Rakhi festival
-
ముందు బొట్టు పెట్టాలి కదా!
తిరుమలాయపాలెం: ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సోమవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రీవెన్స్‌ను పరిశీలించి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారంపై ఉద్యోగులకు సూచనలు చేశారు. రాఖీ పండుగ కావడంతో అక్కడి ఐకేపీ ఏపీఎం అలివేలు మంగ కలెక్టర్‌కు రాఖీ కట్టి హారతి ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారి కావడంతో.. తనలాంటి ఉద్యోగి రాఖీ కట్టడాన్ని ఎలా భావిస్తారోనన్న సంశయంతోనే ఆమె రాఖీ కట్టారు. అయితే, బొట్టు పెట్టకుండా రాఖీ కట్టడాన్ని గమనించిన ఆయన ‘ముందు బొట్టు పెట్టాలి కదా..’అంటూ ఆమెకు సంప్రదాయాన్ని గుర్తు చేశారు. -
రక్షా ‘బంధనాలు’..!
తంగళ్లపల్లి/రామకృష్ణాపూర్: అన్నాచెల్లి..అక్కాతమ్ముడు అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక. కానీ ఇక్కడ బంధనాల నడుమ ఆ వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. కిటికీల సందుల్లో నుంచి అనేక ఇబ్బందులు పడుతూ రాఖీలు కట్టించుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ఉంది. సోమవారం రాఖీ పండుగ కావడంతో అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుందామని సుదూర ప్రాంతాల నుంచి సోదరులు తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చారు. అయితే వారిని ప్రిన్సిపాల్ గురుకులంలోకి అనుమతించలేదు. ఎంత ప్రాథేయపడినా ససేమిరా అన్నాడు. చివరకు చేసేదేమి లేక కిటికీల సందుల్లో నుంచి తమ అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకొని కన్నీళ్లు దిగమింగుకుంటూ తిరిగివెళ్లారు. ఈ విషయంపై గురుకుల పాఠశాల సిబ్బందిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు. తండ్రి భుజాలపై రాఖీ బంధం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో దాసరి అశ్విక, సహస్ర చదువుతున్నారు. రాఖీ పండగకు సోమవారం పాఠశాలకు సెలవు ఇవ్వలేదు. రాఖీలు కట్టేందుకు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో అశ్విక, సహస్రల తమ్ముడు దాసరి జితేంద్ర అక్కలపై ఉన్న ప్రేమతో ఎలాగైనా రాఖీ కట్టించుకోవాలని సాహసం చేశాడు. తండ్రి భుజంపైకి ఎత్తుకోగా హాస్టల్ కిటికీ వద్దకు వచ్చిన అక్కలు జితేంద్రకు రాఖీ కట్టారు. జితేంద్ర రాఖీ కట్టించుకున్న తీరును ఎవరో మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కూడా వైరల్ అయ్యింది. దీనిని అధికారులు తీవ్రంగా పరిగణించారు. గురుకుల జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు విచారణ చేపట్టి కలెక్టర్ కుమార్‌దీపక్‌కు నివేదిక అందజేశారు. రాఖీ పౌర్ణమి సెలవు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గురుకులానికి వచ్చారని, విద్యార్థులందరినీ ఒకేసారి ఉదయం 11గంటలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఓ విద్యారి్థని తండ్రి ఉదయం 9గంటలకే కిటికీలోతన పిల్లలకు రాఖీ కట్టించుకుంటూ సెల్ఫోన్లో వీడియో తీసి గురుకులానికి ఇబ్బంది కలిగేలా చేశారన్నారు. -
సోదరీమణులతో రాఖీ పండుగను జరుపుకున్న కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి
-
శునకమే సోదరుడు!
దండేపల్లి: చనిపోయిన పెంపుడు కుక్కను అన్నగా భావి స్తూ.. ఏటా సమాది వద్ద రాఖీలు కడుతూ అభి మానం చాటుకుంటున్నారు ఇద్ద రు అక్కా చెల్లెళ్లు. దండేపల్లి మండలం కన్నె పల్లి గ్రామానికి చెందిన మర్రిపెల్లి మల్లయ్య– కమల దంపతులకు 20 ఏళ్ల క్రితం పిల్లల్లేక పోవడంతో ఓ కుక్కను తెచ్చి రాము అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. దాన్ని పెంచుకున్న కొద్ది రోజులకు వారికి ఆడపిల్లలు రమ, రమ్య జన్మించారు. పిల్లలు పుట్టిన కొద్ది రోజులకు కుక్క చనిపోవడంతో తమ పొలం వద్ద సమాధి కట్టించారు. అయితే మల్లయ్య–కమల దంపతుల ఇద్దరు కూతుళ్లు ఆ కుక్కను అన్నయ్య లా భావిస్తారు. ఏటా రాఖీ పౌర్ణమి రోజున పొలం వద్ద ఉన్న కుక్క సమాధి వద్దకు వెళ్లి రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకుంటున్నారు. -
మై డియర్ బ్రదర్.. లవ్ యూ సిస్టర్
అన్నాచెల్లెలు.. అక్కాతమ్ముడు.. ఒక కొమ్మకు పూసిన పువ్వులు.. ఒక గూటిలో వెలిగిన దివ్వెలు.. తోడబుట్టిన బంధం ఆతీ్మయతల హరివిల్లు.. అనురాగాలు, అనుబంధాల పొదరిల్లు.. చిన్ననాటి చెలిమి.. పెరిగి పెద్దయ్యాక బలిమి.. అన్నా.. అంటే నేనున్నా.. అని ఆపదలో చెల్లికి అభయహస్తం.. అమ్మా–నాన్నల తరువాత అంతటి ఆతీ్మయబంధం ఏదైనా ఉందంటే.. అది సోదర–సోదరీ బంధమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాసింత తెలివితేటలు వచ్చే వరకే తల్లిదండ్రులు.. ఆపైన అంతా అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లే. ఇంతటి జన్మజన్మల బంధాన్ని వేడుకలా చేసుకునే రక్షాబంధన్ కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా ఎలా గడిచినా, రాఖీ పౌర్ణమి నాడు మాత్రం వారి ప్రేమనంతా పోగేసుకుని సంబరాలు జరుపుకుంటారు. ఇలా తమ జీవితంలో మధురమైన సోదర–సోదరీ బంధాల గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రక్షాబంధన్ నేపథ్యంలో వారి అనుభవాలు, అనుభూతులు వారి మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో/శ్రీనగర్ కాలనీ సర్‘ప్రైజ్’ ఇచ్చాను.. నా తమ్ముడిది నాది తల్లీ కొడుకుల అనుబంధం. అమ్మానాన్న లేకపోవడంతో తమ్ముడు మహే‹Ùచంద్రను కొడుకులానే చూసుకున్నాను. మహేష్ చిన్నోడైనా కష్టాలు చుట్టిముట్టిన సమయంలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ తోడునీడలా ఉన్నాడు. షూటింగ్స్ కానీ, ఇతర వ్యక్తిగత విషయాల్లోగానీ సపోర్ట్‌గా ఉన్నాడు. తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ మరణించింది. నేను జాబ్ చేస్తుంటే.. అప్పటి వరకు అమ్మ బాగోగులు, ఇంటి పనులు అన్నీ తానే చూసుకునేవాడు. చివరకు అమ్మ మరణించినప్పడు తన వయస్సు చిన్నదైనా అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించాడు. అలా ఒకరికొకరం ఆతీ్మయతను పంచుకుంటూ పెరిగాం. ఏడాది క్రితం జాబ్‌లో చేరిన మహేష్... ఏడాదంతా తన జీతాన్ని దాచి, ఈసారి రాఖీకి బహుమతిగా గోల్డ్–ప్లాటినం బ్రాస్లెట్ చేయించాడు. ఇంకా ఆ సంతోషంలోనే ఉన్నాను. ఓసారి స్కూల్లో ఓ అవార్డుకు మహేష్ సెలెక్ట్ అయ్యాడు. నన్ను సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో పేరెంట్స్ మీటింగ్ ఉందని పిలిచాడు. కానీ, అదే కార్యక్రమానికి నేను ముఖ్యఅతిథిగా వెళ్లి అవార్డు ప్రదానం చేసి నేనే తమ్ముడికి సర్ప్రైజ్ ఇచ్చాను. మా ఇద్దరికీ ఇది మరచిపోలేని జ్ఞాపకం. –రోజా భారతి, నటిటామ్ అండ్ జెర్రీ లాగే.. చెల్లి సోనీ, నేను ఒక దగ్గర ఉంటే.. టామ్ అండ్ జెర్రీల్లాగే పోట్లాడుకుంటాం. ఒకరినొకరం ఏడిపించుకుంటుంటాం. కానీ, మా మధ్యలో మూడో వ్యక్తి ఎవరైనా వస్తే వాళ్ల పని ఖతమే. ఏదో పండుగకో, పుట్టినరోజుకో గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ఎప్పుడు తను ఏది అడిగినా కొనిస్తుంటా. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఏదైనా నచి్చతే తీసుకొచ్చి మా చెల్లికి ఇస్తుంటా. సోనీ కూడా నా కోసం ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది. నా పని విషయంలో సోనీయే పెద్ద క్రిటిక్. ముందుగా సోనీ నా పాటలను విని ఓకే చేసిన తర్వాతే వేరే ఎవరికైనా వినిపిస్తా. ప్రతి విషయాన్ని ముందుగా సోనీతోనే పంచుకుంటుంటా. ప్రతి విషయంలో నాకు పిల్లర్‌గా సపోర్టు చేస్తుంటుంది. ఇక, ఇద్దరం కలిసి చాలా టూర్స్ వెళ్లాం. అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ప్లాన్ చేస్తాం. అన్ని ఓకే అయి బయల్దేరే ముందే అమ్మ, నాన్నకు చెప్పేవాళ్లం. 8 ఏళ్ల కింద చెల్లి పుట్టినరోజున తన పేరును నా చేతిపై టాటూగా వేయించుకున్నా. అప్పుడు తను చాలా ఎమోషనల్ అయింది. తనపై నాకున్న ఇష్టాన్ని అంతకన్నా బాగా చెప్పలేను కదా! అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. పూజితతో నా పెళ్లి విషయంలో కూడా మొదటి నుంచీ సోనీయే సపోర్టుగా ఉంది. ఇప్పుడు పూజిత, సోనీ కలిసి నన్ను ఆడుకుంటున్నారు. రాఖీ పండుగ మా ఇంట్లో స్పెషల్ రాఖీ పండుగ మా ఇంట్లో చాలా స్పెషల్.. మా అన్నయ్య వంశీ కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఓ నాన్నలా నన్ను ప్రోత్సహించి, ముందుండి నడిపించాడు. డిజిటల్ మీడియా, సినీ ఇండస్ట్రీలోకి అమ్మాయిలు వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ, నేను కచి్చతంగా మంచిస్థాయిలో ఉంటానని నమ్మి నాకు గాడ్‌ఫాదర్‌లా నిలబడ్డాడు. ఇద్దరం కెరీర్ పరంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నాం. నేడు ఇద్దరం మంచిస్థానాల్లో ఉన్నాం. నాకు తండ్రిలా నడిపించిన మా అన్నయ్యకు, నాకు అన్నివిధాలుగా వెన్నుతట్టే అన్నయ్యలు వందేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని రాఖీ పండుగ శుభాకాంక్షలు. – హారిక, నటిఅత్యద్భుత బంధం మాది.. అనితర సాధ్యమైన అద్భుత..ఆతీ్మయ బంధం మాది. మధురమైన జ్ఞాపకాలతో, షరతులు లేని ప్రోత్సాహంతో ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటాం. క్రీడలు, చదువులు ఇలా ఏ విషయంలోనైనా నా తమ్ముడు అగస్త్య నిరంతరం మద్దతుగా నిలిచాడు. నా కంటే చిన్నవాడైనప్పటికీ కీలక నిర్ణయాల్లో తమ్ముడి భాగస్వామ్యం ఉంటుంది. ముఖ్యంగా కఠినమైన శిక్షణ సమయాల్లో, సవాల్‌తో కూడిన టోర్నీల్లో పాల్గొనే సమయంలో ఆత్మస్థైర్యాన్ని నింపే కోచ్‌గా నాకు మార్గనిర్దేశం చేస్తూ, ప్రోత్సహిస్తాడు. మల్లె పూల కన్నా.. మంచు పొరల కన్నా, నెమిలి హొయల కన్నా, సెలయేటి లయల కన్నా.. మా బంధం అందమైనదని చెప్పగలను. పాకిస్తాన్లో బంగారు పతకాలు సాధించి దక్షిణాసియా ఛాంపియన్‌గా నిలవడం ఓ మధుర జ్ఞాపకం. ఈ ఫైనల్స్‌కు ముందు ఫోన్ కాల్లో నా సోదరుడు ‘భారత్ మాతా కీ జై’ అంటూ గోల్డ్ మెడల్ కోసం నన్ను ప్రోత్సహించిన శక్తివంతమైన మాటలు నాకింకా గుర్తున్నాయి. నేను కట్టిన రాఖీకి రిటర్న్ గిఫ్ట్‌గా తను ఇచి్చన టేబుల్ టెన్నిస్ రాకెట్ నా ఫేవరెట్. నేషనల్ ఛాంపియన్íÙప్ సమయంలో నాతో పాటే ఉండమని అడిగినప్పుడు..అగస్త్య తన డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షను వదిలి మరీ వచ్చాడు. – నైనా జైస్వాల్, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిభాయ్.. తమ్ముడు.. అన్నయ్య ఈసారి మార్కెట్లో కాస్త వెరైటీ రాఖీలు దర్శనమిస్తున్నాయి. రాఖీలపైన భాయ్, తమ్ముడు, అన్నయ్య పేర్లు వచ్చేలా అందంగా తీర్చిదిద్దారు. కాస్త కొత్తగా.. విభిన్నంగా ఉండడంతో ఈ రాఖీలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఫ్యాషన్ కూడా తోడవడంతో రాఖీలు కొత్తరూపాలను సంతరించుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే మోడ్రన్‌గా ఉండే రాఖీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. -
మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
-
ఈ బంధం.. ఎన్నటికీ విడిపోదు!
కడప కల్చరల్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఓ కుగ్రామంలో ప్రతి రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య యుగంధర్ విగ్రహానికి రాఖీ కడుతున్నారు ఓ చెల్లి. అన్నయ్య మరణానంతరం ఆమె క్రమం తప్పకుండా ఆయన విగ్రహానికి రాఖీ కట్టి అన్నతో తనకు గల అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. విగ్రహానికి రాఖీనా? అంటూ కొందరు విచిత్రంగా చూసినా.. ఎగతాళిగా మాట్లాడినా ఆమె మాత్రం ఈ పద్ధతిని వదలడం లేదు. భౌతికంగా లేకపోయినా అన్నయ్య తన హృదయంలో ఎప్పటికీ సజీవంగానే ఉన్నారని సోదరి గాయత్రి పేర్కొంటారు.ఒంటిమిట్ట మండలం రాచపల్లె గ్రామానికి చెందిన సరోజనమ్మ, కొండూరు జయరామరాజు కుమారుడు లాన్స్ నాయక్ కె.యుగంధర్ ఆర్మీలో ఉంటూ వీరమరణం పొందారు. గ్రామస్తులు యుగంధర్ స్మారకార్థం స్వగ్రామం రాచపల్లెలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి చెల్లెలు గాయత్రి, తమ్ముడు విశ్వనాథ్ అన్న విగ్రహం వద్ద ఏటా రాఖీ పండుగ నాడు చిన్న సందడి చేస్తుంటారు. ఉదయాన్నే సోదరి గాయత్రి అన్నయ్య విగ్రహానికి రాఖీ కడుతుంటారు. దీన్ని అందరూ విచిత్రంగా భావిస్తున్నా తనకు ఎంతో ఆత్మ తృప్తి లభిస్తుందని అంటారు గాయత్రి. నేటి పరిస్థితుల్లో ఇది ఆదర్శంగానే నిలుస్తోంది. -
Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ సంప్రదాయ బద్ధంగా ఆనాడు ఏం చేయాలో... రాఖీ కట్టడంలోని అంతరార్థం ఏమిటో తెలిసినవారు అరుదనే చె΄్పాలి.పూర్ణిమనాడు శ్రవణానక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసమని పేరు. శ్రావణమాసంలో రాత్రివేళ పూర్ణిమ తిథి ఉన్న రోజును రక్షికా పూర్ణిమ అన్నారు పెద్దలు. రక్షించగలిగిన పూర్ణిమ, రక్షణ కోరుకునే వారికోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ అని అర్థం. ఈ పండుగ కాస్తా కాలక్రమంలో రాఖీపూర్ణిమగా పేరు మార్చుకుంది.శ్రావణ పూర్ణిమనాడు ఉదయమే స్నానం చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి కడుతూ– ‘ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. అయితే ఇది ఇప్పటి ఆచారం కాదు... ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే!రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక అంతటితో వదిలేయకూడదు. ఆ బంధానికి కట్టుబడి ఒకరికి ఒకరు అన్నింటా అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. అంతేకాదు.. దేశ రక్షణలో పాల్గొనే సరిహద్దు భద్రతాదళాలకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి విజయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమిరోజు రక్షాబంధనం కడుతుండటం శుభపరిణామం.స్థితి కారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమనాడే నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేనూ రక్షించేవాడిగానే ఉండాలని అర్థం చేసుకోవడానికే శ్రావణపూర్ణిమని ఈ పండుగ రోజుగా నిర్ణయించారని గమనించాలి. అంతేకాదు, అపరాహ్ణ సమయంలో రక్షికని కడుతున్న నా రక్షికాబంధానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యుడని తెల్పడానికే. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలఃతేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమై΄ోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. ఈ పండుగలోని హంగులు, ఆర్భాటాల మాట ఎలా ఉన్నా, తమకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతూ... తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయÆ . ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో çమాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. – డి.వి.ఆర్. -
బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని
బహుమతులు ఆనందాన్నిస్తాయి... అయితే వస్తువుల రూపంలో కన్నా మాటల రూపంలో ప్రేమను వ్యక్తపరిస్తే ఆ ఫీలింగ్ హృదయంలో నిలిచిపోతుంది. అన్నయ్య గౌతమ్ నుంచి అలాంటి ప్రేమనే ఎక్కువగా కోరుకుంటున్నానని చిన్నారి సితార అంటోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రతల కుమార్తెగా పన్నెండేళ్ల సితార పాపులర్. ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా తనకంటూ పాపులార్టీ తెచ్చుకుంది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా ‘సాక్షి’కి సితార చెప్పిన ప్రత్యేకమైన ముచ్చట్లు...రాఖీ పండగను ఇంట్లో చిన్న పూజతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టి, ఇద్దరం బహుమతులు ఇచ్చి, పుచ్చుకుంటాం. నాకు ఎనిమిది.. తొమ్మిదేళ్లప్పుడు అనుకుంటా... రాఖీకి అసలైన అర్థం తెలిసింది. చేతికి రాఖీ కట్టడం అనేది ఓ ఆచారం కాబట్టి పాటించాలి. అంతవరకే నాకు తెలుసు. అయితే సోదరుడి అనుబంధం, రక్షణ ఎంతో అవసరమని, అది సూచించే విధంగా కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యం ఉందని ఈ పండగ అసలు విషయం అర్థమైంది. ఆచారం అర్థం అయ్యాక ఈ ఫెస్టివల్‌కి ప్రాధాన్యం ఇస్తున్నాను.రాఖీ కొనడానికి చాలా టైమ్ తీసుకుంటాఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పై చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఇప్పటిరకూ ఒక విధంగా ఉండేది.. ఇప్పుడు తనకు దూరంగా ఉండటం అనే మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాఖీ కొనడం అనేది పెద్ద పనే. ఎందుకంటే ఒక పట్టాన సెలక్ట్ చేయలేను. చాలా టైమ్ పడుతుంది. మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉన్న రాఖీ కొంటుంటాను.అమ్మ గైడెన్స్‌తో పండగ చేసుకుంటాంఈ పండగ అనే కాదు ప్రతి పండగకీ మా అమ్మ గైడెన్స్ ఉంటుంది. అయితే అన్నయ్యకి హారతి ఇవ్వడం, స్వీటు తినిపించడం... ఇలా నేను మాత్రమే చేయాల్సినవే ఉంటాయి కాబట్టి రాఖీ పండగ అప్పుడు ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. అమ్మకు సంప్రదాయాలు పాటించడం చాలా ఇష్టం. మేం కూడా పాటించాలని కోరుకుంటారు. అలాఅని ఒత్తిడి చేయరు. మా స్వేచ్ఛ మాకు ఉంటుంది.నా ప్రేమను మెసేజ్ రూపంలో చెబుతాఒకవేళ వచ్చే ఏడాది మా అన్నయ్య రాఖీ పండగ సమయంలో విదేశాల్లో ఉంటే వీడియో కాల్ చేస్తాను. దాంతో పాటు తన మీద నాకు ఉన్న ప్రేమను ఒక మంచి మెసేజ్ రూపంలో చెబుతాను. ఆ మెసేజ్ హృదయపూర్వకంగా తను నాకెంత ముఖ్యమో చెప్పేలా ఉంటుంది. దూరం అనేది విషయం కాదు అని చెప్పేలా ఉంటుంది.నన్ను సర్ప్రైజ్ చేస్తే ఇష్టంఅన్నయ్య నాకు ఫలానా గిఫ్ట్ ఇవ్వాలని అనుకోను. కానీ నన్ను సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టం. తను నా గురించి ఆలోచిస్తున్నాడని సూచించే ఏ గిఫ్ట్ అయినా నాకు ఓకే. పుస్తకం అయినా, ఏదైనా జ్యువెలరీ అయినా లేక తన చేతితో రాసిన లెటర్ అయినా సరే... తను నా గురించి ఆలోచిస్తున్నాడనే ఆ ఫీల్ నాకు ముఖ్యం.నా బ్రదర్ నా ఆత్మవిశ్వాసంబ్రదర్ ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాంటి వాడు... రక్షణగా నిలబడేవాడు. ఏ విషయంలోనైనా నా బ్రదర్ మీద ఆధారపడిపోవచ్చు అనే భరోసా నాకు ఉంది. తను నా ఆత్మవిశ్వాసం... మా బాండింగ్‌ని నేను చాలా గాఢంగా ఇష్టపడతాను. ఒక బ్రదర్ ఉండటం అనేది ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి పక్కనే ఉండటంలాంటిది. – డి.జి. భవాని -
రక్షాబంధన్ కు సిద్ధమవుతున్న రాఖీలు
-
రాఖీ కట్టిన చెల్లికి రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?
నేడు రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెలు.. అక్కా తమ్ముడు ఇలా తమ అను బంధాన్ని తెలుపుతూ రాఖీ కట్టడం సహజం. ఒకే ఇంట్లో పుట్టి ఆపై ఊహ తెలిసింది మొదలు ఆటపాటలతో కలిసి పెరుగుతారు. అలా కాలం గడిచేకొద్ది పెళ్లిళ్లయ్యి ఎవరి దారిన వారెళ్లినా. ఎవరికి నచ్చిన ప్రపంచంలో వారు ఉన్నా రక్తసంబంధం మధ్య ఉండే ఆ ప్రేమ అంతే తియ్యందనం పంచుతుంది. కొండంత ఆలంబన అందిస్తుంది. ఇలా తన అన్నయ్య అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని సాక్షి ఛానల్‌తో విజయ లక్ష్మీ పంచుకున్నారు. రామూ కూడా సెంటిమెంట్లు ఫాలో అవుతారని ఆమె చెప్పారు. ఒక అన్నగా తమకు చాలా రక్షణగా ఉంటరాని విజయ తెలిపారు. రామూతో పాటు తన తమ్ముడు అయిన కోటికి కూడా రాఖీ కడుతానని ఆమె చెప్పారు. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) చిన్నప్పడు రామూకు రాఖీ కట్టినప్పుడు ఏం జరిగింది.. ఇప్పుడు రాఖీ కట్టేందుకు వెళ్తే వర్మ ఏం అన్నారు.. తిరిగి చెల్లెలు కోసం ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు.. చెల్లెలు కష్టాల్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సాయం చేశారు.. వంటి విషయాలు ఈ పూర్తి వీడియోలో తెలుసుకోండి. -
సెలబ్రిటీల ఇంట రాఖీ పండగ సెలబ్రేషన్స్
అన్న అంటే కొండంత అండ.. తల్లిదండ్రుల తర్వాత అంత ప్రేమను పంచేది, అన్ని బాధ్యతలు చూసుకునేది అన్న మాత్రమే.. ఆ మాటకొస్తే కష్టసుఖాలను ముందుగా పంచుకునేది, తొలి మిత్రువు కూడా సోదరుడే అవుతాడు. మరి అన్నకు చెల్లి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు?.. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మరుక్షణం అన్నా అంటూ వచ్చే చెల్లి ప్రేమకు అన్న బదులుగా ఏమివ్వగలడు? అందుకే ఈ రాఖీ పండగ.. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉంటామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పేదే రక్షా బంధన్. సెలబ్రిటీలు సైతం రాఖీ పండగ రోజు తమ సోదరులకు రాఖీ కట్టి పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఎవరెవరు రాఖీ పండగ జరుపుకున్నారో కింద చూసేయండి.. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(గురువారం) ప్రజలందరూ రాఖీ పండుగ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్..‘కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంది. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుంది. సీఎం పేర్కొన్నారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనది. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారు అని తెలిపారు. ఇది కూడా చదవండి: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్ -
ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్ చేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాణేనికి అటు.. ఢిల్లీలో చంద్రబాబు డ్రామా! ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను! — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2023 -
5 రూపాయల నాణేలతో అక్కకు తులాభారం
ఖమ్మం అర్బన్: ఖమ్మంలో ఓ సోదరుడు తన అక్కకు రూ.56 వేల విలువైన రూ.5 నాణేలతో తులాభారం వేసి కానుక అందజేయడం ద్వారా తన ప్రేమను చాటుకున్నాడు. భదాద్రి కొత్తగూడెం జిల్లా గార్ల బయ్యారానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బొలగాని బసవనారాయణ ఖమ్మంలో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె రణశ్రీకి గత ఏడాది వివాహం జరగ్గా, కుమారుడు త్రివేది పదో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా తనకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని రూ.5 నాణేలుగా మారుస్తున్న త్రివేదిని ఎవరడిగినా ఎందుకో చెప్పేవాడు కాదు. వివాహమయ్యాక తొలిసారి రాఖీ కట్టేందుకు వస్తున్న సోదరికి ఈ నాణేలతో తులాభారం వేసి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు త్రివేది.. తన తల్లిదండ్రులకు పండుగ ముందురోజు చెప్పాడు. దీంతో శుక్రవారం బంధువులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో తులాభారంపై ఒక వైపు అక్కను కూర్చోపెట్టి మరో వైపు అక్క బరువు ఎత్తు తాను సేకరించిన రూ.5 నాణేలను ఉంచి బహుమతిగా ఇవ్వడంతో ఆమె మురిసిపోయింది. (క్లిక్: ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం) పంచ పాండవుల పూలే రాఖీలు మార్కెట్లో దొరికే రెడీమేడ్ రాఖీలతో అందరూ రక్షాబంధన్ జరుపు కొంటారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య ఇంట్లో మాత్రం రాఖీ పండుగ వినూత్నంగా జరుగుతుంది. వీళ్ల ఇంట్లో పంచపాండవుల పూలతోనే రాఖీలు కట్టుకుంటారు. రాఖీల పోలికతో ఉండే ఈపంచపాండవుల పూలను రాఖీలుగా తయారు చేసి కట్టుకోవడం గొప్ప అనుభూతిని స్తున్నందని అయిలయ్య చెబుతున్నాడు. అయిలయ్య కొన్నే ళ్లుగా కూర గాయలు, పండ్లు, పూల నర్సరీలను పెంచుతుండటంతో కూర గాయల అయిలయ్యగా అందరికీ చిరపరిచితం. – హుస్నాబాద్ -
సీఎం జగన్‌కు రాఖీ విషెష్ చెప్పాలనుకుంటున్నారా.. అయితే..
అన్నా చెల్లెళ్ల అనుబంధం.. అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగం మాటలకందనిది.. అనుక్షణం ఆనందం పంచుతూ కష్టమన్నదే దరి చేరకుండా రక్షగా నిలిచే సోదరుడి చేతికి కట్టే రాఖీ అమూల్యమైనది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రాఖీ పండుగ నాడు మీ అభిమాన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మీరే ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మీ సందేశాన్ని సీఎం జగన్‌తో పంచుకోవడానికి ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించండి. ►మొదట మీ వీడియోను రికార్డును చేయండి ►రికార్డు చేసిన మీ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో కానీ ఇతర సోషల్ మీడియా పేజీల్లో కానీ అప్లోడ్ చేయండి. ►7890689927 నెంబర్‌కు రికార్డు చేసిన వీడియోను పంపండి. ఈ రాఖీ పండుగ నాడు మీ అభిమాన సోదరుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న గారికి మీరే ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మీ సందేశాన్ని సీఎం వైయస్ జగన్ గారితో పంచుకోవడానికి ఈ క్రింది విధంగా అనుసరించండి. pic.twitter.com/cAoaDdysRX — YSR Congress Party (@YSRCParty) August 11, 2022 -
Raksha Bandhan 2022: సీఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?) -
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వైఎస్సార్సీపీ మహిళా ఎంపీలు
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. అంతకుముందు ఆయన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన వారిలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఉన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, నందిగామ సురేష్ సహా పలువురు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. చదవండి: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం.. పాల్గొన్న సీఎం జగన్ -
రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ
నల్లగొండ క్రైం: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలుకు కానుక ఇవ్వాల్సిన అన్న ఆమె బంగారాన్నే దొంగలించాడు. చెల్లెకు బహుమతి ఇవ్వకుండా ఆమె సొత్తునే చోరీ చేసిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రమేశ్‌కు రాఖీ కట్టేందుకు ఈ నెల 21వ తేదీన ఆయన చెల్లెలు పోగుల లలిత వచ్చింది. లలిత ఆ రోజు అక్కడే ఉంది. అయితే, లలిత తన ఏడు తులాల బంగారు ఆభరణాలను బీరువాలో దాచిపెట్టింది. అదే బీరువాలో తండ్రి ముత్తయ్య రూ.10 వేల నగదును కూడా పెట్టాడు. వాటిపై కన్నేసిన అన్న అదును చూసి బంగారం, నగదును అపహరించాడు. చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా రమేశ్ నిర్వాకం బయటపడింది. అతడితోపాటు అతడి స్నేహితుడు వెలగల విజయ్ను అరెస్టు చేశారు. వారి వద్ద నగదు బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? ) చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
గాఢనిద్రలోనే... అనంతలోకాలకు
మిర్యాలగూడ అర్బన్: తెల్లవారుజాము.. బస్సు వేగంగా వెళ్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలిసేలోపు ఇద్దరి ప్రాణాలు పోయా యి. రాఖీ పండుగను జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వచ్చిన వారు పండుగను ముగించుకుని తిరిగి వెళ్తూ ప్రమాదం బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కామేపల్లి నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 40 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ బయలు దేరింది. తెల్లవారుజామున 3 గంటలకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకోగానే అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి బైపాస్‌పై చింతపల్లి క్రాసింగ్ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆస్పత్రి బయట తన ఇద్దరు పిల్లలతో దీనంగా కూర్చున్న క్షతగాత్రురాలు ముందుభాగంలో కూర్చున్న ప్రకాశం జిల్లా పెద్దకాల్వకుంటకు చెందిన మేడుగ మల్లికార్జున్ (40), ముక్కెనవారిపాలెంకు చెందిన కొత్త నాగేశ్వర్రావు (44) ఇద్దరూ లారీ, బస్సుకు మధ్యలో ఇరు క్కుని అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ వీరు జీవ నం సాగిస్తు న్నారు. రోడ్డు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుంటూరు జిల్లా నాగులవరం గ్రామానికి చెందిన సురభి జయరావు (42) మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 15 మంది, బస్సు డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సదానాగరాజు తెలిపారు. -
పండుగరోజు విషాదం: చెల్లితో రాఖీ కట్టించుకోకుండానే...
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంట పురపాలక సంఘం పరిధి రామన్నపల్లి గ్రామానికి చెందిన వెలిపికొండ రాకేశ్(25) పండుగపూట మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆదివారం రాకేశ్ కారులో బంధువులను సుల్తాన్బాద్లో దించి తిరిగి ఇంటికి వస్తుండగా ఓదెల మండలం కనగర్తి గ్రామ శివారులో కారు చెట్టును ఢీకొని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ స్వగ్రామం హూజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామం. అతడి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతి చెందగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. రాకేశ్ మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి ఒక చెల్లె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. చదవండి: తాలిబన్ల దమనకాండ -
అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య
సంగారెడ్డి:రాఖీ పండుగ వేడుకలు దేశమంతటా ఘనంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదరసోదరీమణుల సందడితో అన్నీ ఇళ్లూ కళకళలాడుతుంటాయి.తమ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను చాటుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. కానీ ఇదే రాఖీ పండగ రోజు ఆ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. అందరిలానే ఆమె కూడా తన అన్నకు రాఖీ కట్టాలనుకుంది. ఆదివారం రాఖీ పండగ కావడంతో అందరు చెల్లెళ్ల మాదిరే మమత అనే యువతి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. కానీ ఆ యువతి చేత రాఖీ కట్టించుకునేందుకు తన అన్నయ్య రమేశ్ నిరాకరించాడు. కారణమేంటో తెలియదు గానీ తాను రాఖీ మాత్రం కట్టించుకోనని స్పష్టం చేశాడు. అన్నపై ఎంతో ప్రేమతో రాఖీ తీసుకొచ్చిన మమత తన అన్నయ్య ఆ మాట అనగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇంటికి వచ్చిన పెద్ద సోదరి సరితతో రమేశ్ రాఖీ కట్టించుకున్నాడు. తన అక్కతో అన్నయ్య రాఖీ కట్టించుకుని తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపానికి గురైన మమతను తండ్రి ఓదార్చి పొలానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి వచ్చిన బసన్నకు కూతురు శవమై కనిపించడంతో బోరున విలపించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారెడ్డి నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న బసన్న(బస్వరాజ్)కు నలుగురు సంతానం. భార్య చనిపోయింది. పెద్ద కూతరుకు పెళ్లయింది. పెద్ద కుమారుడు కూడా వేరుగా నివసిస్తున్నాడు. బసన్నతో పాటు చిన్న కొడుకు రమేశ్, చిన్న కూతురు మమత(22)లు ఉంటున్నారు. నాలుగైదు రోజులుగా అన్నాచెల్లెళ్ల మధ్య గొడవల కారణంగా మమతతో రమేశ్ మాట్లాడటం లేదని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం మమత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ కట్టించుకోనంత మాత్రన ఇలా ఆత్మహత్య చేసుకుంటారా అని సందేహపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గాంధీభవన్‌లో రక్షాబంధన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌లో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నేతలు నీలం పద్మ, వరలక్ష్మి, గోగుల సరిత తదితరులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ములుగు ఎమ్మెల్యే సీతక్క జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మంజులారెడ్డి తదితరులు కూడా రేవంత్‌కు ఆయన నివాసంలో రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలందరికీ కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా అండగా ఉంటుందని, మహిళా సమస్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. -
విషాదం: మరణించిన సోదరుడి చేతికి రాఖీ కట్టిన తోబుట్టువులు
-
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ సందడి
-
బ్రదర్ అండ్ సిస్టర్
రాఖీ పండగ సందర్భంగా ‘మోసగాళ్లు’ సినిమా టీమ్ ఒక విషయం చెప్పింది. అదేంటంటే.. ఇందులో విష్ణు–కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలు చేస్తున్నారని ప్రకటించింది. హాలీవుడ్–ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకి లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మించగా, ఏవీఏ ఎంటర్టై¯Œ మెంట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ పోస్టర్ని విడుదల చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ‘మోసగాళ్లు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌ¯Œ తో వాయిదా పడింది. సినిమా ఎప్పుడు విడుదలయ్యేదీ త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ ఇతర కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి కెమెరా: షెల్డన్ చౌ. -
పోలీసులకు రాఖీ కట్టిన సోము వీర్రాజు
సాక్షి, విజయవాడ: కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో పోలీసులదే అగ్రస్థానం అన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. పోలీసుల సమక్షంలో సోమవారం నిర్వహించిన రాఖీ పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వీర్రాజుతో పాటు జీవిఎల్, సునీల్ డియోదర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ సిబ్బందిని కలిసి వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోము వీర్రాజు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో వైద్యుల తరువాత ముఖ్య పాత్ర పోలీసులదే అని ప్రశంసించారు. (3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం) లాక్డౌన్లో ప్రజలందరూ బయటకు రాకుండా పోలీసులు ప్రముఖ పాత్ర వహించారని సోము వీర్రాజు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు పోలీసులు కల్పించిన అవగాహన, జాగ్రత్తలు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. -
రూ.8 లక్షల రివార్డు.. చెల్లి కోసం లొంగిపోయాడు
రాయ్‌పూర్: రాఖీ పండగ అనేది ప్రధానంగా తోబుట్టువుల పండుగ. ఒకరి క్షేమం ఒకరు కోరుతూ జరుపుకునే పండుగ. ఆడపడుచు.. నిండు నూరేళ్లు తన సోదరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది. రక్ష కట్టించుకున్న సోదరులు జీవితాంతం వారికి తోడుగా ఉంటానని మాటిస్తారు. ఈ రాఖీ పండుగ నాడు.. రక్షా బంధన్ గొప్పతనాన్ని నిజం చేసే సంఘటన ఒకటి చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. నక్సలైట్‌గా మారి.. ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న ఓ అన్నను.. రాఖీ కట్టి.. జనజీవన స్రవంతిలో కలిసేలా చేసింది అతడి సోదరి. వివరాలు.. దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే వ్యక్తి తన 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. (రక్షాబెహన్) గత 14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతని చెల్లెలు లింగేతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తన అన్నయ్య ఇంటికి రావాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది లింగే. ఈ క్రమంలో 2016లో మల్లా, ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ అయ్యాడు. భైరవ్‌ఘడ్ ఏరియా కమిటీ నక్సలైట్ కమాండర్‌గా పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. సోదరుడి క్షేమం కోసం ప్రార్థిస్తోన్న లింగే.. దీనితో మరింత భయాందోళనకు గురయ్యింది. హిట్ లిస్ట్‌లో చేరిన తన సోదరుడు ఏదో ఒక రోజు పోలీసుల కాల్పుల్లో మరణిస్తాడని.. అలా కాకుండా తన అన్నను కాపాడుకోవాలని నిర్ణయించుకుది. (సోదరులకు రక్షాపూర్ణిమ) ఈ క్రమంలో లింగే రక్షాబంధన్ సందర్భంగా సోదరుడు మల్లాను కలిసింది. రాఖీ కట్టి.. పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత సోదరిని కలుసుకున్న లింగే ఆమె కట్టిన రాఖీకి విలువ ఇచ్చాడు. నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాడు. దాంతో మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. -
రక్షాబెహన్
అనురాగబంధం చిరకాలం ఉండేది. రజతోత్సవం అన్నది ఒక జ్ఞాపకమే. మోదీకి ఇరవై ఐదేళ్లుగా.. మొహ్సిన్ షేక్ రాఖీ కడుతూ వస్తోంది. ఈసారి కుదర్లేదు. రాఖీని, ప్రార్థనల్ని.. పోస్ట్ చేసింది. ప్రధానికి రక్షా బెహన్ ఈ పౌరురాలు. ఖమర్ మొహ్సిన్ షేక్ ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టలేకపోయారు! అయితే రాఖీ పౌర్ణమికి మూడు రోజుల ముందే ఈ చెల్లెమ్మ పంపిన రాఖీ ఆ అన్నయ్యకు చేరింది. చేరినట్లుగా ప్రధాని కార్యాలయం నుంచి ఆమెకు తిరుగు జవాబు కూడా వచ్చింది. గత ఇరౖÐð నాలుగేళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నారు మొహ్సిన్. ఈ ఏడాది కూడా ఆయన చేతికి స్వయంగా రాఖీ కట్టి ఉంటే అదొక రజతోత్సవ సంబరం అయి ఉండేది. కరోనా కారణంగా సాధ్యం కాలేదు. మొహ్సిన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంటారు. మోదీకి ఆమె మొదటిసారి రాఖీ కట్టింది 1996లో. మోదీ అప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నారు. పార్టీ ఆదేశాలపై బదలీ మీద ఢిల్లీ వచ్చి హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను చూస్తున్నారు. ఆ ఏడాది ఆగస్టు 28న వచ్చింది రాఖీ పౌర్ణమి. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి ఆయన చేతికి రాఖీ కట్టి వచ్చారు మొహ్సిన్! మోదీకి ఢిల్లీకి, మొహ్సిన్‌కి ఢిల్లీకి పుట్టు పూర్వోత్తరాల అనుబంధం ఏమీ లేదు. మోదీ పుట్టింది గుజరాత్లో. మొహ్సిన్ పుట్టినిల్లు పాకిస్థాన్‌లో. అయితే ఈ అన్నాచెల్లెళ్ల బంధం కలిసింది మాత్రం ఢిల్లీలోనే! మొహ్సిన్‌కి తోడబుట్టిన సోదరులు లేరు. మొహ్సిన్ ఇరవై ఐదేళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నప్పటికీ ముప్పై ఐదేళ్లుగా ఆమెకు ఆయన తెలుసు. 1980లలో పాకిస్తాన్ నుంచి ఆమె ఢిల్లీ వచ్చినప్పుడు మోదీ ‘సంభాగ్ ప్రచారక్’గా ఢిల్లీలో ఆరెసెస్ కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. ఆ సమయంలోనే మొహ్సిన్కు ఆయన పరిచయం అయ్యారు. ‘‘నేను కరాచీ నుంచి వచ్చానని, నా భర్త ఇక్కడి వారేనని తెలిసిన వెంటనే మోదీజీ నన్ను ‘బెహెన్’ అని సంబోధించారు’’ అని శనివారం ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఎ.ఎన్.ఐ.) వార్త సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు మొహ్సిన్. కరాచీ నుంచి ఢిల్లీ వచ్చిన మొహ్సిన్ ఆ తర్వాత అహ్మదాబాద్‌లో స్థిరపడ్డారు. మోదీకి మొహ్సిన్ ఏడో రాఖీ కట్టేనాటికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పందొమ్మిదో రాఖీ కట్టేనాటికి దేశ ప్రధానిగా ఉన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఓ ఏడాది ఆయనకు రాఖీ కడుతూ.. ‘‘మీరు గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థించాను’’ అని మొహ్సిన్ అన్నారట. ఆ మాటకు మోదీజీ నవ్వి ఊరుకున్నారని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన తొలి రాఖీ పౌర్ణమికి రక్షాబంధన్ కట్టేందుకు వెళ్లినప్పడు ఆ సంగతిని ఆయనకు గుర్తు చేశానని మొహ్సిన్ ఎ.ఎన్.ఐ. ప్రతినిధికి చెప్పారు. ఈ ఏడాది కూడా మోదీని నేరుగా కలిసి రాఖీ కట్టాలని అనుకున్న మొహ్సిన్కు ఆ అవకాశం లేకుండా పోయింది. రాఖీతో పాటు ఆయన గురించి తను చేసిన ప్రార్థనలను కూడా ఒక కాగితంలో రాసి పంపారు. ఆయురారోగ్యాలతో మోదీజీ చిరకాలం వర్థిల్లాలని, ప్రపంచానికే గర్వకారణమైన దేశ నాయకుడిగా... వచ్చే ఐదేళ్లల్లో మోదీజీ గుర్తింపు పొందాలని తను ప్రార్థించినట్లు మొహ్సిన్ ఆ కాగితంలో రాశారు. -
రాఖీ పౌర్ణమి స్పెషల్
తోబుట్టువుల పండగ రాఖీ. ఏడాదంతా ఎంత ఆటపట్టించుకున్నా, మనిద్దరం ఒకటే జట్టు అన్న శాంతి ఒప్పందమే రాఖీ. వీళ్లకు చిన్నప్పటి గొడవలే ప్రస్తుత జ్ఞాపకాలు. నేనున్నా అని ఒకరికొకరు చెప్పుకునే భరోసాయే రాఖీ. మా అన్నయ్య బెస్ట్ అని సూపర్ సిస్టర్ ప్రసీద, మా సిస్టర్ సూపర్ అని హ్యాండ్సమ్ బ్రదర్ అమన్, మా అక్క బంగారు తల్లి అంటూ సిక్స్‌ప్యాక్ కార్తికేయ వాళ్ల రాఖీ బంధం గురించి ఇలా చెప్పారు. అన్నయ్య చిన్నప్పటి నుంచే బాహుబలి – సాయిప్రసీద తండ్రి కృష్ణంరాజు, అన్నయ్య ప్రభాస్‌తో సాయిప్రసీద ► నేను ప్రస్తుతం ప్రభాస్ అన్నయ్య (సాయిప్రసీదకు ప్రభాస్ కజిన్ బ్రదర్) హీరోగా చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి గోపీకృష్ణ మూవీస్ తరపున నిర్మాతగా చేస్తున్నాను. తెలుగు వెర్షన్‌కు యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లతో కలిసి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ► ప్రభాస్ అన్నయ్య అనగానే నాకు బెస్ట్‌ఫ్రెండ్ గుర్తుకు వస్తాడు. ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే.. అన్ని విషయాలు షేర్ చేసుకునేంత బెస్ట్ ఫ్రెండ్ నాకు. నా కెరీర్‌కి ఆయనే మెంటర్. రాఖీ పండగ రోజున నేను, చెల్లెళ్లు కలసి అన్నయ్యతో టైమ్ స్పెండ్ చేస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఈరోజు (సోమవారం) తప్పనిసరిగా ప్రభాస్ అన్నయ్యను కలుస్తాం. ► మా ఫ్యామిలీ అంతా ఫుడ్ లవర్సే. మేము అన్నయ్య దగ్గరికెళ్లగానే ౖహె దరాబాద్‌లో ఉన్న బెస్ట్ ఫుడ్ తెప్పిస్తారు (నవ్వుతూ). చిన్నప్పటి నుంచి రాఖీ పండగరోజు అన్నయ్య మాకు బెస్ట్ గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ప్రతి ఏడాది లేటెస్ట్ ట్రెండ్‌లో ఏది ఉంటే అది మా ముందుండేది. అన్నీ బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చేవారు. ఇప్పుడంటే అన్నయ్య ‘బాహుబలి’ అయ్యారు కానీ, మాకు మాత్రం చిన్నప్పటి నుంచే ‘బాహుబలి’. ► మొదట్లో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. వ్యాపారం చేద్దామనుకుని లండన్‌లో బిజినెస్ కోర్స్ చదివాను. ఆ కోర్స్ చివరిలో ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది.. అప్పుడు నేను ప్రొడక్షన్ చేశాను. మొదట్లో సినిమా వ్యాపారం ఎందుకు? ఇది రిస్కీ బిజినెస్ కదా? అనుకున్నాను. లండన్‌లో ప్రాజెక్ట్ తర్వాత నాకు నమ్మకం పెరిగింది. తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు అని అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ప్రొడక్షన్లో ఏడాది కోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఆ కోర్స్ జరుగుతుండగానే ‘రాధేశ్యామ్’ కి పనిచేస్తున్నా. ► ప్రొడక్షన్ విషయంలో అన్నయ్య నాకు చాలా సహాయం చేస్తున్నారు. ‘ప్రొడక్షన్లోకి రావటానికి నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఆసక్తి ఉంటే నాకు తెలిసినదంతా నీకు నేర్పిస్తాను. కంగారు పడాల్సిన పనేంలేదు, నీకు నేనున్నాను’ అంటూ చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు నాన్నకి, అన్నయ్యకి చెప్పి ప్రొడక్షన్లోకి వచ్చాను. ఇద్దరక్కలు నాకుఅమ్మలాంటివాళ్లు – అమన్ లక్ష్మీమంచు, రకుల్‌ప్రీత్ సింగ్‌తో అమన్ ► రాఖీ పండగ వస్తోందంటే అక్క (రకుల్‌ప్రీత్‌సింగ్)కి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటాను. నేను చిన్నప్పటి నుండి ఖరీదైన వస్తువులు ఇచ్చేవాణ్ని కాదు. కానీ, నేను ఏమిచ్చినా చాలా సంతోషంగా తీసుకుంటుంది అక్క. ► గతేడాది మాత్రం ‘బర్బరీ’ బ్రాండ్ హ్యాండ్‌బ్యాగ్ కొనిచ్చాను. తను చాలా ఆనందపడింది. ఈ రాఖీకి నేను హీరోగా నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమా విడుదలవుతుందేమో అనుకున్నాను. నేను నటునిగా కావడమే ఈ ఏడాది అక్కకి ఇచ్చే బహుమతి అని చెబుదాం అనుకున్నాను. కానీ కరోనా వల్ల మా సినిమా విడుదల కాలేదు. 180 థియేటర్లలో సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత లాక్డౌన్ వచ్చింది. అందుకే, ఈ రాఖీ పండక్కి ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాను. ► రాఖీ కట్టించుకున్న తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను.. అది ఇచ్చిన తర్వాత అక్కతో కలిసి సినిమా చూస్తాను. లక్ష్మీమంచును కూడా నేను అక్కలానే భావిస్తాను. ఆమెతో కూడా రాఖీ కట్టించుకుంటాను. ఈ ఇద్దరక్కలు నా లైఫ్‌లో అమ్మలాంటివాళ్లు. త్వరలోనే నా సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతుంది. ఏ నిర్ణయం అయినా అక్కదే! – కార్తికేయ అక్క శుక్లతో కార్తికేయ ► మా అక్క శుక్లా అమెరికాలో ఉంటుంది. చిన్నప్పుడు ఆమె వస్తువులు ఎవరన్నా ముట్టుకుంటే చాలా కోప్పడేది. తన వస్తువుల్ని నేను పనికిరాకుండా చేసి, నాకు తెలియదు అనేవాణ్ణి. ఇద్దరం ఫుల్‌గా ఫైట్ చేసేవాళ్లం. కానీ, రాఖీ పండగకి మాత్రం మంచి బహుమతులు ఇచ్చేవాణ్ని. ► అక్క, నేను ఇద్దరం కలసి చిన్నప్పటి నుండి సినిమాలు చూసేవాళ్లం. సినిమా చూసిన తర్వాత దాని గురించి చర్చించుకోవడంతో పాటు హీరోల గురించి మాట్లాడుకునేవాళ్లం. చిన్నప్పటి నుండి అక్క డ్యాన్స్ బాగా చేసేది. నేను కూడా తన దగ్గర డ్యాన్స్ నేర్చుకునేవాణ్ని. ► నాకు సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా అక్కే ఫైనలైజ్ చేసేది. ఉదాహరణకు.. కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా.. ఇప్పుడు ఏదన్నా సినిమా ఫైనలైజ్ చేయాలన్నా అక్కతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. తర్వాతి అడుగు ఎలా వేయాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అక్క, నేను మాట్లాడుకుంటుంటాం. ► నా మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైనప్పుడు అక్క అమెరికాలోనే ఉంది. తనకి పాప పుడితే అన్నప్రాసనకు నేను వెళ్లాను. అక్కడ ఓ భారతీయ సూపర్ మార్కెట్‌కి వెళితే కొంతమంది నన్ను గుర్తుపట్టి ఫొటోలు దిగారు. అది చూసి మా అక్క సర్ప్రైజ్ అయింది. నాకు బాగా సంతోషంగా అనిపించింది. ► గత ఏడాది అక్క ఇండియాలో ఉన్నప్పుడే నేను నటించిన ‘గుణ 369’ విడుదలైంది.. ఇద్దరం కలిసి చూశాం. ఆ సినిమా విడుదలైన టైమ్‌లో రాఖీ పండగ రావటం, అక్క ఇండియాలో ఉండటం.. ఇలా అన్నీ హ్యాపీ మూమెంట్స్ అదే రోజు జరిగాయి. ఆ సినిమా క్లైమాక్స్‌లో నా నటన చూసి నన్ను పట్టుకొని ఏడ్చింది.. చాలా గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పింది. ‘నాకు జీవితంలో ఇంతకంటే ఏం కావాలి’ అని ఆ క్షణం అనిపించింది. -
నూలు వెచ్చని రక్షాబంధం
భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. అంతటి శక్తి గల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ రక్షాబంధన సంప్రదాయాన్ని ఏర్పరిచారు. చారిత్రకంగా, ఐతిహాసికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణ సంప్రదాయం ప్రకారం రక్షాబంధన దినోత్సవం నాడు సోదరులకు తోబుట్టువులు రక్షాబంధనం కడితే విశాల దృక్పథంతో గ్రామ ప్రజలందరి హితాన్ని కోరుతూ పురోహితుడు ప్రజలందరికీ రక్షాబంధనం కట్టడం కూడా గమనించవచ్చు. అంతేకాదు, యుద్ధ సమయాలలో సైనికులు దేశ రక్షణకు ముందుకు నడుస్తున్నప్పుడు, సరిహద్దు ప్రాంతాలలోని యువతులు, వృద్ధులు, బాలికలు సైనికులందరికీ రక్షాబంధనం కట్టి తిలకం దిద్ది, మంగళహారతులతో సాగనంపడం రివాజు. రక్షాబంధన మంత్రం యేనబద్ధో బలీరాజా దానవేంద్రోమహాబలః తేనత్వామభి బధ్నామి రక్షమాచల మాచల ‘బలాధికుడు, దానశీలుడు అయిన రాక్షసరాజు బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతున్నాను. నీ చేతిని అంటి పెట్టుకుని ఉండే ఈ రక్షాకవచ ప్రభావం వల్ల దేవతలందరూ నీ పక్షాన నిలచి ఏ ప్రమాదమూ జరగకుండా నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను’ అని ఈ మంత్రానికి అర్థం. రక్షాబంధన పండుగ పరమార్థం ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే– ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలని. ఎంత ఖరీదైన రాఖీ అయినా కట్టుకోవచ్చు కానీ నూలు పోగుది మంచిది. జంధ్యాల పూర్ణిమ దైవీశక్తులతో కూడిన శ్రావణ పూర్ణిమనాడు చేసే దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం సత్ఫలితాలనిస్తాయి. దక్షిణ భారతదేశంలో శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు న దులలో, చెరువులలో లేదా కాలువ స్నానం– అదీ కుదరని పక్షంలో ఇంటి వద్దనయినా స్నానం చేసి జీర్ణ (పాత)యజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మ (ముంజవిడుపు) జరిపిస్తారు. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరు ఈ రోజున జంధ్యం మార్చుకోవడం ఆచారం గనుక దీనిని జంధ్యాల పూర్ణిమగా పేర్కొంటారు. హయగ్రీవజయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు ‘జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని, జ్ఞానం వికసిస్తుందనీ ప్రతీతి. – డి.వి.ఆర్ (సోమవారం శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన దినోత్సవం) -
జవాన్ విగ్రహానికి రాఖీ
సాక్షి, హుస్నాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ ఈ పండుగ రోజు తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయితే తన సోదరుడు చనిపోయిన అతని విగ్రహానికి రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో చాటి చెబుతున్నారు. ఏటా జ్ఞాపకార్థం.. అక్కన్నపేట మండలంలోని దుబ్బతండా గ్రామ పంచాయితీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్‌కు ముగ్గురు అక్కలు ఉన్నారు.అతడు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ 2014లో నక్సల్స్ మందుపాతరలో మృతి చెందాడు.అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లింగయ్యనాయక్ సత్తవ్వ తమ వ్యవసాయ పొలంలో విగ్రహాని ఏర్పాటు చేశారు. ఒక్కగానొక్క సోదరుడు చనిపోవడంతో తాము రాఖీ ఎవరికి కట్టాలని అతని సోదరీమణులు విగ్రహంలోనే తమ తమ్ముడుని చూసుకుంటున్నారు. ఏటా రాఖీ పండుగా రోజు విగ్రహానికి రాఖీ కట్టా పండుగా జరుపుకొంటారు.అలాగే కాకుండా ప్రతి ఏటా స్వాతంత్ర,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నరసింహ నాయక్ విగ్రహాం ఎదుట జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటి చెబుతున్నారు. -
ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ
కర్ణాటక ,యశవంతపుర : తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ అని నటుడు యశ్ అన్నారు. గురువారం రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు నందినితో రాఖీ కట్టించుకుని ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడు చేశారు. యశ్ భార్య రాధిక పండిత్ ఆమెరికాలోని తన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్ననాటి ఫోటోలను ఆమె సామాజిక మాధ్యమాలకు అప్లోడ్ చేశారు. -
ఈ రోజు మా అక్కతోనే..
షూటింగ్ నిమిత్తం ఎక్కడ ఉన్నా సరే.. రాఖీ పండగ రోజు మాత్రం ఖచ్చితంగా మా అక్క నిఖితారెడ్డి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుంటాను. మా అక్కకి నేనంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. అందరి అక్కలకు తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది. కానీ మా అక్కది కొంచెం ఎక్కువ ప్రేమ. ఆమె రాఖీ కట్టగానే నేను ఏదో ఒక గిప్ట్ ఇస్తాను. ఇప్పుడు హీరోగా రేంజ్పెరిగింది కాబట్టి గిప్ట్ రేంజ్ కూడా పెరుగుతుంది. తమ్ముడిగా ఏం ఇవ్వకపోయినా ఆమె హ్యాపీగానే ఉంటుంది.. కానీ నాకే ఆమెకు ఏమన్నా మంచి గిప్ట్ ఇవ్వాలని పిచ్చి. ఈ రోజంతామా అక్కతోనే ఉంటాను. -
అన్నను కాపాడిన రాఖి
చెల్లెలి చేత రాఖీ కట్టించుకోవడం అంటే ఆమెకు రక్షగా ఉంటానని పునర్ వాగ్దానం ఇవ్వడమే. రాఖీ కట్టించుకున్న అన్నకు చెల్లెలి అనురాగమే బలం.మనోబలం. చెల్లెలిని ఆదరించని అన్న గుండె,రాఖీ కట్టించుకోని అతని చేయి అర్థరహితం. చెల్లెలే అన్నకు రక్షగా నిలవాల్సినఒక వాస్తవ కథ ఇది. ‘ఆ రోజు చాలా వాన పడుతోంది. నేను ఏడో క్లాస్ చదువుతున్నాను. మా చెల్లెలు అయిదో క్లాసు. మా స్కూల్ నుంచి వచ్చేదారిలో రెడ్డిగారి ఇల్లు ఉంది. ఆ గేటును ఆనుకునే అవతలి వైపు జామచెట్టు ఉంటుంది. దాని నిండా జామకాయలే. కాని పనివాళ్లు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. ఆ జామచెట్టు వైపు పిల్లలు చూస్తే నాలుగు తగిలిస్తారు. అందువల్ల దాని వైపు చూడటమే తప్ప ఎప్పుడూ తిని ఎరగం. ఆ ముందు రోజు మా చెల్లెలు ఎప్పుడూ లేనిది అన్నయ్యా... ఒక జామకాయ కోసిపెట్టవా అని అడిగింది. కోయాలంటే ఎలా? చూస్తే కొడతారు. వద్దమ్మా... కుదరదు అని చెప్పి ఇంటికి తెచ్చేశాను. ఆ మరుసటిరోజు భారీ వాన. ఎవ్వరం స్కూళ్లకు వెళ్లలేదు. ఎవరూ వీధుల్లోకి రాలేదు. ఆకాశం మూసుకుపోయింది. పట్టపగలు చీకటి కమ్ముకుంది. ఇంట్లో అందరం పొయ్యి దగ్గర ముణగదీసుకొని కూచుని ఉన్నాం. కాని నాకు మాత్రం చెల్లెలు అడిగిన చిన్న కోరికే గుర్తుకు వస్తోంది. ఏమడిగిందని... మణులా మాణిక్యాలా... ఒక జామకాయేగా... ఈ వానలో రెడ్డిగారి ఇంటి గేటు దగ్గర ఎవరూ ఉండరని అనిపించింది. ఇంట్లో గొడుగు లేదు. వానకు తడిస్తే తుడుచుకోవడానికి సరైన తువ్వాలు కూడా లేనంత పేదరికం. అయినా అంతటి వానలో తలుపు తీసుకొని రివ్వున బయటకు పరిగెత్తాను. వాన తరుముతూ ఉన్నా తడుపుతూ ఉన్నా బాణాల్లా గుచ్చుతున్నా రెడ్డిగారి ఇంటికి చేరుకున్నాను. నేననుకున్నట్టుగానే గేటు దగ్గర ఎవరూ లేరు. చెట్టు నిండా జామకాయలు తడిసి దుమ్ము కడుక్కుని మెరుస్తున్నాయి. చకచకా గేటు మీద నుంచి చెట్టు మీదకు పాకి దొరికినన్ని కోసి దిగుతుండగానే కుక్క మొరిగింది. రెడ్డిగారి కుక్క. అంతే ఒక్క దూకు దూకాను. కాలు పూర్తిగా బెణికింది. అయినా పరుగు ఆపలేదు. ఇల్లు చేరి ఆ జామకాయలు మా చెల్లెలికి ఇచ్చి వాటిని తను తింటూ ఉంటే కాలు నొప్పి అంతా మర్చిపోయాను. మా చెల్లెలంటే అంత ఇష్టం మేడమ్ నాకు’ అన్నాడతను లేడీ సైకియాట్రిస్ట్‌తో. నలభై ఐదేళ్లు ఉంటాయి. మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి రూపం, వేషం ఉన్నాయి. కాని మనిషి సంతోషంగా లేడు. ఒక కన్ను లేకపోతే, ఒక చేయి లేకపోతే, ఒక ఊపిరితిత్తి లేకపోతే, ఒక మూత్రపిండం లేకపోతే మనిషికి సహజంగా ఒక దిగులు కమ్ముకునే అవకాశం ఉంది. అలాంటి దిగులుతో ఉన్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి. మరి లేనిది ఏమిటి? ‘మా చెల్లెలిని చూసి నేను పదేళ్లు అవుతోంది మేడమ్’ అన్నాడు మళ్లీ. అతడు రోజూ గత కొన్నాళ్లుగా రాత్రిళ్లు మంచం మీదకు చేరి దుప్పటి ముఖం మీదుగా కప్పుకొని తెల్లారే దాకా శోకిస్తున్నాడని అతడి భార్య డాక్టర్ దగ్గరకు తీసుకు వచ్చింది. ఎందుకు అలా ఏడుస్తున్నావని అడిగితే ఏమీ చెప్పడు. పగలంతా మామూలుగానే ఉంటాడు. ఉద్యోగానికి వెళతాడు. పిల్లల అవసరాలు చూస్తాడు. కాని రాత్రయితే బెడ్రూమ్లో దూరి ఎవరికీ కనపడకుండా ఏడుస్తూ ఉంటాడు. భార్య ఉండగా డాక్టర్ అడిగితే కారణం ఏమీ లేదని ఉండేవాడేమో కానీ భార్యను బయట కూచోబెట్టడం వల్ల కొద్ది కొద్దిగా ఓపెన్ అవుతూ ఉన్నాడు. ‘పేదవాళ్ల బతుకులో అతి పెద్ద బరువు ఏమిటో తెలుసా డాక్టర్? బంధం. అవును.. అమ్మా నాన్నా అన్న బంధం. చెల్లెలు అన్న బంధం. కుటుంబం అన్న బంధం. మనిషి ఈ బంధాల కోసమే బతుకుతాడు. కాని పేదరికం ఉన్నప్పుడు ఈ బంధం లేనట్టే మరుపు నటిస్తాడు. నేను టెన్త్ క్లాస్‌కు వచ్చేటప్పటికే చాలా చురుకైన స్టూడెంట్‌నని మా చుట్టుపక్కల పల్లెల్లో బంధువుల్లో తెలిసిపోయింది. మా దూరపు బంధువు ఒకాయన ఒకరోజు మా ఇంటికి వచ్చి మా నాన్నతో– ‘చూడు ఈశ్వరయ్య. నీ కొడుకు నీ దగ్గర ఉంటే మరుసటి సంవత్సరానికి నీలాగే మట్టిపనికి వెళ్లాలి. లేదంటే ఇక్కడి గవర్నమెంట్ కాలేజీలో ఏదో ఒక దిక్కుమాలిన కోర్సు చదవాలి. ఎందుకు కన్నావో కన్నావు. నేనెలా ఉన్నా పర్లేదు నా కొడుకు చల్లగా ఉంటే చాలనుకునే మనసు తెచ్చుకో. నీ కొడుకును నాకిచ్చెయ్. వాణ్ణి చదివించుకొని ఇంజనీరుని చేసి నా కూతురుకి ఇచ్చి చేసుకుంటా. నా మనిషిని చేసుకుంటా’ అన్నాడు. అమ్మా నాన్న అది విని మూడురోజులు ఏడ్చారు. ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి కాని డబ్బులు రావు. నన్ను మా బంధువుతో పంపించేశారు’ అని తల దించుకున్నాడు. కన్సల్టేషన్ రూమ్‌లో డాక్టర్‌తో పాటు గదిలో ఉన్న ప్రతి వస్తువు అతడు చెబుతున్న కథకు చెవి ఒగ్గినట్టుగా చాలా నిశ్శబ్దం ఉంది. అతడు కొనసాగించాడు. ‘ఆ తర్వాత మా ఇంటిని పట్టించుకోలేదు. మా చెల్లెలిని పట్టించుకోలేదు. ప్రతి రాఖీనాడు మా చెల్లెలు అందమైన దారాలతో రాఖీ అల్లి దానిని కవర్లో పెట్టి నాకు పోస్ట్‌లో పంపేది. ఆ రాఖీకి బదులుగా చిన్న చాక్లెట్ పంపే వీలు కూడా నాకు ఉండేది కాదు. పాత లంపటాలు ఎక్కడ నన్ను వెనక్కు లాగుతాయో అని నన్ను తీసుకెళ్లినవాళ్లు ప్రతిదానికీ ఉలిక్కిపడుతూ ఉండేవారు. మా చెల్లెలికి ఊళ్లోనే మరో మట్టిపనివాడికిచ్చి పెళ్లి చేశారు. మా చెల్లెలు కంప్లయింట్ చేయలేదు. నేనొచ్చి నాలుగు అక్షింతలు వేయడమే పెద్ద కానుక అన్నట్టు సంతోషంగా నవ్వింది. దాని జీవితంలో నేను అన్నగా లేను. దాని పిల్లలకు మేనమామగా లేను. చివరకు నా తల్లిదండ్రులకు నేను కొడుకుగా కూడా లేను’... అతడి కళ్లు అంచు తెగకుండా నీళ్లు నిలిపి పెట్టి ఉన్నాయి. ‘మా అమ్మా నాన్నలు చివరి రోజుల్లో చూసే మనిషి లేక అవస్థలు పడ్డారు. తీసుకెళ్లి ఉంచుకోవడానికి నా చెల్లెలు శ్రీమంతురాలు కాదు. నిరుపేద. తీసుకెళ్లి పెట్టుకోవాల్సినవాడిని నేను. కాని చేతులు కట్టివేయబడి ఉన్నాను. ఒకరోజు మా చెల్లెలు ఫోన్ చేసింది– ‘అన్నయ్యా.. నా కోసం నిన్ను నేను ఏమీ అడగలేదు. అమ్మా నాన్న కోసం అడుగుతున్నాను. వాళ్లను బాధించక తీసుకెళ్లి నాలుగు ముద్దలు పెట్టరా’ అంది. దొంగ సంజాయిషీలు చెప్పాను. ఇది జరిగి పదేళ్లు. పదేళ్లుగా మా చెల్లెలు నా ముఖం చూడలేదు. నాతో మాట్లాడలేదు. అన్నగా కాదు నన్నో మనిషిగా కూడా తన మనసులో నుంచి తీసేసింది. పోతే పోయిందిలే అని నేను హాయిగా ఉండొచ్చు. కాని అలా ఉండలేకపోతున్నాను. నా ఒంట్లో రక్తం ఉంది. మా చెల్లెలి ఒంట్లో కూడా రక్తం ఉంది. దానిని ఒక గర్భం నుంచి మేము పంచుకున్నాము. ఆ రక్తం ఏ అర్ధరాత్రో నన్ను లాగుతుంది. ప్రశ్నిస్తుంది. నిలదీస్తుంది. ఎందుకిలా చేశావ్ అని దోషిగా నిలబెడుతుంది. నాకు నిద్ర పట్టదు. ఏం చేయాలో తోచదు. అందుకే ఏడుస్తున్నాను డాక్టర్’ అని ఆపిన కన్నీరును మనసు తేలిక పర్చుకోవడానికి చెంపల మీద కారనిచ్చాడు. లేడీ సైకియాట్రిస్ట్ అంతా వింది. ఇతనికి ఉన్న జబ్బుకు ఒకే ఒక మందు ఉంది. ఆ మందు పేరు చెల్లెలు. ఆ చెల్లెలు పెట్టాల్సిన క్షమాభిక్ష. అన్నను క్షమించడానికి ప్రతి చెల్లెలు సిద్ధంగా ఉంటుంది. ప్రయత్నించాల్సింది అన్నే. సాధారణంగా ఆ సైకియాట్రిస్ట్ పేషంట్ చెప్పిన వివరాలను రికార్డ్ చేయదు. చేసినా అతడి సంబంధీకులకు వినిపించదు. కాని ఈ కేసును చేసింది. చేసి అతడి భార్యకు వినిపించింది. ‘చూడమ్మా... దగ్గరలో రాఖీ పండగ ఉంది. ఏం చేయాలో నీ ఇష్టం’ అంది. ‘నీ భర్తకు చాలా క్షమాపణ అవసరం. నీకు కూడా అవసరం. బంధాలు కూలిపోయాయని కూల్చగలమని మనం అనుకోవచ్చు. కాని రక్తం ఎరుపుగా ఉన్నంత కాలం ఆ బంధం నిలిచే ఉంటుందని గ్రహిస్తే మేలు’ అంది. ఆమె అంగీకారంగా తల ఊపింది. బహుశా ఈ రాఖీ పండుగ ఒక అన్నాచెల్లెళ్ల సంతోషకరమైన ఆలింగనంగా కళకళలాడే అవకాశం ఉంది.– కథనం: సాక్షి ఫ్యామిలీ -
స్వేచ్ఛాబంధన్
భలే మంచి రోజు ఇది. బానిస శృంఖలాలు తెంచుకుని భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు. అంతేనా! రాఖీ పండుగ కూడా కలిసి వచ్చిన రోజు. ఈ రెండు వేడుకలను కలుపుకుంటూ భరతమాత చేసిన ఈ స్వగత రచనను ఆస్వాదించండి. ఎంతోమంది దేశభక్తులు తమ చేతులకు రాఖీలు కట్టించుకున్న రోజు ఇది. రుక్సానా తన చేతికి కట్టిన రాఖీ కోసం పురుషోత్తముడు గ్రీకువీరుడు అలెగ్జాండరును చంపకుండా విడిచిపెట్టాడు. ఎంత అద్భుతమైన పండుగ. కేవలం రాఖీ కారణంగానే అలెగ్జాండరును విడిచిపెట్టాడా. కాదు.. అదొక్కటే కారణం కాదు.. రాఖీలో దాగి ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగానే పురుషోత్తముడు అంత ఉత్తమంగా ప్రవర్తించాడు. అందుకే ఈ రోజు నాకు రెండు పండుగల సంబరాలు జరుగుతున్నాయి. నా బిడ్డలందరూ నన్ను ‘భరతమాత’ అంటూ ఆప్యాయంగా పెనవేసుకుపోతున్నారు. నేను మాత్రం నా పుత్రసంతానం చేతులకున్న రాఖీలు చూస్తూ మురిసిపోతున్నాను. నా ఆడపిల్లలకు ఎంతో భరోసా ఇస్తున్న శుభ పండుగ ఇది. ఆడపిల్లలు అస్వతంత్రులేమీ కాదు, చేతకానివారూ కాదు. ఆప్యాయతను కోరే సున్నిత మనస్కులు. అందుకే సోదరుల ప్రేమను స్వార్థంగా ఆశిస్తారు. నిస్వార్థంగా వారికి సేవలు అందిస్తారు. మన ఇంటి ఆడపడుచులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఒక తల్లిగా నేను నిరంతరం ఆకాంక్షిస్తుంటాను. ఒక పక్కన మువ్వన్నెల జెండాలతో నగరాలు, గ్రామాలు, పల్లెలు కళకళలాడుతుంటే, మరోపక్క నా పిల్లలు చేసుకుంటున్న అన్నచెల్లెళ్ల పండుగతో నాకు కన్నులపండువుగా ఉంది. నా అంతరంగం పరవళ్లు తొక్కుతోంది. రంగురంగుల మిఠాయి బిళ్లలతో బడిపిల్లలు నోళ్లు తీపి చేసుకుంటుంటే ఎర్రగా మారిన వారి నోళ్లు చూసి నా హృదయం పసిపిల్లలా గెంతుతుంటే, పరవశించిపోతాను. ‘హిమగిరీంద్రము నుండి అమృతవాహిని దాకా అఖిల భారత జనుల అలరించు తల్లీ’ అంటూ దేశభక్తి గీతాలు ఆలపిస్తుంటే, నా మేను పులకరించిపోతోంది. ‘కల గంటినే నేను కలగంటినే, కలలోన తల్లిని కనుగొంటినే, ఎంత బాగున్నదో నా కన్నతల్లి ఎన్నాళ్లకెన్నాళ్లకగుపించె మళ్లీ’ అని కొన్ని సుస్వరాల ఆలాపన వింటుంటే, నా మనసు కోకిల గానం చేస్తోంది. ఇంతలోనే ‘అన్నయ్య హృదయం దేవాలయం, చెల్లెలె ఆ గుడి మణిదీపం’ అంటూ చెల్లెమ్మలు అన్నయ్యను పొగడ్తలతో ముంచెత్తుతుంటే, నా బిడ్డలంతా అనురాగ బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నందుకు నా మాతృహృదయం పరవశించపోతోంది. ‘ఎందరో వీరుల త్యాగఫలమే మన నేటి స్వేచ్ఛకే మూల బలం, వారందరినీ తలచుకుని మన మానసవీధిని నిలుపుకుని’ అంటూ వీరుల త్యాగాలను స్మురించుకుంటున్నారు నా వారంతా. నా మీద ఎంత ప్రేమ. కలం పట్టిన ప్రతి కవి సిరాలో నుంచి స్వేచ్ఛాసుమాల వర్ణాలు జాలువారుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో నాకు స్వతంత్రం వచ్చిందనే విషయం పిల్లలకు గుర్తు చేయాలన్న లక్ష్యంతో పాఠశాలల్లో జెండాలు ఎగురవేస్తూ, బిళ్లలు పంచుతుంటే, పిల్లలంతా ముద్దుముద్దు మాటలతో నన్ను కీర్తిస్తూ పాడుతుంటే, నా గురించి నా ఒళ్లే గగుర్పొడిచేలా ఉపన్యాసాలు చెబుతుంటే, నా మాతృహృదయం ద్రవించిపోదా. నాకు ఉత్తరాన ఉన్న హిమాలయాలు అవే కదా. ఈ చిన్నారుల మాటలకు అవి ద్రవించకుండా ఉంటాయా. ఈ పండుగతో పాటు నా పిల్లలంతా మరో పండుగ సంబరంగా జరుపుకుంటుటే, నా ఆనందం ద్విగుణీకృతమవుతోంది. నా నొసట అశోకుని ధర్మచక్రాన్ని కుంకుమగా దిద్దుతూ, మరోపక్క సోదరుల నుదుటన నిలువుగా కస్తూరీ తిలకం అద్దుతుంటే... అబ్బో... మళ్లీ ఎన్నాళ్లకు ఇంతటి సుందర దృశ్యాన్ని కళ్లారా చూసే అదృష్టం కలుగుతుందో అనిపిస్తోంది. శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడి అన్నాచెల్లెళ్ల అనుబంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాడు. సుభద్ర కోరుకున్న అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించి, పితృవాత్సల్యాన్ని అనుభూతి చెందాడు. ఒక తల్లిగా నేను ఇంతకంటె ఏం కోరుకుంటాను. ఇంతటి ఆనందానుభూతులన్నీ ఈ రోజు నా మనసు పొరల్లోంచి బయటకు వస్తున్నాయి. ఈ రోజు నాకు మాత్రమే కాదు నా సంతానానికి కూడా జేజేలు పలుకుదాం. నా వారందరికీ రక్షాబంధన శుభాశీస్సులు పలుకుతున్నాను. ఒక పక్కన మువ్వన్నెల జెండాలతో నగరాలు, గ్రామాలు, పల్లెలు కళకళలాడుతుంటే.. మరోపక్క నా పిల్లలు చేసుకుంటున్న అన్నాచెల్లెళ్ల పండుగతో నాకు కన్నుల పండువుగా ఉంది. నా అంతరంగం పరవళ్లు తొక్కుతోంది.సృజనాత్మక రచన: వైజయంతి పురాణపండ -
సోదరులకు రక్షాపూర్ణిమ
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపండగ అంటే తెలియని వారుండరు. చిన్న నుంచి పెద్ద వరకు పురుషులందరి చేతులూ రకరకాల రాఖీలతో తళతళ మెరిసిపోతుంటాయి. శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనాడు సోదరి చేత రక్ష కట్టించుకుంటే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమం కూడా శుక్రవారం గడిచే దాకా ఆగి ఆ తర్వాతనే పూర్తి చేస్తారు. సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఈవేళ ఇలా చేయాలి శ్రావణపూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానం చేసి, మనం ఎవరి రక్షణ అయితే కోరుకుంటున్నామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు మనఃపూర్వకంగా ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి గల ఈ రక్షికకీ పూజ చెయ్యాలి. అంటే పూజాశక్తిని రాఖీలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని సోదరుడు లేదా సోదర సమానంగా భావించిన వ్యక్తి ముంజేతికి కడుతూ– నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను అని మనసు నుండా భావన చేసుకుని ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఆ తర్వాత తీపి తినిపించాలి. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల! రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ సోదరుడు లేదా మిత్రునికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రక్షాబంధనం కట్టించుకున్న సోదరుడు ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అన్నింటా అండగా నిలవాలి. ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేననీ పౌరాణిక, చారిత్రక గాథల ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన సూత్రాన్ని పురోహితుడు ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. క్రమేపీ ఇది కేవలం సోదరీ సోదరులకు మాత్రమే పరిమితమైన బంధంగా ముడిపడింది. తన సోదరుని జీవితం ఎల్లప్పుడూ తియ్యగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే– ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలిచినప్పుడే ఈ పండుగకు సార్థకత. – డి.వి.ఆర్. -
అన్న చెల్లెళ్లు లేనివారు ఏం చేయాలి?
రాఖీ పండుగ రోజు సోదరుల చేతికి రాఖీ కట్టి కష్టసుఖాలలోసోదరుడు తోడునీడై ఉండాలని కోరుకోవడం సహజం. అయితే అన్నతమ్ముల లేదా అక్కచెల్లెళ్లు లేనివారు ఏం చేయాలి? సోదరులుగా భావించే వారి చేతికి రక్షాబంధనం కట్టాలి. కానీ, అటువంటి అవకాశం కూడా లేనివారు ఏం చేయవచ్చంటే... ఒక పచ్చని చెట్టుకు లేదా ఒక మూగజీవికి రక్షాబంధనం కట్టచ్చు. ఆ చెట్టు లేదా ఆ మూగజీవి సంరక్షణ బాధ్యత తీసుకోవచ్చు. చెట్టుకు కడితే వృక్షబంధనమనీ, జీవ రక్షణమనీ పిలుచుకోవచ్చు. పేరు ఏదైతేనేం... రక్షన వహించడమే కదా అసలు ఉద్దేశ్యం. వృక్షాలైతే స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు ఫలాలు ఇస్తాయి. జంతువులైతే మానసిక ఆహ్లాదాన్నిస్తాయి. -
రాఖీ పండుగ వచ్చిందంటే.. రాజన్నే గుర్తొస్తడు
సాక్షి, మహేశ్వరం: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చాటేది రాఖీ పండుగ. అన్ని పండుగలకంటే రాఖీ నాకు ఎంతో ఇష్టం. దివంగత నేత, అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదటి రాఖీ నేనే కట్టేదానిని. నాకు ఒక తమ్ముడు నర్సింహారెడ్డి ఉన్నాడు. రాజశేఖరరెడ్డి అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాతే మా తమ్ముడికి కట్టేదానిని. రాజన్న కూడా నన్ను సొంత చెల్లెలుగా చూసుకునేవారు. రాఖీ పండుగ వచ్చిందంటే రాజశేఖరరెడ్డి అన్నే గుర్తొస్తడు. నేను చదువుకునే రోజుల్లో రాఖీ పండుగ రోజున మా తమ్ముడికి రాఖీని పోస్టులో పంపించేదాన్ని. ఇప్పుడు రాఖీ పండుగ రోజున మా తమ్ముడి ఇంటికి వెళ్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. -
ప్రకృతి హితమే రక్షగా...
‘రక్షాబంధనం’ అనేది అన్న చెల్లెలికి ఇచ్చేరక్షణకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేది.ఒక్క మార్పుతో ఈ పండగను మరింతవేడుకగా జరుపుకోవచ్చు. అదెలాగో చెబుతున్నాయి కొన్ని పర్యావరణహిత సంస్థలు. 1. మొక్కలకే రాఖీలు మీరు మనసు పెడితే మొక్కలకే రాఖీలను పూయించవచ్చు అంటున్నారు గార్గి. ‘బా నో బాట్వో’ వ్యవస్థాపకులు గార్గి ఔరంగాబాద్ నివాసి. చెట్లు, మొక్కల నుంచి ఆకులు, గింజలు, షెల్ ..వంటి భాగాలను సేకరించి వాటిని రాఖీల తయారీ కోసం వాడుతున్నారు. ఆన్లైన్ ప్రచారం ద్వారా ‘నా సోదరి నా బలం’ అనే ట్యాగ్‌తో క్యాంపెయిన్ ద్వారా గార్గి మరో మైలురాయి దాటారు. 2. హెచ్ఐవీ పిల్లలకు రాఖీ బెంగుళూరులోని జీసస్ హెచ్ఐవీ హోమ్‌లో ఏడాది నుంచి పదేళ్ల వయసున్న హెచ్ఐవీ ప్రభావిత పిల్లలు తలదాచుకుంటున్నారు. వీరికి ‘సీడ్ పేపర్ ఇండియా’ వ్యవస్థాపకులు రోషన్ రాయ్ పర్యావరణ హితమైన రాఖీలను రెండేళ్లుగా అందిస్తున్నారు. ఈ రాఖీలు ఎలా ఉంటాయంటే .. మొక్క వచ్చేందుకు అనువైన విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరినారతో తయారు చేసిన కార్డులను.. ఇలాంటి వాటితో ఒక కిట్‌ని రూపొందించి వారికి ఇస్తున్నారు. 3. స్లమ్ మహిళలకు ఉపాధి ప్రజలతో కలిసి పనిచేస్తేనే అనుభవాలు పువ్వుల పరిమళాలవుతాయి. ఢిల్లీ వాసి సౌరభ్ డిగ్రీ తర్వాత సొంతంగా బాల్ పెన్ తయారీ వ్యాపారం పెట్టుకున్నాడు. ఏడాది గడిచాక పెన్నులన్నీ ప్లాస్టిక్‌వే అని ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. ‘బయో క్యూ’ పేరుతో ‘పర్యావరణహితమైన స్టేషనరీ’ని ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ ద్వారా ప్రతి నెలా 5–6 లక్షల విత్తనాల పెన్నులు, పెన్సిళ్లను తయారు చే యడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన నుంచే మొక్కల రాఖీలను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు సౌరభ్. ‘కిందటేడాది 6,000ల సీడ్ రాఖీలు తయారుచేశాం. ఈ ఏడాది 15,000 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఢిల్లీలోని చుట్టుపక్కల స్లమ్ ఏరియాల నుంచి 20 మంది మహిళలతో ఈ గ్రీన్ రాఖీల తయారీ చేస్తున్నాం. దీనిద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం’ అని ఆనందంగా తెలిపారు సౌరభ్. 4. ఒక్కో దారం ఒక్కో కథ సామాజిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మధ్యప్రదేశ్‌కి చెందిన గ్రామ్‌ఆర్ట్ ఈ వేడుకను ఒక అవకాశంగా తీసుకొని ఈ రాఖీలను రూపొందించింది. ముంబయ్‌లో ఆదివాసీల హక్కుల కోసం ర్యాలీ చేసిన మానవ హక్కుల కార్యకర్త నవ్లీన్ 19 కత్తి పోట్లకు గురయ్యారు. ఆమె జ్ఞాపకార్థం ‘గ్రామ్ ఆర్ట్’ 19 ముడులతో కూడిన రాఖీని తయారుచేసింది. అలాగే గర్భాశయ ఆకారంలో ఉన్న రాఖీ ద్వారా సమాజంలో లింగ అంతరాన్ని ఎత్తి చూపుతుంది. ఇలా ఒక్కో దారం ఒక్కో కథను కళ్లకు కట్టేలా చేస్తుంది గ్రామ్ ఆర్ట్. ‘హమ్ కమ్జోర్ నహీ’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కి చెందిన 100 మంది గ్రామీణ మహిళలతో కలిసి ఈ విత్తన రాఖీల తయారీని చేపట్టారు. కిందటేడాది 12,000 రాఖీలను అమ్మిన ఈ సంస్థ ఈ ఏడాది 20,000ల సీడ్ రాఖీలను అమ్మాయిలని నిర్ణయించుకున్నామని సంస్థ వ్యవస్థాపకులు లలిత్ వంశీ తెలిపారు. 5. మట్టితో అనుబంధం అభికా క్రియేషన్స్ మట్టితో రాఖీలను తయారు చేస్తుంటుంది. ఈ రాఖీలను బటర్ పేపర్లో ప్యాక్ చేస్తారు. మట్టి రాఖీ, పేపర్ నేలలో సులువుగా కలిసిపోతుంది. ‘వీటిని కొంతమంది తమ ఆప్తులకు కానుకలుగా కూడా ఇస్తుంటారు’ అని ఆనందంగా తెలిపారు వ్యవస్థాపకులు. 6. పేపర్ రాఖీ పేపర్‌తో తయారు చేసిన రాఖీతో పాటు కిట్‌లో అరుదైన జాతి మొక్కల విత్తనాలు చుట్టి ఉన్న కాగితం పాకెట్ కూడా ఉంటుంది. ఈ విత్తనాల ద్వారా మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నేటి తరాన్ని రకరకాల గ్యాడ్జెట్లు తమవైపుకు తిప్పుకుంటున్నాయి. ఇలాంటప్పుడు పర్యావరణ మూలాలకు వారిని తీసుకెళ్లడం అత్యవసరం’ అంటారు బైస్మిటా వ్యవస్థాపకులు స్మిత. రాఖీని సోదర ప్రేమకు, రక్షణకు, సంఘీభావనకు గుర్తుగా ఉపయోగిస్తారు. అయితే, చాలా వరకు రాఖీలో ఉపయోగించే ప్లాస్టిక్, రసాయనాల రంగులు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. వీటికి సరైన పరిష్కారం పర్యావరణ హితమైనవి ఎంపిక చేసుకోవడమే. మన చుట్టూ ఉన్నవారికి ప్రకృతి పట్ల వారి బాధ్యతను గుర్తుచేయడమే. -
ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?
బిజనోర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పూర్ణిమకు రకరకాల డిజైన్ల రాఖీలు మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్ జిల్లాలో శ్రీకృష్ణా గోశాల నిర్వాహకులు విభిన్నంగా ఆవు పేడతో రాఖీలు తయారు చేశారు. సహజ రంగులు, దారాలతో పర్యావరణ హితంగా వీటిని తయారు చేసినట్టు ఎన్నారై మహిళ అల్కా లహోటి(52) తెలిపారు. తన తండ్రికి తోడుగా గోశాల నిర్వహణను చూసుకునేందుకు ఇండోనేసియాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆమె బిజనోర్‌కు వచ్చేశారు. ‘జునా అఖహరాతో కలిసి ఆవు పేడతో మేము తయారుచేసిన రాఖీలను మొదటసారి కుంభమేళాలో ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. ప్రజల కోసం ఇలాంటి రాఖీలు రూపొందించాలని స్వాములు సూచించారు. ఇతర నిపుణుల సాయంతో రాబోయే రాఖీ పండగ కోసం వేల సంఖ్యలో రాఖీలు తయారుచేశాం. ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, ఉత్తరాఖండ్, ఒడిశా నుంచి ఆర్డర్లు వచ్చాయి. వివిధ ఆకృతులు, పరిమాణాల్లో టెంప్లేట్స్ తయారుచేసుకుని వీటిలో ఆవు పేడ నింపుతాం. తర్వాత వీటిని చల్లటి, చీకటి ప్రదేశంలో ఉంచుతాం. ఆరిపోయిన తర్వాత పర్యావరణహిత రంగులద్ది, రంగు రంగుల దారాలు కడతాం. చైనా రాఖీలతో పోలిస్తే ఈ రాఖీలు పర్యావరణహితమైనవి. వీటిని తయారుచేయడంలో మొదట్లో పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ రాఖీలు త్వరగా ఇరిగిపోయేవి. ప్రయోగాలు కొనసాగిస్తూనే ఈ సమస్యను అధిగమించాం. గట్టిగా, దృఢంగా ఉండేలా వీటిని రూపొందించగలిగాం. తక్కువ ధరకే వీటిని విక్రయిస్తాం. మిగిలిపోయిన రాఖీలను ఉచితంగా పంచిపెడతామ’ని అల్కా లహోటి వివరించారు. శ్రీకృష్ణా గోశాలలో 117పైగా ఆవులున్నాయి. ఆవు మూత్రంతో ఫినాయిల్, పేడతో పూలకుండీలు కూడా తయారుచేస్తున్నారు. -
కేటీఆర్‌కు రాఖీ కట్టిన చిన్నారి దివ్య
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాఖీ బహుమతిగా ఆపన్నహస్తం అందించారు. గత ఏప్రిల్‌లో కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌కు చెందిన 9 ఏళ్ల దివ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కిరాయి ఆటోని నడుపుకుని జీవనోపాధి పొందుతున్న ఆమె తండ్రి చికిత్సకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడని స్థానిక టీఆర్ఎస్ యువజన నాయకుడు జగన్మోహన్రావు ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి దివ్యకు చికిత్స అందించాలని నిమ్స్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో దివ్య ఎడమకాలిని పోగొట్టుకోవడం విషాదంగా మారింది. ఆపదలో అన్నలా ఆదుకున్న కేటీఆర్‌కు రాఖీ కట్టాలన్న తన ఆకాంక్షని దివ్య వెలిబుచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆమెను ఆదివారం తన ఇంటికి పిలిపించుకుని రాఖీ కట్టించుకున్నారు. ఆమెకు కృత్రిమ అవయవాన్ని అందించారు. అవసరమైతే మరింత సహాయం దివ్యకు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే తనతో రాఖీ కట్టించుకోవడమే పెద్ద బహుమతి అన్న దివ్య, ఇంకేం వద్దంటూ మంత్రికి తెలిపింది. దివ్య తండ్రి కిరాయి ఆటో నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి, త్వరలోనే అయనకు ఒక కొత్త ఆటోను రాఖీ బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యను అన్నలా ఆదుకున్న మంత్రి తారక రామారావుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు తమ ఆనందన్ని వ్యక్తం పరిచారు. కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ కట్టారు. కేటీఆర్ సతీమణి శైలిమ కూడా కవిత భర్త అనిల్ కుమార్‌కు రాఖీ కట్టారు. -
సుఖసంతోషాలతో జీవించాలి: గట్టు
లోటస్‌పాండ్‌లో ఘనంగా రాఖీ పండుగ సాక్షి, హైదరాబాద్: అక్కాచెల్లెళ్లందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృత సాగర్ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లందరికి శ్రీకాంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ, ప్రధాన కార్యదర్శులు పుష్పలత, ఇందిరారెడ్డి, వనజ, కార్యదర్శులు విరాణిరెడ్డి, నేహ, ఇందిర, గీతారెడ్డి, రమా, పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డి, కె.కేసరి సాగర్ పాల్గొన్నారు. -
బహ్రయిన్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
రాఖీ పౌర్ణమి వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రయిన్లో ఘనంగా నిర్వహించింది. మనామా కృష్ణ మందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన బహ్రయిన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్‌లు మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధమే రక్షాబంధన్ అని అన్నారు. రాఖీతో పాటు సోదరులకు హెల్మెట్లను గిఫ్ట్‌గా ఇచ్చి వారికి రక్షణగా నిలవాలనే 'సిస్టర్స్ 4 ఛేంజ్' గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమానికి నాంది పలికిన నిజామాబాద్ ఎంపీ కవిత ప్రయత్నానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవి పటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు గంగాధర్ గుమ్ముల, రాజేందర్ మగ్గిడి, విజయ్, కిరణ్, నర్సయ్య, దేవ్ యాదవ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరూ తమ మధ్య సౌభ్రాతృత్వ భావనలను పునరుద్ధరించుకుంటారని కోవింద్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళల గౌరవాన్ని కాపాడడానికి పునరంకితం కావాలని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రజలను కోరారు. -
‘రాఖీ రోజున హెల్మెట్’ప్రచారం భేష్
కవితకు లోక్‌సభ స్పీకర్ కితాబు సాక్షి, న్యూఢిల్లీ: హెల్మెట్ వినియోగంపై అవగాహనకు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించిన ఆన్లైన్ ప్రచారానికి సంబంధించిన వెబ్‌లింక్ www.sisters4change.orgను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం పార్లమెంటులో ప్రారంభించారు. రాఖీ పండుగనాడు ప్రతి మహిళ తమ సోదరులకు రాఖీ కట్టడంతోపాటు ఒక హెల్మెట్‌ను బహూకరించాలని కవిత ఇచ్చిన పిలుపును సుమిత్రా మహాజన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం తాను ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కవిత కోరారు. -
రాఖీ పండుగకు వెళ్లి యువతి అదృశ్యం
హైదరాబాద్(నాగోలు) : రాఖీ పండుగకు వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్నగర్కు చెందిన బి.రమాదేవి (20) ఈ నెల 18న రాఖీ పండుగ సందర్భంగా బయటకు వెళ్లింది. అయితే ఎంతకూ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం పరిసర ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రమాదేశి కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘాట్లన్నీ రాకీ పౌర్ణమి సందడి
-
రాఖీ పండుగకు పంపలేదని ఆత్మహత్య
కిరోసిన్ పోసుకున్న వివాహిత చికిత్స పొందుతూ ఎంజీఎంలో మృతి మడికొండ : రాఖీ పండుగకు తల్లిగారింటికి పంపించలేదని వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని మృతి చెందిన ఘటన వరంగల్ 33వ డివిజన్లోని కుమ్మారిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దామెరుప్పుల స్వప్న(22) రాఖీ పండుగకు తన పుట్టిల్లయిన దుగ్గొండి మండలం దేశాయిపేటకు వెళ్తానని భర్త రవీందర్‌ను అడిగింది. అయితే తన నలుగురు అక్కలు కూడా రాఖీ కట్టేందుకు వస్తారని, వారు వచ్చాక వెళ్దామని రవీందర్ స్వప్నతో చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన స్వప్నం బుధవారం మధ్యాహ్నం భర్త పడుకున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె అరుపులతో లేచిన రవీందర్ మంటలను అర్పి చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై విజ్ఞాన్‌రావు తెలిపారు. వీరి వివాహం రెండేళ్ల క్రితం జరుగగా, ప్రస్తుతం ఏడు నెలల బాబు ఉన్నాడు. అయితే స్వప్న వివాహ సమయంలో ఆమె తండ్రి కందికొండ రాజ్‌కుమార్ రెండెకరాల భూమితో పాటు రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు స్థానికులు చెప్పారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మాకు రాఖీ కట్టండి: పుష్కర సిబ్బంది
-
రాఖీ పండక్కి పుట్టింటికి వద్దనడంతో..
కుత్బుల్లాపూర్: రాఖీ పండక్కి పుట్టింటికి వెళ్లొద్దని భర్త అనడంతో మనస్తాపం చెంది ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల ఎస్సై సైదిరెడ్డి కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జితేందర్ సింగ్ బౌరంపేటలోని ఎస్బీహెచ్ బ్రాంచిలో క్యాషియర్‌గా పని చేస్తూ సుభాష్‌నగర్‌లో ఉంటున్నారు. బుధవారం ఉదయం భార్య ప్రతిమా సింగ్ రాఖీ పౌర్ణమికి స్వగ్రామానికి వెళ్దామని భర్తను కోరగా.. నెల క్రితమే వెళ్లొచ్చాం.. ఇప్పుడెందుకని చెప్పి విధులకు వెళ్లాడు. సాయంత్రం ఫోన్ చేస్తే ప్రతిమ స్పందించలేదు. దీంతో భర్త ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్న రాఖీ పండుగకు వస్తే బాగుండు
* నయీమ్ వల్ల మేమంతా చెల్లాచెదురయ్యాం * 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం * మీడియాతో బెల్లి లలిత అక్కాచెల్లెళ్లు తుర్కపల్లి: ‘‘గ్యాంగ్‌స్టర్ నయీమ్ కారణంగా 17 ఏళ్లుగా మా నలుగురం అక్కాచెల్లెళ్లం, అన్నయ్య విడిపోయాం. నయూమ్ చనిపోయూడని తెలిసి ఈ రోజు ముగ్గురం అక్కాచెల్లెళ్లం కలుసుకున్నాం.. మా అన్నయ్య జాడ తెలియదు. ఈ రాఖీ పండుగకైనా వస్తే బాగుండు.. మేమంతా కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాం’’ అని బెల్లి లలిత సోదరీమణులు బాలకృష్ణమ్మ, గుంటి కవిత, సరిత అన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము నలుగురం ఆడపిల్లలం, ఒక అన్నయ్య ఉన్నాడు. మా నాన్న ఒగ్గు కథలు చెప్పి కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అన్న బెల్లి కృష్ణ ఆలనా పాలనా చూస్తూ మా పెళ్లిళ్ల్లు కూడా చేశాడు. తెలంగాణ సాధన కోసం లలిత కాలుకు గజ్జెకట్టి ఎన్నో వేదికల మీద తన ఆట పాటలతో జనాన్ని ఉర్రూతలూగించింది. భువనగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతుం దన్న కారణంతో కొంతమంది నాయకులు కక్షగట్టి 1999లో లలితను హత్య చేయించారు. అదే ఏడాది లలిత చెల్లెలు సరిత భర్త కరుణాకర్‌ను భువనగిరిలో హత్య చేశారు. ఆ తరువాత మా అక్క బాల కృష్టమ్మ భర్తను కూడా హత్య చేశారు. అలా ముగ్గురి హత్యలు జరిగిన తర్వాత మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. మా అన్న ఎక్కడున్నాడో కానీ.. రాఖీ పండుగకు రావాలని ఎదురుచూస్తున్నాం’’ అని చెప్పారు. -
‘ఈ రాఖీ పండుగకు అన్న వస్తే బాగుండు..!’
తుర్కపల్లి: 17 సంవత్సరాలుగా మా నలుగురం అక్కాచెల్లెళ్లం, మా అన్నయ్య అందరమూ విడిపోయాం. నయీం చనిపోయాడని తెలిసి ప్రస్తుతం ముగ్గురం అక్కాచెల్లెళ్లం కలుసుకున్నాం.. ఇంతవరకూ మా అన్నయ్య జాడ తెలియదు. ఈ రాఖీ పండుగకైనా మా అన్నయ్య వస్తే బాగుండు మేమంతా కలుసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం అని బెల్లి లలిత సోదరీమణులు చెప్పారు. వివరాలు.. వారి మాటల్లోనే..‘‘ మేము నలుగురం ఆడపిల్లలం, ఒక అన్నయ్య. ఒగ్గుకథలు చెప్పి కుటుంబాన్ని పోషించేవాడు మా నాన్న. మా చిన్నతనంలో నాన్న చనిపోవడంతో అన్న బెల్లి క్రిష్ణ మా ఆలనా పాలనా చూస్తూ మా పెళ్లిళ్లు కూడా చేశాడు. తెలంగాణ సాధన కోసం కాలుకు గజ్జెకట్టి ఎన్నో వేదికల మీద తన ఆట పాటలతో జనాన్ని ఉర్రూతలూగించింది లలిత. భువనగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతుందన్న కారణంతో కొంతమంది నాయకులు కక్షగట్టి 1999లో లలితను హత్య చేయించారు. అదే సంవత్సరం బెల్లి లలిత చెల్లెలు సరిత భర్త కరుణాకర్‌ను భువనగిరిలో హత్య చేశారు. ఆ తరువాత మా బెల్లి లలిత అక్క బాలక్రిష్టమ్మ భర్తను కూడా హత్య చేశారు. అలా ముగ్గురి హత్యలు జరిగిన తరువాత మా కుటుంబం చిన్నాభిన్నమైంది.. తెలంగాణ కోసం పోరాటం చేసిన బెల్లి లలిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నాం’’ అని బెల్లి లలిత సోదరీమణులు తెలిపారు. -
ఇంతకీ రాఖీ ఎప్పుడు కట్టాలి?
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమినాడు ఈ పండుగ చేసుకుంటారు. అక్కచెల్లెళ్లు తమ సోదరులు క్షేమంగా ఉండాలంటూ చేతికి రక్షాబంధనం కట్టి, వాళ్లకు హారతులిస్తారు. అయితే.. ఈ శనివారం నాడు అసలు రాఖీ ఏ సమయంలో కట్టాలన్న విషయమై పలు రకాల చర్చలు నడుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 1.20 గంటల వరకు భద్రకాల దోషం ఉందని, అందువల్ల ఆ తర్వాత మాత్రమే రాఖీ కట్టాలన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్న సెంటిమెంటు. అదికూడా రాత్రి 9.02 వరకు మాత్రమే కట్టాలని చెబుతున్నారు. ఈ రకమైన సందేశాలు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే.. ఇదంతా ఉత్త ట్రాష్ అని జ్యోతిష్య పండితులు కొట్టేస్తున్నారు. భద్రకాలం అనేది ఓ దోషం మాత్రమేనని, అది ఉన్నంత మాత్రాన రక్షాబంధనం కట్టడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. ఏవైనా పెద్ద పనులు చేపట్టేటప్పుడు, యుద్ధాలకు వెళ్లేటప్పుడు ఈ దోషకాలాన్ని మినహాయించుకుంటే మంచిదేనని, కానీ రక్షాబంధనానికి ఇలాంటివి అడ్డు కాబోవని వివరించారు. దోషకాలంలో కడితే ఏదో అయిపోతుందన్నది ఇటీవలి కాలంలో అనవసరంగా వస్తున్న ఓ చిన్న ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. -
ఫెస్టివల్స్, అకేషన్స్.. షార్ట్ ఫిల్మ్స్..
ఒక థీమ్నో, ఒక కథాంశాన్నో లేదా ఏదో ఒక సందేశాన్నో ఎంచుకుని అందుకు అనుగుణంగా చిన్న సినిమా తీయడం అనేది చాలా మంది ఫాలో అవుతున్నదే. అయితే ఇటీవల దానికి మరో స్టైల్ కూడా జతకలిసింది. అదేమిటంటే.. అకేషన్‌కు లేదా బర్నింగ్ ఇష్యూకు అనుగుణంగా వెంటనే కెమెరా కదిలించడం. నిర్భయ ఘటన లాంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే చిన్న సినిమాలు తెరకెక్కాయి. అదే విధంగా విభిన్న రకాల సందర్భాలు, ముఖ్యమైన రోజుల్ని కూడా ఆధారంగా తీసుకుని తీస్తున్నారు. నిన్న గాక మొన్న ముగిసిన ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా స్నేహం కథాంశంతో చాలా చిత్రాలు తీశారు. అదే బాటలో ‘రాఖీ’ పండుగ సందర్భంగా తాజాగా బ్రదర్/సిస్టర్ సెంటిమెంట్‌ను, అనుబంధాల్ని రంగరించిన పలు చిన్ని సినిమాలు వెలుగు చూశాయి. రానున్న ఆగస్టు 15ని పురస్కరించుకుని కూడా పలు షార్ట్ ఫిల్మ్‌లు రూపాందాయి. సందర్భానికి అనుగుణంగా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అనే ట్రెండ్ కూడా మంచి పరిణామమే. విభిన్న రకాల కధాంశాలు, వి‘చిత్రాలు’ తెరంగేట్రం చేసేందుకు ఇది ఉపకరించవచ్చు. -ఎస్బీ -
ఇటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అటు సోదాలు
వీకెండ్లో బిజీబిజీగా గడిపిన సైబరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: ఒకపక్క రాఖీ పండుగ.., మరోపక్క వీకెండ్. అయినా సైబరాబాద్ పోలీసులు మాత్రం విధి నిర్వహణలో ఆదివారం బిజీబిజీగా గడిపారు. శంషాబాద్‌జోన్‌లో 250 మందితో ‘కార్డన్ అండ్ సర్చ్’ నిర్వహించగా, మరోపక్క ఎల్బీనగర్, బాలానగర్ జోన్ పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన తరగతులు నిర్వహించారు. ప్రజల్లో పోలీసు ప్రతిష్టను మరింత పెంచేందుకు నడుంబిగించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ .. ముందుగా తమ సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అన్ని ఠాణాల సిబ్బందిని ఒక్కచోట కూర్చోబెట్టి అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయా జోన్ల డీసీపీలను ఆదేశించారు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలి, బాధితులకు ఎలా సాయమందించాలనే విషయాలపై సిబ్బందికి వివరించాలని ఆయన సూచించారు. ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ వారి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే ప్రజల నుంచి పోలీసులకు మన్ననలు అందుతాయని కమిషనర్ భావిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు బాలానగర్, ఎల్బీనగర్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, విశ్వప్రసాద్‌లు తమ జోన్ పరిధిలో ఆదివారం పోలీసు సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించారు. కార్డన్ సర్చ్.. సైబరాబాద్‌లో శాంతి భద్రతలు, నేరాలు అదుపునకు మరోపక్క జోన్ల వారీగా ఇప్పటికే కార్డన్ సర్చ్ (బస్తీ గస్తీ) కార్యక్రమం నిర్వహిస్తూ నేరస్తులను పసిగట్టే పనిలో పడ్డారు. గత పదిహేను రోజుల్లో బాలానగర్, మాదాపూర్ డీసీపీ జోన్ల పరిధిలో కార్డన్ సర్చ్‌లో వందలాది దొంగ వాహనాలు, పదుల సంఖ్యలో నేరస్తులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది నేరస్తులను సైబరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసేందుకు ఎంతో ఉపకరిస్తోంది. తాజాగా, ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ జోన్ పరిధిలో డీసీపీ రమేష్‌నాయుడు, క్రైమ్స్ ఇన్‌ఛార్జి డీసీపీ జి.జానకీషర్మిల నేతృత్వంలో 250 మంది పోలీసులు పహాడీషరీఫ్‌లోని శ్రీరామ్‌కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని లక్ష్మీగూడలో కార్డన్ సర్చ్ నిర్వహించి 44 వాహనాలను సీజ్ చేశారు. మరో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
రాఖీ శుభాకాంక్షలు
-
పాదం మీద.. పుట్టుమచ్చనవుతా
ఆ మువ్వల సవ్వడిలో అక్కల ఆప్యాయత ఉంది. ఎలుగెత్తి వినిపించే ఆ గొంతుకలో తోబుట్టువుల అనురాగం దాగుంది. అందుకే ఆ గళం.. ఆడపడుచుల ఆర్తనాదమైంది. ఆ పాదాల మీద పుట్టుమచ్చై రుణం తీర్చుకుంటానంది. మల్లె తీగకు పందిరిలా మారిపోతానంది. మసక చీకటిలో వెన్నెల వెలుగులు నింపుతానంది. ఈ ఆర్ద్రత వెనుక అలవికాని అనురాగం ఉంది. సిరిమల్లె చెట్టు కింద చినబోయిన లచ్చువమ్మ గోస ఉంది. అజ్ఞాతంలో పల్లవించిన గళం కోసం అల్లాడిపోయిన అక్కల ఆవేదన ఉంది. తన జీవితమంతా అక్కలతో ముడిపడి ఉందంటున్న ప్రజాగాయకుడు గద్దర్ రాఖీ బంధాన్ని, అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. - వనం దుర్గాప్రసాద్ నాకు ముగ్గురు అక్కలు. నా చిన్నతనంలోనే వాళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. అయినా వాళ్లకు నేనంటే ప్రాణం. పెద్దక్క పేరు సరస్వతీబాయి. రెండో అక్క శాంతాబాయి. మూడో అక్క బాలమణి. మొదటి ఇద్దరూ కాలం చేశారు. ఇప్పుడున్నది మూడో అక్కే. పెద్దక్కను ఔరంగాబాద్‌కు ఇచ్చాం. రెండో అక్క అల్వాల్‌లోనే ఉండేది. మూడో అక్క మేడ్చల్‌లో ఉంటుంది. నిజానికి రెండో అక్క దగ్గరే ఎక్కువ కాలం ఉండేవాణ్ని. ఆమెలో ఉద్యమ భావాలు బాగా నచ్చేవి. నక్సల్స్ ఉద్యమంపై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లోనూ ఉద్యమ నేతలకు ఆమె రాఖీ కట్టేది. కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులకు శాంతాబాయి చాలాసార్లు రాఖీ కట్టింది. అందుకే ఆమె ప్రజా ఉద్యమానికే సోదరిగా భావిస్తాం. అజ్ఞాతంలో ఎక్కువ గడపడం వల్ల నేను వాళ్లకు చాలా కాలం దూరంగానే ఉన్నాను. పెద్దక్క మాత్రం ఏటా ఇంటికొచ్చేది. బావ వాళ్ల తమ్ముళ్లకు దుస్తులు కొంటే తను నాకు కూడా కొనేది. అక్కంటే ప్రాణం కావడం వల్లేమో, ఆమె తెచ్చేవన్నీ నాకు నచ్చేవి. ఆ రాఖీ అలాగే.. రాఖీ పండుగొస్తే ఎంతో మంది ఈ అన్నకు రాఖీలు కడతారు. కానీ రెండో అక్క శాంతాబాయి రాఖీ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ఊడిపోయే వరకూ విప్పే ప్రసక్తే లేదు. ఒక రోజు ముందే రాఖీ కొనేది. ‘రేపు రాఖీ... ఎక్కడికీ వెళ్లకూ...’ అని ముందే హెచ్చరించేది. పొద్దున్నే స్నానం చేసేవరకే అక్క సిద్ధంగా ఉండేది. రాఖీ కట్టి ఆత్మీయంగా కౌగిలించుకునేది. ఆ అక్కకు నేనేమిచ్చి రుణం తీర్చుకుంటాన? అక్క కట్టిన ఆ రాఖీ చేతికున్నంత సేపు రాలిపోయే స్వర్ణక్కలు.. వాడిపోయే లచ్చుమమ్మలు గుర్తుకొస్తారు. ఆ రాఖీలో అంత శక్తి ఉందనిపిస్తుంది. మాదంతా రివర్స్ ‘రాఖీ కట్టావ్.. అన్న నీకు ఏం ఇచ్చాడు?’ సాధారణంగా విన్పించే ప్రశ్న ఇది. కానీ మా ఇంట్లో భిన్నంగా ఉంటుంది. రాఖీ కట్టిన అక్క ఆ రోజు ఆమె దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిందే. సోదర భావాన్ని సామాజిక, మానవీయ కోణంలో చూడాలని కోరుకుంటాను. నిజానికి ఆ సోదర ప్రేమను ఏ రూకలతో కొలుస్తాం? ఆ సెంటిమెంట్‌ను బలమైన బంధంగా మార్చే సన్నివేశానికి ఎలా వెలకడతాం? నేను మాత్రం పాట, మాట, ఆటతోనే ఆ అక్కలకు జోహార్లర్పిస్తాను. ఎర్రపూల దారిలోనే పాదాభివందనం చేస్తాను. అజ్ఞాతంలో మరుపురాని జ్ఞాపకం నేను అజ్ఞాతంలో ఉన్నాను. ఒకసారి పెద్దక్కను ఔరంగాబాద్‌లో రహస్యంగా కలుసుకోవాలనుకున్నా. పోలీసుల నిఘా తీవ్రంగా ఉండటంతో ఇబ్బంది పడుతుందనుకున్నా. చెప్పినట్టే ఓ రహస్య ప్రదేశానికి వచ్చింది. అప్పుడూ ఆమె ఒట్టి చేతులతో రాలేదు. నాకు ఇష్టమని గోధుమ రొట్టెలు, టీ తీసుకుని వచ్చింది. టీలో ఆ రొట్టెలు ముంచుకుని తినడం.. అప్పుడు అక్క ఆప్యాయంగా చూడటం.. ఆ తర్వాత నన్ను కౌగిలించుకుని భోరున ఏడ్వటం ఇప్పటికీ మరచిపోలేను. అప్పుడు రాఖీ జీవితంలో మరపురానిది. దేవుడికి ముడుపులు కట్టారు పోలీసులు అణువణువూ గాలిస్తున్న రోజులవి. అప్పుడప్పుడు కంటపడితే ‘ఏంటిరా ఇది.. నీ బిడ్డల ముఖమైనా చూడవా?’ అని ప్రశ్నించేవాళ్లు. నేను మారాలనే అక్కలే.. బయటవాళ్ల ముందు మాత్రం ‘మా తమ్ముడు ఏం తప్పు చేశాడు?’ అని ప్రశ్నించేవాళ్లు. అజ్ఞాతంలో ఉన్న నేను క్షేమంగా ఉండాలని దేవుళ్లకు ముగ్గురక్కలూ ముడుపులు కట్టేవాళ్లు. ఒకసారి ఔరంగాబాద్‌లో పెద్దక్క రైల్వే స్టేషన్లో నన్ను చూసి, ముద్దుపెట్టుకుని, కన్నీళ్లు పెట్టింది. పాటకు ప్రాణం అనుభవాలే ఒకసారి ప్రశాంతంగా గతాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు, కళ్లు చెమర్చిన రాఖీ అనుబంధాలు.. ‘మల్లెతీగకు పందిరి వోలె..’ అనే పాటగా మారాయి. ఆ సమయంలోనే నారాయణమూర్తి తన సినిమా కోసం కదిలించే పాట కావాలన్నారు. ఓ పాఠశాలలో నేను రాసిన పాట విన్నారు. వందేమాతం శ్రీనివాస్ ట్యూన్ కట్టారు. ఆ పాట నారాయణమూర్తిని కదిలించింది. సినిమా విడుదలయ్యాక దాసరి నారాయణరావు భార్య పద్మ ఒక రోజంతా కన్నీరు పెట్టారు. ఊరూవాడా అంతగా కదిలించిన ఆ పాటకు అక్కల మమకారమే ప్రేరణని సగర్వంగా చెబుతాను. అందుకే వాళ్లు కట్టే రాఖీకి వెలకట్టలేమని భావిస్తాను. నా తమ్ముడికి ఎందరో అక్కాచెల్లెళ్లు: బాలమణి గద్దర్ ప్రపంచానికి పాటై పల్లవించినా.. మాకు మాత్రం పిల్లాడే. నాన్న చెప్పిన అంబేద్కర్ భావాల ప్రభావమో.. గద్దర్‌తో ఉన్న మమకారమో.. ఆ ఆత్మీయత అలా బలపడింది. ఏ చిన్న కష్టమొచ్చినా ఆదుకుంటాడు. కన్నీళ్లు పెడితే ఊరడిస్తాడు. ఇంతకన్నా ఏ అక్కకైనా కావాల్సిందేంటి? ఏటా రాఖీ పండుగకు రావడం అలవాటు. నేనొచ్చేసరికే సిద్ధమవుతాడు. తమ్ముడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు రాఖీ కట్టలేదన్న వేదన కలచివేసేది. కానీ గద్దర్‌కు ఎక్కడున్నా అక్కాచెల్లెళ్లు ఉంటారు. నాలాంటి వాళ్లు ఎక్కడో ఒక చోట రాఖీ కట్టే ఉంటారని మనసును ఓదార్చుకునేదాన్ని. ఇప్పుడా ఇబ్బంది లేదు. ఈ జన్మలోనే కాదు.. ఇంకెన్ని జన్మలకైనా నా తమ్ముడు నా చేత, నాలాంటి వాళ్ల చేత రాఖీ కట్టించుకోవాలని కోరుకుంటున్నా. - ఫొటోలు: సృజన్పున్నా -
వాడికి నేను...అక్కను కాదు అమ్మను!
రాఖీ పండుగ... ఒకరికి ఒకరు అండగా నిలుస్తామని ప్రమాణం చేసే పండుగ... చెల్లెళ్లు అన్నయ్యలకు మాత్రమే రాఖీ కట్టే పండుగ కాదు... అక్కయ్యలు తమ్ముళ్లకు అండగా నిలుస్తామనే భరోసా ఇచ్చే పండుగ కూడా ... శ్రీకాంత్, అనిల్... . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తారలు... నిర్మల... ఆ సెలబ్రిటీల తోబుట్టువు... నలభై సంవత్సరాలుగా వీరి మధ్య అనుబంధం ఎంతో పొందికగా కొనసాగుతోంది... ‘మాకు అందరి కంటె మా అక్కే ఎక్కువ’ అని ఆ తమ్ముళ్లు చెబుతుంటే... ‘నాకు మా ఇద్దరు తమ్ముళ్లు దేవుడిచ్చిన బహుమతి... వాళ్లు నాకు పెద్ద కొడుకులు, ఆ తరవాతే మా అమ్మాయి’ అంటున్నారు అక్కయ్య నిర్మలచిన్నప్పటి నుంచీ తమ్ముళ్లతో టెన్షన్స్... తరవాత సరదాలు, సాహసాలూ... రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఈ అక్కాతమ్ముళ్ల ఆప్యాయతానురాగాలను శ్రీకాంత్ సోదరి నిర్మల ‘సాక్షి’ తో మురిపెంగా పంచుకున్నారు. రక్షాబంధనం... మా పెద్ద తమ్ముడు శ్రీకాంత్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నేను మొట్టమొదటిసారి రాఖీ కట్టాను. అప్పుడు వాడు తనకి స్పోర్ట్స్‌లో వచ్చిన బహుమతులలో నుంచి ఒక బొమ్మ తీసి, దాన్ని అందంగా ప్యాక్ చేసి, ప్రేమగా నా చేతికి ఇచ్చినట్లు గుర్తు. అప్పటి నుంచి ఈ రోజు వరకూ ఒక్క సంవత్సరం కూడా మానకుండా రాఖీ కడుతున్నాను. రక్షణకేనా... రాఖీ కట్టడమంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్లకు రక్షణ కల్పించడం అనుకుంటారు చాలా మంది. నా లెక్క ప్రకారం సందర్భాన్ని బట్టి ఒకరికొకరు రక్షణగా నిలబడాలి. నేను మా ఇంట్లో పెద్దదానిని. అందువల్ల మా తమ్ముళ్లకి రాఖీ కట్టి వాళ్లని ఆశీర్వదించే అవకాశం నాకు ఈ రోజు హక్కుగా సంక్రమించినట్టు, ‘భగవంతుడి రక్ష’ నాతో కట్టిస్తున్నట్టు భావిస్తాను. బాధగా ఉండేది... నేను పుట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత మా కాంతి (శ్రీకాంత్‌ని ప్రేమగా కాంతి అంటారు) పుట్టాడు. నా ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుంచి వాడంటే ప్రాణం. ఎవరైనా మా కాంతిని ఏమైనా అన్నారో, ఇక వాళ్ల పని అయిపోయినట్లే! బాల శ్రీకృష్ణుడు మా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా మేనత్త మా ఇంటికి వచ్చారు. మా కాంతి ఆవిడని ఏదో అడిగితే, ఆవిడ కాదన్నారు. అందుకు వాడికి కోపం వచ్చింది. వాడు అదనుకోసం చూస్తున్నాడు. ఆవిడ స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లి, తలుపు మీద బట్టలు వేయగానే, ఆ బట్టలు తీసుకుని, గోడ ఎక్కేశాడు. నాన్నగారు వాళ్లు చూస్తారేమోనని నాకు భయం. బట్టలు ఇచ్చేయమని వాడిని ఎంతో బతిమాలాను. ఈ లోపల అమ్మవాళ్లంతా అక్కడకు వచ్చారు. ఎలాగో చివరకు బట్టలు ఇచ్చాడు. అప్పటి నుంచి వాడిని మావాళ్లంతా ముద్దుగా శ్రీకృష్ణుడు అనేవారు. ఇంతా చేస్తే అప్పుడు వాడికి ఐదేళ్లు. మాఅత్తయ్య ఇప్పటికీ ఆ సంఘటన తల్చుకుని నవ్వుకుంటారు. స్కూల్లో నా పక్కనే... స్కూల్లో చేరిన కొత్తలో వాడు నా దగ్గరే కూర్చునేవాడు. కొన్నిరోజులయ్యాక వాడి క్లాస్‌లో కూర్చోవడం మొదలుపెట్టాడు. మా స్కూల్ పక్కన పెద్ద కాల్వ ఉంది. అందులో ఉండే చేపలకు క్యారేజీలో తెచ్చుకున్నదంతా వేసేవాడు. ఒకసారి చేప అనుకుని ఒక పాముని పట్టుకున్నాడు. వదిలేయమని నేను ఎంత గట్టిగా అరిచినా వాడు వదలలేదు. ఇంతలో ఆ పాము కరిచింది. దాంతో భయం వేసిందో ఏమో, స్పృహతప్పి పడిపోయాడు. నాకు చాలా భయం వేసింది. అది విషపు పాము కాకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ రోజు వాడితో ప్రమాణం చేయించుకున్నాను ‘సాహసాలు చేయను’ అని. అప్పటి నుంచి ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. కొండ మీద సాధువంటే... అమ్మో... వాడికి చిన్నప్పటి మా ఊళ్లో కొండ మీద ఉండే సాధువంటే భయం, భక్తీను. ఎప్పుడు అల్లరి చేసినా ఆ సాధువుకి ఇచ్చేస్తామని అనేవాళ్లం. మేం సరదాగా చెప్పిన మాటతో, కొండ మీద సాధువు ఏదో చేస్తాడని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఆ సాధువు భిక్ష కోసం రాగానే ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేసేవాడు. దొంగ భయం... వాడికి దొంగల భయం కూడా ఎక్కువే. వేసవికాలంలో మేమంతా ఆరుబయట పక్కలు వేసుకుని పడుకుంటే, వాడు మాత్రం తలుపులన్నీ వేసుకుని ఇంట్లో పడుకుని, కిటికీ దగ్గర నుంచి బయటకు చూస్తుండేవాడు, ఎవరైనా దొంగలు వస్తున్నారేమోనని. ఒకరోజు నిజంగానే ఒక దొంగ కిటికీ పక్క నుంచి వెళ్లాడు. దాంతో నన్ను లేపి, ‘అక్కా! ఇటు నుంచి దొంగ వెళ్లాడు’ అని చెప్పాడు. మేం వాడి మాట నమ్మలేదు. ఇంతలోనే పక్కింటి దగ్గర నుంచి పారిపోవడం చూశాం. వాడు చెప్పింది నిజమే అనుకున్నాం. ఆ సంఘటనతో వాడికి బాగా ధైర్యం వచ్చింది. అది చూసే వాడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. చిన్నప్పుడు ఒకసారి... చిన్నప్పటి నుంచి వాడు చేసే పనుల వల్ల సరదా కంటె టెన్షన్స్ ఎక్కువగా ఉండేది. ఇంటికి వచ్చిన చుట్టాలతో అమ్మ ఎప్పుడూ బిజీగా ఉండేది. అందువల్ల తమ్ముళ్ల బాగోగులన్నీ నేనే చూసేదాన్ని. వాడు ఏం చేసినా అమ్మానాన్నలకు చెప్పకుండా కవర్ చేసేదాన్ని. ఆ రోజు చాలా భయపడ్డాను... ఒకసారి నాన్నగారు మా కాంతిని కోప్పడ్డారు, సరిగ్గా చదవట్లేదని. అప్పుడు వాడు నాతో ‘నేను లేకపోతే కాని వీళ్లకి నా విలువ తెలియదు’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే ఒక కుర్రాడు వచ్చి, ‘మీ తమ్ముడు కాల్వ వైపుగా వెళుతూ కనిపించాడు’ అని చెప్పాడు. అంతకుముందే ఎవరో ఆ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని మా కాంతి విన్నాడు. ఒక్కసారి నా నవనాడులూ కుంగిపోయాయి. పరుగుపరుగున కాల్వ దగ్గరకు వెళితే, వాడు నెమ్మదిగా నడుచుకుంటూ కాల్వ వైపు వెళ్తూ కనిపించాడు. గభాల్న వాడిని పొదివి పట్టుకుని సర్ది చెప్పి ఇంటికి తీసుకువచ్చాను. ఆ రోజున ఎంత టెన్షన్ పడ్డానో, ఇప్పుడు మాత్రం... మా కాంతేనా నన్ను అంత ఇబ్బంది పెట్టింది అనుకుంటాను. టపాసుల్లో నా వాటా కూడా... దీపావళి పండుగకి, నాలుగు రోజులు ముందుగానే బాణాసంచా కొని అమ్మ మా ముగ్గురికీ సమానంగా పంచేది. పంచుతున్నంతసేపు కాంతి చాలా కామ్‌గా ఉండేవాడు. నేను, మా చిన్న తమ్ముడు అనిల్ జాగ్రత్తగా దాచుకునేవాళ్లం. మా కాంతి మాత్రం అన్నీ ముందే కాల్చేసేవాడు. ఒకసారి అలాగే వాడివన్నీ కాల్చేసుకుని, ఎవ్వరూ చూడకుండా నా వాటా బాణాసంచా ఎత్తుకుపోయి, పొలంలో గడ్డివాము దగ్గర కాల్చడం ప్రారంభించాడు. కొంతసేపటికే గడ్డివాములు కాలిపోయాయి. ‘అక్కడ ఎందుకు కాల్చావురా’ అని అడిగితే, ‘నేను అడిగితే నాకు ఇవ్వరుగా, అందుకే ఎత్తుకుపోయి కాల్చేశాను’ అన్నాడు. ఇప్పుడయితే తనే స్వయంగా కొని తీసుకువచ్చి, నన్ను కాల్చమంటాడు. నా ఉత్తరం రాకపోతే... ఇంటర్మీడియట్ ధార్వాడ్‌లో హాస్టల్లో ఉండి చదివాడు. వారానికొకసారి నా దగ్గర నుంచి ఉత్తరం అందితేనే పాఠాలు చదివేవాడు. ఎప్పుడైనా నా నుంచి లెటర్ అందడం ఆలస్యం అయితే ఇంక ఆ వారం చదువు అటకెక్కేదని వాడి స్నేహితులు చెప్పేవారు. మంచి బహుమతులు... మా తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లినా నా కోసం ఏదో ఒకటి తప్పకుండా తీసుకువస్తారు. నాకు ఆధ్యాత్మిక పుస్తకాలంటే చాలా ఇష్టం. ఒకసారి మా కాంతి వివేకానందుడి ఉపన్యాసాల బుక్స్ సెట్ కొని నాకు బహుమతిగా ఇచ్చాడు. అదలా ఉంచితే, ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి చీర కొంటారు. వాళ్లు బిజీగా ఉంటే, డబ్బులిచ్చి నన్నే కొనుక్కోమంటారు. వాళ్లు బయటి ప్రపంచానికి మాత్రమే సెలబ్రిటీస్. నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తమ్ముళ్లే. వివాహమయ్యాక... మా వివాహం జరిగాక మా కాంతి నాతో మా ఇంటికి వచ్చేశాడు. డిగ్రీ పూర్తి చేశాక సినిమాలలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు మా వారు. అసలు నా కంటె కూడా మా వారే మా తమ్ముళ్లని ప్రేమగా చూస్తారనిపిస్తుంది. వాళ్లు కూడా ఆయనతో చాలా స్నేహంగా ఉంటారు. అందువల్ల మా అనుబంధం ఇంకా బాగా కొనసాగుతోంది. బైక్ మీదే... ఇప్పటికీ చిన్న అవసరం ఉందని ఫోన్ చేస్తే చాలు క్షణాలలో వచ్చి వాలతారు. ఒకసారి నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి మా కాంతి ఎంతో టెన్షన్ పడి, బైక్ మీద బయలుదేరాడు. అప్పుడు మేం విజయవాడలో, వాడు చెన్నైలో ఉంటున్నాం. ‘ఎందుకురా అంత సాహసం చేశావు’ అని అడిగితే, ‘నీకు బాగాలేదని తెలిసింది. ఇంక ఉండలేకపోయాను. వచ్చేశాను. అంతే’ అన్నాడు. వాడికి నేను అక్కను కాదు! అమ్మను! తమ్ముళ్ల గురించి చెప్పాలంటే... వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. మా కాంతి బాగా సెంటిమెంటల్, ఎఫెక్షనేట్, ఫ్యామిలీ ఓరియెంటెడ్. చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. చిన్నప్పుడు వాళ్లకి ప్రతి విషయంలో ఎలా సలహాలు ఇచ్చానో, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వగలుగుతున్నాను. అదే సమయంలో వాళ్ల స్వేచ్ఛ, స్వాతంత్య్రం వాళ్లదే. అందువల్ల మా మధ్య తేడాలు రావట్లేదు. రక్తపు దుస్తులతో... ఒకసారి పోలీస్ డ్రెస్‌లో దెబ్బలతో, ఒంటి నిండా రక్తంతో మా ఇంటికి వచ్చాడు. అప్పటికింకా వాడికి పెళ్లి కాలేదు. వస్తూనే ‘చూడు నేను ఎలా ఉన్నానో’ అంటూ పడిపోయాడు. నాకు ఏడుపు వచ్చేసింది. మా వారు కూడా భయపడిపోయారు. ఐదు నిమిషాల తర్వాత (మొదటి సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్) నవ్వుతూ లేచి , ‘నేను పోలీసాఫీసరైతే ఇలాగే అవుతుంది’ అన్నాడు. షూటింగ్ డ్రెస్‌లో వచ్చి నన్ను అలా భయపెట్టాడు. వాడి అల్లరి పనులు అన్నీ ఇన్నీ అని చెప్పలేను. తమ్ముడి గురించి లెక్కలేనన్ని అనుభవాలు ఉన్నాయి. మా ఇద్దరు తమ్ముళ్లూ నాకు దేవుడిచ్చిన వరం. - డా. పురాణపండ వైజయంతి చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లే రోజుల నుంచి అక్కతో అటాచ్మెంట్ ఎక్కువ. సినిమాకి వెళ్లాలంటే అక్క దగ్గర డబ్బులు తీసుకుని, వెళ్లిపోయేవాడిని. అక్క రాకపోతే స్కూల్‌కి వెళ్లేవాళ్లం కాదు. ఏది కావాలన్నా ఎక్కువగా అక్కనే అడిగేవాళ్లం. ఇప్పటికి కూడా మా బాగోగుల గురించి అక్కే ఆలోచిస్తుంది. అక్కలా కాకుండా అన్నీ అమ్మలా చూస్తుంది. మా అవసరాలేంటో చిన్నప్పటి నుంచి తనే చూసుకునేది. మా పెళ్ళిళ్లయ్యాక కూడా ప్రతి ఫంక్షన్‌కీ కలుస్తుంటాం. మేమే కాదు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అక్క. తనంటే మాకు గౌరవం, ప్రేమ. - శ్రీకాంత్ -
ఆన్లైన్లో అనుబంధం
ఒకప్పుడు రాఖీ పండుగ అంటే.. రాఖీ కొనాలి... దానిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించేందుకు సెంటర్‌కు వెళ్లడం, కవర్లు కొనడం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇంత చేసినా చిరిగిపోకుండా ఆత్మీయులైన సోదరులకు రాఖీలు అందుతాయా, అదీ సమయానికి చేరుతాయా, లేదా అనే అనుమానాలతో అక్కాచెల్లెళ్లు మధనపడేవారు. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో వరంగల్ నగరంలోని పలువురు మహిళలు, యువతులు ఈసారి తమ సోదరులకు ఆన్లైన్లో రాఖీలు పంపించేందుకు సిద్ధమయ్యారు. షాపుల్లో మాదిరిగానే... రాఖీలు అమ్మే షాప్‌నకు వెళ్తే వేల రకాలు.. బంగారు, వెండి రాఖీలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిందే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఆన్లైన్లో అన్ని రకాలు ఉంటాయా, లేదా అనే బెంగ కొందరికి ఉంది. కానీ ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రకాల రాఖీలు అందుబాటులో ఉంచడంతో మహిళలు, యువతులు ఈసారి ఇంటర్నెట్ రాఖీకే తమ ఓటు అంటున్నారు. దీంతో ఈ సారి నగరం నుంచి సుమారుగా 10వేల మందికి పైగానే తమ సోదరులకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. వేల రకాలు తక్కువ నాణ్యత గల వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూతతో చేసిన రాఖీ, ముత్యాల జర్దోసి రాఖీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఆన్లైన్లో కూడా వెయ్యికి పైగా రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇక చిన్నపిల్లల మనస్సు దోచే చోటా బీమ్, మిక్కీ మౌస్, యాంగ్రీ బర్డ్స్ బొమ్మలతో కూడిన రాఖీలకు కొదువే లేదు. రూ.300 నుంచి రూ.10వేల వరకు ధరలో విభిన్న రాఖీలు ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నాయి. గిఫ్ట్‌లూ రెడీ.. సోదరులు ఇష్టపడే బహుమతులను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి నగర మహిళలు మొగ్గుచూపుతున్నారు. కేవలం రాఖీతో సరిపెట్టుకోకుండా డ్రై ఫూట్స్‌తో చేసే స్వీట్లను కూడా ఆర్డర్ చేసే వెసులుబాటును సైట్లు కల్పిస్తున్నాయి. ఇంకా బ్రేస్లెట్లు, పర్ఫ్యూమ్లు, కుర్తాలు, వాచీలను కూడా బహుమతిగా పంపించాలని సోదరీమణులు సైట్లను వెతికేస్తున్నారు. ఇక రాఖీ పంపిన సోదరీమణుల కోసం సోదరులు వజ్రాభరణాలు, చీరలు, వాచీలు, బ్యాగులు, టెడ్డీబేర్లు.. ఇత్యాది బహుమతుల (రిటర్న్ గిఫ్ట్)ను పంపించేందుకు సిద్ధమయ్యారు. వీటికి కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తుండడంతో ఈసారి రాఖీ పండుగ మొత్తం ఆన్లైన్లో సాగే అవకాశం కనిపిస్తోంది. రాఖీలు లభించే కొన్ని సైట్లు www.onlinerakhigifts.com www.sendrakhizonline.com www.rakhisale.com www.amazon.in www.rakhi.rediff.com www.flipkart.com www.snapdeal.com -
ఆన్లైన్లో..అనుబంధం..
ఒకప్పుడు రాఖీ పండుగ అంటే.. రాఖీ కొనాలి... దానిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించేందుకు సెంటర్‌కు వెళ్లడం, కవర్లు కొనడం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇంత చేసినా చిరిగిపోకుండా ఆత్మీయులైన సోదరులకు రాఖీలు అందుతాయా, అదీ సమయానికి చేరుతాయా, లేదా అనే అనుమానాలతో అక్కాచెల్లెళ్లు మధనపడేవారు. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో వరంగల్ నగరంలోని పలువురు మహిళలు, యువతులు ఈసారి తమ సోదరులకు ఆన్లైన్లో రాఖీలు పంపించేందుకు సిద్ధమయ్యారు. షాపుల్లో మాదిరిగానే... రాఖీలు అమ్మే షాప్‌నకు వెళ్తే వేల రకాలు.. బంగారు, వెండి రాఖీలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిందే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఆన్లైన్లో అన్ని రకాలు ఉంటాయా, లేదా అనే బెంగ కొందరికి ఉంది. కానీ ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రకాల రాఖీలు అందుబాటులో ఉంచడంతో మహిళలు, యువతులు ఈసారి ఇంటర్నెట్ రాఖీకే తమ ఓటు అంటున్నారు. దీంతో ఈ సారి నగరం నుంచి సుమారుగా 10వేల మందికి పైగానే తమ సోదరులకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. వేల రకాలు తక్కువ నాణ్యత గల వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూతతో చేసిన రాఖీ, ముత్యాల జర్దోసి రాఖీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఆన్లైన్లో కూడా వెయ్యికి పైగా రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇక చిన్నపిల్లల మనస్సు దోచే చోటా బీమ్, మిక్కీ మౌస్, యాంగ్రీ బర్డ్స్ బొమ్మలతో కూడిన రాఖీలకు కొదువే లేదు. రూ.300 నుంచి రూ.10వేల వరకు ధరలో విభిన్న రాఖీలు ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నాయి. -
కంకణం కట్టుకుందాం
దైవికం దేవుడు కనిపించకపోవచ్చు. కానీ దైవభీతి ఉంటుంది. మన చేతికి రాఖీ లేకపోవచ్చు. కానీ ఆడపిల్లల్ని నిశ్చింతగా ఉంచేందుకు మనకై మనం కంకణం కట్టుకోవచ్చు కదా! రాఖీ పండుగ ప్రతి యేడూ వస్తుంది. అయితే ఈసారి రాఖీ రాకడ వెనుక ‘ప్రత్యేకమైన’ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు రాఖీ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనవి. రాఖీ.. స్త్రీకి భరోసా ఇస్తుంది. అన్న ఉన్నాడని, తమ్ముడు ఉన్నాడని, భర్త ఉన్నాడని, కొడుకు ఉన్నాడని; వీళ్లందరిలో ఒక రక్షకుడు ఉన్నాడని ధీమాను కలిగిస్తుంది. అయితే అలాంటి ధీమాను, భరోసాను అన్నదమ్ములు, తక్కిన కుటుంబ సభ్యులు, ప్రజా నాయకులు.. వీళ్లెవ్వరూ ఇవ్వలేరని; వాళ్లతో పాటు ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయాలు, నాగరికతలు.. ఇవి కూడా ఏమీ చేయలేవని రూఢీ అవుతున్న ఒక నిస్సహాయ వాతావరణంలో మన ఆడకూతుళ్లు బితుకుబితుకుమంటూ ఉన్నప్పుడు వస్తున్న రాఖీ ఇది! 2012 నాటి ఢిల్లీ బస్సు ఘటన తర్వాత, దోషులకు శిక్ష పడిన తర్వాత, నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్త్రీజాతిపై పగబట్టినట్లుగా దేశమంతటా అత్యాచారాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. వాటికి పదింతలుగా.. రక్షణ కల్పించవలసిన వారి (ప్రజానాయకులు, ప్రభుత్వాధికారులు) నోటి నుంచి స్త్రీలకు వ్యతిరేకంగా వెలువడుతున్న అభ్యంతరకరమైన మాటలు కూడా! రేప్ అనేది కొన్నిసార్లు తప్పు, కొన్నిసార్లు రైట్ అట. ఓ మంత్రిగారు అంటారు! ‘ఒక్క యూపీలోనే జరగడం లేదు కదా’ అని ఆ రాష్ర్ట సీఎం గారి చికాకు. ‘పాశ్చాత్య నాగరికత చెడగొడుతోందండీ’ అని స్వామీ నిశ్చలానంద సరస్వతి. ఇంకా ఇలాంటివే రకరకాల విశ్లేషణలు. ‘‘టీవీ చానళ్లు మతిపోగొడుతున్నాయి మరి!’’, ‘‘ఇంటర్నెట్ వచ్చాక ఎడ్యుకేషన్ ఎక్కువైంది’’, ‘‘పెద్దపిల్లల్ని, స్త్రీలని రేప్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. మరీ పసికందుల మీద కూడానా?’’, ‘‘ఆ మహిళ గౌరవనీయురాలైతే ఎందుకలా జరిగి ఉండేది?’’, ‘‘మీద పడబోతున్నప్పుడు ‘అన్నయ్యా’ అంటే సరిపోయేది కదా’’, ‘‘ఒంటి నిండా బట్టలుంటే ఇలాంటివి జరగవు’’, ‘‘స్కూళ్లలో స్కర్టుల్ని బ్యాన్ చెయ్యాలి’’, ‘‘సీత లక్ష్మణ రేఖ దాటింది కాబట్టే అపహరణకు గురైంది’’, ‘‘పెట్రోలు, ఫైరు ఒకచోట ఉంటే అంటుకోవా?’’, ‘‘అంతా గ్రహ ఫలం.. గ్రహాలు సరిగ్గా లేకుంటే ఇలాగే జరుగుతుంది’’, ‘‘ఫాస్ట్ ఫుడ్ తింటే ఇంతే’’, ‘‘చీకటి పడ్డాక ఆడపిల్లకు బయటేం పని?’’, ‘‘బడికెళ్లే పిల్ల చేతికి మొబైల్ ఇస్తే అంతే సంగతులు’’, ‘‘బాయ్‌ఫ్రెండ్స్ ఉన్న పిల్లలకే ఎక్కువగా ఇలాంటివి జరుగుతాయి’’, ‘‘ఆ సమయం వస్తే దేవుడు కూడా కాపాడలేడు’’... ఇదీ వరస! అత్యాచారాలు జరక్కుండా చూడండి నాయనలారా, నాయకులారా అని మొత్తుకుంటుంటే... ఇంట్లోంచి బయటికి రావద్దు, వచ్చినా గాలి పీల్చొద్దు, కంట్లో పడిన నలకను తీసుకోవద్దు, వదులైన జడను పబ్లిగ్గా బిగదీసి కట్టుకోవద్దు అంటుంటే ఏం చెప్పాలి? ఇలా మాట్లాడే పెద్దమనుషులక్కూడా ఇంట్లో ఒక చెల్లో, అక్కో, భార్యో, కూతురో ఉండి ఉంటారు కదా. కనీసం బయటి నుండి రాఖీ కట్టేందుకు వచ్చేవారైనా ఉంటారు కదా. చూడాలి.. ఈసారి ఏ అర్హతతో వారు తమ చేతికి రాఖీ కట్టించుకుంటారో! అన్నాచెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ఎంతో ప్రియమైన వేడుక రాఖీ. అన్నగానీ, తమ్ముడు గానీ ఆడపిల్లకు దేవుడిచ్చిన స్నేహితుడు. అలాగే, స్నేహితుడు ఆ పిల్ల ఎంపిక చేసుకున్న సోదరుడు. ఈ స్పృహ ఆడపిల్లలకు ఉంటుంది. ఉండాల్సింది మన ఇళ్లల్లోని అబ్బాయిలకు, రాజకీయాల్లో, ప్రభుత్వ గణాల్లో ఉన్న మొద్దబ్బాయిలకూ. దేవుడు ప్రతి చోటా తను ఉండలేక స్త్రీని సృష్టించాడని అంటారు. మరి ఆ స్త్రీపై అత్యాచారానికి తెగబడడం, ఆ స్త్రీని నోటికి వచ్చినట్లు తూలనాడడం అంటే దేవుడిని దూషించడమే కదా. దేవుడికి అపచారం జరిగినట్లే కదా! దేవుడు కనిపించకపోవచ్చు. కానీ దైవభీతి ఉంటుంది. మన చేతికి రాఖీ లేకపోవచ్చు. కానీ ఆడపిల్లల్ని నిశ్చింతగా ఉంచేందుకు మనకై మనం కంకణం కట్టుకోవచ్చు కదా. - మాధవ్ శింగరాజు -
జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల
సాక్షి, హైదరాబాద్: రాఖీ పండుగను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా షర్మిల బుధవారం ప్రత్యేక ములాఖత్ ద్వారా చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. జగన్‌ను కలుసుకోవడానికి షర్మిల జైలు వద్దకు వచ్చే సమయానికి అక్కడ పెద్దఎత్తున మహిళలు వచ్చారు. జగన్‌కు రాఖీ కట్టేందుకు జైలు అధికారులు వారిని అనుమతించకపోవడంతో అక్కడే బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. వైఎస్ఆర్ అమర్ హై, జై జగన్ నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న షర్మిల వారందరితో మాట్లాడి సముదాయించారు. రాఖీలు కట్టడానికి అక్కాచెల్లెళ్లు మీకోసం వచ్చారని జగనన్నకు తెలియజేస్తానని, మీ అభిమానాన్ని అన్నకి వివరిస్తానని చెప్పి ఊరడించారు. దీంతో కొందరు షర్మిల, వైఎస్ భారతిలకు, జగన్ కటౌట్లకు రాఖీలు కట్టారు. మరికొందరు జగన్‌కు అందజేయాలంటూ రాఖీలను ఆయన సతీమణి భారతికి ఇచ్చారు. ములాఖత్ తర్వాత షర్మిల వారితో మాట్లాడుతూ... రాఖీ కట్టేందుకు ఎంతో మంది అక్కాచెల్లెళ్లు వచ్చారని, జైలు బయట ఉన్నారని చెప్పినప్పుడు జగనన్న సంతోషించారని తెలిపారు. అందరి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. జైలు వద్దకు వచ్చిన వారిలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్, నాయకులు సుమతీ మోహన్, అలేఖ్యరెడ్డి, సూరజ్ ఎస్దానీ, డాక్టర్ ప్రకాశ్ వంజరి, డాక్టర్ వరలక్ష్మి, హిమజానాయుడు, ఇబ్రహీం, నహదీ తదితరులు ఉన్నారు. -
వైఎస్ భారతి,షర్మిలకు రాఖీలు కట్టిన మహిళలు
-
చంచల్‌గూడ జైలు వద్ద మహిళల నిరసన
హైదరాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి రాఖీ కట్టేందుకు చంచల్‌గూడ జైలు వద్ద మహిళలు బారులు తీరారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు. తమకు అనుమతి ఇచ్చేవరకు కదిలేదిలేదని అక్కడే భీష్కించుకు కూర్చున్నారు. కనీసం తమలో ఒక్కరికైనా అనుమతి ఇవ్వాలంటూ వాళ్లు ప్రాధేయపడ్డారు. ఫలితంలేదు. దాంతో వారు జైలు ముందు ధర్నా చేస్తున్నారు. జగనన్నకు రాఖీ కడతామని తాము రెండు రోజుల ముందే జైలు అధికారులకు చెప్పినట్లు వారు తెలిపారు. తమని అడ్డుకుంటున్న పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు జైలు గేటు ఎదురుగా జగన్ ఫోటోకు రాఖీ కట్టారు. మరికొందరు మహిళలు జగన్‌ను కలవడానికి వచ్చిన ఆయన సతీమణి భారతి చేతికి, సోదరి షర్మిల చేతికి రాఖీలు కట్టారు. జగనన్నకే రాఖీ కట్టినట్లు సంబరపడిపోయారు. పోలీసుల వైఖరి మారాలంటూ, వారికి కూడా రాఖీలు కట్టారు. -
ఘనంగా రాఖీ, జంద్యాల పండుగలు భారీగా హాజరైన తెలుగువారు
సాక్షి, ముంబై: నగరంలోని వివిధ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాఖీ, జంద్యాల పండుగలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామ సంఘాల కార్యాలయాల్లో ప్రజలు తమ కులదైవాలకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రోచ్ఛారణలతో కొత్త జంద్యాలను ధరించారు. అనంతరం రాఖీలు కట్టుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రభాదేవి, సయానీరోడ్డు, ఎల్ఫిన్స్టన్ రోడ్డు, లోయర్ పరేల్, వర్లి, కామాటిపుర, సైన్, ప్రతీక్షానగర్ ప్రాంతాల్లో తెలుగుదనం ఉట్టిపడింది. ఎక్కడ చూసినా మహిళలు రాఖీలు, మిఠాయిలు కొనుగోలు చేయడం కనిపించింది. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఓం పద్మశాలి సేవా సంఘం కేంద్ర కార్యాలయం ఖరాస్ భవన్లో ఉదయం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామస్తులు, చాల్స్వాసులకు తీర్థ ప్రసాదాలతోపాటు రాఖీలు, జంధ్యాలు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ చెప్పారు. కమ్మర్పల్లి సంఘం గదిలో.. ముంబైలోని కమ్మర్పల్లి వాసులకు చెందిన పద్మశాలి విజయ సంఘం ఆధ్వర్యంలో ఉదయం జంధ్యాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన గ్రామస్తులకు జంధ్యాలు, రాఖీలు పంపిణీ చేశారు. చిలివేరి నరేంద్ర మంత్రోచ్ఛారణ చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులు మంత్రాన్ని జపిస్తూ పాత జంధ్యాన్ని తీసివేసి కొత్తవి ధరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు గుడ్ల నడ్పి లింబాద్రి, కోశాధికారి గుడ్ల రమేశ్, కమిటి సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. మోర్తాడ్ సంఘంలో.. మోర్తాడ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం రక్షాబంధన్, జంద్యాలధారణ కార్యక్రమం జరిగింది. ఇందులో సంఘం అధ్యక్షుడు కామని హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి అరుట్ల మల్లేశ్, ప్రధాన సలహాదారులు యెల్ది సుదర్శన్, సబ్బని నరేశ్ తదితరులు పాల్గొన్నారు. వర్లిలో.. పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో ఉదయం హవనం, జంద్యాల పూజ ఘనంగా జరిగింది. పద్మశాలీయుల కులదైవం మార్కండేశ్వర మహామునికి పండితులు గంగిశెట్టి రాజమల్లు చేతుల మీదుగా అర్చన, పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, కార్యదర్శులు జిందం భాస్కర్, మహేందర్, కోశాధికారి ఎక్కల్దేవి గణేశ్ తదితరులు పాల్గొన్నారు. దాదర్ నాయ్‌గావ్‌లో... పద్మశాలి యువక సంఘం ఆధ్వర్యంలో ఠ7వ పేజీ తరువాయి గాయత్రి ధారణ వేడుకలు సంఘ భవనంలో ఉదయం ఘనంగా నిర్వహించారు. ఆ సంస్థ ట్రస్టీ చైర్మన్ పాపని సుదర్శన్ చేతుల మీదుగా జ్ఞాతి ధ్వజారోహణం, అధ్యక్షుడు కోడి చంద్రమౌళి చేతుల మీదుగా మార్కండేయ మహామునికి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా యజ్ఞోపవీత ధారణం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు బుధారపు రాజారాం, ఎం.నారాయణ, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, ఉపాధ్యక్షుడు పొన్న శ్రీనివాసులు, తదితరులు హాజరయ్యారు. ప్రభాదేవిలో.......... ఏర్గట్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జంద్యాల పూర్ణిమ, రాఖీ పండుగ ఉత్సవా లు ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యు లందరికీ జంద్యాలు, రాఖీలు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఎలిగేటి రాజారాం చెప్పారు. అట్టహాసంగా మార్కండేయ రథోత్సవం షోలాపూర్, న్యూస్‌లైన్: జంద్యాల పౌర్ణమిని పురస్కరించుకొని తమ కులదైవం శ్రీ మార్కండేయ మహాముని రథోత్సవాన్ని పద్మశాలీయులు మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు మార్కం డేయ మహామునిని దర్శించుకోవ డానికి సిద్ధేశ్వరపేట్లోని మార్కండేయ ఆలయానికి బారులు తీరా రు. స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు నూతన జంజిరాలు (యజ్ఞోపవీతం) ధరించారు. ఇదిలా ఉండగా శతచండీ యాగం తో నూలుపున్నం ఉత్సవాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. పద్మశాలి జ్ఞాతి సంస్థ అధ్యక్షుడు జనార్దన్ కారంపూరి పతాకావిష్కరణ చేశారు. వైభవంగా రథోత్సవం... రథంపై ఉత్సవమూర్తులను ఉంచి పలు వీధుల గుండా ఊరేగించారు. శాసనసభ్యులు విజయ్‌దేశ్‌ముఖ్, ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎస్ఎంసీ సభానాయకుడు మహేష్ కోటే తదితర ప్రముఖులు జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందువరుసలో వివిధ భజన మండళ్లు, చేనేత మగ్గం నూలును వడికే చరఖాలతోపాటు శక్తిప్రయోగ విన్యాసాలు చేసే బృందాలు పాల్గొన్నాయి. మాజీ డిప్యూటీ మేయర్ అప్పాషా మేత్రే రథోత్సవం ఊరేగింపుమార్గంలో హెలికాప్టర్ ద్వారా పూలజల్లులు కురిపించారు. ఇదిలాఉండగా పద్మశాలి జ్ఞాతిసంస్థ ఆలయానికి వచ్చిన భక్తులకు రెండు లడ్డూలను తక్కువ ధరకే పంపిణీ చేశారు. ఈ లడ్డూల తయారీకి ప్రత్యేకంగా టీటీడీకి చెందిన ఐదుదుగురు పాకశాస్త్ర నిపుణులను పిలిపించామని నిర్వాహకులు తెలిపారు. ఊరేగింపు ఉత్సవ కమిటీ కన్వీనర్ విష్ణు కారంపూరి, రఘురాం కందికట్ల, జ్ఞాతి సంస్థ ట్రస్టీ పూరణ్‌చంద్ పూంజాల్, అజయ్ దాసరి, సింద్రాం గంజి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. భివండీలో.. రాఖీ, జంధ్యాల పౌర్ణమిని పురస్కరంచుకొని భివండీలోని మార్కండేయ ముని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.50 గంటలకు యజ్ఞోపతీలా ధారణ జరిగింది. స్థానిక కార్పొరేటర్ సంతోష్‌శెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారని నిర్వాహకులు గాజెంగి రాము, పాము మనోహర్, వేణుప్రసాద్ చెప్పారు. -
రాఖీ సందడి
దోమ, న్యూస్‌లైన్: పల్లెల్లో అప్పుడే రాఖీ పండుగ సందడి మొదలైంది. ఈ నెల20న (మంగళవారం) పండుగ జరుపుకొనేందుకు ఉద్యోగాలు, చదువుల నిమిత్తం పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉండే ఆడపడుచులు, పెళ్లిళ్లై అత్తవారింటికి వెళ్లిన వారు కాస్త ముందుగానే సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఆదివారం అందరికీ సెలవు ఉండడం, ఒక్క సోమవారం సెలవు పెడితే మంగళవారంతో కలుపుకుని మొత్తం మూడు రోజులు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉండడంతో చాలామంది శనివారం సాయంత్రానికే సొంత గ్రామాలకు చేరుకున్నారు. వారంతా తమ సోదరులకు కట్టేందుకు రాఖీల కొనుగోలులో నిమగ్నమయ్యారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మార్కెట్లలో రకరకాల రాఖీలు... వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా మార్కెట్లో ఈ ఏడాది సరికొత్త ఆకృతుల్లో రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. గడియారాల రూపంలో ఉండే రాఖీలు, పూల ఆకారం, డైమండ్ ఆకృతి, గొలుసులు, బ్రాస్లెట్ల రూపంలో, పూసల దండలతో ఉన్న రాఖీలు దర్శనమిస్తున్నాయి. రూ.10 మొదలుకొని రూ.3వేల వరకు ధర పలుకుతున్నాయి. రాఖీల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ కనబడుతున్నాయి. తాండూరులో ఘనంగా రక్షాబంధన్ తాండూరు టౌన్: ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ్ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరులోని కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మహేంద ర్‌రెడ్డి, డీసీసీబీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు వారిని సన్మానించి, రాఖీలు కట్టారు. అనంతరం ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మకుమారి సమాజ్ వారు శాంతి ప్రచారకులుగా దేశవిదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించారన్నారు. దైవం తోడు లేకుండా ఏ కార్యాన్ని చేయలేమని, శాంతి, అహింసా మార్గాల్లోనే అందరి మనసులు గెలుచుకోవచ్చని వారిని చూసి నేర్చుకోవాలన్నారు. డీసీసీబీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నిస్వార్థ సేవతో దైవమార్గాన్ని ప్రబోధిస్తున్న సోదరీమణులు అందరికీ ఆదర్శనీయులని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సేడం, చించోళి, గుల్బర్గా, రంగారెడ్డి జిల్లా సమాజ ప్రతినిధులు రత్న, కళ, జగదేవి, గిరిజ, విద్య తదితరులను తాండూరు సమాజసభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రవిగౌడ్, వెంకటయ్య, భద్రన్న, పెన్నా సిమెం ట్స్ జీఎం హరిశ్చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రిలేషణం: తన గొంతు వినగానే గట్టిగా ఏడ్చేశా...
ఆగస్టు 21 రాఖీ పౌర్ణమి సందర్భంగా... తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఒకరి మీద మరొకరి కంప్లయింట్లు... ఆ రోజు అన్నీ పుల్‌స్టాప్. రాఖీ పండుగ అనురాగాల కొమ్మలు తొడుక్కుని, ఆప్యాయతల రెక్కలు విప్పుకుని వర్షరుతువులో తడి ఆరని జ్ఞాపకమై తోడొస్తుంది. తూర్పున ఉన్న తమ్ముడు నానీని, పడమరలో ఉన్న అక్క దీప్తిని కలిపి కట్టిన రక్షాబంధనమే ఈ వారం రిలేషణం... దీప్తి మాటల్లో... అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమతోపాటు గొడవలు, అలకలు మామూలే. మేం కూడా అందుకు మినహాయింపు కాదు. ఇద్దరం విపరీతంగా కొట్టుకునేవాళ్లం. టీవీ చానెల్ విషయంలో యుద్ధాలే జరిగేవి. నేనొక చానల్ చూస్తానంటే, తను మరోటి చూస్తానని! ఓ వంద రిమోట్ల దాకా విరగ్గొట్టి ఉంటాం. ఇద్దరం కలసి చేసే అల్లరి సంగతేమో కానీ, నాని అల్లరికి స్కూలు వాళ్లు కూడా హడలిపోయేవారు. ఎనిమిదో తరగతి విజయవాడలోని సిద్ధార్ధ స్కూల్లో చదివాడు నానీ. వాడి అల్లరిని భరించలేక ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ ఇంటికి లెటర్స్ పంపించేవాళ్లు, ఫోన్లు చేసేవాళ్లు. ఒక్కోసారి ఆ ఫోన్లు నేనే రిసీవ్ చేసుకునేదాన్ని. అమ్మలా నటించేసి, ఏదేదో చెప్పి మేనేజ్ చేసేదాన్ని. అయినా వాడి అల్లరి మితిమీరడంతో స్కూల్వాళ్లు వాణ్ని హైదరాబాద్ పంపేశారు. అంతేకాదు... మావాడికి చిన్నప్పట్నుంచీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వాడికొచ్చే బ్లాంక్ కాల్స్‌కి నేను తిట్లు తినేదాన్ని. నాకు మొదటినుంచీ చదువు మీద శ్రద్ధ ఎక్కువ. కానీ నానీకి మాత్రం సినిమా అంటే ప్రాణం. ఏ సినిమా విడుదలైనా, ఫస్ట్ షోకే పరిగెత్తేవాడు. ఎంత ఇన్వాల్వ్ అయి చూస్తాడంటే... పక్కన బాంబు పేలినా పట్టించుకోడు. నాకు తనలో నచ్చని విషయం అదే. మరీ అంత పిచ్చేంట్రా అనేదాన్ని. పైగా సినిమా చూసి, ఆ కథకు తన ఇమాజినేషన్ జోడించి మరీ ఫ్రెండ్స్‌కు చెప్పేవాడు. తీరా వాళు సినిమా చూశాక ‘నువ్వు చెప్పిందేదీ సినిమాలో లేదురా’ అనేవాళ్లు. అంత బాగా చెప్పేవాడు! తన పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, ఏ సినిమా అయినా నచ్చేస్తుంది మనకు! ఇంజినీరింగ్ అయ్యాక నేను యు.ఎస్. వెళ్లిపోయాను. ఒక్కసారిగా ఏదో దూరమైపోయినట్టుగా అనిపించింది. కొత్తలో ఓ రోజు ఫోన్ చేశాను. వాడి గొంతు వినగానే దుఃఖం పొంగుకొచ్చి గట్టిగా ఏడ్చేశాను. వాడిదీ అదే పరిస్థితి. ఎంత కొట్టుకున్నా అంత ప్రేమ ఒకరంటే ఒకరికి! వాడు డెరైక్షన్ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్నానని చెబితే సంతోషమేసింది. కానీ యాక్టింగ్ అంటే వెంటనే ఎస్ అనలేకపోయాను. ఎందుకంటే, వాడికి డెరైక్టర్‌కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ నటన అంటే చేయగలడో లేదోనని భయమేసింది. కానీ ‘అష్టాచెమ్మా’ చూశాక నా భయం పటాపంచలయ్యింది. వెంటనే ఫోన్‌చేసి ‘అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, చాలా బాగా చేశావ్’ అని మెచ్చుకున్నాను. సంబరపడిపోయాడు. సినిమా పట్ల తనకున్న అంకితభావం, కమిట్మెంట్ వల్లే మంచి నటుడు కాగలిగాడు. అయితే వాడు ఏదో ఒక రోజు గొప్ప దర్శకుడు అవుతాడని నా నమ్మకం. మణిరత్నం ప్రభావం తనమీద చాలా ఉంది. తప్పకుండా ఒకనాడు వాడు ఆ స్థాయి డెరైక్టర్ అవుతాడు. ఆ రోజుకోసం కోసం ఎదురుచూస్తూ ఉంటా! చిన్నతనంలో అక్క రాఖీ కట్టగానే ఫైవ్‌స్టార్ చాక్లెట్, డైరీ మిల్క్ ఇచ్చేవాణ్ని. అమెరికా వెళ్లినప్పట్నుంచిఆన్లైన్లో పంపిస్తోంది. దాన్ని మా కజిన్స్లో ఎవరితోనైనా కట్టించుకుంటాను. నా సినిమాలకు సంబంధించి బెస్ట్ క్రిటిక్ అక్కే. సినిమాల్లో ఏం బాగుంది, ఏం బాగోలేదు అని రివ్యూ రాసి మరీ పంపిస్తుంది. నేను ఏ ఇంపార్టెంట్ విషయమైనా మొదట పంచుకునేది అక్కతోనే. నా ప్రేమ విషయం కూడా ముందు తనకే చెప్పాను. వెంటనే అంజూని చూడాలంటూ ఎగ్జయిటయ్యింది. ఇప్పుడు వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎక్కువసేపు ఉండటం లేదని అంజూ అక్కకి కంప్లయింట్ చేస్తుంది. నేను తనకి సరిగ్గా ఫోన్ చేయట్లేదని అక్క అంజుకి కంప్లయింట్ చేస్తుంది. (నవ్వుతూ) ఇద్దరి మధ్యలో నేను బుక్కయిపోతూ ఉంటాను!