gadapa gadapakoo ysr
-
మోసాలను ఎండగడితే తట్టుకోలేకున్నారు
రాయదుర్గం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలు ఎత్తి చూపుతుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం రాయదుర్గం పట్టణంలోని 18వవార్డులో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ వైఎస్సార్ జరిగిన ప్రతి చోటా విశేష ఆదరణ వస్తోందన్నారు. దీంతో భయం చుట్టుకున్న అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా అన్యాయం చేశారని ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. -
వైఎస్సార్ సీపీ పరిశీలకుల నియామకం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన లో తెలిపింది. పరిశీలకులుగా నియమితులైన నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఆధ్వర్యంలో పనిచేస్తారని పేర్కొంది. నియోజకవర్గం పరిశీలకుని పేరు ఏలూరు మాజేటి సురేష్‌కుమార్ దెందులూరు ముప్పిడి సంపత్‌కుమార్ ఉంగుటూరు గంటా ప్రసాదరావు పోలవరం గన్నమని జనార్దనరావు చింతలపూడి బండి పట్టాభి రామారావు (అబ్బులు) కొవ్వూరు పోతుల రామతిరుపతి రెడ్డి గోపాలపురం పోల్నాటి శ్రీనివాస్ బాబు (బాబ్జి) నిడదవోలు ఊదరగొండి చంద్రమౌళి తణుకు మేడపాటి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తాడేపల్లిగూడెం చెలికాని రాజమోహనరావు (రాజాబాబు) ఆచంట రుద్రరాజు బాల సూర్యనారాయణరాజు (పీడీ రాజు) నరసాపురం చెల్లెం ఆనందప్రకాష్ పాలకొల్లు బలగం సేతుబంధన సీతారామ్ భీమవరం నడపన చినసత్యనారాయణ ఉండి వి.సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) -
‘ఉత్తుత్తి హామీలతో వంచించారు’
పెనుకొండ రూరల్ : చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ వంచనలేనని గోనిపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ వద్ద వాపోయారు. శుక్రవారం మండలంలోని గోనిపేట గ్రామంలో శంకరనారాయణ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ‘ప్రభాకర్ అనే మతి స్థిమితం లేని వ్యక్తికి గతంలో రూ. 200 పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి రాగానే అతనికి పింఛన్ తొలగించార’ని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా పింఛన్లు, పక్కాగృహాలు, ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా రుణాలు తదితర సమస్యలను గ్రామస్తులు ఏకరవు పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, అనితాశ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు గాలికి
విడపనకల్లు: ప్రజాసమస్యల ను గాలికి వదిలే సి కృష్ణా పుష్కరాల పేరిట హంగు, ఆర్భాటాలకు మాత్ర మే ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విడపనకల్లులో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రుణమాఫీ చేయకుండా మభ్యపెడుతున్నారంటూ ప్రభుత్వ తీరుపై రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు మండిపడుతున్నారన్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఎంతో మంది పత్తి రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి నష్ట పోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంత వరకు ఒక్క నిరుపేదకు కూడా పక్కాగృహం నిర్మించి ఇవ్వలేదని ప్రభుత్వానికి చురకలంటించారు. -
పేదలపై కనికరం లేని ప్రభుత్వం
గడప గడపకూ వైఎస్సార్‌లో తండావాసుల ఆవేదన పుట్టపర్తి అర్బన్: పింఛన్లు, రేషన్ సరుకులు అందక పేదల బతుకులు భారమైనా ఈ కనికరం లేని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నగరపంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన శాంతాబాయి, నారాయణమ్మ బాయి, సోనీబాయి, లకే్ష్మనాయక్ తదితరులు పుట్టపర్తి నియోజకవర్గ సమన్వకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఆదివారం నగర ‡పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా,బ్రాహ్మణపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఇంటింటి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తండాకు చెందిన శాంతమ్మ బాయి తన సమస్యను వివరిస్తూ తన కొడుకులందరూ ఉపాధి కోసం వలస పోయారని, ఎవరూ దిక్కులేని తనకు పింఛన్ ఇవ్వడం లేదని వాపోయింది. దరఖాస్తు చేసుకుని అలసిపోయానని, నాయకులు కూడా తనపై కనికరం చూపలేదన్నారు తండాలో అపరిశుభ్రత వల్ల రోగాలు ప్రబలుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. అర్హతలు ఉన్నా రుణమాఫీ దక్కలేదని, డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కాలేదని ఈ ప్రభుత్వాన్ని నమ్మి పూర్తిగా మోసపోయామని బ్రాహ్మణపల్లికి చెందిన పలువురు రైతులు, మహిళలు శ్రీధర్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి మండల, పట్టణ, కొత్తచెరువు కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, జగన్మోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, నాయకులు లింగాల భాస్కర్‌రెడ్డి, సాయిరాంరెడ్డి, సోము, గంగాద్రి, బాబుల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దాదాపీరా, రా>మస్వామినాయక్, కిషోర్‌నాయక్, రాజేష్‌నాయక్, సాయినాథ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిలువునా మోసపోయాం
– ‘గడపగడపకూ వైఎస్సార్’లో మహిళల ఆవేదన లేపాక్షి : మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి నిలువునా మోసపోయామని హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. శనివారం లేపాక్షి మండలం గోపిందేవరపల్లి, శిరివరం, తిరుమలదేవరపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారని ప్రజలను అడిగారు. ఈప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారో మీరే (ప్రజలు) నిర్ణయించాలని ఆయన కోరారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యల గురించి నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. కంచిసముద్రం సిండికే ట్ బ్యాంకులో తనకు తెలియకుండానే ఓ వ్యక్తి రూ.23 వేలు అప్పు చేశాడని గోపిందేవరపల్లికి చెందిన గంగమ్మ వాపోయింది. తనకు ఆ బ్యాంకులో రూ.30 వేలు మాత్రమే అప్పు ఉందని చెప్పింది. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నారాయణస్వామి, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమాన్, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజిని, పట్టణ మíß ళ అధ్యక్షురాలు నాగమణి, మండల నాయకులు ప్రభాకర్, బాలు, సిరాజ్, శంకర్‌రెడ్డి, గోపికృష్ణ, కూతుల శీన, నరసింహప్ప, స్థానిక నాయకులు కిష్టప్ప, తిప్పన్న, హనుమప్ప, సుమాన్, గోపాల్‌రెడ్డి, మూర్తి, జయరామిరెడ్డి, మారుతీ, ఇంతియాజ్, బషీర్, శ్రీరామిరెడ్డి, వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు. రూ.5 వేలు ఆర్థికసాయం లేపాక్షి మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన సాలమ్మ అనే నిరుపేద మహిళకు హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. సాలమ్మ నివాసం ఉండడానికి ఇల్లు లేదని, సిమెంటు రేకులు వేసుకుని జీవనం గడపాలన్నా స్థోమత లేదని ఈనెల 3న శిరివరం గ్రామంలో చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయింది. ఆమె పరిస్థితి చూసి చలించిన నవీన్‌నిశ్చల్ శనివారం తనవంతు సాయంగా రూ.5 వేలు నగదు అందజేశారు. అదేవిధంగా శిరివరం గ్రామానికి చెందిన వృద్ధురాలు రామక్కకు స్టీల్ ఊతకర్రలను అందజేశారు. -
నాలుగు డిగ్రీలున్నా ఉద్యోగం లేదు
అనంతపురం : ‘ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని కొండంత ఆశతో ఓట్లేశాం. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భతి అయినా వస్తుందని ఎదురు చూశాం. ఏమీ లేదు. ప్రైవేట్‌గా పని చేసుకుంటున్నా. చేతిలో నాలుగు డిగ్రీలున్నా(ఎంబీఏ, ఎంకాం,ఎంఏ, బీఈడీ) ఉద్యోగం లేదు’ అని నగరానికి చెందిన మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ‘గడప గడపకు వైఎస్సార్’ కార్యక్రమం 9వ డివిజన్లోని భవానీ నగర్లో జరిగింది. పార్టీ అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యులు ఎర్రిస్వామి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బుర్రా సురేష్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాగే పరుశురాం, నదీమ్ అహ్మద్‌లు పాల్గొన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చి హామీల ఏ మేరకు అమలయ్యాయో మార్కులు వేయాలంటూ బ్యాలెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా డివిజన్లో అధిక సంఖ్యలో ప్రజలు టీడీపీ పాలనపై మండిపడ్డారు. ప్రకాష్ అనే స్థానికుడు మాట్లాడుతూ, ఎమ్మెస్సీ చేసిన ఉద్యోగం లేక చివరకు చిన్న వ్యాపారం చేసుకుంటున్నానని, సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయేషా అనే మహిళా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారన్నారు. రుణ మాఫీ అవుతుందని వేచి ఉన్నందుకు రూ.4 వేలు వడ్డీ రూపంలో చెల్లించానని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రాముడు అనే విశ్రాంత ఉద్యోగి చంద్రబాబు సీఎం అందరి నోళ్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కనేకల్ లింగారెడ్డి, డాక్టర్ మైనుద్దీన్, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలనరసింహా రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్రంపేట పురుషోత్తం, డీలర్ల సంఘం నగర మాజీ అధ్యక్షుడు బాలనాగిరెడ్డి, కార్పొరేటర్ జానకి, వివిధ డివిజన్ల కన్వీనర్లు సత్యనారాయణ రెడ్డి, బిందెల శీన, శేషానంద రెడ్డి, విశ్వనాథ్, చంద్రమోహన్ రెడ్డి, రమణ, నాగార్జున రెడ్డి, స్థానిక నాయకులు మార్కెట్ మల్లి, సుబ్బరాయుడు, లక్ష్మినారాయణ, మంగలి ప్రసాద్, బాబూ నాయక్, రామ్,లక్ష్మణ్ కమల్ పాల్గొన్నారు.