
అమీర్‌పేట: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సంధ్య, నరేష్ దంపతులు ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు.
వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులతో కలిసి సీసీఎస్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు నరేష్ పరారు కాగా విటులు సంతోష్‌దాస్, రామరాజులతో పాటు మరో యువతిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీపులు తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment