దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఢిల్లీ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బ్యూటీ స్పాలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సోనియా (24) మృతురాలు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రేమలో మోసపోయానని..
ప్రేమలో మోసపోయానని అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తండగి తాలూకా మిత్రబాగిలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమ్మాయి (17)ని బంధువు అయిన ప్రవీణ్ అనే యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీంతో విరక్తి చెందిన యువతి 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ప్రవీణ్‌పై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment