‘రాఖీ రోజున హెల్మెట్’ప్రచారం భేష్
కవితకు లోక్‌సభ స్పీకర్ కితాబు
సాక్షి, న్యూఢిల్లీ: హెల్మెట్ వినియోగంపై అవగాహనకు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించిన ఆన్‌లైన్ ప్రచారానికి సంబంధించిన వెబ్‌లింక్ www.sisters4change.orgను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం పార్లమెంటులో ప్రారంభించారు. రాఖీ పండుగనాడు ప్రతి మహిళ తమ సోదరులకు రాఖీ కట్టడంతోపాటు ఒక హెల్మెట్‌ను బహూకరించాలని కవిత ఇచ్చిన పిలుపును సుమిత్రా మహాజన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.
అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం తాను ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కవిత కోరారు.