‘జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం’ | YSRCP Leaders Slams JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

‘జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం’

Published Tue, Jan 3 2017 6:08 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

‘జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం’ - Sakshi

‘జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం’

అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వైఎస్సార్‌ సీపీ నాయకులు విశ్వేశ్వర్‌ రెడ్డి, గుర్నాథ్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే జేసీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పిందని మండిపడ్డారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ పై నోరుజారితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

జేసీ దివాకర్‌ రెడ్డి ఊసరవెల్లి అని, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళతారని ఎద్దేవా చేశారు. జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం పొందారని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లాలో సోమవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో దళిత ఎమ్మెల్యే ఐజయ్యకు మైకు ఇచ్చేందుకు ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధంకావాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించింది చంద్రబాబేనని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement