
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: తీన్మార్ మల్లన్నను మంగళవారం మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 20 మంది పోలీసులు పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి క్యూ న్యూస్ ఆఫీస్‌పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంపై తీన్మార్ మల్లన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ ఆఫీసును పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని మేడిపల్లి పోలీసులు లేదా మల్కాజిగిరి ఏసీపీ ధ్రువీకరించడం లేదు. కాగా, తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్‌ల అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment