సాక్షి, అనంతపురం: చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను సాధించటంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటాలకు టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదన్నారు. జిల్లాలోని ఉరవకొండ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర పన్నారన్నారు. టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు.
మరో వైపు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ, బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీయేలో కొనసాగుతూనే నిరసన తెలియజేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ప్రజా సంక్షేమం కన్నా రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment