HYD: పోలీసుల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. మందుబాబుల పరుగులు | Drunk And Drive Cases Filed In Hyderabad, Bikers Tried To Escape From Police, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

HYD: పోలీసుల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. మందుబాబుల పరుగులు

Published Wed, Jan 1 2025 7:36 AM | Last Updated on Wed, Jan 1 2025 9:55 AM

Drunk And Drive Cases Filed In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్స్‌లతో సందడి చేశారు. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక, పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా మందుబాబులు మళ్లీ రోడ్ల మీదకు వచ్చి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు.  

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్‌ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 1184 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్‌ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు నమోదు కాగా.. సౌత్‌ ఈస్ట్‌ జోన్‌లో 192, వెస్ట్‌ జోన్‌లో 179 కేసులు, సౌత్‌ వెస్ట్‌ జోన్‌లో 179 కేసులు, నార్త్‌ జోన్‌లో 177 కేసులు, సెంట్రల్‌ జోన్‌లో 102 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని వెంగళరావు పార్క్‌ వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పోలీసుల టెస్టులో భాగంగా అతడికి 550 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. రోడ్ల మీద పోలీసుల తనిఖీలను చూసిన మందుబాబులు బైక్‌లను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement