Helmet use
-
అందుకే ‘హెల్మెట్’ పెట్టుకోమని చెప్పేది.. ఓసారి ఈ వీడియో చూడండి
బైక్‌పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తున్నారు. జరిమానాలు సైతం విధిస్తున్నారు. కానీ, చాలా మంది హెల్మెట్ పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. అయితే, అలాంటి వారు ఈ వీడియోను చూస్తే వారు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో, హెల్మెట్ వల్ల ఏ మేర ప్రయోజనం ఉందో తెలుస్తుంది. ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొచ్చి పడిపోయాడు. ఎదురుగా వస్తున్న బస్సు వెనకాల టైర్ల కిందకు దూసుకెళ్లాడు. హైల్మెట్ ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన గతంలో జరిగినా.. పాత వీడియోనే మరోమారు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను తాన్సుయోగెన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బస్సును ఢీకొట్టిన బైకర్.. వెనక టైర్ల కిందకు దూసుకెళ్లాడు. తల టైర్ కిందకు వెళ్లింది. దీంతో హెల్మెట్ పగిలింది. అయితే, బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తానే బస్ కింద నుంచి బయటకు రాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హెల్మెట్ ఉండటం వల్లే అతడి ప్రాణాలు నిలిచాయని కామెంట్ చేశారు. ‘అతడు పెట్టుకున్న హెల్మెట్ బ్రాండ్ నాకు చెప్పండి ప్లీజ్..’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు.. ఆ హెల్మెట్ తయారు చేసిన సంస్థనే ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేస్తుందని మరికొంత మంది పేర్కొన్నారు. My reactions in order: 1) OMG😱 2) I hope he has survived🙏 3) Yes he did👏 4) What is the brand of his helmet❓ pic.twitter.com/dnBugyycGe — Tansu YEĞEN (@TansuYegen) December 12, 2022 ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
Ind Vs Aus- Uppal: రోహిత్, దినేష్ కార్తీక్ ఫోటోలతో హైదరాబాద్ పోలీసుల ట్వీట్
సాక్షి, హైదరాబాద్- Ind Vs Aus 3rd T20- Hyderabad: హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకోసం అప్పుడప్పుడూ పాపులర్ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు వివరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు క్రికెట్‌ను ఇందుకోసం వాడుకున్నారు. ఓ ట్రెండింగ్ ట్వీట్‌తో ముందుకు వచ్చారు. హైదరాబాద్ వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్, దినేష్ కార్తీక్‌కు చెందిన రెండు ఫోటోలను షేర్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో మొదటి ఫోటోలో రోహిత్ గ్రౌండ్లో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. When commuters follow traffic rules... #HelmetSavesLives #HyderabadCityPolice #wearhelmet #BeSafe #RoadSafety pic.twitter.com/DZwlQggJ6W — Hyderabad City Police (@hydcitypolice) September 26, 2022 రెండో దానిలో రోహిత్ దినేష్‌ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్ ఉంది. ఈ రెండిటిని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో షేర్ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్ చేశారు. -
‘రాఖీ రోజున హెల్మెట్’ప్రచారం భేష్
కవితకు లోక్‌సభ స్పీకర్ కితాబు సాక్షి, న్యూఢిల్లీ: హెల్మెట్ వినియోగంపై అవగాహనకు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించిన ఆన్లైన్ ప్రచారానికి సంబంధించిన వెబ్‌లింక్ www.sisters4change.orgను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం పార్లమెంటులో ప్రారంభించారు. రాఖీ పండుగనాడు ప్రతి మహిళ తమ సోదరులకు రాఖీ కట్టడంతోపాటు ఒక హెల్మెట్‌ను బహూకరించాలని కవిత ఇచ్చిన పిలుపును సుమిత్రా మహాజన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం తాను ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కవిత కోరారు.