటన స్థలానికి తరలివెళ్లారు. బోగీ మంటల్లో తగలబడుతూ కనిపించింది. ఎవరికి చేతనైంది వారు చేసి ప్రయాణికులను కాపాడటానికి ఉపక్రమించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు బెంగళూరులో బయలు దేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ1 ఏసీ బోగీ ఇక్కడ తగలబడిన సంఘటనలో 26 మంది మృతి చెందారని తెలియగానే జిల్లాలోని ప్రముఖులందరూ తరలివచ్చారు. కాసేపటికి రైల్వే అధికారులూ వచ్చారు. ఉదయం 11 గంటల సమయానికి ఆ రైలులో ప్రయాణించిన వారి బంధులు సైతం కొందరు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 26మంది మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రులను పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామసుబ్బారావు ఆధ్వర్యంలో సంఘటన స్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చే సి స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేయించారు. మధ్యాహ్నం రైల్వే శాఖ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప, మంత్రి రఘువీరా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నేత హరికృష్ణ తదితరులు సంఘటన స్థలిని పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని కాలిపోయిన రైలు బోగీని పరిశీలించి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అనంతపురం నగరం నీలిమీ థియేటర్ సమీపంలోని డోర్ నెంబర్ 1-333 ఇంట్లో ఉంటున్న పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ కుమారుడు శ్రీనివాస్ (28), కోడలు (26) శ్రీలత బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. మంత్రాలయం వెళ్లాలనుకుని ఈ రైలులో బయలుదేరారు. ఇపుడు వారి ఆచూకీ తెలియడం లేదు. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వారి బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
ఘనంగా సత్యసాయి జయంతి
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్ : సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు. సత్యసాయి ప్రేమతత్వాన్ని వివరిస్తూ సత్యసాయి భోదనల ఆంగ్లఅనువాదకుడు ప్రోఫెసర్ అనిల్ కుమార్ ప్రసంగించారు. సత్యసాయి మానవాళికందించిన వెలకట్టలేని సేవలకు చిహ్నంగా భారత ప్రభుత్వం తరుఫున కేంద్ర సమాచార ప్రసార సాధనాల శాఖ మంత్రి కిల్లి కృపారాణి సత్యాసాయి స్మారక స్టాంపును విడుదల చేశారు. ప్రథమ స్టాంపును సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు జస్టిస్ ఏపీ మిశ్రాకు అందజేశారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 2012-13 సంవత్సర వార్షిక నివేదికను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు టీకేకే భగవత్‌తో కలసి మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. వాటి ప్రతులను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డికి అందజేశారు. ట్రస్ట్ సభ్యుడు నాగానంద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదిక ఆధారంగా సత్యసాయి ట్రస్ట్ సేవలు, చేపట్టబోవు పథకాలను వివరించారు. అనంతరం సత్యసాయి స్మారకార్థం పోస్టల్ కవర్‌ను విడుదల చేసి మంత్రి కిల్లి కృపారాణి, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్‌కు అందజేశారు. సాయి సేవలు వెలకట్టలేనివి : కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వేడుకలకు ముఖ్య అథితిగా హాజరైన కిల్లి కృపారాణి ప్రసంగింస్తూ పేదలకు సత్యసాయి అందజేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. నేటి ప్రపంచానికి ఆయన ఆదర్శమన్నారు. సత్యసాయి ఆశయ సాధనకు ప్రతి సాయి భక్తుడు పాటుపడాలన్నారు. దేశవిదేశాల భక్తలకు ప్రశాంతత నందించిన ప్రశాంతి నిలయం పేరుమీద త్వరలోనే మైస్టాంప్ పేరుతో మరో స్టాంపును విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం విద్యార్థులు బ్రాస్ బ్యాండ్ వాయిద్యంతో సత్యసాయికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వరాలొలికించారు. సత్యసాయి విద్యార్థులు, వివిద దేశాలకు చెందిన భక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన 88 కేజీల సత్యసాయి జయంతి కేక్‌ను మంత్రి కిల్లికృపారాణి క్యాండిల్స్ వెలిగించి కట్ చేశారు. వేడుకల్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు,సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి జయంతి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, పోస్టల్ పీఎంజీలు సుధాకర్, సంధ్యారాణి, పోస్టల్ డెరైక్టర్ డీఎస్‌వీఆర్ మూర్తి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, మద్రాస్ శ్రీనివాస్, చక్రవర్తి, సత్యసాయి యూనివర్సిటీ చాన్సలర్, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య, వైస్‌చాన్సలర్ శశిధర్‌ప్రసాద్, రిజిస్ట్రార్ నరేన్ రాంజి, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నరేంద్రరెడ్డి, అంతర్జాతీయ అధ్యక్షుడు గ్యారీబెల్, మాజీ అధ్యక్షుడు గోల్డ్ స్టెయిన్, పారిశ్రామిక వేత్త టీవీఎస్ శ్రీనివాసన్, రిటైర్డ్ డీజీపీ హెచ్‌జె దొర, అప్పారావు తదితరులు హాజరయ్యారు. -
నేడు సత్యసాయి జయంతి
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్ : సత్యసాయి 88వ జయంతిని శనివారం పుట్టపర్తిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో వేడుకలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ప్రశాంతి నిలయాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యేకంగా ముస్తాబు చేసింది. దేశ విదేశాలకు చెందిన సత్యసాయి భక్తులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. జయంతి వేడుకలలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కిల్లి కృపారాణి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆమె ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలకు గుర్తింపుగా సత్యసాయి స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు. వేడుకలలో భాగంగా సత్యసాయి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. వేడుకలకు తరలివచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీకి ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
సిమ్స్ లో సాధారణ వైద్య సేవలు బంద్
పుట్టపర్తి అర్బన్/ అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్)లో సాధారణ వైద్య సేవలన్నీ బంద్ అయ్యాయి. లక్షలాది మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మూడు రోజులుగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో సాధారణ సేవలన్నీ నిలిపేసి.. అత్యవసర సేవలను మాత్రం జనరేటర్ సాయంతో కొనసాగిస్తున్నారు. ‘విద్యుత్ సరఫరాలో నిరవధిక అంతరాయం వల్ల ఆస్పత్రిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేయడమైనది’ అనే నోటీసును రెండు ప్రధాన ద్వారాల వద్ద అతికించారు. సత్యసాయి సేవాదళ్ సిబ్బంది కూడా ఎమర్జెన్సీ రోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ఆస్పత్రిని 22 ఏళ్లలో ఏ ఒక్క రోజూ బంద్ చేయలేదు. అలాంటిది మూడు రోజులుగా మూసి వేయడంతో వేలాది మంది రోగులు అవస్థ పడుతున్నారు. ఇక్కడ ఖరీదైన వైద్య సేవలు సైతం ఉచితంగా అందిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. నెలల తరబడి ఇక్కడే ఉంటూ వైద్యం చేయించుకుంటుంటారు. ప్రస్తుతం ఆస్పత్రిని మూసివేయడం వల్ల సుదూర ప్రాంత రోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సర్వజనాస్పత్రిలోనూ కరెంటు కష్టాలు అనంతపురం నగరంలోని సర్వజనాస్పత్రిలోనూ కరెంటు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది ‘సమైక్య’ సమ్మెలో భాగంగా ఓపీ సేవలకు దూరంగా ఉండడం, మరో వైపు విద్యుత్ సమ్మెతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోయిన కరెంటు సాయంత్రం 6 గంటలకు వచ్చింది. విద్యుత్ లేని సమయంలో జనరేటర్ వేసే ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేడు. దీంతో అత్యవసర సేవలు, చిన్నారుల ఐసీఐసీయూ, ఐసీయూ, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ విభాగాల్లో రోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతపురం రూరల్‌కు చెందిన ఓ గర్భిణీకి సిజేరియన్ చేయాల్సిన సమయంలో కరెంటు సరఫరా ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్నపిల్లల వార్డులో పిల్లలకు ఏమైనా జరుగుతుందేమోనని తల్లిదండ్రులు భయపడ్డారు. విద్యుత్ సమ్మె ప్రభావం ఆపరేషన్లపైనా పడుతోంది. నిత్యం 60 ఆపరేషన్లు జరిగే సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం పది కూడా దాటడం లేదు. సాధారణ ఆపరేషన్ థియేటర్‌ను తాత్కాలికంగా మూసేశారు. ఎమర్జెన్సీ ఓటీలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ నెల 6న మూడు, 7,8 తేదీల్లో పది చొప్పున, బుధవారం11 ఆపరేషన్లు జరిగాయి. వీటిలోనూ ఎక్కువ శాతం సిజేరియన్లే. ఆరోగ్యశ్రీ కేసులు సైతం ఆలస్యమవుతున్నాయి. కరెంటు లేక అప్రూవల్ కోసం పంపలేకపోతున్నామని ఆరోగ్యశ్రీ సిబ్బంది చెబుతున్నారు. జనరేటర్ వాడాలంటే గంటకు 20 లీటర్ల డీజిల్ అవసరమని, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రవాణా లేకపోవడం, బంకులు కూడా బంద్ చేస్తుండడంతో ఇబ్బంది కలుగుతోందని ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావు తెలిపారు. -
పుట్టపర్తిలో సమైక్య సమరభేరి
-
బాబా ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి...
-
వివాదాల నిలయంగా మారుతున్న పుట్టపర్తి