Hyderabad Police
-
కాసుల కోసం కక్కుర్తి పడ్డారు.. కేసులు ఎదుర్కొంటున్నారు
-
హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన మేధా పాట్కర్
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ హఠాత్తుగా నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్ సమీపంలోని ఓ ఇంటికి ఆమె చేరుకోగా.. పోలీసులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్తారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేసిన ఇంటికి భారీగా చేరుకున్నారు. అయితే ఆమె స్నేహితుల ఇంటికి వచ్చానని చెప్పడం గమనార్హం. అయినప్పటికీ ఆమెను అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి పంపించేసినట్లు సమాచారం. -
చొరబాటు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్‌కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. అక్కడి అలజడులతో ఇక్కడ దడ... బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్‌కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి.. మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా... కాక్స్ టౌన్లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచి్చలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్బార్, రబీల్ ఇస్లాం పశి్చమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు.. ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశి్చమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బిహార్, జమ్మూ కశీ్మర్లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశి్చమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
HYD: పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్.. మందుబాబుల పరుగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్స్‌లతో సందడి చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక, పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా మందుబాబులు మళ్లీ రోడ్ల మీదకు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదు కాగా.. సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు, నార్త్ జోన్లో 177 కేసులు, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని వెంగళరావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పోలీసుల టెస్టులో భాగంగా అతడికి 550 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. రోడ్ల మీద పోలీసుల తనిఖీలను చూసిన మందుబాబులు బైక్‌లను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. -
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ స్పెషల్: ఆటోలు, కార్లలో ఉచిత ప్రయాణం!
సాక్షి,హైదారబాద్ : నగర వాసులకు శుభవార్త. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ సదుపాయాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులే క్షేమమే లక్ష్యంగా ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో తెచ్చినట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉండనుంది.మరోవైపు,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మంగళవారం(రేపు)హైదరాబాద్‌లో అర్దరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు కొనసాగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రేపు అర్ధరాత్రి 12:30 కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు చివరి స్టేజి వరకు అందుబాటులో ఉండనుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు మెట్రో రైలు విభాగం సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్,ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ , ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు,క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,మైనర్ డ్రైవింగ్ చెస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు రేపు రాత్రి 11నుండి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.న్యూఇయర్ వేడుకలపై మాదాపూర్ డీసీపీ వినీత్ సాక్షి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో భద్రత విషయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాం.మాదాపూర్ జోన్లో 61 ఈవెంట్స్ జరగనున్నాయి. 43పబ్స్ ఉన్నాయి. 20 కమ్యూనిటీ ఈవెంట్స్ జరగనున్నాయి.నిర్వాహకులు తప్పని సరిగా సమయం, నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఈవెంట్లో ఐడీకార్డ్‌లు తప్పని సరి.మైనర్లకి మద్యం సప్లయ్ చేయకూడదు. సౌండ్ ఎక్కువగా ఉండకూడదు.. స్థానికులను ఇబ్బందులు పెట్టొద్దు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి.కెపాసిటీ మేరకు మాత్రమే కస్టమర్స్ ను అనుమతించాలి. ప్రతి ఈవెంట్స్ లో అన్నీ ఏర్పాట్లు నిర్వాహకులు చూసుకోవాలి. భద్రత ,పార్కింగ్, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలి. క్యాబ్, టాక్సీ,ఆటో డ్రైవర్లకు సూచనలు ఇచ్చాం. డ్రంక్ అండ్ డ్రైవ్ రాత్రంతా కొనసాగుతుంది. తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు. డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంటుంది.న్యూ ఇయర్ ఎంజాయ్ చెయ్యాలి కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. -
పబ్‌లపై డేగ కన్ను
బంజారాహిల్స్: పబ్‌లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్ పబ్‌లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్ పబ్‌లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్ పబ్లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్‌లలో న్యూ ఇయర్ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్ నిర్వాహకులు న్యూ ఇయర్ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్‌ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్‌లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్‌కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్‌ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్ ముందు, పార్కింగ్ ప్లేస్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. పబ్‌లలో డ్రగ్స్ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అన్ని పబ్‌లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్‌లోనూ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నాలుగు పబ్‌లకు అనుమతి నో... జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే... జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పబ్‌లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసుల ఘాటు హెచ్చరికలు
-
సంధ్య థియేటర్ ఘటనపై 'హైదరాబాద్ పోలీసుల' హెచ్చరిక
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని పోలీసులు గుర్తించారు. దీంతో వారు అధికారికంగా ఒక హెచ్చరిక చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో రేవతి మరణం గురించి ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు.అల్లు అర్జున్ రాకముందే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్టుగా కొందరు తప్పుడు వీడియోలతో పోస్టులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఈ అంశంపై వారు ఇలా చెప్పుకొచ్చారు ' ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.ఈ విషయంలో పోలీసు శాఖ కీర్తిని తక్కువ చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.' అని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు …. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటన పై విచారణ…— Hyderabad City Police (@hydcitypolice) December 25, 2024 -
అజ్ఞాతంలో నటుడు మోహన్ బాబు?
జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుకు (Mohan Babu) తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పటివరకు పోలీసుల విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు (Hyd Police) సిద్ధమవుతున్నారు. కేసు నమోదైన ఫహడీ షరీఫ్ పోలీసులు.. ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.ఇంతకీ ఏం జరిగింది?మంచు మోహన్ బాబుని గత కొన్నిరోజులుగా కుటుంబ సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj) ఈయనపై దాడి చేశారనే రూమర్స్ తొలుత వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని.. మంచు కుటుంబంలో అంతా బాగానే ఉందని అన్నారు. కానీ తండ్రి-కొడుకు పరస్పరం హైదరాబాద్ ఫహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో మంచు ఫ్యామిలీలో గొడవ బయటపడింది. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు మోహన్ బాబు ఇంటి దగ్గరకు కొన్నిరోజుల క్రితం తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మాట్లాడే క్రమంలోనే జర్నలిస్ట్‌పై మోహన్ బాబు మైకుతో దాడి చేశారు. దీంతో అతడి తలకు గాయలయ్యాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) ఆదేశించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. తొలుత నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
అల్లు అర్జున్ అరెస్ట్: సోషల్ మీడియా పోస్ట్‌లపై పలు కేసులు
సాక్షి,హైదరాబాద్ : అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం, పలువురు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లపై పలువురు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులపై ఐటి యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది..?పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఎంట్రీ, ఎగ్జిట్లలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.అయితే, దిల్సుఖ్నగర్ శివలింగనగర్కు చెందిన మగుడంపల్లి భాస్కర్ (40) తన భార్య రేవతి (39), కొడుకు శ్రీతేజ్ (9)తో కలిసి 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమాకు వెళ్లారు. వీరు థియేటర్లోని లోయర్ బాల్కనీలో ఉండగా.. 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన భద్రతా సిబ్బంది ప్రేక్షకుల గుంపును తొలగిస్తూ ముందుకు రావడంతో రేవతి, శ్రీతేజ్ కిందపడిపోయారు. అప్పటికే రేవతి మరణించగా, స్పృహ కోల్పోయిన శ్రీతేజ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు
'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం ఇదే కేసులో హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం సంచలనం అయింది. కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకొచ్చాడు. అయినా సరే ఈ కేసు ఇంకా బలంగా బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)తాజాగా చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అలానే లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ అడిగారు.షోకాజ్ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్న కొన్ని అంశాలుసంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలుసంధ్య 70MM మరియు సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం.ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారుఅల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు.అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ , ఎగ్జిట్ ప్లాన్ చేయలేదు.అల్లు అర్జున్‌తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.టిక్కెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు.మరి ఈ అంశాలపై సంధ్య థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
బిగ్‌బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
అల్లు అర్జున్ అరెస్ట్.. టూమచ్!
హైదరాబాద్, సాక్షి: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను నగర పోలీసులు దాదాపు ధృవీకరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకుగానూ శుక్రవారం(నవంబర్ 13) మధ్యాహ్నాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే..అరెస్ట్ టైంలో పోలీసులు అతి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పోలీసులు వెళ్లిన టైంలో.. అల్లు అర్జున్ నైట్ దుస్తులతో ఉన్నారు. తమతో రావాలని కోరగానే.. డ్రస్ మార్చుకుంటానని అన్నారాయన. దీంతో బెడ్ రూం వరకు వెళ్లి డ్రస్ మార్పించి మరీ తీసుకెళ్లారు. ఆ టైంలో అరెస్ట్ సమయంలో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘బెడ్ రూంలోకి వచ్చి మరీ తీసుకెళ్లడం టూమచ్. ఉన్నపళంగా రావాలంటే ఎలా?. బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వరా?’’ అంటూ అల్లు అర్జున్ పోలీసులను నిలదీసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఏం చెప్పకుండా ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసుల హడావిడితో భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అవ్వగా.. ఆమెను అల్లు అర్జున్ ఓదార్చారు. ఇక.. తనయుడి వెంట అల్లు అరవింద్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని వాహనం నుంచి దించేశారు. ‘మంచైనా చెడైనా నాదేనంటూ..’ ఆ టైంలో అల్లు అర్జున్ , అరవింద్‌తో అన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండినాలుగు సెక్షన్ల కింద కేసుభారత న్యాయ సంహిత సెక్షన్లు 105, 118(1) రెడ్‌విత్ 3/5 కింద కేసు పెట్టారు. ఇందులో 105 నాన్‌బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం. ఈ కేసులో గనుక నేరం రుజువైతే కనీసం ఐదేళ్లు.. గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. అలాగే.. బీఎన్ఎస్ 118(1) సెక్షన్ చూసుకుంటే ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడుతుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య ధియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ కోసం భారీగా అభిమానులు ఎగబడటంతో సంధ్య థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా...ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సంధ్య థియేటర్ యజమానులలో ఒకరైన ఎం సందీప్‌ను, సీనియర్ మేనేజర్ నాగరాజు, లోయర్ బాల్కనీ మేనేజర్ విజయ్ చందర్ ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి.. తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ, అలాంటి నోటీసులేం జారీ చేయకుండానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.హైకోర్టులో పిటిషన్ ఉండగానే..ఈకేసుకు సంబంధించిన అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో ఉండగానే అరెస్ట్ కావడం గమనార్హం.మాకేం సంబంధం లేదు!తమకు సంబంధం లేకుండా, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో తప్పుడు కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ‘ప్రీమియర్ షో నిర్వహణ థియేటర్ యాజమాన్యం నిర్ణయం కాదు. చట్టప్రకారం గత నెల 29న ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రదర్శనపై మైత్రి డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర ప్రదర్శన సమయంలో థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ నెల 4, 5 తేదీల్లో బెనిఫిట్ షో కోసం గత నెల 30 నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, ఇతర ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున చిక్కడపల్లి పోలీసులకు, ట్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. .. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా భారీగా వచ్చిన అభిమానులతో తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు మహిళ మృతి ఘటన చోటుచేసుకుందే తప్ప ఇది హత్య కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేసింది కాదు. ఈ ఘటనలో మా ప్రమేయం ఏమీ లేదు. అయినా మేం దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో తదుపరి విచారణ నిలిపివేసేలా పోలీసులను ఆదేశించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించే 3 నక్షత్రాల హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్‌లు తప్పని సరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈవెంట్ నిర్వహించే ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 కింద తప్పని సరిగా ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు ప్రాంగణమంతా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. తగిన సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, అశ్లీలతకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఔట్‌డోర్‌లో ఉండే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకల్లా బంద్ చేయాలని, ఇండోర్‌లో ఒంటి గంట వరకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సామరŠాధ్యనికి మించి టిక్కెట్లు జారీ చేయడం వల్ల పలు రకాల ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు పార్కింగ్, ఇతర ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు నిరీ్ణత సమయం వరకే మద్యం ఉపయోగించాలని, ఈవెంట్‌కు వచ్చే కస్టమర్లు తిరిగి వెళ్లే సమయంలో డ్రైవర్లు, క్యాబ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కస్టమర్లను దూరంగా ఉంచాలన్నారు. ఆ రోజు రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ తెలిపారు. అగ్నమాపక శాఖ ఆదేశాల మేరకు ఫైర్ వర్క్స్‌ను ఉపయోగించరాదని సూచించారు. -
HYD: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.ఆరు ప్రత్యేక బృందాలతో హైటెక్ నేరగాళ్ల కోసం చేసి గాలింపు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా 18 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు ఆరెస్టు చేశారు.వీరిపై తెలంగాణలో 45కుపైగా సైబర్ క్రైమ్ కేసులు ఉండగా దేశవ్యాప్తంగా 319 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు,26సెల్ఫోన్లు,16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.సెక్స్టార్షన్,పెట్టుబడులు, కొరియర్ పేరుతో వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. తెలంగాణలో ఈ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.6.94 కోట్లు సైబర్ నేరాల ద్వారా కాజేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పోలీసులే షాక్ అయ్యేలా.. విశాఖ హానీ ట్రాప్ కేసులో -
అజ్ఞాతంలో హర్షసాయి.. స్పెషల్ టీమ్‌లు రంగంలోకి
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు కొనసాగుతోంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.గుడ్ మెసేజ్.. హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష, ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది. హర్షసాయి డెబ్యూ మూవీ ‘మెగా’ కాపీరైట్సే్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. డబ్బు కోసమే ఈ ఆరోపణలంటూ హర్షసాయి ఓ ప్రకటన విడుదల చేయగా.. ఆయన తరఫు లాయర్ కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలే అయితే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి కాగా, హర్షసాయిపై ఆరోపణలకుగానూ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. జానీ మాస్టర్ ఉదంతం వార్తల్లో ఉండగానే.. మరో డర్టీ పిక్చర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి తనను లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. దీంతో.. 328, 376(2)(n)354(ఆ)(ఇ) సెక్షన్ల కింద పోలీసులు హర్షపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. -
మోహన్‌బాబు ఇంట్లో చోరీ.. హౌజ్ బాయ్ అరెస్ట్
పహాడీషరీఫ్(హైదరాబాద్): సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జల్పల్లి గ్రామ శివారులో మోహన్‌బాబుకు నివాసం (మంచు టౌన్షిప్) ఉంది. ఇంటి ఆవరణలోనే వ్యక్తిగత కార్యదర్శులు, సెక్యూరిటీ సిబ్బంది, పనివారి కోసం వేర్వేరు గదులు సైతం ఉన్నాయి. ఈ నెల 22న మోహన్‌బాబు ఆదేశాల మేరకు పర్సనల్ సెక్రటరీ (పీఎస్) కిరణ్‌కుమార్ తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీ నుంచి రూ.10 లక్షల నగదు తీసుకొని రాత్రికి మంచు టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు. రాత్రి కావడంతో ఉదయాన్నే డబ్బులు మోహన్‌బాబుకు ఇద్దామని భావించి తన గదిలో ఉంచాడు. ఈ టౌన్‌షిప్‌లోనే అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి గ్రామానికి చెందిన గణేశ్ నాయక్ (24) హౌజ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కిరణ్ డబ్బులు తెచ్చిన విషయం ముందే తెలుసుకున్న గణేశ్ అతడు నిద్రపోయాక, తలుపు నెట్టి డబ్బులు కాజేసి పరారయ్యాడు. ఉదయాన్నే లేచి చూడగా డబ్బుతో పాటు గణేష్ కూడా కనిపించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అతడే డబ్బు తీసుకెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. మోహన్‌బాబు సూచన మేరకు కిరణ్ 23వ తేదీన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాచకొండ సీపీ సుదీర్‌బాబు సూచనలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి బుధవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద నుంచి రూ.7,36,400ల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్
గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం మంగళవారం (సెప్టెంబర్ 17) జరగనుంది. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు విధించినట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణం సౌకర్యార్థం ప్రజలు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను విస్తృతంగా వాడుకోవాలని చెప్పారు.ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించామని, రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపుకు ఏర్పాట్లు. సాయంత్రం 4గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుంచి వెల్లడించారు. ఇక శోభాయాత్ర మొదలైన రెండు గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జనాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ కోరారు.ఇదీ చదవండి : రేపే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా -
HYD: స్పా సెంటర్లలో రాసలీలలు.. ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మధురా నగర్ పీఎస్ పరిధిలో స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుండి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు.వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ నామోదర్, నాగరాజు, సతీష్‌లను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే, వీరు ముగ్గురు పీఎస్ పరిధిలోని స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లంచాలతోపాటుగా అక్కడి యువతులతో వీరు రాసలీలలకు కూడా పాల్పడుతున్నారని ఫిర్యాదు కూడా వచ్చాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.ఈ క్రమంలో సదరు స్పా సెంటర్లోకి ముగ్గురు కానిస్టేబుల్స్, మరో హోంగార్డ్ వెళ్లిన దృశ్యాలను పోలీసులు.. సీసీ కెమెరాల్లో పరిశీలించారు. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు. అలాగే, వారితోపాటు ఉన్న హోంగార్డ్ రాజును పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్‌పోర్టుకు పంపించి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
శభాష్ పోలీస్..!
మాడ్గుల: రాత్రివేళ.. రాష్ట్రంకాని రాష్ట్రం.. ఇద్దరు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని స్థితి.. ఆపై మొదలైన పురిటినొప్పులు... ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గస్తీ పోలీసులు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు. ‘డయల్ 100’ కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక మహిళల చేత దగ్గరుండి పురుడు పోయించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆమె సంబం«దీకుల సహకారంతో తల్లీబిడ్డలను హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి పంపించారు.ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో..: సోమవారం రాత్రి గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి ఈ విషయం చెప్పగా కంట్రోల్ రూం సిబ్బంది ఆ సమాచారాన్ని గస్తీ పోలీసులకు చేరవేశారు. దీంతో వారు తక్షణమే అక్కడికి చేరుకొని మహిళ వివరాలు కనుక్కున్నారు. తన పేరు కుమీ భాయ్ అని, కర్ణాటకలోని చెంచోలు మండలం పోలేపల్లి తమ గ్రామమని తెలి పింది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలతో వారం క్రితం ఇల్లు వదిలి వచ్చా నని పేర్కొంది. భర్త పేరు, ఫోన్ నంబర్ చెప్పగా పోలీసులు ఆ నంబర్‌కు కాల్ చేశారు. అతను ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.హైదరాబాద్‌లో ఉన్న భార్య తమ్ముడిని పిలిపించి అతని వెంట పంపాలని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనంత రం పోలీసులు తల్లీబిడ్డలకు ఆహారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండ గా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళకు పెట్రో కార్ అడ్డంపెట్టి స్థానిక మహిళల చేత అక్కడే పురుడు పోయించారు. తర్వాత ఆమె సోదరుడిని పిలిపించారు. తల్లీపిల్లలను మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కోఠి మెటరి్న టీ హాస్పిటల్‌కి పంపించారు. ఆస్పత్రిలో మాడ్గుల సీఐ నాగరాజు గౌడ్ ఆమెను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వం చాటుకున్న పెట్రో కార్ సిబ్బంది రాజేందర్, సురేశ్, సీఐ నాగరాజు గౌడ్‌ను రాచకొండ సీపీ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ డి.సునీతారెడ్డి అభినందించారు. -
శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
-
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
-
కుర్చీతాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు!
వెంగళరావునగర్(హైదరాబాద్): బూతు పురాణాలతో మరోసారి కుర్చీతాత రచ్చకెక్కాడు. గతంలో అనేకమార్లు ప్రముఖ యూట్యూబ్ స్టార్స్ స్వాతినాయుడు, వైజాగ్ సత్యపై దుర్భాషలాడి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. చివరకు క్షమాపణలు కోరుతూ కేసులు లేకుండా చేసుకున్నాడు. అయితే మళ్లీ అదే తరహాలో బూతులు మాట్లాడుతున్నాడని బాధితులు మంగళవారం మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాలు.. రహమత్‌నగర్‌కు చెందిన కాలా పాషా అలియాజ్ కుర్చీ తాత మహేశ్‌బాబు సినిమాలోని కుర్చీ పాట ద్వారా యూ ట్యూబ్‌లో ఫేమస్ అయ్యాడు. అయితే, యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ తీసే స్వాతినాయుడు, వైజాగ్ సత్యతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. అతని చెడు ప్రవర్తన కారణంగా వారు అతనిని దూరంగా ఉంచారు. దాంతో గతంలో వారిని తీవ్ర అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో బాధితులు జూబ్లీహిల్స్, తర్వాత మధురానగర్ పీఎస్‌లో కేసులు పెట్టారు. అనంతరం కుర్చీతాత వారితో రాజీ కుదుర్చుకున్నాడు. తాజాగా మళ్లీ తమను తిడుతున్నాడంటూ స్వాతినాయుడు, వైజాగ్ సత్యలు మంగళవారం మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత, మాజీ సీఎంలను, సినీరంగ ప్రముఖులను సైతం తిడుతున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
ప్రజాభవన్ ఎదుట రోడ్డుప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం
-
Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం
సోషల్ మీడియా వైరల్: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి. ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్‌లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Please dont be our Guest, our Service is Quite Complicated, Rest on you...#DontDrinkAndDrive#DrunkenDrives pic.twitter.com/9eEvjJhiU5 — Hyderabad City Police (@hydcitypolice) December 31, 2023 చదవండి: Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? -
మోస్ట్ వాంటెడ్‌గా నాడు తండ్రి.. నేడు కొడుకు
హైదరాబాద్: అప్పట్లో మహ్మద్ షకీల్ ఆమీర్ అలియాస్ బోధన్ షకీల్... ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్... హైదరాబాద్ పోలీసులు వాంటెడ్‌గా మారారు. 2007 నాటి నకిలీ పాస్పోర్ట్స్ కేసులో షకీల్, తాజాగా ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదం, తదనంతర నాటకీయ పరిణామాల కేసులో సాహిల్ నిందితులుగా ఉన్నారు. పదహారేళ్ళ క్రితం తండ్రి కోసం పరుగులు పెట్టిన సిటీ కాప్స్ ఇప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నారు. సాహిల్ దుబాయ్‌కి పారిపోవడంతో అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు గతేడాది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్ ఫైల్‌ను బయటకు తీస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టిన షకీల్... మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్‌పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్‌లో ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నగరంలో నమోదైన కేసులో బోధన్ షకీల్ నిందితుడిగా మారాడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్ కోసం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. కారు కేసులో కుమారుడి కోసం... నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ జరిగిన దాదాపు పదహారేళ్ల తర్వాత ‘బీఎండబ్ల్యూ కారు’ కేసు చోటు చేసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసు నుంచి సాహిల్‌ను తప్పించడానికి పోలీసులు ప్రయతి్నంచడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరారీలో ఉన్న సాహిల్ కోసం పంజగుట్టతో పాటు వెస్ట్‌జోన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తు అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. షకీల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నాటి కేసులోనూ గోల్మాల్ జరిగిందా? తాజాగా పంజగుట్ట పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కేసు గతేడాది నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు అశ్వతోష్ (రెండు నెలలు) మృతి చెందాడు. ఈ థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో సాహిల్‌పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రమాదానికి కారణమైన కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాపను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ ఉదంతం చాలా బాధాకరమంటూ జరిగిన విషయాన్ని తాను తన కజిన్‌తో మాట్లాడి తెలుసుకున్నానని షకీల్ పేర్కొన్నారు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. ఈ కేసులో పోలీసులు సైతం సాహిల్‌కు క్లీన్చిట్ ఇచ్చేశారు. తాజాగా పంజగుట్ట కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు నాటి జూబ్లీహిల్స్ కేసును తిరగదోడుతున్నారు. అప్పట్లో జరిగిన ప్రమాదంలోనూ సాహిల్ పాత్ర ఉందా? ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పశి్చమ మండల డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. -
హైదరాబాద్: పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ
సాక్షి, హైదరాబాద్: ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్.. అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు. దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్‌లో తాకట్టు పెట్టి హోటల్స్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, మిగిలిన ఆ డబ్బుతో మళ్లీ దొంగతనం చేయడానికి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి, ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ శంకర్ నాయక్. మహబూబ్‌నగర్‌కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు. అయితే రిమాండ్ చేసిన శంకర్ నాయక్ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్షతో -
హైదరాబాద్ పబ్స్‌పై పోలీసుల ఫుల్ ఫోకస్
-
హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలన పై స్పెషల్ డ్రైవ్
-
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చదవండి: TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
TS Election 2023: ఢిల్లీకి చేరిన ప్యానల్ జాబితా..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌పై ఆకస్మికంగా వేటు పడింది. దీంతో తక్షణ కొత్త కొత్వాల్ నియామకం అనివార్యంగా మారింది. ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానల్ లిస్ట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఈసీకి పంపారు. ఈ ముగ్గురిలో ఒకరిని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఎంపిక చేస్తుందా? లేక మరికొన్ని పేర్లు పంపాల్సిందిగా కోరుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా.. నేటి సాయంత్రానికి కొత్త కొత్వాల్ పేరు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హోదాలో ఉన్న సీవీ ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. సీనియారిటీ ప్రకారం ఆయన తర్వాత స్థానాల్లో జితేందర్ (1992 బ్యాచ్), సందీప్ శాండిల్య (1993 బ్యాచ్), విజయ్ ప్రభాకర్ ఆప్టే (1994 బ్యాచ్) ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆప్టే కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో అదే బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జితేందర్, సందీప్ శాండిల్య, శ్రీనివాస్‌రెడ్డి పేర్లతో రూపొందించిన ప్యానల్ లిస్టును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. గతంలోనూ ఐదు సందర్బాల్లో.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ పోస్టు అదనపు డీజీ క్యాడర్ అధికారికి సంబంధించింది. ఆనంద్ 2021 డిసెంబర్ 25 నుంచి నగర పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ఆయనకు ఈ ఏడాది ఆగస్టు 8న డీజీపీగా పదోన్నతి వచ్చినప్పటికీ ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించిన ప్రభుత్వం హైదరాబాద్ కొత్వాల్‌గా కొనసాగించింది. గతంలోనూ ఐదు సందర్భాల్లో డీజీపీగా పదోన్నతి పొందిన అధికారులు హైదరాబాద్ సీపీగా పని చేశారు. ఈ హోదాలో ఉన్న వారిని నగర కొత్వాల్‌గా నియమించిన దాఖలాలు లేవు. కేవలం ఈ పోస్టులో పని చేస్తూ, పదోన్నతి పొంది, ఎక్స్ క్యాడర్ పోస్టులో కొనసాగిన వారే ఉన్నారు. తెరపైకి కొత్త పేర్లు? ఆనంద్‌తో పాటు పదోన్నతి పొందిన వారిలో జితేందర్ కూడా ఉన్నారు. ఈయన గతంలో నగర ట్రాఫిక్ చీఫ్‌గా, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) పని చేసి ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన పేరును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందా? లేక అదనపు డీజీ హోదాలో ఉన్న మరో అధికారి పేరును పంపాల్సిందిగా కోరుతుందా? అనే సందేహం నెలకొంది. అలా కోరితే 1994 బ్యాచ్‌కే చెందిన బి.శివధర్‌రెడ్డికి జాబితాలో చోటు దక్కుతుంది. సందీప్ శాండిల్యకు దక్షిణ మండల డీసీపీ, సైబరాబాద్ సీపీ, రైల్వేస్ డీజీగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఏడీజీ ఆపరేషన్స్ హోదాలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘకాలంగా లూప్లైన్లోనే ఉన్నారు. ఎన్నికల సంఘం సీనియారిటీ, గతంలో చేసిన పోస్టులు, సమర్థత ఆధారంగా హైదరాబాద్ సీపీని ఎంపిక చేయాలని భావిస్తే కొత్తగా మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
బంజారాహిల్స్ లో 3.35 కోట్ల హవాలా నగదు పట్టివేత
-
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా.. శుక్రవారం పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలు కదులుతుండడంతో.. పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు రోడ్ల వెంట బారులు తీరాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచన చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో వెళ్లే వాహనాలు.. ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. నగరంలో నిన్న(గురువారం) ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం తర్వాత చాలాసేపు విగ్రహాల నిమజ్జనం జరగలేదు. సాయంత్రం నుంచి విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఇవాళ రెండో రోజూ కూడా ట్యాంక్‌బండ్‌లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. లిబర్టీ మీదుగా హిమాయత్ నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్.. కోరంటి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, లక్డీకాపూల్ వైపు భారీగానే ట్రాఫిక్ ఉంది. మరోవైపు ట్యాంక్‌బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై గణనాథులు బారులు తీశారు. మధ్యాహ్నాంలోగా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్‌కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
బేబీ సినిమాపై హైదరాబాద్ సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన). మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు. -
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్‌చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్‌లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
‘సిటీ పోలీస్’లో అటాచ్మెంట్లకు చెల్లు!
హైదరాబాద్: ఓ అధికారికి లేదా సిబ్బందికి ఉన్నతాధికారులు ఒక పోలీసుస్టేషన్లో పోస్టింగ్ ఇస్తారు. సర్దుబాట్లు, అప్పటి అవసరాల్లో భాగంగా ఆయన/వాళ్ళు మరో చోట పని చేస్తుంటారు. తాత్కాలిక ప్రాతిపదికన పని చేయాల్సిన వీళ్ళు నెలలు, ఏళ్ళ తరబడి అక్కడే ఉండిపోతున్నారు. ఫలితంగా వీరికి పోస్టింగ్ ఇచ్చిన ఠాణాలో సిబ్బంది కొరతో పని తీరు మందగిస్తోంది. సాంతికేంగా అటాచ్మెంట్గా పిలిచే ఈ విధానానికి నగర కొత్వాల్ సీవీ ఆనంద్ స్వస్తి పలికారు. దీనికి తోడు సిబ్బందికి కచ్చితంగా మూడు షిఫ్టుల విధానం అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీసు విభాగంగాలో పోలీసుస్టేషన్లను పరిధి, ప్రాధాన్యత తదితరాల ప్రాతిపదికన ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరీని బట్టే అందులో సిబ్బంది సంఖ్య ఆధారపడి ఉంటుంది. అటాచ్మెంట్ల కారణంగా పోలీసుస్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చిన వాస్తవ సిబ్బందికి, అక్కడ పని చేస్తున్న వారికి మధ్య పొంతన లేకుండా ఉంటోంది. ఈ ప్రభావం ఆ ఠాణాల పనితీరుపై పడి ఉన్న సిబ్బందిపై పని భారం తీవ్రంగా పెరుగుతోంది. ఏళ్ళుగా ఈ విధానం అమలులో ఉన్నా... ఇప్పటి వరకు ఉన్నతాధికారుల దృష్టికి రాలేదు. ఇటీవల జరిగిన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణతో మ్యాన్‌పవర్ ఆడిట్ నిర్వహించిన అధికారుల దృష్టికి ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాదాపు వంది మందికి పైగా సిబ్బంది అటాచ్మెంట్లపై వివిధ విభాగాలు, కార్యాలయాల్లో పని చేస్తున్నట్లు గుర్తించి వారిని వెనక్కు రప్పించారు. కచ్చితంగా ప్రతి రోజూ అదనపు సిబ్బంది అవసరమైన చోట ఉన్న సివిల్ కానిస్టేబుళ్ళకు బదులు ఏఆర్ సిబ్బందిని మోహరిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ అనుమతి లేకుండా శాంతిభద్రతల విభాగం నుంచి ఒక్కరిని కూడా అటాచ్‌మెంట్‌పై పంపకూడదని స్పష్టం చేశారు. మరోపక్క క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితంగా మూడు షిఫ్టుల విధానం అమలు పైనా కొత్వాల్ ఆనంద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. -
మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
థ్యాంక్యూ పోలీస్ అంకుల్..
హైదరాబాద్: ‘‘హాయ్ పోలీసు అంకుల్స్. మీరు సమయానికి స్పందించి నన్ను హాస్పిటల్‌కు తీసికెళ్లకపోతే నేను చచ్చిపోయేవాడినని మా మమ్మీ, డాడీ చెప్పారు. నన్ను కాపాడినందుకు అందరికీ థ్యాంక్యూ’’ అంటూ ఓ ఐదేళ్ల చిన్నారి ముద్దొచ్చే మాటలతో నారాయణగూడ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈనెల 13న దత్తానగర్‌కు చెందిన బాలుడు దివ్యాన్ష్ ఇంట్లో ఉన్న పెయింట్ టిన్నర్ తాగడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో అతడి పిన్ని ఏం చేయాలో తోచక డయల్–100కు కాల్ చేసి బోరున విలపించింది. తక్షణమే స్పందించిన పెట్రోకార్ కానిస్టేబుల్ రాజు, ప్రమోద్, హోంగార్డు బాసిత్ క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. బాలుడిని పెట్రోకార్‌లో ఎక్కించుకుని ఐదు నిమిషాల్లో కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందిస్తూ బాలుడిని అదే వాహనంలో నిలోఫర్‌కు తరలించారు. దాదాపు పదిరోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన దివ్యాన్ష్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పీఎస్‌కు వచ్చిన అతను ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఎస్ఐ నరేష్, ఆరోజు ప్రాణాలు కాపాడిన సిబ్బంది రాజు, ప్రమోద్, హొంగార్డు బాసిత్, తదితర సిబ్బందిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. -
Ambulance: అత్యవసరమైతేనే సైరన్ వాడండి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న అంబులెన్స్‌ల కారణంగా సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పేషెంట్లను తరలిస్తున్నవి మాత్రమే సైరన్ వినియోగించేలా ఆదేశాలు జారీ చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో అంబులెన్స్ అసోసియేషన్లు, ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అత్యవసర పేషెంట్లను తీసుకువెళ్లే అంబులెన్స్‌లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక ఫోన్ నంబర్‌తో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో(టీసీసీసీ) స్పెషల్ సెల్ అందుబాటులోకి తెచ్చినట్లు వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సైరన్లు వేసుకుని ఇష్టానుసారం దూసుకుపోతున్న అంబులెన్స్‌ల వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. దీనికోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అత్యవసరం కాని వాహనాలు, ఖాళీగా వెళ్తున్న అంబులెన్స్‌లతో పాటు మృతదేహాలను తరలిస్తున్న సమయంలోనూ కొన్ని అంబులెన్స్ లైట్లు, సైరన్లతో హడావుడి చేస్తూ ఇతర వాహనచోదకులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తేల్చారు. అనేక అంబులెన్స్‌లకు సరైన పత్రాలు, అనుమతులు లేవని, కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో ఉంటున్నారని వెలుగులోకి వచ్చింది. దీంతో సిటీలో సంచరిస్తున్న అంబులెన్స్‌లకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంపై ఓ విధానానికి రూపకల్పన చేశారు. ఆ అంశాలను రాహుల్ హెగ్డే ఈ సమావేశంలో ఆయా ప్రతినిధులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్న పేషెంట్లను తరలించడానికి ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పని చేసే దీనికోసం ప్రత్యేక సెల్‌ఫోన్ నంబర్ 8712660600 కేటాయించారు. అత్యవసర పేషెంట్లను తరలిస్తున్న లేదా వారి కోసం వెళ్తున్న అంబులెన్స్‌ల వివరాలను ఆస్పత్రులు లేదా నిర్వాహకులు ఈ సెల్‌తో పాటు ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ ఫోన్: 9010203626కు అందించాలని కోరారు. ఆస్పత్రుల నుంచి అందే వివరాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ ప్రయాణించే రూట్లోని జంక్షన్లను అప్రమత్తం చేస్తూ దాని ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడనున్నారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ ఎస్.రంగారావు తదితరులు పాల్గొన్నారు. సమన్వయం కోసం ప్రత్యేక నంబర్లు 87126 60600, 90102 03626 -
వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్‌పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాతంర చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు. షర్మిలను పరామర్శించిన విజయమ్మ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా? ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు. ఇదీ చదవండి: నాకు స్వేచ్ఛ లేదా?.. వైఎస్ షర్మిల -
అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నగరం వేదిక కానుంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. అంబేద్కర్ మనువడు ప్రకాష్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు ప్రకటించారు హైదరాబాద్ పోలీసులు. రేపు అంటే ఏప్రిల్ 14 శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంత్లాలో ఆంక్షలు అమలు చేయనున్నారు. దీంతో వాహనాల దారి మళ్లింపు ఉండనుంది. నెక్సెస్ రోడ్డు, ఖైరతాబాద్, లకిడీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు అమలు కానున్నాయి. నెక్లెస్ రోడ్డు - ఎన్టీఆర్ మార్గ్ - తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు లక్డీకాపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లింపు మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం. ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని నెటిజన్స్‌కు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. -
హైదరాబాద్: వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
-
వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. -
పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: తీన్మార్ మల్లన్నను మంగళవారం మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 20 మంది పోలీసులు పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి క్యూ న్యూస్ ఆఫీస్‌పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంపై తీన్మార్ మల్లన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ ఆఫీసును పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని మేడిపల్లి పోలీసులు లేదా మల్కాజిగిరి ఏసీపీ ధ్రువీకరించడం లేదు. కాగా, తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ల అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
చుట్టాల్లా వెళ్లి పట్టేశారు!
సాక్షి, సిటీబ్యూరో: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల తయారీ కేంద్రంలో పని చేస్తూ రూ.కోటి విలువైన వజ్రాభరణాలతో ఉడాయించిన కార్మికులను పట్టుకోవడానికి పోలీసులు వారి చుట్టాలుగా మారారు. ఇలానే పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో గాలించి నలుగురిని అరెస్టు చేశారు. నిందితులను అక్కడి కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై సొత్తుతో సహా సిటీకి తీసుకువచ్చినట్లు మధ్య మండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ పూర్ణచంద్రర్‌తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతోనే... పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిసర ప్రాంతాలకు చెందిన హిమాన్షు సర్దార్, మహదేబ్ సర్దార్, ఉత్తమ్ ఓఝా ఐదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలసచ్చారు. ఉప్పుగూడలోని లలితబాగ్‌లో ఉంటూ అబిడ్స్‌లోని ఆర్వీజే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారు. బంగారు, వజ్రాభరణాలు తయారు చేసే ఈ సంస్థకు గోపాల్ కృష్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరు కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాన్షు, ఉత్తమ్ కుటుంబీకులు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వీరికి పెద్ద మొత్తంలో నగదు అవసరమైంది. ఇదే కార్ఖానాలో పని చేసేందుకు మూడు నెలల క్రితం హౌరాకే చెందిన కార్తీక్ బాగ్ వచ్చాడు. కార్తీక్ సలహాతో... అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురూ అతడు ఇచ్చిన సలహా నేపథ్యంలోనే తుది మెరుగుల కోసం యజమాని ఇచ్చిన సొత్తుతో ఉడాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న గోపాల్ కృష్ణ రూ.కోటి విలువ చేసే 83 తులాల బంగారు ఆభరణాలు, 119 క్యారెట్ల వజ్రాలు, విలువైన రాళ్లు వీరికి అప్పగించాడు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు వీటిని తీసుకున్న నలుగురూ ఓ పెట్టెలో పెట్టుకుని మధ్యాహ్నం అక్కడినుంచి ఉడాయించారు. గోపాల్ కృష్ణ ఫిర్యాదుతో అబిడ్స్ ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ బి.ప్రసాదరావు, డీఐ బి.అభిలాషతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా నిందితులు నలుగురూ ట్యాక్సీ, బస్సుల్లో విజయవాడ వెళ్లి అక్కడ హౌరా వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. ఏ మాత్రం సమాచారం అందకుండా... దీంతో ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని గోపాల్ కృష్ణ ఇచ్చిన ఆధార్ కార్డుల ఆధారంగా గాలింపు చేపట్టారు. పోలీసుల రాకపై ఏ మాత్రం ఉప్పందినా నిందితులు పారిపోతారని భావించిన పోలీసులు ‘చుట్టాలుగా’ మారారు. తాము కార్తీక్ ఇంటికి వచ్చిన బంధువులమని, చాలా కాలం తర్వాత రావడంతో ఇల్లు గుర్తించలేకపోతున్నామని, అతడి ఫోన్ పని చేయట్లేదని స్థానికులకు చెప్పారు. అప్పటికే అతడు మిగిలిన ముగ్గురు నిందితులతో పాటు వచ్చి ఉండటంతో వీళ్లూ అతడి బంధువులై ఉండవచ్చునని భావించిన స్థానికులు స్పందించారు. ఇలా ఇంటిని గుర్తించిన టీమ్ స్థానిక పోలీసులను రప్పించి దాడి చేసింది. నలుగురు నిందితులతో పాటు సొత్తునూ స్వాధీనం చేసుకుంది. ఈ బృందాన్ని అభినందించిన డీసీపీ రివార్డు అందించారు. -
HYD: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్‌లు, శివారుల్లోని ఫామ్‌హౌజ్‌లపై పోలీసులు శనివారం రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒకవైపు.. మాదాపూర్‌లోని పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బర్డ్ బక్స్, హాట్కప్ పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. మొయినాబాద్ పరిధిలోని ఫామ్హౌజ్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ ఫామ్‌హౌజ్, ముషీరుద్దిన్, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్‌లపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ మూడు ఫామ్ హౌజ్‌లపై కేసులకు గానూ పదిహేను మంది అరెస్ట్ చేశారు పోలీసులు. -
హైగ్రేడ్ ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు ఎంతో తెలుసా? బంగారాన్ని మించిన ధర
సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్రాము బంగారం రేటు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటోంది. మహారాష్ట్రలోని ముంబై నుంచి సిటీకి సరఫరా అవుతున్న హైగ్రేడ్ ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు ఎంతో తెలుసా..? ఏకంగా గ్రాము రూ.10 వేలు. వ్యవస్థీకృతంగా ఈ డ్రగ్ నెట్వర్క్ నడిపిస్తున్న అంతరాష్ట్ర సరఫరాదారుడిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు పట్టుకున్నారు. ఇతడికి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ముంబైలోని అంథేరీ వెస్ట్ ప్రాంతంలో నివసించే మిరాజ్ కాజీ అక్కడి పబ్స్‌కు వెళ్లే క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. తానూ ఇదే దందా చేయాలని నిర్ణయించుకుని ఆ నగరంలో ఉన్న డ్రగ్ సప్లయర్ సూరజ్ గోస్వామితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతడి నుంచి హోల్‌సేల్‌గా కొంటూ ముంబైతో పాటు హైదరాబాద్‌లో ఉన్న అనేక మంది వినియోగదారులకు రిటైల్‌గా అమ్ముతున్నాడు. హైక్వాలిటీ ఎండీఎంఏ డ్రగ్‌ను గ్రాము రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి అందించడం కోసం 40 గ్రాముల ఎండీఎంఏ తీసుకున్న మిరాజ్ ఇక్కడకు చేరుకున్నాడు. దీనిపై హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రమేష్‌రెడ్డికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు తన బృందంతో నిఘా ఉంచారు. చార్మినార్ ప్రాంతంలో మిరాజ్ ఉన్నాడన్న సమాచారం అందుకుని వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గోస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతడి నుంచి ఈ మాదకద్రవ్యాన్ని సిటీలో ఎవరెవరు ఖరీదు చేస్తున్నారు? వాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో పాటు స్వా«దీనం చేసుకున్న డ్రగ్‌ను చార్మినార్ పోలీసులకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పు.. రూ. 50 వేలు ముంబైలోని మూతపడిన కర్మాగారాల్లో తయారవుతున్న ఎండీఎంఏ డ్రగ్ దేశ వ్యాప్తంగా అనేక మెట్రో నగరాలకు సరఫరా అవుతోంది. దీనికోసం ప్రత్యేకంగా నెట్వర్క్ పని చేస్తోంది. ఈ డ్రగ్‌ను తరలించే క్యారియర్లను ఒక్కో ట్రిప్పుకు రూ.50 వేల చొప్పున సరఫరాదారులు చెల్లిస్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు అరెస్టు చేసిన ఏడుగురు నిందితుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందిదని కొత్వాల్ సీవీ ఆనంద్ అన్నారు. ఏఓబీ టు ముంబై సింథటిక్ డ్రగ్స్ ముంబై నుంచి నగరంతో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ) నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి సరఫరా అవుతోంది. ఈ దందా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాకు ఈస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ముంబైలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన భార్యభర్తలు బిల్కిస్ మహ్మద్ సులేమాన్, అలీ సాగర్ సైఫుద్దీన్ రాంపుర్వాలా కొన్నేళ్లుగా గంజాయి దందాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఏడు, మరొకరిపై 15 కేసులు నమోదయ్యాయి. ఏఓబీలో గంజాయి పండించే శ్రీనివాస్ నుంచి గంజాయి ఖరీదు చేసే రకీబ్ అనే ముంబై వాసి అక్కడి విక్రయిస్తున్నాడు. బిక్విస్, సైఫుద్దీన్ తమకు పరిచయమైన జహీరాబాద్‌కు చెందిన ముర్తుజా షేక్ ద్వారా రకీబ్‌ను సంప్రదించారు. తమకు, గంజాయి పండించే వారికి మధ్య దళారిగా ఉండాలని కోరడంతో ఇతడు అంగీకరించాడు. శ్రీనివాస్ నుంచి ఖరీదు చేసిన 110 కేజీల గంజాయిని మంబై తరలించడానికి రకీబ్... అబ్దుల్ అనే వ్యక్తికి చెందిన కారు రూ.20 వేలకు అద్దెకు మాట్లాడుకున్నారు. ఈ సరుకు తీసుకురావడానికి అబ్దుల్ తన భార్య హసీనాతో కలిసి ఏఓబీకి వెళ్లాడు. శ్రీనివాస్‌ను కలిసి 110 కిలలో గంజాయి తీసుకొని కారు సీట్ కింద ప్యాకెట్ల రూపంలో దాచాడు. ముంబై వెళ్తూ ఇమ్లీబన్ దగ్గర ఆగి 20 కిలోలు జహీరాబాద్‌కు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ డి.సంతోష్ కుమార్‌కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేసి బిలి్కస్, సైఫుద్దీన్ , ముర్తుజా షేక్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
వలెంటైన్స్ డే అలర్ట్.. అడ్డుకుంటామంటున్న సంస్థలు
వలెంటైన్స్ డే బహిష్కరణ పిలుపులు... ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తామంటున్న కొన్ని సంస్థలు... ఈ పరిణామాల నేపథ్యంలో ఘర్షణలకు తావు లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌లు, యూనివర్సిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో అయిదు జోన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు దినసరి వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో అయిదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్స్, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. బౌన్సర్లకు గిరాకీ.. బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే.. వలంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్లర్లు కలిగిన సంస్థలు సైతం మంగళవారం ఒక్క రోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 60 శాతం బౌన్సర్‌కు, 40 శాతం ఆయా సంస్థలు/జిమ్‌లకు చెందుతాయి. చదవండి: ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. -
హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్.. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. మంగళవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గుప్తా, మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వివరాలు Ðð ల్లడిస్తున్న రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ► 2,500 మంది పోలీసులు, 250 మందితో సెక్యూరిటీ వింగ్ , 403 మంది ట్రాఫిక్ సిబ్బంది, 1091 మంది లా అండ్ ఆర్డర్, నాలుగు ప్లాటూన్ల టీఎస్ఎస్పీ బృందాలు, ఆరు ప్లటూన్ల ఆర్మ్డ్ సిబ్బంది, రెండు ఆక్టోపస్ టీంలు, మౌంటెడ్ పోలీస్, వజ్రా తదితర సిబ్బందితో భారీ బందోబస్తు. ►అలాగే ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, రెండు ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. స్టేడియం పరిసర ప్రాంతాలు, స్డేడియంలో, ప్రేక్షకులు కూర్చునే చోటు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కలిసి మొత్తం 300 సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ టీవీలతో గస్తీ.. ►సీసీ టీవీల దృశ్యాలను ఎప్పటికప్పుడు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూం. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో నిరంతర గస్తీ. ►పేలుడు పదార్థాలను గుర్తించేలా ప్రత్యేక టీంల ఏర్పాటు. బ్లాక్ టికెట్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నవారిపై ఇప్పటికే 4 కేసులు బుక్ చేశాం. చదవండి: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి ఎక్కడ మహిళలుంటే అక్కడ షీ టీం ►ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి వచ్చే మహిళల భద్రతకు ప్రాధాన్యం. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ షీటీంలు అందుబాటులో ఉంటాయి. వీఐపీలకే గేట్ నంబర్ వన్.. ఈసారి గేట్ నంబర్ వన్ను వీఐపీలకే అనుమతి ఉంటుంది. 12 నంబర్ గేట్‌ను గేట్ 1ఏగా గుర్తించి.. దాని ద్వారా జనరల్ పబ్లిక్‌ను అనుమతి ఇవ్వనున్నాం. భారీ వాహనాల దారి మళ్లింపు ►బుధవారం ఉదయం నుంచే ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు, సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలను దారి మళ్లిస్తాం. ►వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను చెంగిచెర్ల, మల్లాపూర్‌ల మీదుగా దారి మళ్లిస్తాం. సెల్ఫోన్లకు మాత్రమే అనుమతి ప్రేక్షకులు కేవలం సెల్ఫోన్లు తప్ప మరే ఇతర వస్తువులను స్టేడియంలోకి అనుమతి ఉండదు. ►తాగునీరు, తినుబండారాల విక్రయం ►తిను బండారాలు, తాగునీరు.. అన్ని రకాల ఆహార పదార్థాలను హెచ్‌సీఏ ద్వారా స్టేడియంలో విక్రయిస్తారు. ►సూచించిన రేట్లకే స్టాల్స్ నిర్వాహకులు వీటిని విక్రయించాలి. లేనిపక్షంలో పోలీసులు చర్యలు తీసుకుంటారు. సూచించిన స్థలాల్లోనే పార్కింగ్.. ►హబ్సిగూడ చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు, రామంతాపూర్ విశాల్ మార్ట్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు రోడ్డుకిరువైపులా ఎలాంటి వాహనాలను పార్క్ చేయొద్దు. ►కేటాయించిన స్థలాల్లోనే పార్కు చేయాల్సి ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చినవారు టీఎస్ఐఐసీ స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలి. ఏ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో సూచించే బోర్డులను ఏర్పాటు చేశాం. -
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ పార్టీ విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెప్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి.. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. ►వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ►ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. ►యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ►నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. చదవండి: New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో .. ►ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గలలో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్‌జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్‌నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్‌నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఎలాన్ స్పా పేరుతో బెజవాడ అభిలాష్ అనే వ్యక్తి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. పలువురు యువతులతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మసాజ్ థెరపిస్టుల పేరుతో మణిపూర్ తదితర ప్రాంతాలనుంచి యువతులను తీసుకొచ్చి వారిని సెక్స్ వర్కర్లుగా మార్చి ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. ముషీరాబాద్‌కు చెందిన బెజవాడ అభిలాష్(33)తో పాటు స్పా మేనేజర్ లిఖినా జవోమితో పాటు అయిదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. అభిలా‹Ùతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కస్టమర్లలో ఓ వైద్యుడు, ఓ చాక్లెట్ కంపెనీ వ్యాపారి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, వాస్తు కోర్సు చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో కొనసాగుతున్న స్పోరా స్పాలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడు చింతల స్వామిపై కేసులు నమోదు చేశారు. -
డ్రగ్ కేసు: గోవాలో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కేంద్రంగా దేశ్యావ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత 15 రోజులుగా ఎడ్విన్ కోసం గోవాలో పోలీసులు గాలిస్తుండగా.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రోజు రాత్రి వరకు అతన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. కాగా ఎడ్విన్ గోవా కర్లీస్ రెస్టారెంట్, పబ్ యజమాని. ఇక ఇదే కేసులో మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బోర్కర్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాదులో సరాఫరా చేస్తుంటాడు. ఇతను గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్నాడు. ఈ ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హెచ్–న్యూ ఆగస్టు 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అయితే నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాలో పలువురుపై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలోనే మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఎడ్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా.. -
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో హిందువుల మనోభావాలు కించపరిచేలా చిత్రీకరించారని వారు ఆరోపించారు. (చదవండి: దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు) ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలన్నారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. -
పీడీ యాక్ట్‌పై రాజాసింగ్ అప్పీల్ తిరస్కరణ
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ షాక్ తగిలింది. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది. ఈ కేసును నిశితంగా పరిశీలించి ఇరువర్గాల వాదోపవాదాలు విని విచారణ చేపట్టిన కమిటీ.. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థించింది. అంతేకాదు.. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో ఆయనకు ప్రతికూలంగా బోర్డు ఇవాళ తీర్పు వెలువరించింది. రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయని, అందులో 18 కేసులు కమ్యూనల్(మత సంబంధిత) ఉన్నాయని పోలీసులు కమిటీకి నివేదించారు. దీంతో హైదరాబాద్ పోలీసుల వాదనతో ఏకీభవించింది అడ్వైజరీ కమిటీ. -
ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?
సాక్షి, హైదరాబాద్: కాంబోడియా కేంద్రంగా చైనీయులు సాగించిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉండగా.. ఒకరికి ఢిల్లీలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చైనా, తైవాన్ జాతీయులు సహా మిగతా తొమ్మిది మందిని గురువారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న సన్నీ, సాహిల్‌లు హవాలా మార్గంలో దుబాయ్‌కు రూ.903 కోట్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో సన్నీ ద్వారా వెళ్లిన డబ్బు వరుణ్ అరోరా, భూపేష్ అరోరాలకు చేరినట్టు తేల్చారు. సన్నీని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. ఇక సాహిల్ హవాలా మార్గంలో పంపిన రూ.400 కోట్లు దుబాయ్‌లో ఎవరికి చేరాయన్నది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయంగా హైదరాబాద్ ఈడీ అధికారులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఎఫ్ఐఆర్, ఇతర వివరాలను తీసుకున్నారు. ఐబీ అధికారులు కూడా ఫోన్ చేసి పలు వివరాలను తెలుసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కమీషన్ల కోసం నిబంధనలను పాతర వేసి.. భారతీయ కరెన్సీని తీసుకుని విదేశీ కరెన్సీని ఇచ్చే ‘ఆథరైజ్డ్ మనీ చేంజింగ్ (ఏఎంసీ)’సంస్థలకు రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇస్తుంది. ఈ మనీ చేంజింగ్ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్‌పోర్ట్ వంటివి పరిశీలించి నగదును విదేశీ కరెన్సీలోకి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేసిన నవ్‌నీత్ కౌశిక్ ఈ నిబంధనలను పక్కనపెట్టేశాడు. కేవలం ఇద్దరు క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.903 కోట్లను డాలర్లుగా మార్చి ఇచ్చాడు. ఇందుకోసం రూ.1.8 కోట్లు కమీషన్‌గా తీసుకున్నాడు. అయితే ఇంత భారీగా మనీ చేంజింగ్ జరుగుతున్నా.. రిజర్వు బ్యాంకు, ఈడీ వంటివి పసిగట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఎందుకంటే మీరు తిరిగొచ్చేసరికి మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదముంది.’ అంటూ పోలీసులు నగర పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నేరస్తులు సైతం తెలివిమీరి సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ► మీరు ఊరెళుతున్న విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ► ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, వాటి డీవీఆర్లు బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి. ► సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ► బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపర్చుకోండి. లేదా ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. ► ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలి. ► కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబరులో సమాచారం ఇవ్వాలి. -
Ind Vs Aus- Uppal: రోహిత్, దినేష్ కార్తీక్ ఫోటోలతో హైదరాబాద్ పోలీసుల ట్వీట్
సాక్షి, హైదరాబాద్- Ind Vs Aus 3rd T20- Hyderabad: హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకోసం అప్పుడప్పుడూ పాపులర్ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు వివరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు క్రికెట్‌ను ఇందుకోసం వాడుకున్నారు. ఓ ట్రెండింగ్ ట్వీట్‌తో ముందుకు వచ్చారు. హైదరాబాద్ వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్, దినేష్ కార్తీక్‌కు చెందిన రెండు ఫోటోలను షేర్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో మొదటి ఫోటోలో రోహిత్ గ్రౌండ్లో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. When commuters follow traffic rules... #HelmetSavesLives #HyderabadCityPolice #wearhelmet #BeSafe #RoadSafety pic.twitter.com/DZwlQggJ6W — Hyderabad City Police (@hydcitypolice) September 26, 2022 రెండో దానిలో రోహిత్ దినేష్‌ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్ ఉంది. ఈ రెండిటిని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో షేర్ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్ చేశారు. -
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) ఘోర వైఫల్యంతో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది హెచ్‌సీఏ. అయితే.. ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం ఊపందుకుంది. అయితే తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్ సీపీ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్ జోన్ అడిషనల్ సీపీ చౌహాన్ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్లో లైన్లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు గురువారం ఉదయం ఎగబడ్డారు. వేలాది మందిగా ఎగబడిపోవడం.. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్‌కు దిగారు. ఈ క్రమంలో గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఈ పరిస్థితికి హెచ్‌సీఏ ఘోర వైఫల్యమే కారణమన్న విమర్శ వినిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. టికెట్ల అమ్మకంలో మొదటి నుంచి హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నా హెచ్‌సీఏ నుంచి స్పందన కరువైంది. అయితే.. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని మాట మార్చిన హెచ్‌సీఏ.. తర్వాత ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. హెచ్‌సీఏ సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొందనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. తొక్కిసలాట నేపథ్యంలో.. హెచ్‌సీఏ తీరుపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. -
గణేష్ ఉత్సవాలు: సీపీ ఆనంద్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: బందోబస్తు, భద్రత కోణంలో నగర పోలీసు విభాగానికి అత్యంత కీలకమైన గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఏమరుపాటుకు తావు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కొత్వాల్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని ఆడిటోరియంలో బుధవారం తొలి సన్నాహాక, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9న నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మండపాలు/విగ్రహాలు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం సిటీలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీల్లో అనేక మంది కొత్తవారు ఉన్నారు. వీరి గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం బందోబస్తు నిర్వహించడం తొలిసారి. ఈ నేపథ్యంలో ఆనంద్ ఈ సమావేశంలో వారిని ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ‘కోవిడ్ తర్వాత ఈ ఏడాది అనేక పండుగలు, ఇతర ఘట్టాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెమీ ఫైనల్స్ లాంటి వాటిని సమర్థంగా నిర్వహించాం. ఫైనల్ లాంటి గణేష్ బందోబస్త్‌లోనూ కచ్చితంగా రాణిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆనంద్ అన్నారు. మండపాల ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు స్థానిక పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కొత్వాల్ స్పష్టం చేశారు. ఇతర విభాగాలతో కలిసి సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని ఆనంద్ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి అభ్యంతరకర పోస్టులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు పి.విశ్వప్రసాద్, ఎం.రమేష్, ఏవీ రంగనాథ్, గజరావ్ భూపాల్, ఠాణాల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా.. నిమజ్జనానికి 3 రకాల కొలనులు సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నిర్వహణతో పాటు మరోవైపు విగ్రహాల నిమజ్జనాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడి విగ్రహాలను అక్కడే దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 75 కొలనుల్ని అధికారులు సిద్ధం చేయనున్నారు. కేవలం గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసమే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్మించిన 25 కొలనులున్నాయి. వీటిని బేబీ పాండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు అదనంగా మరో 24 ప్రీఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఆర్పీ (ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) పాండ్స్‌కు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీటికి ఒక్కో దానికి రూ. 10 లక్షలు వెచ్చించనున్నారు. వీటినే కృత్రిమ తటాకాలుగా కూడా వ్యవహరిస్తున్నారు. 20మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.35 మీటర్ల లోతులో ఉండే వీటిలో నాలుగడుగుల ఎత్తు వరకు విగ్రహాలను నిమజ్జనం చేయొచ్చు. వీటితోపాటు ఆయా ప్రాంతాల్లోని అవసరాలకనుగుణంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం మరో 26 ప్రాంతాల్లో చెరువులు తవ్వి, నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. వీటిని తాత్కాలిక నిమజ్జన కొలనులుగా వ్యవహరిస్తున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం ఇలా మూడు రకాల కొలనుల్ని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. నిర్వహణ లేక చెత్తా చెదారాలు పేరుకుపోయిన బేబీ పాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల కోసం తవ్వకాల పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. ఈ కొలనుల్లో వేసిన విగ్రహాలను ఎప్పటికప్పుడు బయటకు తీసి, తాజా నీరు నింపుతారని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆరు లక్షల మట్టివిగ్రహాలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలు కూడా వినియోగించనుండటంతో చెరువుల్లో నీరు కలుషితం కాకుండా ఉండేందుకు, నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ క్రైమ్ కేసులో నేరస్తులైన కొందర్ని బిహార్ నుంచి నగరానికి తీసుకువస్తుండగా ఆదివారం సాయంత్రం అక్కడి నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌కు చెందిన మిథిలేశ్ అనే వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి సైబర్ నేరాలకు పాల్పడి నగరంలోని పలువురిని నిండా ముంచాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 11న బిహార్‌లోని నవాడాకు వెళ్లారు. నేరగాళ్లు అక్కడే ఉన్నట్లు గుర్తించి నలుగుర్ని అరెస్టు చేసి తీసుకు వస్తుండగా వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు సురక్షితంగా తప్పించుకున్నారు. కాగా, అప్పటికే పోలీసులు మిథిలేశ్ నుంచి రూ.1.22 కోట్లు నగదు, 3 లగ్జరీ కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: రిక్షా డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ -
Freedom Run: ‘డీజే టిల్లు’ పేరు వీళ్ల స్టైలే వేరు.. సోకేమో హీరోల తీరు కొట్టేది తీను మారు!
సాక్షి, సిటీబ్యూరో: ‘డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు’ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ప్రాంగణంలో గురువారం ఉదయం ఈ పాట మారు మోగింది. ఏదైనా దావత్లోనే, వ్యక్తిగత పార్టీలోనో డీజే టిల్లు సినిమాలోని ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తే తప్పులేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహించిన అధికారిక ఫ్రీడమ్ రన్లో వినిపించడం విమర్శలకు తావిచ్చింది. ఈ తీన్మార్ పాట కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సాక్షిగా విద్యార్థులు పాల్గొన్న ఫ్రీడన్ రన్ అపహాస్యమైంది. అన్నింటిలోనూ జాగ్రత్తలు తీసుకున్నా... వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి నగర పోలీసులు నడుం బిగించారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలు చేరేలా చేయడంతో పాటు చిన్నారులతో కలిసి గాంధీ చిత్రాన్ని చూస్తూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. సిటీ పోలీసులు గురువారం తెల్లవారుజామున ఐసీసీసీ వద్ద ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఫ్రీడమ్ రన్’ నిర్వహించారు. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 4 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి పంపిణీ చేసిన టీ–షర్టుల విషయంలోనూ పోలీసు విభాగం జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై నగర పోలీసు లోగో, జాతీయ పతాకంతో పాటు వజ్రోత్సవాల లోగో కూడా ఉండేలా డిజైన్ చేశారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంగా ఇలా తయారు చేయించారు. వారించే లోపే చేయి దాటిపోయింది... ఫ్రీడమ్ రన్ నిర్వహణ బాధ్యతల్ని దీపక్ అనే ఈవెంట్ మేనేజర్‌కు అప్పగించారు. ఇతగాడు రన్లో పాల్గొనే వారిని ఉత్సాహపరచడానికంటూ జుంబా ట్రైనర్ రఫీఖ్ను రంగంలోకి దింపాడు. ఈయన అంత మంది విద్యార్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చూసిన రఫీఖ్ విచక్షణ కోల్పోయాడు. తాను ఏ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నది మర్చిపోయి రన్ ప్రారంభానికి ముందు వామ్ అప్ అంటూ డీజే టిల్లు పాట పెట్టాడు. ఆ మ్యూజిక్కు తగ్గట్టు అధికారులతో పాటు నాయకులనూ∙స్టెప్పులు వేయాలని ప్రేరేపించాడు. విద్యార్థుల ముందు జరుగుతున్న ఈ తతంగాన్ని గమనించిన ఉన్నతాధికారులు వారించే ప్రయత్నం చేసే లోపే రాజకీయ నాయకులు జోష్‌లో ముగినిపోయారు. దీంతో చేసేది లేక అధికారులూ వారితో జట్టు కట్టాల్సి వచ్చింది. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. (చదవండి: ప్రగతిభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం) తమను తాము తక్కువ చేసుకోవడం కాదా? ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ సమయంలో పోలీసు అధికారులు తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. నగరంలో ఏదైనా కీలక ఘట్టం, వాణిజ్య సముదాయాలు/సంస్థల ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలకు వాటి యజమానులు పోలీసులను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. వీళ్లే తమ బ్రాండ్ అంబాసిడర్లు అని వాళ్లు భావిస్తుంటారు. అయితే పోలీసులు మాత్రం వాళ్లు నిర్వహించే కార్యక్రమాలకు సినీ రంగానికి చెందిన లేదా ప్రాచుర్యం ఉన్న ఇతర రంగాలకు చెందిన వారిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ ధోరణి మరీ పెరిగిపోయింది. పోలీసుల కార్యక్రమాలను ఉన్నతాధికారులే స్పెషల్ అట్రాక్షన్ అవ్వాల్సి ఉండగా ఎదుటి వారి కోసం వెంపర్లాడుతూ, తమ కార్యక్రమాలను కలర్‌ఫుల్ చేయడానికి సినీ తారల అపాయింట్మెంట్స్ కోసం తమను తాము తక్కువ చేసుకుంటున్నది స్పష్టమవుతోంది. తొలినాళ్లల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు ప్రతి అంశానికీ విస్తరించింది. అధికారిక బ్యాండ్ ఎందుకు వాడరు? పోలీసు విభాగానికి సొంతంగా ఓ బ్యాండ్ ఉంటుంది. సుశిక్షితులైన ఈ సిబ్బంది సేవలను పాసింగ్ ఔట్ పెరేడ్స్తో పాటు గణతంత్య్ర, స్వాతంత్య్ర వేడుకల సమయంలోనూ వినియోగించుకుంటూ ఉంటారు. గతంలో కొందరు ఔత్సాహికులు వారి ఇళ్లల్లో జరిగిన వివాహాలకు వీరిని బుక్ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు ప్రత్యేక సందర్భాల్లో ఈ బ్యాండ్ దేశభక్తిని పెంపొందించే పాటల్ని ఆలాపిస్తూ కార్యక్రమాలు నిర్వహించేది. దేశభక్తిని ప్రదర్శించాల్సిన ఫ్రీడమ్ రన్ వంటి వేదికల వద్దే కాదు... పోలీసు అధికారిక కార్యక్రమాల్లో వీరి సేవలను వాడుకుంటే సముచితంగా ఉండేది. ఈ విషయం మర్చిపోతున్న అధికారులు ఈవెంట్ మేనేజన్లు, డీజే నిర్వాహకులు తదితరుల వెంట పడుతుండటంతోనే ఇలాంటి అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. (చదవండి: వాట్సాప్‌లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్) -
వజ్రోత్సవాల్లో భాగంగా సీసీసీ వద్ద 5కె రన్ (ఫొటోలు)
-
‘టిల్లు’ సాంగ్‌కు డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు
హైదరాబాద్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ నిర్వహించారు. సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ 5కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు. డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు దీనిలో భాగంగా టీజే టిల్లు సినిమా సాంగ్‌కు సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. బీట్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థమవడం లేదు. అప్పటి వరకు భగభగమంటున్న సూర్యుడు మాయమైపోయి.. ఒక్కసారిగా మేఘాలు కమ్మేస్తున్నాయి. వర్షం దంచికొడుతుంది అని అనుకునేలోపు అనూహ్యంగా మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో ఊహించని మార్పులతో నగర ప్రజలకు తికమకపడుతున్నారు. భారీ వర్షం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మూడు గంటలపాటు వర్షం కొనసాగే అవకాశం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనరగ్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్ చిలుకానగర్, రామంతపూర్, మణికొండ, పుష్పాలగూడ, కాటేదాన్, రాజేంద్రనగర్, నార్సింగి, అత్తాపూర్, గండిపేటలో వాన పడుతోంది. ఆఫీసులకు, విద్యాసంస్థలకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడుతుండటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. Heavy rain lashes city. #HyderabadRains #rain #weather @balaji25_t @HYDmeterologist @TS_AP_Weather @Hyderabadrains @swachhhyd @HiHyderabad @Hyderabad_Bot @Weather_AP pic.twitter.com/7t8VODq1xH — Mohammed Farzan Ahmed (@FarzanHyderabad) August 2, 2022 ట్ట్రాఫిక్ పోలీసులు సూచన హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు వర్ష సూచన చేశారు. నగరంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉందని జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, వర్షం తగ్గిన తర్వాతనే బయటికి రావాలని తెలిపారు. వర్షం పడుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పేర్కొన్నారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని, కావున ముందే కొన్ని ముఖ్యమైన రోడ్లలో ఇతర మార్గాలలో వెళ్లాలని చెప్పారు. Wake up call for the day - thunder & lightening accompanied with a down pour! #HyderabadRains #GoodMorning pic.twitter.com/UtX0UMmitG — Atulmaharaj (@Atulmaharaj) August 2, 2022 -
Hyderabad Police: జోకులేస్తే షాకులిస్తారు!
సాక్షి, హైదరాబాద్: ఓ నెటిజనుడు ట్విట్టర్ వేదికగా పోలీసులపై జోకు పేల్చాడు. దీనికి తమదైన శైలిలో స్పందించిన నగర పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. ఈ పోస్టు ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. చికోటి ప్రవీణ్ వ్యవహారంతో గడిచిన కొన్ని రోజులుగా పేకాట, క్యాసినోలు వార్తల్లో నిలిచాయి. రాష్ట్రంలో అన్ని రకాలైన జూదాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు నెటిజనుడు ట్విట్టర్లో నగర పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి ఓ ప్రశ్న సంధించాడు. ‘సర్ మా ఇంట్లో మేము పేకాట ఆడుకోవచ్చా? అది చట్టబద్ధమేనా? నియమ నిబంధనలు వివరిస్తారా?’ అని పోస్టు చేశాడు. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసు సోషల్‌మీడియా టీమ్ నగర పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘సర్ మీ ఇంటికి సంబంధించిన పక్కా లొకేషన్ తెలుసుకోవచ్చా?’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో.. కొద్దిసేపటికే సదరు నెటిజనుడు తన హ్యాండిల్ నుంచి పోస్టును తొలగించాడు. చదవండి: ఒకే మహిళను రెండోసారి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు, కట్నం వద్దంటూనే -
హైదరాబాద్: ఇంట్లోనే వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట సర్వోదయనగర్ కాలనీకి చెందిన నిర్వాహకురాలు వాసిరెడ్డి సుధారాణి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకురాలు సుధారాణి, దిల్సుఖ్నగర్ కృష్ణానగర్‌కాలనీకి చెందిన విటుడు గట్ల రాజు (37)తో పాటు ఓ యువతిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సుధారాణి గతంలోనూ ఇదే కేసులో పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. కోర్టు భవనం -
Hyderabad: యువతిపై ప్రేమ.. అప్పటికే పెళ్లి నిశ్చయమైందని తెలిసి..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి ఓ యువతి కుటుంబసభ్యులకు, ఆమెకు కాబోయే భర్తకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లాకు చెందిన జాతావత్ సిద్ధూ (22) ప్రైవేట్ ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఇష్టపడ్డాడు. అయితే, అప్పటికే ఆమెకు పెళ్లి నిశ్ఛయమైంది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న సిద్ధూ నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి యువతి కుటుంబ సభ్యులకు అనేక ఫోన్ నంబర్ల నుంచి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. యువతి పెళ్లి ఆగిపోవాలని, అప్పుడు ఆమెను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబసభ్యులకు తరచూ అసభ్యకర మెసేజ్‌లు రావడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మాదాపూర్: ఓయో రూంలో వ్యభిచారం చేస్తూ..
మాదాపూర్(హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్న హైటెక్ టవర్ హోటల్ 4వ ఫ్లోర్ గది నంబర్ 401లో ఇద్దరు వ్యక్తుల సాయంతో దాడి చేశారు. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు అందులో ఓ మహిళ ఇతరులతో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బిహార్‌కు చెందిన అజిత్భగత్(25), ఓ కంపెనీలో హౌస్‌కీపింగ్ పనిచేస్తున్నాడు. అమీన్పూర్ బీరంగూడకు చెందిన పట్లోళ్ల రాహూల్‌రెడ్డి (24), ప్రైవేటు ఉద్యోగి. పశ్చిమ బెంగాల్‌కి చెందిన నున్నిహర్ ఖాతున్ ఫలెజ్ అలీ(34)కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వీరితో కలసి అర్జున్ అలియాస్ కమలాకర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి పలువురిని పిలిపించుకుని అజిత్ భగవత్ సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ సంఘటనలో అర్జున్ పరారీలో ఉండగా పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సోదాలో రూ.1010 నగదు, తదితర సామగ్రితో పాటు రెండు సెల్పోన్లు, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు -
మహిళ అక్రమ నిర్బంధం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: విచారణ పేరుతో వ్యాపారవేత్త భార్యను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో అయిదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో తనను అక్రమంగా నిర్బంధించారని మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు.. హైరదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు 2019లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే సోదాల సమయంలో శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డని అధికారులు అక్రమంగా నిర్బంధించారు. ఫిబ్రవరి 27, 2019 రోజున తనను సెర్చ్ ఆపరేషన్ పేరుతో అధికారులు నిర్బంధించారని జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. అయిదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా, ఆనంద్ కుమార్, శ్రీనివాస్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బొల్లినేని గాంధీ , చిలక సుధా సస్పెన్షన్‌లో ఉన్నారు. చదవండి: దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం! -
హైదరాబాద్: ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్
-
జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నేడు(మే 20) ఎన్టీఆర్ 39వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి గురువారం అర్థరాత్రి అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కేక్ కట్ చేసి.. జై ఎన్టీఆర్ అంటూ రోడ్డుపై హంగామ సృష్టించారు. దీంతో అటువైపు వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసలు..ఎన్టీఆర్ ఇంటివద్దకు చేరుకొని..అభిమానులను పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ అంతా వెళ్లిపోవాలని ఆదేశించినా.. పట్టించుకోకుండా డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొంతమంది అభిమానులను అదుపులోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి..లాఠీచార్జ్ చేయడంతో అభిమానులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
బంజారాహిల్స్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్ ఎనలైజర్) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు. బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం 485 మంది కోర్టులో హాజరు.. డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్‌ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చదవండి👉🏼 ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? తీరు మారడం లేదు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ట్యాబ్‌లో ఫీడ్ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్ లైసెన్స్‌రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి. చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య -
రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: పేమెంట్ గేట్వేలను టార్గెట్‌గా చేసుకుని రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్ వి.శ్రీరాం దినేష్ కుమార్‌ను ఓ పేమెంట్ గేట్‌వేలో లభించిన చిన్న క్లూ ఆధారంగా పట్టుకున్నారు. ఎక్కడా తన ఉనికి బయటపడకుండా పక్కా పథకం ప్రకారం నేరాలు చేసిన ఇతగాడు చిక్కడానికి సెకండ్ హ్యాండ్ వన్ ప్లస్ ఫోన్ కారణమైంది. నగరానికి చెందిన పేజీ పేమెంట్ గేట్‌వే సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.52.9 లక్షలు కాజేసిన దినేష్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఏపీలోని పెడనకు చెందిన దినేష్ విజయవాడలో వెబ్ డిజైనింగ్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. లాక్డౌన్ కారణంగా నష్టాలు రావడంతో దీన్ని మూసేశాడు. అప్పటికే ఇతగాడికి పేమెంట్ గేట్‌వేలకు సంబంధించిన సాఫ్ట్వేర్ వల్నరబులిటీ టెస్ట్‌లపై పట్టు ఉండటంతో వాటినే టార్గెట్‌గా చేసుకున్నాడు. పేజీ సంస్థ నుంచి నగదు కొల్లగొట్టడానికి పథకం వేసిన ఇతడికి స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిన చింటు సహకరించాడు. వాట్సాప్‌లోని కొన్ని ‘నేరగాళ్ల గ్రూపుల్లో’ఔ దినేష్ సభ్యుడిగా ఉన్నాడు. వాటిలో ఉన్న వారి ద్వారానే జార్ఖండ్‌లోని జామ్‌తార చిరునామా, సోమ్‌నాథ్ పేరుతో ఉన్న గుర్తింపు పత్రాలు సంపాదించాడు. వీటిని వినియోగించే చెన్నైలోని ఈక్విటాస్ బ్యాంక్‌లో హైప్రోక్స్టెక్, ఇన్వెంట్ఫైల్ సంస్థల పేర్లతో వర్చువల్ ఖాతాలు తెరిచాడు. బెంగళూరులో ఎస్ బ్యాంక్ శాఖను వర్చుల్‌గా సంప్రదించి తను తయారు చేసిన మూడు యాప్‌ల ఆధారంగా ఏఎన్సార్ ఎంటర్ప్రైజెస్ పేరుతో వారి పూల్ ఖాతాకు యాక్సస్ పొందాడు. వీటికి లింక్ చేసిన ఫోన్ నంబర్ల సిమ్‌కార్డులను చింటు తప్పుడు పేర్లతో ఉత్తరాదిలోని ప్రాంతాల నుంచి తెప్పించాడు. పేజీ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసిన దినేష్ దాని పూల్ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు రెండు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. వాటి నుంచి యస్ బ్యాంక్‌లోని పూల్ ఖాతాలోకి బదిలీ చేశాడు. ఈ ఖాతా నుంచి బోగస్ వివరాలతో తెరిచిన బిట్‌కాయిన్ వాలెట్‌లోకి, దాని నుంచి మరో బిట్‌కాయిన్ సైట్‌లోని తన సొంత వాలెట్‌లోకి మళ్లించాడు. అక్కడి నుంచి నగదుగా మార్చి తనతో పాటు సన్నిహితులకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఎథికల్ హ్యాకర్ల సహకారం తీసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నేరం జరిగిన తీరు గుర్తించారు. అయితే జామ్‌తార సైతం సైబర్ నేరగాళ్ల అడ్డా కావడంతో సోమ్నాథే నిందితుడిగా భావించారు. కొన్ని రోజులు అతడి కోసం గాలించినా ఫలితం లేదు. బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు కొనే దినేష్ వాటిని వాడటానికి కొత్త ఫోన్లు ఖరీదు చేయడు. పోలీసులకు చిక్కకూడదనే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవాడు. ఇదే తరహాలో విజయవాడకు చెందిన వ్యక్తి నుంచి వన్ ప్లస్ కంపెనీ ఫోన్‌ను రూ.16 వేలకు కొనుగోలు చేశాడు. అతడికి రూ.15 వేలు నగదు ఇచ్చి తాను వాడే ఓ బోగస్ నంబరే ఇచ్చాడు. తనకు రావాల్సిన రూ.వెయ్యి కోసం ఇతడు ఒత్తిడి చేయడంతో దినేష్ రూ.1000 పేటీఎం ద్వారా పంపాడు. తన వద్ద ఉన్న సిమ్‌కార్డును ఫోన్లో వేసి నేరంలో వాడాడు. ఫోన్ ఐఎంఈఐ నంబర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు విజయవాడ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి వద్ద కూడా దినేష్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే తనకు రూ.1000 బదిలీ అయిన పేటీఎం నంబర్ ఇచ్చాడు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు దినేష్‌ను పట్టుకోగలిగారు. పేజీ సంస్థలో దినేష్ చేసింది రెండో హ్యాకింగ్‌గా పోలీసులు చెబుతున్నారు. మొదటిసారిగా గతేడాది నవంబర్‌లో దీన్ని సర్వర్‌ను హ్యాక్ చేసి కొందరు హ్యాకర్లు రూ.1.28 కోట్లు కొల్లగొట్టారు. అప్పట్లో ఈ నగదు వెళ్లిన ఆరు ఖాతాలు ఒడిస్సా, వెస్ట్ బెంగాల్‌లకు చెందినవిగా తేలింది. అవన్నీ బోగస్ వివరాలతో తెరిచినవి కావడంతో ఆధారాలు దొరక్క కేసు ముందుకు వెళ్లలేదు. -
విడిపోయిన భార్యభర్తలను కలిపిన క్రిమినల్.. చివరికి ఏమైందంటే!
సాక్షి, హైదరాబాద్: తాత్కాలికంగా విడిపోయిన భార్యభర్తలు కలవడానికి పరోక్షంగా కారణమైన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో అరెస్టు చేసిన ఇతడిని గురువారం నగరానికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు పంపారు. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో భర్తతో దూరంగా ఉంటూ, విడాకుల ప్రయత్నాల్లో ఉన్న గృహిణికి ఫేస్బుక్ ద్వారా మొహాలీకి చెందిన పర్మేందర్ సింగ్‌తో పరిచయమైంది. ప్రతి నెలా రూ.2 లక్షల ఆర్జిస్తున్నట్లు చెప్పుకున్న అతగాడు ఆమెతో పెళ్లి ప్రస్తావన చేశాడు. ఆపై నగరానికి రాకపోకలు సాగించి ఆమెతో కొన్ని ఫొటోలు దిగాడు. రెండు సందర్భాల్లో డబ్బు అవసరమంటూ ఆమె నుంచి రూ.70 వేలు తీసుకున్నాడు. ఓ సందర్భంలో అతడిపై అనుమానం రావడంతో ఆమె నేరుగా మొహాలీ వెళ్లారు. పర్మీందర్ తండ్రిని కలిసిన నేపథ్యంలో అతడో అవారా అని, గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చాడని తేలింది. దీంతో ఆమె పర్మీందర్‌ను దూరంగా ఉంచింది. దీంతో కక్ష కట్టిన అతగాడు వివాహితతో దిగిన ఫోటోలను ఆమె, ఆమె భర్త, కుమారుడితో పాటు వారి స్నేహితులకూ ఫేస్బుక్ ద్వారా పంపి దుష్ఫ్రచారం చేశాడు. విషయం తెలిసిన బాధితురాలి భర్త ఆమెకు మళ్లీ దగ్గరై మనోబలాన్నిచ్చాడు. ఇద్దరూ కలిసి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు మొహాలీలో పర్మీందర్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. చదవండి: ప్రాణాలు తీసిన డిప్రెషన్ -
Hyderabad: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీసులు ఓ వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతలకుంటలోని అభ్యుదయనగర్ కాలనీలో వేముల కళ్యాణి (41) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు కళ్యాణితోపాటు శ్రావణి (27) అనే యువతితో పాటు బహదూర్‌గూడకు చెందిన వినోద్‌కుమార్ (40)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్‌పై అమిత్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు -
'సర్కారు వారి పాట'ను బాగా వాడేసిన హైదరాబాద్ పోలీసులు..
SVP Trailer: Hyderabad Police Awareness With Helmet Scene: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌లోని సీన్లు, డైలాగ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లోని సీన్లు ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులను సైతం బాగా ఆకర్షించాయి. ఈ మూవీ ప్రచార చిత్రంలో ఓ సన్నివేశంలో విలన్‌కు హెల్మెట్ పెడుతూ డైలాగ్ చెప్తాడు మహేశ్ బాబు. ఈ సీన్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ నిర్వాహకులు బాగా వాడారు. మూవీలోని ఈ సీన్‌కు క్రెడిట్ ఇస్తూ హెల్మెట్ ధరించండి, భద్రత ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగానే బాగా వైరల్ అయిన సీన్లు, సాంగ్స్, హుక్ స్టెప్స్లను మార్ఫింగ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ట్రైలర్లోనే హెల్మెట్ ధరించడం ఉండేసరికి వీడియో పోస్ట్ చేస్తూ కొటేషన్స్‌తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట #WearHelmet #SafetyFirst Vc: SarkaruVaariPaataTrailer pic.twitter.com/Npgg05zeXs — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 2, 2022 -
10 రాష్ట్రాల్లో 61 కేసులు.. ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి’
సాక్షి,హైదరాబాద్: అతడి పేరు సత్యేంద్ర సింగ్ షెకావత్...రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్మీ మాజీ జవాను కుమారుడు...ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేశాడు...కేవలం హైఎండ్ కార్లనే టార్గెట్‌గా చేసుకుని 2003 నుంచి చోరీలు చేస్తున్నాడు...ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో 61 నేరాలు చేసిన ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ ఐదు కేసులు ఉన్నాయి. షెకావత్‌ను ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని శుక్రవారం పీటీ వారెంట్‌పై తమ కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ అధికారులు విచారిస్తున్నారు. ► మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న పంచవటి పోలీసుస్టేషన్ పరిధి నుంచి 2003లో క్వాలిస్‌ను చోరీ చేయడంతో సత్యేంద్ర సింగ్ నేరచరిత్ర మొదలైంది. ప్రస్తుతం ఆడి, బీఎండబ్ల్యూ, స్కార్పియో వంటి అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే టార్గెట్ చేసే షెకావత్ వాటిని చోరీ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటాడు. ► కార్ల తాళాలు స్కాన్ చేయడానికి, వాహనం నంబర్ ఇతర వివరాల ఆధారంగా జీపీఎస్ ద్వారా దాని ఉనికి కనిపెట్టడానికి, మారు తాళాలు త యారు చేయడానికి అవసరమైన ఉపకరణాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఓ కారు ఇంజిన్ నంబర్, ఛాసిస్ నెంబర్ ఆధారంగా దాని తాళం తయారు చేయడం ఇతడికే సొంతం. ► ఇటీవల కాలంలో తాళం పెట్టాల్సిన అవసరం లేకుండా, అది దగ్గర ఉంటే చాలు స్టార్ట్ అయ్యే వాహనాలు వచ్చాయి. ఇలాంటి వాటిని చోరీ చేయడానికి షెకావత్ చైనా నుంచి ఖరీదు చేసిన ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ అనే పరికరం వాడతాడు. సదరు వాహనం ఆగిన వెంటనే డ్రైవర్ కిందికి దిగకుండానే దాని సమీపంలోకి వెళ్తాడు చదవండి: అయ్యా బాబోయ్! అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ.. ► డొంగల్తో కనెక్ట్ చేసి ఉండే ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ ద్వారా దాని ఫ్రీక్వెన్సీ రికార్డు చేస్తాడు. ఆ ఫ్రీక్వెన్సిని తన వద్ద ఉండే వీవీడీఐ మినీ కీటూల్ ద్వారా నకిలీ తాళంలోకి ఇన్‌స్టల్ చేస్తాడు. ఇలా తయారైన తాళం తన వద్ద ఉంచుకుని దర్జాగా కారుతో ఉడాయిస్తాడు. 2003 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, డయ్యూడామన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 58 వాహనాలు తస్కరించాడు. వీటితో పాటు రెండు దోపిడీ, ఓ ఆయుధ చట్టం కేసులు సత్యేంద్ర సింగ్‌పై ఉన్నాయి. ► బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్లో గతేడాది జనవరి 26న పంజా విసిరిన షెకావత్ దాని పార్కింగ్ లాట్ నుంచి కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వి.మంజునాథ్ కారు తస్కరించాడు. అప్పట్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఏప్రిల్‌లో నాచారంలో అడుగుపెట్టిన సత్యేంద్ర సింగ్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాహనం తస్కరించాడు. దీంతో ఆ పోలీసులు జైపూర్ వరకు వెళ్లారు. చోరీల్లో షెకావత్ భార్యకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసినప్పటికీ... పీటీ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించిన అక్కడి కోర్టు అమెకు బెయిల్ ఇచ్చింది. ఆ సందర్భంలో పోలీసులతో వీడియో కాల్లో మాట్లాడిన షెకావత్ ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి. నా భార్యను, కుటుంబాన్ని వేధించొద్దు’ అంటూ సవాల్ విసిరాడు. దీంతో అతడి కోసం అతడి కోసం గాలింపు ముమ్మరమైంది. ఈలోగా మరో మూడుసార్లు ఇక్కడకు వచ్చి వెళ్లిన షెకావత్ పేట్‌బషీరాబాద్, దుండిగల్ల్లో మూడు కార్లు ఎత్తుకుపోయాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. ఇతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చిన బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు విచారించనున్న ఈ అధికారులు చోరీ అయిన కారు రికవరీ చేయనున్నారు. షెకావత్ చోరీ చేసిన కార్లను విక్రయించి సొమ్ము చేసుకుంటాడని, ఆ సొమ్ముతో జల్సాలు చేస్తాడని పోలీసులు చెప్తున్నారు. -
కిరణ్‌రాజు, అర్జున్‌పై ‘లుక్ఔట్’?
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న పబ్ భాగస్వాములు పెనుమత్స కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేనిపై లుక్ఔట్ సర్క్యులర్స్(ఎల్వోసీ) జారీ చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు యోచిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరు దేశం విడిచిపోకుండా అడ్డుకునేందుకే పోలీసులు ఈ ఎల్వోసీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కిరణ్ రాజు పాస్‌పోర్ట్ వివరాలను సేకరించారు. అర్జున్ పాస్‌పోర్టు వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాష్ట్ర నోడల్ అధికారుల ద్వారా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్వోసీలు పంపడానికి చర్యలు ముమ్మరం చేశారు. ఈ చర్యలు పూర్తయితే బంజారాహిల్స్ ఠాణాలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసులో వీరిద్దరు కూడా నిందితులనే విషయం ఇమిగ్రేషన్ డేటాబేస్‌లోకి చేరుతుంది. ఈ క్రమంలో వీరు దేశం దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తే, ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తిం చి అదుపులోకి తీసుకుంటారు. వీరిద్దరూ రాష్ట్రం వెలుపల ఉన్నారని భావిస్తున్న పోలీసులు పట్టుకో వడం కోసం సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అధికారులు పబ్ ఉద్యోగులను ప్రశ్నించారు. రేవ్ పార్టీ జరిగిన రోజే పబ్‌లో ఓ ప్రముఖుడి కుమారుడి పుట్టినరోజు వేడుక జరిగిందని విచారణలో బయటపడింది. ఆ ‘మూడు టేబుళ్ల’వద్దే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి వద్ద కూర్చున్నవారిని గుర్తించడానికి మరోసారి సీసీ కెమెరాల ఫుటేజ్‌ని విశ్లేషిస్తున్నారు. నేడు ఎంఎస్‌జే కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ ఇప్పటికే అరెస్టు అయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న పబ్ భాగస్వామి అభిషేక్ ఉప్పాలతోపాటు మేనేజర్ అనిల్‌కుమార్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగే అవకాశముంది. ఈ కోర్టులోనే బుధవారం ఈ నిందితులిద్దరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను కొట్టేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కౌంటర్లు సైతం సమర్పిస్తున్నారు. కిరణ్ రాజు డైరెక్టర్‌గా ఉన్న టి-డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అనుబంధంగా పుడింగ్ అండ్ మింక్ పబ్ కొనసాగుతోంది. దీనితోపాటు మరో 24 సంస్థల్లోనూ కిరణ్ డైరెక్టర్‌గా ఉన్నట్లు పోలీసు లు గుర్తించారు. ఆదివారం ఆ పబ్‌పై దాడి చేసిన సందర్భంలో నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా సిద్ధార్ధ్తోపాటు మాజీ కేంద్రమంత్రి మనవడు సహా 128 మంది కస్టమర్లు, 18 మంది సిబ్బంది, అభిషేక్, అనిల్కుమార్లను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వీరిలో అభిషేక్, అనిల్కుమార్లను అరెస్టు చేయగా, మిగిలిన వారిని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టిన విషయం తెలిసిందే. -
కేటీఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల పట్ల గౌసుద్దీన్ ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని కొంతమంది మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ట్విటర్లో స్పందించిన కేటీఆర్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. మంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భోలక్‌పూర్ కార్పొరేషన్ గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 350, 506 కింద కేసులు నమోదు చేశారు. కాగా ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మంగళవారం రాత్రి పెట్రోలింగ్ పోలీసులతో దుర్భాషలాడాడు. రాత్రిపూట హోటళ్లు నడిపేందుకు అనుమతి లేదని చెప్పిన పెట్రోలింగ్ పోలీసుల పట్ల కార్పొరేటర్ గౌసుద్దీన్ అనుచితంగా ప్రవర్తించాడు. రంజాన్ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేగాక మీరంతా వంద రూపాయలకు పనిచేసే వ్యక్తులు అంటూ దురుసుగా వ్యవహరించాడు. చదవండి: నేనేమీ అధికారం చెలాయించడం లేదు: గవర్నర్ తమిళిసై అయితే ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2 — KTR (@KTRTRS) April 6, 2022 -
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐసిస్ కలకలం
-
హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఐపీ అడ్రస్ ద్వారా మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ ఫలక్‌నుమా పరిధిలోని రైతు బజార్లో కొంతకాలంగా నివాసముంటున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. కాగా 2020లోనే పహాడీషరీఫ్‌లో సులేమాన్‌కు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ తరువాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సులేమాన్ తరువాత ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సోషల్ మీడియా వేదికగా సులేమాన్ ఏకంగా 20 ఖాతాలను తెరిచి యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నాడని పోలీసులు తేల్చారు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలు మరోసారి తెరమీదకు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక లతో ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చదవండి: యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ -
వాహన తనిఖీలు.. 700 కేసుల నమోదు..!
చార్మినార్: వాహనాల స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 700 వందలకు పైగా కేసులు నమోదు చేసినట్లు దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి ఆయన పాతబస్తీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తనీఖీలలో పట్టుబడిన కార్లకు ఉన్న బ్లాక్ కవర్లను తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... దక్షిణ మండలంలోని పాతబస్తీలో ఇప్పటి వరకు నెంబర్ ప్లెట్లు సక్రమంగా లేని 190 వాహనాలపై, పోలీసు, అడ్వకేట్, ఎమ్మెల్యే, ఎంపీ, డాక్టర్ స్టిక్కర్లతో వచ్చిన 46 వాహనాలతో పాటు బ్లాక్ ఫిల్మ్‌లతో కూడిన 500 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. (చదవండి: Ram Charan: రామ్ చరణ్ బర్త్‌డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్) -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, దొరికారో అంతే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇన్నాళ్లూ అనధికారికంగా పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసుల్లో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో కదలిక వచ్చింది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జడ్‌ప్లస్ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడొద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలన్నారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
గంటల వ్యవధిలోనే పాపను కాపాడి.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
-
భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సాగర్ కె చంద్ర డైరెక్షన్లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి లీడ్ రోల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న(బుధవారం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇందుకోసం యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది నగర పోలీస్ శాఖ. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ చెక్‌పోస్ట్ వైపు వాహనాలకు అనుమతి నిరాకరిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, క్రిష్ణ కాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుంది. #HYDTPinfo Commuters, please make note of traffic restrictions/diversions in view of the Pre-Release Event of the Telugu movie "Bheemla Nayak" at 1st TSSP Bn. Grounds, Yousufguda on 23.02.2022.@JtCPTrfHyd pic.twitter.com/lUn348As8R — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 pic.twitter.com/xihE3KATJj — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్లిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలల్ని పార్కింగ్ ప్రదేశాలుగా గుర్తించారు. వాహనదారులు ఈ రూట్లలో ప్రయాణించి.. అసౌకర్యానికి గురికాకూడదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్లు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 21వ తేదీనే ఈ ఈవెంట్ జరగాల్సిన ఉండగా.. ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్‌ను వాయిదా వేశారు. దీంతో 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి ఉండదని, కేవలం 23వ తేదీతో ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం. -
నన్ను పట్టుకోలేరు
సాక్షి, సిటీబ్యూరో: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన మనీ హెయిస్ట్ తొమ్మిది సీజన్లను తీక్షణంగా వీక్షించి.. తాను అందులోని ప్రొఫెసర్ క్యారెక్టర్‌గా ఫీల్ అవుతూ.. సిండికేట్ ఏర్పాటు చేసుకుని మరీ వరుస కిడ్నాప్‌లకు పాల్పడిన గుంజపోగు సురేష్ అలియాస్ సూరి వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడు ఇటీవలి కాలంలో పలుమార్లు పోలీసులకు చిక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సందర్భాల్లో పోలీసులు తన వాట్సాప్ స్టేటస్ చూస్తారని ఊహించాడు. దీంతో డాన్ చిత్రంలోని ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై’ (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అనే డైలాగ్‌ను స్టేటస్‌గా పెట్టి సవాల్ విసిరాడు. సూరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు అయిదు రోజుల కస్టడీకి కోరుతూ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. సంకల్పం చెదరకూడదని పచ్చబొట్టు... భోజగుట్ట ప్రాంతానికి చెందిన సూరి డిగ్రీ పూర్తి చేశాడు. పోలీసు అధికారి అవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. తన అన్న సుధాకర్‌కు ఉన్న నేరచరిత్ర నేపథ్యంలో తన దృష్టి మళ్లకుండా, సంకల్పం చెదరకుండా ఉండటానికి టాటూ వేయించుకోవాలని భావించాడు. 2006లో కుడి చేతిపై పోలీసు బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తన అన్న ప్రభావంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన ఇతగాడు 2011 నుంచి నేరాలు చేయడం ప్రారంభించాడు. మరో చేతిపై ఓ సినీ నటుడి ఫొటోను టాటూగా వేయించుకున్న సూరి ఆయన మాదిరిగానే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓ ట్రావెల్స్ కార్యాలయంలో డ్రైవర్‌గా పని చేయడంతో డ్రైవింగ్‌పై మంచి పట్టువచ్చింది. సెకండ్ హ్యాండ్ పజేరో వాహనం ఖరీదు చేసిన ఇతగాడు నేరం చేసినప్పుడు, ఆ తర్వాత వీలున్నన్ని రోజులు అందులోనే గడిపేవాడు. స్టీరింగ్‌పై ఉంటే చిక్కడం దుర్లభం... రేసర్లను తలదన్నుతూ డ్రైవింగ్ చేసే సూరి కారు డ్రైవింగ్ సీటులో ఉంటే మాత్రం పట్టుకోవడం ఎవరితరం కాదు. ఇతడిని ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకోవడానికి గతంలో సదాశివపేట, విజయవాడ పోలీసులు ప్రయత్నించారు. ఆ సందర్భంల్లో దాదాపు కిలోమీటరు దూరంగా కారును రివర్స్‌లో అత్యంత వేగంగా నడిపి తప్పించుకున్నాడు. మరోసారి పోలీసులపైకే కారు పోనిచ్చి ఉడాయించాడు. ఈ సందర్భాల్లో తన వాట్సాప్ స్టేటస్‌గా డాన్ సినిమా డైలాగ్ పెట్టాడు. పది రోజులకు పైగా గాలించిన ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎన్.రవీందర్ నేతృత్వంలోని బృందం ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టింది. ఓ టోల్గేట్ వద్ద కారులో నిద్రిస్తున్న సూరిని గుర్తించింది. మూడు గంటలు శ్రమించి ఆ వాహనం చుట్టూ ఇతర వాహనాలు ఆపి పట్టుకోగలిగింది. బిహారీ మాదిరిగా బిల్డప్.. స్నేహితులకు స్నేహితులో, పరిచయస్తులనో మాత్రమే టార్గెట్‌గా చేసుకుని, యువతితో డేటింగ్ ట్రాప్ వేయించి కిడ్నాప్ చేసే సూరి తాను కిడ్నాప్ చేసిన వారి వద్ద బిహారీ మాదిరిగా బిల్డప్ ఇస్తాడు. తాను కనిపించకుండా అనుచరులతో కిడ్నాప్ చేయిస్తాడు. ఆపై వారికి కళ్లకు గంతలు, ముఖానికి తొడుగులు వేశాకే రంగంలోకి దిగుతాడు. బాధితులతో హిందీలో మాట్లాడుతూ బిహార్‌కు చెందిన కిడ్నాపింగ్ గ్యాంగ్‌గా నమ్మిస్తాడు. వారి కుటుంబీకుల నుంచి డబ్బు ముట్టిన తర్వాత ప్లేట్ ఫిరాయిస్తాడు. తానే అతికష్టమ్మీద కిడ్నాపర్ల నుంచి రెస్క్యూ చేసినట్లు బిల్డప్ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది బాధితులు పోలీసుల కదలికలపై ఇతడికే సమాచారం ఇస్తూ వచ్చారు. ఇతడిని పట్టుకున్న తర్వాత పోలీసులు వారితో సూరినే కిడ్నాపర్ అని చెప్పినా కొందరు నమ్మలేదు. పొడవాటి గడ్డం, సిగతో కూడిన తలకట్టు, జీన్స్, టీషర్ట్స్‌తో తిరిగే సూరి ప్రతి అంశంలోనూ ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకున్నాడని, నడిచిన మార్గం మాత్రం సరైంది కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
డ్రగ్ కేసు: టోనీ ఇచ్చిన సమాచారంతో మరో ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ టోనీ అయిదు రోజుల కస్టడీ బుధవారంతో ముగియనుంది. డ్రగ్ కేసులో నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంతో‚ డ్రగ్స్ కేసులో మరో ఎనిమిదిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టోనికి వ్యాపార వేత్తలకు ఏజెంట్లుగా పనిచేసిన10 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వివిధ రంగాలకు చెందిన పలువురిని పోలీసులు గుర్తించారు. అయితే టోనీతో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ సెల్, టాస్క్ ఫోర్స్ బృందాలు అతని కాల్ డేటా, డార్క్ నెట్ వెబ్సైట్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా పరీశీలిస్తున్నారు. మూడు బ్యాంక్ ఎకౌంట్స్ ట్రాన్సెక్షన్స్ పరిశీలించిన పోలీసులు.. టోనీని మరోసారి కస్టడీలోకి కోరే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో టోనీ అనుచరుడు అఫ్తాబ్. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టోనీ ప్రధాన అనుచరుడు అఫ్తాబ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిని ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో టోనీ డ్రగ్స్ లావాదేవీలను అఫ్తాబ్ పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని ఖాతాలో రోజుల వ్యవధిలోనే రూ.కోట్లలో లావాదేవీలు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అఫ్తాబ్ ఖాతాల్లో డబ్బులు పంపినవారి వివరాలను సేకరిస్తున్నారు . అఫ్తాబ్ ఫోన్ సీజ్ చేసి.. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ వ్యాపారి టోనీకి కస్టమర్లుగా ఉన్న తొమ్మిది మంది వ్యాపారులను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం కొట్టివేసింది. డ్రగ్స్‌కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవాల్సినందున టోనీ అతని కస్టమర్లు నిరంజన్ కుమార్ జైన్, సశ్వత్ జైన్, యజ్ఞనాద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్టడీకి పంపేందుకు హైకోర్టు నిరాకరించింది. చదవండి: హైదరాబాద్ టు ఢిల్లీ ‘వందేభారత్’.. పింక్ బుక్‌లో ఏముందో.. -
ఎఫ్ఐఆర్లను ఆన్లైన్లో ఉంచని పోలీసులు.. ‘సుప్రీం’నే ధిక్కరిస్తారా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగం పరోక్షంగా సుప్రీం కోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తోంది. పారదర్శకత పెంచడంతో పాటు బాధితులకు ఉపయుక్తంగా ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానం పోలీసులు నమోదు చేసే కేసుకు సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికను (ఎఫ్ఐఆర్) అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించింది. కేంద్రం అధీనంలో పని చేసే సీబీఐ, ఎన్ఐఏలు సైతం దీన్ని పక్కాగా అమలు చేస్తుండగా.. పోలీసులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నింటికి ఆన్లైన్లో పెట్టట్లేదు. పెట్టిన వాటిలో కొన్నింటికి పబ్లిక్ వ్యూ ఆప్షన్ ఇవ్వట్లేదు. ఆన్లైన్లో ఉన్న మరికొన్ని ఎఫ్ఐఆర్లు సాంకేతిక సమస్యలతో తెరుచుకోవట్లేదు. అప్పట్లో అత్యంత రహస్యమే... ఏదైనా కేసులో బాధితుడు, నిందితుడిగా ఉన్న వారికి తమ ఎఫ్ఐఆర్ పొందడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగం. ఒకప్పుడు దీని ప్రతిని ఠాణా నుంచి తీసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కీలకమైన కేసుల విషయంలో పోలీసుల చేతులు తడిపితే తప్ప కాపీ బయటకు వచ్చేది కాదు. సుప్రీంకోర్టు యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కేసుతో ఈ సమస్య తీరింది. ‘సుప్రీం’ 2016 సెప్టెంబర్ 7న కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఎఫ్ఐఆర్ను 24 గంటల్లోగా పోలీసు అధికారిక వెబ్సైట్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో కానీ కచ్చితంగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఆ ఏడాది నవంబరు 15 నుంచి ఈ విధానం అమలులోకి రావాలని పేర్కొంది. చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి... కొన్నింటికి మాత్రమే మినహాయింపు.. అనివార్య కారణాల నేపథ్యంలో కొన్ని కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు మాత్రం రహస్యంగా ఉంచేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. మహిళలపై లైంగిక వేధింపులు, వారిపై జరిగే నేరాలు, ఉగ్రవాద సంబంధిత నేరాలు, బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు, సున్నిత స్వభావం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింగే కేసులకే ఈ అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ రహస్యంగా ఉంచాలనే నిర్ణయం తీసుకునే అధికారం డీఎస్పీ (ఏసీపీ) స్థాయికి తక్కువ కాని స్థాయి అధికారి, జిల్లా మేజిస్ట్రేట్లకు మాత్రమే ఉంటుంది. రహస్యంగా ఉంచిన ఎఫ్ఐఆర్పై సంబంధిత కోర్టుకు కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వేగంగా మొదలెట్టి అరకొరగా... ఈ తీర్పును అమలు చేయడంలో తెలంగాణ పోలీసు విభాగం వేగంగా స్పందించింది. తమ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసి ఎఫ్ఐఆర్లు ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మాత్రం ఈ విధానం అరకొరగా మారిపోయింది. పోలీసుస్టేషన్లకు చెందిన పోలీసుల మాట అటుంచితే... ప్రత్యేక విభాగాలు సైతం దీన్ని పట్టించుకోవట్లేదు. సాక్షాత్తూ నగరం కేంద్రంగా పని చేసే నేర విభాగంలో ఈ ఏడాది నమోదైన ఎఫ్ఐఆర్ల్లో ఒక్కటి కూడా వెబ్సైట్లో కనిపించట్లేదు. గతేడాదికి సంబంధించిన వాటిలోనూ అనేక పోలీసుస్టేషన్లు అప్లోడ్ చేసిన వాటిలో సాంకేతిక సమస్యలు ఉంటున్నాయి. దీంతో డౌన్లోడ్ అయినా.. తెరుచుకోవట్లేదు. ఫలితంగా ఉన్నా లేనట్లుగానే భావించాల్సి వస్తోంది. చదవండి: Hyderabad: అండగా ఉంటారనుకుంటే.. అందకుండా పోయారు.. తెలివిగా ఆన్లైన్లో పెడుతూ.. రాష్ట్రంలోని కొన్ని పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలు ఈ ఎఫ్ఐఆర్ల విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో కోర్టులు, సంబంధిత విభాగాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆన్లైన్లోనే పొందుపరుస్తున్నారు. వీటికి పబ్లిక్ వ్యూ ఆప్షన్ ఇవ్వట్లేదు. ఫలితంగా పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వ్యూ ఎఫ్ఐఆర్’ విభాగంలో అవి కనిపించట్లేదు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అత్యాధునిక టెక్నాలజీలు అందిపుచ్చుకోవడంలో ముందున్న మన పోలీసులు ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అంశంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు. -
Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. కర్ణాటకలోని బెంగళూరులో వరుసపెట్టి పంజా విసారాడు.. హైదరాబాద్‌కు చేరుకుని రెండు రోజుల్లో అయిదు చైన్ స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేశాడు.. చూడటానికి పక్కా సాఫ్ట్వేర్ ఉద్యోగిలా కనిపించే ఈ ఘరానా నేరగాడు ఉమేష్ ఖతిక్‌ను అప్పగించేది లేదని అహ్మదాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో శనివారం తెల్లవారుజామున ఆ అధికారులు అక్కడే పట్టుకున్నారు. అతడిని తమకు అప్పగించాలంటూ ఇక్కడి పోలీసులు వెళ్లి కోరగా... తామే అరెస్టు చేస్తామని ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లండి అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆదివారం రాత్రి తెలంగాణ పోలీసు బృందాలు తిరిగి పయనమయ్యాయి. నాలుగు గంటలకు పైగా నడక.. మంగళవారం మధ్యాహ్నం రైలులో నగరానికి చేరుకున్న ఉమేష్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని మెజిస్టక్ హోటల్లోని రూమ్ నెం.204లో బస చేశాడు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అతగాడు బయటకు వచ్చి కాలినడకన బయలుదేరాడు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో కాలినడకన సంచరించిన ఉమేష్ సాయంత్రం 5,30 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం చేరుకున్నాడు. అక్కడి జిర్రా రోడ్లో మహ్మద్ సులేమాన్ నిర్వహిస్తున్న మొబైల్ దుకాణం వద్దకు వెళ్లాడు. అప్పటికి కొద్దిసేపటి ముందే తన యాక్టివా వాహనంపై సరుకు తీసుకువచ్చిన సులేమాన్ తన వాహనాన్ని దుకాణం ముందు పార్క్ చేశారు. అప్పటికే కస్టమర్లు ఎదురు చూస్తుండటంతో ఆ హడావుడిలో బండికి తాళం వేయడం మర్చిపోయిన ఆయన సరుకు తీసుకుని షాపు లోపలకు వెళ్లిపోయారు. చదవండి: Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే.. అల్పాహారం తర్వాత మొదలుపెట్టి.. తాళంతో సహా ఉన్న సులేమాన్ ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన ఉమేష్ దాన్ని తస్కరించాడు. అక్కడ నుంచి చెక్కర్లు కొడుతూ తాను ఉన్న హోటల్‌కు చేరుకున్నాడు. ఆ రాత్రి హోటల్లోనే ఉన్న ఉమేష్ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అల్పాహారం చేసి అక్కడ నుంచి బయలుదేరాడు. ఎక్కడా ఎలాంటి రెక్కీలు చే యని అతగాడు నేరుగా అల్వాల్‌కు చేరుకున్నా డు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మొదలెట్టి మేడిపల్లిలో సాయంత్రం 4.30 వరకు వరుసపెట్టి నేరాలు చేశాడు. అక్కడి సంపూర్ణ హోట ల్ వద్ద వాహనం, సమీపంలోని చెంగిచర్ల చౌర స్తా సమీపంలో ఉన్న మేకల బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద తన జర్కిన్ విడిచిపెట్టాడు. అక్కడ నుంచి బస్సులో లక్డీకాపూల్‌కు చేరుకున్న ఉమేష్... ఆటోలో హోటల్‌కు చేరాడు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసి రైలులోనే అహ్మదాబాద్ చేరుకున్నాడు. హోటల్లో మరో వ్యక్తి ఫోన్ నంబర్... ఉమేష్ నాంపల్లిలోని మెజిస్టిక్ హోటల్లో బస చేస్తున్న సమయంలో తన ఫోన్ నంబర్ పొందుపరచలేదు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన చేతన్ రాథోడ్‌కు చెందిన నంబరును ఇచ్చాడు. గుర్తింపు కార్డుగా మాత్రం తన ఆధార్‌నే అందించాడు. సీసీ కెమెరాల ఆధారంగా ఉమేష్ కదలికలు తెలుసుకున్న పోలీసులు హోటల్ వరకు వచ్చాడు. రిజిస్టర్లో ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించగా ఉమేష్ ఎవరో తనకు తెలియదని చేతన్ చెప్పాడు. దీంతో ఆధార్ కార్డు ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు ఉమేష్ నేరచరిత్ర తెలుసుకున్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి అతడు శుక్రవారం రాత్రి అతడు అహ్మదాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి బృందాలు వెళ్లేసరికి అతడు తప్పుకునే అవకాశం ఉందని భావించిన అధికారులు అహ్మదాబాద్ అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం తెల్లవారుజామున ఆ ఇంటిపై దాడి చేసిన ఆ పోలీసులు ఉమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి దాదాపు 20 రోజులుగా బెంగళూరు అధికారులు అహ్మదాబాద్ పోలీసులతో టచ్‌లో ఉన్నారు. -
చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో ఎనిమిది నేరాలు చేసి పరారైన ‘సింగిల్ స్నాచర్’ ఉమేష్ ఖాతిక్‌ను అహ్మదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిటీ నుంచి పరారైన ఇతగాడిని శనివారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని నగరానికి తీసుకువచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు అహ్మదాబాద్‌కు వెళ్లారు. సొత్తు రికవరీ చేయడంతో పాటు ఇంకా ఏవైనా నేరాలు చేశాడా? అనే కోణంలో విచారణ చేయనున్నారు. గతంలో ఇతడిని అనేకసార్లు అరెస్టు చేసిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారితో ‘సాక్షి’ శనివారం ఫోన్లో మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఉమేష్‌కు సంబంధించిన కీలకాంశాలు ఆయన వెల్లడించారు. టార్గెట్ చేసిన నగరంలోని హోటళ్లలో బస చేయడం, చోరీ చేసిన వాహనంపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడటం సహా ఈ ఘరానా స్నాచర్కు సంబంధించిన వివరాలివీ.. ►రాజస్థాన్‌లో పాలి జిల్లాకు చెందిన ఉమేష్ కొన్నాళ్లు అహ్మదాబాద్‌లోని నారాయణ్పురలో నివసించాడు. అప్పట్లో మహారాష్ట్రలోని జల్గాం జిల్లాకు చెందిన సూర్యవంశీ అలియాస్ దీపక్‌తో కలిసి కొన్ని చోరీలు చేశాడు. ►ఈ కేసులకు సంబంధించిన 2015–16లలో అహ్మదాబాద్ పోలీసులకు చిక్కి వీరు జైలుకు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత ఒకరు రాజస్థాన్‌కు, మరొకరు సూరత్‌కు వెళ్లిపోయారు. కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఈ ద్వయం 2017 నుంచి చైన్ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టింది. ►ఉమేష్ రాజస్థాన్ నుంచి బస్సు లేదా రైలులో దాదాపు 650 కి.మీ. దూరంలో ఉన్న సూరత్ చేరుకునే వాడు. ఇద్దరూ కలిసి తొలుత ఓ వాహనం చోరీ చేసి దానిపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడ్డారు. రెండు మూడు నేరాలు చేసిన తర్వాత ఉమేష్ ఇన్స్టాల్మెంట్లో కారు కొన్నాడు. అప్పటి నుంచి దాని మీదే సూరత్ వచ్చే వాడు. ►ఇప్పటి వరకు ఉమేష్ చోరీ చేసిన ద్విచక్ర వాహనాలన్నీ గేర్లు లేనివే. వాటిపైనే తిరుగుతూ దీపక్‌తో కలిసి అనేక స్నాచింగ్స్ చేశాడు. ఈ ఇద్దరిపై గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ►ఉమేష్ 2015లో కొన్నాళ్లు అహ్మదాబాద్ సమీపంలోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్నాడు. అప్పట్లో చోరీ కేసులకు సంబంధించి సోలా పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై గుజరాత్ యూనివర్సిటీ ప్రాంతంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. ►దీంతో ఆ ఠాణా ఇన్స్పెక్టర్ రాజ్యగురు ఇతడిని పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. తమ ఠాణాకు తరలించి చోరీ సొత్తు ఎక్కడ విక్రయించావో చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆయనపై కక్షగట్టిన ఉమేష్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత పెద్ద డ్రామా నడిపాడు. అప్పట్లో ఉమేష్ వయసు కేవలం 19 ఏళ్లు. ►సదరు ఇన్స్పెక్టర్ ఇంటరాగేషన్ పేరుతో విచక్షణారహితంగా కొట్టారని, ఈ నేపథ్యంలోనే తన రెండు కళ్లూ పోయాయంటూ ఆరోపించాడు. దీంతో న్యాయస్థానం అతడికి ప్రత్యేక చికిత్స అందించేలా ఆదేశాలిచ్చింది. ►రాజ్యగురుపై విచారణను చేపట్టింది. చివరకు ఠాణాలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను ఉన్నతాధికారులు పరిశీలించిన నేపథ్యంలో అతడి ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఈలోపే అతడి తండ్రి గులాజ్జీ, తల్లి మోహిని, సోదరి ఉష సైతం విలేకరుల సమావేశాలు పెట్టి హడావుడి చేశారు. పోలీసులను బ్లాక్మెయిల్ చేయడానికే ఈ వ్యవహారం నడిపినట్లు తేలింది. -
అల్వాల్‌లో ప్రత్యక్షం.. ఉప్పల్‌లో అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండల్లో బుధవారం వరుస స్నాచింగ్స్తో సవాల్ విసిరిన సింగిల్ స్నాచర్ మొత్తం ఏడు నేరాలు చేసినట్లు తేలింది. ఉదయం అల్వాల్‌లో ప్రారంభించిన అతగాడు సాయంత్రం మేడిపల్లిలో ముగించాడు. ఈ ఏడింటిలోనూ మొదటి రెండూ విఫలం కాగా... ఆ తర్వాత అయిదింటిలోనూ కలిపి 18.5 తులాల బంగారం కొట్టేశాడు. ఉప్పల్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇతడి కోసం మూడు పోలీసు కమిషనరేట్లకు చెందిన టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిర్రా రోడ్లో యాక్టివా వాహనం చోరీ చేసిన ఈ స్నాచర్ బుధవారం ఉదయం తన ‘పని’ మొదలెట్టాడు. అల్వాల్ పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన పుష్ప ఇళ్లల్లో పని చేస్తుంటారు. పనులు ముగించుకున్న ఈమె బుధవారం బుధవారం ఉదయం 10.45 గంటలకు కానాజీగూడ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ గోలుసును బంగారంతో చేసిందిగా భావించిన స్నాచర్ వెనుక నుంచి వచ్చి లాక్కుపోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన ఆమె అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడ నుంచి వాహనంపై పారిపోయాడు. ఆలస్యంగా స్పందించిన ఆమె బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్! అక్కడి నుంచి పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి వెళ్లిన స్నాచర్ ఉమారాణి మెడలో గొలుసు చోరీ చేయడానికి ప్రయత్నించాడు. ఈ రెండూ విఫలం కావడంతో.. రాఘవేంద్ర కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, మారేడ్‌పల్లిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ, తుకారాంగేట్‌లోని సమోసా గార్డెన్స్, మేడిపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీల్లో పంజా విసిరాడు. సాయంత్రం 4.30 గంటలకు ఆఖరి నేరం చేసిన స్నాచర్ అక్కడ నుంచి ఉప్పల్ వరకు వచ్చాడు. ఈ కదలికలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉప్పల్‌లోని ఓ గల్లీలోకి ప్రవేశించిన దుండగుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నాగోల్, హబ్సిగూడ, రామాంతపూర్ రోడ్లలోని కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతడు ఎక్కడి వాడు? ఎక్కడ బస చేశాడు? కొన్ని నేరాలకు మధ్య సమయంలో ఎక్కడ ఉన్నాడు? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. త్వరలో పట్టుకుంటాం బుధవారం వరుస స్నాచింగ్స్‌కు పాల్పడిన దుండగుడికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే నేరగాడిని పట్టుకుంటాం. సైబరాబాద్, రాచకొండ పోలీసులతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాం. చాలా కాలం తర్వాత ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సీవీ ఆనంద్, సిటీ సీపీ -
హైదరాబాద్: చలో అంటే చల్తా నై!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారులపైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగానూ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇలా వస్తున్న వాహనాలకు చలాన్ విధించడంతో సరిపెట్టారు. ఇకపై వీటిని ఆంక్షలున్న సమయం ముగిసే వరకు ఆపేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు.. ►అనుమతి పొందినవి మినహా నగరంలోకి భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలో సంచరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకువచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలసి వీడియో రికార్డింగ్ ►ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళలో నగరంలోని ప్రవేశించేసి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు. దీన్ని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో విహరించేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కొన్ని కంపెనీలు తమ వాహనాలను నో ఎంట్రీ సమయంలోనూ తిప్పేస్తున్నాయి. రోజుకు ఒక చలాన్ చొప్పున చెల్లిస్తూ తమ పని కానిచ్చుకుంటున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతూ ఇతర వాహనచోదకులు ఇబ్బందులు పడటంతో పాటు కొన్నిసార్లు ప్రమాదాలూ జరుగుతున్నాయి. పెద్ద ప్రహసనమే.. వీటిని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆయా వాహనాలు కనిపించిన వెంటనే ఆపి చలాన్ వేయడంతో పాటు నిషేధిత సమయం ముగిసే వరకు అనువైన ప్రాంతంలో ఆపేయాలని నిర్ణయించారు. మరోపక్క ఇలాంటి ‘నో ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ పోలీసుస్టేషన్కో, గోషామహల్ స్టేడియానికో తరలించాలి. ఆపై సదరు డ్రైవర్/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్లే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. భారీ శబ్దాలతో నరకం.. ►నో ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ. ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్దాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగర వాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. ►రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం పరిపాటగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆయా వాహనాలకు నిర్దిష్ట విధానం రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే ప్రయాణికుల్ని ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్ చెప్పవచ్చనే వాదన వినిపిస్తోంది. -
రూ.99 కోట్లు గాయబ్.. ఎలాగో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: ఓ చోరీ కేసులో దొంగను పట్టుకోవడంతో పాటు పోయిన సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేస్తేనే బాధితుడికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగినట్లు. అయితే రికవరీల ఏ ఏడాదీ 80 శాతానికి కూడా చేరట్లేదు. ఫలితంగా బాధితులకు దొంగ దొరికినా... దొరక్కపోయినా... బాధితులకు మాత్రం నష్టమే జరుగుతోంది. 2014 నుంచి 2021 వరకు హైదరాబాద్ నగరంలో చోరీ అయిన సొత్తులో కేవలం 65.14 శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. ఈ కాలంలో మొత్తం రూ.285,47,88,204 విలువైన సొత్తు నేరగాళ్ల పాలు కాగా పోలీసులు రూ.185,96,11,821 విలువైంది మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన రూ.99,51,76,383 విలువైంది పత్తాలేకుండా పోయింది. ఇందులో నగదు, నగలు, ఇతర వస్తువులు ఉన్నాయి. దర్యాప్తు అధికారులపై భారం... ► నగర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత, వనరుల లేమి నేపథ్యంలో చోరీ జరిగిన తరవాత దొంగలను పట్టుకోవడం ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఒక్కో దర్యాప్తు అధికారీ ఏడాదికి కేవలం 60 నుంచి 70 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఓ కొలిక్కి చేర్చగలడు. అయితే దర్యాప్తు అధికారులుగా వ్యవహరించే ఎస్సై స్థాయి అధికారుల కొరత కారణంగా ప్రస్తుతం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి సరాసరిన 200లకు పైగా కేసులను దర్యాప్తు చేస్తున్నాడు. ఫలితంగా అవి అంత తొందరగా ఓ కొలిక్కి రావడం, చోరీ కేసుల్లో దొంగలు దొరకడం ఆలస్యం జరుగుతోంది. ఎంత ఆలస్యంగా దొంగ దొరికితే... రికవరీ అంత తక్కువగా ఉంటోంది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘పెరిగిపోతున్న’ మెుత్తాలు... ► ఓ ఇంట్లోనే, దుకాణంలోనో చోరీ జరిగితే... అందులో ఎంత మెుత్తం పోయిందనేది కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కొన్ని కేసుల్లో బాధితులు చెప్తున్నదీ వాస్తవంగా ఉండట్లేదన్నారు. ఓ చోరీ కేసు పరిష్కారమై, దొంగ దొరికిన తరవాత రికవరీ పూర్తయి, మిగిలిన చట్టపరమైన అంశాలను దాటి బాధితుడికి సొత్తు చేరడానికి కొంత సమయం పడుతోంది. మరోపక్క 100 శాతం సొత్తు రికవరీ కావట్లేదు. గరిష్ఠంగా బాధితులకు అందుతున్నది 50 శాతం లోపే. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసే సమయంలో చోరీ అయిన సొత్తు, సొమ్ముల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. ఇలా చేస్తే అన్నీ ప్రక్రియలూ పూర్తయిన తరవాత తమకు అందేది చోరీ అయిన దాంతో సరిపోతుందని బాధితులు భావిస్తున్నారు. ఫలితంగా ఫిర్యాదులోనే మెుత్తాలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ కారణంగానే వాస్తవంగా చోరీ అయిన దానికి, రికార్డుల్లో నమోదవుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యగా మారిన రికవరీ... ► ఈ చోరులకు అరెస్టు చేయడం ఒక ఎత్తయితే... పోయిన సొత్తు రికవరీ చేయడం మరో ఎత్తుగా మారింది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లల్లో నమోదైన నేరాల్లో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే పరిష్కారమవుతున్నాయి. ఈ పరిష్కారమైన కేసుల్లోనూ సరాసరి రికవరీలు మాత్రం 70 శాతానికి చేరట్లేదు. గతంలో దొంగలు చోరీ సొత్తును రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో విక్రయించే వారు. అయితే ప్రస్తుతం నేరం చేసిన మరుక్షణం రాష్ట్రం దాటేస్తున్న నిందితులు కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది నగరాల్లో చోరీ సొత్తును అమ్ముతున్నారు. ఫలితంగా నిందితుడు దొరికినా... రికవరీలు మాత్రం పూర్తిస్థాయిలో కావట్లేదు. తాము చోరీ సొత్తు విక్రయించిన ప్రాంతాలను నిందితులు చెప్తున్నా... దానిని కొనుగోలు చేసిన వారు మాత్రం తిరిగి ఇవ్వడంలో అనేక మెలికలు పెడుతున్నారు. దీంతో రికవరీలు శాతం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మరోపక్క ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటలకు మించి కస్టడీలో పెట్టుకునే అధికారం చట్ట ప్రకారం పోలీసులకు లేకపోవడం కూడా రికవరీలపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో నిందితులు చోరీ సొత్తుకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించట్లేదు. నగదైతే పత్తా ఉండదు... ► చోరీకి గురైంది బంగారం, వెండి వంటి సొత్తయితే ఎన్నాళ్ల తరవాత నిందితుడు దొరికినా... ఎంతో కొంత రికవరీ చేయడానికి వీలుంటుంది. అదే నగదు దొంగల పాలయితే ఇక రికవరీ అనే విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ రకంగా వచ్చే డబ్బు ఈజీ మనీ కావడంతో నేరగాళ్లల్లో చాలా మంది వివిధ దురలవాట్లకు బానిసలుగా ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. ఫలితంగా చోరీ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ మెుత్తాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. చాలా కొద్దిమంది నేరగాళ్లు మాత్రమే చోరీ సొమ్ముతో స్థిరాస్తులు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో మాత్రమే చోరీకి గురైన సొమ్ము రికవరీ చేయడం సాధ్యమవుతోంది. -
పేరు పెట్టమన్న హైదరాబాద్ సీపీ.. ఆ పోస్టుకు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే తలమానికంగా బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకుంటున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (సీసీసీ) పేరు సూచించాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నెటిజనులను కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. రోడ్ నం.12లో 20 అంతస్తుల ఎత్తుతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని ప్రస్తుతం ట్విన్ టవర్స్‌గా పిలుస్తున్నాయి. అయితే వాస్తవంగా ఇందులో మొత్తం నాలుగు టవర్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్ పోలీసుకే కాకుండా తెలంగాణ పోలీసు విభాగానికే ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుందని స్పష్టం చేసిన ఆనంద్... ఆ మేరకు సరైన పేరు సూచించాలని కోరారు. చదవండి: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి ఈ పోస్టుకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1500 మంది లైక్ చేయగా...1100 మంది వివిధ పేర్లను సూచించారు. కమాండో హిల్స్, 4 లయన్స్, సీ4, ఫెడ రల్ టవర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఎఫ్‌టీటీ ఎస్), చార్మినార్ ప్రొటెక్షన్ సెంటర్ (సీపీసీ) తదితర పేర్లను నెటిజనులు సూచించారు. మా ర్చి 31లోగా నిర్మాణం పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆనంద్ ఇటీవలే కాంట్రాక్టర్‌కు సూచించిన విషయం విదితమే. -
ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ పోలీసుల షాక్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం సోషల్ మీడియాపై డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతోంది. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌తో పాటు ప్రతి ఠాణాలోనూ వీటిపై కేసులు నమోదు చేయనున్నారు. అనేక మందికి ఇబ్బందులు.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఎవరికి వారు తమ ఆలోచనలను అందులో పొందుపరుస్తున్నారు. కొందరైతే కొన్ని వర్గాలను, రాజకీయ పార్టీలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మరికొందరు మహిళలు, యువతులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. కుప్పలుకుప్పలుగా పుట్టుకువస్తున్న యూట్యూబ్ చానళ్లలో కూడా కొన్ని ఇదే పంథాలో వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి లో అతితక్కువ మంది మాత్రమే పోలీసులకు ఫిర్యా దు చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న అనేక మంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే సుమోటో కేసులు.. వీటన్నింటినీ గమనించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచేలా సైబర్ స్పేస్ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సోషల్‌మీడియా వ్యవహారాలపై కేవలం సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసులు నమోదయ్యేవి. ఇకపై నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఈ కేసులు నమోదు చేస్తారు. బాధితులు ఎవరూ ముందుకు రాకుంటే సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారులు దర్యాప్తు చేపడతారు. ఈ వ్యవహారంలో పారీ్టలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల తీరుతెన్నులను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు. పాస్‌పోర్టులు సైతం రద్దుకు సిఫార్సు.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతున్న అభ్యంతరకరమైన, అశ్లీల, కించపరిచే పోస్టుల్లో కొన్ని ఇతర దేశాల నుంచి పోస్టు అవుతున్నాయి. వీటిని సృష్టిస్తున్న వ్యక్తుల్లో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఉండటంతో ఇప్పటి వరకు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తులు దేశానికి వస్తేనే పట్టుకునే ఆస్కారం ఉంటోంది. ఇలాంటి వారికీ చెక్ చెప్పడానికి సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో నిందితులు ఎన్నారైలు ఉంటే వారి పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఆర్పీఓకు సిఫార్సు చేస్తారు. దీంతో ఆయా వ్యక్తులను వారు ఉంటున్న దేశాలు బలవంతంగా తిప్పి పంపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శిక్షలు పడే వరకు పర్యవేక్షణ.. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్‌మీడియాల్లో అవాంఛనీయ పోస్టులపై కేసుల నమోదుతో సరిపెట్టవద్దని ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి కేసునూ చట్ట ప్రకారం దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటే వాట్సాప్, ట్విట్టర్ల ద్వారానే ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాట్సాప్‌లో ఉండే గ్రూపులే వదంతులు విస్తరించడానికి కారణమవుతున్నా యని వివరిస్తున్నారు. ఏ సమాచారం అయినా పూర్తిగా నిర్ధారించుకోకుండా ప్రచారం, షేరింగ్ చేయవద్దని అలా చేస్తే చట్ట ప్రకారం నేరమే అవుతుందని, అభ్యంతరకర కామెంట్లు చేసినా బాధ్యులేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో కొత్త పోలీస్స్టేషన్లు.. ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దశాబ్ద క్రితం వరకూ శివారు ప్రాంతాలు అనుకున్నవన్నీ నేడు ప్రధాన నగరంలో కలిసిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డును దాటేసి.. రీజినల్ రింగ్ రోడ్ వైపు పరుగులు పెడుతోంది. దీంతో అదే స్థాయిలో శాంతి భద్రతలను కల్పించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్‌లో కొత్తగా నాలుగు ఠాణాలు, రాచకొండలో ఒక డివిజన్, పీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అనేది జనాభా, నేరాల సంఖ్యను బట్టి ఉంటుంది. ఐటీ కంపెనీలతో పశ్చిమ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ తదితర ప్రాంతాలు నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో శాంతి భద్రతలను పెంచాల్సిన అవసరం ఉందని ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సైబరాబాద్‌లో నాలుగు పీఎస్‌లు.. సెబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దేశంలో లక్ష జనాభాకు 138 మంది పోలీసులు ఉండగా.. సైబరాబాద్‌లో 86 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు, 9 డివిజన్లలో 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్ డివిజన్లోని నార్సింగి, మియాపూర్ డివిజన్లోని ఆర్సీపురం, చేవెళ్ల డివిజన్లోని శంకర్పల్లి పీఎస్‌ల పరిధిని కుదించి.. ఆయా ప్రాంతాలతో పాటూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలిపి కొత్తగా సైబరాబాద్ కమిషనరేట్‌లో నాలుగు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో నార్సింగి పీఎస్‌లోని గండిపేట, మెకిల్ల.. ఆర్సీపురం పీఎస్‌లోని కొల్లూరు, శంకర్పల్లి పీఎస్‌లోని జన్వాడ పేరిట కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రధాన నగరంలోని పోలీస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో పాటూ నేరాల నియంత్రణ సులువవుతుందని తెలిపారు. 2 నుంచి 3 వేల పోలీస్ సిబ్బంది కూడా.. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పోలీస్ స్టేషన్లతో పాటూ కొత్తగా రానున్న వాటిల్లో పోలీసుల నియామం చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు సమాచారం. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అదనంగా 2–3 వేల మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌కు 9,403 మంది సిబ్బంది మంజూరు కాగా.. ప్రస్తుతం అన్ని ర్యాంక్‌లలో కలిపి 6,599 మంది సిబ్బంది ఉన్నారు. 2,804 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. (ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?) రాచకొండలో కొత్త డివిజన్, పీఎస్.. 5,091.48 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న రాచకొండ ఏరియా వారీగా దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్. రాచకొండలో అత్యధిక జనాభా ఉన్న ఎల్బీనగర్ జోన్ నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త డివిజన్, పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న నాగోల్‌ను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎల్బీనగర్ జోన్‌లోని వనస్థలిపురం డివిజన్‌ను విభజించి ప్రత్యేకంగా బాలాపూర్ పోలీస్ డివిజన్ ఏర్పాటు కానుంది. వనస్థలిపురంలోని డివిజన్లోని కొన్ని ప్రాంతాలను, బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లతో పాటు, ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లను కలుపుకొని కొత్తగా బాలాపూర్ డివిజన్ ఏర్పాటు కానుంది. (చదవండి: హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఫ్లైఓవర్లు) -
‘తెలుగు అకాడమీ’ నిందితులపై సస్పెక్ట్ షీట్స్
సాక్షి, హైదరాబాద్: చుండూరి వెంకట కోటి సాయికుమార్... రూ.64 కోట్లతో ముడిపడి ఉన్న తెలుగు అకాడమీ కుంభకోణంలో కీలక సూత్రధారి. వెంకట రమణ, సోమశేఖర్ సహా మరికొందరితో కలిసి 2015 నుంచి ఈ తరహా స్కామ్స్ చేస్తున్నాడు. ఈ గ్యాంగ్ అరెస్టు కావడం, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే పంథాలో నేరాలు చేయడానికి సరైన నిఘా లేకపోవడమే కారణమని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సాయి కుమార్ సహా తెలుగు అకాడమీ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరవాలని నిర్ణయించారు. (చదవండి: పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే..) ► రౌడీలపై రౌడీషీట్, చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్, సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్, భూకబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరవడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఇదే తరహాలో పదేపదే నేరాలు చేస్తున్న మోసగాళ్ల పైనా సస్పెక్ట్ షీట్స్‌ను తెరుస్తున్నారు. ► ఇప్పటి వరకు అసాంఘికశక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్స్‌లో స్వల్ప మార్పులతో సీసీఎస్ అధికారులు ఈ సస్పెక్ట్ షీట్లు నమోదు చేస్తున్నారు. వీటిలో సదరు నేరగాడికి సంబంధించిన ఫొటో, చిరునామా, నమోదై ఉన్న కేసులు, నేరం చేసే విధానం సహా పూర్తి సమాచారం పొందుపరుస్తారు. ► ఈ వివరాలను సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసుస్టేషన్‌కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల ఆయా చోట్ల పోలీసు అధికారులు మారినప్పటికీ వీరిపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. ► సస్పెక్ట్ షీట్ తెరిచిన తరవాత సాయి కుమార్ సహా ఇతర కీలక నిందితులపై స్థానిక పోలీసుల నిఘా కొనసాగుతుంది. మరోపక్క గస్తీ బృందాలు సైతం అనునిత్యం వారి ఇళ్లకు వెళ్లి కార్యకలాపాలు, కదలికల్ని పరిశీలిస్తుంటారు. సీసీఎస్ పోలీసులు సైతం కనీసం ఆరు నెలలకు ఒకసారి ఈ నిందితుల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ► ఇలాంటి షీట్లను తెరవడానికి సదరు కార్యాలయానికి పోలీసుస్టేషన్ హోదా ఉండటం తప్పనిసరి. సీసీఎస్‌తో పాటు సైబర్ క్రైమ్ ఠాణాకు సైతం ఈ హోదా ఉంది. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటు ఆధారంగానే సాయి, వెంకట రమణ తదితరులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నారు. (చదవండి: తెలంగాణ జైళ్లలో యువత; ఉజ్వల భవిత.. ఊచల వెనక) ► మరోపక్క తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన కీలక నిందితుల్లో బయటి రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి నేర చరిత్ర లేని వీరు బయటి ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై ఇక్కడ షీట్ తెరిచినా ఉపయోగం లేదు. ► దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇలాంటి నేరగాళ్ళపై షీట్లు తెరవడంతో పాటు ఆ వివరాలను వారు నివసిస్తున్న ప్రాంతం ఏ జిల్లా పరిధిలోని వస్తుందో ఆ జిల్లా ఎస్పీలకు లేఖ ద్వారా నివేదించనున్నారు. అందులో నేరగాడి చరిత్ర రాయడంతో పాటు నిఘా ఉంచాల్సిందిగా కోరనున్నారు. ► ఈ తరహా మోసాలకు పాల్పడిన సస్పెక్ట్ షీటర్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లలో ఉంచడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం సాధ్యం కాదనే వాదన ఉంది. సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరిచూసుకోవడం సాధ్యం కాదు. ► ఇలాంటి వారి వివరాలను పోలీసు అధికారిక వెబ్సైట్లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఎవరికైనా వీరిపై అనుమానం వస్తే సరి చూసుకోగలుగుతారు. -
నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు..
నగర నయా పోలీస్ బాస్ సీవీ ఆనంద్.. ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. ఆదర్శ్‌నగర్‌లో వారి ఇల్లు ఉండేది. అక్కడ నుంచి తరచూ ట్యాంక్‌బండ్ మీదకు వెళ్లేవారు. ఆ సందర్భాల్లోనే హుస్సేన్‌సాగర్‌లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. సెంట్రల్ జోన్ డీసీపీగా పని చేస్తున్నప్పుడు 2002లో లేక్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్యల నివారణలో తనదైన శైలితో ముందుకెళ్లారు. ప్రస్తుతం సిటీ సీపీగా కొత్త బాధ్యతలతో శాంతిభద్రతల పరిరక్షణకు గట్టిగా కృషిచేస్తానంటున్నారాయన. ప్రజల శ్రేయోభిలాషిగా నిలుస్తానంటున్నారు ఆనంద్. సిటీ కమిషనర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏసీబీ డీజీగా వెళ్తున్న అంజనీకుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. – సాక్షి, హైదరాబాద్ సిటీపై పట్టుంది.. నేను సిటీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నా. నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈస్ట్‌జోన్ డీసీపీ, సెంట్రల్ జోన్ తొలి డీసీపీగా, ఆపై ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా పని చేశా. ఇలా వివిధ హోదాల్లో, వివిధ విభాగాల్లో పని చేసిన నేపథ్యంలో సిటీపై పట్టు ఉంది. ఇటీవల కాలంలో నాలుగైదేళ్లు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్విర్తించి తిరిగి వచ్చా. చదవండి: కొడుకుల ప్రోత్సాహంతో.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..! ట్రాఫిక్ నిర్వహణకు ప్రధానం.. ► పోలీసు విభాగానికి సంబంధించి ప్రతి రోజూ నేరుగా ఎక్కువ మంది ప్రజలతో సంబంధాలు కలిగి ఉండేది ట్రాఫిక్ వింగ్. వీళ్లు తీసుకునే ప్రతీ చర్యతో వేలాది మంది వాహనచోదకులు, లక్షలాది నగర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణకు కీలక ప్రాధాన్యమిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకూ పెద్ద పీట వేస్తాం. ఇప్పటికే అమలులో ఉన్న విధానాలను కొనసాగిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. నేరాల నిరోధానికి యాక్షన్ ప్లాన్.. ►ప్రస్తుతం సైబర్ నేరాలను నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిని నిరోధించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తాం. పెట్రోలింగ్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, కొత్త టెక్నాలజీతో కేసులను ఛేదిస్తాం. సొత్తు సంబంధిత నేరాలు, చైన్ స్నాచింగ్స్ నిరోధించేందుకు చర్యలు తీసుకుంటాం. మహిళా భద్రత కోసం ఉన్న షీ–టీమ్స్ మరింత బలోపేతం చేస్తాం. చదవండి: చలనాల నుంచి తప్పించుకోవాంటే.. మాస్క్ ఫర్ నంబర్ ప్లేట్! ►మూడేళ్ల మూడు నెలల పాటు నగర ట్రాఫిక్ అదనపు సీపీ పని చేశా. ఆ సందర్భంలో అనేక తీవ్రమైన ప్రమాదాలకు డ్రంక్ డ్రైవింగే కారణంగా గుర్తించా. దీని వల్ల వాహనచోదకులతో పాటు ఎదుటి వారికీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ట్రాఫిక్ విభాగంలో అనునిత్యం అవసరమైన చర్యలు తీసుకుంటాం. హైకోర్టు ఆదేశాలకనుగుణంగానే న్యూ ఇయర్ వేడుకలు.. ► ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ అంత తీవ్రత లేకున్నా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఈ అంశంలో ప్రభుత్వం సూచించిన విధంగా ముందుకు వెళ్తాం. న్యూ ఇయర్ వేడుకలు ప్రతిసారీ వస్తాయి, పోతాయి. కానీ ప్రాణాలు అత్యంత విలువైనవి. ఈ నేపథ్యంలోనే అందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలి. -
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
-
న్యూఇయర్ టార్గెట్: గ్రాము ‘కొకైన్’ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: బంగారం కంటే మూడు రెట్లు విలువైనదిగా తయారైంది కొకైన్ . గోవా నుంచి గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున దిగుమతి చేసుకొని... హైదరాబాద్‌లో రూ.14 వేలకు విక్రయిస్తున్న ఓ పెడ్లర్‌తో సహా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ డీసీపీ జి.సందీప్‌తో కలిసి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల కోసం.. ♦ బాచుపల్లికి చెందిన రామేశ్వర శ్రవణ్ కుమార్ (24), కొండాపూర్‌కు చెందిన గోరంట్ల చరణ్ తేజ (27) స్నేహితులు. న్యూ ఇయర్ వేడుకలను కొకైన్ మత్తులో తేలిపోవాలని ప్లాన్ వేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్ టోలిచౌకికి చెందిన అరబిక్ టీచర్ మహ్మద్ అష్రఫ్ బేగ్ (37)ను సంప్రదించారు. చెరో గ్రాము కొకైన్ కొనుగోలు చేశారు. ♦ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ పి.శివ ప్రసాద్ తన బృందంతో రాయదుర్గం పీఎస్ పరిధిలోని గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ ఫ్లాట్ నం. బి–1305లో ఇద్దరు వినియోగదారులు శ్రవణ్, చరణ్ తేజలను అదుపులోకి తీసుకున్నారు. ♦ఇద్దరి నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకుని వారిని విచారించగా టోలిచౌకిలోని మహ్మద్ అష్రఫ్ బేగ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో అష్రఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. వ్యక్తిగత ఫోటోలు పంపు, నీ కష్టాలు తీరుస్తానంటూ.... ♦అఫ్రష్ నుంచి 181 గ్రాముల కొకైన్ పౌడర్, 44 ఎండీ ఎక్స్టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను నుంచి 183 గ్రాముల కొకైన్ పౌడర్, 44 ఎండీ ఎక్స్టసీ మాత్రలు, మూడు సెల్ఫోన్లు పట్టబడ్డాయి. వీటి విలువ రూ.26.28 లక్షలు. ♦అష్రఫ్‌ను పోలీసులు విచారించగా.. ప్రధాన డ్రగ్ సరఫరాదారు నైజీరియాకు చెందిన జూడ్ అలియాస్ క్రిస్ దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో సేకరిస్తున్నట్లు తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో నైజీరియా దేశం నుంచి గోవాకు వచ్చి అక్కణ్నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ♦కొంత కాలంగా గోవా నుంచి డ్రగ్స్‌ను దిగుమతి చేసుకొని హైదరాబాద్‌లో వ్యక్తిగత కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు అష్రఫ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు డ్రగ్ సప్లయిర్ గోవాలో ఉంటున్న జూడ్ పరారీలో ఉన్నాడు. చదవండి: బాలికపై కన్నెసి లైంగిక దాడి.. విషయం బయటికి పొక్కడంతో.. ఈ ఏడాది 202 కేసులు.. ♦ కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మాదక ద్రవ్యాల సరఫరా ఉంటుందని సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. బల్క్ సప్లయర్స్, స్థానిక రిటైలర్లు, సరఫరాదారులు, వినియోగదారులపై దాడులు చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. ♦ ఈ ఏడాది ఇప్పటివరకు 202 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. 419 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 23 మందిపై పీడీ యాక్ట్‌లు రిజిస్టరయ్యాయి. 1,770.8 కిలోల గంజాయి, 37.2 కిలోల 124 గంజాయి మొక్కలు, 14 గాంజా మాత్రలు, 8.55 లీటర్ల హషీప్ ఆయిల్, 150 ఎంజీ 12 లైరికా మాత్రలు, 141 కిలోల ఆల్ప్రాజోలం, 116.29 గ్రాముల ఎండీఎంఏ, 200 గ్రాముల ఓపీఎం, 61 ఎక్స్టసీ మాత్రలు, 3 ఎల్సీడీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇదే అత్యధికం.. ఉమ్మడి రాష్ట్రంలో 63 గ్రాముల కొకైన్ హైదరాబాద్ పరిధిలో అప్పట్లో పట్టుబడింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక కొకైన్ కేసుగా నిలవగా.. తాజాగా సైబరాబాద్ పరిధిలో 183 గ్రాముల కొకైన్ కేసు బయటపడటంతో ఇదే అత్యధికమని సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ సందీప్ తెలిపారు. -
జాడలేని దొంగ: స్టార్ హోటల్లే టార్గెట్.. రూ.19 కోట్ల చోరీ
సాక్షి, హైదరాబాద్: 48 ఏళ్ల వయస్సు... 29 ఏళ్ళ నేర జీవితం... 17 ఏళ్ళుగా స్టార్‌హోటల్సే టార్గెట్... 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 36 చోరీలు... దాదాపు రూ.19 కోట్ల సొత్తు అపహరణ... వివిధ రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్... ఇంతటి ఘరానా నేరచరిత్ర కలిసిన గజదొంగ జయేష్ రావ్జీ సెజ్పాల్ కోసం రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతడిని ఆఖరుసారిగా 2018 మార్చ్‌లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడి కదలికలపై సమాచారం ఉండే అందించాల్సిందిగా కోరారు. సెజ్పాల్ గత నెల్లో జైపూర్, ఉదయ్‌పూర్‌ల్లో రెండు నేరాలు చేశాడు. ►గుజరాత్‌కు చెందిన జయేష్ రావ్జీ సెజ్పాల్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఆపై గుజరాత్‌తో పాటు ముంబైలో ఉన్న కొన్ని హోటల్స్/ఫుడ్ పాయింట్స్‌లో క్యాటరింగ్ వర్కర్‌గా పని చేశాడు. ►ఈ రకంగా వచ్చే ఆదాయంతో బతుకీడ్చటం కష్టంగా మారడంతో 1991లో తొలిసారిగా ముంబైలోని డొంగ్రీ ఠాణా పరిధిలో చోరీ చేశాడు. అప్పట్లో బాగా క్రేజ్ ఉన్న వీసీపీని ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కి ఆథర్ రోడ్ జైలుకు వెళ్ళాడు. ►అక్కడే ఇతడికి రమేష్ ఛాగ్ అనే మరో నేరగాడి సలహాతో స్టార్ హోటళ్ళను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేయాలని పథకం వేశాడు. ఓ నగరాన్ని టార్గెట్‌గా చేసుకునే జయేష్ ట్రావెల్స్ బస్సుల్లో అక్కడకు చేరుకుంటాడు. ►బోగస్ గుర్తింపుకార్డులు దాఖలు చేయడం ద్వారా మధ్య తరహా లాడ్జిల్లో బస చేస్తాడు. ఆపై ఆటోలో ఏదో ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్తాడు. కొత్తగా పెళ్ళైన జంట లేదా వివాహ వేడుకలకు హాజరైన జంటల్ని గుర్తిస్తాడు. ►వీరి వద్దే భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలు ఉంటాయనే ఉద్దేశంతో వీరిని ఎంచుకుంటున్నాడు. ఒకటికి రెండుసార్లు వారిని ఫాలో అవుతూ ఏ గదిలో బస చేశారో, ఏఏ సమయాల్లో బయటకు వెళ్ళి వస్తున్నారో గుర్తిస్తాడు. ►నీట్‌గా తయారయ్యే, పక్కా వాక్చాతుర్యం కలిగి ఉన్న జయేష్ ఆ హోటల్ సిబ్బందిని మచ్చిక చేసుకునో, బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ ద్వారానో ఆ గదిలో బస చేస్తున్న తన ‘టార్గెట్’ పేరు, వివరాలు తెలుసుకుంటాడు. ►ఆపై హోటల్ లాబీల్లో ఆ జంటలో ఒకరిని (రూమ్ ఎవరి పేరుతో బుక్కై ఉంటే వారిని) పేరుతో పలకరిస్తూ వారితో మాట కలుపుతాడు. ఇలా ఒకటిరెండుసార్లు తన టార్గెట్‌తో మాట్లాడుతూ హోటల్ సిబ్బంది కంటపడతాడు. ►దీంతో వారు జయేష్ సదరు జంటకు బంధువో, స్నేహితుడో అయింటాడని భావిస్తారు. వీరికి ఈ భావన వచ్చిందనే నమ్మకం కలిగిన తర్వాత తన టార్గెట్ బయటకు వెళ్ళే వరకు ఎదురు చూస్తాడు. ►ఆపై వారి గది ఉన్న ఫ్లోర్‌కు చేరుకుని రిసెప్షన్‌ను సంప్రదించి యాక్సిస్ కార్డు మర్చిపోయానంటూ చెప్పి హోటల్ సిబ్బందిని నమ్మిస్తాడు. వారి నుంచి మరో యాక్సిస్ కార్డు తీసుకుని టార్గెట్ చేసిన వారు బస చేసిన గదిలోకి ప్రవేశిస్తాడు. ►చేతికి చిక్కిన బంగారం, వజ్రాల ఆభరణాలను తస్కరించి హోటల్ నుంచి ఆటోలో బయలుదేరి తాను బస చేసిన లాడ్జికి వెళ్తాడు. అక్కడ నుంచి సొత్తుతో సహా ముంబైకి పారిపోయి చోరీ సొత్తు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. ►ఈ పంథాలో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం సహా 18 నగరాల్లో నేరాలు చేశాడు. జయేష్ 2014లో తొలిసారిగా సిటీకి వచ్చి జూన్ 6న మెర్క్యూరీ హోటల్లో పంజా విసిరి రూ.10 లక్షల సొత్తుకు పోయాడు. ►2016 డిసెంబర్ 16న అమీర్‌పేట మ్యారీగోల్డ్ హోటల్లోని రూ.4 లక్షల బంగారం ఎత్తుకుపోయాడు. 2018 మార్చ్ 6న బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో రూ.30 లక్షల బంగారం చోరీ చేసి నగర పోలీసులకు చిక్కాడు. ►బెయిల్‌పై వెళ్లిన జయేష్ గత నెల 20న ఉదయ్‌పూర్‌లోని హోటల్లో రూ.కోటి బంగారం, ఆఖరి వారంలో జైపూర్‌లోని హోటల్ నుంచి రూ.2 కోట్ల బంగారం, నగదు తస్కరించాడు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా ఇతడిని గుర్తించిన రాజస్థాన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ►‘ఆరు రాష్ట్రాలకు వాంటెడ్‌గా ఉండగా మనం చాకచక్యంగా పట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరిచయస్తులైన రాజస్థాన్ పోలీసులు జయేష్ ఆచూకీ కోసం ఆరా తీశారు. మన దగ్గరి వివరాలు చెప్తున్నాం. దీనిపై ఎలాంటి అధికారిక లేఖలు లేవు. మనమిచి్చన సమాచారంతో అతడికి సూరత్‌లో పట్టుకున్నట్లు తెలుస్తోంది’ అని నగర అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
కూకట్పల్లి కానిస్టేబుల్ నిర్వాకం.. మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం
సాక్షి, హైదరాబాద్: ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ కానిస్టేబుల్ మైనర్ బాలికపై లైంగికదాడికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయ్యప్పరెడ్డిగూడ కాలనీకి చెందిన శేఖర్ కూకట్‌పల్లిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంట్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మేస్త్రీ కుటుంబం ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. వీళ్లకు 14 ఏళ్ల అమ్మాయి ఉంది. బుధవారం ఉదయం 7–8 గంటల ప్రాంతంలో బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డాడు. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకునే సరికి అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీస్ కానిస్టేబుల్ శేఖర్‌ను చితకబాది 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. నిందితుడు శేఖర్‌పై శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాలిక ఇంట్లో.. కోడి గుడ్లు పెడుతుందని, చూసేందుకు వెళ్లానని శేఖర్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. చదవండి: ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని.. -
ఇన్నోవా కారులో ముగ్గురు.. ఎలాంటి లెక్కలు లేవు.. రూ. కోటి స్వాధీనం
సాక్షి, మణికొండ: ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ఎలాంటి లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ. కోటి నగదును నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టగా టీఎస్ 15ఈబీ 3993 నెంబర్ గల ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఆపి తనిఖీ చేయగా నగదు దొరికింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం ప్రాథమిక విచారణలో భాగంగా వారు రూ.కోటి రూపాయలను నగదుగా హ్యాకర్లకు ఇస్తే వారు ఇతరుల బ్యాంక్ అకౌంట్లనుంచి తస్కరించి తమకు రూ. 2 కోట్లను బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తారని అంగీకరించారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్‌కంట్యాక్స్ శాఖకు అప్పగిస్తామని, తదుపరి విచారణతో పాటు వీరి వ్యవహారాలపై మంగళవారం లోతుగా విచారణ జరుపుతామన్నారు. అప్పటి వరకు డబ్బుతో దొరికిన వారి పేర్లు.. వివరాలను ఇచ్చేందుకు నార్సింగి పోలీసులు నిరాకరించారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం -
ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్/మణికొండ: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. కేసుల నమోదు, స్టేషన్ల బెయిల్, భూవివాదాలు, సినిమా షూటింగ్ అనుమతులు.. ఇలా పోలీసుల అవసరం ఉన్న ప్రతీ చోట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏసీపీ, డీసీపీలూ తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుండటంతో బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్లను ఆశ్రయిస్తున్నారు. ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి సదరు పోలీసులను సస్పెండ్ చేస్తున్నా రు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి ఠాణాలో ఇన్స్పెక్టర్, ఎస్ఐలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. రెండ్రోజుల క్రితమే ఓ నేరస్తునితో జట్టు కట్టి డబ్బులు వసూలు చేసిన సరూర్‌నగర్ ఎస్ఐ సైదులును రాచకొండ సీపీ సస్పెన్షన్ చేసిన విషయం విదితమే. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో పోస్టింగ్‌ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం.. ►ఒక్క పోస్టింగ్ దొరికితే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతి, అక్రమాలు బయటపడిన స్థానిక రాజకీయ నేతలు వారిని కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ►రాజకీయ బలం ఉన్న ఇన్స్పెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వేటు వేసినా.. తమకున్న రాజకీయ అండదండలతో వేరే చోట లేదా వేరే కమి షనరేట్‌లో పోస్టింగ్‌లు పొందుతున్నారు. నిజాయితీ గల అధికారులకు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఎస్హెచ్ఓ పోస్టింగ్ దక్కడంలేదు. ►పోస్టింగ్‌ల విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇప్పిస్తుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చదవండి: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఓపిక ఉంటే అక్కడైనా రాయొచ్చు! సెటిల్మెంట్లలో.. భూ వివాదాలలో.. ►నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడంతో నేరస్తులతో దోస్తీ కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్స్పెక్టర్లు, సెక్టార్ ఎస్ఐలు కాసులు దండుకుంటున్నారు. ►అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్సింగి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధనం గంగాధర్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కె. లక్ష్మణ్‌లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ►గతంలో వీరిద్దరిపై పలు భూ వివాదాలలో సెంటిల్మెంట్లు చేసినట్లు విచారణలో తేలింది. కొల్లూరు, జన్వాడ గ్రామాల సరిహద్దు భూ వివాదంలో తలదూర్చి సెటిల్మెంట్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దోస్తీ కట్టి.. దొరికిపోయి.. ►రెండు రోజుల క్రితమే సరూర్‌నగర్ ఎస్ఐ బి.సైదులును రాచకొండ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా నేరస్తుడితో సైదులుకు పరిచయం ఏర్పడింది. అనతికాలంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ►ఎస్ఐ కుటుంబంతో సహా కలిసి విజయవాడ విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు ఖరీదైన హోటల్లో బస ఏర్పాటు చేశాడు. రవాణా, భోజనం, ఇతరత్రా ఖర్చులను నేరస్తుడే భరించాడు. ఆయా బిల్లులన్నీ భద్రపరుచుకున్నాడు. ►తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక.. అధికారాన్ని వినియోగించుకొని తనను బెదిరించాడని సదరు నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్ఐతో దిగిన ఫొటోలు, హోటల్ బిల్లులు తదితర ఆధారాలన్నీ జత చేశాడు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు. ‘సమర్పించు’కోకపోతే అనుమతులివ్వరు.. ►సినిమా షూటింగ్‌లకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే వారికి వసూళ్ల వేదికగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, సరైన పత్రాలు ఉన్నా.. పోలీసులకు ‘సమర్పించు’కోకపోతే అనుమతులు రావు. ఇలాంటి సంఘటనలు నార్సింగి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►ఆయా పీఎస్‌ల పరిధిలో షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. అనుమతులు వచ్చినా, రాకపోయిన స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాల్సిందే. సెక్టార్ ఎస్ఐతో పాటు బీట్ కానిస్టేబుళ్లు, పెట్రోలింగ్ సిబ్బంది చేయి తడపనిదే సినిమా షూటింగ్ ముందుకు సాగని పరిస్థితి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ►కేవలం లా అండ్ ఆర్డరే కాదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సదరు అధికారులకు తడపనిదే పని జరగని పరిస్థితి. రాయదుర్గం పరిధిలోకి వచ్చే ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సినిమా నిర్మాతలకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. స్టేషన్ బెయిల్ కోసం లంచం.. గత నెల 21న స్టేషన్ బెయిల్ కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు మహేశ్వరం పీఎస్ కానిస్టేబుల్ యాదయ్య. మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాల్‌రాజ్‌తో పాటు మరో అయిదుగురిపై భూ వివాదంలో మహేశ్వరం ఠాణాలో కేసు నమోదయింది. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కానిస్టేబుల్ యాదయ్య (ఎస్ఐ రైటర్) రూ.25 లక్షల డిమాండ్ చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి రూ.20 లక్షలు, తనకి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. -
సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్
మార్కెట్లోకి ఎన్ని బైకులు వచ్చినా బుల్లెట్ బండికి ఉండే క్రేజే వేరు. యువతలో చాలామంది కలల బండి బల్లెట్టే.. అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఈ బండి అంటే విపరీతమైన పిచ్చి. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇంజిన్ సౌండ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డుగ్గు డుగ్గు డుగ్గు అంటూ వచ్చే సౌండ్‌కే యువత పడిపోతారు. అయితే బుల్లెట్ సౌండ్‌పై ఉన్న మోజుతో చాలామంది బండి సైలెన్సర్లను ఎక్కువ శబ్దం వచ్చేలా ప్రత్యేకించి రూపొందించుకుంటారు. ఇవి రోడ్డుమీద వెళ్తుంటే భారీ సౌండ్‌తోపాటు శబ్ధ కాలుష్యానికి కారణంగా మారుతోంది. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసుల కన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్న బుల్లెట్ బండి సైలెన్సర్స్పై పడింది. దీంతో ప్రత్యేకించి తయారు చేయించుకున్న వందలాది రాయల్ ఎన్ఫీల్డ్ బండ్ల సైలెన్సర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఒక్కచోట చేర్చిన ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోలర్ సాయంతో సైలెన్సర్లను నలిపివేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ పోలీస్ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ ఇప్పుడు సైలెన్స్ అయిపోయాయని ట్వీట్ చేశారు. Customized #dugudugu bandi silencers are under silence.#HyderabadCityPolice #BulletBandi pic.twitter.com/Y0lK6d13Cq — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 19, 2021 -
గుట్టు రట్టు: ఐదుసార్లు కళ్లుగప్పారు.. ఆరోసారికి దొరికిపోయారు
సాక్షి, హైదరాబాద్: తూర్పు తీరంలోని నర్సీపట్నం సమీపంలో ఉన్న నక్కపల్లి క్రాస్ రోడ్స్ నుంచి పశ్చిమాన మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 300 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరు ఇప్పటికే ఐదుసార్లు గంజాయిని అక్రమ రవాణా చేశారని, ఆరో విడతలో దొరికిపోయారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం తెలిపారు. జేసీపీ ఎం.రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలసి ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన విలాస్ భావ్‌సాహెబ్ తన వాహనంలో ఏపీకి కూరగాయలు రవాణా చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ధ్యానేశ్వర్ మోహితే ఇతడికి సహకరించేవాడు. ఈ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో వీరిద్దరూ కలసి గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించారు. దీంతో విశాఖ ఏజెన్సీలో ఉన్న కొందరు గంజాయి వ్యాపారులు, రైతులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి కూరగాయలకు వినియోగించే ఖాళీ ట్రేలతో బయలుదేరేవాళ్లు. నక్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద గంజాయిని లోడ్ చేసుకుని ఆ ఖాళీ ట్రేల మధ్యలో ఉంచేవాళ్లు. తనిఖీల్లో ఎవరైనా అడిగితే కూరగాయలు అన్లోడ్ చేసి వస్తున్నామని చెప్పేవారు. హైదరాబాద్ మీదుగా అహ్మద్‌నగర్‌కు.. సరుకును తమ వాహనంలో అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్– హమ్నాబాద్ (కర్ణాటక) మీదుగా వారు అహ్మద్‌నగర్‌కు చేర్చేవాళ్ళు. కేజీ గంజాయిని రూ.1,500 కొనుగోలు చేసి, మహా రాష్ట్రలో కేజీ రూ.10 వేలకు విక్రయించే వారు. పుణే, ముంబై, నాసిక్‌లలో ఉన్న గంజాయి వ్యా పారులకు ఎక్కువగా సరఫరా చేసేవారు. మా ర్గం మధ్యలో ఉన్న మరికొందరు గంజాయి వ్యా పారులతోనూ వీళ్లు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధానంగా జహీరాబాద్‌లోని ఓ దాబా వద్ద ఆగి ఆ ప్రాంతంలో పాటు హైదరాబాద్‌కు చెంది న వ్యాపారులకు కిలోల లెక్కన అమ్మే వాళ్లు. వీరి ద్వారా ఆ సరుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతా లకు చేరేది. విలాస్, ధ్యానేశ్వర్లు తమ వాహనంలో ఒక్కో దఫా 200 నుంచి 400 కేజీల చొ ప్పున ఐదుసార్లు మహారాష్ట్రకు తరలిం చారు. వీరి దందాపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం, మలక్‌పేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌తో కలసి శనివారం ముసారాంబాగ్ చౌరస్తా వద్ద స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. -
చెలరేగిన సైబర్ నేరగాళ్లు..ఒకే రోజు రూ.27 లక్షలు వసూలు
సాక్షి, హిమాయత్‌నగర్: సైబర్ నేరగాళ్లు మరోసారి భారీగా పంజా విసిరారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో సోమవారం ఒక్కరోజే నగర వ్యాప్తంగా ఏడుగురు వ్యక్తులకు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వల వేసి భారీ మొత్తంలో కాజేశారు. సైదాబాద్‌కు చెందిన యువకుడిని ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.9లక్షలు మోసం చేశారు. అదే తరహాలో అఫ్జల్‌గంజ్‌కు చెందిన మరో వ్యక్తికి టోకరా వేసి రూ.6.44 లక్షలు కాజేశారు. మోతీనగర్ వాసి నుంచి రూ.1.48లక్షలు, వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి నుంచి రూ.3.49లక్షలు, లాల్‌దర్వాజ వాసి నుంచి రూ.1.40లక్షలు, మలక్‌పేట వాసి నుంచి రూ.1.88లక్షలు, లాటరీ పేరుతో చారి్మనర్ వాసి నుంచి రూ.1.18లక్షలు స్వాహా చేశారు. ఇలా 8మంది నుంచి రూ.27.06లక్షలు లూటీ చేశారు. బాధితులు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కానిస్టేబుల్ ఆకృత్యం.. వివాహితపై అత్యాచారయత్నం -
సైదాబాద్ ఘటన దారుణం: కోమటిరెడ్డి
హైదరాబాద్: సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఘటన దారుణమని తెలిపారు. బాధిత కుటుంబాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్, డమ్మీ హోమ్ మంత్రి పలకరించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కనిపించడం లేదనగానే.. పోలీసులు స్పందిస్తే అమ్మాయి బ్రతికి ఉండేదని అన్నారు. పోలీసులున్నది గాడిదలు కాయడానికా అని ఘాటుగా విమర్శించారు. బాలిక మృతికి రాక్షసుడు ఎంత కారణమో.. పోలీసులు కూడా అంతే కారణమని అన్నారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దళిత, గిరిజన బిడ్డని కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారా అని.. కోమటి రెడ్డి వెంటరెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసు శాఖకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు.. అవన్ని డబ్బులతో కొనుక్కుంటున్న అవార్డులని విమర్శించారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసుశాఖ అలసత్వం కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి సమయంలో ఒక కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు. మంత్రి తలసానికి సినీయాక్టర్‌ను పరామర్శించడానికి సమయం ఉంది కానీ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దిశ ఘటనలో చేసినట్లే ఈ ఘటనలోను నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ -
సైదాబాద్ అత్యాచార కేసు: ఆచూకీ చెప్తే రూ. 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ప్రకటించారు. నిందితుడి ఫొటో, ఆనవాళ్లను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలియజేయాలనుకొనేవారు ఈస్ట్‌జోన్ డీసీపీకి 9490616366 లేదా టాస్క్‌ఫోర్స్ డీసీపీకి 9490616627 ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై అంజనీకుమార్ మంగళవారం సమీక్షించారు. నిందితుడిపై రివార్డు ప్రకటన నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులూ రంగంలోకి దిగారు. మొత్తం పది బృందాలు క్షేత్రస్థాయిలో గాలిస్తుండగా మూడు కమిషనరేట్లకు చెందిన ఐటీ సెల్స్ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. రాజు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో ఆచూకీ కనిపెట్టడం జటిలంగా మారిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు అతడి ఫొటోతోపాటు వివరాలనూ పంపినట్లు ఆయన తెలిపారు. రాజు మద్యం మత్తులో వైన్ షాపులు, ఫుట్‌పాత్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లోనే తలదాచుకుంటూ ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ దారుణం అనంతరం రాజు పారిపోవడానికి అతని స్నేహితుడు సహకరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు సోమవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుగా పోలీసులు చెబుతున్నారు. వ్యసనాలు, చిల్లర దొంగతనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతున్న రాజుకు అతని కుటుంబం దూరంగా ఉంటోంది. భార్య కూడా అతన్ని వదిలేసింది. అందుకే అతని కుటుంబీకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇవీ రాజు ఆనవాళ్లు... ►30 ఏళ్ల వయస్సు, ముఖానికి గడ్డం ►దాదాపు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ►రబ్బర్ బ్యాండ్‌తో బిగించి ఉండే పొడువాటి జుట్టు ►తలపై టోపీ, మెడలో ఎర్రటి స్కార్ఫ్ ►రెండు చేతుల మీదా మౌనిక అనే పేరు పచ్చబొట్టు -
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్ నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు ఉంటుందని, పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని తిరుగుతాడని తెలిపారు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే అతని రెండు చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందని తెలిపారు. రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడు ఇంకా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరురోజులైన నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం.. -
సైబర్ కేసుల ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: నానాటికీ గణనీయంగా పెరిగిపోతూ ప్రజలను నిలువుగా ముంచుతున్న సైబర్ నేరాలపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓ పక్క వీటిని నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే... కేసులను కొలిక్కి తీసుకురావడానికి కీలక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేసుల నమోదు ప్రక్రియను వికేంద్రీకరించడంతో పాటు అన్ని స్థాయిల దర్యాప్తు అధికారులకూ ఉపయుక్తంగా ఉండేలా ‘ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ’పేరుతో ఓ ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించి అన్ని ఠాణాలకు సరఫరా చేస్తోంది. ► ప్రస్తుతం రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అధికారికంగా సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో సైబర్ క్రైమ్ సెల్స్ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు కేవలం వీళ్లే సైబర్ నేరాలను దర్యాప్తు చేసేవాళ్లు. ►సైబర్ క్రైమ్ ఠాణాల్లో ఏటా వేల కేసులు నమోదు అవుతుండగా... వీటికి మూడునాలుగు రెట్ల వరకు పిటిషన్లు విచారించాల్సి వస్తోంది. దీంతో ఉన్నతాధికారులు స్థానిక పోలీసు స్టేషన్లలోనూ ఈ కేసుల నమోదుకు ఆదేశాలిచ్చారు. ► ఇప్పటికే ఆయా ఠాణాల్లోని ఎంపిక చేసిన కానిస్టేబుళ్లు, ఎస్సైలకు సైబర్ నేరాల కేసుల దర్యాప్తుపై సైబర్ క్రైమ్ అధికారులు తర్ఫీదు ఇచ్చారు. అయితే కొన్ని సాంకేతిక అంశాలపై వీరికి పట్టు లభించడంలేదు. ► ఈ కారణంగా కేసుల దర్యాప్తు ఆలస్యం కావడం దాంతో కేసులు మళ్లీ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకే చేరుతున్నాయి. ఫలితంగా ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితులు మొదటికే వస్తున్నాయి. ►మరోపక్క ప్రతి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఓ ఫిర్యాదుల పరిష్కార విభాగం ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్రం ఆదేశించింది. దీంతో ప్రతి సంస్థ తమకు సంబంధించిన నోడల్ లేదా గ్రీవెన్స్ అధికారులను నియమించుకుంది. ►సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో అనుమానితులు, నిందితుల వివరాలు కోరుతూ దర్యాప్తు అధికారులు.. సోషల్‌మీడియా నోడల్/గ్రీవెన్స్ అధికారులకు ఈ–నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరాలు పొందాల్సి ఉంటుంది. ►దీనికోసం ఆయా కేసుల్ని ఎలా దర్యాప్తు చేయాలి? ఏ అంశంలో ఎవరికి నోటీసులు ఇవ్వాలి? వారి వివరాలు, చిరునామా, సంప్రదించాల్సిన నంబర్లు ఇప్పటి వరకు ఠాణాల స్థాయిలో అందుబాటులో లేవు. ►ఈ అంశాలపై దృష్టి పెట్టిన రాష్ట్ర పోలీసు విభాగం ‘ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ’పేరుతో పుస్తకాన్ని తయారు చేసింది. డీజీపీ కార్యాలయంలోని ఐటీ సెల్ నేతృత్వంలో నిపుణుల సలహాలు, సూచనలు, వివరాలతో దీన్ని రూపొందించారు. ►ఇందులో కేసుల దర్యాప్తు తీరుతెన్నులతో పాటు ఏ కేసుల్లో ఎలా స్పందించాలో వివరించారు. ఆయా నోడల్, గ్రీవెన్స్ అధికారుల వివరాలు, సంప్రదించడానికి ఉపకరించే ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు పొందుపరిచారు. ► సమగ్రంగా రూపొందించిన ఈ పుస్తకంలో కేవలం వివరాలు ఇచ్చి వదిలిపెట్టలేదు. ఎవరికి, ఏ ఫార్మాట్లో లేఖ రాయాలన్న దానిపై కొన్ని లేఖల్నీ ముద్రించారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఈ పుస్తకం కీలకంగా మారుతోంది. -
బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా ముసుగులో వ్యభిచారం
సాక్షి, బంజారాహిల్స్: సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఫిలింనగర్‌లోని కిమ్ బ్యూటీ అండ్ స్పాపై దాడులు నిర్వహించి ఓనర్ కిమ్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోగా ప్రొఫెషనల్ థెరపిస్ట్ కూడా లేడని ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా కొనసాగుతోందని.. మసాజ్ కోసం సెక్స్ వర్కర్‌ను నియమించుకున్నట్లు గుర్తించారు. కిమ్‌తో పాటు కొడుకు కాంతిలాల్‌పై కేసు నమోదు చేశారు. కిమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వ్యభిచార గృహంపై.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో వీ.ఎన్. బ్యూటీ స్టూడియో ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ డి.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి వ్యభిచార గృహ నిర్వాహకుడు ఎ. వేణుగోపాల్, స్పా మేనేజర్ ఎన్.రాకేష్, ఎ.సురేందర్రాజులపై కేసు నమోదు చేశారు. ఇక్కడ నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని బాలిక సంరక్షణా కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొస్తూ ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వీడు గజదొంగ గంగన్నా!.. పోలీసులకే కాల్ చేసి సవాల్? -
డీమార్ట్ పేరిట ఘరానా మోసం, లింక్ ఓపెన్ చేశారో అంతే!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. నకిలీ యాప్స్, క్లోన్ వెబ్సైట్ల పేరుతో సైబర్ నేరస్థులు అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాట్సాప్‌లో కూడా నకిలీ వెబ్సైట్ల లింకుల బెడద ఎక్కువగానే ఉంది. సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సారి రిటైల్ సూపర్ మార్కెట్ల దిగ్గజం డీమార్ట్ రూపంలో సైబర్ నేరస్థులు విరుచుకుపడుతున్నారు. చదవండి: Ola Electric: మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్...! డీమార్ట్ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ లింక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్ తన ట్విట్లో పేర్కొంది. నకిలీ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, స్పిన్ వీల్ ఉన్న థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కు ప్రజలు మళ్లీంచబడతారు. మీరు సుమారు రూ. 10,000 వరకు బహుమతి కార్డులను గెలుచుకోవడానికి స్పీన్ వీల్ తిప్పమని అడుగుతుంది. మీరు వీల్‌ను స్పిన్ చేసిన వెంటనే'ఉచిత బహుమతి'తో మరొక లింక్ ఓపెన్ అవుతోంది. గిఫ్ట్‌ను క్లెయిమ్ చేయడానికి 'ఉచిత బహుమతి' పోటీని ఇతర స్నేహితులతో పంచుకోవాలని మిమ్మల్ని అడుగుతుంది.ఆయా లింక్‌లను ఓపెన్ చేస్తే సైబర్‌నేరస్తులు ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. బీ అలర్ట్.. ఈ లింక్ ఓపెన్ చేయవద్దు.#DMart pic.twitter.com/x9XmqHzWqO — Economic Offences Wing Cyberabad (@EOWCyberabad) August 21, 2021 (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
అట్రాసిటీ కేసు: స్పందించిన దాసరి అరుణ్ కుమార్
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఈ రోజు ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా కులం పేరుతో దూషించారంటూ అరుణ్ పై నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో అరుణ్ పై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా దీనిపై అరుణ్ స్పందించాడు. అసలు నర్సింహులు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అరుణ్ చెప్పాడు. ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే ఆయన ఎవరో తెలియదని చెప్పడంతో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారన్నాడు. ఒకవేళ కేసు నమోదైతే పీఎస్‌లో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా? అని పేర్కొన్నాడు. నాన్న దగ్గర ఆ వ్యక్తి ఎప్పుడు పని చేశారో కూడా తనకు తెలియదని, నాన్న సినిమాలకు తాను ఎప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదని వెల్లడించాడు. తనకు తెలియని వ్యక్తికి తాను డబ్బులు ఎలా ఇవ్వాలో తనకు తెలియడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేగాక ఈ వ్యవహారం వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అరుణ్ చమత్కరించాడు. -
దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్ అనే టెక్నీషియన్ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్ ఔట్సోర్సింగ్ పనులు చేశారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్ బాగా పరిచయం. 2018 నవంబర్ 15న దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. (చదవండి: ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్) ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒప్పందంపై తాను సంతకం చేయలేదని అరుణ్ చెప్పారు. ఈ నెల 13న రాత్రి 9 గంటల సమయంలో తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఎఫ్ఎన్సీసీకి రమ్మని చెప్పగా చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని బాధితుడు తెలిపారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే అరుణ్‌కుమార్ కులం పేరుతో తనను దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించడంతో పాటు ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 16న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైరల్ వీడియో: లైక్‌ల కోసం స్నేక్‌ను తిన్నాడు
-
పిచ్చి పరాకాష్టకు: లైక్‌ల కోసం పామును కసాబిసా తినేశాడు
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో లైకుల కోసం కొంతమందికి పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. రాత్రికిరాత్రి పేరు తెచ్చుకునేందుకు మూగజీవాలను హింసిస్తూ వికృతచర్యలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోనే పాతబస్తీ యువకుడు ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వెర్షన్’ పేరుతో ఏకంగా బతికున్న పామునే తింటూ వీడియో తీసుకున్నాడు. తొలుత పాముపిల్ల తలను నోట్లో పెట్టుకున్న యువకుడు.. కొంచెంకొంచెంగా తోక చివరి వరకు నమిలి మింగుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇపుడు వైరల్‌గా మారింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిల్లాడింది. ‘అరేయ్ సాజిద్.. నీళ్ల బాటిల్ తీసుకురా..!’ అంటూ ఆ యువకుడు మిత్రులను ఆదేశించడం వీడియోలో వినిపిస్తోంది. దీనిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. సదరు యువకుడిని పట్టుకుని శిక్షించాలని బుధవారం డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. గతంలో కుక్కలను భవనం పైనుంచి విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు యువకుడిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. -
నన్ను అడ్డుకున్నారు: స్పీకర్‌కు ఎంపీ రేవంత్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని స్పీకర్‌కు ఎంపీ రేవంత్ ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంలో రేవంత్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు వివరణ ఇస్తూ.. పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశం మాకు లేదని, రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడాన్ని మేం ఎక్కడా అడ్డుకోలేదని తెలిపారు. రేవంత్‌రెడ్డి సోమవారం కోకాపేట భూముల సందర్శనకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున నుంచి ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించి రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. -
పోలీసులు,ఇంటెలిజెన్స్‌కు సవాల్‌గా మారిన ‘మల్లేపల్లి’
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు, కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు మల్లేపల్లి సవాల్‌గా మారింది. ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా కొరవడటంతో పాటు సెర్చ్ ఆపరేషన్లు తగ్గాయి. మర్కాజ్ ఘటనతో మల్లేపల్లిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్‌లో స్లీపర్ సేల్స్‌కు అడ్డాగా మల్లేపల్లి మారింది. మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి ఉంటున్న ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. 8 ఏళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను మల్లేపల్లిలో ఎన్ఐఏ పట్టుకుంది. మల్లేపల్లిలో వస్త్ర దుకాణాలను ఆశ్రయం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారు. సూరత్,ముంబై నుంచి వస్త్రాల ఇంపోర్ట్కి కేరాఫ్ అడ్రెస్‌గా మల్లేపల్లి ఉండగా, ఆ ప్రాంతంలో 1200లకు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. యూపీ బీహార్ నుండి వచ్చి హోల్ సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్ గా మకాం పెడుతున్నారు. -
‘ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త’
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ను వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్‌పై మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త... అంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆర్ఎస్ఎస్ నాయకుడిలా వ్యవహరిస్తున్న మీరు మాతో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్ సంభాషణ వైరలైంది. వివరాల ప్రకారం... రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన ఆసిఫ్ ఇక్బాల్ రెండు రోజుల క్రితం మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్‌ను దూషిస్తూ హెచ్చరించారు. మొఘల్‌పురా పరిధిలో జరిగిన ఒక సంఘటన విషయంలో స్థానిక మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌తో పాటు రౌడీషీటర్ ఆసిఫ్ ఇక్బాల్ ఫోన్లో అమర్యాదగా మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆసిఫ్ ఇక్బాల్‌గా రౌడీషీటర్ అని గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే రెయిన్‌బజార్, చాంద్రాయణగుట్ట, మొఘల్‌పురా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసిఫ్ ఇక్బాల్ యెమెన్ దేశంలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. చదవండి: కరోనాతో గాంధీ భవన్ అటెండర్ షబ్బీర్ మృతి నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు? -
లోన్‌యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్‌యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. లోన్‌యాప్స్ ఎండీ దగ్గర నుంచి ఈడీ అధికారి లంచం తీసుకున్నట్లు తేలింది. ఈడీ అధికారిగా పనిచేస్తున్న లలిత్ బజార్డ్ అనే వ్యక్తి బెంగళూరులో రూ. 5లక్షల లంచం తీసుకున్నారు. లంచం తీసుకున్న సదరు అధికారి సీసీఎస్ అధికారులు ఫ్రీజ్ చేసిన ఖాతాలను తెరిపించే ప్రయత్నం చేశాడు. బెంగళూరులోని ఓ బ్యాంకులో లావాదేవీలు జరిగినట్లు తేలింది. కాగా ముంబైకి చెందిన అపోలో ఫైన్‌వెస్ట్ ఎండీ దగ్గర నుంచి లలిత్ లంచం తీసుకున్నారు. బెంగళూరులోని పలు బ్యాంక్‌లకు లలిత్ తప్పుడు పత్రాలు ఇచ్చి డబ్బులు రిలీజ్ చేయించారు. కాగా ఈడీ అధికారి బాగోతంపై హైదరాబాద్ పోలీసులు సీబీఐకి సమాచారం ఇవ్వడంతో బెంగళూరులో లలిత్ బజార్డ్‌పై కేసు నమోదు చేశారు. -
మా నాన్న అంత్యక్రియలు మీరే చేయండి
జవహర్‌నగర్: కరోనా మహమ్మారి మిగిల్చిన ఓ విషాదకర ఘటన జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుడిపూడి గున్నయ్య (75) కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వచ్చి సంతోష్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. గున్నయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీనివాస్ చిన్నతనం నుంచే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుమార్తెలకు వివాహమై ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం గున్నయ్య భార్య అనారోగ్యంతో చనిపోయారు. వారం రోజులుగా గున్నయ్య, కుమారుడు శ్రీనివాస్ కరోనా బారిన పడి నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గున్నయ్య మంగళవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో వైద్యులు తూర్పు గోదావరిలో ఉన్న ఆయన కుమార్తెలకు తండ్రి మరణ వార్త చెప్పారు. లాక్డౌన్ కారణంగా అక్కడికి రాలేకపోతున్నామని, పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు నాగ శ్రీదేవి వాట్సాప్ ద్వారా వేడుకున్నారు. స్పందించిన పోలీసులు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం గున్నయ్య కుమారుడు శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణించిన విషయం అతనికి తెలియదు. చదవండి: దైవ దర్శనానికి వెళ్లొస్తామంటూ.. ముగ్గురి బలవన్మరణం -
కొన్ని ప్రాణాలు కాపాడగలిగామన్న సంతృప్తి ఉంది: నిఖిల్.
‘‘బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కోసం రిక్వెస్ట్ వస్తే మణికొండ నుంచి నా భార్యతో రాజేంద్రనగర్‌లోని ఫార్మా ఫ్యాక్టరీ గోడౌన్ వరకూ వెళ్లి, అక్కడ్నుంచి సోమాజిగూడ ఆసుపత్రి దాకావెళ్లి ఆ మెడిసిన్ అందజేశాను. రాత్రి 2 గంటల టైమ్‌లో నేనొస్తానని ఊహించలేదేమో.. ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు హీరో నిఖిల్. నాలుగు రోజుల క్రితం నిఖిల్ అవసరార్ధుల కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రికి మెడిసిన్స్ తీసుకెళుతున్న సమయంలో పోలీసులు ‘ఈ పాస్’ లేదని అడ్డుకున్నారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందంటే... మందులు తీసుకెళుతున్నప్పుడు పోలీసులు ఆపారు. మాస్క్ తీసి ముఖం చూపలేదు కానీ, ప్రిస్క్రిప్షన్ చూపించి, ఎమర్జెన్సీ అని చెప్పినా ‘ఈ పాస్’ ఉండాల్సిందే అన్నారు. రోడ్డు మీదే 20నిమిషాలు ట్రై చేసినా పాస్ దొరకలేదు. ఆ విషయాన్నే ట్వీట్ చేశా’’ అన్నారు నిఖిల్. ఈ ఉదంతం బయటకు వచ్చేవరకూ నిఖిల్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో నిఖిల్ పంచుకున్న అనుభవాలివి.. తుపాన్లు, వరదలు వస్తే నష్టాన్ని అంచనా వేసి తలా ఇంత అని సాయం చేయడం వేరు. కానీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, మందులు దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితులు.. అంచనాలకు అందని వ్యాధులు.. వీటి మధ్య అవసరార్ధులకే కాదు సాయం చేయాలనుకున్నవారికీ కష్టమే. గత ఏప్రిల్‌లో నా భార్య, మా అంకుల్ కోవిడ్ బారిన పడినప్పుడు ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను ఆలోచింపజేశాయి. అప్పటికే ట్విట్టర్లో చూస్తే... పెద్ద సంఖ్యలో సాయం కోరుతూ రిక్వెస్టులు. కొంతమందికైనా సహాయం చేయాలనుకున్నాను. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో వచ్చిన ప్రతీ రిక్వెస్ట్‌నీ పరిశీలించి, వీలైనంతవరకూ అటెండయ్యాం. ఇంజక్షన్ కావాలన్నవారికి ఇంజక్షన్, మెడిసిన్స్ అంటే మెడిసిన్స్, ఆసుపత్రి బిల్ కట్టలేకపోయిన వారికి బిల్లు... ఇలా వందలాది పేషెంట్స్‌కి కావాల్సినవి సమకూర్చగలిగాం. కాకినాడ కేజీహెచ్‌లో ఒకరికి బ్లాక్ ఫంగస్, విజయవాడ కామినేని ఆసుపత్రిలో ఇలా కొందరి గురించి ఆరోగ్యాంధ్రకు వారిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తే.. వారు కూడా ఆయా పేషెంట్స్‌కి ఉచితంగా చికిత్స చేయించారు. నాకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఆసుపత్రుల్లో మంచి పరిచయాలు ఉండడం హెల్ప్ అయింది. రిక్వెస్టులు తగ్గాయి ఈ నెల 15 వరకూ రోజుకు దాదాపు 1000 దాకా రిక్వెస్టులు వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టడం వల్ల, బెడ్స్ బాగా పెరిగి అందుబాటులోకి రావడం వల్లనేమో ఆ తర్వాత తగ్గాయి. గతంలో తిత్లీ తుపాన్ టైమ్‌లో కూడా బాధితులకు సేవ చేసిన అనుభవం ఉంది. అయితే ఇన్ని రోజులు ఇంత కంటిన్యూగా చేయడం చాలా కొత్త అనుభవాలను, పాఠాలను నేర్పింది. ఒక అబ్బాయికి ఆక్సిజన్ సిలిండర్ పంపిస్తే అది ఇంటికి చేరేలోపు చనిపోయాడు. ఇలా చివరి నిమిషాల్లో రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల ప్రాణాలు కాపాడలేకపోవడమనే బాధ కలచివేసింది. ఏదేమైనా కొన్ని ప్రాణాలైనా కాపాడగలిగాం, కొంతమందికైనా ఉపశమనం ఇచ్చామనే సంతృప్తి అయితే ఉంది. పుట్టినరోజుకి ఫస్ట్ లుక్ నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘18 పేజెస్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అయితే బుధవారం అప్డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘18 పేజెస్’ టైటిల్ ఫిక్స్ చేసినప్పటినుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బాబు, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శరణ్ రాపర్తి, అశోక్ బి. -
ఔరా! వీళ్లంతా అత్యవసర సర్వీసులకేనా!
సాక్షి, హైదరాబాద్: ∙నగర పోలీసులు తమ విశ్వరూపం చూపించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపించారు. శనివారం ఎక్కడికక్కడ వాహనదారులను అడ్డుకొని పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. భారీ సంఖ్యలో వాహనాలు సీజ్ చేశారు. ఏకంగా డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం రంగంలోకి దిగారు. గ్రేటర్‌లోని ముగ్గురు సీపీలు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌భగవత్‌లు వారి పరిధిలో తనిఖీలు నిర్వహించారు. కారణాలు లేకుండా రోడ్డెక్కిన వాహనదారులకు సీరియస్‌గా క్లాస్ పీకారు. ఎవ్వరినీ ఉపేక్షించకుండా భారీగా జరిమానాలు సైతం విధించారు. లాక్డౌన్ నిబంధనల్ని కఠినతరం చేయాలని సీఎం ఆదేశించడంతో..ఇప్పటి వరకు కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించిన పోలీసులు ఒక్కసారిగా ‘లాక్’ బిగించారు. దీంతో వాహనదారులు హడలెత్తారు. కాగా సడలింపు సమయం ముగిసినా ఆ తర్వాత కూడా ఎక్కడ చూసినా జనాలు కనిపించారు. పాస్‌లు ఉన్న వాళ్లు, లేని వాళ్లు అనే తేడా లేకుండా రోడ్లపైనే ఉన్నారు. నిన్నటి వరకు నామమాత్రంగా మారిన చెక్ పోస్టులతో వీరికి చెక్ చెప్పేవాళ్లు లేకుండా పోయారు. అనేక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. రాజధానిలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. మదీనా సెంటర్లో వాహనం సీజ్‌చేసి తీసుకెళ్తున్న పోలీసులు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా రంగంలోకి దిగాలని, పరిస్థితుల్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో మేల్కొన్న పోలీసులు శనివారం నుంచి హడావుడి చేయడం మొదలెట్టారు. ఉన్నతాధికారులు అంతా చెక్‌పోస్టులతో పాటు వారి పరిధిల్లో పర్యటించారు. ఎక్కడిక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలకు ఆదేశించారు. ఇప్పటి వరకు సరుకు రవాణా వాహనాల సంచారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే ఆదివారం నుంచి మాత్రం కేవలం రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. లోడింగ్, అన్లోడింగ్ వాహనాలకు ఇది వర్తించనుంది. అంజనీ ఆన్ రోడ్ సీపీ అంజనీకుమార్ స్వయంగా రోడ్డెక్కి వాహనదారులను అడ్డుకున్నారు. లాక్డౌన్ సమయం ముగిసినా ఎందుకు బయటకు వచ్చారని వారిని సీరియస్‌గా ప్రశ్నించారు. బిగ్‌బాస్ ఇన్ యాక్షన్ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సజ్జనార్ సీరియస్ కూకట్పల్లి: లాక్డౌన్ ఉల్లంఘనలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. స్వయంగా చెక్‌పోస్టుల వద్ద ఆయన వాహనదారులను ఆపి ఎందుకు బయటకు వచ్చారని నిలదీశారు. -
Lockdown: ‘మా కుక్కకు బాలేదు.. వచ్చే నెల నా పెళ్లి’
బంజారాహిల్స్: ‘‘సార్.. వచ్చేనెల 9వ తేదీన నా పెళ్లి.. శుభలేఖలు పంచడానికి స్వయంగా నేనే బయటికి వచ్చాను’’ అంటూ గురువారం ఉదయం ఫిలింనగర్ సీవీఆర్ చౌరస్తాలో చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు ఓ యువతి చెప్పిన విషయం. లాక్డౌన్ సమయంలో రాకూడదు కదా అని పోలీసులు ప్రశ్నిస్తే ఈ సమ యంలోనే బంధుమిత్రులు దొరుకుతారని ఆమె సమాధానం. అయితే ఆమెకు పోలీసులు జరిమానా విధించారు. ‘‘సార్.. మా నానమ్మ అపోలో ఆస్పత్రిలో ఉంది. చూడటానికి వెళ్తున్నా.. ఇదిగో మందుల చీటీ’’ అంటూ ఓ యువకుడు తాను బయటికి ఎందుకు వచ్చానో పోలీసులకు చెప్పే ప్రయత్నం. ఆరా తీస్తే ఆ మందుల చీటీ 2019లో తీసుకున్నది. మరింత లోతుగా ప్రశ్నిస్తే ఇంట్లో బోర్ కొడుతోందని చెప్పాడు. ఆయనకు రూ.వెయ్యి జరిమానా విధించారు. ‘‘సార్.. ఇప్పుడే షాప్ బంద్ చేసి వస్తున్నా’’ అంటూ తాను బయటికి ఎందుకు వచ్చానో ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. మీ షాప్ ఎక్కడ దానికి సంబంధించిన ఆధారాలు ఏవని పోలీసులు ప్రశ్నిస్తే పొంతలేని జవాబులు చెప్పాడు. ఆరా తీస్తే తన స్నేహితుడి వద్దకు వెళ్తున్నట్లుగా తేలింది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘నా పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తున్నానంటూ’’ ఓ వ్యక్తి చెప్పగా పోలీసులు లాక్డౌన్ సమయంలో ఇదేం పని అంటూ మందలించి కేసు నమోదు చేశారు. ఇలా అనవసరంగా లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వస్తున్న వారు పోలీసులకు చిక్కగానే చెబుతున్న పిట్టకథలు. రోడ్డుపైకి వస్తున్న వంద మందిలో 8 మంది అనవసరంగా వస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వీరందరిపై పెట్టీ కేసులు నమోదు చేస్తూ వాహనాలను కూడా జప్తు చేస్తున్నారు. అయినా సరే లాక్డౌన్ సమయంలో అనవసరంగా తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసులు ఫొటోలు తీసుకొని పెట్టీ కేసులు నమోదు చేస్తుంటే అదేదీ వాహనదారులకు పట్టడం లేదు. ఫొటోలు తీసుకున్నారు.. పంపించేస్తున్నారు.. అనే ధీమాలోనే వెళ్లిపోతున్నారు. తెల్లవారి మళ్లీ బయట తిరుగుతున్నారు. ♦కరోనా రెండోదశ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించింది. ♦గతేడాది లాక్‌డౌన్‌తో పోల్చుకుంటే వివిధ కారణాలతో బయటికి వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ♦సడలింపులు ఎక్కువ కావడంతో లాక్డౌన్ సమయంలోనూ రోడ్లపైకి జనం వస్తున్నారు. ♦తెలిసో తెలియకో కొందరు బయట తిరుగుతూ లేనిపోని అనర్ధాలను కొనితెచ్చుకుంటున్నారు. ♦కొన్నిచోట్ల యువకులు సరదా కోసం బయట తిరుగుతుండగా మరికొందరు చిన్నచిన్న అవసరాల రీత్యా రోడ్లపైకి వస్తున్నారు. ♦మరి కొంతమంది మాత్రం పాత మందుల చీటీలు, పడేసిన ఆస్పత్రి ప్రిస్కిప్షన్లు పట్టుకొని పోలీసులకు మస్కా కొడుతూ బయట తిరుగుతున్నారు. వారిని పట్టుకొని వివరాలు అడిగితే ఏవేవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. అయితే.. పోలీసులు వీరిని గాలికి వదిలేయడం లేదు. ఇలాంటి వారికి జరిమానాలు విధిస్తూ పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. చదవండి: పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు -
Charminar: ఆటో డ్రైవర్ వీరంగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండోరోజు లాక్డౌన్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో ప్రజలు లాక్డౌన్ ఆంక్షలు పాటిస్తూ ఇళ్లకే పరిమితయ్యారు. కానీ చార్మినార్ దగ్గర ఓ ఆటోడ్రైవర్ వీరంగం సృష్టించాడు. చార్మినార్ దగ్గర బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తనని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులను ఆపొద్దంటూ గొడవ చేశాడు. అక్కడితో ఆగకుండా తన ఆటో అద్దం బద్దలుకొట్టాడు. దీంతో చెయ్యి తెగిపోయి రక్తం కారుతున్నా మత్తులో హంగామా చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తి చేతికి కట్టుకట్టి మంచి నీరు అందించారు. చదవండి: తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే -
Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మూడు కమిషనరేట్లకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన శాంతిభద్రతల విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేయనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, ప్రధాన రహదారులతో కలిపి మొత్తమ్మీద 346 చెక్ పోస్టులు, మరికొన్ని చోట్ల బారికేడ్లు ఉండనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంది. అయితే ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ తాము నివసిస్తున్న పోలీసుస్టేషన్ పరిధి దాటి వెళ్లద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఉండే చెక్ పోస్టులు, గస్తీ బృందాలు ఇలా వెళ్లేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నిర్ణీత సమయాన్ని మించి రోడ్లపైకి వస్తే వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. వాహనచోదకులపై కేసులు నమోదు చేయనున్నారు. అత్యవసర సేవల ఉద్యోగులు, అనుమతి ఉన్న పనులపై వెళ్తున్న వారిని మాత్రమే ముందుకు పంపిస్తారు. ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు ఖతంగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల్ని వివరిస్తూ, లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించాలని నిర్ణయించారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. బుధవారం నుంచి కేవలం 5 శాతం మంది పోలీసులు మాత్రమే ఠాణాల్లో ఉండనున్నారు. మిగిలిన వాళ్లు రహదారులపైకి వచ్చి పహారా కాయనున్నారు. లాక్డౌన్ ప్రకటనకు ముందే బయలుదేరిన అనేక బస్సులు, రైళ్లు బుధ, గురు వారాల్లో సిటీకి చేరుకోనున్నాయి. ఇలా ఇతర ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వచ్చిన వారికి సహకరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసరమైన, అనుమతి ఉన్న అంశాలకు సంబంధించిన వ్యక్తులు, వాహనాలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఎక్కడికక్కడ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. లాక్ డౌన్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నగరంలో లాక్ డౌన్ అమలు పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారులను జోన్ల వారీగా నియామిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు ఆయా మండలాలకు నేతృత్వం వహించనున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా వీరు ఎప్పటకప్పుడు చర్యలు చేపడతారు. పరిస్థితులను పర్యవేక్షిస్తారు. షిఖా గోయల్ (అదనపు సీపీ): తూర్పు మండలం అనిల్ కుమార్ (అదనపు సీపీ): మధ్య– పశ్చిమ మండలాలు డీ ఎస్ చౌహాన్ (అదనపు సీపీ): దక్షిణ మండలం అవినాష్ మహంతి (సంయుక్త సీపీ) : ఉత్తర మండలం -
మాదాపూర్‌లో జాగ్వార్ కార్ హల్చల్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం రాత్రి జాగ్వార్ కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ఫ్లై ఓవర్ వద్ద పాదచారుడిపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్ కాలనీ నుంచి మాదాపూర్ వైపు జాగ్వార్ కారు శనివారం రాత్రి 9 గంటల సమయంలో అతి వేగంగా దూసుకుంటూ వచ్చింది. ఈ సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కర్ఫ్యూ అమల్లో ఉండడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి వేగంగా నడుపుతూ నిబంధనలు అతిక్రమించాడు. అసలు కర్ఫ్యూ సమయంలో బయటకు ఎందుకు వచ్చాడు? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
సరదాగా యాప్ క్రియేట్ చేసి.. జైలుపాలయ్యాడు
సాక్షి, సిటీబ్యూరో: పేటీఎంను పోలి ఉండే నకిలీ యాప్ ‘పేఏటీఎం స్ఫూఫ్’ యాప్‌ను తయారు చేసింది గుర్గావ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హితేష్ వర్మగా తేలింది. సరదాగా అతడు తయారు చేసిన ఈ యాప్ పలువురు వ్యాపారులు నష్టపోవడానికి కారణమైంది. నగరంలోని దక్షిణ మండల పరిధిలో దీన్ని వినియోగించిన మూడు ముఠాలు పలువురు వ్యాపారులకు టోకరా వేశాయి. అప్రమత్తమైన పేటీఎం సంస్థ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్ నేతృత్వంలోని బృందం హితేష్ వర్మను గుర్గావ్లో అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరు పరిచిన అధికారులు పీటీ వారెంట్‌పై సోమవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. గుర్గావ్లోని పటౌడీ ప్రాంతానికి చెందిన హితేష్ వర్మ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. తనకున్న పరిజ్ఞానంతో పేఏటీఎం స్ఫూఫ్ పేరుతో ఓ నకిలీ యాప్ సృష్టించాడు. దీన్ని కొన్నాళ్ల క్రితం వరకు గూగుల్ ప్లేస్టోర్స్‌లో ఉంచాడు. అనేక మంది ఈ స్ఫూఫ్డ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పేటీఎం యాప్ ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు లావాదేవీ పూర్తయిన తర్వాత ఆ విషయం నగదు చెల్లించిన వ్యక్తి ఫోన్ స్కీన్ర్‌పై కనిపిస్తుంది. కొద్ది క్షణాల్లోనే నగదు పొందిన వ్యక్తి ఫోన్‌కూ సందేశం వస్తుంది. అయితే స్ఫూఫ్డ్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపినట్లు వ్యాపారుల్ని నమ్మిస్తారు. ఈ యాప్ దుకాణదారుడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయదు. డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తే ఆ వ్యాపారి పేరు, ఫోన్ నెంబర్ తెలుసుకుని వాటిని ఈ నకిలీ యాప్‌లో ఎంటర్ చేస్తాడు. ఆపై నిరీ్ణత మొత్తం పొందుపరిస్తే... నిజమైన పేటీఎం యాప్ మాదిరిగానే చెల్లించిన వ్యక్తి ఫోన్‌పై లావాదేవీ పూర్తయినట్లు డిస్ప్లే వస్తుంది. అయితే ఆ నగదు అందుకున్న వ్యక్తికి మాత్రం ఎలాంటి సందేశం రాదు. తమ ఫోన్లో వచి్చన సందేశాన్ని చూపించిన కొందరు మోసగాళ్లు క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ నుంచి జారుకునేవారు. సాంకేతిక కారణాలతో తమకు సందేశం రావడం ఆలస్యమైందని భావిస్తున్న వ్యాపారులు వేచి చూసి మోసపోయే వారు. నగరానికి చెందిన మూడు తొలుత పాతబస్తీలోని చిన్న చిన్న దుకాణాలు, జ్యూస్ సెంటర్ల వద్ద ఈ స్ఫూఫ్డ్ యాప్‌తో ‘ట్రయల్ రన్’ చేశారు. అక్కడ సక్సస్ కావడంతో పెద్ద దుకాణాలపై పడ్డారు. కంచన్‌బాగ్ పరిధిలోని ఓ వస్త్ర దుకాణంలో రూ.28 వేలు, చంద్రాయణగుట్టలోని స్పోర్ట్స్ స్టోర్‌లో రూ.8500, కిరాణా షాపులో రూ.10,700, మీర్చౌక్లో ఉన్న బంగారం దుకాణంలో రూ.28 వేలు వెచి్చంచి ఉంగరం ఖరీదు చేసి మోసం చేశాయి. వీళ్ల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేటీఎం ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు హితేష్ వర్మను పట్టుకున్నారు. చదవండి: విషాదం నింపిన అమెరికా పర్యటన.. ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో.. -
మాస్కు లేకుండా వెళ్తున్నారా? అయితే, కష్టమే!
బంజారాహిల్స్: కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. మాస్‌్కలు లేకుండా తిరుగుతున్న వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రతిరోజూ ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మాస్‌్కలు ధరించకుండా తిరుగుతున్న వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్లైన్లో జరిమానా రశీదును అందజేస్తున్నారు. చెల్లించని వారిని కోర్టులో ప్రవేశపెట్టి 51(ఏ) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వారెంట్ జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నుంచి మాస్‌్కలు లేని వారికి జరిమానాలు విధించే స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిత్యం రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గురువారం ఒక్కరోజే 220 మంది మాస్‌్కలు ధరించకుండా తిరుగుతున్నారంటూ వారికి జరిమానాలు వేశారు. మాస్‌్కలు ధరించకపోతే కరోనా విస్తరించే అవకాశం ఉందని ఒక వైపు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తుంటే చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తాజా తనిఖీల్లో బయటపడిందని పోలీసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వాహనదారులు మాస్‌్కలు ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూటరిస్ట్‌లు 50 శాతం మంది మాస్‌్కలు లేకుండానే దర్జాగా దూసుకుపోతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. ప్రస్తుతం రెండు చోట్ల నిర్వహిస్తున్న తనిఖీలు వచ్చే వారానికి నాలుగైదు చోట్ల నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. (చదవండి: తెలంగాణ: టెన్త్ పరీక్షలు అవసరమా?) -
తెలంగాణలో లాక్డౌన్.. ఫేక్ జీవో వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఆయనో చార్టెడ్ అకౌంటెంట్. ఏప్రిల్ ఫస్ట్ నేపథ్యంలో తనతో బ్యాడ్మింటన్ ఆడే వారిని ఫూల్స్ చేయాలని భావించాడు. దీనికోసం లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించి సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశాడు. దీనిపై తీవ్ర కలకలం రేగడంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసుల బృందం సోమవారం నిందితుడిని అరెస్టు చేసింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని దర్గా మిట్ట ప్రాంతానికి చెందిన శ్రీపతి సంజీవ్‌కుమార్ 1993లో హైదరాబాద్‌కు వలసవచ్చాడు. సీఏ చదివిన అతడు ప్రస్తుతం కార్వే అండ్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిని. మాదాపూర్‌లో నివసిస్తున్న సంజీవ్‌కుమార్ నిత్యం స్థానికులతో కలసి బ్యాడ్మింటన్ ఆడుతుంటాడు. వీరంతా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. తేదీ మార్చి నకిలీ జీవో పోస్టు.. కాగా, ఏప్రిల్ ఫస్ట్ నేపథ్యంలో గత గురువారం ఈ గ్రూప్ సభ్యుల్ని ఫూల్స్‌ని చేయాలని సంజీవ్‌కుమార్ భావించాడు. దీనికోసం ప్రభుత్వ వెబ్సైట్ నుంచి గత ఏడాది లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను (నం.45) డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇందులో తేదీలు మార్చి ఆ కాపీని బ్యాడ్మింటన్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అందులో సభ్యుడైన శరత్‌కుమార్ దాన్ని ఇతర గ్రూపుల్లోకి పంపారు. అలా సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ జీవో తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించి నకిలీ జీవో అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకోవడానికి ఈ అధికారులతో పాటు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులూ రంగం లోకి దిగారు. మొత్తం 18 వాట్సాప్ గ్రూపులకు చెందిన 29 మంది అడ్మిన్లను ప్రశ్నించారు. ఈ జీవో షేర్ అయిన దాదాపు 1,800 సెల్ఫోన్లను పరిశీలించారు. ఎట్టకేలకు సంజీవ్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేసి ల్యాప్‌టాప్, ఫోను స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే ముందు సరిచూసుకోవాలని కొత్వాల్ ప్రజలను కోరారు. అలా కాకుండా చేస్తే ఆయా గ్రూప్ అడ్మిన్లు నిందితులుగా మారతారని, వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తప్పతాగి పోలీసులనే భయపెడున్న డ్రైవర్లు!
⇔ రెండు నెలల క్రితం మియాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ డీడీ తనిఖీల్లో ఉన్నప్పునడు వనస్థలిపురం పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ కారులో వస్తున్నాడు. అయితే పోలీసులను గమనించిన అతను వేగంగా వాహనాన్ని నడుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎస్ఐ రమేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐపీసీ 332 సెక్షన్ కింద కేసు నమోదుచేసి జైలుకు తరలించారు. ⇔ గత నెలలో జేఎన్టీయూ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడు వేగంగా దూసుకువచ్చి పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐను ఢీకొట్టడంతో కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. ⇔ కేపీహెచ్‌బీ కాలనీ నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్ సమీపంలో శనివారం రాత్రి 11.40 గంటలకు ట్రాఫిక్ పోలీసులు డీడీ తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అతిగా మద్యం సేవించి కారులో అతివేగంతో వచ్చిన డ్రైవర్ సృజన్ హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు అక్కడే నిలిచి ఉన్న మహిళను ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకొని అక్కడికొచ్చిన ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి అక్కడి ట్రాఫిక్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో మరోకారులోవచ్చిన ట్సాక్సీ డ్రైవర్ అస్లామ్ అతివేగంతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడిన మహిపాల్‌రెడ్డి రోడ్డు పక్కనే ఉన్న రాయికి తగిలి కాలు విరిగింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. చదవండి: మందుబాబు దూకుడు.. పోలీసుల్నే 'ఢీ' కొట్టాడు ..ఈ మూడు ఘటనలే కాదు...రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఒక్కొసారి వారి ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తున్నాయి. రాత్రి పది దాటిన తర్వాత వివిధ ప్రాంతాల్లో డీడీ తనిఖీలు చేస్తున్న వీరు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నా...డ్రంకన్ డ్రైవర్లు తమను పట్టుకుంటే జరిమానాతో పాటు జైలుకు పంపిస్తారని తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న సిబ్బందిని ఖాతరు చేయకుండా దూసుకెళుతున్నారు. ఫలితంగా పోలీసులు గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇటువంటివారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపుతున్నా అడపాదడపా జరుగుతున్న ఈ ఘటనలు పోలీసులను కలవరపెడుతున్నాయి. ఓవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ...మరోవైపు బారికేడ్లతో రహదారిని దిగ్బంధం చేసి డీడీ తనిఖీలు చేస్తున్న పోలీసులు అడపాదడపా కొంతమంది డ్రంకన్ డ్రైవర్లు చేస్తున్న చేష్టలతో భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ► ఇక డీడీ తనిఖీల సమయంలో పోలీసులు కొన్ని నిబంధనల్ని విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ►వాహనచోదకుడు ఆయా పరిస్థితుల్ని బట్టి కచ్చితంగా వాహనాన్ని స్లో చేసుకునే స్ట్రాటజిక్ పాయింట్స్ (రోడ్డు, బ్రేకర్లు, టర్నింగ్ పాయింట్లు) వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడితే కొంత ఉపయోగం ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. ►వాహనచోదకులను ఆపేందుకు రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నా...వాటి రక్షణలో పోలీసులు ఉండడం లేదు. కొన్నిచోట్లు బారికేడ్ల కన్నా ముందుకెళ్లి వాహనచోదకులను ఆపుతున్న సందర్భాలున్నాయి. ►వాహనచోదకులు హెల్మెట్ వాడినట్టుగానే డీడీ తనిఖీల్లో పాల్గొనే ట్రాఫిక్ పోలీసులు వైట్ క్యాప్‌లు ధరించాలి. దీనివల్ల కొంత ప్రమాదం తప్పే అవకాశం ఉంది. నిబంధనల మేరకు చర్యలు డ్రంకన్ డ్రైవ్ తనిఖీ సమయంలో నిబంధనల ప్ర కారం ఏమేమి రక్షణ చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు వాహనదారులు అతిగా వ్యవహరిస్తే ఐపీసీ 333 సెక్షన్‌తో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇతర చర్యలు తీసుకుంటున్నాం. మందుబాబుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. – విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
నన్ను ఆపడానికి మీరెవరు?
-
తమాషా చేస్తున్నారా.. నన్ను ఆపడానికి మీరెవరు?
సాక్షి, బంజారాహిల్స్: ‘నన్ను ఆపడానికి మీరెవరంటూ’ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాను భైంసాకు వెళ్తున్నట్లు సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరవింద్‌ను అడ్డుకునేందుకు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయినట్లు తెలియడంతో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్. కళింగరావు, ఎస్ఐలు బాలరాజు, కె.ఉదయ్‌తో పాటు పోలీసులు పెట్రోకార్లలో ఆయనను వెంబడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్‌హయత్ హోటల్ ముందు నుంచి వెళ్తున్న ధర్మపురి అరవింద్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోకార్లు రోడ్డుకు అడ్డంగా నిలిపి అడ్డుకున్నారు. దీంతో కారులో నుంచి దిగిన అరవింద్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఆపడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను నిజామాబాద్ వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. హిందువులను నాశనం చేయాలనుకున్నారా.. తమాషా చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో సహకరించాలని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. నిజామాబాద్ వెళ్తుంటే వద్దని చెప్పేందుకు ఆర్డర్ ఏదంటూ నిలదీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చదవండి: నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు 15 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ -
హ్యట్, క్రికెట్ బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి
-
హ్యాట్, బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి!
సాక్షి, హైదరాబాద్ : పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన మహిళా దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళా శక్తికి ఎదురు లేదని..వారిప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం సీపీ అంజనీకుమార్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆదాయ పన్ను శాఖ కమిషనర్ వసుంధర సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: క్రికెట్ ఆడుతున్న మంచులక్ష్మి : మరిన్ని ఫొటోలకోసం ఇక్కడ క్లిక్ చేయండి దృశ్యం 2: కేసు రీఓపెన్ చేయనున్న రానా! అజిత్ షూట్ చేశాడు.. మెడల్ ఇచ్చారు -
‘వీసా అప్లికేషన్ల’పై డబ్బుల వసూలు
సాక్షి, హైదరాబాద్: అన్లైన్లో అమెరికా వీసా కోసం దరఖాస్తు నింపుతున్న అనేకమంది డబ్బు వసూలు చేస్తున్నారంటూ అమెరికా కాన్సులేట్ అధికారులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు ఇటీవల వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వూ్యకు హాజరయ్యారు. దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించుకుని రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున చెల్లించామని చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్లో వీసా దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇది నేరమంటూ మైఖేల్ పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వారితో పూర్తి చేయించుకుని డబ్బు చెల్లించిన కొందరి ఫోన్ నంబర్లు జతచేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెపుతున్నారు. పాస్‌పోర్ట్ పొందడానికి, రెన్యువల్ చేసుకోవడానికి అనేక ఈ, మీ–సేవ కేంద్రాలు సైతం ఈ సేవల్ని అందిస్తున్నాయి. దరఖాస్తు నింపడం తెలియని, ఇబ్బందిగా భావించేవాళ్లు వీటిని ఆశ్రయించి స్లాట్లు బుక్ చేసుకుంటారు. దీని కోసం నిర్ణీత మొత్తాలను చెల్లిస్తారు. ఇది నేరం కానప్పుడు యూఎస్ వీసాకు ఆన్లైన్లో దరఖాస్తును వేరే వ్యక్తుల ద్వారా పూర్తి చేయించడం ఎలా తప్పవుతుందని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా విద్యార్థులతో మాట్లాడాలని నిర్ణయించారు. తామే ఇతరులను ఆశ్రయించి దరఖాస్తును ఇష్టపూర్వకంగా పూర్తిచేయించుకున్నామని చెప్తే కేసు నిలబడదని అధికారులు చెపుతున్నారు. -
దొంగల కుటుంబం: వారి టార్గెట్ అదే..
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): ఓ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఓ సభ్యుడికి చెందిన ఆటోలో తిరుగుతూ బంగారం దుకాణాలను టార్గెట్‌గా చేసుకున్నారు. కస్టమర్లుగా నటిస్తూ వ్యాపారుల దృష్టి మళ్లించి బంగారం, వెండి ఆభరణాలు తస్కరిస్తున్నారు. నెల రోజుల్లో మూడు నేరాలు చేసిన ఈ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని ఓఎస్డీ రాధాకిషన్‌రావు సోమవారం తెలిపారు. ♦ప్రకాశం జిల్లాకు చెందిన వై.రేణుక, ఆమె సమీప బంధువులు ఎం.కిరణ్, వై.రాజు, అతడి భార్యలు తులసి, శ్వేత, మరో బంధువు రాణి 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. ♦హయత్‌నగర్ ప్రాంతంలో స్థిరపడిన వీరు తొలినాళ్లల్లో చిన్నచిన్న పనులు చేసినా... ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రేణుక నేతృత్వంలో వీరు ముఠా కట్టారు. ♦ఈ ఐదుగురూ కిరణ్‌కు చెందిన ఆటోలో నగరంలో తిరుగుతూ దారిలో కనిపించిన జ్యువెలరీ దుకాణాల్లో తమకు అనువుగా ఉన్న దాన్ని ఎంచుకుంటారు. ♦వినియోగదారుల మాదిరిగా అందులోకి ప్రవేశిస్తారు. ఒకరు నగలు, వస్తువులు చూపించాల్సిందిగా యజమానికి చెప్తారు. ఆయన ఆ పనిలో ఉండగా మిగిలిన వారు అతడి దృష్టి మళ్లించి చేతికి చిక్కిన బంగారు, వెండి వస్తువులు తస్కరిస్తారు. ♦వీటిని తమ వస్త్రాల లోపలి భాగాల్లో ప్రత్యేకంగా కుట్టించిన అరల్లో పెట్టుకుని ఆ దుకాణం నుంచి బయటకు వచ్చేస్తారు. ఆపై అంతా కలిసి తమ ఆటోలోనే ఉడాయిస్తారు. చోరీ సొత్తును విక్రయించి వచి్చన సొమ్ము పంచుకునేవారు. ♦ఇదే తరహాలో చిక్కడపల్లిలోని రామ్‌స్వరూప్ జ్యువెలర్స్ నుంచి 600 గ్రాముల వెండి ఆభరణాలు, నాచారంలోని ఓమ్‌సాయి జ్యువెలర్స్ నుంచి 50 తులాల వెండి ఆభరణాలు, తుకారామ్‌గేట్‌లోని త్రిషాల్ జ్యువెలర్స్ నుంచి 400 గ్రాముల వెండి తస్కరించారు. ♦తుకారాంగేట్ కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్‌లతో కూడిన బృందం దర్యాప్తు చేసింది. ♦సోమవారం ఆరుగురినీ పట్టుకుని వీరి నుంచి ఆటోతో పాటు 1070 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకుంది. వీటి విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితుల్ని తుకారాంగేట్ పోలీసులకు అప్పగించింది. ♦ఈ ముఠాకు చెందిన రేణుకపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 13 కేసులు, కిరణ్‌పై 3, తులసిపై 8, శ్వేతపై 3, రాజుపై 2 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీళ్లు వాంటెడ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గంజదొంగ బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ -
పైసలిస్తారా.. ఫిర్యాదు చేయాలా..?
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: అక్రమ నిర్మాణాల పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొందరు చట్టాలకు అతీతులమన్నట్లు పెట్రేగిపోయి భవన నిర్మాణ దారుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఉండాలంటే తాము చెప్పిన ధరకే అపార్టుమెంట్ ఫ్లాట్‌ను ఇవ్వాలని బలవంతంగా తమ పేరిట రాయించుకుంటున్నట్లు పోలీసు యంత్రాంగం దృష్టికి వచ్చింది. ఇటీవల ఈ ఘటనలపై జీహెచ్ఎంసీ, పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్లలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్న 20 మందిపై పోలీసు ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఎవరెవరిని బెదిరింపులకు గురి చేశారో..? ఎంత మొత్తంలో దండుకున్నారో పక్కా ఆధారాలతో ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో రోజూ అక్రమ నిర్మాణాలు లక్ష్యంగా చేసుకొని రాత పూర్వకంగా, సోషల్ మీడియా ద్వారా సుమారు 40 కిపైగా ఫిర్యాదులు రావడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. రెండేళ్ల క్రితం అక్రమ నిర్మాణదారులను, ప్రభుత్వ భూముల్లో వెలసిన ఇళ్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ మహిళను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలి ఇంట్లో దొరికిన ఫిర్యాదు పత్రాలు, సెల్పోన్లో నిక్షిప్తం చేసిన బహుళ అంతస్తుల భవనాల ఫొటోలను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. తాజాగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని బసంత్‌రాజ్ ఉదంతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే తలెత్తడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. చదవండి: మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం! అక్రమ నిర్మాణాలపై చర్యల విషయంలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అక్రమ నిర్మాణాలు కొన్నయితే.. ఎలాంటి నిబంధనలు లేకుండానే చేపట్టే నిర్మాణాలు మరికొన్ని. అయితే వీటిలో ఎక్కువశాతం నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడమే తరువాయి అన్నట్లుగా పెద్దఎత్తున ఒత్తిళ్లను తీసుకువచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకునేవారు కొందరైతే, మరికొందరు ఫిర్యాదులు మొదలుపెట్టి తమకు తాయిలం దక్కే వరకూ బెదిరింపులకు పాల్పడేవారు మరికొందరు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అవినీతికి పాల్పడటం దేవుడెరుగు, ఫిర్యాదుదారులకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇప్పించాల్సిన దుస్థితికి దిగజారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం.. అక్రమ నిర్మాణాల పేరుతో బిల్డర్లను బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసే కొంతమందిపై ఫిర్యాదులు అందాయి. పూర్తి ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలి. వారి వివరాలను గొప్యంగా ఉంచి నిందితులపై చర్యలు తీసుకుంటాం. -సురేందర్‌రావు, ఏసీపీ -
బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది
పంజగుట్ట: నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న పబ్‌పై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 28 మందిని అదుపులోకి తీసుకుని, మరో 8 మంది మహిళలను రెస్క్యూ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట కంట్రీక్లబ్‌లో ఉన్న లిస్బన్ బార్ అండ్ రెస్టారెంట్, పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మహిళలతో అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తుండడంతో పలువురు సిబ్బందితో పాటు, మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 8 మంది మహిళలను రెస్క్యూ చేసి హోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు మురళితో పాటు బంటి, వేణుగోపాల్, నందీశ్వర్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ పబ్‌లో ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్ అనుమతులు రద్దుచేయాలని ఎక్సైజ్ అధికారులకు, పబ్ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. -
హోసూరు దోపిడీ ముఠా.. హైదరాబాద్‌లో పట్టేశారు..
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. శంషాబాద్ తొండపల్లి వద్ద అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ టౌన్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన ఈ గ్యాంగ్ నుంచి 25 కేజీల బంగారం, 7 తుపాకులు, బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించగా, సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చదవండి: జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ సీపీ సజ్జనార్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.‘‘తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్నాం. నిందితుల చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అక్టోబర్‌లో లూథియానా, పంజాబ్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ చేశారు. అప్పటి నుంచి నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. తొండపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిందితులను అరెస్ట్ చేశాం. వారిని విచారించగా మరో కంటైనర్‌లో గోల్డ్, వెపన్స్ తరలిస్తున్నట్లు తెలిసింది. మేడ్చల్ వద్ద కంటైనర్‌ను పట్టుకున్నాం. నిందితులు మధ్యప్రదేశ్, జార్ఖండ్, యూపీలకు చెందినవారని’’ సీపీ తెలిపారు. చదవండి: ఆ ఇద్దరు సైకోలకు ఉరిశిక్షల వెనుక.. తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారు.. దోపిడీ ముఠాను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారని కృష్ణగిరి జిల్లా(తమిళనాడు) ఎస్పీ బండి గంగాధర్ అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దాటుకుని తెలంగాణకు వచ్చారని.. ఈ గ్యాంగ్ చాలా ప్రమాదకరమైనదన్నారు. ఆయుధాలతో ఎదురు కాల్పులు జరిపే ప్రమాదం ఉందని, గతంలో లూథియానాలో ఈ గ్యాంగ్ చోరీ విఫలయత్నం అయినపుడు 32 రౌండ్లు కాల్పులు జరిపారని.. ఈ కాల్పులో ఒక వ్యక్తి కూడా మరణించాడని ఆయన వివరించారు. -
చైనాకు పరారైన లోన్‌యాప్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : రుణాలు తీర్చినా తీవ్ర వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలు తీసుకునేలాగా చేసిన లోన్ యాప్స్ నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే వారు పోలీసులకు చిక్కకుండా స్వదేశం చైనాకు పరారయ్యారు. చైనాకు వెళ్లిన లోన్ యాప్స్ కంపెనీల రెక్టర్లను తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో డైరెక్టర్లను పట్టుకునే ప్రయత్నాలు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఆ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారం నడిపించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసే వారు కూడా భారత్‌కు చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. ఆ విధంగా డైరెక్టర్లను నియమించుకున్న చైనా కంపెనీలు ఇప్పుడు వారి నేరాలు బహిర్గతమవడంతో వారు చైనాకు పారిపోయారు. చైనాకు చెందిన కంపెనీలు భారత్‌కు చెందిన వారితో కంపెనీ నడిపిస్తున్న విషయం కేసుల నమోదు అనంతరం బయటపడింది. ఆ కంపెనీల భారీ ఆఫర్లు ఇవ్వడంతో భారత్‌కు చెందిన చాలామంది ఆశ పడి డైరెక్టర్లుగా చేరారు. ఇలాంటి 16 కంపెనీలపై ఇప్పటివరకు దాడులు చేసి పోలీసులు మూసివేశారు. అయితే చైనాకు పారిపోయిన ఈ కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా చైనాకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రుణాల యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక దాదాపు 5 మంది బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.