సాక్షి, ముంబై: నగరంలోని వివిధ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాఖీ, జంద్యాల పండుగలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామ సంఘాల కార్యాలయాల్లో ప్రజలు తమ కులదైవాలకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రోచ్ఛారణలతో కొత్త జంద్యాలను ధరించారు. అనంతరం రాఖీలు కట్టుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రభాదేవి, సయానీరోడ్డు, ఎల్ఫిన్‌స్టన్ రోడ్డు, లోయర్ పరేల్, వర్లి, కామాటిపుర, సైన్, ప్రతీక్షానగర్ ప్రాంతాల్లో తెలుగుదనం ఉట్టిపడింది. ఎక్కడ చూసినా మహిళలు రాఖీలు, మిఠాయిలు కొనుగోలు చేయడం కనిపించింది.
తెలుగు సంఘాల ఆధ్వర్యంలో
ఓం పద్మశాలి సేవా సంఘం కేంద్ర కార్యాలయం ఖరాస్ భవన్‌లో ఉదయం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామస్తులు, చాల్స్‌వాసులకు తీర్థ ప్రసాదాలతోపాటు రాఖీలు, జంధ్యాలు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ చెప్పారు.
కమ్మర్‌పల్లి సంఘం గదిలో..
ముంబైలోని కమ్మర్‌పల్లి వాసులకు చెందిన పద్మశాలి విజయ సంఘం ఆధ్వర్యంలో ఉదయం జంధ్యాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన గ్రామస్తులకు జంధ్యాలు, రాఖీలు పంపిణీ చేశారు. చిలివేరి నరేంద్ర మంత్రోచ్ఛారణ చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులు మంత్రాన్ని జపిస్తూ పాత జంధ్యాన్ని తీసివేసి కొత్తవి ధరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు గుడ్ల నడ్పి లింబాద్రి, కోశాధికారి గుడ్ల రమేశ్, కమిటి సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు.
మోర్తాడ్ సంఘంలో..
మోర్తాడ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం రక్షాబంధన్, జంద్యాలధారణ కార్యక్రమం జరిగింది. ఇందులో సంఘం అధ్యక్షుడు కామని హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి అరుట్ల మల్లేశ్, ప్రధాన సలహాదారులు యెల్ది సుదర్శన్, సబ్బని నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
వర్లిలో..
పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో ఉదయం హవనం, జంద్యాల పూజ ఘనంగా జరిగింది. పద్మశాలీయుల కులదైవం మార్కండేశ్వర మహామునికి పండితులు గంగిశెట్టి రాజమల్లు చేతుల మీదుగా అర్చన, పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, కార్యదర్శులు జిందం భాస్కర్, మహేందర్, కోశాధికారి ఎక్కల్‌దేవి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
దాదర్ నాయ్‌గావ్‌లో...
పద్మశాలి యువక సంఘం ఆధ్వర్యంలో ఠ7వ పేజీ తరువాయి
గాయత్రి ధారణ వేడుకలు సంఘ భవనంలో ఉదయం ఘనంగా నిర్వహించారు. ఆ సంస్థ ట్రస్టీ చైర్మన్ పాపని సుదర్శన్ చేతుల మీదుగా జ్ఞాతి ధ్వజారోహణం, అధ్యక్షుడు కోడి చంద్రమౌళి చేతుల మీదుగా మార్కండేయ మహామునికి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా యజ్ఞోపవీత ధారణం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు బుధారపు రాజారాం, ఎం.నారాయణ, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, ఉపాధ్యక్షుడు పొన్న శ్రీనివాసులు, తదితరులు హాజరయ్యారు.
ప్రభాదేవిలో..........
ఏర్గట్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జంద్యాల పూర్ణిమ, రాఖీ పండుగ ఉత్సవా లు ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యు లందరికీ జంద్యాలు, రాఖీలు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఎలిగేటి రాజారాం చెప్పారు.
అట్టహాసంగా మార్కండేయ రథోత్సవం
షోలాపూర్, న్యూస్‌లైన్: జంద్యాల పౌర్ణమిని పురస్కరించుకొని తమ కులదైవం శ్రీ మార్కండేయ మహాముని రథోత్సవాన్ని పద్మశాలీయులు మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు మార్కం డేయ మహామునిని దర్శించుకోవ డానికి సిద్ధేశ్వరపేట్‌లోని మార్కండేయ ఆలయానికి బారులు తీరా రు. స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు నూతన జంజిరాలు (యజ్ఞోపవీతం) ధరించారు. ఇదిలా ఉండగా శతచండీ యాగం తో నూలుపున్నం ఉత్సవాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. పద్మశాలి జ్ఞాతి సంస్థ అధ్యక్షుడు జనార్దన్ కారంపూరి పతాకావిష్కరణ చేశారు.
వైభవంగా రథోత్సవం...
రథంపై ఉత్సవమూర్తులను ఉంచి పలు వీధుల గుండా ఊరేగించారు. శాసనసభ్యులు విజయ్‌దేశ్‌ముఖ్, ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎస్‌ఎంసీ సభానాయకుడు మహేష్ కోటే తదితర ప్రముఖులు జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందువరుసలో వివిధ భజన మండళ్లు, చేనేత మగ్గం నూలును వడికే చరఖాలతోపాటు శక్తిప్రయోగ విన్యాసాలు చేసే బృందాలు పాల్గొన్నాయి. మాజీ డిప్యూటీ మేయర్ అప్పాషా మేత్రే రథోత్సవం ఊరేగింపుమార్గంలో హెలికాప్టర్ ద్వారా పూలజల్లులు కురిపించారు.
ఇదిలాఉండగా పద్మశాలి జ్ఞాతిసంస్థ ఆలయానికి వచ్చిన భక్తులకు రెండు లడ్డూలను తక్కువ ధరకే పంపిణీ చేశారు. ఈ లడ్డూల తయారీకి ప్రత్యేకంగా టీటీడీకి చెందిన ఐదుదుగురు పాకశాస్త్ర నిపుణులను పిలిపించామని నిర్వాహకులు తెలిపారు. ఊరేగింపు ఉత్సవ కమిటీ కన్వీనర్ విష్ణు కారంపూరి, రఘురాం కందికట్ల, జ్ఞాతి సంస్థ ట్రస్టీ పూరణ్‌చంద్ పూంజాల్, అజయ్ దాసరి, సింద్రాం గంజి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.
భివండీలో..
రాఖీ, జంధ్యాల పౌర్ణమిని పురస్కరంచుకొని భివండీలోని మార్కండేయ ముని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.50 గంటలకు యజ్ఞోపతీలా ధారణ జరిగింది. స్థానిక కార్పొరేటర్ సంతోష్‌శెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారని నిర్వాహకులు గాజెంగి రాము, పాము మనోహర్, వేణుప్రసాద్ చెప్పారు.
ఘనంగా రాఖీ, జంద్యాల పండుగలు భారీగా హాజరైన తెలుగువారు
Published Wed, Aug 21 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement