visweswara reddy
-
విచారణకు మేము సిద్ధం.. నువ్వు సిద్ధమా?.. చంద్రబాబుకు విశ్వేశ్వర రెడ్డి సవాల్
-
చంద్రబాబుపై విశ్వేశ్వర రెడ్డి కామెంట్స్
-
వైఎస్ఆర్ జయంతి.. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
-
నారా లోకేష్, చంద్రబాబులకు విశ్వేశ్వర రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర పయ్యావుల కేశవ్‌దే: విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, అనంతపురం: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలంటూ ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను బెదిరించేలా పయ్యావుల వ్యవహరిస్తున్నారని, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు పయ్యావుల కేశవ్ నమోదు చేయించారు. దొంగ ఓట్లు తొలగిస్తే తప్పేంటి?. కర్ణాటకలో నివసిస్తున్న వారి ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి?. దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌దేనని విశేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: జనాలు లేరు..‘జెండాలూ’ లేవు.. నీరసంగా లోకేశ్ యువగళం -
‘ఆ భయంతోనే చంద్రబాబు అండ్ కో డ్రామాలు’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాయలసీమ జిల్లా అభివృద్ధి గురించి బాబు ఏరోజైనా ఆలోచించారా? ఒక్క ప్రాజెక్టునైనా కట్టారా? ఎన్నికలొస్తున్నప్పుడే బాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయి’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ వల్లే రాయలసీమకు సాగు, తాగు నీటి కష్టాలు తీరాయి. 1996, 1999లో రెండు సార్లు హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఎందుకు పనులు చేయలేదు?. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే హంద్రీనీవా, గాలేరు-నగరి సహా రాయలసీమ ప్రాజెక్టులకు మోక్షం లభించింది. హంద్రీనీవా కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది’’ అని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. చదవండి: సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి ‘‘40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ఐదు టీఎంసీలకు కుదించి సీమకు అన్యాయం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. సీఎం జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం జగన్ చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ ఎప్పుడూ దొంగ ఓట్లతోనే గెలుస్తారు’’ అని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. -
ఉరవకొండలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
-
‘కేసీఆర్ ఎలా పుట్టారో మేము అలానే పుట్టాం’
సాక్షి, షాద్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ నేతలను తెలంగాణలో ఎలా పుట్టారో అంటున్నారని, కేసీఆర్ ఆయన జిల్లాలో ఎలా పుట్టారో తాము కూడా తమ జిల్లాలో అలానే పుట్టామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం షాదనగర్ మండలం చౌదరి గూడలో జరిగిన జలసాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా.. అమెరికాలో ఇంజనీర్ సదివిన.. కానీ కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్ మాత్రం అర్థం కావడం లేదు. మా ప్రాంతానికి నాలుగు నెలల్లో నీళ్లు తెస్తే కేసీఆర్‌కు గుడి కడతా. మృగశిర పండుగ తరువాత చంద్రశిర పండగ చేస్తాం. ఇచ్చిన మాట తప్పితే... చంద్రశిర ఖండన చేద్దాం’’ అంటూ ధ్వజమెత్తారు. -
జగన్ పాలనలో ఏపీకి సువర్ణయుగమే
-
ప్రజలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు
-
పయ్యావుల కేశవ్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తా
-
తాడిపత్రిలో జేసీ సోదరుల ఆరాచకపాలన : విశ్వేశ్వర్‌రెడ్డి
-
అభివృద్ధి రవ్వంత.. దోచేది కొండంత
కూడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగున్నర ఏళ్లలో ప్రజా ధనాన్ని దోచుకుంది కొండంత .. అభివృద్ధి చేసింది గోరంత అని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్యజమెత్తారు. సోమవారం కూడేరు మండల పరిధిలోని చోళసముద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు ‘రావాలి జగన్...కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు సమస్యలను వారితో ఏకరువు పెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతు అనంతపురం జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నా .. కరువు సహాయక చర్యలు చేపట్టకుండా సీఎం చంద్రబాబు తాను చేసిన గోరంత అభివృద్ధిని కొండంత చేసి చెబుతు ప్రజలను మభ్యపెడుతున్నారుని మండి పడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంగా హంద్రీ నీవా కాలువ ఏర్పాటు చేస్తే నీరు ఇవ్వకుండా ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేశారన్నారు. కేశవ్‌తో పాటు ఆయన అనుయాయులకు దోచుకోవడమే సరిపోయిందని విమర్శించారు. కేబినెట్లో ఐటీ దాడులపై చర్చనా? కేబినెట్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా ఐటీ దారులపై చర్చించడం సిగ్గుచేటని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య విమర్శించారు. చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బును కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో పంచారన్నారు. ఆయన పాలనంతా అవినీతిమయమే కాబట్టి ఐటీ దాడులు చేస్తే తమ అవినీతి బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బాబు జంకుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజశేఖర్ , జడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, నాయకులు మాదన్న, నాగేంద్ర ప్రసాద్, తిమ్మారెడ్డి, గంగాధర్, పెన్నోబులేసు, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశ్వ పోరాటం.. సంక్షేమ ఆరాటం
ఉద్యమాల ఖిల్లా...ఉరవకొండ...ప్రజా పోరాటం..అభివృద్ధి కోసం ఆరాటం.. నాలుగన్నరేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సాగిస్తున్న సమరనాదమిది. ప్రభుత్వం నిధులివ్వకుండా వివక్ష చూపినా..స్థైర్యం కోల్పోక ప్రజలకు అండగా నిలిచారు. సాగు, తాగునీరు, పంటలకు మద్దతు ధర, ఇళ్లు, ఇంటి స్థలాలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో ప్రజా ఉద్యమాలు నిర్మించారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కరించేలా అలుపెరగని పోరాటం చేశారు. రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం వస్తుందని..అప్పుడే అందరికీ మేలు జరుగుతుందని పేదలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతపురం, ఉరవకొండ: ప్రజా ఉద్యమాలే శ్వాసగా, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నాలుగున్నరేళ్లుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిస్వార్థంగా ప్రజా సంక్షేమం కోసం రోడ్డెక్కిన ఎమ్మెల్యే తీరునచ్చిన వామపక్షాలూ మద్దతు పలికాయి. ఎమ్మెల్యే చేపట్టిన ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచాయి. ఒకే ఒక్కడు జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ గుర్తుపై ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా అధికార పార్టీకి అమ్ముడుబోయారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన విశ్వేశ్వరరెడ్డి మాత్రం ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తూ ఉరవకొండ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగు నీటి కోసం అలుపెరగని పోరాటం రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత హంద్రీనీవా తొలిదశ కింద మిగిలి ఉన్న పది శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. తొలిదశలో జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా...అత్యధికంగా 80 వేల ఎకరాలు ఉరవకొండ నియోజకవర్గంలో ఉంది. ప్రభుత్వం ప్రతిపాదిత ఆయకట్టుకు ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వకపోగా..నీటిని కుప్పంకు తీసుకువెళ్లేందుకు జిల్లాలో డిస్ట్రిబ్యూటరీలను, పిల్ల కాల్వను రద్దు చేసింది. దీంతో ఎమ్మెల్యే విశ్వ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి డిస్ట్రిబ్యూటరీలు రద్దు చేస్తూ ఇచ్చిన జీఓ నిలుపుదల చేసింది. ఫలితంగా నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా నీటిని మళ్లించారు. ఇళ్లకోసం ధర్నాలు ఉరవకొండ పట్టణంలోని వైఎస్సార్ హయాంలో 88 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిలో పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వేలాది మందితో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మహాధర్నా చేపట్టారు. పోలీసులు బలవంతంగా ఆయన్ను అరెస్టు చేశారు. ఇంతకు ముందు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులతో కలిసి 32 గంటల దీక్ష, పాత బస్టాండ్ వద్ద 24గంటల దీక్షలు చేపట్టారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్నీ మండల కేంద్రాల్లో పేదల ఇంటిపట్టాల కోసం ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు పాసుపుస్తకాలు, ముద్రరుణాలు ఇవ్వాలని ఉరవకొండ పట్టణంలో చేనేతల ధర్నా, సదస్సులు చేపట్టారు. మైనార్టీ సమస్యలపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన మైనార్టీ సదస్సు విజయవంతమైంది. ప్రధాన సమస్యలు.. ఎమ్మెల్యే చర్యలు ♦ హంద్రీనీవా తొలిదశ ఆయకట్టులో ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలున్నాయి. అయితే హంద్రీనీవా ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరినా..టీడీపీ ప్రభుత్వం ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. అంతేకాకుండా రాకెట్ల–ఆమిద్యాల లిఫ్ట్ పనులను కూడా చేపట్టలేదు. ♦ హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలని ఎమ్మెల్యే విశ్వ దశలవారీగా ఎన్నో పోరాటాలు చేశారు. దిగి వచ్చిన ప్రభుత్వం నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలలతో నింపింది. అందువల్లే డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకపోయినా రైతులు చెరువు నీటితో పంటలు సాగు చేస్తున్నారు. ♦ జీడిపల్లి గ్రామంలో రిజర్వాయర్ దగ్గరగా ఉండటంతో ఊట నీరు ఇళ్లలోకి వెళ్లి గ్రామం మొత్తం దెబ్బతింది. తమను ఆదుకోవాలంటూ గ్రామస్తులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. ♦ జీడిపల్లి గ్రామానికి పునరావసం కల్పించాలని ఎమ్మెల్యే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎన్నోమార్లు విన్నవించారు. గ్రామçస్తులతో కలిసి కలెక్టరేట్‌ను కూడా ముట్టడించారు. ఎమ్మెల్యే పోరాటాలతో స్పందించిన ప్రభుత్వం.. ఆర్ఆర్ యాక్టు కింద జీడిపల్లి గ్రామానికి పునరాసవం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ♦ ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలల్లో పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి రూ.4 కోట్లు వెచ్చించి 140 ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ హయాంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్... నేటికీ పట్టాలు పంపిణీ చేయలేదు. ♦ అర్హులైన పేదలకు ఇంటిపట్టాలు పంపిణీ చేయాలని విశ్వేశ్వరరెడ్డి సుదీర్ఘ పోరాటాలు చేశారు. ఉరవకొండలో వేలాది మందితో రోడ్డుపైనే ఎమ్మెల్యే బైఠాయించి అరెస్టు కావడంతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గింది. పట్టాల పంపిణీకి అధికారుల చేత సర్వే చేయించి జాబితాలు సైతం సిద్ధం చేశారు. మిగితా మండలాల్లో కూడా పేదలకు ఇంటిపట్టాల ఇవ్వాలని ఎమ్మెల్యే ఆయా తహసీల్దార్ కార్యాలయల వద్ద ధర్నాలు చేపట్టారు. దీంతో అర్హులను గుర్తించడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పోరాడి నిధులు సాధించాం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వం నిధులివ్వడం లేదు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు విడుదల కోసం ప్రభుత్వంపై ఎంతో ఒత్తడి చేశా. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండకు వచ్చి సాగునీటి కోసం ధర్నా చేపట్టారు. మా పోరాటల ఫలితంగానే రోడ్లు, పెన్నహోబిళం దగ్గర వంతెన, హంద్రీనీవా ద్వారా చెరువులు, డిస్ట్రిబ్యూటరీలకు సాగునీరు, జీబీసీ ఆధునికీకరణ పనులు జరిగాయి. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేస్తా.– వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ -
కరువు రైతుపై కనికరం లేని ప్రభుత్వం
‘‘కరువుతో రైతాంగం విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో కనీస మానవత్వంచూపాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది.’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతపురం రూరల్: ‘‘కరువుతో రైతాంగం విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో కనీస మానవత్వం చూపాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది.’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శరత్‌చంద్రారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వాతావరణ బీమా కింద దాదాపు రూ.300 కోట్ల ప్రీమియాన్ని రైతులు బ్యాంకులకు చెల్లిస్తే అందులో సగం కూడా బీమా రూపంలో రైతులకు అందడం లేదన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అదే జరిగితే లక్షల ఎకరాలు ఎందుకు బీళ్లుగా మారుతాయో సమాధానం చెప్పాలన్నారు. తీవ్ర కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు సహజ మరణాలుగా చూపించే ప్రయత్నం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు నీరివ్వకుండా కేవలం చెరువులు, కుంటలను నింపి రైతులను మభ్యపెడుతున్నారన్నారు. హంద్రీనీవా నీటిని కుప్పంకు తరలించే ఉద్దేశంతోనే అనంత రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడన్నారు. పీఏబీఆర్ కింద 50వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.500 కోట్లు కేటాయించారని.. టీడీపీ ప్రభుత్వం ఆధునికీకరణ పనులను నత్తనడకన సాగిస్తుండటంతో చాలా చోట్ల నీళ్లు వృథా అవుతున్నాయన్నారు. అదేవిధంగా తుంగభద్ర డ్యాం నీళ్లను తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలరంగయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజినేయులు, మానవ హక్కుల వేదిక బాషా, సరస్వతి, కేవీపీఎస్ నల్లప్ప పాల్గొన్నారు. -
ఏపీ బంద్: అనంతలో విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
-
హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోంది
-
‘రాజీనామాలు చేసే దమ్ము టీడీపీకి ఉందా’
సాక్షి, అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. దీక్షలు చేసే దమ్ము టీడీపీ ఎంపీలకు ఉందా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 24న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోందని విమర్శల వర్షం కురిపించారు. రైల్వే జోన్ తేలేని దద్దమ్మలు టీడీపీ నేతలని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు కారణమన్నారు. కేంద్రానికి ఆ అవకాశం ఇచ్చింది టీడీపీ అని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడు కూడా ఎన్డీయే భాగస్వామి, మిత్రుడే అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో సహా, ప్రజా సంఘాల మద్దతు కోరుతున్నామన్నారు. ఏపీ ప్రయోజనాలను మోదీ వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్టారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వేలాది మందిపై కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీకి ద్రోహం చేశాయని, వైఎస్సార్సీపీ ఎంపీల త్యాగం చారిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సారథి వైఎస్ జగన్ విభజన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటాన్ని వైఎస్సార్సీపీ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోందని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజల మనోభావాలు, వారికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో సుదీర్ఘంగా తమ నేతలు నిరసనలు తెలిపారన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు పదవికి రాజీనామా చేసి అమరణ దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీ ప్రజల హక్కులను కేంద్రం తిరస్కరించడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పును బీజేపీపైకి నెట్టి చంద్రబాబు జారుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్యాకేజీని చూసి అసెంబ్లీ సాక్షికి చంద్రబాబు, మంత్రులు స్వాగతించారని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుందని కేంద్ర మంత్రులను చంద్రబాబు సన్మానించారని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై స్పందించేలా చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. టీడీపీకి ఏపీ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఈ నెల 24న జరిగే ఏపీ బంద్‌కి వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
చంద్రబాబులో ధర్మం లేదు..పోరాటం లేదు
-
పంటలకు మద్దతు ధర ప్రకటించాలి
అనంతపురం: ‘‘పంటకు మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలన్నీ ఇళ్లలోనే మగ్గిపోతున్నాయి. విత్తనం వేసే సమయం వచ్చినా.. పంట అమ్ముకునే పరిస్థితి లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా ధరలు అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం మభ్య పెడుతోంది’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే యల్లారెడ్డిగారి విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని పంటలకు సాగు వ్యయం రెట్టింపైనా... కనీస మద్దతు ధర మాత్రం 10 శాతానికి మించి పెంచలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించినా..ఒక్క ఏడాది కూడా రూ.100 కోట్లు కేటాయించలేదన్నారు. రైతుల నుంచి పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... నేటికీ చాలామంది రైతులకు ఇంకా చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలు చేస్తామని చెప్పి... 3 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయి. విలేకరుల సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి కరువు జిల్లా. ప్రతి నాలుగేళ్లలో మూడేళ్లు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి. వేరుశనగ పంట సాగు చేసిన రైతులు సర్వస్వం కోల్పోయారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం గతేడాది ఎకరాకు రూ.21 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈసారి మరింత పెరిగింది. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసిన రైతులు రూ. 10–12 వేలు నష్టపోయారు. వ్యాపారుల ముసుగులో టీడీపీ నేతలు క్వింటాలుకు రూ. 3,600 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ. 5,500 విక్రయించి సొమ్ము చేసుకున్నారు.– అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ మోసకారి మాటలు ప్రభుత్వం మోసగారి మాటలతో కాలం వెల్లదీస్తోంది. కరువుతో పంటలు పండక రైతులు, కూలీలు వలసలు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో వెళ్లారంటూ స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు. దీన్నిబట్టి చూస్తే వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు అవినీతి, అక్రమాలపై ఉన్న ధ్యాస... ప్రజల సంక్షేమంపై లేదు. మహరాష్ట్రలో రైతుల స్ఫూర్తితో ఇక్కడా ఉద్యమాలు చేయాల్సి ఉంది.– వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ -
స్థలం ఉన్నా...పట్టాలిచ్చే నాథుడే లేడు
-
రాయదుర్గంలో మంత్రి కాల్వకు గట్టి ఎదురుదెబ్బ
-
కేశవ్.. రైతులపై కక్ష సాధింపా?
ఉరవకొండ: ‘‘ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. పదిరోజుల్లో ఇంటికి చేరేది.. ఆ లోపే బూదగవి చెరువు కోసమంటూ నీళ్లొదిలారు. చెరువు నిండడం ఏమోగానీ.. ఆ నీరంతా పొలాల్లో చేరడంతో రైతులు నిండా మునిగారు. లక్షలాది రూపాయల నష్టం జరిగింది.. ఓ ఎమ్మెల్సీకి ఆమాత్రం తెలియదా..? రైతుల కడుపుకొట్టడమే పయ్యావుల కేశవ్ నైజం’’ అంటూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. బుధవారం బూదగవి వద్ద చెరువుకు సమీపంలో నీటమునిగిన పప్పుశనగ పంటలను ఆయన పరిశీలించారు. వందల ఎకరాల్లో సాగుచేసిన పంట హంద్రీనీవా నీటితో మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓ దార్చిన ఎమ్మెల్యే అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత పంట బాగా పడిందని రైతులంతా సంతోషించారనీ, ఎకరాకు కనీసంగా రూ.50 వేల వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో హంద్రీనీవా నీళ్లు వదలాలని ఎమ్మెల్సీ కేశవ్ ఆదేశించడం దుర్మార్గమన్నారు. తమ మాట వినడం లేదనే రైతులపై కక్షట్టి పయ్యావుల కేశవ్ చేతికొచ్చిన పంటలను నీటిపాలు చేశారన్నారు. నీరువదులుతున్నట్లు తెలిసి తాను వారం క్రితమే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రోజులు నీటి సరఫరా నిలపాలని కోరానన్నారు. కానీ కేశవ్ అధికారులు, పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసి రైతులను దెబ్బతీయాలన్న కుట్రతో చెరువుకు నీళ్లు వదిలించారన్నారు. అధికారులు ఇప్పటికైనా నీటి సరఫరా ఆపితే కనీసం 50 ఎకరాల్లోని పంట అయినా రైతులకు దక్కే అవకాశం ఉందన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి అధికారులపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ తేజోనాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, ప్రధాన కార్యదర్శి ఈడిగ ప్రసాద్, కిసాన్ సెల్ నాయకుడు కాకర్ల నాగేశ్వరావు, మాన్యం ప్రకాష్, దుద్దేకుంట రామాంజినేయులు, మూలగిరిపల్లి ఓబన్న, గోవిందు, ఆంజినేయులు, రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, విడపనకల్లు మండల కన్వీనర్ బసన్న, గడేకల్లు పంపాపతి పాల్గొన్నారు. -
రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ కుట్ర
సాక్షి, అనంతపురం: చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను సాధించటంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటాలకు టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదన్నారు. జిల్లాలోని ఉరవకొండ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర పన్నారన్నారు. టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. మరో వైపు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ, బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీయేలో కొనసాగుతూనే నిరసన తెలియజేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ప్రజా సంక్షేమం కన్నా రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని తెలిపారు. -
చంద్రబాబు నాటకాలాడుతున్నారు
సాక్షి, అనంతపురం: కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం అసమర్థతపై నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్‌తో యుద్దమంటూ మీడియాకు లీకులిచ్చారని, తర్వాత ఎన్డీఏలో కొనసాగుతామని అధికారిక ప్రకటనలు చేయడం చూస్తే ఆయనకు రాష్ట్రం పట్ట ఉన్న అభిమానం ఏంటో అర్థమౌతోందని అన్నారు. ఓటుకు నోటు కేసులో బయట పడేందుకే ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడ్డారని ఆరోపించారు. విభజన హామీలతో పాటు, ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో సైతం విఫలమయ్యారని విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. తన అవినీతి బట్టబయలు అవుతుందనే చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయానికి తెలుగుదేశం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ న్యాయమైందేనని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమౌతుందన్నారు.