ప్రతీ అడుగులో సోదర–సోదరీ అనుబంధం
అన్నాచెల్లెలు.. అక్కాతమ్ముడు.. ఒక కొమ్మకు పూసిన పువ్వులు.. ఒక గూటిలో వెలిగిన దివ్వెలు.. తోడబుట్టిన బంధం ఆతీ్మయతల హరివిల్లు.. అనురాగాలు, అనుబంధాల పొదరిల్లు.. చిన్ననాటి చెలిమి.. పెరిగి పెద్దయ్యాక బలిమి.. అన్నా.. అంటే నేనున్నా.. అని ఆపదలో చెల్లికి అభయహస్తం.. అమ్మా–నాన్నల తరువాత అంతటి ఆతీ్మయబంధం ఏదైనా ఉందంటే.. అది సోదర–సోదరీ బంధమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాసింత తెలివితేటలు వచ్చే వరకే తల్లిదండ్రులు.. ఆపైన అంతా అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లే. ఇంతటి జన్మజన్మల బంధాన్ని వేడుకలా చేసుకునే రక్షాబంధన్ కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా ఎలా గడిచినా, రాఖీ పౌర్ణమి నాడు మాత్రం వారి ప్రేమనంతా పోగేసుకుని సంబరాలు జరుపుకుంటారు. ఇలా తమ జీవితంలో మధురమైన సోదర–సోదరీ బంధాల గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రక్షాబంధన్ నేపథ్యంలో వారి అనుభవాలు, అనుభూతులు వారి మాటల్లోనే...
సాక్షి, సిటీబ్యూరో/శ్రీనగర్ కాలనీ
సర్‘ప్రైజ్’ ఇచ్చాను..
నా తమ్ముడిది నాది తల్లీ కొడుకుల అనుబంధం. అమ్మానాన్న లేకపోవడంతో తమ్ముడు మహే‹Ùచంద్రను కొడుకులానే చూసుకున్నాను. మహేష్ చిన్నోడైనా కష్టాలు చుట్టిముట్టిన సమయంలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ తోడునీడలా ఉన్నాడు. షూటింగ్స్ కానీ, ఇతర వ్యక్తిగత విషయాల్లోగానీ సపోర్ట్‌గా ఉన్నాడు. తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ మరణించింది. నేను జాబ్ చేస్తుంటే.. అప్పటి వరకు అమ్మ బాగోగులు, ఇంటి పనులు అన్నీ తానే చూసుకునేవాడు. చివరకు అమ్మ మరణించినప్పడు తన వయస్సు చిన్నదైనా అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించాడు. అలా ఒకరికొకరం ఆతీ్మయతను పంచుకుంటూ పెరిగాం. ఏడాది క్రితం జాబ్‌లో చేరిన మహేష్... ఏడాదంతా తన జీతాన్ని దాచి, ఈసారి రాఖీకి బహుమతిగా గోల్డ్–ప్లాటినం బ్రాస్‌లెట్ చేయించాడు. ఇంకా ఆ సంతోషంలోనే ఉన్నాను. ఓసారి స్కూల్‌లో ఓ అవార్డుకు మహేష్ సెలెక్ట్ అయ్యాడు. నన్ను సర్‌ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో పేరెంట్స్ మీటింగ్ ఉందని పిలిచాడు. కానీ, అదే కార్యక్రమానికి నేను ముఖ్యఅతిథిగా వెళ్లి అవార్డు ప్రదానం చేసి నేనే తమ్ముడికి సర్‌ప్రైజ్ ఇచ్చాను. మా ఇద్దరికీ ఇది మరచిపోలేని జ్ఞాపకం.
–రోజా భారతి, నటి
టామ్ అండ్ జెర్రీ లాగే..
చెల్లి సోనీ, నేను ఒక దగ్గర ఉంటే.. టామ్ అండ్ జెర్రీల్లాగే పోట్లాడుకుంటాం. ఒకరినొకరం ఏడిపించుకుంటుంటాం. కానీ, మా మధ్యలో మూడో వ్యక్తి ఎవరైనా వస్తే వాళ్ల పని ఖతమే. ఏదో పండుగకో, పుట్టినరోజుకో గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ఎప్పుడు తను ఏది అడిగినా కొనిస్తుంటా. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఏదైనా నచి్చతే తీసుకొచ్చి మా చెల్లికి ఇస్తుంటా. సోనీ కూడా నా కోసం ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది. నా పని విషయంలో సోనీయే పెద్ద క్రిటిక్. ముందుగా సోనీ నా పాటలను విని ఓకే చేసిన తర్వాతే వేరే ఎవరికైనా వినిపిస్తా. ప్రతి విషయాన్ని ముందుగా సోనీతోనే పంచుకుంటుంటా. ప్రతి విషయంలో నాకు పిల్లర్‌గా సపోర్టు చేస్తుంటుంది. ఇక, ఇద్దరం కలిసి చాలా టూర్స్ వెళ్లాం. అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ప్లాన్ చేస్తాం. అన్ని ఓకే అయి బయల్దేరే ముందే అమ్మ, నాన్నకు చెప్పేవాళ్లం. 8 ఏళ్ల కింద చెల్లి పుట్టినరోజున తన పేరును నా చేతిపై టాటూగా వేయించుకున్నా. అప్పుడు తను చాలా ఎమోషనల్ అయింది. తనపై నాకున్న ఇష్టాన్ని అంతకన్నా బాగా చెప్పలేను కదా! అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. పూజితతో నా పెళ్లి విషయంలో కూడా మొదటి నుంచీ సోనీయే సపోర్టుగా ఉంది. ఇప్పుడు పూజిత, సోనీ కలిసి నన్ను ఆడుకుంటున్నారు.
రాఖీ పండుగ మా ఇంట్లో స్పెషల్
రాఖీ పండుగ మా ఇంట్లో చాలా స్పెషల్.. మా అన్నయ్య వంశీ కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఓ నాన్నలా నన్ను ప్రోత్సహించి, ముందుండి నడిపించాడు. డిజిటల్ మీడియా, సినీ ఇండస్ట్రీలోకి అమ్మాయిలు వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ, నేను కచి్చతంగా మంచిస్థాయిలో ఉంటానని నమ్మి నాకు గాడ్‌ఫాదర్‌లా నిలబడ్డాడు. ఇద్దరం కెరీర్ పరంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నాం. నేడు ఇద్దరం మంచిస్థానాల్లో ఉన్నాం. నాకు తండ్రిలా నడిపించిన మా అన్నయ్యకు, నాకు అన్నివిధాలుగా వెన్నుతట్టే అన్నయ్యలు వందేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని రాఖీ పండుగ శుభాకాంక్షలు. – హారిక, నటి
అత్యద్భుత బంధం మాది..
అనితర సాధ్యమైన అద్భుత..ఆతీ్మయ బంధం మాది. మధురమైన జ్ఞాపకాలతో, షరతులు లేని ప్రోత్సాహంతో ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటాం. క్రీడలు, చదువులు ఇలా ఏ విషయంలోనైనా నా తమ్ముడు అగస్త్య నిరంతరం మద్దతుగా నిలిచాడు. నా కంటే చిన్నవాడైనప్పటికీ కీలక నిర్ణయాల్లో తమ్ముడి భాగస్వామ్యం ఉంటుంది. ముఖ్యంగా కఠినమైన శిక్షణ సమయాల్లో, సవాల్‌తో కూడిన టోర్నీల్లో పాల్గొనే సమయంలో ఆత్మస్థైర్యాన్ని నింపే కోచ్‌గా నాకు మార్గనిర్దేశం చేస్తూ, ప్రోత్సహిస్తాడు. మల్లె పూల కన్నా.. మంచు పొరల కన్నా, నెమిలి హొయల కన్నా, సెలయేటి లయల కన్నా.. మా బంధం అందమైనదని చెప్పగలను. పాకిస్తాన్‌లో బంగారు పతకాలు సాధించి దక్షిణాసియా ఛాంపియన్‌గా నిలవడం ఓ మధుర జ్ఞాపకం. ఈ ఫైనల్స్‌కు ముందు ఫోన్ కాల్‌లో నా సోదరుడు ‘భారత్ మాతా కీ జై’ అంటూ గోల్డ్ మెడల్ కోసం నన్ను ప్రోత్సహించిన శక్తివంతమైన మాటలు నాకింకా గుర్తున్నాయి. నేను కట్టిన రాఖీకి రిటర్న్ గిఫ్ట్‌గా తను ఇచి్చన టేబుల్ టెన్నిస్ రాకెట్ నా ఫేవరెట్. నేషనల్ ఛాంపియన్íÙప్ సమయంలో నాతో పాటే ఉండమని అడిగినప్పుడు..అగస్త్య తన డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షను వదిలి మరీ వచ్చాడు. – నైనా జైస్వాల్,
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి
భాయ్.. తమ్ముడు.. అన్నయ్య
ఈసారి మార్కెట్లో కాస్త వెరైటీ రాఖీలు దర్శనమిస్తున్నాయి. రాఖీలపైన భాయ్, తమ్ముడు, అన్నయ్య పేర్లు వచ్చేలా అందంగా తీర్చిదిద్దారు. కాస్త కొత్తగా.. విభిన్నంగా ఉండడంతో ఈ రాఖీలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఫ్యాషన్ కూడా తోడవడంతో రాఖీలు కొత్తరూపాలను సంతరించుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే మోడ్రన్‌గా ఉండే రాఖీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment