సాక్షి, హైదరాబాద్- Ind Vs Aus 3rd T20- Hyderabad: హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకోసం అప్పుడప్పుడూ పాపులర్ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు వివరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు క్రికెట్‌ను ఇందుకోసం వాడుకున్నారు. ఓ ట్రెండింగ్ ట్వీట్‌తో ముందుకు వచ్చారు.
హైదరాబాద్ వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్, దినేష్ కార్తీక్‌కు చెందిన రెండు ఫోటోలను షేర్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో మొదటి ఫోటోలో రోహిత్ గ్రౌండ్‌లో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు.
When commuters follow traffic rules... #HelmetSavesLives #HyderabadCityPolice #wearhelmet #BeSafe #RoadSafety pic.twitter.com/DZwlQggJ6W
— Hyderabad City Police (@hydcitypolice) September 26, 2022
రెండో దానిలో రోహిత్ దినేష్‌ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్ ఉంది. ఈ రెండిటిని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment