ప్రజా సమస్యలు గాలికి | gadapa gadapakoo ysr in uravakonda | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు గాలికి

Published Fri, Aug 12 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ప్రజా సమస్యలు గాలికి

ప్రజా సమస్యలు గాలికి

విడపనకల్లు: ప్రజాసమస్యల ను గాలికి వదిలే సి కృష్ణా పుష్కరాల పేరిట హంగు, ఆర్భాటాలకు మాత్ర మే ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విడపనకల్లులో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రుణమాఫీ చేయకుండా మభ్యపెడుతున్నారంటూ ప్రభుత్వ తీరుపై రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు మండిపడుతున్నారన్నారు.


వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఎంతో మంది పత్తి రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి నష్ట పోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంత వరకు ఒక్క నిరుపేదకు కూడా పక్కాగృహం నిర్మించి ఇవ్వలేదని ప్రభుత్వానికి చురకలంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement