డాన్సు చేయనందని.. భార్యను పైనుంచి తోసేశాడు! | wife refused to dance, husband pushes from rooftop | Sakshi
Sakshi News home page

డాన్సు చేయనందని.. భార్యను పైనుంచి తోసేశాడు!

Published Tue, May 16 2017 2:59 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

డాన్సు చేయనందని.. భార్యను పైనుంచి తోసేశాడు! - Sakshi

డాన్సు చేయనందని.. భార్యను పైనుంచి తోసేశాడు!

పెళ్లి జరుగుతుంటే తనతో పాటు డాన్సు చేయలేదని ఓ తాగుబోతు భర్త తన భార్యను మేడ మీద నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా చిల్లాఘాట్ పట్టణం సమీపంలోని డిఘ్వాట్ గ్రామంలో జరిగింది. దాంతో విశాఖ తివారీ (28) అనే ఆ మహిలకు రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆమె తలకు, ఉదరభాగంలోను కూడా గాయాలయ్యాయి. డిఘ్వాట్ గ్రామంలో జరుగుతున్న తన బంధువుల పెళ్లికి విశాఖ తన భర్తతో కలిసి వెళ్లింది. అక్కడ 'కలేవా' అనే తంతు జరుగుతుండగా ఆమె భర్త అజయ్ తనతోను, ఇతర అతిథులతోను కలిసి డాన్సు చేయాలని ఆమెను కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది.

దాంతో బాగా కోపం వచ్చిన ఆ భర్త.. ఆమెను మేడ మీద నుంచి కిందకు తోసేశాడు. అతడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement