పేదలపై కనికరం లేని ప్రభుత్వం | people blames to tdp goverment | Sakshi
Sakshi News home page

పేదలపై కనికరం లేని ప్రభుత్వం

Published Mon, Aug 8 2016 12:33 AM | Last Updated on Fri, Aug 10 2018 5:54 PM

people blames to tdp goverment

గడప గడపకూ వైఎస్సార్‌లో తండావాసుల ఆవేదన
పుట్టపర్తి అర్బన్‌: పింఛన్లు, రేషన్‌ సరుకులు అందక పేదల బతుకులు భారమైనా ఈ కనికరం లేని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నగరపంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన శాంతాబాయి, నారాయణమ్మ బాయి, సోనీబాయి, లకే్ష్మనాయక్‌ తదితరులు పుట్టపర్తి నియోజకవర్గ సమన్వకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఆదివారం నగర ‡పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా,బ్రాహ్మణపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఇంటింటి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించారు.


ఈ సందర్భంగా తండాకు చెందిన శాంతమ్మ బాయి తన సమస్యను వివరిస్తూ తన కొడుకులందరూ ఉపాధి కోసం వలస పోయారని, ఎవరూ దిక్కులేని తనకు పింఛన్‌ ఇవ్వడం లేదని వాపోయింది. దరఖాస్తు చేసుకుని అలసిపోయానని, నాయకులు కూడా తనపై కనికరం చూపలేదన్నారు తండాలో అపరిశుభ్రత వల్ల రోగాలు ప్రబలుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. అర్హతలు ఉన్నా రుణమాఫీ దక్కలేదని, డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కాలేదని ఈ ప్రభుత్వాన్ని నమ్మి పూర్తిగా మోసపోయామని బ్రాహ్మణపల్లికి చెందిన పలువురు రైతులు, మహిళలు శ్రీధర్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్‌ హరికృష్ణ, పుట్టపర్తి మండల, పట్టణ, కొత్తచెరువు కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్‌ కేశవరెడ్డి, నాయకులు లింగాల భాస్కర్‌రెడ్డి, సాయిరాంరెడ్డి, సోము, గంగాద్రి, బాబుల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దాదాపీరా, రా>మస్వామినాయక్, కిషోర్‌నాయక్, రాజేష్‌నాయక్, సాయినాథ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement