మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Marriage Party Tragedy-20 Killed As Truck Falls Off Sone River ridge | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Wed, Apr 18 2018 7:20 AM | Last Updated on Mon, Oct 8 2018 3:19 PM

Marriage Party Tragedy-20 Killed As Truck Falls Off Sone River ridge  - Sakshi

సంఘటనాస్థలంలో స్థానికులు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సిధి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ అమేలియా  ప్రాంతంలో జోగ్దాహా బ్రిడ్జిపై నుంచి సోన్‌ నదిలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు.

మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక జిల్లా కలెక్టర్‌ దిలిప్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల తక్షణ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement