ఆరు సూట్‌కేసుల్లో కోట్ల రూపాయల డబ్బు.. | TDP Leaders Caught with the Money of Crores of Rupees | Sakshi
Sakshi News home page

ఆరు సూట్‌కేసుల్లో కోట్ల రూపాయల డబ్బు..

Published Thu, Apr 4 2019 10:35 AM | Last Updated on Thu, Apr 4 2019 1:36 PM

TDP Leaders Caught with the Money of Crores of Rupees - Sakshi

సాక్షి, అనంతపురం : ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండటంతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపింది. కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి ఓటర్లను లోబర్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి పోలీస్‌ యంత్రంగాన్నే ఇష్టా రాజ్యంగా వాడుకుంటుంది. తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరులో ఓ ఇన్నోవా కారులో కోట్లు తరలిస్తుండగా స్పెషల్‌ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సమాచారం అందగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మీడియా అక్కడికి వెళ్లగా పోలీసులు మాత్రం దగ్గరకు రానివ్వలేదు. కారులోని ఆరుసూట్‌కేసుల్లో కోట్లలో డబ్బు ఉందని తెలుస్తోంది.

పై అధికారుల సూచనల మేరకే పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు టీడీపీ నేతలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినా.. కేవలం కృష్ణారెడ్డి అనే కార్యకర్తపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement