duddukunta sridhar reddy
-
ఎమ్మెల్యే బాలకృష్ణ ఆచూకీ ఎక్కడ?: వైఎస్సార్సీపీ
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి ఏఎస్పీ ఆర్ల శ్రీనివాస్‌ను వైఎస్సార్సీపీ నేతల బృందం సోమవారం కలిసింది. హిందూపురం నియోజకవర్గంలో అత్తా కోడలిపై సామూహిక లైంగికదాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ, నిందితులను పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అత్తాకోడళ్లపై జరిగిన ఘటనతో అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది. మహిళలు, సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేసేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది. ఈ ఘటనపై జిల్లా మంత్రి సవిత సాయంత్రానికల్లా నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఎస్పీ నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి వదిలేశారు. స్థానిక (హిందూపూర్) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆచూకీ తెలియడం లేదు. ఇంతవరకు ఈ ఘటనపై గా ఆయన స్పందించకపోవడం దారుణం.’’ అని ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిపోవడం లేదు. పుంగనూరు ఘటనలోనూ మూడు రోజులైనా పోలీసులు స్పందించలేదు. మా నాయకులు వైఎస్ జగన్ వస్తారని తెలియగానే మంత్రులు పర్యటించారు. అప్పటిదాకా ప్రభుత్వంలో కానీ, పోలీసుల్లో కానీ చలనం లేదు ఈ ఘటనలోనూ వైఎస్ జగన్ వస్తే తప్ప బాధితులకు న్యాయం చేయరా..? అలాగే అయితే మా నాయకులు ప్రజల కోసం రావడానికి ఎప్పుడూ సిద్ధమే’’ అని ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు.బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా?: దీపికఎమ్మెల్యే బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా? అంటూ హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక ప్రశ్నించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మలపల్లి గ్రామంలో పక్క రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వచ్చి నివాసం ఉంటున్న కుటుంబంలోని అత్తా కోడళ్లపై శనివారం లైంగికదాడి జరిగింది. స్ధానికుల సాయంతో శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆచూకీ లేదు. ఆయనకు నియోజకవర్గ ప్రజల మాన ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా. ఫోన్లో పరామర్శించి చేతులు దులిపేసుకోవడం న్యాయమా? రెండు రోజుల తర్వాత మంత్రి సవిత వచ్చి హడావుడి చేసి వెళ్లారు. సంఘటన జరిగిన 12 గంటల్లోనే ప్రతిపక్ష పార్టీ నుంచి మేం బాధితులకు అండగా నిలబడితే, వ్యవస్థలన్నీ చేతుల్లో ఉంచుకుని నిందితులను పట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకంత తాత్సారం చేస్తోంది...సాయంత్రం లోపు నిందితులను అరెస్ట్ చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు. మా పార్టీని తిట్టడం మాని ఇప్పటికైనా నిందితులను పట్టుకోవడంలో దృష్టిపెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టం ఉండుంటే నిందితులు ఇంత స్వేచ్ఛగా నేరాలు చేసే వాళ్లు కాదు. 21 రోజుల్లో నిందితులను పట్టుకుని శిక్షలు విధించిన సందర్భాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 120 రోజుల్లో మహిళలపై ఎన్నో నేరాలు చేసినా ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడింది లేదు.ఇదీ చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’..హిందూపురం ప్రజలు గెలిపించింది బాలకృష్ణనా లేదా ఆయన పీఏనా. హైదరాబాద్‌లో కూర్చుని అన్‌స్టాపబుల్‌కి తర్వాతైనా ప్రిపేర్ అవొచ్చు.. హైదరాబాద్ నుంచి హిందూపురం ఇప్పటికైనా వచ్చి బాధితులకు న్యాయం చేయాలి. పోలీసుల నుంచి కూడా సరైన స్పందన లేదు. బాధితులను పరామర్శించడానికి కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు. మహిళా నాయకులు కూడా వెళ్లడం తప్పా.. బాధితులకు అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యత మాపై ఉంది. కానీ దాన్ని కూడా అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది’’ అని దీపిక నిప్పులు చెరిగారు.రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు: దుద్దుకుంట శ్రీధర్రెడ్డిచంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రతినెలా ఏదోక చొట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ముచ్చుమర్రి, పుంగనూరు, గుడ్లవల్లేరు, నేడు చిలమత్తూరు ఘటనలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అర్థం అవుతుంది. కూటమి పాలనలో రాష్ట్రాన్ని దోపిడీలు, దాడులకు అడ్డాగా మార్చేశారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ఆదాయం కోసం బెట్టింగులు, పేకాట క్లబ్బులు, గంజాయి అమ్మకాలను ఎమ్మెల్యేలే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. పోలీసులకు కూడా నేరాలపై నియంత్రణ లేకుండా పోయింది. గంజాయి, జూదం అరికడితే తప్ప ఈ నేరాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉండదని సీఎం చంద్రబాబు గమనించాలి. రవి బిష్ణోయ్ గ్యాంగ్ తరహాలో అనంతపురంలో కూడా ఒక గ్యాంగ్ తయారవుతోంది. మహిళల రక్షణ కోసం గతంలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని కొనసాగించాలి’’ అని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
విచారణకు తీసుకువెళ్తే..కిడ్నాప్ అంటూ ఎల్లోమీడియా తప్పుడూ కథనాలు
సాక్షి, పుట్టపర్తి టౌన్: కేసు విచారణ నిమిత్తం ఓ నిందితు డిని పోలీసులు తీసుకెళ్తే ఆ విషయంలో తన అనుచరుల హస్తం ఉందని, ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పచ్చ పత్రికలతో కలిసి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. శనివారం పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాయలంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమాడ మండలానికి చెందిన చెరువు నరేంద్రరెడ్డి అనే వ్యక్తిని గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసుల ప్రత్యేక బృందం విచారణ నిమిత్తం తీసుకెళ్లిందన్నారు. అయితే, సదరు వ్యక్తిని తన అనుచరులు కిడ్నాప్ చేశారని, ఎమ్మెల్యే హస్తం ఉందని ఓ పచ్చ పత్రికలో వచ్చిందన్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పత్రికపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకు సాగుతుండడాన్ని చూసి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. రూ. 6 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 193 చెరువులు నింపేందుకు చర్యలు తీసుకున్నామని, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో మండలానికి 200 ఇళ్లు మంజూరు చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక నిరుపేదల కోసం 25 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అడ్డదారుల్లో రాజకీయం చేయడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం పల్లె రఘునాథరెడ్డికే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగణంగా పనిచేస్తూ, సత్యసాయి బాబా కలలు కన్న బంగారు పుట్టపర్తిని తీర్చిదిద్దుతున్న తమపై అభాండాలు వేయడం హేయమన్నారు. ప్రజలకన్నీ తెలుసని, వారే మళ్లీ టీడీపీ నేతలకు బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నెడ్‌క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, జిల్లా అగ్రీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ రమణారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కేశప్ప, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, పట్టణ కన్వీనర్ రంగారెడ్డి, కౌన్సిలర్ చెరువుభాస్కర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, నాయకులు సాయి, కడపరాజా తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్ వార్త వదంతే నల్లమాడ: మండలంలోని చెరువువాండ్లపల్లికి చెందిన నరేంద్రరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని సీఐ నిరంజన్‌రెడ్డి శనివారం తెలిపారు. నరేంద్రరెడ్డితో పాటు గుప్త నిధుల తవ్వకంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డిని కూడా అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల దాతృత్వం
సాక్షి, కృష్ణా జిల్లా: కష్టకాలంలోనూ పేదలకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు స్ఫూర్తి కలిగించేలా ఉన్నాయని పెనమలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆరు లక్షల రూపాయల వ్యయంతో పదివేల కూరగాయల కిట్లు, 30 వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు. వీటిని కంకిపాడు మండలం ఉప్పులూరు నుంచి పంపిణీ చేశారు. ఒక్కో కిట్టులో అయిదు రోజులకు సరిపడా కూరగాయలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెల్ల రేషన్, బియ్యం కార్డులేని ప్రతీ పేదవాడికి ఆర్థిక భరోసాకు ఉచిత బియ్యం సీఎం ఆదేశించారని తెలిపారు. (లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం.. ) పశ్చిమగోదావరి జిల్లా: తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలువురి వాలంటీర్లకు కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశారు. యలమంచిలి మండలం చించినాడ, నెరేడుమిల్లి గ్రామాల్లో నియోజకవర్గ ఇంచార్జి, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు.. లాక్డౌన్ కారణంగా వారం రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. (‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’ ) అనంతపురం: పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో పాత్రికేయుడికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, గోధుమ పిండి తదితర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమాచారం ప్రజలకు చేరవేయడంలో మీడియా సోదరుల పాత్ర కీలకమైందన్నారు. విపత్కర సమయంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మరోవైపు గుంటూరులోని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. 250 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రకాశంలోని సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం పల్లెపాలెం గ్రామాలలో కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య సుమారుగా 3లక్షల విలువచేసే నిత్యవసర వస్తువులు అందజేశారు. (నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా: టైగర్) -
‘బాబు ఉన్నంతసేపు సీమలో కరువు’
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెయిన్గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని.. ఆయన అధికారంలోకి రాగానే సీమలో వర్షాలు కురిశాయని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని.. రైతులకు ఆయన అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.(రింగ్ దాటితే చర్యలు తీసుకోండి: సీఎం జగన్) గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం: చెవిరెడ్డి రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతగానో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్ స్వయంగా రైతుల సమస్యలను తెలుసుకున్నారని... అందుకే వారికోసం వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు. -
ఆరు సూట్‌కేసుల్లో కోట్ల రూపాయల డబ్బు..
సాక్షి, అనంతపురం : ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపింది. కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి ఓటర్లను లోబర్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి పోలీస్ యంత్రంగాన్నే ఇష్టా రాజ్యంగా వాడుకుంటుంది. తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరులో ఓ ఇన్నోవా కారులో కోట్లు తరలిస్తుండగా స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సమాచారం అందగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మీడియా అక్కడికి వెళ్లగా పోలీసులు మాత్రం దగ్గరకు రానివ్వలేదు. కారులోని ఆరుసూట్కేసుల్లో కోట్లలో డబ్బు ఉందని తెలుస్తోంది. పై అధికారుల సూచనల మేరకే పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ పుట్టపర్తి అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు టీడీపీ నేతలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా.. కేవలం కృష్ణారెడ్డి అనే కార్యకర్తపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. -
రైతులకు న్యాయం జరగపోతే ఉద్యమం
నల్లమాడ: ఇన్పుట్ సబ్సిడీ మంజూరులోనూ ప్రభుత్వ ‘పచ్చ’పాత వైఖరి స్పష్టంగా కన్పిస్తోందని వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన వారికి ఎకరా భూమి ఉన్నా రూ.40 వేలు పరిహారం మంజూరు చేసిన పాలకులు, ఇతర రైతులు ఐదెకరాలు పైబడి పంటలు సాగు చేసి నష్టపోయినా రూ.500 మాత్రమే మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ విడుదలలో అక్రమాలను నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ధర్నాలో శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులను భయపెట్టి ఇన్పుట్ సబ్సిడీ జాబితాను తమకు ఇష్టం వచ్చినట్లు తయారు చేయించారని ఆరోపించారు. తప్పొప్పులను సరిదిద్ది 10 రోజుల్లోగా అర్హులైన రైతులందరికీ విస్తీర్ణం మేరకు పరిహారం మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అధికారులెవ్వరినీ గ్రామాల్లో తిరగనివ్వబోమన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఓడీ చెరువు, అమడగూరు, బుక్కపట్నం మండలాల కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, శేషురెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ కన్వీనర్ పొరకల రమణ, సర్పంచ్‌లు రంగలాల్‌నాయక్, సూర్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి చంద్ర, ఎమ్మార్పీఎస్ గంగిశెట్టి, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి ఆది, బీడుపల్లి శ్రీధర్, పలువురు రైతులు మాట్లాడారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ఏఎస్ హమీద్బాషాకు అందజేశారు. -
బాబు పాలనలో కరువు వెంటాడుతోంది
- రైతు సమస్యలపై మేలో భారీ నిరసన - చేతకాని అసమర్థుడు పల్లె - దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజం పుట్టపర్తి అర్బన్ : చంద్రబాబు పదవి చేపట్టిన నాటి నుంచి కరువు వెంటాడుతోందని పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పుట్టపర్తి సాయి ఆరామంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటి పంటలు పండక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. ఉపాధి పనులు లేకపోవడంతో కూలీలు, రైతులు వలసబాట పట్టారన్నారు. రెయిన్ గన్లతో పంటలు రక్షిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు ప్రజాధనం వృథా చేశారన్నారు. కేవలం పార్టీ నాయకులను బతికించడానికి నీరు చెట్టు పనులు చేయించి కమీషన్లు పొందుతున్నారన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పల్లె మంత్రి పదవి ఉన్నంత కాలం పుట్టపర్తి గురించి పట్టించుకోని అసమర్థుడన్నారు. అనంతలో 13 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధిని విస్మరించారన్నారు. సీఎం కేవలం ఎయిర్‌పోర్టు కోసమే పుట్టపర్తిని వినియోగించుకుంటున్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వాలని ఒక్కరైనా సీఎంను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజల సమస్యలు పరిష్కారం కోరుతూ మే మూడో వారంలో వేలాది మందితో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ధర్నాకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో పంటలు పూర్తిగా ఎండిపోవడంతో ప్రభుత్వం బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ ఇవ్వాలన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకున్నా పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి బీమా కంపెనీపై కోర్టుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి మండల, పట్టణ, ఓడీసీ, కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, కేశవరెడ్డి, మాధవప్ప, ఈశ్వరరెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు ఏవీ.రమణారెడ్డి, నరసారెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌లు తిప్పారెడ్డి, చిత్తరంజన్‌రెడ్డి, చెన్నకృష్ణ, రామ్మోహన్, బీడుపల్లి శ్రీధర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీని వీడితే మైనార్టీలపై కేసులా?
–మంత్రి పల్లెకు మేకప్‌పై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదు –వైఎస్సార్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కొత్తచెరువు : టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన ముస్లిం మైనార్టీలపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లడారు. మంత్రి పల్లెకు మేకప్‌పై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై లేదని మండిపడ్డారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండున్నర సంవత్సరం మంత్రిగా ఉన్న పల్లె మైనార్టీలకు చేసింది ఏమీలేదని, దీన్ని గుర్తించి దొన్నికోటకు చెందిన ముతవల్లి మహమ్మద్ రసూల్, మరో 50 కుటుంబాలు పార్టీలో చేరితే వారిపై అక్రమ కేసులు, పోలీసులతో వేధింపులు దిగిడం మంత్రి పల్లె నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ నారేపల్లి జగన్మోహన్రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, లోచర్ల రాజారెడ్డి, సర్పంచ్ సంజీవరెడ్డి, నాయకులు వలీ, రసూల్, రామసుబ్బరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పల్లె... నిజాయితీ నిరూపించుకో
నల్లమాడ : గ్యాంగ్‌స్టర్ మధుతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి దోస్తీ వాస్తవమేనని, మంత్రి మాటలే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. నల్లసింగయ్యగారిపల్లిలోని ఇంట్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి విలేకరులతో మాట్లాడారు. బుక్కపట్నం మండలం యర్లంపల్లికి చెందిన గ్యాంగ్‌స్టర్ మధుతో పరిచయాలు ఉన్నాయని, 2014 ఎన్నికల్లో తన విజయానికి మధు సహకరించాడని, తాను బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఫోన్ చేస్తుంటాడని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించడం వారిరువురిసంబంధాలను తేటతెల్లం చేస్తున్నాయన్నారు. బెంగళూరు స్థావరంగా గ్యాంగ్‌స్టర్ మధు కొన్నేళ్లుగా సాగిస్తున్న దందాలు, సెటిల్మెంట్లలో పల్లె ర ఘునాథరెడ్డి సూత్రధారి అనే విషయం స్పష్టంగా అవగతమవుతోందన్నారు. మధును అడ్డం పెట్టుకొనే పల్లె జిల్లాలో రూ.వేల కోట్లు విలువ చేసే భూములను కారుచౌకగా కొట్టేసినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై విచారణకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వయంగా కోరి, నిజాయితీ నిరూపించుకోవాలని శ్రీధర్‌రెడ్డి సూచించారు. లేనిపక్షంలో గ్యాంగ్‌స్టర్ మధుతో మంత్రి పల్లె సంబంధాలపై విచారణ చేయించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో రిట్ దాఖలు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు సుధాకర్‌రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, వెంకటప్పనాయుడు, ఎంపీపీ ఉంట్ల బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసులయాదవ్, విజయమ్మ, సుకన్యా శ్రీనివాసరెడ్డి, కోఆప్షన్ సభ్యులు మాబూఖాన్, కుళ్లాయిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పేదలపై కనికరం లేని ప్రభుత్వం
గడప గడపకూ వైఎస్సార్‌లో తండావాసుల ఆవేదన పుట్టపర్తి అర్బన్: పింఛన్లు, రేషన్ సరుకులు అందక పేదల బతుకులు భారమైనా ఈ కనికరం లేని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నగరపంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన శాంతాబాయి, నారాయణమ్మ బాయి, సోనీబాయి, లకే్ష్మనాయక్ తదితరులు పుట్టపర్తి నియోజకవర్గ సమన్వకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఆదివారం నగర ‡పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా,బ్రాహ్మణపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఇంటింటి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తండాకు చెందిన శాంతమ్మ బాయి తన సమస్యను వివరిస్తూ తన కొడుకులందరూ ఉపాధి కోసం వలస పోయారని, ఎవరూ దిక్కులేని తనకు పింఛన్ ఇవ్వడం లేదని వాపోయింది. దరఖాస్తు చేసుకుని అలసిపోయానని, నాయకులు కూడా తనపై కనికరం చూపలేదన్నారు తండాలో అపరిశుభ్రత వల్ల రోగాలు ప్రబలుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. అర్హతలు ఉన్నా రుణమాఫీ దక్కలేదని, డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కాలేదని ఈ ప్రభుత్వాన్ని నమ్మి పూర్తిగా మోసపోయామని బ్రాహ్మణపల్లికి చెందిన పలువురు రైతులు, మహిళలు శ్రీధర్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి మండల, పట్టణ, కొత్తచెరువు కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, జగన్మోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, నాయకులు లింగాల భాస్కర్‌రెడ్డి, సాయిరాంరెడ్డి, సోము, గంగాద్రి, బాబుల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దాదాపీరా, రా>మస్వామినాయక్, కిషోర్‌నాయక్, రాజేష్‌నాయక్, సాయినాథ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.