
'బస్సు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: మడకశిర ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఉరవకొండ వైఎస్సార్ సిపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటన బాధాకరమని విశ్వేశ్వరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటనలో సహాయ చర్యల్లో పాల్గొనాలని జిల్లా వైస్సార్ సిపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘటనా స్థలికి రానున్నట్టు ఆయన తెలిపారు.