జూబ్లీహిల్స్‌లో యువకుడి హల్‌చల్
బంజారాహిల్స్: ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి మితిమీరిన వేగంతో చెట్టుకు, డివైడర్‌కు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. వెస్ట్ మారేడ్‌పల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్ (27) రైల్వే ఆఫీసర్స్ కాలనీలో నివసించే తన స్నేహితురాలు (27)తో కలిసి శనివారం రాత్రి ఫిలింనగర్ సమీపంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఓ విందుకు హాజరయ్యాడు. ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఆ విందులో పాల్గొని మద్యం తాగారు. దయాసాయిరాజ్ మోతాదుకు మించి మద్యం తాగి ఇంటికి వెళ్లే క్రమంలో తన స్నేహితురాలిని తీసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు ఫంక్షన్ హాల్ నుంచి బెంజ్ కారు బయలుదేరాడు.
సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను, ఆ తర్వాత చెట్టును ఢీకొని రోడ్డుకు అవతల వైపు బోల్తాపడింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. చెట్టు విరిగిపడి డివైడర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు స్టేషన్‌కు తీసుకువచి్చన వీరిద్దరినీ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌కు యతి్నంచగా వీరు సహకరించలేదు.
3 గంటల పాటు పోలీసులను దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఠాణాలో న్యూసెన్స్ చేశారు. మద్యం మత్తులో స్టేషన్‌లో ఇద్దరూ వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు వీరికి శ్వాస పరీక్షలు నిర్వహించగా దయాసాయిరాజ్‌కు 94 ఎంజీ, యువతికి 73 ఎంజీ రక్తంలో ఆల్కహాలిక్ నమోదైంది. వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద సెక్షన్ విధించి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment