Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం | Prostitution In The Name Of Spa Center At Banjara hills | Sakshi
Sakshi News home page

Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం

Published Tue, Nov 15 2022 2:34 PM | Last Updated on Tue, Nov 15 2022 3:22 PM

Prostitution In The Name Of Spa Center At Banjara hills - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో ఎలాన్‌ స్పా పేరుతో బెజవాడ అభిలాష్‌ అనే వ్యక్తి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు. పలువురు యువతులతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మసాజ్‌ థెరపిస్టుల పేరుతో మణిపూర్‌ తదితర ప్రాంతాలనుంచి యువతులను తీసుకొచ్చి వారిని సెక్స్‌ వర్కర్లుగా మార్చి ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు.

ముషీరాబాద్‌కు చెందిన బెజవాడ అభిలాష్‌(33)తో పాటు స్పా మేనేజర్‌ లిఖినా జవోమితో పాటు అయిదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. అభిలా‹Ùతో పాటు నిర్వాహకులను  అరెస్ట్‌ చేశారు. కస్టమర్లలో ఓ వైద్యుడు, ఓ చాక్లెట్‌ కంపెనీ వ్యాపారి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, వాస్తు కోర్సు చదువుతున్న విద్యార్థి  కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో కొనసాగుతున్న స్పోరా స్పాలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడు చింతల స్వామిపై కేసులు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement