marriage party
-
పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు
భోఫాల్: లాక్డౌన్ నిబంధనలను పక్కన పెట్టి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని జరిగింది. వివరాల ప్రకారం.. ఉమరి గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు సుమారు 300 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను రావడాన్ని గమనించి చాలామంది పారిపోయారు గానీ అందులో 17 మంది మాత్రం దొరికిపోయారు. ఇక పోలీసులకు దొరికిన వారికి శిక్షగా నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు. అనంతరం లాక్డౌన్ ఆంక్షలు పూర్తి అయ్యే వరకు ఇటువంటి ఉల్లంఘన చేయకూడదని వాళ్లని హెచ్చరించి వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌వీడియోలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు In Bhind "Baaratis" were made to do ‘Frog Jump’ for violating #CovidIndia-19 restrictions. The wedding was being organized, in violation of the lockdown restriction enforced in Bhind @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/QftxjTsFvL— Anurag Dwary (@Anurag_Dwary) May 20, 2021 -
సాంగ్స్‌తో ఆదరగొట్టిన బన్ని, నాని
టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, నాని స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలిసిన విషయమే. బన్ని ఓ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ బహుమతిగా ఇచ్చిన జాకెట్ ధరించి తాను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో తెలిపారు. అలాగే నాని కూడా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో స్నేహంగా వ్యవహరిస్తారు. పలు హీరోల చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వారి మధ్య స్నేహాన్ని వ్యక్తపరిచారు. కానీ ఇప్పడు బన్ని, నానిలు కలిసి ఓ వేడుకలో చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బన్ని, నానిల కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకలో వీరు ఇలా ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. బన్ని, నానిలు కలసి ఎటో వెళ్లి పోయింది మనసు’ చిత్రంలోని ‘ ప్రియతమా నీ వచట కుశలమా..’ అని పాడుతూ సందడి చేశారు. ఆ తర్వాత బన్ని ఆర్య2 చిత్రంలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమ..’కు పాటను ఆలపిస్తూ.. తన భార్య స్నేహరెడ్డితో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. నాని తన భార్య అంజనాతో కలిసి నిన్నుకోరి చిత్రంలోని ‘అడిగా, అడిగా..’ సాంగ్ పాడారు. బన్ని, నానిలు ఇలా పాటలు పాడుతుంటే అక్కడున్న వారంతా గోల చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడొచ్చు.. -
మ్యారేజ్ పార్టీలో సందడి చేసిన బన్ని, నాని జంటలు
-
తిరుపతి: పెళ్లికి పోతే దోచుకున్నారు !
తిరుపతి: నగరంలో శనివారం దొంగలు హల్చల్ చేశారు. స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలోకి ప్రవేశించిన దొంగలు పెళ్లి బృందం తెచ్చుకున్న నగలను చాకచక్యంగా దోచుకెళ్లారు. బాధితులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. మొత్తం 55 గ్రాముల బంగారంతో పాటు రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తోన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ప్రియా వారియర్ సందడి
ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సన్సేషన్‌గా మారారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ టీజర్లో సందడి చేసిన ప్రియా, ఆ సినిమా విడుదలకు ముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియాకు వచ్చిన ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఆ తర్వాత సినిమాలో ఆమె పాత్ర నిడివిని పెంచేలా రీ షూట్ చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవడానికి అభిమానులు సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు. తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఒరు అదార్ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్ మ్యారేజ్‌కు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంతమంది మాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ వివాహ వేడకలో ప్రియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పింక్ రంగు చీరలో పెళ్లికి హాజరైన ప్రియా మరోసారి అందరిని మాయ చేశారు. అంతే కాకుండా తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. సంజయ్ దత్ ఫేమస్ సాంగ్ ‘హవా హవా’ పాటను పాడుతూ.. చిన్నగా డాన్స్ కూడా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
-
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ అమేలియా ప్రాంతంలో జోగ్దాహా బ్రిడ్జిపై నుంచి సోన్ నదిలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక జిల్లా కలెక్టర్ దిలిప్ కుమార్ మీడియాకు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల తక్షణ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. -
ఏడడుగులు వేయకుండానే...
ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని ప్రేమను సార్థకం చేసుకోవాలనుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏడడుగులు వేయబోతున్నారు. ఆ మధుర క్షణాల్ని ఊహించుకుంటూ ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. అయితే విధి మరోలా తలచింది. యముని రూపంలో బస్సు దూసుకొచ్చింది వారి కలల్ని ఛిద్రం చేసింది. పెళ్లిదుస్తులు రక్తంతో తడిసిపోయాయి. వారి బంధానికి తాళికి ముందే నూరేళ్లు నిండింది. ► పెళ్లి వ్యాన్‌ను ఢీకొన్న బస్సు ► వధువు సహా 8 మంది మృతి, వరునికి తీవ్ర గాయాలు బెంగళూరు: పెళ్ళిబృందంతో వెళ్తున్న టెంపో వ్యాన్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో వధువుతో పాటు ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన గురువారం తెల్లవారజామున ఉత్తర కన్నడ జిల్లాలో సంభవించింది. భట్కళ తాలూకా అనంతవాడి సమీపంలో ఉన్న జాతీయ రహదారి– 66పై ఈ ఘోరం చోటు చేసుకుంది. టెంపో, బస్సులోని మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం పెళ్ళి జరగాల్సిన వధువు దివ్య కుడేర్కర్ (20), టెంపో డ్రైవర్ నాగప్ప గణిగార్ (45), టెంపోలో ఉన్న పాలాక్షి (42), బేబి (38), సుబ్రమణ్య(15), రుక్మిణి (65) సంఘటణ స్థలంలో తీవ్రగాయాలతో మృతి చెందారు. పూజా సేఠ్Š‡ అనే వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. వరుడు హరీష్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఉమేష్ వాల్మికి (35) కూడా మరణించాడు. దరిచేరని ప్రేమ వివాహం దివ్య, హరీష్‌లు ఇద్దరూ ప్రేమించుకుని ఇరు కుటుంబాలను పెళ్ళికి ఒప్పించారు. గురువారం ఉదయం ధర్మస్థలంలో పెళ్ళి జరగాల్సి ఉంది. వధూవరులు, బంధువులు టెంపోలో వెళ్తుండగా, ప్రమాదం ఎదురైంది. దివ్య మృతి చెందిన విషయం చెబితే తట్టుకోలేడని ఆ సంగతి హరీష్‌కు తెలియనివ్వలేదు. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. -
డాన్సు చేయనందని.. భార్యను పైనుంచి తోసేశాడు!
పెళ్లి జరుగుతుంటే తనతో పాటు డాన్సు చేయలేదని ఓ తాగుబోతు భర్త తన భార్యను మేడ మీద నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా చిల్లాఘాట్ పట్టణం సమీపంలోని డిఘ్వాట్ గ్రామంలో జరిగింది. దాంతో విశాఖ తివారీ (28) అనే ఆ మహిలకు రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆమె తలకు, ఉదరభాగంలోను కూడా గాయాలయ్యాయి. డిఘ్వాట్ గ్రామంలో జరుగుతున్న తన బంధువుల పెళ్లికి విశాఖ తన భర్తతో కలిసి వెళ్లింది. అక్కడ 'కలేవా' అనే తంతు జరుగుతుండగా ఆమె భర్త అజయ్ తనతోను, ఇతర అతిథులతోను కలిసి డాన్సు చేయాలని ఆమెను కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. దాంతో బాగా కోపం వచ్చిన ఆ భర్త.. ఆమెను మేడ మీద నుంచి కిందకు తోసేశాడు. అతడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలిస్తున్నారు. -
పెళ్లి విందులో మటన్ వడ్డించలేదని..
హైదరాబాద్: పెళ్లి విందులో మటన్ వడ్డింపు వ్యవహారం వధూవరుల బంధువుల మధ్య ఘర్షణకు దారితీసింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి సురభీ కాలనీకి చెందిన మణికంఠ వివాహం బాచుపల్లి మల్లంపేటకు చెందిన రజనితో ఈ నెల 18న మల్లంపేటలో ఘనంగా జరిగింది. గురువారం సురభీ కాలనీలోని పెళ్లికొడుకు నివాసం వద్ద విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక సురభీ కాలనీకి చెందిన ఒక యువకుడు తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ప్లేటు విసిరేశాడు. అతను విసిరిన ప్లేటు వెళ్లి పెళ్లి కూతరు తరఫు బంధువలపైన పడింది. ఆగ్రహానికి గురైన మల్లంపేట వాసులు అతన్ని తీసుకెళ్లి చితకబాదారు. దీన్ని గ్రహించిన స్థానికులు మల్లంపేట వాసులపై దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తమవారిని కొడుతున్నారని సురభీ కాలనీ వాసులు, తమ ఊరి వాళ్లను కొడుతున్నారని మల్లంపేట వాసులు ఆగ్రహాలకు గురై తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలు సర్దిచెప్పి పంపించివేయడంతో అర్ధరాత్రి దాటాక మల్లంపేటకు వెళ్లిపోయారు. కానీ.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం మల్లంపేట గ్రామం నుంచి సుమారు 30 మంది వివిధ వాహనాలలో వచ్చి సురభీ కాలనీ వాసులపై ఆకస్మాత్తుగా దాడికి దిగారు. కాలనీ పక్కనే రైల్వే ట్రాక్ ఉండటంతో కంకర్ రాళ్లతో దాడి చేయడంతో సురభీ కాలనీకి చెందిన సాయి, చిన్న, చంటి, నాగరాజ్, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్రగాయమవడంతో చరణ్ అనే వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా విషయంగా తెలుసుకున్న చందానగర్ ఎస్సై రామారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఘర్షణ తీవ్రంగా ఉండడంతో అదనపు సిబ్బందిని తీసుకొచ్చి ఇరువర్గాలకు చెందిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇరువర్గాలు ఒకరిపై కొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనంలో మంటలు
తొండంగి: పెళ్లి బృందంతో వెళుతున్న టాటా ఏస్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపేశాడు. దాంతో వాహనంలోని పెళ్లి బృందం కిందకి దూకి ప్రాణాలు దక్కించుకుంది. ఈ సంఘటన శుక్రవారం తుని మండలం తేటగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పెళ్లి వేడుక ముగించుకున్న 10 మంది ...విశాఖ జిల్లా చింతపల్లికి టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. ఆ క్రమంలో వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వాహనం మాత్రం పూర్తిగా తగలబడిపోయింది. -
పెళ్లి లారీ బోల్తా: 25మందికి గాయాలు
పెళ్లివేడుకకు బయలుదేరిన లారీ బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు. పెద్దపల్లి గ్రామానికి చెందిన మొగిళి శివయాదవ్‌కు బిజ్నాపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మితో ఆదివారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఉదయం మంగనూరు నుంచి బంధువులు లారీలో బయలుదేరి వస్తుండగా పెద్దపల్లి గ్రామ సమీపంలో బోల్తాపడింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలను గమనించిన లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు. ఈ సంఘటనలో పెళ్లి బృందంలోని నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో 20మందికి స్వల్ప గాయాలు కాగా వారికి స్థానికంగా చికిత్స చేయించారు. అయితే, వివాహ వేడుకకు ఎలాంటి ఆటంకం కలుగలేదు. -
పెళ్లి బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లికి రెండు బస్సుల్లో బయల్దేరిన బృందం ప్రమాదానికి గురైంది. ఈ బస్సులు నల్లగొండ జిల్లా పరిధిలో ఉండగా వాటిలో ఒక బస్సు డివైడర్ పైకి ఎక్కడంతో పల్టీకొట్టింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు తమ అన్నకొడుకు పెళ్లి కోసం బయల్దేరామని, ఇంతలో ఉన్నట్టుండి ఈ ప్రమాదం జరిగిందని, బస్సు మొత్తం తుక్కు తుక్కు అయినా అదృష్టవశాత్తు కొంతమంది గాయాలతోనే బయటపడ్డామని, ఎవరూ ప్రాణాలు మాత్రం కోల్పోలేదని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. గాయపడిన వారిని నల్లగొండ జిల్లా భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. -
పెళ్లి బృందం వాహనంపైకి దూసుకెళ్లిన ట్రక్
పెళ్లి చేసుకుని మరి కొన్ని ఘడియల్లో అంతవారింటికి వెళ్లవలసిన నవ వధువు ఇంటి విషాదం అలముకుంది. పెళ్లి చేసుకునేందుకు వరుడు ఇంటికి వెళ్తున్న వధువు కుటుంబ సభ్యుల బృందం వాహనంపైకి ట్రక్ దూసుకువెళ్లింది. ఆ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, నవవధువు తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గత అర్థరాత్రి జార్ఖండ్ రాష్ట్రంలో జంషెడ్‌పూర్‌లోని బ్రిది నుంచి మన్మన్ది కాలనీ వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటనతో స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్రక్‌పై దాడి చేసి తగలబెట్టారు. దాంతో ట్రక్ డ్రైవర్ పరారైయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రక్ బోల్తా: 14 మంది గాయాలు
కడప- చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళ్తున్న మిని ట్రక్ బోల్తా పడిన ఘటనలో 14 మంది గాయపడ్డారని రాయచోటి గ్రామీణ సీఐ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. జిల్లెలమందలో జరిగిన వివాహా వేడుకలకు హాజరై వారంతా స్వస్థలమైన నందలూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కడప-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో రోడ్డు బాగా వాలుగా ఉంటుందని, అందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నామని సీఐ వివరించారు. -
ట్రక్ బోల్తా: 14 మంది గాయాలు
కడప- చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళ్తున్న మిని ట్రక్ బోల్తా పడిన ఘటనలో 14 మంది గాయపడ్డారని రాయచోటి గ్రామీణ సీఐ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. జిల్లెలమందలో జరిగిన వివాహా వేడుకలకు హాజరై వారంతా స్వస్థలమైన నందలూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కడప-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో రోడ్డు బాగా వాలుగా ఉంటుందని, అందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నామని సీఐ వివరించారు.