raod accident
-
హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం
-
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు అని తెలుస్తోంది. ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్‌కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు. -
ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. యువకుడి విషాదం!
మహబూబ్‌నగర్: మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా శివారులోని హైదరాబాద్ రోడ్డుపై కారు ఢీకొని శంకర్(శివ)(18) గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం, అప్పక్‌పల్లికి చెందిన శ్రీనివాసులు, అంజిలమ్మ కుమారుడు శంకర్ హైదరాబాద్ రోడ్డు వెంట ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందగా.. కారు నిలుపకుండా పారిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువకుడు నారాయణపేటలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోకరి తెలియజేశారు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో బీటెక్ విద్యార్థి విషాదం! -
మానవత్వమే అతడి పాలిట మృత్యువై..
మహబూబ్‌నగర్: మానవత్వమే అతడి పాలిట మృత్యువైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడితో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం ఇద్దరి జీవితాలను ఛిద్రం చేయడమే గాక.. వారి కుటుంబసభ్యుల ఆశలను సమాధి చేసింది. ఈ విషాదకర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి నర్సింహులు, ఎస్ఐ రమేష్ వివరాల మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవాజ్ (25) టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 11 నెలల కిందట వివాహం కాగా.. 10 రోజుల క్రితం కూతురు జన్మించింది. తన కుమార్తెను చూసేందుకు గురువారం మధ్యాహ్నం బైక్‌పై తన అత్తగారి ఊరైన జడ్చర్ల పట్టణానికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి కల్వకుర్తికి బయల్దేరగా.. మండలంలోని మార్చాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో హాలియా నుంచి కొత్తకోట మండలం కనిమెట్టకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ హెల్పర్ అశోక్ (30) ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నవాజ్‌ను గమనించి కాపాడే ప్రయత్నం చేస్తుండగా.. కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నవాజ్‌తో పాటు అశోక్‌కు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు. అశోక్‌ది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం. పాల వ్యాన్ డ్రైవర్ నర్సింహులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను కల్వకుర్తి మార్చురీకి తరలించారు. కాగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఇరువురి కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. పాలవ్యాన్ డ్రైవర్ నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కనిమెట్టలో విషాదఛాయలు.. కొత్తకోట మండలంలోని కనిమెట్టకు చెందిన చీర్ల నాగమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు అశోక్ కొంత కాలంగా గ్రామ సమీపంలోని ఓ డెయిరీ మిల్క్ ఫ్యాక్టరీకి చెందిన లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అశోక్ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవి కూడా చదవండి: బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుల దుర్మరణం! -
పాప పుట్టిన 13 రోజులకే.. తండ్రీకొడుకుల విషాదం!
సాక్షి, కరీంనగర్: ఆ కుటుంబంలో పాప జన్మించింది.. అందరూ ఆనందంగా ఉన్నారు.. వైద్యులు డిశ్చార్జి చేయడంతో ఇంటి పెద్ద తల్లీబిడ్డను ఇంటికి పంపించాడు.. తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలో వెళ్తుండగా ఇసుక లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. వీణవంక మండలంలోని మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి జ్యోతి డెలివరీ కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 14న పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే, జ్యోతికి ఇన్ఫెక్షన్ కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో జ్యోతి భర్త మొగిలి(45) తన భార్యాబిడ్డను ఆటోలో ఇంటికి పంపించాడు. కుమారుడు శివసాయి(12)తో కలిసి కూరగాయలు, పండ్లు, ఇంటి సామగ్రి తీసుకొని, తన సొంత ఆటోలో మామిడాలపల్లికి బయలుదేరాడు. మానకొండూర్ మండలంలోని రంగపేట వద్ద ఇసుక లారీ వేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మొగిలి, శివసాయి అక్కడికక్కడే మృతిచెందారు. లారీ పైనుంచి వెళ్లడంతో శివసాయి మృతదేహం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను చూసి, కన్నీరుమున్నీరుగా విలపించారు. న్యాయం చేయాలని ఆందోళన.. అనంతరం బంధువులు కరీంనగర్–జమ్మికుంట రహదారిపై ఆందోళన చేపట్టారు. మానకొండూర్, తిమ్మాపూర్ సీఐలు రాజ్‌కుమార్, ఇంద్రసేనారెడ్డిలు విరమించాలని కోరగా తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తీసేది లేదని తేల్చిచెప్పారు. ఈ సంఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఓవైపు పాప జన్మించడం, మరోవైపు ఇద్దరి ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ పరిస్థితిని చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతల పరామర్శ.. ప్రమాద విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఓదార్చారు. -
ఉపాధ్యాయురాలు విధులు ముగించుకుని ఆటోలో వెళ్తుండగా ఘటన.. తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్‌నగర్: కోయిలకొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి (40), జాయింట్ మెర్సి, పద్మప్రియ, లక్ష్మీమానస, సయబాసుల్తానా విధులు ముగించుకుని ఆటోలో మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా, పారుపల్లి స్టేజీ వద్ద పంది అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పద్మావతి మృతి చెందగా, నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇవి చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా.. -
విందుకు వెళ్తూ.. అంతలోనే ఇలా..!
మెదక్: నార్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ అహ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాలు. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పెంటపర్తి బాపురెడ్డి కుమారుని వివాహం ఇటీవలే జరిగింది. ఈమేరకు ఆదివారం రామాయంపేటలోని ఓ ఫంక్షన్ హాలులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బాపురెడ్డి తన బావ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్‌పేటకు చెందిన సిరికొండ లింగారెడ్డి, తోడల్లుడు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ముత్యాల వెంకట్రాంరెడ్డితో కలిసి కారులో జంగరాయి నుంచి రామాయంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో జప్తి శివునూర్‌వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి (55) అక్కడిక్కడే మృతిచెందగా, లింగారెడ్డి (48) రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన బాపురెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ ప్రమాదాలకు గురైన వాహానాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియక్ చేయించారు. ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని విలపించారు. ప్రమాదంలో మృతిచెందిన లింగారెడ్డి బీఆర్ఎస్ అంబర్‌పేట గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. ఏపీ యువతి మృతి
రోడ్డు ప్రమాదాల విషయంలో పోలీసులు.. ఎన్ని నిబంధనలు విధించినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, అధిక వేగం కారణంగా ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలి అయ్యారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నైలోని ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతుండగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగినులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతిచెందారు. కాగా, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆఫీస్ ముగిసిన తర్వాత.. వారు ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్లోనే ఓ యువతి మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇక, మృతి చెందిన యువతులు.. తిరుపతికి చెందిన ఎస్.లావణ్య (24), కేరళలోని పాలక్కడ్‌కు చెందిన ఆర్. శ్రీలక్ష్మీ (23)గా గుర్తించారు. వీరిద్దరూ హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్‌లో ఎనలిస్ట్‌లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 130 కి.మీల వేగంతో ఉందని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 2 Women Techies In #Chennai Run Over By Speeding Driver https://t.co/xBUo2vlpiD pic.twitter.com/5kcZgaSEXE — NDTV (@ndtv) September 15, 2022 -
ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్
సాక్షి,న్యూఢిల్లీ: బలవన్మరణాల సంఖ్యపరంగా దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యానికి బానిసకావడం, ఆర్థికంగా కుంగుబాటు, అనారోగ్యం ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది, కర్ణాటకలో 13,056 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా సూసైడ్లు మహారాష్ట్ర తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి. 53 నగరాల్లో మొత్తంగా 25వేలకుపైగా సూసైడ్ చేసుకున్నారు. 1.73 లక్షల యాక్సిడెంట్ మరణాలు గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.22 లక్షల ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల బ్యూరో తెలిపింది. యూపీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. 2020తో పోలిస్తే 2021లో మరణాలు 18.8 శాతం పెరగడం ఆందోళనకరం. చదవండి: గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా -
పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్‌లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి👇 జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా? -
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్‌కు తరలింపు
-
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
-
యానాం బాలయోగి బ్రిడ్జ్‌పై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలంలో యానం బాలయోగి బ్రిడ్జ్‌పై ఓ బైక్‌ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో చిన్నారి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిచారు. -
విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి చిన్నారులు మృతి
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తెర్లాం మండలం టెక్కలివలస వద్ద ఓ బైకును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..
జడ్చర్ల టౌన్: మరికొన్ని గంటల్లో పెళ్లి పీట లెక్కాల్సిన ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరుకున్నాడు. గురువారం ఉదయం జడ్చర్ల–మహబూబ్‌నగర్ 167వ నం బరు జాతీయ రహదారిపై ఈ విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్యశామ్యూల్ (34)కు వన పర్తి పట్టణానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ కల్వరీచర్చిలో వి వాహం కావాల్సి ఉంది. మధ్యాహ్నం అక్కడి సుదర్శన్ ఫంక్షన్హాల్లో విందుకు సైతం ఏ ర్పాట్లు చేశారు. అందులోనే వధువు తరఫు కు టుంబ సభ్యులు, బంధువులు విడిది చేశారు. పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు మరణ వార్తతో ఇంటి వద్ద విషాదంలో బంధువులు 15 నిమిషాల్లో వస్తానని చెప్పి.. గురువారం ఉదయం అందరూ పెళ్లికి సిద్ధమవుతుండగా 15 నిమిషాల్లో వస్తానంటూ వరుడు కారులో జడ్చర్లకు బయలుదేరాడు. ఏడు గంటలకు నక్కలబండ తండా సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన దండలను.. పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు వరుడు చైతన్య మరణ వార్త తెలియ డంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లి కో సం తీసుకొచ్చిన పూల దండలను మృతదేహా నికి వేయాల్సి వస్తుందని అనుకోలేదని బంధు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు
Gachibowli Road Accident: 2 Junior Artists Instagram Photos Viral: గచ్చిబౌలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి చెందారు.హెచ్‌సీయూ రోడ్లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఎన్. మానస(23), ఎం. మానస(21)లు స్పాట్లోనే మరణించారు. వీరితో పాటు కారు నడిపిన అబ్ధుల్ సైతం అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో కారు రెండు భాగాలుగా తునాతునకలైంది. దీన్ని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ప్రాణాలు నిలవలేదు. మృతుల్లో ఎన్. మానస స్వస్థలం (23) కర్ణాటక కాగా, ఎం. మానస(21)ది మహబూబ్‌నగర్ అని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్. మానసకు చెందిన ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి -
పీఏం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద రోడ్డుపై ఇద్దరి మృతదేహాలు
-
టిప్పర్ బోల్తా.. 13 మంది కూలీల దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుల్ధానాలోని సమృద్ది ఎక్స్‌ప్రెస్ హైవేపై టిప్పర్ బోల్తా పడిన ఘటనలో 13 మంది కూలీలు మృత్యవాత పడ్డారు. ఐరన్ లోడుతో వెళ్తున్న టిప్పర్‌పై కూలీలు కూర్చొన్నారు. టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడడంతో టిప్పర్‌పైన కూర్చొన్న కూలీలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి:వైఎస్సార్సీపీ కౌన్సిలర్ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం -
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8మంది దుర్మరణం
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రేన్‌ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు అదుపుతప్సి గుడిసెలోకి దూసుకెళ్లిట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో గుడిసెలో పది మంది నిద్రిస్తున్నారని, వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఎనిమిది మంది చనిపోయారని, మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారని అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్‌రాయ్ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పెర్కోన్నారు. -
అన్నదమ్ముల బైక్‌లు ఢీ: తమ్ముడి మృతి
సాక్షి, వైఎస్సార్ (కలసపాడు): విధి విచిత్రమంటే ఇదే. అనుకోకుండా సొంత అన్నదమ్ముల బైక్‌లు ఢీ కొనగా తమ్ముడు దుర్మరణం పాలైన ఘటన కలసపాడు మండల కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. కలసపాడులోని మస్తాన్, షేక్ పీరాంబీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు షేక్ షఫీ (27) విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. సిద్దుమూర్తిపల్లె సమీపంలో ఉన్న పాలకేంద్రంలో ఇతడి అన్న షేక్ షరీఫ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇతను కలసపాడులోని ఇంటికి బయలుదేరాడు. షఫీ వ్యక్తిగత పని నిమిత్తం చెన్నారెడ్డిపల్లెకు బయలుదేరాడు. ఎదురెదురుగా వస్తున్న వీరి బైక్‌లు పోరుమామిళ్ల రోడ్డులోని కోతి సమాధి సమీపంలోకి రాగానే ఢీకొన్నాయి. ప్రమాదంలో షఫీ అక్కడిక్కడే మృతి చెందగా, షరీఫ్‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడికి ఐదేళ్ల కిందట కలసపాడుకు చెందిన షేక్ షాహిన్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు. ఒక ఏడాది పాప ఉన్నారు. బక్రిద్ పండుగ రోజు చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో కుటుంబసభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. ఎస్ఐ రామాంజనేయులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
సాక్షి, రాజేంద్రనగర్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ లారీ వెనుక నుంచి ముగ్గరు వ్యక్తిలను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకట్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
కృష్ణాలో ట్రాక్టర్ ట్రక్ బోల్తా: నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విసన్నపేట మండలం ముతారాశి పాలెం చెందిన ఓ ట్రాక్టర్ ట్రక్ శనివారం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడకు తలించారు. 14 మంది కూలీలకు గాయాలు కాగా, వారిని విస్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ప్రమాద సమయంలో ఆ ట్రక్‌లో 18 మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా మామిడి కోతకు ట్రాక్టర్ ట్రక్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: అమలాపురంలో మహిళ దారుణ హత్య -
ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు సమాచారం. జల్గావ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొప్పాయిలతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద బోల్తా పడింది. దాంతో ట్రక్కులో ఉన్న కూలీల్లో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ట్రక్కులో మొత్తం 21 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ట్రక్కు బొప్పాయిల లోడుతో ధులే నుంచి చోప్డా మీదుగా రావేర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా రావేర్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని జల్గావ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కావాలనే యాక్సిడెంట్ చేశాడు.. బొటన వేలిని పరీక్షగా చూసి షాక్! -
విషాదం.. పెళ్లయిన ఆర్నెళ్లకే
సాక్షి, మంచిర్యాల : పెళ్లి సమయంలో చేసిన బాసలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన ఆ దంపతులు అంతలోనే మృత్యు ఒడిలోకి చేరారు. పెళ్లయిన ఆర్నెళ్లకే ఆ నవదంపతులను లారీ మృత్యురూపంలో కబళించింది. వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ వారి ఆశలను చిదిమేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మందమర్రి మండలం గద్దెరాగడి గ్రామానికి చెందిన రుద్ర రాజయ్య–పద్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు స్వరాజ్(30). ఇతడికి పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల శంకరయ్య కూతురు కృష్ణవేణి(23)తో గతేడాది జూన్ 11న వివాహమైంది. భార్యాభర్తలు గద్దెరాగడిలోనే ఉంటున్నారు. చదవండి :అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి.. ఈ క్రమంలో కృష్ణవేణి జిల్లాకేంద్రంలో కుట్టు నేర్చుకుంటోంది. స్వరాజ్ ఆమెను ప్రతిరోజూ కుట్టు శిక్షణ కేంద్రానికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి.. అనంతరం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం దంపతులిద్దరూ బైక్‌పై మంచిర్యాలకు బయల్దేరారు. ఏసీసీ అంబేద్కర్ కాలనీ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ.. వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవదంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై మారుతీ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: నిద్రిస్తున్నవారి పైకి దూసుకెళ్లిన ట్రక్కు..13 మంది మృతి మరో 15 రోజుల్లో ఉద్యోగం.. రాజయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. స్వరాజ్ ఒక్కడే కుమారుడు. స్వరాజ్ కొంతకాలం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేశాడు. రాజయ్య సింగరేణి ఉద్యోగి కావడం.. మెడికల్‌గా అన్‌ఫిట్ కావడంతో తన ఉద్యోగాన్ని కుమారుడికి పెట్టించాడు. అప్పటినుంచి స్వరాజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని ఇంటివద్దనే ఉంటున్నాడు. నెలరోజుల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. మరో 15రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు భద్రత వారోత్సవాల రోజే.. రోడ్డు భధ్రత వారోత్సవాల రోజే ఈ ప్రమాదం జరగడం కలకలం సృష్టించింది. స్వరాజ్ హెల్మెట్ ధరించినా ప్రమాద సమయంలో బెల్ట్ ఊడిపోయిందని, దీంతో హెల్మెట్ ఎగిరిపోయి లారీ దంపతుల తలలపై నుంచి వెళ్లడంతోనే మృత్యుఒడికి చేరారని స్థానికుల ద్వారా తెల్సింది. స్వరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సాక్షి, కృష్ణా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందువెళ్లుతున్న లారీని వెనక నుంచి ఢీకొట్టగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. గాయపడినవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేములువాడ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లాలోని మధిరకు చెందిన మాచర్ల శ్యామ్, శారద, శ్యామలగా పోలీసులు గుర్తించారు. కాగా, మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక వృద్దుడు ఉన్నారు. ఈ కారులో డ్రైవర్‌తో పాటు 9 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.