special prayers
-
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ (ఫోటోలు)
-
ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల్లో మునిగితేలారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. హోలీ రంగులతో ఇళ్లు, వీధులు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాలతో గడిపారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు రెండో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల డ్రోన్లు సైతం మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో మసీదు కమిటీల పిలుపు మేరకు హోలీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో మొఘల్ పాలకుల కాలంనాటి షాహీ జామా మసీదులో గత ఏడాది నవంబర్‌లో సర్వే ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదు. సంభాల్‌లో సంప్రదాయ ‘చౌపాయ్ కా జులూస్’ శాంతియుతంగా జరిగింది. పోలీసుల చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు, రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
Ash Wednesday 2025 పవిత్ర ప్రార్థనలు
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ధ్యానంలో ఆచరించే తపస్సు కాలాన్ని ‘లెంట్ కాలం’అంటారు. లెంట్ అనే లాటిన్ మాటకు చిగురించడం అని అర్థం. ఇది బుధవారంతో ప్రారంభమవుతుంది. అందు చేత ‘భస్మ బుధవారం’ లేదా ‘బూడిద బుధ వారం’ అంటారు. లెంట్ మొత్తం నలభై రోజులు. లాటిన్ భాషలో ‘క్వాడ్రగెసిమ’ అనే మాటకు నలభై అనిఅర్థం. బైబిల్లో నలభై దినాల ఉపవాసానికి ఉదాహరణగా, మోషేనలభై దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవసించి, ప్రార్థించాడు. నోవా జలప్రళయం 40 దినాలు జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు పయనించారు. ఏసు పరిచర్యకు ఉపక్రమించే ముందు 40 దినాలు ఉపవసించి ప్రార్థించాడు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన ఉపవాస ధ్యానాలు 40 రోజులు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఒంటిపూట సాత్వికాహారం తీసుకుని నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఆచరిస్తారు.బుధవారం రోజు కొన్ని ఆలయాల్లో విశ్వాసులు తాటాకులతోగాని, కొబ్బరి ఆకులతోగాని, ఖర్జూరపు ఆకులతో చేసిన సిలువ ప్రతిమలు తెచ్చి ఉంచుతారు. వాటిని మరుసటి సంవత్సరం వరకు ఉంచి బుధవారం భస్మం చేస్తారు. ఆ బూడిదతో నుదుటపై సిలువు గుర్తు వేసుకుని లేదా తలపై చల్లుకుని బూడిద బుధవారం నుంచి శుభ శుక్రవారం వరకు జరిగే క్వాడ్రగెసిమ కాలం ధ్యానాలు ఆచరిస్తారు. లెంట్కాలం అంతా దేవాలయాల్లో నలభై అంశాలపై ధ్యానం చేస్తూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ కాలంలో శుభకార్యాలు గాని, కుటుంబాల్లో జరుపుకునే ఇతర ఉత్సవాలు గాని చేయరు. భస్మ బుధవారం నుంచిశుభ శుక్రవారం వరకూ వచ్చే నలభై దినాలు ‘శ్రమల కాలం’గా పరిగణించి, ప్రక్షాళన కోసం పవిత్రపరచుకునే సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఆచరిస్తుంది. శుభ శుక్రవారం అనంతరం వచ్చే శనివారాన్ని ‘లాజరస్ సాటర్ డే’ అంటారు. దీన్నే ‘నిశ్శబ్ద శనివారం’ అని కూడా పిలుస్తారు. ఏసు మరణించిన శుక్రవారం సమాధిలో ఉన్నా, శనివారం అనంతరం పునర్జీవితుడై తిరిగి లేచిన ఆదివారం ‘ఈస్టర్ ఆది వారం’గా జరిగే ప్రార్థనలతో లెంట్కాలం పూర్తవుతుంది. ఈ క్వాడ్రగెసిమ కాలం అంతా పాప ప్రక్షాళనతో పాటు వ్యక్తిగత నియమనిష్ఠలను పాటించి, ప్రపంచ శాంతి, సమసమాజ సుహృద్భావ జీవనం కలగాలని ప్రార్థనలు చేస్తారు. – ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, క్రైస్తవ సాహిత్య పరిశోధకులు (నేడు భస్మ బుధవారం) -
కమలా దేవి హారిస్ గెలవాలని తమిళనాడులో పూజలు
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు బైడెన్ భారతీయ మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆమె డెమోక్రట్ల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే.. కమలా హారిస్‌కు తమిళనాడుతో సంబంధం ఉంది. పైంగనాడు-తులసేంద్రపురం.. ఆమె తాతల ఊరు. ఈ గ్రామ ప్రజలు ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. సోమవారం ఆమె గెలుపు కోసం గ్రామంలోని ధర్మ శాస్తా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలా దేవి గెలిచేంతవరకు తమ పూజలు కొనసాగుతాయని చెబుతున్నారు. ‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీవీ గోపాలన్ గారి మనవరాలు (కమలా హారిస్) ప్రెసిడెంట్ అభ్యర్థి బరిలో ఉంటటం చాలా ఆనందంగా ఉంది. ఆమె డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించాలని మేము గ్రామంలో ప్రత్యేక పూజలు చేశాం’’ అని ఓ గ్రామస్తుడు అంటున్నాడు. ‘‘ఈ ఆలయ పునరుద్ధరణ కోసం ఒక్కొక్కరు రూ. 5,000 విరాళం ఇచ్చిన వ్యక్తుల జాబితాలో కమలా హ్యారిస్ మామ బాలచంద్రన్ గోపాలన్ ఉన్నారు. ఆలయం మేనేజ్మెంట్ వారికి తరచూ విభూతి, కుంకుమ పంపిస్తుంది. ఆలయంలో జరిగే కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తాం. వారు ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఈ గ్రామంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆలయం పునరుద్ధరణకు విరాళం ఇచ్చారు. ఆలయం కార్యక్రమాలకు హాజరవుతారు’’అని గ్రామస్తులు తెలిపారు.చెన్నైకి 350 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు.. 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు కార్యక్రమాలు నిర్వహించారు. -
వర్షాలు కురవాలని.. అమ్మలక్కల ఆట పాట
-
శివాలయాలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, శ్రీశైలం: కార్తీకమాసం చివరి రోజు, చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడి పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించారు. వేకువ జాము నుంచే క్యూలైన్లో వేలాదిమంది భక్తులు శివుని దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శీఘ్రదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. తిరుపతిలో.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపారాధన చేశారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చివరి సోమవారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం స్వర్ణముఖి నదిలోకి కార్తీక దీపాలు వదిలిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో.. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా గోదావరి ఘాట్‌లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రిలో ఉమా మార్కండేయ స్వామి ఆలయం భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ద్రాక్షారామ భీమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా.. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. -
Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు
కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు ఆదివారం ఉదయం వందలాది మంది ‘జెహోవా’ క్రైస్తవులు తరలివచ్చారు. అందరూ ప్రార్థనల్లో ఉండగా, ఉదయం 9.40 గంటలకు హఠాత్తుగా పేలుడు జరిగింది. కొద్దిసేపటికే మరోరెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో జనమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మంది రక్తమోడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మొదటి రెండు పేలుళ్లు శక్తివంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగిన పేలుడుగా పోలీసులు గుర్తించారు. పేలుళ్ల కోసం దుండగులు ఐఈడీ ఉపయోగించినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పేలుళ్లకు కారణమైన ముష్కరులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని డీజీపీ స్పష్టంచేశారు. పేలుళ్ల సమాచారం తెలియగానే కేరళ రాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కేరళ గవర్నర్ దిగ్భ్రాంతి క్రైస్తవుల మత ప్రార్థనల్లో పేలుళ్లు జరగడం పట్ల కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుళ్ల ఘటన అత్యంత దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. పేలుళ్లకు తానే కారణం అంటూ వ్యక్తి లొంగుబాటు కలామాస్సెరీలో తానే వరుస పేలుళ్లకు పాల్పడ్డానంటూ ఓ వ్యక్తి ఆదివారం కేరళలోని త్రిసూర్ జిల్లా కొడాకర పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తాను కూడా ‘జెనోవా’ సభ్యుడినేనని చెప్పారు. లొంగిపోయిన వ్యక్తి పేరు డొమినిక్ మార్టిన్ అని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు తానే కారణం అంటూ కొన్ని ఆధారాలు చూపించాడని వెల్లడించారు. అతడు చెప్పేది నిజమేనా? అనేది క్షుణ్నంగా విచారిస్తున్నామని అన్నారు. కళ్ల ముందు అగ్నిగోళం కనిపించింది కలామస్సెరీలో మత ప్రార్థనల్లో జరిగిన పేలుళ్లను తల్చుకొని ప్రత్యక్ష సాక్షులు బెంబేలెత్తిపోతున్నారు. తాను కళ్లు మూసుకొని పార్థన చేస్తున్నానని, హఠాత్తుగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ఓ మహిళ చెప్పారు. వెంటనే ఉలిక్కిపడి కళ్లు తెరిచానని అన్నారు. కళ్ల ముందు భగభగ మండుతున్న ఒక అగి్నగోళం కనిపించిందని పేర్కొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే ప్రముఖ చర్చిల్లో ఏసుక్రీస్తు జనన దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి కేక్‌లు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఫాదర్లు పండుగ సందేశాన్ని వివరించారు. విజయవాడలోని గుణదల మేరి మాత పుణ్యక్షేత్రంలో రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సమష్టి దివ్య బలిపూజ సమర్పించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు నడిచిన మార్గంలో పయనించాలని గుంటూరు జిల్లా మేత్రాసన గురువులు చిన్నాబత్తిన భాగ్యయ్య పిలుపునిచ్చారు. భక్తి గీతాలాపనలు, క్రిస్మస్ సందేశాలు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలతో బాల ఏసు నగరోత్సవం ఆద్యంతం పలు ప్రాంతాల్లో కన్నుల పండువగా సాగింది. ఏసు జనన నాటిక, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సాక్షి, అమరావతి : శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్ భవన్ దర్బార్ హోలులో ఆదివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయం అన్నారు. మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించడమే నిజమైన సంతోషమన్నారు. శాంతి, స్వేచ్ఛ, ఆనందానికి ఏకైక మార్గం ప్రేమ మాత్రమేనని.. ద్వేషాన్ని ప్రేమతో, కోపాన్ని దయతో భర్తీ చేసినప్పుడు జీవితంలో మరింత శాంతిని పొందగలుగుతారని వివరించారు. బిషప్ రాజారావు సందేశం ఇచ్చారు. అనంతరం మత పెద్దలు పాకలపాటి ప్రభాకర్, మట్టా జయకర్, ఎబినేజర్ తదితరులు గవర్నర్‌ను ఘనంగా సన్మానించారు. వారికి గవర్నర్.. మదర్ థెరిస్సా మెమోంటోలను బహూకరించారు. -
మమ్మేల రావయ్యా.. మా శివయ్య!
శ్రీశైలం టెంపుల్/అమరావతి/శ్రీకాళహస్తి రూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో బుధవారం స్వామిఅమ్మవార్లకు నిర్వహించిన రథోత్సవం నేత్రానంద భరితంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ముందు గల గంగాధర మండపం వద్దకు పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను రథోత్సవంపై ఆశీనులను చేసి సాత్విక బలి సమర్పించారు. అశేష భక్తజనం శివనామాన్ని స్మరిస్తుండగా ఆలయం పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవానికి ముందు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయపుష్కరిణి వద్ద తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అంగరంగ వైభవంగా అమరేశ్వరుని దివ్యరథోత్సవం అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం బుధవారం వైభవంగా సాగింది. అమరావతి, ధరణికోట నుంచి చింకా, ఆలపాటి, కామిరెడ్డి, కోనూరువారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశాస్త్రి పర్యవేక్షణలో పలు పూజలు నిర్వహించి రథోత్సవ ప్రారంభ క్రతువును పూర్తి చేశారు. రథాన్ని సర్వాంగసుందరంగా పూలతో అలంకరించి ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుని అందులో కొలువుదీర్చారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణప్రసాద్‌లు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని క్రోసూరు జంక్షన్ వరకు లాగారు. అక్కడ నుంచి వెనుదిరిగి శివనామస్మరణ చేస్తూ రథాన్ని యథాస్థానానికి చేర్చారు. నేత్రపర్వంగా ముక్కంటీశుని రథోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో ముక్కంటీశుని రథోత్సవం బుధవారం కనులపండువగా సాగంది. రథోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకు దేవస్థానానికి చెందిన స్వర్ణాభరణాలను అలంకరించడంతో భక్తులు స్వామి, అమ్మవార్ల తేజస్సును చూసి పరవశించిపోయారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కడప పెద్దదర్గా ఉరుసు
కడప కల్చరల్: దేశంలో ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన వైఎస్సార్ జిల్లా కడప అమీన్‌పీర్ దర్గాలోని హజరత్ సూఫీ సరమస్త్‌సాని చల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఆదివారం రెండోరోజు ఘనంగా కొనసాగాయి. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పర్యవేక్షణలో ఆయన సంప్రదాయబద్ధంగా ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాలు, నాత్ గీతాలాపనల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చాదర్‌ను తీసుకెళ్లారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో గురువుల మజార్ వద్ద గంధంతోపాటు చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు, నగర ప్రముఖులు, దర్గా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపే రంజాన్
సాక్షి హైదరాబాద్: ఈద్–ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను ఈనెల 14న జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ( నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో బుధవారం ఎక్కడా నెలవంక కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని.. శుక్రవారం రంజాన్ జరుపుకోవాలని సూచించారు. కాగా, కరోనా కారణంగా ఈద్గా, మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని అన్ని ధార్మిక సంస్థల మతగురువులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. -
కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
-
కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు
సాక్షి, సిద్ధిపేట : కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్(మర్కూక్) వద్ద సుదర్శన యాగం, ప్రాజెక్టు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న కేసీఆర్ దంపతులు.. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. (చదవండి : కొండంత సంబురం నేడే) పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మర్కూక్ పంప్‌హౌస్ వద్దకు చేరుకొని చినజీయర్ స్వామికి స్వాగతం పలుకనున్నారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో ఆయన పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు పంప్‌హౌస్‌లలోని రెండు మోటార్లను ఆన్ చేసి గోదావరి ఎత్తిపోతలకు కేసీఆర్ శ్రీకారం చూట్టనున్నారు. -
మైసమ్మ సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో వెలసిన మైసిగండి మైసమ్మ తల్లిని శనివారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ చైర్మన్ శిరోలీ తదితరులు పాల్గొన్నారు. -
కొలువంతా బంగారం
నవరాత్రుల బొమ్మల కొలువుకు తమిళనాట అధిక ప్రాధాన్యత ఉంది. చెన్నైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అభిరామి రామనాధన్ అయితే ఏటా తన నివాసంలో ఏకంగా బంగారు బొమ్మల్ని కొలువు తీరుస్తారు! వాటిల్లో కాంస్య విగ్రహాలు బంగారు తాపడంతో ఉంటాయి. వాటికి బంగారు నగలు అలంకరించి ఉంటాయి. అన్నపూర్ణాదేవి ప్రధానాంశంగా అన్నీ బంగారు తాపడంతో చేసిన విగ్రహాలనే కొలువులో ఉంచటం, వాటికి బంగారు ఆభరణాలను అలంకరించటం వాళ్లింటి ప్రత్యేకత. ఐదు వరుసలలో కొలువుదీరి బంగారు వర్ణంతో తళతళ మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ విగ్రహాలు గతవారం రోజులుగా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మైలాపూరులోని తమ నివాసంలో రామనాధన్ సతీమణి నల్లమ్మై రామనాధన్ కొలువు దీర్చిన ఈ విగ్రహాలకు మరో ప్రత్యేకతా ఉంది. ఇవి నిత్యం వాళ్ల పూజా మందిరంలో పూజలు అందుకునే ఉత్సవ విగ్రహాలే. ఏడాదికి ఒక బంగారు తాపడంతో కూడిన కాంస్య విగ్రహాన్ని కొనుగొలు చేసి ఏటా ఇలా బొమ్మల కొలువులో ప్రత్యేక అలంకారాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు ఈ దంపతులు. ఈ ఏడాది నాలుగు వరుసల్లో వివిధ రకాల దేవతా మూర్తులు ఇక్కడ కొలువుదీరారు. నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకునే ఈ బొమ్మల కొలువు చెన్నైలో ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. -
వానల కోసం వరంగల్‌లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
-
జగన్ కోసం జనం మొక్కులు
-
జేదార్నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
-
సోమ్నథ్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
-
శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ
తిరుమల: తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించారు. తిరుమల శ్రీభూవరాహస్వామి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా 4 రోజుల పాటు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించా రు. ఈనెలæ 22న ఉదయం రుత్విక్ వరణం, రాత్రి అంకురార్పణ చేశారు. 23న కళాకర్షణం చేపట్టారు. 25న అష్టబంధన కార్యక్రమం, 26న మహాశాంతి హోమం, మహాశాంతి అభిషేకం నిర్వహించారు. శనివా రం ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల మధ్య కర్కాటక లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం మహాపూర్ణాహుతి, తర్వాత ఆలయ విమాన గోపురానికి యాగశాలలోని కలశంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపి వేశారు. విశేష ఆరాధనలు, నైవేద్యాలు విమాన గోపుర శిఖరంలో నలుగురు దేవతలుంటారు. వీరిని విమానం ప్రపధ్యే.., విష్ణుమయం ప్రపధ్యే.., దేవావాసం ప్రపధ్యే.., వైకుంఠోద్భవం ప్రపధ్యే.. అనే మంత్రాలతో ప్రార్థిస్తారు. గోపురం చుట్టూ 24 మంది ఆవరణ దేవతలు ఉంటారు. మహాసంప్రోక్షణతో యాగశాలలో కుంభంలో ఉన్న దేవతామూర్తుల శక్తిని బింబం(విగ్రహం)లోకి ఆవాహన చేశారు. విమానగోపురంలోని దేవతల శక్తితో పాటు వరాహస్వామి, విష్వక్సేనుడు, రామానుజాచా ర్యులు, పుష్కరిణి వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాలకు తిరిగి దైవశక్తి చేకూరింది. దేవతా మూర్తుల విగ్రహాలకు 12 జీవస్థానాలు, 4 ఉపస్థానాలు, 48 కళలు ఉంటాయి. కళాకర్షణతో తొలగించిన ఈ 48 కళలను మహాసంప్రోక్షణతో తిరిగి ఆవాహన చేశారు.. మహాసంప్రోక్షణ అనంతరం విశేష ఆరాధనలు, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత అక్షతారోపణం చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 7 నుంచి 9గంటల వరకు వరాహస్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, వీఎస్వోలు మనోహర్, ప్రభాకర్, డెప్యూటీ ఈఓలు హరీంద్రనాథ్, నాగరత్న, ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు తదితరులు పాల్గొన్నారు. మహద్భాగ్యం మహాసంప్రోక్షణ నిర్వహించే అవకాశం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్టు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గతంలో 1982లో ఈ ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగిందని, తిరిగి ఇప్పుడు నిర్వహించే అవకాశం తమకు దక్కిందని అన్నారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు ఈ బాలాలయ కార్యక్రమాల సందర్భంగా కొలతలు తీసుకున్నట్టు ఈవో తెలిపారు. ఇక్కడి సేనాధిపతి వారికి, ఆంజనేయ స్వామికి, రామానుజులకు బంగారు పూత పూసిన మకరతోరణాలు సమర్పించామని, వీటి విలువ దాదాపు రూ.7 లక్షలని తెలిపారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు భక్తులందరూ సహకరించారని, టీటీడీ అర్చకస్వాములు, ఇంజినీరింగ్ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని కృతజ్ఞతలు తెలియజేశారు. 37 ఏళ్ల తర్వాత వరాహస్వామి ఉత్సవమూర్తి దర్శనం తిరుమలలో వరాహస్వామి ఉత్సవమూర్తి శనివారం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వరాహస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ పూర్తయిన సందర్భంగా స్వామివారి ఊరేగింపు జరిగింది. ఈ ఆలయంలో గతంలో 1982వ సంవత్సరంలో మహాసంప్రోక్షణ నిర్వహించినపుడు వరాహస్వామి ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి 37 ఏళ్ల తరువాత శనివారం స్వామివారు ఊరేగింపుగా రావడంతో పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు, అనంతశయన దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. -
అనుకున్నది జరుగుతుంది!
‘‘దోమకొండ శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. 400 ఏళ్ల క్రితం మా పూర్వీకులు ఆ ఆలయం చుట్టూ దోమకొండ కోటను నిర్మించారు. 2003లో మా తాతగారు కామినేని ఉమాపతి (దోమకొండ ఫ్యామిలీ 20వ తరం) పురావస్తు శాఖ వారితో కలిసి ఆలయాన్ని పునరుద్ధరించడం మొదలుపెట్టారు. ఇక్కడి శివలింగం విచిత్రమైన నీలం రంగులో ఉంటుంది. నాకు, మిస్టర్ సి (రామ్‌చరణ్)కి ఆలయాన్ని, దాని పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తే అనుకున్నది జరుగుతుందని నమ్మకం’’ అన్నారు ఉపాసన కొణిదెల. భర్త రామ్‌చరణ్‌తో కలసి శివరాత్రి పర్వదినాన దోమకొండ కోట శివాలయాన్ని సందర్శించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ ఫొటోను ఉపాసన తన ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. కాగా శివరాత్రికి ముందు కొన్ని రోజులు ఉపాసన ఆధ్యాత్మిక యాత్ర వెళ్లారు. ఇందులో భాగంగా ప్రయాగలో జరిగిన కుంభమేళాని సందర్శించారు. ‘‘ఆరు పవిత్ర స్థలాలను సందర్శించాను. కుంభ్ ఓ మంచి అనుభూతి. తేలికగా, సంతోషంగా, నూతనోత్సాహాన్నిచ్చింది. జై శివ శంభో’’ అంటూ ఆ హోలీ ట్రిప్ గురించి పేర్కొన్నారు ఉపాసన. Shraddha, Bhakti & complete LOVE & devotion to Lord Shiva. 🙏🏼 OM NAMAH SHIVAYA #ramcharan at the #Domakonda Shivalayam 🙏🏼 restore ancient temples pic.twitter.com/sme3oPMo7P — Upasana Konidela (@upasanakonidela) 4 March 2019 -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్/ అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రార్థన మందిరాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బిషప్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున శిలువ ఊరేగింపు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జోగి రమేశ్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్నవరం, నిడమానూరులోని పలు చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విశాఖపట్నం పెదబయలు మండలంలో జరుగుతున్న ఐక్య క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని పలు చర్చిలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ప్రార్థనలు చేశారు. పలు చర్చిల్లో కేక్ కట్ చేసి ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. విశాఖపట్నం అరకు మండలం పనిరంగిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూపాంతర దేవాలయం చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సీఎస్ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంతి నిలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విదేశీ భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి మహా సమాధి వద్ద విదేశీ భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. సూర్యాపేటలోని మేరిమాత చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఖమ్మంలోని సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని చర్చిలు సర్వాంగ సుందరంగా అలకరించారు. గుణదల మేరిమాత చర్చిలో క్రీస్తు ఆరాధన కొనసాగుతుంది. కాకినాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం అల్లిపురం కల్వారి బాప్టిస్ట్, పాతనగరం లండన్ మిషన్ మెమోరియల్ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
సంకల్పానికి ఏడాది: అనంతపూరం జిల్లాలో ప్రత్యక పూజలు
-
సంకల్పానికి ఏడాది: కర్నూలు జిల్లాలో ప్రత్యక పూజలు
-
జనహితుడి క్షేమం కోరి..
వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో గాయపడ్డ వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని జిల్లా వ్యాప్తంగా నేతలు, ప్రజలు సర్వమత ప్రార్థనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నెలలుగా అలుపెరగని దీక్షతో నిరంతరాయంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న జననేతపై హత్యాయత్నం జరగడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు. నరసరావుపేట రూరల్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ శనివారం పట్టణంలో ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్టేషన్‌రోడ్డులోని బాపిస్ట్ చర్చిలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. వైఎస్ జగన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని సంఘకాపరి ఏలిషా ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు మల్లెల అశోక్, కందుల ఎజ్రా, బొమ్ము జయరావు, దావల దేవదానం, కుందా చిన్నా, కె.పౌల్, పంగులూరి విజయకుమార్, మన్నవ మేరిబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే గుంటూరు రోడ్డులోని జామియా మసీద్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ నాయకులు ఖాజావలి మాస్టారు, షేక్ ఖాదర్‌భాషా, సున్ని, పొదిలి ఖాజ, సయ్యద్ ఖాజామొహిద్దీన్ పాల్గొన్నారు. అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పట్నంబజారు: జనహితం కోరే నిస్వార్ధ రాజకీయనేత జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. పార్టీ 24వ డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో అరండల్‌పేటలోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో ప్రార్థన చేపట్టారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి నీచమైన హత్యా రాజకీయాలకు తెరలేపారన్నారు. ఆపరేషన్ గరుడకు చంద్రబాబు దర్శకుడైతే.. శివాజీ తన నటనా కౌశల్యంతో దాన్ని రక్తికట్టించేందుకు కిందా మీదా పడరాని పాట్లు పడుతున్నారని జాలిపడ్డారు. కార్యక్రమంలో షేక్ బాజీ, ఇలియాజ్, మొబీన్, మెహబూబ్ బాషా పాల్గొన్నారు. టౌన్ చర్చిలో ప్రార్థనలు తెనాలి: జగన్ మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో బోసురోడ్డులోని టౌన్‌చర్చిలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్ పాస్టర్లు రెవరెండ్ డి.డేవవిడ్రాజు, పాస్టరు జె.ఆదాం కెనడీ, ప్టాసర్ కె.జయబాబులు, పాస్టర్ కె.ఎఫ్‌జి వర్థన్కుమార్, నీల సువర్ణబాబులు ప్రార్థనలు చేశారు. పార్టీ పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ దుబాయ్‌బాబు ఆధ్వర్యంలో వహబ్చౌక్లోని మదీనా మసీదులో శనివారం ప్రార్థనలు నిర్వహించారు. జననేత త్వరగా కోలుకోవాలని కోరుతూ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం బోసురోడ్డులోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేమూరు మండలం పెరవలి గ్రామంలోని కేశవ మాధవ దేవస్థానంలో ఎంపీటీసీ దాది రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పొన్నూరులో వైఎస్ జగన్ కోలుకోవాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ డాక్టర్ నల్లమోతు రూత్‌రాణి, వార్డు కౌన్సిలర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో గ్రామపార్టీ అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా పాల్గొని టీడీపీ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేశినేని నోరు అదుపులో పెట్టుకో క్రోసూరు: టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటిశివనాగమనోహరనాయుడు హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావటి మాట్లాడుతూ కేశినానిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై దాడి సంఘటనపై రాష్ట్ర ప్రజలందరూ ఎంతో మనోవేదనతో ఉంటే నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావన్నారు. నానికి జగన్ దాక అవసరం లేదు, చేతనైతే వైఎస్సార్సీపీ కార్యకర్తను టచ్‌చేసి చూడు నీ సంగతి ఏమవుతుందో తెలుస్తుందని హెచ్చరించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవటం తెలుగుదేశంపార్టీకి చెల్లిందన్నారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీకి వెళ్లేందుకు వైఎస్జగన్హన్రెడ్డి కొవ్వుత్తుల నిరసనకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం విమాశ్రయానికి చేరుకుంటే విమాశ్రయంలోనే అరెస్టుచేసి తిరిగి హైదారాబాద్ పంపించినప్పుడు విమాశ్రయం రాష్ట్ర పోలీసుల అధీనంలో ఉందా, ఇప్పుడు అదే విమానాశ్రయం కేంద్ర బలగాల పరిధిలో ఉందా అని నిలదీశారు. సీబీఐతో గాని, మూడో పార్టీ ద్వారా విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు, దుష్ట పాలనలు ఎన్నోరోజులు మనుగడ చేయవని త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జగన్‌పై హత్యాయత్నం పిరికిపందల చర్య
నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి పెనుమత్స సాంబశివరాజు పార్టీ నాయకులతో కలిసి శనివారం రామతీర్థం శ్రీరామ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. జగన్‌పేరిట అర్చన చేయించారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడిందన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ప్రజలకేం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో హింస పెరిగిపోయిందన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కోలేకే హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిన కొద్ది సేపటికే రాష్ట్ర డీజీపీ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని భావిస్తున్నామన్నారు. ఏ ఎన్నికల్లో కూడా గెలవలేకపోయిన మంత్రి సోమిరెడ్డి హత్యాయత్నాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్న విధానం సరికాదన్నారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులే విచారణను పక్కదారి పట్టిస్తున్నారని, ఈ దాడిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు చనమళ్లు వెంకటరమణ మాట్లాడుతూ వెన్నుపోటు, హత్యా రాజకీయాలు చంద్రబాబు నైజమన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు మాట్లాడుతూ అత్యంత జనాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజాదరణ కలిగిన నాయకులపై దాడులు చేయించడం టీడీపీకి కొత్తేమీ కాదన్నారు. వంగవీటి మోహన రంగాను హత్య చేయించిన రాజకీయ చరిత్ర టీడీపీదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాంబార్కి రామారావు, సత్యం, సంచాన సూరిబాబు, తర్లాడ దుర్గారావు, అట్టాడ అప్పలనాయుడు, తర్లాడ రామస్వామి, మహంతి రామారావు, పతివాడ రామారావు, చిట్టోడు, రెడ్డి రామదాసు, సూరప్పడు, పల్లి క్రిష్ణ, ఆర్.రామారావు, బి.సత్యం, పిన్నింటి శ్రీనివాసరావు, పరిసినాయుడు, కంచరాపు రాము, యరకయ్య, రాములు, మీసాల నారాయణరావు, మోహనరావు, రామ్మోహనరావు, లెంక శివ, ఆబోతుల శ్రీరాములు, ఇప్పిలి అప్పలనాయుడు, అట్టాడ రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని పూజలు చీపురుపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుక టీడీపీ హస్తం ఉందని మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ బెల్లాన శ్రీదేవి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు త్వరగా కోలుకుని ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించాలని కోరుతూ బెల్లాన శ్రీదేవి ఆధ్వర్యంలో మేజర్ పంచాయతీకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు శనివారం పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ దత్తసాయి మందిరంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఈ పరిస్థితులు బాగుపడాలంటే జగన్ త్వరగా కోలుకునేలా భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరారు. ఆయనపై హత్యాయత్నం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. అవేం మాటలు.. తెలుగుదేశం ఎంపీలు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ను మట్టుబెట్టాలన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు. సాటి మనిషికి గాయమైతే కనీస సానుభూతి చూపించడం మానవ ధర్మమని అలాంటిది రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగితే ప్రభుత్వం, సీఎం కనీసం సానుభూతి ప్రకటించకపోవడం దుర్మార్గపు పరిపాలనకు ఉదాహరణ అని పేర్కొన్నారు. 2003లో చంద్రబాబుపై బాంబు దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సానుభూతి ప్రకటించడమే కాకుండా తిరుపతిలో నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపిన సంఘటన గుర్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇప్పిలి సుధారాణి, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పతివాడ రాజారావు, యువజన విభాగం అధ్యక్షుడు ఇప్పిలి తిరుమల, పార్టీ నాయకులు ఇప్పిలి గోవింద్, మహంతి ఉమ, అప్పికొండ ఆదిబాబు, మల్లెంపూడి శ్రీను, పీతల మురళి, సతివాడ అప్పారావు, మీసాల రాజగోపాలనాయుడు, రెడ్డి జగదీష్, సుంకరి చంద్రశేఖర్గుప్త, మహంతి లక్ష్మణ, బలగ రమేష్, ఎస్‌విజి.శ్రీనివాసరావు, సువ్వాడ శ్రీను, కొమ్ము చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ కోలుకోవాలని మక్కాలో ప్రార్థనలు
జెడ్దా(మక్కా): విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్‌కు అల్లా మరింత శక్తిని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలందరికి కూడా అల్లా దీవెనలు ఉండాలని ప్రార్థించారు. ప్రజల కోసం నిరంతరం తపించే జననేతపై గురువారం జరిగిన హత్యాయత్నాన్ని వారు ఖండించారు. దాడి వార్త వినగానే చాలా ఆవేదన చెందామని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన షేక్ సలీం తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం బాధకరమన్నారు. దేశంలోనే మెండుగా ప్రజాదరణ కలిగిన నేతకు రక్షణ కల్పించలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. విమానాశ్రయంలో రక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని ఏపీ మంత్రులు తల తోక లేకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడటం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే దయ గుణం లేని వారు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భగ్యమని అన్నారు. వారి శాఖలపైన అవగాహన లేని మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. జననేతకు రక్షణ కల్పించమని గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంపైన కుట్ర పూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. దాడి చేసిన వ్యక్తికి జైల్లో మర్యాదలు చేస్తూ.. కట్టుకథలు అల్లడం, పోలీసులను అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం చంద్రబాబుకే చెల్లిందని సలీం విమర్శించారు. పరామర్శలను కూడా రాజకీయం చేయడం ద్వారా వైఎస్ జగన్‌కు చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో తెలుస్తోందన్నారు. పచ్చ పత్రికలు, అమ్ముడుపోయిన మీడియా ఎంత ప్రయత్నం చేసినా.. నిజం దాగదని పేర్కొన్నారు. వారందరికి అల్లా తగిన బుద్ది చెబుతారని.. ఇలాంటి చౌకబారు చర్యలకు వైఎస్ జగన్ భయపడరని తెలిపారు. అల్లా దీవెనలు వైఎస్ జగన్‌పై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన మళ్లీ వైఎస్ జగన్ రూపంలో రావాలని కోరుతూ.. ఇదే నియ్యత్తో తవాఫ్ పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో సలీంతో పాటు షేక్ అప్సర్, మహ్మద్ సిరాజ్, షేక్ ఫరీద్‌లు పాల్గొన్నారు. -
నేటి నుంచి భీమా పుష్కరాలు
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో ప్రవహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22వ తేదీ వరకు కొనసాగే పుష్కరాలకు రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పుణ్యస్నానాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, తెలంగాణలో కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే భీమా నది ప్రవహిస్తోంది. ఈ పుష్కరాలను పురస్కరించుకుని తంగిడి, కుసునూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో స్నాన ఘాట్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 7.24 గంటలకు అధికారులు, వేద పండితులు పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా పుష్కరాలను ప్రారంభించనున్నారు. -
బద్రినాథ్ గుడిలో కొత్త బంగారు గొడుగు
గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్ సోల్కర్ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. -
కేదార్నాథ్ యాత్రలో భాగమతి..
అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలతో భారీ సక్సెస్‌లు అందుకున్నారు నటి అనుష్క శెట్టి. ఇటీవల భాగమతి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పారు. పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇటీవల స్వీటీ కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు. కాలినడకన ధామానికి చేరుకున్నఆమె అక్కడ కొలువైన మహాశివుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గుర్రం సహాయంతో 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు అనుష్క. ఇద్దరు సభ్యులతో కలిసి వెళ్లిన అనుష్క.. కేదార్నాథ్ యాత్రకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కేదార్‌నాథ్‌లో అనుష్కని చూసిన కొందరు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. -
నేడు తిరుగువారం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో సమ్మక్క–సారలమ్మకు నేడు (బుధవారం) తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగిన మహా జాతర తల్లుల వనప్రవేశంతో ముగిసిన విషయం తెలిసిందే. గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనప్రవేశం అయ్యేంత వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన పూజారులు బుధవారం తిరుగు వారం పండుగ నిర్వహించనున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఒర్చుకుని తల్లుల చెంతకు వచ్చిన మొక్కులు చెల్లించిన భక్తజనాన్ని, గ్రామస్తులను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ తిరుగువారం పండుగ సందర్భంగా దేవతలను వేడుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా దేవతలను మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలిరానున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు తిరుగువారం పండుగా నిర్వహిస్తారు. పూజారులు గుడిని నీటితో శుద్ధి చేయనున్నారు. పూజారులు తలస్నానాలు అచారించి గుడిలో సమ్మక్క తల్లికి ధూప, దీపాలతో ప్రత్యేక పూజాలు నిర్వహిస్తారు. యాటను బలిచ్చి నైవేద్యంగా పెడతారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో కూడా పూజారులు తిరుగువారం పండుగాను నిర్వహిస్తారు. ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. వడెరాల కుండాలను పసుపు, కుంకుమలతో అలకరిస్తారు. సారలమ్మకు ధూప, దీపాలతో పూజలు నిర్వహిస్తారు. తిరుగువారం పండుగతో తల్లుల పూజలు ముగిస్తాయి. మహా జాతరలో తల్లుల సేవలో తరించిపోయిన పూజారులు తిరుగువారం పండుగ పూజల అనంతరం మళ్లీ ఏడాది మధ్యలో నిర్వహించే మినీ జాతర వరకు సా«ధారణ వ్యక్తులుగా మారిపోతారు. పూజారుల ఇళ్లలో కూడా.. మేడారం కన్నెపల్లిలోని సమ్మక్క–సారలమ్మ పూజారులు, ఆదివాసీలు తమతమ ఇళ్లలో తిరుగువారం పండుగాను ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసుకుని ఇంటిì గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. అమ్మవార్ల గుడికి వెళ్లి కూడా పూజలు నిర్వహిస్తారు. కోళ్లు, యాటలను సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. పండుగ సంరద్భంగా సమ్మక్క గుడి వద్ద కూడా ఆదివాసీలు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా ఇంటికి ఆహ్వానించిన బంధువులు, ఆడబిడ్డలకు కొత్త దుస్తులు పెట్టి సాగనంపుతారు. ఈ సందర్భంగా బంధువులు పూజారుల ఆశీస్సులు తీసుకుంటారు. మంగపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ముగిసి మూడు రోజులు అవుతోంది. నేడు తిరుగువారం పండుగ అయినప్పటికీ భక్తులు ఇంకా మేడారానికి వస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించి గద్దెల సమీపం ప్రాంతాలు, ఆర్టీసీ బస్‌పాయింట్ వద్ద వంటలు వండుకుని భోజనాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. బుధవారం తిరుగువారం పండుగ రోజు సమక్క–సారలమ్మను దర్శించుకునేందుకు కూడా భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
మేడారం చేరుకున్న వెంకయ్యనాయుడు
-
సమ్మక్క వంశీయుల పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గద్దె వద్ద బయ్యక్కపేటకు చెందిన చందా వంశస్తులు గురువారం మొక్కులు చెల్లించారు. సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేట అనే చరిత్ర ఉంది. అయితే ప్రతి ఏటా జాతర సందర్భంగా సమ్మక్కకు తొలి మొక్కులు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు చందా వంశస్తులు బయ్యక్కపేట నుంచి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, చీరసారె, గాజులు, పూలు తీసుకువచ్చి సమ్మక్క గద్దె వద్ద పూజలు నిర్వహించారు. జాతర సమయంలోనే సమ్మక్కకు ఆనవాయితీగా పూజలు నిర్వహించాల్సిన ఉన్నప్పటికీ రద్దీ కారణంగా ముందుగానే తల్లికి మొక్కు చెల్లించినట్లు చందా వంశీయులు తెలిపారు. డోలు వాయిద్యాలతో సమ్మక్క గద్దెపైకి వెళ్లి మొక్కులు సమర్పించారు. సమ్మక్కకు తొలి పూజల సందర్భంగా చందా వంశస్తులు, వడ్డెల ఇళ్లలో ప్రత్యేక పూజలు చేశారు. -
ప్రజాసంకల్పయాత్ర: ఎస్ కోటలో ప్రత్యేక పూజలు
-
కరీంనగర్లో నకిలీ బాబా అరెస్ట్
కరీంనగర్: పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాస్తు పేరుతో ప్రత్యేక పూజలు చేయించి డబ్బులు దండుకుంటున్న నకిలీ బాబాను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటస్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాబా అవతారమెత్తి అమాయక ప్రజలను దోచుకుంటున్నాడు. వ్యవసాయ భూములను పరిశీలించి అందులో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ప్రత్యేక పూజల పేరుతో లక్షల్లో డబ్బు దండుకొని చివరకు తన తీసుకొచ్చిన ఇత్తడి విగ్రహాలను భూ యజమానికి తెలియకుండా ఏదో ఓ ప్రాంతంలో పాతి పెట్టి అక్కడ తవ్వకాలు జరిపిస్తున్నాడు. అనంతరం వీటిని ప్రత్యేక మూలికలతో శుద్ధి చేయాలి.. దానికి చాలా ఖర్చు అవుతుందని నమ్మిచి వారి వద్ద నుంచి దండిగా డబ్బు లాగి మోసం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఈ రోజు నకిలీ బాబాను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఇత్తడి ప్రతిమలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
వైఎస్ జగన్ కోసం
-
వైభవంగా కోదండరాముడి కల్యాణం
ఒంటిమిట్ట రామాలయం (రాజంపేట) : రెండవ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో రంగమండపంలో దాశరథి కల్యాణం కమనీయంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేశారు. టీటీడీవారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ సంప్రదాయ విధానంలో సీతరాముల కల్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
లింగా.. ఓ లింగా..
మార్మోగిన పెద్దగట్టు సాక్షి, సూర్యాపేట: లింగా.. ఓ లింగా.. అంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతర ప్రాంగణం మార్మోగింది. జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. మొదటి రోజు దేవపెట్టె పెద్దగట్టు దేవాలయానికి చేరింది. అనంతరం యాదవ కులస్తులు గుడిచుట్టూ గంపల ప్రదక్షిణ చేశారు. రెండేళ్ల క్రితం నెలవారం తర్వాత సూర్యాపేట రూరల్ మండలంలోని కేసారం గ్రామం లోని మెంతబోయిన, గోర్ల, మున్న వంశీయులు దేవరపెట్టెను తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం దేవరపెట్టెను తీసుకురా వాలని యాదవ కులస్తులను కలెక్టర్, ఎస్పీలు కోరారు. దీంతో రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ పరిమళ హననూతన్, జేసీ సంజీవరెడ్డి కేసారం గ్రామానికి చేరుకున్నారు. దేవరపెట్టె ఉన్న మెంతబోయిన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యాదవ కులస్తులు దేవర పెట్టెను తరలించే తంతు నిర్వహించారు. ఆ పెట్టెను యాదవ పూజారులు భుజాలపై పెట్టుకొని ముందు నడవగా, గజ్జెల లాగులు, భేరీ చప్పుళ్లు, కటార్ల విన్యాసాలతో పాటు.. ఓలింగా.. ఓలింగా.. నామస్మరణల మధ్య కేసారం గ్రామం నుంచి కాలినడకన ఆరు కిలోమీట్ల దూరంలో ఉన్న దురాజ్ పల్లి (పెద్దగట్టు) దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజ లతో దేవాలయ ప్రవేశం చేశారు. అనంతరం మెంతబోయిన, మున్న, గొర్ల(రెడ్డి) వంశీయులు తెచ్చిన బియ్యం, ఇతర పూజా సామగ్రితో వచ్చిన గంపల ప్రదక్షిణ నిర్వహించారు. -
ఐదు రోజుల పాటు శారదాపీఠం వార్షికోత్సవాలు
విశాఖపట్నం : విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలను శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామిజీ తెలిపారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదుర్గకు హోమాలు నిర్వహిస్తున్నామన్నారు. -
సంబురంగా సంక్రాంతి
సంక్రాంతి పండుగను జిల్లా అంతటా ప్రజలు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ రంగవళ్లులు వీధివీధిన వేశారు. గొబ్బెమ్మలు, రేగుపళ్లతో పూజించారు.అందరూ బాగుండాలని నువ్వులు, బెల్లం పంచి పెట్టారు.a ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సకల సంపదలు, అన్నిశుభాలే కలగాలని కోరుకుంటూ మహిళలు నోములు నోచుకున్నారు. చిన్నారులు మొదలుకొని యువకులు, నడివయస్కులు గాలిపటాలను ఎగురవేశారు. – నిజామాబాద్ కల్చరల్ -
గీసుకొండ జాతర ప్రారంభం
నేడు రేపు ప్రత్యేక పూజలు బౌద్ధం వర్ధిల్లినట్లుగా చారిత్రక ఆధారాలు గీసుకొండ(పరకాల): మండల కేంద్రమైన గీసుకొండ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభువగా వెలసిన లక్ష్మినర్సింహస్వామి జాతర శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 10న స్వామి వారిని గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆల యం నుంచి గుట్టపైకి తీసుకు వచ్చారు. గురువారం రాత్రి నుంచి జాత ర ప్రారంభమైందని, శుక్ర, శనివారాల్లో కొనసాగుతుందని నిర్వహణ కమిటీ బాధ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం స్వామివారిని గ్రామానికి తోడ్కొని వెళ్లనున్నారు. స్వామివారి గుట్టకు చారిత్రక ప్రాధాన్యం.. స్వామివారు వెలసిన నల్లని కొండను గీసుకొండ గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట నలుపు రంగులో ఉండటంతో ‘గీసు అనగా నలుపు అని, నల్లని కొండ శివారులో వెలసిన గ్రా మం కావడంతో గీసుకొండ అని పేరు వచ్చిందని చెబుతా రు. అలాగే ఆదిమానవులు శిలాయుగంలో గుట్ట ప్రాంత ంలో జీవించేవారిని, వారి తర్వాత శాతవాహనుల వరకు నాగరికత వెలసినట్లు, బౌద్ధం ఇక్కడ వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయల్ప డ్డాయి. గుట్ట వద్ద పురావస్తుశాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో బయల్పడ్డ టెర్రాకోట బొమ్మలు, బుద్దుడి ప్రతిమ, రాతి ఆయుధాలను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వెనకవైపు ఉన్న పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. ఆది మానువులు తమ రాతి ఆయుధాలను పదును చేయడానికి గుట్టపై నూరా(గీశా) రని, అందుకే ఈ కొండకు ‘గీసుడుకొండ’అని పేరు వచ్చిందని ఆ పేరుతోనే గ్రామానికి గీసుకొండ అని పేరు పెట్టి ఉంటారనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులేవీ కేటాయించకపోవడం, ప్రచారం కొరవడటంతో ప్రాశస్త్యం మరుగున పడుతోంది. -
పెద్దమ్మకు కేసీఆర్ సతీమణి పూజలు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ గుడిలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శోభ ఆదివారం సాయంత్రం భద్రాచలం వచ్చారు. ఈ రోజు ఉదయం ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని పాల్వంచ చేరారు. అమ్మవారికి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. -
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు
-
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు
ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్ సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్ఐ మెదక్ డయాసిస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు జనవరి 2 వరకు కొనసాగనున్నాయి. వేకువజామున 4.30 గంటలకు బిషప్ ఏసీ సాల్మన్ రాజు మొదటి ప్రార్థనలతో చర్చిలో వేడుకలను ప్రారంభిస్తారు. -
గణపతికి 158 కిలోల నెయ్యితో అభిషేకం
వరంగల్ : కాజీపేటలో కొలువైన శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి 158 కిలోల నెయ్యితో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. దేవాలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకుడు రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కాశీ నుంచి తెచ్చిన పవిత్ర నదీ జలాలతో అభిషేకాలు, అర్చనలు జరిపించారు. భక్తులు శ్వేతార్కుడిని పూలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. పండితులు గోత్రనామాలతో సహస్రనామార్చనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లయ్యశర్మ సిద్ధాంతి, రాధాకృష్ణశర్మ, తేలు సారంగపాణి, మణి, రవి తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలకు పోటెత్తిన తమిళభక్తులు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో ఏఐడీఎంకే పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు, తమిళభక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. అమ్మ కోలుకోవాలంటూ శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో లండన్ వైద్యులు, ఎయిమ్స్ వైద్య బృందాలు జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. -
కార్తీక శోభ
-
కార్తీక శోభ
నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్రమైన కార్తీకమాసం, శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పౌర్ణమి కలిసిరావడంతో శైవాలయాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని సారుుబాబా ఆలయంలో లక్షదీపోత్సవం దేదీప్యమానంగా సాగింది. పలుచోట్ల సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. - సాక్షినెట్‌వర్క్ -
శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పండుగ శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నదీ స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులుతీరుతున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో కొలువుతీరిన ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివ నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. శ్రీశైలంలో భక్తుల రద్దీ కార్తీక మాసం మూడో సోమవారం, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానమాచరించిన భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి బారులుతీరారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కపిలతీర్థంలో పోటెత్తిన భక్తులు తిరుపతి: కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు పెట్టడానికి మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఆలయ ఆవరణతో పాటు పుష్కరిణి సమీపంలో మహిళలు దీపాలు పెడుతున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో కార్తీక స్నానాలు రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటెత్తారు. పరమశివుడు అనుగ్రహం కోసం భక్తులు భక్తిశ్రద్దలతో కార్తీక స్నానాలు ఆచరించారు. కార్తీక సోమవారంతో పాటు పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. దీంతో గోదావరి ఘాట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. గజగజ వణికించే చలిలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు స్నానాలు చేశారు. -
శివాలయాల్లో కార్తీక శోభ
బద్వేలు అర్బన్∙: కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన కార్తీక దీపాలతో శివాలయాలు వెలుగులతో నిండాయి. ఈ సందర్భంగా రూపరాంపేట శివానందాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్షబిల్వార్చన, సహస్రదీపాలంకరణలు చేపట్టగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే దత్తసాయిబాబాల ఆలయ ప్రాంగణంలోని శ్రీ పార్వతిసమేత ఓంకారేశ్వరస్వామి ఆలయంలో 365 శివలింగాలకు భస్మార్చన పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ గౌరవా«ధ్యక్షులు భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కార్యదర్శి నాగిరెడ్డి శంకర్‌రెడ్డిలతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే లక్ష్మీపాలెం, చెన్నంపల్లె, కట్టమీద శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయాలలో దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. -
యాదాద్రిలో కార్తీక పూజలు
యాదాద్రి : కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట)కు భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక పూజలు నిర్వహించారు. ముందుగా విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు... తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం సోమవారంతో ప్రారంభం కావడం విశేషమని ఆలయ అర్చకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో భక్తులు కార్తీక పూజలు చేశారు. -
పోటెత్తిన భద్ర‘గిరి’
భద్రాచలం: రామాలయ ప్రాంగణం గిరిపుత్రులతో జనసందోహంగా మారింది. శబరి మాత వంశస్తుల గిరి ప్రదర్శనతో భద్రగిరి, రామాలయ మాడవీధులు పులకించిపోయాయి. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని మొదట చిత్రకూట మండపం వద్ద ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఖమ్మం జిల్లా జడ్జి విజయ్‌మోహన్, భద్రాచలం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బులికృష్ణ, దేవస్థానం ఈఓ రమేష్‌బాబు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు వాల్మీకికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి హారతి సమర్పించారు. శబరిమాత చిత్రపటానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.శబరిమాత చిత్రపటంతో గిరిజనుల కోలాటాలు, రేలా నృత్యాలు, కొమ్ము, కోయ డ్యాన్సులతో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా తూము నర్సింహదాసు, భక్తరామదాసు, శబరి మాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శబరి నదీ జలంతో అభిషేకం.. శబరి నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జలంతో మేళతాళాలు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. పసుపు, కుంకుమ చల్లి ధ్వజస్తంభంపై ముగ్గు వేసి బలిపీఠం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుక కోసం ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పుష్పాలు, పండ్లతో గిరిజనులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గిరిజనులు ప్రదర్శించిన నృత్యాలకు మంత్ర ముగ్ధులైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య కొమ్ము తలపాగా ధరించి, డోలు వాయిస్తూ గిరిజనులను ఉత్తేజపరిచారు. రామయ్యకు పుష్పార్చన.. శ్రీసీతారామచంద్రస్వామి వారికి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉత్సవ మూర్తులను, శబరి మాత చిత్రపటాన్ని గర్భ గుడి నుంచి ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఫల, పుష్పాలను మేళతాళాల మధ్య చిత్రకూటమండపానికి తీసుకొచ్చారు. తొలుత ఆలయ అర్చకులు, వేద పండితుల ‘శ్రీరామ సంపుటి’ని నిర్వహిస్తూ స్వామి వారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ‘శ్రీరామాయనమః’ నామస్మరణతో చిత్రకూట మండపం మార్మోగింది. ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఫల, పుష్పాలతో సీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య స్వామికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది గిరిజన పెద్దలకు ఆలయం తరఫున ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేతులమీదగా వస్త్రాలను, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. పురవీధుల్లో గిరిజనుల ప్రదర్శన.. ఉత్సవంలో భాగంగా శబరి చిత్రపటంతో గిరిజనులు భద్రాచలం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రామాలయం నుంచి బ్రిడ్జి సెంటర్‌కు, అక్కడి నుంచి బస్టాండ్ మీదగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుని కొమ్ము నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం మార్కెట్ సెంటర్, తాతగుడి మీదగా తిరిగి రామాలయానికి చేరుకున్నారు. గిరిజనులు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలు ఆధ్యంతం భక్తులను, పట్టణ వాసులను ఆకట్టుకున్నాయి. వేడుకలకు అశ్వారావుపేట, ముల్కలపల్లి, చర్ల, దుమ్ముగూడెం మండలాలలతో పాటు, ఏపీలో విలీనమైన మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. శబరి తిరిగిన ప్రాంగణమైన ఏపీలోని కూనవరం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న శబరి నది వద్ద కూడా దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్ రాజు, అగ్నిమాపక అధికారి సురేష్, ఆలయ పర్యవేక్షకులు భవానీ రామకృష్ణ, సీసీటూఈఓ అనిల్‌కుమార్, గిరిజన సంఘం పెద్దలు కృష్టదొర పాల్గొన్నారు. గిరిజనులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భద్రాచలం సీఐ శ్రీనివాసుల ఆదేశాల మేరకు పట్టణ ఎస్సై కరుణాకర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అమ్మ కోసం.. ఆలయాల్లో పూజలు
• సర్వ మత ప్రార్థనలు • నేడు 25 వేల పాలబిందెలతో పూజ • ఆసుపత్రి వద్ద నిరీక్షణ అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురికావడం ఆ పార్టీ నేతలను తీవ్రంగా కలచివేస్తుండగా ఆమె కోలుకోవాలనే ప్రార్థనలతో ఆలయాలు నిండిపోతున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు హోరెత్తుతున్నాయి. అమ్మ ఆపోలో ఆసుపత్రికి చేరి 17 రోజులైంది. స్వల్ప అనారోగ్యమని తొలిరోజు ప్రకటించినపుడే తట్టుకోలేకపోయిన అమ్మ అభిమానులు రోజులు గడిచే కొద్దీ మరింత ఉద్వేగానికి గురి అవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రి పరిసరాలన్నీ అన్నాడీఎంకే నేతలతో నిండిపోతూ పార్టీ కార్యాలయాన్ని తలపిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే అపోలో వద్దకు చేరుకుని రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతలు, కార్యకర్తల అపోలో ప్రవేశద్వారం వద్ద తమకంటూ ఒకచోటును ఏర్పాటు చేసుకుని దీక్షలా కొనసాగుతున్నారు. ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం, వైద్య మంత్రి విజయభాస్కర్ తదితర మంత్రులు, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ ఆసుపత్రి వద్దనే గడుపుతున్నారు. ప్రభుత్వ ప్రధాన రామమోహన్‌రావు ఒకవైపు సీఎం వైద్య చికిత్సను గమనిస్తూ, మరోవైపు రాష్ట్ర పరిపాలన కుంటు పడకుండా పాటుపడుతున్నారు. డిశ్చార్జ్ ఆలస్యం అయ్యే కొద్దీ అన్నాడీఎంకేలో ఆందోళన పెరిగిపోతోంది. అమ్మ కోలుకుంటోందని ఒకవైపు అపోలో ఆసుపత్రి, మరో వైపు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు ప్రకటి స్తున్నా ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంతో అన్నాడీఎంకే శ్రేణులు సైతం మరింత ఉత్కంఠకు లోనవుతున్నారు. సీఎం కోలుకోవాలని ప్రార్థిస్తూ రాష్ట్రంలో సర్వమత ప్రార్థనలు సాగుతున్నాయి. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు జరుపుతున్నారు. తిరువళ్లూరు జిల్లా సమీపం కడంబత్తూ రు మండలం సిట్రం గ్రామంలోని శ్రీపచ్చైమలై ఆలయం లో శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేసి 108 మంది అన్నాడీఎంకే కార్యకర్తలు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరువొత్తియూరులోని ఆంజనేయస్వామి ఆలయంలో మహా యాగం చేశారు. చెన్నై తిరువల్లికేనీలోనిపార్థసారథి ఆలయంలో మంత్రులు కడంబూరు రాజా, సేవూరు ఎస్ రామచంద్రన్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధురైలో మంత్రి సెల్లూరు రాజా నేతృత్వంలో వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. సుమారు 50 మంది హిజ్రాలు ఆపోలో వద్దకు చేరుకుని అమ్మ కోసం అన్ని మతాల ప్రార్థనలు చేశారు. మధురై జిల్లా తిరుప్పరగున్రం మురుగన్ ఆలయంలో ఆదివారం 25 వేల పాల బిందెలతో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నందున పార్టీ శ్రేణులు దసరా పండుగను జరుపుకుంటున్న దాఖలాలు లేవు. పండుగ చేసుకున్న ఉత్సాహం కూడా లేనట్లుగా ఆసుపత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. స్టాలిన్ రాకతో సందడి ప్రతిపక్ష నేత, డీఎంకే కోశాధికారి స్టాలిన్ శనివారం సాయంత్రం అపోలో వద్దకు రావడంతో సందడి నెలకొంది. కారులో నేరుగా ఆసుపత్రిలోపలికి వెళ్లిన స్టాలిన్ సుమారు అరగంటసేపు అక్కడే గడిపారు. సీఎంకు చికిత్స అందిస్తున్న వైద్యులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ, రెండురోజుల్లో సీఎం డిశ్చార్జ్ అవుతారని ప్రకటించిన అపోలో వైద్యులు రెండు రోజుల క్రితం సుదీర్ఘకాలం ఉండాలని పేర్కొనడంతో వచ్చినట్లు తెలిపారు. సీఎం జయలలితను నేరుగా చూసే అవకాశం లేదని తెలిసినా ఆమెకు చికిత్స అందిస్తున్న అపోలో వైద్యులను కలుసుకునేందుకు వచ్చానని అన్నారు. సీఎం త్వరగా డిశ్చార్జ్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అమ్మ పేరిట మృత్యుంజయ యాగం తిరువళ్లూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ తిరువళ్లూరులోని శ్రీ వైద్యవీరరాఘవస్వామి ఆలయంలో అన్నాడీఎంకే నేతలు మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరిణిలో బెల్లం, ఉప్పును కరిగిస్తే రోగాలు బెల్లంగా మారి కరిగిపోతాయన్న నమ్మకంతో ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. కాగా గత 18 ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేసి పుష్కరిణిలో పాలు, బెల్లం తదితర వాటిని వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సిరునియం బలరామన్ , ఎంపీలు వేణుగోపాల్, హరి, ఎమ్మెల్యేలు విజయకుమార్, నర్సింహన్, ఏలుమలై మాజీ మంత్రి రమణ, మాజీ ఎమ్మెల్యే మణిమారన్, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మ కోసం కొనసాగుతున్న పూజలు పళ్లిపట్టు: అమ్మ క్షేమం కోసం అన్నాడీఎంకే శ్రేణులు ఆలయాల్లో పోటా పోటీగా పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమ అధినేత్రి ఆరోగ్యం కుదుట పడి యధావిధిగా బయటకు రావాలనే ఆశయంతో వారం రోజుల నుంచి అన్నాడీఎంకే శ్రేణులు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో తిరుత్తణి నియోజకవర్గ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జిల్లా ఆవిన్పాల్ చైర్మన్ వేలంజేరి చంద్రన్ అధ్యక్షతన మురుగన్‌కు విశిష్ట అభిషేక ఆరాధన పూజలు చేపట్టారు. పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి బలరామ్, ఎంపీలు వేణుగోపాల్, హరి,ఎమ్మెల్యే నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మూలవమూర్తికి పూజలు చేపట్టిన అనంత రం ఉత్సవ మూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరిగించారు. అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. భారీ సంఖ్యలో అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొన్నాయి. అలాగే తిరుత్తణి పట్టణ అన్నాడీఎంకే ఉప కార్యదర్శి మాసిలామణి ఆధ్వర్యంలో గాంధీ రోడ్డు మార్గంలోని ధర్మరాజుల ఆలయం నుంచి 508 పాల బిందెల ఊరేగింపును మహిళలు నిర్వహించారు. ఇందులో జిల్లా కన్వీనర్ బలరామ్, ఎంపీలు హరి,వేణుగోపాల్, ఎమ్మెల్యే నరసింహన్, పట్టణ కన్వీనర్ సౌందర్‌రాజన్,పట్టణ పార్టీ అధ్యక్షుడు కుప్పుస్వామి,పార్టీ నాయకులు టీడీ.శ్రీనివాసన్, ఇళంగోవన్ తదితరులు పాల్గొన్నారు. అవ్ము పేరుతో రాహుకేతు పూజలు శ్రీకాళహస్తి : తమిళనాడు వుుఖ్యవుంత్రి జయులలిత ఆరోగ్యం కోసం అన్నాడీఎంకే నేత, పశుసంవర్థక శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి శనివారం శ్రీకాళహస్తి ఆలయంలో సర్పదోష, రాహుకేతు పూజలు చేరుుంచారు. రూ.5వేలు టికెట్ ద్వారా స్వామివారి సన్నిధి సమీపంలోని సహస్రలింగేశ్వరస్వామి వద్ద ప్రత్యేక పూజలు చేరుుంచారు. అనంతరం స్వామి, అవ్మువార్లను దర్శించుకున్నారు. జయులలిత ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయు ఆవరణలో కొబ్బరికాయులు కొట్టి, మొక్కులు తీర్చుకున్నారు. ఆయునతో పాటు పలువురు అన్నాడీఎంకే నేతలు ఉన్నారు. -
త్రిపురాంతకంలో హైకోర్టు జడ్జి పూజలు
ప్రకాశం : హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు సోమవారం కుటుంబసభ్యులతో కలిసి త్రిపురాంతకంలోని శ్రీబాలాత్రిపురసుందరీదేవి ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయం వద్ద వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీ పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాలు చేశారు. అనంతరం ఆనంద నిలయం వద్ద జరుగుతున్న సహస్ర చండీయాగంలో న్యాయమూర్తి పాల్గొన్నారు. -
అమ్మ కోసం ప్రార్ధనలు
-
అమ్మ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు
-
తల్లి కోసం గుడికట్టిన కుమారులు
దుబ్బాక: తల్లి ప్రతిమను రూపొందించి, ప్రత్యేక పూజలు చేస్తున్న కుమారుల సంగతి దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కొలుగూరి రాజమణి గతేడాది అనారోగ్యంతో మరణించింది. దీంతో భర్త చంద్రాగౌడ్, కుమారులు రాజేందర్, శంకర్, కూతురు రేణుక కలిసి రాజమణి ప్రతిమను వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్టించారు. ప్రతిమను ప్రతిష్టించి ఏడాది అవుతున్న సందర్భంగా ఆశ్రమంలో యజ్ఞ హోమాలు, ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు అన్నదానం చేపట్టి మానవ సంబంధాలకు మారు పేరుగా నిలుస్తున్నారు. ప్రతి ఏడాది రాజమణి పేరున ప్రజలకు ధాన ధర్మాలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతామని నిర్వాహకులు తెలిపారు. తమ అమ్మను ప్రతి రోజు గుర్తుంచుకునే విధంగా ఆమె పేరున సేవా కార్యక్రమాలు చేపడతామని కుమారులు తెలిపారు. కార్యక్రమంలో బంధు మిత్రులు నాగవ్వ నర్సాగౌడ్, కళావతి నారాగౌడ్, సుగుణ చంద్రాగౌడ్, సుధా వెంకట్ గౌడ్, కళావతి పాపయ్య, లక్ష్మి భూమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
-
నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైనపెంచలకోనలో శ్రీవారి కల్యాణాన్ని శనివారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. 11 గంటలకు నిత్య కల్యాణమండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి కల్యాణం జరిపారు. మధ్యాహ్న అన్నదానం చేశారు. సాయంత్రం 6గంటలకు ఉత్సవవిగ్రహాలను తిరుచ్చిపై సహస్రదీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి ఊంజల్‌సేవ నిర్వహించారు. -
భద్రాద్రి రామయ్యకు డీజీపీ పూజలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. -
మెదక్‌లో.. జైజై గణేశ
మెదక్/మెదక్ మున్సిపల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో వీధివీధినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చవితిని పురస్కరించుకుని సోమవారం మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. పట్టణంలోని వీధుల్లో యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల్లో భారీ విగ్రహలను ఏర్పాటు చేశారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంతో పాటు మున్సిపల్ కాంప్లెక్స్‌లో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. మున్సిపల్ చైర్మెన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మెన్ రాగి అశోక్, పలువురు కౌన్సిలర్లు పూజలు చేశారు. అనంతరం మట్టి విగ్రహాలు తయారు చేసిన శ్రీకాంత్‌ను సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, చంద్రకళ, ఆర్కే శ్రీను, గాయత్రి, ఐతారం నర్సింలు, నాయకులు సాయిలు, ముత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గణనాధుడికి రాఖీ సావంత్ ప్రత్యేక పూజలు
-
YSRCP కార్యాలయంలో ఘనంగా చవితి వేడుకలు
-
కోరికలు సిద్ధించే గణపతి
రేజింతల్ శివారులో స్వయంభూగా వెలిసిన స్వామి నలుమూలల నుంచి భక్తుల రాక నేడు వినాయక చవితి ఆలయంలో ప్రత్యేక పూజలు న్యాల్కల్: పచ్చని పొలాలు, చుట్టూ కొండలు ఎటూ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయoభూగా వెలిశారు శ్రీ సిద్ధి వినాయకుడు. రేజింతల్ గ్రామ శివారులో ఉన్న ఈ ఆలయం దిన దినాభివృద్ధి చెందుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సమీపాన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. ప్రసిద్ధి గాంచిన వినాయక ఆలయాల్లో మొదటిది చిత్తూరు జిల్లా కాణిపాకం కాగా, రెండోవది రేంజితల్ గ్రామ శివారులో వెలిసిన శ్రీసిద్ధి వినాయక ఆలయం. కోరిన కోర్కెలు తీర్చే స్వామి వారి జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వాటితో పాటు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రత్యేకత చుట్టూ కొండలు, పచ్చని పొలాల మధ్య స్వయంభూవుగా వెలిసిన సిద్ధి వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల నీరాజనాలందుకుంటున్నారు. శుభ కార్యాల సమయాల్లో.. పూజలు చేసేటప్పుడు ప్రథమంగా వినాయకుడిని పూజించిన తర్వాతే ఇతర కార్యక్రమాలను ప్రారంభించడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలలో వినాయక ఆలయాలు ఉండడం అరుదు. మన రాష్ట్రంలో ఐదు, కర్ణాటక రాష్ట్రంలో ఒక స్వయంభు వినాయక ఆలయాలున్నాయి. ఒక్క న్యాల్కల్ వుండలంలోనే స్వయంభు వినాయక ఆలయాలు ఉండడం విశేషం. విగ్రహం ఉద్భవించిన తీరు స్వయంభూగా వినాయకుడు ఉద్భవించిన తీరు మరాఠి భాషలోని లఘు విభక్తి విజయగ్రంథం ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు సుమారు 20కిలో మీటర్ల దూరంలో చింతల్‌గిరి గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన బ్రహ్మణుడైన శివరాంభట్ నిత్యం నియమ నిబద్ధతలతో వినాయక, వెంకటేశ్వర స్వాములను పూజిస్తుండే వారు. సంధ్యావందనం, గాయత్రి జపం వంటి కార్యక్రవూలు చేపట్టేవారు. మన రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన విమర్శనంద మహారాజ్ తన శిష్యుడైన శివరాం భట్లు కలిసి బోధనలు చేశారు. 217 సంవత్సరాల క్రితం శివరాం భట్ తిరుపతి తీర్థ యాత్రకు చింతల్‌గిరి నుంచి రేజింతల్ గ్రామ శివారు మీదుగా కాలిబాటనే వెళుతుండగా.. రేజింతల్ గ్రామ శివారులోకి రాగానే పూజా సమయం కావడంతో అక్కడే పూజలు నిర్వహించారు. ఆయన చేసిన పూజలకు ప్రసన్నుడైన వినాయకుడు భూమిని చీల్చుకుని చిన్న మూర్తి రూపంలో ఉద్భవించాడనే విషయం విజయ గ్రంథం ఆధారంగా తెలుస్తోంది. విగ్రహం పెరుగుదల రేజింతల్ గ్రావు శివారులో వెలిసిన సిద్ధి వినాయకుడు ప్రతి సంవత్సరం కొంత మేర విగ్రహం పెరుగుదల కనిపించడంతో ప్రజలు వినాయకుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, వుహారాష్ట్ర భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటారు. ఆలయ ప్రత్యేకతలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలో వినాయకుడి ముఖం దక్షిణం వైపు ఉంది. ఇక్కడి వినాయకుడికి చందన లేపనం చేయడం ప్రత్యేకత. సంకష్ట హర చతుర్థి ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే మూడో రోజును సంకష్ట హర చతుర్థిగా, వినాయకుడి ఇష్ట దినమైన మంగళవారం వచ్చే సంకష్ట హర చతుర్థిని అంగారక చతుర్థిగా భక్తులు కొలుస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, వుహారాష్ట్రలలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన ఆలయానికి వచ్చి దైవదర్శనం చేసుకుంటారు. కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు ఫలిస్తాయనేది భక్తుల విశ్వాసం. -
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
-
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కరీంనగర్ : వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, రామగుండంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
ఉత్సాహంగా పస్క పండుగ
నర్సాపూర్:స్థానిక సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన పస్క పండుగ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రతి ఏటా నిర్వహించే పండుగను ఆదివారం మండలంలోని పెద్దచింతకుంట శివారులోని మామిడితోటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా సీఎస్ఐ చర్చి ఫాస్టర్ రెవరెండ్ విజయరావు మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని అందరూ ప్రార్థనలు చేయాలని భక్తులకు సూచించారు. వర్షాలు బాగా కురిస్తేనే పంటలు పండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అనంతరం మహిళలకు పాటల పోటీలు, పిల్లలకు మ్యూజికల్ చైర్ తదితర ఆటలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా చర్చిల ఫాస్టర్లు లెనిన్, న్యూటన్, ప్రభుదాస్‌లు మాట్లాడుతూ భక్తులకు పలు సూచనలు చేశారు. కాగా నర్సాపూర్ సీఎస్ఐ చర్చి సభ్యులు అరున్, వినోద్, టాగూర్, ప్రేం, తారాభాయి, మేరీ వసంత, ఇందిర, జయశీల తదితరులు పాల్గొన్నారు. - -
సంజీవరాయస్వామికి ప్రత్యేక పూజలు
వెల్లాల (రాజుపాళెం): సంజీవరాయ స్వామి గోవిందా... గోవిందా అంటూ భక్తులు వెల్లాలలో స్వాముల వారిని దర్శించుకున్నారు. మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామునే స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణం, అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం చేశారు. అనంతనం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేశారు. ధ్యాన మందిరంలో అర్కటవేములకు చెందిన శ్రీమహాలక్ష్మి భజన సంఘం సభ్యులు భక్తులు భజనలు చేశారు. -
అన్నా చెల్లెల ఆప్యాయతే రాఖీ
-
సింధు తండ్రి ప్రత్యేక పూజలు
-
పాము పడగ విప్పడంతో ...
వేలూరు: వేలూరు సమీపంలోని పెన్నాతూర్ ఎలై్ల మారియమ్మన్ ఆలయంలో నాగు ఉన్న పలంగా పడగ ఎత్తి ఆడటంతో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయంలో పూజారి సుందరం ఆలయంలో పూజలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆలయంలో ఈనెల 12వ తేదిన 108 పాల బిందెలతో ఊరేగించి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం భక్తులు పాలు తెచ్చిన మట్టి దుత్తను ఆలయంలో ఉంచి బయటకు వచ్చారు. మంగళవారం ఉదయం ఆలయంలోని మట్టి దుత్తలో నాగు పాము ఉన్న ఫలంగా ఉండటాన్ని గమనించిన ఆలయ పూజారి భక్తులకు తెలిపారు. ఈ విషయాన్ని సమీపంలోని గ్రామస్తులందరికీ వ్యాపించింది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వరకు పాము అక్కడ నుంచి వెళ్ళకుండా పడగ విప్పడంతో భక్తులు ఆశక్తిగా చూస్తున్నారు. -
‘శ్రావణ’ సందడి
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడనున్న ఆలయాలు తెలుగు నెలల్లో శ్రావణమాసానికి విశిష్టస్థానం ఉంది. మహిళలు ఈనెలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో తమ ఆరాధ్య దైవాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కోరిన కోర్కెలు తీర్చాలని మనసారా వేడుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ‘శ్రావణమాసం’ ప్రత్యేకతను ఓసారి తెలుసుకుందాం. హన్మకొండ కల్చరల్ : తెలుగు ప్రజలకు శ్రావణమాసం ఐదోవది. ఈ మాసంలో శ్రీకృష్ణభగవానుడు జన్మించాడని, హైగ్రీవోత్పత్తి జరిగిందని.. శ్రావణశుద్ధ పంచమి రోజే గరుత్మంతుడు అమృతభాండాన్ని సాధించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీమహా విష్ణువు కూడా శ్రవణా నక్షత్రంలోనే జన్మించాడని పేర్కొంటున్నాయి. శ్రీవైష్ణవ సంప్రదాయ గురు పరంపరకు చెందిన అళవందారు, బదరీ నారాయణ పెరుమాళ్, చూడికుడుత్తనాంచార్ తిరునక్షోత్రోత్సవాలను కూడా శ్రావణమాసంలోనే జరుపుకుంటారు. ఈనెలలో సంప్రదాయ ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుందని భక్తుల నమ్మకం. రజకులు మడేలయ్యకు, గౌడ కులస్తులు కాటమయ్యకు బోనాలు, పండుగలు చేసుకుంటారు. ప్రతి రోజు ప్రత్యేకమే శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు. శ్రావణ æసోమవారం శివుడికి, మం గళవారం గౌరీదేవికి, శనివారం శ్రీవేంకటేశ్వరస్వామికి, శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులుగా భావిస్తూ ఆలయాల్లో ప్రత్యేకSపూజలు నిర్వహిస్తారు. మంగళవారం మంగళగౌరీ వ్రతాలను పాటిస్తే జన్మజన్మలకు అమంగళము కలుగకుండా ఉంటుం దని మహిళల విశ్వాసం. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు మొదటì ఐదేళ్లు మంగళగౌరీ వ్రతాలు చేసుకుంటారు. గురువారం సాయిబాబా ఆలయాల్లో అఖండ సాయినామయజ్ఞాలు జరుగుతాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకున్న వారికి పుణ్యంతో పాటు లక్ష్మీప్రసన్నం కూడా జరుగుతుందని, ధన, కనక, వస్తు, వాహనాలు సమకూరుతాయని, పూర్వకాలంలో చారుమతిదేవి అనే మహిళ ఈ వ్రతాన్ని పాటించి సకల సంపదలు పొందిందని మహిళలు నమ్ముతారు. బంగారు నగ నియమం శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు బంగారు నగ తప్పకుండా చేయించుకోవాలనేది నియమం. కొత్తగా వివాహామైన యువతులకు శ్రావణపట్టి పేరిట ఆభరణాలు చేయిస్తారు. శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసదీక్షలు పాటించి ఆలయాల్లో గోధుమ పిండితో చేసిన ప్రమిదలతో నేతి దీపాలు వెలిగిస్తారు. ఇళ్లలో శ్రీవేంకటేశ్వరస్వామి జ్యోతి వ్రతాలు జరుపుకుంటారు. శ్రీభద్రకాళి దేవాలయంలో.. వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీభద్రేశ్వరశివలింగానికి ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు, ఓడిబియ్యం సమర్పణలు జరుగుతాయని ఈఓ కట్టా అంజనీదేవి తెలిపారు. అలాగే నాగ పంచమిరోజు ఆలయ ఆవరణలోని పుట్టవద్ద పూజలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో.. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలో ప్రతి రోజు శ్రీరుద్రేశ్వర శివలింగానికి సామూహిక రుద్రా భిషేకాలు, రుద్రాహోమాలు, అన్నపూజలు జరుగుతాయని ఈఓ వద్దిరాజు రాజేందర్ తెలిపారు. అలాగే ప్రతి సోమవారం మహా అన్నదానం, మంగళవారం గౌరీ వ్రతాలు, శుక్రవారం వరలక్ష్మీవ్రతాలు, పంచమి తిథిరోజు నాగపూజలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, వరలక్ష్మీ వ్రతాన్ని వేయిస్తంభాల దేవాలయంలో మహిళలు సామూహికంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ∙ -
ప్రత్యేక పూజలు చేసిన సబితారెడ్డి
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్ గ్రామంలో ఆదివారం బోనాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహంకాళీ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన అతి పూరాతన ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చన, పుష్పాలంకరణ, అభిషేకం చేసి పసుపు, గంధంతో అమ్మవారిని అలంకరించారు. సాయంత్రం గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో సుమారు 200 బోనాలు.. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో, యువకుల డ్యాన్సులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేష్, సర్పంచ్ అత్తెని కౌసల్యబాబు యాదవ్, ఎంపీటీసీ మదన్మోహన్, ఉప సర్పంచ్ కప్పల సుందరయ్య, కాంగ్రెస్ నాయకులు అత్తెని మహేందర్ యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పహడీషరీఫ్ సీఐ చలపతి, ఎస్ఐ మహేందర్‌జీ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు బ్రహ్మంచారి, చిప్ప సురేష్, యాదయ్య, శ్రీకాంత్, రవి నాయక్, నాసర్‌ఖాన్, సామెల్‌రాజ్, నర్సింగ్‌రాజ్, విలాస్, శ్రీనివాస్ నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పూజలు మంఖాల్, తుక్కుగూడ గ్రామాల్లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, మంఖాల్ గ్రామ సర్పంచ్ కౌసల్య, ఉప సర్పంచ్ సుందరయ్య, నాయకులు కొమిరెడ్డి నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ పాండు నాయక్, మహేందర్ యాదవ్, నల్ల వీరేష్‌గౌడ్, మంత్రి రాజేష్, కాకి ఈశ్వర్ ముదిరాజ్, సురేష్, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేష్ యాదవ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
ఆలయ అభివృద్ధికి సహకారం
చక్రాయపేట : జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గండి వీరాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం గండి అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేసరి, రాజా ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర ఆయనకు వివరించారు. దాతల సహకారంతో రూ.63 లక్షలతో జరుగుతున్న పర్మినెంటు షెడ్లు, డార్మెంటరీ, క్యూలైన్ల పనులపై ఆయన ఆరా తీశారు. ఆలయ ఆవరణలో తాము పెట్టుకున్న హోటళ్లు, తోపుడు బండ్లకు గాను ఆలయ అధికారులు వారానికి రూ.200 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆయనకు మొర పెట్టుకున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారికి ఎంపీ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తే స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులకు పర్మినెంటు షెడ్లు వేయించి ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ మునికుమారి, మారెళ్లమడక, సురభి, సింగిల్ విండో ప్రెసిడెంట్లు శేషారెడ్డి, సురేష్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంటు మునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తలలేని మొండెం తిరుగుతున్నట్టు...
వేలూరు: వానియంబాడి సమీపంలో తలలేని మొండెంతో రక్తకాటేరి తిరుగుతున్నట్లు పుకార్లు లేవడంతో గ్రామస్తులు భయాందోళనలతో అర్ధరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు చేసి సరిహద్దులో కాపలా కాశారు. స్థానిక బత్తాపేట గ్రామంలో సుమారు వెయ్యికి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఇంటి తలుపులు, కిటికీలు మూసి వేసి నిద్రించినా తలలేని మొండెంతో రక్తకాటేరి లోపలికి ప్రవేశించి ఉయ్యాల కట్టి ఊగుతోందని పుకార్లు షికార్లు చే స్తున్నాయి. అదే విధంగా మూసిన తలుపులు ఎవరో తడుతున్నారని, బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించడం లేదని, ఇంటి బయట నీటిని చల్లుతున్నట్లు శబ్దాలు విసిపిస్తున్నాయని, బయటకు వచ్చి చూస్తే నీళ్లు చల్లి ఉండడం చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వీటిపై గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామంలో తలలేని మొండెం తిరుగుతోందని, తమ గ్రామానికి వచ్చిన రక్తకాటేరిని తరిమి వేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో మంగళవారం రాత్రి గ్రామస్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో గ్రామంలోని తొమ్మిది మంది మహిళలకు స్వామి వచ్చి గ్రామంలో రక్తకాటేరి ఉందని, దానివల్ల ఇది వరకే ఇద్దరు మృతి చెందారని, మరో ముగ్గురు మృతి చెందబోతున్నారని చెప్పారు. అనంతరం గ్రామస్తులు గ్రామ సరిహద్దులోని వంతెనపై రక్తకాటేరికి ప్రత్యేక పూజలు చేసి పంబ కొడుతూ గ్రామం చుట్టూ ఊరేగింపు చేశారు. ప్రతి ఇంటి ముందు మంచి నూనెతో దీపం వెలిగించి, జిల్లేడు కొమ్మలను ఉంచి కాపలా కాశారు. -
చెంగాళమ్మ గుడిలో వైభవంగా కలశపూజ
సూళ్లూరుపేట: గురుపూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 108 కలశాలను ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించారు. ఇప్పటికే 45 కలశాలను కాళంగి పరివాహక ప్రాంతంలోని ఆలయాలకు పంపిన సంగతి తెలిసిందే. 19వ తేదీన మొత్తం 153 కలశాల్లోని పవిత్రజలాలతో అమ్మవారికి అభిషేకం చేయనున్నారు. అషాడ పౌర్ణమిని పురస్కరించుకుని అదేరోజు అమ్మవారికి మహాచండీయాగం చేస్తారు. -
రంజాన్‌కు సర్వం సిద్ధం
♦ నేడు ఈద్-ఉల్-ఫితర్ ముగిసిన నెల రోజుల రోజాలు ♦ వేడుకలకు సిద్ధమవుతున్న ముస్లింలు ♦ నోరూరించనున్న షీర్ఖుర్మా ♦ ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గాల ముస్తాబు ♦ 30 రోజుల ఉపవాసాలను విశ్వాసులు పూర్తి చేశారు. ఇక పండగే మిగిలింది. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ బుధవారంతో ముగిసింది. షవ్వాల్ మాసంలోని మొదటి రోజున(గురువారం) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఈ పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. తలస్నానంతో మొదలు ముస్లింలు పండగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి.. ఈతర్ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఁఈద్-ముబారక్* అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రంజాన్ రోజున షీర్ఖుర్మా చేసుకొని నోరు తీపి చేసుకుంటారు. ఆ రోజు ప్రతిచోట పవిత్రత, పరిశుద్ధత వెల్లివిరుస్తాయి. వాతావరణమంతా దైవ విశ్వాసం, దైవ భీతి, విధేయతా భావాలతో, ఉన్నతమైన నైతిక పోకడలతో, సత్క్రియా, సదాచారాలతో అలరారుతుంది. ధనికులు, పేదలు అనే తారతమ్యం లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్య పాటిస్తారు. ఈ పండగ మానవుల వ్యక్తిగత జీవితాన్ని, సాంఘిక స్థితిని, ఆరోగ్యకర పద్ధతుల్లోకి మలచి శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పుతుంది. పండగ తర్వాత మరో ఆరు రోజుల పాటు షవ్వాల్ దీక్షలు విశ్వాసులు పాటిస్తారు. ఫిత్రా దానం పండగ రోజున నమాజ్‌కు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండగకు ఈద్-ఉల్-ఫితర్ అని పేరు వచ్చింది. ఉపవాసాల పాటింపులో మనిషి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. వాటి పరిహారార్థం చేసే దానమే ఫిత్రా. దీని ద్వారా నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కూడా, ఇతరులతో పాటు పండగ వేడుకల్లో పాల్గొని, మంచి వస్త్రాలు ధరించి, మంచి వంటకాలు అరగించే వీలు కలుగుతుంది. పావు తక్కువ రెండు సేర్ల గోధుమలు కానీ, తూకానికి సరిపడా పైకాన్ని గానీ కడు నిరుపేదలకు ప్రతి ముస్లిం దానం చేయాలి. జకాత్ ఇస్లాం నిర్థేశించిన సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అంటే దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరు తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి కొంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపారం కోసం నిర్థేశించబడిన సరుకులు, చివరకి తమ వద్ద ఉన్న పశువుల నూ వెల కట్టి, అందులో నుంచి 2.5 శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. రంజాన్ నెలలోనే జకాత్‌ను చెల్లించడం అత్యంత పుణ్యదాయకంగా భావిస్తారు. పలు విషయాలు అవగతం ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అదుపులో ఉంటాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను ఆచరించడం సర్వసాధారణం. 30 రోజుల పాటు పాటించే దీక్షల్లో చుక్క నీరు కూడా సేవించరు. ఇలా 30 రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్ష చేస్తారు. తద్వారా రంజాన్ మాసంతో అనేక విషయాలు అవగమవుతాయి. మనో నిగ్రహం కలుగుతుంది. ఆకలిదప్పుల విలువ తెలుస్తుంది. దాన గుణం అలవడుతుంది. చెడు అలవాట్లు, కోరికలు దహించుకుపోతాయి. ప్రేమ, అభిమానం, క్రమశిక్షణ, రుజువర్తన, కర్తవ్య పారాయరణ, సర్వ మానవ సౌభ్రాతృత్వం తదితర గుణాలు దరిచేరుతాయి. ఇన్ని ప్రత్యేకతలతో సాగే రంజాన్ మాసం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలతో ముగుస్తుంది. ఇహలోకంలో ఆచరించే ఇలాంటి కఠోర దీక్షలు పరలోకంలో రక్షణగా ఉండి కాపాడతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. రంజాన్ నెలలో ఉపవాసాలతో, దానధర్మాలతో గడిపినవారి ప్రార్థనలను అల్లా ఆలకిస్తాడని, వారి పాపాలు పరిహారమై, అగ్ని సంస్కారం పొందిన బంగారంలా మోము దివ్యకాంతిలో వెలుగొందుతుందని ముస్లింలు విశ్వసిస్తారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కుల, మత భేదాలు లేకుండా హిందువులు, క్రైస్తవులు.. ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. వివిధ కుల సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పండగ రోజున ఈద్గాలకు వెళ్లి ఈద్-ముబారక్ చెబుతారు. పండగ శుభాకాంక్షలు సిద్దిపేట జోన్: మత సామరాస్యానికి పవిత్ర రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన బుధవారం పత్రికా ముఖంగా ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందును అధికారికంగా నిర్వహించిన మొదటి ప్రభుత్వం తమదేనని గుర్తుచేశారు. సోదర భావానికి దోహదం జహీరాబాద్: జహీరాబాద్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ జె.గీతారెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జరుపుకోనున్న రంజాన్.. ప్రజల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పండగలు ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. -
కమనీయం.. అమ్మవారి కల్యాణం
-
ముద్రగడ ఆరోగ్యం మెరుగుపడాలని..
పట్నంబజారు (గుంటూరు) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ మంగళవారం తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజా వద్ద శ్రీ కోదండ రామాలయంలో పూజలు చేశారు. ఉద్యమానికి ఊపిరి పోసేలా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయం నుంచి కేకేఆర్ వరకు కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేత మాదా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను విస్మరించటం ఆ జాతికి ద్రోహం చేయటమేనన్నారు. కాపు జాతి కోసం పాటుపడుతున్న ముద్రగడను తీవ్రవాదిలా చూడటం దారుణమన్నారు. కాపు నేత మలిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పతనానికి కాపు ఉద్యమమే నాంది కాబోతోందని హెచ్చరించారు. కాపు అడ్వకేట్స్ జేఏసీ నేత గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముద్రగడకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కాపు యువనేత కావటి విక్రమ్‌నాయుడు మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నా.. అక్రమ కేసులు బనాయించటం సిగ్గుచేటన్నారు. తెలగ అభ్యుదయ జేఏసీ నేతలు గ్యాలం ప్రేమ్‌చంద్, నీలం ప్రసాద్, కళ్యాణం శివశ్రీనివాసరావు (కేకే), డాక్టర్ యిమడాబత్తుని కృష్ణమూర్తి, దాసరి రాము, బండి దుర్గ, బాలిశెట్టి విజయ్, అడ్వకేట్ జేఏసి నేత వైఎస్ సూర్యానారాయణ పాల్గొన్నారు. -
పులివెందులలో ప్రత్యేక పూజలు
మూడు రోజుల జలదీక్ష చేపట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నుంచి కర్నూలు బయల్దేరారు. అంతకుముందు ఆయన పులివెందుల అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ దీక్షను చేపడుతున్న విషయం తెలిసిందే. దిగువ కృష్ణా డెల్టాకు నీరు రాకుండా అడ్డుపడే ఈ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఈ దీక్ష చేపడుతున్నారు. ఈనెల 17వ తేదీన అన్ని మండల కేంద్రాలలో పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టనున్నాయి. -
పల్లె గడపతొక్కిన గోదారమ్మ..
నీళ్లొచ్చిన వేళ.. చిన్నాపెద్ద అంతా ఆనంద సాగరంలో మునిగిపోయారు. పల్లెగడప తొక్కిన గోదారమ్మను ముద్దాడారు. మిషన్ భగీరథలో భాగంగా మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం వడ్డెపల్లి వద్ద నిర్మించిన ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా దుబ్బాకలోని మాల కుంట సంపు వరకు శనివారం ఉదయం 11.15 గంటలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చారు. గోదారమ్మకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 101 కొబ్బరి కాయలు కొట్టారు. మండుటెండల్లో నీళ్లు చెంత కు చేరడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. - దుబ్బాక -
స్పీకర్ కోలుకోవాలని పూజలు
చిట్యాల : భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి తొందరగా కోలుకోవాలని మండలంలోని మసీదులలో శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ ఇటీవల వడదెబ్బకు గురై నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఈ మేరకు చల్లగరిగె, వెలిశాల, చిట్యాల, టేకుమట్ల, గోపాలపురం గ్రామాలలోని మసీదులలో మైనార్టీ సెల్ మండల నాయకులు ఎండీ రబ్బాని, కమ్రోద్దిన్, రాజ్‌మహ్మద్ ఆధ్వర్యంలో స్పీకర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నమాజ్ చేసారు. కొడకండ్లలో.. కోల్‌బెల్ట్ : తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కోరుతూ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గని వద్ద శుక్రవారం కార్మికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గని ఆవరణలో గల ఆలయంలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ బాషనపల్లి కుమారస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి స్పీకర్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కోరారు. అనంతరం గని ఆవరణలో కార్మికులకు ఉగాది పచ్చడిని పంచారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు ఏరుకొండ సంపత్, ఆలయ కమిటీ చైర్మన్ డి. సాంబరెడ్డి, సభ్యులు అయిలయ్య, రవి, రాజ్‌కుమార్, సాంబయ్య, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
హరహర మహాదేవ శంభో
ఏ నోట విన్నా పంచాక్షరీ మంత్ర జపమే... ఏ దారిని కన్నా పంచ భూతాత్ముడైన ఆ పరమ శివుని ఆలయాలకు చేరుతున్న జనమే. హరహర మహాదేవ అంటూ ఆ బోళా శంకరుడుని ఆర్తిగా స్మరిస్తూ, తమ శక్తి మేరకు అర్చిస్తూ, అభిషేకిస్తూ భక్తులు అలౌకికానందంలో తేలియాడారు... సుఖశాంతులు ప్రసాదించాలని ఆ జంగమదేవరను శరణచొచ్చారు. నర్సీపట్నం: బలిఘట్టంలో త్రిశూల పర్వతంపై వేంచియున్న శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. స్వామికి మహోన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్తర వాహిని నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పురోహితులతో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. పితృదేవతులను మననం చేస్తూ బుడగజంగాల మంత్రోచ్ఛారణలతో నదీ ప్రాంతం కోలాహాలంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్వామి వారి ఆలయ సమీపంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. బలిఘట్టం యూత్ సభ్యులు భక్తులకు పులిహార, మజ్జిగ పంపిణీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి వాహనాలను క్రమబద్ధీకరించారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచదార్లలో... రాంబిల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంచదార్ల పుణ్యక్షేత్రం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలలు నుంచి వేకువజామునే భక్తులు ఇక్కడకు చేరుకొని తొలుత ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉమా ధర్మలింగేశ్వరస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి, సహస్ర లింగేశ్వరస్వామి వార్లను దర్శించుకొని పూజలు చేశారు. క్షేత్రపాలకుడైన ధర్మలింగేశ్వరస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ధర్మలింగేశ్వరస్వామిని దర్మించుకునేందుకు, ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు(దిన్‌బాబు), డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ దంపతులతో పా టు వేలాది మంది భక్తులు ఉమా ధర్మలింగేశ్వర స్వా మిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం అర్చకులు తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. -
భద్రాద్రిలో పుష్య మాసోత్సవాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పుష్యమాసం ఉత్సవాల వివరాలను ఆలయ ప్రధానార్చకులు ఆదివారం వెల్లడించారు. 14వ తేదీన భోగి సందర్భంగా గోదా కల్యాణం, 15న మకర సంక్రాంతి రోజున రథోత్సవం, చుట్టు సేవ, స్వామివారికి ప్రణయ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 16న కనుమ, ఆండాలమ్మ వారికి తిరువీధి సేవ, 23 పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి తిరువీధి సేవ, మండప సేవ చేస్తారు. 24న పుష్యమి నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం, 25 నుంచి 29 వరకు శ్రీ కూరత్తాళ్వార్కు తిరు నక్షత్రోత్సవాలు జరపనున్నారు. 26న శ్రీ తిరుమలీశై ఆళ్వార్ తిరు నక్షత్రం ఆళ్వారుకు విశేష భోగం, 29న ఆళ్వారుకు చుట్టు సేవ, విశేష భోగం, నివేదన, ప్రబంధారంభము నిర్వహిస్తారు. 30న చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన యాగం, హోమం, ఫిబ్రవరి 4న సర్వేషా ఏకాదశిని పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ప్రధానార్చకులు తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత పాపులర్ తొలి పది చర్చిల విశేషాలు..
పపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రతీ దేశంలోని క్రైస్తవులంతా తమకు దగ్గర్లోని చర్చికెళ్లి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. దీంతో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన తొలి పది చర్చిల విశేషాలు.. 1. సాగ్రడా ఫెమీలియా బార్సిలోనాలోనే అతిపెద్దదైన ‘సాగ్రడా ఫెమీలియా’ రోమన్ క్యాథలిక్ చర్చిని క్యాటలాన్ వాస్తుశిల్పి ఆంటోనీ గాధీలో నిర్మాణం ప్రారంభించాడు. 1882లో మొదలైన నిర్మాణం ఈ రోజుకూ కొనసాగుతూనే ఉంది. 2. సెయింట్ బాసిల్ క్యాథడ్రల్ రష్యాలోని మాస్కోలో రెడ్ స్క్వేర్ ప్రాంతంలో ఉందీ చర్చి. సెయింట్ బాసిల్ క్యాథడ్రల్గా పేరుగాంచిన ఈ చర్చిని 1555-1561 కా లంలో నిర్మించారు. ఆర్థోడాక్స్ చర్చిలో ప్రముఖమైన ఈ చర్చి.. మాస్కో మధ్యలో ఉంది. 3. నోర్డే డామ్ డి పారిస్ ‘నోర్డే డామ్ డి పారిస్’గా పిలిచే ఈ చర్చి యూరప్‌లోనే అత్యంత అందమైన చర్చిగా పేరొందింది. మధ్యయుగం నాటి నుంచే పారిస్‌లో వెలుగొందిన ఈ చర్చి నిర్మాణం పూర్తవడానికి వందేళ్లు పట్టిందట. 4. సెయింట్ పీటర్స్ బాసిలికా సెయింట్ పీటర్స్ బాసిలికాను 1506-1615కాలంలో రోమ్‌లో నిర్మించారు. చర్చి ప్రధాన గుమ్మటాన్ని ప్రఖ్యాత చిత్రకారుడు మైకలాంజలో 1547లో డిజైన్ చేశాడు. డోమ్ ఎత్తు ఏకంగా 448.1 అడుగులు. 5. వెస్ట్మిన్స్టర్ అబే లండన్ కీర్తిని చాటే అద్భుతాల్లో ‘వెస్ట్మిన్స్టర్ అబే’ చర్చి ఒకటి. పదో శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి మొత్తం బ్రిటన్‌లోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న మతకట్టడం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఇది ఉంది. 6. సెయింట్ పాల్ క్యాథడ్రల్ లండన్ బిషప్ అధీనంలో ఉండే ఈ సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చి ధవళ వర్ణంలో మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకుంటుంది. లండన్‌లోనే అత్యంత ఎత్తయిన కొండప్రాంతంలో 17వ శతాబ్దంలో నిర్మించారు. 7. చర్చి ఆఫ్ నేటివిటీ క్రీస్తు పుట్టిన ప్రాంతంగా ఖ్యాతికెక్కిన ‘చర్చి ఆఫ్ నేటివిటీ’ పాలస్తీనాలోని బెత్లెహాంలో ఉంది. క్రీ.శ.327లో దీనిని నిర్మించారు. కాన్స్టాంటిన్, హెలెనాలు దీనిని కట్టారు. 8. హోలీ సెపల్కర్ క్రీస్తును శిలువ వేసిన ప్రాంతంలో ఉందీ చర్చి. పాత జెరూసలెం పట్టణంలోని కల్వరీ కొండపై ఈ ‘హోలీ సెపల్కర్’ను నిర్మించారు. ఇక్కడ క్రీస్తు సమాధి ఉందని కొందరి విశ్వాసం. 9. సెయింట్ మార్క్స్ సెయింట్ మార్క్స్ చర్చిని ఇటలీలోని వెనీస్ నగరంలో కట్టారు. బైజాంటియన్ శైలిలో నిర్మించిన అద్భుత కట్టడమిది. 1650లో నిర్మాణం పూర్తయిన ఈ చర్చిని వెనీస్‌కు వచ్చిన ప్రతీ యాత్రికుడు చూస్తారట. 10. హగియా సోఫియా టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉంది. 537 నుంచి 1453 సంవత్సరం వరకు చర్చిగా కొనసాగింది. తర్వాత ఇంపీరియల్ మసీదుగా పేరుపొందింది. 1935 నుంచి మ్యూజియంగా కొనసాగుతోంది. -
కోటప్పకొండలో గవర్నర్ ప్రత్యేక పూజలు
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండలో వెలసిన శ్రీత్రికోటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నరసరావుపేట శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యలమండలో డంపింగ్ యార్డును ప్రారంభించిన అనంతరం అక్కడ ఉన్న డ్వాక్రా మహిళలతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు. -
పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు
-
భక్తి సాగరం
సూర్యలంక తీరంలో కార్తీక కాంతులు సాగర హారతి వీక్షించేందుకు పోటెత్తిన పర్యాటకులు లక్షల సంఖ్యలో భక్తుల పుణ్యస్నానాలు కిక్కిరిసిన శైవాలయాలు.. దీపాలతో ప్రత్యేక పూజలు కోటప్పకొండపై వైభవోపేతంగా జ్వాలాతోరణం బాపట్లటౌన్/నరసరావుపేట రూరల్ కార్తీకపౌర్ణమిను పురస్కరించుకొని సూర్యలంక, నిజాంపట్నం సముద్రతీరాలకు బుధవారం పర్యాటకులు పోటెత్తారు. ఉదయాన్నే సూర్య నమస్కారాలతో కూడిన పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుక తిన్నెలపై పిండి ముగ్గులేసి, మధ్యలో గొబ్బెమ్మలుంచారు. ఇసుకతో తయారుచేసిన గౌరీదేవి ప్రతిమలకు ప్రత్యేకపూజలు నిర్వహించి, గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లు సముద్రంలోకి వదిలారు. సూర్యలంక తీరానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజామున 3.30 గంటల నుంచే తీరానికి వచ్చారు. భక్తులు, అయ్యప్ప, భవానీ, శివ మాలలు ధరించిన దీక్షాపరులు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలోను, తీరం వెంబడి నూతనంగా ఏర్పాటుచేసిన శివలింగం, నందీశ్వరుని ప్రతిమలకు పూజలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన యువకులు, వివిధ కళాశాలల విద్యార్థులు ఆహ్లాదకర తీరంలో కేరింతలు కొట్టారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో సూర్యలంక తీరానికి పర్యాటకులు వస్తారని ముందుగానే అంచనావేసిన పోలీసుశాఖ తీరంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 15 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటుచేశారు. బాపట్ల డిఎస్పీ పి.మహేష్ ఆధ్వర్యంలో 750 మంది పోలీసులు తీరంలో విధులు నిర్వర్తించారు. మత్స్యశాఖాధికారి ఉషాకారిణ్ ఆధ్వర్యంలో తీరంలో 5 ప్రత్యేకబోట్లు, 50 మంది గజఈతగాళ్ళను అందుబాటులో ఉంచారు. మండలంలోని అప్పికట్ల, వెదుళ్ళపల్లి, నరసాయపాలెం పీహెచ్‌సీల పరిధిలోని ఆరోగ్యసిబ్బంది వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. రెడ్‌క్రాస్ తరపున 120 మంది ఎన్సీసీ, 120 ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సాయంత్రం వరకు తీరంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. త్రికోటేశ్వరుని సన్నిధిలో జ్వాలాతోరణం.. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండపం ఎదుట జ్వాలాతోరణం ఏర్పాటుచేసి పూజలు నిర్వహించగా.. భక్తులు ఆ తోరణం గుండా ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆలయ ట్రస్టీ రామకృష్ట కొండలరావు, ఈవో శ్రీనివాసరావు, సుధాకరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రెంటచింతల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 108 కోట్ల వత్తులతో దీపారాధన నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని శ్రీ కాశీవిశ్వనాథుని ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. రేపల్లె పట్టణం ఇసుకపల్లిలోని అయ్యప్ప ఆలయంలో లక్ష వత్తులతో శివలింగాకృతిలో దీపాలు వెలిగించారు. నిజాంపట్నం సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తొలిసారి సాగర హారతి.. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రం వద్ద సాగరు హారతి ఇచ్చి సముద్రస్నానాలను ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ఉదయం 4.30గంటలకు వేదపండితుల సమక్షంలో హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర హారతి ఇవ్వటం ఇదే తొలిసారి కావటంతో భక్తులు భారీగా కార్యక్రమానికి పాల్గొన్నారు. వల్లూరు భావన్నారాయణ, నెమ్మలికంటి హనుమంతరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తెనాలి ఆర్డీఓ నరసింహులు, త హశీల్దార్ టి.వల్లయ్య, మున్సిపల్‌చైర్మన్ తోట నారాయణ, ఎంపీపీ మానం విజేత, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
‘గురు’ కీర్తన్..
-
ఘనంగా దుర్గామాత నిమజ్జనం
ఖైరతాబాద్: దసరా నవరాత్రుల ముగింపు సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాలను శుక్రవారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన 8 ప్రత్యేక క్రేన్ల సాయంతో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఒక్క సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 40 దుర్గామాత విగ్రహాలు ఉన్నాయని ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సుమారు 700 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశముందని ఇన్స్పెక్టర్ తెలిపారు. శనివారం అదనంగా మరో క్రేన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం కొంతమంది నిమజ్జనానికి అమ్మవారి విగ్రహాలను తరలించకపోవడంతో శనివారం పూర్తి స్థాయిలో తరలివచ్చే అవకాశముందని తెలిపారు. -
జగన్ కోలుకోవాలంటూ గంగమ్మకు పూజలు
గోరంట్ల (అనంతపురం) : రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని ఆ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా గోరంట్లలోని ఏటి గంగమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా జగన్ దీక్ష విజయవంతం కావాలని గంగమ్మను వేడుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తున్న తమ నాయకుడిపై కేవలం చంద్రబాబు మెప్పు కోసం, తమ పదవులను కాపాడుకోనేందుకు మంత్రులు లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చిన బీజేపీని నిలదీస్తే కేంద్ర ప్రభుత్వంలో చలనం వస్తుందన్నారు. -
పాదగయక్షేత్రంలో క్రికెటర్
పిఠాపురంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాదగయక్షేత్రాన్ని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం సందర్శించారు. కుక్కుటేశ్వరస్వామి వారికి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
పట్టిసీమలో పంపుల పూజ
చెప్పిన సమయానికి ఒక్క పంపూ పూర్తికాని వైనం * విజయవాడ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రత్యేక పూజలు.. * తాడిపూడి నీరు.. వర్షాలవల్ల కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణానదికి చేరిన వైనం.. * దాంతోనే కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినట్టు ఘనంగా ప్రకటన సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం అపహాస్యంగా మారింది. పనులు పూర్తి చేయకుండానే గత నెలలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రీతిలోనే.. ఈ పట్టిసీమ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించేశారు. బుధవారం పట్టిసీమ పథకానికి సంబంధించిన ఒక మోటార్‌ను సీఎం స్విచాన్ చేసి ప్రారంభించాల్సి ఉంది. పంపు బిగించే పని కొలిక్కిరాకపోవడం.. మోటార్ అమర్పూ పూర్తి కాకపోవడంతో పట్టిసీమ నుంచి చుక్కనీటినీ పోలవరం కుడికాలువలోకి ఎత్తిపోసే పరిస్థితి లేకపోయింది. దీంతో మొదటి పంపు వద్ద పూజలతో సీఎం సరిపెట్టారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పట్టిసీమకు చేరుకున్న ముఖ్యమంత్రి 4.05 గంటలకు మొదటి పంపు వద్ద పూజలు నిర్వహించి వెనుదిరిగారు. మరోవైపు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది ఒడ్డున కృష్ణా-గోదావరి నదుల అనుసంధానాన్ని బుధవారం ఆర్భాటంగా నిర్వహించారు. తాడిపూడి నుంచి వదిలిన గోదావరి నీరు.. వర్షాల కారణంగా వాగులు పొంగి కలసిన నీరు కుడికాలువ ద్వారా కృష్ణా నదికి చేరగా.. దాంతోనే రెండు నదుల అనుసంధానం చేసినట్టు ఘనంగా ప్రకటించుకున్నారు. వరుస మారిన ప్రారంభాలు.. నిజానికి సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 9.45 గంటలకు పట్టిసీమను ప్రారంభించాల్సి ఉంది. అనంతరం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానది ఒడ్డున నదుల అనుసంధాన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. పట్టిసీమ పనులు కొలిక్కి రాకపోవడం.. సాయంత్రం వరకు మోటారు బిగించే పరిస్థితి లేదని అధికారులు చెప్పడంతో సీఎం కార్యక్రమంలో మార్పులు జరిగాయి. దీంతో తొలుత కృష్ణా జిల్లాలో నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం సీఎం పట్టిసీమకు చేరుకున్నారు. అప్పటికీ.. పనులు కొలిక్కి రాలేదు. దీంతో మొదటి పంపు వద్ద పూజలతో సరిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పైపులైను పనులను పూర్తి చేసి రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.12 ఏళ్లక్రితం తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే బ్రహ్మోత్సవాల ప్రారంభానికి వెళ్లే ముందు పట్టిసీమతో ఓ మహత్కార్యానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. ఐదునెలల 19 రోజుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం తొలివిడత నిర్మాణం పూర్తి చేయడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. దేశంలోనే నదుల అనుసంధానానికి ఇది చరిత్రగా నిలుస్తుందని చెప్పారు. పట్టిసీమ వేగంతో పోలవరం పనులు.. సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘ఇకపై ఫోకస్సంతా పోలవరంపైనే. పట్టిసీమ పనుల్ని ఎంత స్పీడ్‌గా చేయించామో, అంతే వేగంతో పోలవరం పనులనూ చేపడతాం. 2018 ఖరీఫ్ నాటికి పొలాలకు ప్రాజెక్టు నీళ్లొచ్చేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం మన కల అని, దాన్ని సాధించి తీరుతామని, నిధుల విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారముందని చెప్పారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం సెంటర్లో నిర్మించిన కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన పైలాన్‌ను సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కడకు సమీపంలోని కృష్ణానది ఒడ్డున కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణా-గోదావరి అనుసంధాన సభలో మాట్లాడారు. పట్టిసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సం గమం జరిగిందని చెప్పారు. వారానికో పంప్ చొప్పున పట్టిసీమను సిద్ధం చేసి అనుకున్న లక్ష్యం మేరకు గోదావరి జలాల్ని కృష్ణాకు తరలిస్తామని పేర్కొన్నారు. కరువు రహిత రాష్ట్రంగా మార్చేదాకా విశ్రమించను.. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేవరకూ విశ్రమించరాదని తాను సంకల్పం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీటి సమస్య తొలగుతుందని, వచ్చే ఏడాది జూలై నెలాఖరుకల్లా వరినాట్లు వే సుకునేలా చేస్తామన్నారు. హంద్రీ-నీవా పనులు పూర్తి చేసి ఈ ఏడాదే కుప్పం నియోజకవర్గానికి నీళ్లిచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. రాజధాని కడతామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ.. మంచి చెబితే వింటానని, అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఖబడ్దార్ అని హెచ్చరించారు. -
శ్రావణ శోభ
ఆలయూలు శ్రావణ శోభను సంతరించుకున్నారుు. శుక్రవారం కావడంలో దేవాలయూ లు భక్తులతో కిక్కిరిశారుు. నగరంలోని భద్రకాళి ఆలయూల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజలు, చీర, రవికబట్టలు, గాజులు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. హంటర్‌రోడ్డులోని సంతోషిమాత దేవాలయం, ఎంజీఎం సమీపంలోని శ్రీరాజరాజేశ్వరీ దేవాలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. -హన్మకొండ కల్చరల్ -
వరుణుడి కరుణ కోసమే యాగం
ఐరాల: రాష్ట్ర ప్రజలపై వరుణుడు కరుణించాలనే వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కాణిపాక ఆలయ ఈవో పూర్ణచంద్రారావు తెలిపారు. వరుణయాగంలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వామివారి కల్యాణ మండపంలో జప కలశాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాలను స్వామివారి ఆలయం వద్ద చేర్చి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వరుణయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్దకు జప కలశాలను తీసుకువెళ్లి వేదపారాయణం, మంత్రోచ్ఛారణల మధ్య వరుణుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఏఈవో ఎన్ఆర్ క్రిష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర గురుకుల్, సూపరిండెంట్ రవీంద్ర, వేదపండితులు కపిల్వాయ నరసింహమూర్తి,పలువురు పాల్గొన్నారు. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా శనివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మాజీ ఎంపీ అల్లాడి రాజ్‌కుమార్ తదితరులతో కలసి ఆయన అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ఈవో అశోక్‌గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు అంటే తనకు ఎంతో నమ్మకమని.. గత 20 ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలందరు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు బాబు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితర కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. -
ఘనంగా రంజాన్
అంతటా భక్తి భావం.. అందరి నోటా అల్లాహ్ గురించి ప్రశంస.. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు.. సహృద్భావ వాతావరణం.. ఆహ్లాదం గొలిపిన అత్తరు పరిమళాలు.. సోదర భావం తెలుపుతూ ఆలింగనాలు... వెరసి శనివారం జిల్లాలో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. కడప నగరంలోని బిల్టప్ ఈద్గా వద్ద భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థన చేస్తున్న దృశ్యమిది. (ఇన్సెట్లో) పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో కడప ఎమ్మెల్యే అంజద్‌బాష, మాజీ మంత్రి అహ్మదుల్లా, అమీర్‌బాబు, సుభాన్‌బాష, షఫీ తదితరులు కడప కల్చరల్ : ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు శనివారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు మధ్యాహ్నం 11.30 గంటల వరకు కొనసాగాయి. కొందరు మసీదులలో ప్రార్థనలు చేయగా, ఎక్కువ శాతం మంది సమీపంలోని ఈద్గాలలో సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. పులివెందుల, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరం బిల్టప్ ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మత గురువు ముఫ్తీ న్యామతుల్లా పండుగ సందేశాన్ని అందజేశారు. ఈ పండుగ.. దైవం మానవులకు అందించిన గొప్ప వరమని, ఈ సందర్భంగా అల్లాహ్ సూచించిన మార్గాన్ని జీవితాంతం కొనసాగించాలని సూచించారు. మనం చేసే కార్యక్రమాల్లో అడుగడుగునా అల్లాహ్ తోడుండాలని కోరాలన్నారు. జీవితాంతం ఉత్తమ మార్గంలో పయనించేందుకు ఆయన నుంచి శక్తిని కోరుదామన్నారు. చాలా మంది ఈ ప్రపంచం తమదేనని గర్వం వ్యక్తం చేస్తున్నారని, నిజానికి ఒక్క అడుగు స్థలాన్ని కూడా తీసుకు వెళ్లలేరని ఆయన గుర్తు చేశారు. మానవుడిలోని చైతన్యం పూర్తిగా అల్లాహ్ దయ మాత్రమేనని తెలుసుకోవాలన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ భక్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్బంగా ఆయన ఆశీస్సులు అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రాంగణంలో ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఘనంగా ఏర్పాట్లు ఎండ ఇబ్బంది ఉండకూడదన్న భావంతో కార్యక్రమ నిర్వాహకులైన జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు బిల్టప్ ఈద్గా మైదానంలో పూర్తిగా షామియానా వేశారు. మంచి నీటికి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ను ముందే మళ్లించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగలేదు. పోలీసు సిబ్బంది అడుగడుగునా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎస్ఎండీ అహ్మదుల్లా, ఎమ్మెల్యే అంజద్‌బాష, ఆయన సోదరుడు అహ్మద్‌బాష, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, అమీర్‌బాబు, జిలానీబాష, సంఘ సేవకులు సలావుద్దీన్, సుభాన్‌బాష, దుర్గాప్రసాద్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌అలీ, షఫీ, దర్గా ప్రతినిదులు నయీం, అమీర్‌తోపాటు నగరానికి చెందిన ముస్లింలు పాల్గొన్నారు. -
వానరానికి సమాధి
పెద్దమండ్యం : పాపేపల్లెలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వానరానికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. సమాధి నిర్మించి పూజలు చేశారు. పది రోజుల క్రితం పాపేపల్లెకు సమీపంలో ఉన్న వానరాల గుంపులో ఒకటి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. అక్కడే కిందపడిపోయి మృతి చెందింది. గ్రామస్తులు చందాలేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం సమాధి నిర్మిం చారు. శనివారం వానర సమాధి వద్ద పల్లె ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. -
ఘనంగా రమజాన్
ఈద్గాలు, మసీదుల వద్ద లక్షలాది మంది ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు సాక్షి, హైదరాబాద్: నగరంలో రమజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. లక్షలాది మంది ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీరాలం ఈద్గా, చార్మినార్ మక్కామసీదు, అంబర్పేట్, మాసాబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీంతో పలు మార్గాల్లో పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రమజాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
పోటెత్తిన భక్త జనం
రాజమహేంద్రికి ఆధ్యాత్మిక శోభ తొలిరోజు కిక్కిరిసిన ఘాట్లు రాజమండ్రి: ఎటుచూసినా భక్తజన సందోహమే.. రహదారులన్నీ జన గోదారులను తలపించాయి. గోదారమ్మను చూడాలి.. పుష్కర స్నానమాచరించి పాపవిమోచనం పొందాలని కోరుకుంటూ లక్షలాదిగా భక్తులు మంగళవారం రాజమహేంద్రికి పోటెత్తారు. గోదావరి పుష్కరాలు ఆరంభం కావడంతో ఈ చారిత్రక నగరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. సోమవారం అర్ధరాత్రి నుంచే తరలివచ్చిన జనవాహినితో రాజమహేంద్రి పులకించిపోయింది. ఒకవైపు లక్షలాదిగా భక్తజనం, మరోవైపు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వీఐపీలు.. తొలి రోజు పుష్కర స్నానమాచరించారు. వాస్తవానికి పుష్కర ఘడియలు ప్రారంభం కాకముందే వేకువజామున మూడు గంటల నుంచే పుష్కర స్నానాలు మొదలయ్యాయి. ఇక పుష్కర ఘడియలు ఆరంభమైనప్పటి నుంచి మంగళవారం రాత్రి వరకూ రాజమండ్రిలో లక్షలాదిగా భక్తజనం పుష్కర స్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. జయేంద్ర సర స్వతి పూజలు పుష్కరాలను అధికారికంగా ప్రారంభించేందుకు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పుష్కర క్రతువులన్నీ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సరిగ్గా 6.26 గంటలకు శిష్యబృందంతో ఘాట్‌లో అడుగుపెట్టిన స్వామీజీ తొలుత మట్టి తీసి నదిలో వేసి ఆ తర్వాత పుష్కర స్నానమాచరించారు. తొలుత తూర్పు దిశగా తిరిగి.. తర్వాత ఉత్తరం వైపు తిరిగి పుష్కర స్నానం చేశారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. పితృదేవతలకు చంద్రబాబు పిండప్రదానం జయేంద్ర సరస్వతితోపాటు ఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘడియల్లోనే కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ మరో కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఆమె తనయుడు శ్రీనివాస్, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి భార్య ఇందిర, చంద్రబాబు సోదరి హైమావతితోపాటు మరో 10 మంది బంధువులు పుష్కర స్నానం చేశారు. అనంతరం తల్లిదండ్రులు, అత్తమామలతోపాటు ఇతర పితృదేవతలకు చంద్రబాబు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. అనంతరం గోదానం చేశారు. ఈ కార్యక్రమం పుష్కర ఘాట్‌లో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆవిష్కరించిన శ్రీకృష్ణుని అవతారంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక జరిగింది. వీఐపీ ఘాట్ అయిన సరస్వతి ఘాట్‌కు ప్రముఖుల తాకిడి తెల్లవారుజాము నుంచే మొదలైంది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్రావ్ భగవత్ మధ్యాహ్నం 2 గంటలకు స్నానమాచరించారు. చంద్రబాబు ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు శివశంకర్, సుబ్బారావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితరులు పుష్కర స్నానమాచరించారు. స్తంభించిన రాజమహేంద్రి నాయకుల హడావుడి, పోలీసుల నిర్లక్ష్యం ఫలితంగా పుష్కర రాజధాని రాజమండ్రిలో మంగళవారం జనజీవనం స్తంభించింది. పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరగడంతో పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై మధ్యాహ్నం నుంచి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు, రాజమండ్రివాసులు నరకం అనుభవించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి, కొవ్వూరు, కాకినాడ, రామచంద్రపురంవైపు నుంచి వచ్చే భక్తుల బస్సులు, ప్రైవేట్ వాహనాలను శివార్లలోనే ఆపేయాలని పోలీసులు ప్రణాళిక రూపొందించారు. అయితే చాలామంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ తమ వాహనాల్లో రాజమండ్రికి వచ్చేస్తున్నారు. మంత్రుల కాన్వాయ్‌లు, టీడీపీ నేతల కార్లు, అధికారుల వాహనాలతో రాజమండ్రి కిక్కిరిసిపోయింది. పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట తర్వాత పోలీసులు ఒక్కసారిగా ఆంక్షలను కఠినతరం చేశారు. 16వ నంబరు జాతీయ రహదారిపై నుంచి రాజమండ్రిలోకి వాహనాలు రాకుండా నిలిపేశారు. దీంతో లాలాచెరువు నుంచి మోరంపూడి సెంటర్ వరకూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విజయవాడ-విశాఖ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
కాళేశ్వరంలో ఈటల పూజలు
మహదేవపూర్ : కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆలయంలో అర్చన చేశారు. అనంతరం ఆయనకు అర్చకులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్, ఈవోలు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి చిత్రపఠాన్ని అందించారు. అంతకుముందు మంత్రి కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో ఎస్టీ కాలనీ రోడ్డు, రూ.40 లక్షలతో వీఐపీ ఘాట్‌రోడ్డు, రూ.40 లక్షలతో 108 లింగాల రోడ్డు, పూస్కుపల్లిలో రూ.40 లక్షలతో గోదావరి వరకు వరకు నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శివుని విగ్రహాలను ఆవిష్కరించారు. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మహదేవపూర్ జెడ్పీటీసీ, ఎంపీపీలు హసీనాభాను, వసంత, కాళేశ్వరం సర్పంచ్ మెంగాని మాధవి, ఆలయ చైర్మన్ మోహనశర్మ, ఈవో హరిప్రకాశ్, సభ్యులు అడుప సమ్మయ్య, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు భద్రాచలంలో ప్రత్యేక పూజలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరగున్నాయి. అధిక ఆషాడమాసోత్సవాల్లో భాగంగాశుక్రవారం చిత్త నక్షత్రం సందర్భంగా యాగశాలలో స్వామి వారికి సుదర్శన స్నపనం, సుదర్శన జపం, సుదర్శన అష్టోత్తర శతనామార్చన, మహా పూర్ణాహుతి, నివేదన చేయనున్నట్టు దేవస్థానం ఈవో జ్యోతి తెలిపారు. అలాగే, శుక్రవారం ఉదయం లక్ష్మీ తాయారు అమ్మవారికి అభిషేకం, సాయంత్రం అద్దాల మంటపంలో సీతారాములకు బంతులాట నిర్వహించనున్నట్టు చెప్పారు. -
కేతకిలో సినీ ప్రముఖుల సందడి
మెదక్ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కేతకి సంగమేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన నిర్మాత శివకుమార్ మల్కపురం, ప్రముఖ దర్శకుడు దశరథ్‌లకు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు.వారు గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం : కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాత శివకుమార్, దర్శకుడు దశరథ్‌లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వచ్చే నెలలో మంచు మనోజ్, రేజీనా హీరో హీరోయిన్లుగా సురక్ష బ్యానర్‌పై సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి సినిమా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
వైభవంగా రామయ్యకు పర్యంకోత్సవం
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పర్యంకోత్సవం(16 రోజుల పండుగ) ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణం తర్వాత పదహారో రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎడబాటు ఉత్సవం అని కూడా పేరు. పర్యంకోత్సవంలో భాగంగా స్వామి వారికి అభిషేకం జరిపించారు. ఉత్సవ పెరుమాళ్లను బేడా మండపం పైకి తీసుకొచ్చి నూతన పర్యంకోత్సవ కర్మాంగ స్నపనం చేశారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. పుణ్య జలాలను స్వామి వారి మూలవరుల వద్దకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. వారితో బేడామండపంలోని ఉత్సవ పెరుమాళ్లకు అభిషేకం జరిపించారు. యాగశాలలో హోమం నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై తిరువీధి సేవ నిర్వహించారు. -
అంతా రామమయం..
రాజంపేట/ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. భక్తుల రామ నామ స్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు డిప్యూటీ సీఎంకు అలయంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆయనకు కోదండరాముని చిత్రపటాన్ని అందజేశారు. తొలిసారిగా అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్న కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో శనివారం శ్రీరామ, పోతన జయంతిని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, కలెక్టరు కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్పిళ్లై పర్యవేక్షణలో ఆలయంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనువాస్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, పసుపులేటి బ్రహ్మయ్య, విజయమ్మ తదితరులు శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. రూ.25 కోట్లతో రామాలయాభివృద్ధి రూ.25 కోట్లతో ఒంటిమిట్ట రామాలయాన్ని తొలి దశలో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల స్థాయిలో ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రభుత్వ లాంచనాలతో ఉత్సవాలు నిర్విహ స్తుండటం వల్ల ఒంటిమిట్ట ఆలయానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. ఈ జిల్లా అంటే సీఎంకు ప్రేమాభిమానం ఉందన్నారు. తిరుమల నుంచి దేవుని కడప వరకు ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదండ రామున్ని వేడుకున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో భక్తులు ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద బస చేసేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు రప్పించే కార్యక్రమానికి 2వ తే దీన శిలాఫలకం ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు. సామాన్య భక్తులకు తప్పని ఇక్కట్లు శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వీఐపీల తాకిడి అధికమైంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రి కామినేనితోపాటు అధికార పార్టీకి చెందిన నేతలు అధిక సంఖ్యలో రావడంతో గర్భగుడి వద్ద తోపులాట చోటు చేసుకుంది. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోయారు. ఆలయం లోపల పలువురు రాజకీయ నేతలు ఎవరంతకు వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక దశలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను సైతం లెక్కచేయని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయానికి తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంతో వేలాదిగా వచ్చే భక్తులకు ఏ విధంగా స్వామి వారి దర్శనం కల్పించాలనే విషయంలో నిర్వహణ లోపం కొట్టిచ్చినట్లు కన్పించింది. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పోలీసులు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. క్యూ సిస్టమ్ సరిగా లేదని, స్వామిని కనులారా దర్శించుకునే భాగ్యం కల్పించాలని సామాన్య భక్తులు కోరుతున్నారు. ఆలయం వెలుపల, లోపల అసౌకర్యంగా క్యూలు ఏర్పాటు చేశారు. గర్భగుడి ఆలయం ప్రధాన ముఖ ద్వారం వద్ద నుంచి (పైకి)క్యూ లోపలికి వెళుతుంది. అక్కడే భక్తులు పడరాని కష్టాలు పడ్డారు. ఎర్రని ఎండకు పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రముఖులు వచ్చిన సందర్భంలో కూడా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం భాగ్యం కలిగించే దిశగా దేవదాయ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంది. భక్తులు పాద రక్షలు బయట వదిలి పెట్టేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. ఆలయ మండపం వద్ద కాకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. ప్రసాద వితరణ చేస్తే బావుంటుంది. 2వ తేదీ కల్యాణోత్సవం నాటికైనా ఈ లోపాలను అధిగమిస్తే బావుంటుందని భక్తులు పేర్కొంటున్నారు. -
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ రాముడు
ఒంటిమిట్ట: వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామునికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామనవమి, పోతన జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. మూలవిరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ధ్వజస్తంభ ప్రాంగణంలో సీతా రామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. కేఈ ఉదయం కడపలో మాట్లాడుతూ ఒంటిమిట్ట అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలని కోరుతున్నానన్నారు. -
వైభవోపేతంగా ధ్వజారోహణం
-
ఫిల్మీ దునియా
వెండి తెర ఇలవేల్పులు ఇలలో కనిపిస్తే... సగటు అభిమాని ‘కలయా నిజమా’ అంటూ ఓ సాంగేసుకోకుండా ఉంటాడా! ఇక మనం నిత్యం తిరిగే సెంటర్లలో సడన్‌గా ఎంట్రీ ఇస్తే... షాకవ్వకుండా ఉంటామా! కానీ... గణపతి కాంప్లెక్స్, కృష్ణానగర్ గ్రీన్ బావర్చి, మంగ, పూర్ణ టిఫిన్ సెంటర్లు, ఫిలింనగర్ సొసైటీ కాంప్లెక్స్... ఈ ఏరియాల్లో తారల తళుకులు క్వైట్ కామన్! సినీ జనం తిరిగే హాట్ సెంటర్స్! ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్ (ఫిలిం చాంబర్)కు వెళితే... అక్కడ వెండి తెర నుంచి బుల్లి తెర వరకు ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలతో పాటు ఫిలిం సొసైటీలో ఓ ప్రివ్యూ థియేటర్ కూడా ఉంది. తెలుగు నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటివెన్నో ఇక్కడ కొలువుదీరాయి. దీంతో హీరోలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు... ఒకరేమిటీ అంతా ఎప్పుడో అప్పుడు విజిట్ చేస్తూనే ఉంటారు. అన్నీ అక్కడక్కడే... ఫిలింనగర్ సొసైటీ దగ్గరలో వెంకటేష్, మోహన్‌బాబు, మురళీమోహన్, గుమ్మడి తదితర ప్రముఖ నటుల ఇళ్లు ఉన్నాయి. సందర్శనకు వచ్చే అభిమానులు వారి ఇళ్లను చూసి సంబరపడిపోతుంటారు. దగ్గరలోనే రామానాయుడు స్టూడియో. ఇక్కడ షూటింగ్‌లకు నిత్యం అనేక మంది ప్రముఖులు ఈ ప్రధాన రహదారి గుండానే వెళ్తుంటారు. అంతేకాదు.. అనేక మంది నిర్మాతలు, ప్రముఖుల ఇళ్లు దగ్గర్లోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ సినీ జనం కనిపించడం సర్వసాధారణం. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు వీరిని చూసి మురిసిపోతుంటారు. వీలైతే ఓ సెల్ఫీ దిగి... తమ వారికి మురిపెంగా చూపించుకుంటుంటారు. సెలబ్రిటీ టెంపుల్ ఫిలింనగర్ సొసైటీ దైవ సన్నిధానం ఒక ప్రత్యేకమైన దేవాలయం. ఇందులో దాదాపు పద్దెనిమిది దేవతామూర్తులు కొలువై ఉన్నారు. సాధారణ భక్తులతో పాటు సినీ ప్రముఖులూ ఇక్కడకు వచ్చి వెళుతుంటారు. ప్రత్యేక పూజలు జరిపిస్తుంటారు. ఏవన్నా పండగలైతే... మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర తారలు మొదలు అంతా ఒకేసారి బయటకు వస్తారు. చోటామోటా... ఇక జూనియర్ ఆర్టిస్టులు, ఫైట్ మాస్టర్లు, డ్యాన్సర్ల వంటి వారెందరికో అడ్డా కృష్ణానగర్, ఇందిరానగర్‌లు. ఇక్కడి గ్రీన్ బావర్చీ, పూర్ణా చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతా వారే కనిపిస్తుంటారు. ఎవర్ని చూసినా... ఎక్కడో చూసిన అనుభూతి కలుగుతుంది. - సత్య/ శ్రీనగర్ కాలనీ -
మనలోనే ఈశ్వరుడున్నాడు..
భక్తులకు పూలాజీ బాబా హితబోధ జైనూర్ : అనంత విశ్వంలో మనమున్నాం.. మనలో విశ్వరూపం దాగి ఉంది.. అదే ఈశ్వర రూపం.. అని సద్గురు పరమహంస పూలాజీ బాబా భక్తులను ఉద్దేశించి హితబోధ చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని పట్నాపూర్ సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై పులాజీ బాబా ఆశీస్సులు పొందారు. మాజీ ఎంపీ రాథోడ్మ్రేశ్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబా ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ధ్యాన కేంద్రంలో భక్తులను ఉద్దేశించి బాబా హితబోధ చేశారు. ప్రతీ ఒక్కరు సన్మార్గంలో నడవాలని, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తే సుఖ జీవితాన్ని అనుభవించవచ్చని వివరించారు. చెడు అలవాట్లు విడనాడినప్పుడే కుటుంబాల్లో సుఖ సంతోషాలు వస్తాయని అన్నారు. స్వార్థ ఆలోచన వీడాలని నిస్వార్థంతో మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు అవుతుందని తెలిపారు. సిద్ధేశ్వర ట్రస్టు డెరైక్టర్ రితీశ్ రాథోడ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మౌళిక సౌకర్యాలు కల్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మాజీ సర్పంచ్ దేవురావు, ఆలయ కమిటీ సభ్యులు ఇంగ్లే కేషవ్, రామారావు, సీఐ రవి, ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర : బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం సప్తమి తిథి, స్వాతి నక్షత్ర మూహుర్తం కలిసి రావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు 3 గంటల పాటు క్యూలైన్లో వేచి ఉన్నారు. అనంతరం ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో అక్షరస్వీకారం, కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. సుమారు 20వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రూ.5.50లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. భక్తులకు తప్పని తిప్పలు ఊహించని రీతిలో భక్తులు ఒకరోజు ముందుగానే ఆలయానికి చేరుకున్నారు. దీంతో భక్తులకు ఆలయంలో సరిపడ అతిథి గృహాలు దొరకకపోవడంతో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రైవేటు అతిథి గృహాలను అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్మవారి దర్శనం కోసం చిన్నారులతో సహా వృద్ధులు క్యూలైన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది భక్తులకు కనీసం మంచి నీరు కూడా అందించలేకపోయారు. అమ్మవారి సేవలో ప్రముఖులు బాసర సరస్వతి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీనటుడు ఆర్యన్ రాజేశ్ కుటుంబ సభ్యులు, నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వైఆర్ అరగోపాల్‌రెడ్డి, ఉస్మానియ యూనివర్సిటీ డిపా ర్డుమెంట్ ఆఫ్ లా ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. -
7న అజ్మీర్‌కు డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఈ నెల 7న అజ్మీర్ వెళ్లనున్నారు. కొత్తగా ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పాటైన సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించి మొక్కుతీర్చుకుంటారు. అనంతరం రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింధియాతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి అజ్మీర్‌కు వచ్చే యాత్రికుల వసతి కోసం దర్గా సమీపంలో ప్రత్యేకంగా విశ్రాంతి భవనం నిర్మాణానికి రెండెకరాల భూమి కేటాయింపుకోసం చర్చిస్తారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ రాసిన లేఖను వసుంధరకు అందజేస్తారు. అదేవిధంగా రాజస్థాన్‌లో మైనార్టీ సంక్షేమం, వక్ఫ్‌బోర్డు తదితర సంస్థల పని తీరును పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి న్యూ ఢిల్లీ వెళ్లి ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు. హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీ ఏర్పాటు, హైదరాబాద్ పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు, త్వరగా వక్ఫ్‌బోర్డు విభజన, వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు తదితర అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు. 11న ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
సూర్యదేవాయ నమః
శ్రీశైలం: రథసప్తమి సందర్భంగా సోమవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ప్రత్యేకపూజలలో ఈవో సాగర్‌బాబు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా వైదిక పండితులు సూర్యయంత్రాన్ని లిఖించి పూజాధికాలకు సంబంధించిన సంకల్పం చెప్పారు. సూర్యదేవుడి అనుగ్రహంతో జనులందరికీ ఆరోగ్యం చేకూరాలని, అకాలమత్యువు రాకుండా అందరికి దీర్ఘాయువును ఉండాలని సంకల్పంలో చెప్పారు. అనంతరం కలశస్థాపన చేసి మహాగణపతిపూజ, వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతో ప్రత్యేక ముంద్రలతోనూ సూర్యనమస్కారాలు చేశారు. ఆ తరువాత అరుణ పారాయణలు, షోడశ ఉపచారాలు, వేదపారాయణలు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించిన అనంతరం సూర్యదేవుడికి నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులందరిపై సూర్యాభిషేక జలాన్ని ప్రోక్షించి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తజనసాగరం.. ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రం సోమవారం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. ఆదివారం సెలవుదినంతో పాటు సోమవారం రథసప్తమి, గణతంత్ర దినోత్సవం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. దాదాపు 80వేలకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయపూజావేళల్లో మార్పులు చేసి 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలను ప్రారంభించేలా ఈఓ సాగర్‌బాబు చర్యలు తీసుకున్నారు. -
ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు
రాయచూరు/బళ్లారి అర్బన్: ఈద్ మిలాద్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన రాయచూరులో మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని షరాఫ్ బజార్, పరకోట, ఖాదర్ గుండ, ఎల్బీఎస్ నగర్, షియా తలాబ్, అరబ్ మొహల్లా నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ మిలాద్ నబీ ర్యాలీలతో తీనకందిల్ వద్దకు చేర్చారు. 3 గంటలకు తీన్‌కందిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏక్ మినార్, జైలు, నగర సభ, టిప్పూ సుల్తాన్ రోడ్డు, జిల్లాధికారి కార్యాలయం, ఈద్గా మైదానం వరకు నిర్వహించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు భోసురాజు, మాజీ ఎమ్మెల్యే యాసిన్, కాడా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వసంత్‌కుమార్, డాక్టర్ తాజుద్దీన్, ఇతర నేతలు పాల్గొని అభినందనలు తెలిపారు ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకలను పురస్కరించుకొని బళ్లారిలో భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ, ఉసేన్‌నగర్ మసీద్ సంస్థ, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 19వ వార్డులోని ఉసేన్‌నగర్ మసీదు ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వి మ్స్ డెరైక్టర్ డాక్టర్ వీ.శ్రీనివాస్ శిబి రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తం తయారు చేయలేమని, మనమే రక్తదా నం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నా రు. 50 మంది రక్తదానం చేసినట్లు తెలి పారు. అనంతరం భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు టీ.అల్లాబకాష్ ఈద్ మిలాద్ శోభయాత్రను ప్రారంభించగా నగర వీధుల గుండా ఊరేగింపు సాగింది. స్పందన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బీ.దేవణ్ణ, ఐఆర్సీఎస్ జిల్లా కార్యదర్శి, హోంగార్డ్స్ కమాండెంట్స్ షకీబ్, హాజీ అబ్దుల్ సత్తార్‌సాబ్, విమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. కంప్లి : ఈద్ మిలాదున్నబి వేడుకలు కంప్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జోగి కాలువ వద్ద గల బడేసా ఖాద్రి దర్గా నుంచి మక్కా మసీదు చిత్రపటంతో నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగగా దర్గాకు చేరుకున్నారు. మతగురువు సయ్యద్ అబుల్ హసన్ ఖాద్రి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఖాద్రి పాల్గొన్నారు. సింధనూరు టౌన్: పట్టణంలో ఆదివారం మిలాదున్న బి వేడుకలు ఘనంగా జరిగాయి. మక్కా, మదినాల స్తంభం నమూనాలను కుష్టగి రోడ్డు, టిప్పుసుల్తాన్ సర్కిల్, కిత్తూరు రాణి చెన్నమ్మ సర్కిల్ మీదుగా ఊరేగించారు. ఖలందరియా కమిటీ, రోషన్ కమిటీ, టిప్పు సుల్తాన్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. సింధనూరు తా లూకాలోని హుడా గ్రామంలో ఆదివారం ఆద్ మిలాద్ పండుగను జరుపుకున్నారు. అనంతరం ముస్లింలు ఊరేగింపు నిర్వహించి ప్రార్థన నిర్వహిం చారు. బళగానూరు గ్రామంలో కూడా షా జామియా మసీద్ సన్నిధిలో ఎస్.శెక్షావలి నేతృత్వంలో శనివారం రాత్రి జాగరణ చేపట్టి ప్రార్థనలు నిర్వహించారు. హొస్పేట : నగరంలో ఆదివారం ఈద్ మిలాద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఐఎస్ఆర్ రహదారి ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ప్రముఖ వీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. -
గెలిపిస్తే రాష్ట్రానికి, కేంద్రానికి వారధిగా పని చేస్తాం
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పర్వతగిరి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి మధ్య వారధిగా ఉండి అధిక నిధులు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని బీజేపీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రాజేశ్వర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని లయోల హైస్కూల్లో జీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్‌రావుతోపాటు పార్టీ రాష్ట్ర నాయకులు మహిపాల్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావు మాట్లాడారు. రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ మూడు జిల్లాల్లో 10 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారని, వారు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని వాపోయూరు. 25 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను సమర్ధవంతంగా చేపడుతున్న విద్యావేత్త, మానవతావాది వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావుకు పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణతోపాటు వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. స్వగ్రామం నుంచి ప్రచారం ప్రారంభించిన రాంమోహన్‌రావు వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టాభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావు తన స్వగ్రామం కల్లెడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత తాను నెలకొల్పిన శ్రీకొలను వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్లెడలోని ఆర్డీఎఫ్ పాఠశాల, కళాశాలలో ప్రారంభించారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులతో మాట్లాడి మొదటి ప్రాధాన్య ఓటు బీజేపీకి వచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలిసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాంచందర్‌రావు, జయపాల్‌రెడ్డి, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజలింగంగౌడ్, మండ ల అధ్యక్షుడు శ్రీధర్, సాంబయ్య యాదవ్, దేవేందర్, బాసాని సారంగపాణి,టీడీపీ నాయకుడులు దామోదర్, జడల కృష్ణ పాల్గొన్నారు. -
ముక్కోటి.. జనకోటి
-
క్రీస్తు జననం.. లోకానికి వరం
క్రిస్మస్ పర్వదిన వేడుకలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. లోక రక్షకుడి రాకను సూచిస్తూ బుధవారం అర్ధరాత్రి క్రైస్తవ ప్రధాన గురువులు, బిషప్‌లు, ఫాదర్లు, ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకానికి క్రీస్తు రాకలోని ఆంతర్యాన్ని వివరించారు. అనంతరం క్రిస్మస్ కే క్‌ను పంచి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి తిరిగి ప్రార్థనా కార్యక్రమాలను ప్రారంభించారు. కడప నగర ఆరోగ్యమాత చర్చిలో ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. మేత్రాసన బిషప్ డాక్టర్ గల్లెల ప్రసాద్ దైవ సందేశం ఇచ్చారు. సీఎస్ఐ సెంట్రల్ చర్చిలో మాజీ బిషప్ ఏసు వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వాక్య పరిచర్య చే శారు. ఫాస్ఱర్ బెన్హర్బాబు దైవ సందేశం ఇస్తూ లోకంలో అందరికి శాంతి, సమాధానాలు అందజేసిన క్రీస్తును అందరం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందన్నారు. స్థానిక క్రైస్ట్ చర్చిలో ఫాస్టర్ ముత్తయ్య దైవ వాక్యాన్ని వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు , ప్రార్థనాగీతాల ఆలాపన నిర్వహించారు. -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు మహబూబ్‌నగర్ కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏంబీసీ చర్చితో పాటు ఫాతిమానగర్, లూర్దునగర్, శాంతినగర్ , వెలగొండకాలనీలో క్రి స్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తుమహిమలను పాటల ద్వారా కొనియాడారు. అంతకుముందు వారం రోజులుగా క్రీస్తు జనాన్ని సూచిస్తూ క్రిస్మస్ ట్రీ, స్టార్లన ప్రత్యేకంగా అలంకరించారు. ప్రార్థనల అనంతరం అన్ని మతాల వారు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం అన్నదానం, వస్త్రదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చీ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. సికింద్రాబాద్‌కు చెందిన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆక్సిలరీ సెక్రటరీ రెవరెండ్ బి.రాజశేఖర్ ముఖ్య ప్రసంగీకుడిగా హాజరై విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న స్థానిక ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలు క్రీస్తుమార్గంలో నడవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ కృష్ణమూర్తి, డీసీసీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, వైఎస్ఆర్ సీపీ జిల్లా నేతలు జెట్టి రాజశేఖర్, హైదర్అలీ, కోస్గి నసీర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డి పట్టణ ప్రముఖులు, వి.మనోహర్‌రెడ్డి, సీజే బెనహర్, సయ్యద్ ఇబ్రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు. తనకు హానిచేసిన వారిని కూడా ప్రేమించమని చెప్పిన క్రీస్తు బోధనలు పాటిస్తే సమాజంలో శాంతి నెలకొంటుందని గద్వాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేడీకే అరుణ అన్నారు. గద్వాల పట్టణంలో ఎంబీ మిస్పా చర్చి, కర్మెలు ప్రార్థన మందిరాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. జడ్చర్లలోని గాంధీచౌరస్తాలో ఉన్న పెంథకోస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విద్యుత్‌శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సతీమణి డాక్టర్ శ్వేత పాల్గొన్నారు. క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తుమార్గం అనుసరణీయని అన్నారు. ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. వనపర్తిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవాళిని రక్షించేందుకు ఏసు జన్మించాడని, ఎన్నో కష్టాలు అనుభవించాడని అన్నారు. పీడనకు గురవుతున్న ప్రజలు బాగుపడాలని ప్రార్థనలు చేయాలని కోరారు. కొత్తకోటలో నిర్వహించిన వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచ రణీయమన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
నేడు క్రిస్మస్
టీనగర్: యేసుక్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్ పండుగను నేడు క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ ఆలయాల్లో బుధవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రీస్తు పుట్టుక గురించి మత బోధకులు సందేశాలను అందించారు. అదేవిధంగా భక్తులకు మతబోధకులు ఆశీస్సులను అందజే శారు. ఇందులో భాగంగా క్రిస్మస్ వేడుకలకు నగరం ముస్తాబైంది. నగరంలోని టీనగర్, మైలాపూరు, ప్యారిస్, పెరంబూరు, శాంతోమ్, సెంట్ థామస్ మౌంట్, ఎగ్మూరు, తిరువాన్మియూరు, అడయారు, అన్నానగర్, తాంబరం, వలసరవాక్కం, వ్యాసర్పాడి, కొడుంగయూరు, మాధవరం తదితర ప్రాంతాలలోని చర్చిలు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు క్రిస్మస్ ప్రత్యేకతను వివరించే అలంకరణలు చేపట్టారు. యేసు క్రీస్తు పుట్టుకను తెలియపరిచే రీతిలో పశువుల పాకలను, వివిధ ఘట్టాలను అనేక మందిరాల్లో ఏర్పాటుచేశారు. చెన్నైలో ప్రత్యేక ప్రార్థనల కోసం కాథలిక్, సీఎస్ఐ, ఈఎస్ఐ, బాప్టిస్ట్, టీఇఎల్‌సి తదితర ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. శాంతాక్లాస్ వేషధారణలతో పలువురు భక్తులను అలరించారు. అనేక మంది భక్తులు బృందాలుగా విడిపోయి వీధుల్లో క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ప్రార్థనలు ముగిసిన వెంటనే భక్తులు ఒకరికొకరు మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అనేక ఆలయాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. రాత్రంతా నగర వ్యాప్తంగా పోలీసు గస్తీ తిరగాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
క్రిస్మస్ శోభ
క్రీస్తు జననం...లోకానికి శుభదినం. లోకరక్షకుడి పుట్టిన రోజైన క్రిస్మస్ పండగను దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని చర్చిలు విద్యుద్దీపకాంతులతో మెరిశాయి. గురువారం ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. ఇళ్లనూ విద్యుద్దీపాలతో అలంకరించుకున్నారు. స్టార్లు, ట్రీలతో కళకళలాడుతున్నాయి. పాఠశాలల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేరీమాత, జీసస్, శాంతాక్లాజ్ వేషధారణలతో పిల్లలు అలరించారు. - విశాఖపట్నం -
దర్గా ఉత్సవాలు ప్రారంభం
హాజరైన స్పీకర్ సిరికొండ పరకాల రూరల్ : హజ్రత్ సయ్యద్ బిస్మిల్లాషావళి దర్గా ఉత్సవాలను ముస్లింలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతులు మహ్మద్‌షఫీ, అహ్మద్‌షా ఖాద్రి, ఉపపీఠాధిపతులు ఇమ్రాన్ రజాఖాద్రి ఇంటి నుంచి 27 దర్గాలకు చెందిన జెండాలతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ గంధం పీఠాన్ని స్పీకర్ తలపై పెట్టుకొని పట్టణంలోని దర్గాకు చేరుకున్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, దర్గా గౌరవ అధ్యక్షుడు జాఫర్‌రిజ్వీ, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎంపీ అహ్మద్, వరంగల్ ఆర్డీఓ సురేంద్రకరణ్, పాడి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి పాల్గొన్నారు. పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం రేగొండ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఓ శుభకార్యానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 23న చెంచుకాలనీలో మెగా దంత, ఆరోగ్య శిబిరం నిర్వహించడానికి బ్రైట్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. వారే ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు. ఆయన వెంట నాయకులు పున్నం రవి, మోడెం ఉమేష్‌గౌడ్, మైస బిక్షపతి, కోలుగురి రాజేశ్వర్‌రావు, గోగుల అశోకరెడ్డి, తడుక శ్రీనివాస్ ఉన్నారు. -
కోరిన కోరికలు తీర్చే కోతిదేవుడు
లక్ష్మణచాంద :మండలంలోని పీచర-ధర్మారం గ్రామాల మధ్య గల కోతిదేవుని ఆలయ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. శనివారం వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కోరిన కోరికలు తీర్చే కోతిదేవుని జాతరను ఏటా డిసెంబర్ 18,19,20 తేదీల్లో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. రెండో రోజు జాతర, అన్నదానం, రథోత్సవం నిర్వహిస్తారు. మూడో రోజు ప్రత్యేక పూజలతోపాటు రథోత్సవం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటుసాగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులుపెద్ద మొత్తంలో తరలివస్తారు. ఇది ఆలయ చరిత్ర ఇంతటి ప్రాశస్యం కలిగి..వేలాది మంది భక్తుల రాకతో కలకలలాడే ఈ ఆలయంలో ఉన్నది కోతిదేవుడే. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం, పీచర గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు గ్రామాల్లోకి ఓ కోతి వచ్చింది. ఆ కోతి క్రమంగా ఇళ్ల మధ్య తిరుగుతూ గ్రామస్తులు పెట్టింది తింటూ, ఇరు గ్రామాల మధ్యలోని ఓ ప్రదేశంలో పడుకునేది. అలా కోతి గ్రామంలోని ప్రజలకు సై తం చేరువైంది. ప్రతీ రోజు గ్రామంలోని ఓ హోటల్ వద్దకు రాగా ఆ హోటల్ యజమాని దానికి టీ పోసేవాడు. ఇలా క్రమంగా గ్రామస్తులకు చేరువై వారితో పాటు ఎండ్లబండ్లపై పంటపొలాలకు వెళ్లేది. ఇలా కొద్ది నెలల తర్వాత కోతి ఒకనాడు హోటల్ యజమాని కలలోకి వచ్చి, తాను రేపు మరణిస్తున్నానని, తనను రోజు పడుకునే ప్రదేశంలో సమాధి చే యాలని కోరింది. తెల్లవారి హోటల్ యజ మాని విషయం గ్రామస్తులకు చెప్పి కోతి నిద్రించే ప్రదేశంలోకి వెళ్లి చూడగా కోతి మృతి చెందివుంది. దీంతో గ్రామస్తులు ఆ కోతి నిద్రించే ప్రదేశంలోనే సంప్రదాయ బద్ధంగా కోతిని సమాధి చేశారు. అనంతరం ఆలయ నిర్మాణం గావించారు. ఏటా భక్తుల కోరికలు నెరవేరడంతో వేలాదిగా తరలివస్తున్నారు. కో తి దేవున్ని సాక్షత్తు ఆంజనేయస్వామిగా బా వించి ఇక్కడ పూజలు చేస్తారు. కోతిని సమా ది చేసిన రోజున ప్రతీ సంవత్సరం డిసెంబర్ 18,19,20 తేదీలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ శనివారం మండల నలుమూలల నుంచి భక్తులు పెద్ద మొత్తంలో తరలివ చ్చి పూజలు చేస్తారు. కాగా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు స్థానిక సర్పం చుతోపాటు ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ అంతరాలయూనికి ఆమెను తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామి విశిష్టతను వివరించారు. అనెవెట్టి మండపంలో ఆశీర్వదించారు. ఈమె వెంట వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరారుు కళావతి, నాయకులు మండవిల్లి రవి, శిమ్మ వెంకటరావు, విజయలక్ష్మి ఉన్నారు. -
ఆలయ పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి
నక్కపల్లి: సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు, ఉపమాక వచ్చారు. షిర్డీ సాయి ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఇదేరోజు చంద్రబాబునాయుడు జన్మనక్షత్రం కావడంతో బాబుగోత్రనామాలతో హోమాలు, పూజలు చేయించారు. గ్రామ ఉపసర్పంచ్ బివి రమేష్‌రాజు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని భువేనేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె ఉపమాక వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధానార్చకులు వరప్రసాద్ క్షేత్రమహత్యాన్ని వివరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమె పర్యటనలో అనకాపల్లి ఎంపీ ఎం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత,జడ్పి చైర్పర్సన్ లాలం భవానీ,ఎంపిపిలు వినోద్‌రాజు, లావణ్య, జిల్లాగ్రంధాలయసంస్ద మాజీ చైర్మన్ తోటనగేష్, పార్టీ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, రెడ్డిరామకృష్ణ, బాబ్జిరాజు, మీగడసత్తిబాబు, కురందాసు నూకరాజు, కానీనాయుడు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపిటీసి ఈశ్వరరావు,ఆర్డివో సూర్యారావు, ప్రత్యేకాధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చిత్రం విజయం సాధించాలని కోరుకున్నా
‘పిల్లా నువ్వులేని జీవితం’ హీరో సాయి ధర్మతేజ్ ద్వారకాతిరుమల : పిల్లా నువ్వులేని జీవితం చిత్రం విజయవంతం కావాలని చినవెంకన్నను కోరుకున్నట్టు వర్ధమాన సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ అన్నారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. శ్రీవారు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. అనంతరం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని వీఐపీ లాంజ్‌లో అభిమానులతో ఫొటోలు దిగారు. విలేకరులతో మాట్లాడుతూ ‘రేయ్’ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టినా, రెండో సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదట విడుదల కానుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాదిరిగానే తన రెండో సినిమా ముందు విడుదల కావడం యాధృచ్ఛికంగా భావిస్తున్నామన్నారు. ధర్మ తేజ్‌ను కలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు. -
గౌతమికి హారతి
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పుణ్యనదీ హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం గోదావరి నదీ తీరంలో జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి స్వామి వారి పాదుకలతో ముందు నడువగా, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి వెళ్లారు. వేద విద్యార్థుల మంత్రోచ్ఛరణలు, మహిళల కోలాటాలతో స్వామి వారి పాదుకలను ప్రత్యేక పల్లకిలో తీసుకెళ్లారు. ముందుగా స్నానఘట్టాల రేవులో ఉన్న గోదావరి మాత విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి ఒడ్డున ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపైకి స్వామి వారి పాదుకలను తీసుకెళ్లారు. వేద స్వస్తి చెప్పిన తరువాత ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదుకలకు పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి స్నాన, వస్త్ర, ఉత్తరీయాలను సమర్పించిన పిదప అభిషేకం గావించారు. గోదావరి నది విశిష్టతను, కార్తీక దీపాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి భక్తులకు వివరించారు. నది వృద్ధిని కోరుతూ హారతి ఇస్తారని, దీనికి ఎంతో విశిష్టత ఉందని చెప్పారు. భక్తజనంతోనే నదీ పూజ... వేడుకలో భాగంగా గోదావరి నదికి అత్యంత వైభవంగా అర్చకులు, వేదపండితులు పూజగావించారు. ముందుగా సకల జనులంతా బాగుండాలని కోరుతూ సంకల్పం చెప్పారు. దీనిని భక్తులందరిచేత కూడా చెప్పించి, వారిని కూడా నదీ పూజలో భాగస్వాములను చేశారు. పుష్పాలు, కుంకుమ, సుగంధ ద్ర వ్యాలు గోదావరి నదిలో వేస్తూ, దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత ‘భద్రాద్రి వరద గోవిందా’ అనే శ్లోకాన్ని భక్తులతో చెప్పించారు. గోదావరి నదీ అష్టోత్తర శతనామాచార్చన గావించారు. గోదావరి నదికి నివేదన జరుగుతున్నంత సేపూ నదీ వైభవాన్ని స్థలశాయి భక్తులకు వివరించారు. అమ్మవారికి తాంబాలాలను సమర్పించిన తర్వాత ముందుగా ఈవో కూరాకుల జ్యోతి దంపతులు గోదావరి నదికి హారతులు ఇచ్చారు. అనంతరం అర్చకులు ఐదు రకాల హారతులు ఇచ్చారు. ప్రణవ శంఖ నాదముల నడుమ మహాహారతి నేత్రపర్వంగా సాగింది. గోదారి తీరంలో దీపోత్సవ సందడి... నదీ హారతులు ఇచ్చిన సమయంలో భక్తులు కూడా గోదావరిలో కార్తీక దీపాలను వదిలేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. దేవస్థానం వారు భక్తులకు ముందుగానే అరిటి దొప్పలతో కూడిన ప్రమిదలను ఇవ్వటంతో వాటిని వెలిగించి గోదావరిలో విడిచారు. వేడుక జరుగుతున్నంత సేపూ గోదావరి తీరంలో బాణా సంచా వెలుగులు విరజిమ్మాయి. భద్రాచలానికి చెందిన చిన్నారులు అమరవాది శ్రీజ, కె.తన్మయి లయబద్ధంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ ఎస్సై మురళి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖాధికారి సురేష్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్ కుమార్ గోదావరి ఘాట్‌లో పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్ కుమార్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీఆర్వో సాయిబాబు, డీఈ రవీందర్, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
కార్తికం వనభోజనాల విశిష్ట మాసం
ఎవరి నోట విన్నా కేశవనామాలో, శివపంచాక్షరీ జపాలో... ఏ ఇంట చూసినా మనసును ఆనంద డోలికలలో నింపే పూజలు, కనువిందు చేసే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గంధమో, కుంకుమో, విభూదో లేదా ఈ మూడూనో అలంకరించుకుని ఆధ్యాత్మికతతో, అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తికమాసమే! అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైనా హరిహరసుతుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసమిది. వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, విష్ణుసహస్రనామ పారాయణలతో మార్మోగిపోతూ ఎంత నాస్తికుడికైనా ఆస్తికభావనలు కలుగ జేసే మాసం కార్తికమే. కార్తికమాసం స్నాన, దాన, జప, ఉపవాసాలకు, దీపారాధనలకు ఎంతో ప్రశస్తమైనదని పెద్దలు చెబుతారు. అలాగే తామస గుణాన్ని పెంపొందింప చేసే ఉల్లి, వెల్లుల్లి తదితర ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదని, మద్య మాంసాల ప్రసక్తి తీసుకు రాకూడదని, ద్రోహచింతన, పాపపుటాలోచనలు, దైవదూషణ పనికి రావని కార్తిక పురాణం చెబుతోంది. ఏడాది పొడుగూతా యథేచ్ఛగా ఉండే మనం ఈ ఒక్క మాసంలో అయినా అటువంటి వాటికి దూరంగా ఉంటే నష్టం లేదు కదా! వనసమారాధనతో విశిష్టఫలాలు కారుమబ్బులు కానరాని నిర్మలమైన నింగి... ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనాపుష్పాలతో నిండిన పూలమొక్కల మధ్యన విందుభోజనం చేయడం కార్తికమాసం ప్రత్యేకత. తిరుపతి వెంకన్న, సింహాద్రి అప్పన్న, శ్రీశైల మల్లికార్జునుడు, వేములవాడ రాజ రాజేశ్వరుడు, కొమురవెల్లి మల్లన్న, మంగళగిరి నరసింహ స్వామి, అన్నవరం సత్యదేవుడు వెలసింది వనాలలోనే! ఈ విశిష్ఠతను గుర్తు చేసేందుకే వనభోజనం చేయడం మంచిదన్నారు పెద్దలు. అంతేకాదు, భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్ల కింద విస్తట్లో జరిగే విందు. శాస్త్రాన్ని, పుణ్యఫలాలను కాసేపు పక్కన ఉంచి, లౌకికంగా ఆలోచించినా వనభోజనాలు ఎంతో హితకరమైనవి. ఎందుకంటే వనాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, కాంక్రీటు జనారణ్యాల్లోనూ, బహుళ అంతస్థుల భవనాలలోనూ చాలీ చాలని ఇరుకు గదుల్లోనూ మగ్గిపోయే పురజనులు అప్పుడప్పుడు అయినా వనాల్లోకి వచ్చి, అందరితోనూ కలసి అన్నీ మరచి హాయిగా భోజనం చేస్తే ఎంతో బాగుంటుంది కదా! మన ముందు తరాలవారు ప్రతి చిన్న అనారోగ్యాలకీ మందులు మింగించేవారు కాదు... అందుబాటులోనున్న ఏ ఆకు పసరునో పిండి, వ్రణాల మీద పోసేవారు, లేదంటే ఏ మూలికనో వాసన చూపించేవారు. ఏ చెట్టుబెరడుతోనో కాచిన కషాయం తాగించేవారు. వాటివల్ల ఏ దుష్ఫలితాలూ తలెత్తకుండా ఆయా రుగ్మతలు సహజంగానే తగ్గిపోయేవి. ఇప్పుడు ఆ సంస్కృతి దాదాపుగా అంతరించింది. కొన్ని రకాల మొక్కలు, వృక్షాలను కేవలం పుస్తకాలలోనో లేదంటే అంతర్జాలంలోనో చూసి ఆనంద పడటం తప్ప వాటిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందడం కష్టమైంది. అందుకోసమైనా సరే, ఈ మాసంలో పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లి, పెద్దలంతా వనభోజనాలు చేయండి. ఎందుకంటే వారికి మంచీ మర్యాదా, ప్రేమ, ఆప్యాయత, నలుగురిలో నడుచుకోవడం ఎలాగో, ఏయే పదార్థాలను ఎలా తినాలో మనం ప్రత్యేకంగా నేర్పకుండానే తెలుస్తాయి. ఇంతకీ వనభోజనాలు చేయమని పెద్దలు ఎందుకు చెప్పారంటే... పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని తెలియజేయడం కోసమే! ఈ అంతస్సూత్రాన్ని గ్రహించిన నాడు మనకు పెద్దలు ఏర్పరచిన ఆచారాలు, సంప్రదాయాల ప్రాధాన్యత తెలుసుకోగలుగుతాం. - డి.వి.ఆర్. -
వైభవంగా సదర్ ఉత్సవాలు
అలరించిన దున్నపోతుల విన్యాసాలు.. మహేశ్వరం: భిన్న స్కృతులు, విభిన్న ఆచారాలకు ఆలవాలమైన గ్రామాల్లో సదర్ ఉత్సవం ప్రత్యేకమైంది. సదర్‌ను తెలుగులో చెప్పాలంటే దున్నపోతుల పండుగ అంటారు. దీపావళి పండుగ తర్వాత రోజు జరిగేది దున్నపోతుల పండుగ. మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో సదర్ ఉత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా యాదవులు దున్నపోతులను రంగుల చెమ్కీలతో అలంకరించారు. గ్రామంలో గున్నాల యాదవ సంఘం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ గున్నాల చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దున్నపోతుల ఊరేగింపు నిర్వహించారు. యాదవులు దున్నపోతులకు ప్రత్యేక పూజలు చేశారు. యాదవులు ఒకే చోట చేరి తీన్మార్, డప్పు, దరువులు, డీజే స్టెప్లతో డ్యాన్సులు చేశారు. మధ్య మధ్యలోదున్నపోతుల విన్యాసాలు చూపరులను అలరించాయి. పెద్ద త్తున టపాసులు కాల్చి సందడి చేశారు. గ్రామంలో సర్దార్‌పటేల్ యూత్, నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో దున్నపోతులను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జే.లక్ష్మయ్య యాదవ్, ఎంపీటీసీలు లింగం సురేష్, మునగని రాజు, ఉప సర్పంచ్ బోద జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొనమోని మహిపాల్ ముదిరాజ్, రాగనమోని మహేందర్, గున్నాల రవీందర్ యాదవ్, గున్నాల పర్వతాలు యాదవ్, గున్నాల ఇబ్రాహీం యాదవ్, గున్నాల హరికిషన్ యాదవ్, వార్డు సభ్యులు పాండురంగారెడ్డి. పుంటికూర నవీన్‌రెడ్డి, లింగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంఖాల్‌లో.. మంఖాల్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను సుందరంగా అలంకరించి నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తెని కౌలస్య, ఉప సర్పంచ్ కప్పల సుందరయ్య, ఎంపీటీసీ మధు, కాంగ్రెస్ సినియర్ నాయకులు అత్తెని మహేందర్ యాదవ్,మాజీ ఎంపీటీసీ రాములు యాదవ్, యాదవ సంఘం నాయకులు అందెల రాజు, బండ ఆశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన గంగ నీళ్ల జాతర
- అశేష భక్తజనం మధ్య అడెల్లి పోచమ్మ నగల శోభాయాత్ర - అడుగడుగునా మంగళహారతులు పట్టిన మహిళలు - సాయంత్రం ఆలయానికి చేరిన ఆభరణాలు - ప్రత్యేక పూజల మధ్య అలంకరణ సారంగాపూర్/దిలావర్పూర్ : భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సారంగాపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. అశేష భక్తజనం.. అడుగడుగునా మహిళల మంగళహారతులు.. భక్తుల నృత్యాలు, ఆటపాటల మధ్య అమ్మవారి ఆభరణాల శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భక్తుల ఊరేగింపు మధ్య ఆభరణాలు శనివారం ఉదయం సారంగాపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి వివిధ గ్రామాల మీదుగా రాత్రి దిలావర్పూర్ మండలం సాంగ్వి పోచమ్మ ఆలయానికి చేరిన విషయం తెలిసిందే. ఆదివారం వేకువజామున గోదావరి నదీ తీరంలో స్థానిక సర్పంచు ఎం.విఠల్, ఉపసర్పంచ్ ఆనంద్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్ర గోదావరి జలాలను ముంతల్లో తీసుకుని అమ్మవారి ఆభరణాల వెంట తరలారు. ఉదయం ఏడు గంటలకు ఆభరణాల శోభాయాత్ర అడెల్లికి తిరుగు పయనమైంది. సాంగ్వి, కదిలి, మాటేగాం, దిలావర్పూర్, కంజర్ గ్రామాల మీదుగా సారంగాపూర్ మండలం ప్యారమూర్, వంజర్, యాకర్‌పల్లి, సారంగాపూర్ గ్రామాల మీదుగా అడెల్లి ఆలయానికి ఆభరణాలను చేర్చారు. ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభాయాత్రకు భాజభజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. దిలావర్పూర్లో భారీ పూలతోరణంతో స్వాగతం పలుకగా.. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. శివసత్తులు పూనకాలతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ.. ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపుగా ఆభరణాలు అడెల్లి ఆలయానికి చేరుకోగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి నగలు అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, పవిత్ర గంగానది జలాలతో ఆలయ శుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలభిషేకం, పవిత్రోత్సవం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కిక్కిరిసిన ఆలయ పరిసరాలు గంగనీళ్ల జాతర నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్, చంద్రపూర్ జిల్లాలతోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. భారీ బందోబస్తు అమ్మవారి ఆభరణాలు తరలిస్తున్న దారి వెంట నిర్మల్ రూరల్ సీఐ రగు, ఎస్సైలు మల్లేశ్, అనిల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వంద మంది వాలంటీర్లుగా పనిచేశారు. అమ్మవారిని ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
గణనాథుని రథోత్సవ వైభవం
కాణిపాకం : కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. మూల విగ్రహన్ని సుగంధ పరి మళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్వాలంకార భూషితులైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉం చి విశేష సమర్పణ చేశారు. ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య ఆలయం నుంచి ఉరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేశారు. కాకర్లవారిపల్లికి చెందిన ఎతిరాజులునాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకానికి చెందిన పూర్ణచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కుమారులు హరిప్రసాద్ రెడ్డి ఉభయదారులుగా వ్యవహరిం చారు. ఉభయదారుల ఉభయం వచ్చిన అనంత రం స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవా న్ని ప్రారంభించారు. అశ్వాలు, వృషభాలు సర్వసైన్యాధిపతులు ముందు వెళుతుండగా స్వామివారు రథంపై కాణిపాకం వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు, చిల్లరనాణేలు చల్లి మొక్కు లు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకొంది. ఈఓ పూర్ణచంద్రరావు ఆలయ ఏఈఓలు ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఉభయదారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు, కీలు గుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
పశుపతికి మోడీ పూజలు
కఠ్మాండు: ప్రధాని మోడీ సోమవారం శ్రావణాష్టమి సందర్భంగా నేపాల్‌లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.2 కోట్ల విలువైన రెండున్నర టన్నుల చందనాన్ని సమర్పించారు. గుడిలో దైవకృపకు పాత్రుడినైనట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మోడీ పశుపతికి నిర్వహించిన రుద్రాభిషేకం, పంచామృత స్నానంలో 150 మంది పూజారులు పాల్గొన్నారు. దక్షిణ భారతానికి చెందిన ప్రధాన అర్చకుడు గణేశ్ భట్ట భారత ప్రధానికి ప్రసాదాలు అందించారు. ‘ఈ ఆలయం విశిష్టమైనది. పశుపతి, కాశీ విశ్వనాథుడు ఒకరే. భారత్, నేపాల్‌లను ఏకం చేస్తున్న పశుపతి ఆశీర్వాదాలు ఇరు దేశాల ప్రజలకు ఇకముందూ అందాలి’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆలయంలో యాత్రికుల కోసం రూ. 25 కోట్లతో సత్రాన్ని నిర్మిస్తామన్నారు. -
బతికి రా... కన్నా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఒకటి కాదు రెండు వరుసగా ఆరు సంఘటనలు చోటు చేసుకున్నా ఎవరిలోనూ కించిత్తయినా అప్రమత్తత లేదు. ఏడో సంఘటనలో తిమ్మన్న హట్టి అనే ఆరేళ్ల బాలుడు బాధితుడు. అయితే ఈసారి అతను సాక్షాత్తు తండ్రి వేయించిన, విఫలమైన బోరును బంధువులకు చూపించడానికి పోయి అందులో పడిపోయాడు. అతను ప్రాణాలతో తిరిగి వస్తాడా... తిరుమల తిమ్మప్ప ఈ తిమ్మన్నను కాపాడుతాడా...అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం. ఆ బాలుని ప్రాణాలతో బయట పడేయ్ స్వామీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాల వారు తమ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవుళ్లు వీరి మొరను ఆలకిస్తారా....లేదా అనేది మరి కొన్ని గంటలు గడిస్తే కానీ తేలకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3,400 బోర్లు ఇంకా నోర్లు తెరుచుకునే ఉన్నాయని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలే చెబుతున్నాయి. తిమ్మన్న 160 అడుగుల లోతులో పడిపోగా...ఆ బోరుకు సమాంతరంగా ఇప్పటి వరకు ఎనభై అడుగుల లోతు వరకు మాత్రమే జేసీబీల సాయంతో గుంతను తవ్వగలిగారు. మరో వైపు బాలునిపై పూర్తిగా మట్టి కప్పుకు పోయిందని బోరులోకి పంపిన కెమెరా ద్వారా లభించిన దృశ్యాలు చెబుతున్నాయి. -
అమ్మవారి సేవలో సినీ నటుడు మోహన్‌బాబు
బాసర : శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని శుక్రవారం ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు వారికి ఆలయాధికారులు ఘనస్వాగతం పలికారు. మోహన్‌బాబు, ఆయన భార్య, పెద్ద కుమారుడు మంచు విష్ణు, కోడలు, మనుమరాళ్లు అరియాన, విరియానా వచ్చారు. మనుమరాళ్లకు అక్షరాభ్యాసం చేయించారు. కుటుంబమంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు, అమ్మవారి ప్రతిమ అందజేసి ఆశీర్వదించారు. ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్ మోహన్‌బాబు కుటుంబాన్ని శాలువాలతో సన్మానించారు. వారిని చూసేందుకు అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈవో ముత్యాలరావు, ఏఈవో అశోక్, సూపరింటెండెంట్ సాయిలు, జ్యోతిష్యులు దైవగ్న, బాసర, లోకేశ్వరం, ముథోల్ ఎస్సైలు నాగరాజు, వెంకటేశ్, రాజన్న, శ్యాంసుందర్ పాల్గొన్నారు. -
108 అమ్మవారి ఆలయాల దర్శనం
ప్యారిస్ : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ తరపున 108 అమ్మవారి ఆలయాల సందర్శన, ఒక రోజు శక్తి ఆలయాల సందర్శన, ఆడి నెల అమావాస్య సందర్శన వంటి మూడు విధాలైన పర్యాటక ఆలయాల సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడాదిలో ఆడి నెల అమ్మవారికి ప్రీతి పాత్రమైనది. ఆ నెలంతా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటా రు. ఈ సందర్భంగా 108 అమ్మవారి ఆలయాల సందర్శన ప్యాకేజీ టూర్ ఆడి నెలలో ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం ఆరు గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాష్ట్రం లో ఉన్న ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలను సందర్శించి ఐదు రోజుల తర్వాత తిరిగి చెన్నైకు చేరుతారు. ఆ రోజుల్లో వైదీశ్వరన్ ఆలయం, తంజావూరు, మదురై, తిరుచ్చి వంటి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస ఏర్పాట్లు చేశారు. ఈ ప్యాకేజీ చార్జీగా ఒక వ్యక్తి రూ.4,950 (ఇద్దరు బస చేసే విధంగా గది లభ్యమవుతుంది), చిన్నారులకు రూ.4,350 (4 నుంచి 10 వయసు లోపు), ఒంటరి వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యంతో*5,950 చార్జీగా వసూలు చేస్తారు. ఈ చార్జీ వాహన రాకపోకలకు, బసకు మాత్రమే అని నిర్వాహకులు వెల్లడించారు. ఒక రోజు శక్తి టెంపుల్ టూర్ ఒక రోజు శక్తి ఆలయాల సందర్శన ప్యాకేజీ కింద మాంగా డు, తిరువేర్కాడు, పూందమల్లి, తిరుముల్లైవాయల్, సెంబులివరం, పంజట్టి, మేలూర్, తిరువొత్తియూర్ వంటి చెన్నై నగర, శివారు ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి ఆలయాలను సందర్శించే విధంగా ఏర్పాటు చేశారు. ఇందుకుగాను ఒక వ్యక్తికి సాధారణ బస్సు చార్జీగా రూ.470, ఏసీ బస్సు సౌకర్యంతో రూ.550గా నిర్ణయించారు. ఆడి అమావాస్య ప్యాకేజీ అమావాస్యలన్నింటిలో ఆడిలో వచ్చే అమావాస్యకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజు పూర్వీకులకు పిండాలు పెట్టి తర్పణాలు అర్పిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరి, వారి వంశస్తులకు మంచి చేకూరుతుందని హైందవుల అపార నమ్మకం. మూడు రోజులు ఆడి అమావాస్య ప్యాకేజీ టూర్ చెన్నై నుంచి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, తిరుభువనం, దేవిపట్నం, రామర్ పాదం, అనుమాన్ పాదం, రామేశ్వరంలోని అగ్ని తీర్థాలను సందర్శించి 27వ తేదీ ఉదయం చెన్నైకు చేరుకుంటుంది. వివరాలకు పర్యాటక శాఖ అధికారి, తమిళనాడు పర్యాటక అభివృద్ధి శాఖ, వాలాజా రోడ్డు చిరునామాలో కానీ లేక 044 - 25384444, 25383333 నంబర్లను సంప్రదించి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. -
నమాజ్‌తో.. ఆరోగ్య భాగ్యం
ఆధ్యాత్మికతతోపాటు ప్రశాంతత ప్రతి క్రియలోనూ వ్యాయామ గుణాలు తాండూరు: దైవ ప్రసాదితమైన దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన పవిత్ర మాసం రంజాన్. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, మనోనిశ్చలత, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్. ఈ నెలరోజుల పాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రంజాన్ వేడుకలకు మసీదులు సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి రంజాన్ నెల ప్రారంభమైంది. ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ చేయడంలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. రోజుకు ఐదుసార్లు నమాజ్ నమాజ్ చేయడం వల్ల దైవాజ్ఞను ఆచరించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నమాజ్‌లోని ప్రతి క్రియలో వ్యాయామ గుణాలు ఉన్నాయి. వేకువజామున చేసే నమాజ్‌ను ఫజర్ అని, మధ్యాహ్నం జోహర్ అని, సాయంత్రం అసర్, సూర్యాస్తమయం వేళ మగధిట్, రాత్రి నమాజ్‌ను జషానమాజ్ అని అంటారు. నమాజ్‌లో తక్బీర్, ఖియామ్, రుకూ, సజ్దా, జల్సా, సలామ్ అనే క్రియలు ఉంటాయి. నమాజ్ చేసినప్పుడల్లా వీటిని తప్పక పాటిస్తారు. తక్బీర్ నమాజ్ ప్రారంభానికి సంకల్పం తర్వాత రెండు చేతులు చెవులు వరకు పెకైత్తి అనంతరం కిందకు దించి నాభిపైన రెండు చేతులు కట్టుకోవాలి. ఈ క్రియ వలన చేతిబలం పెరుగుతుంది. దేవుని సమక్షంలో ఉన్నామని అల్లా తమను గమనిస్తున్నాడనే భావన కలుగుతుంది. ఖియామ్ అల్లాహు అక్బర్ అని తక్బీర్ చెబుతూ.. కుడిచేతి బొటన, చిటికెన వేళ్లతో ఎడమచేతి మణికట్టును నాభిపై ఉంచుకోవాలి. ఈ క్రియ ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నిష్కల్మష ఆరాధనతో దైవంపై మనసు లగ్నం చేస్తే దొరికే ప్రశాంతత వర్ణనాతీతం. ప్రశాంత మనసు కలిగిన వ్యక్తికి రోగాలు ఆమడ దూరంలో ఉంటాయి. రుకూ రెండు చేతులూ మోకాళ్లపై ఉంచుతూ నడుమును సమాంతరంగా వంచుతూ చూపును రెండు కాళ్ల బొటనవేళ్ల మధ్యన ఉంచాలి. ఈ క్రియ ఉదరభాగానికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. బొటన వేళ్ల వద్ద ఉన్న చూపుకు ఉత్తేజం కలుగుతుంది. ఇది వెన్నెముకకు మంచి వ్యాయామం. సజ్దా పాదాలు, మోకాళ్లు, అరచేతులు, ముక్కు, నుదురు, నేలను తాకిస్తూ దైవం సమక్షంలో అష్టాంగ ప్రమాణం చేయడం. ఈ క్రియ ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి వ్యాయామం దొరుకుతుంది. సజ్దా చేసే సమయంలోనూ, అందులోంచి లేచే సమయంలోనూ ఛాతీకి మంచి వ్యాయామం లభిస్తుంది. భుజాలు బలోపేతమవుతాయి. జల్సా సజ్దా నుంచి లేచి రెండు కాళ్లను మడిచి కాళ్లను, మోకాళ్ల వరకు తాకిస్తూ వాటిపైన కూర్చుంటారు. ఈ క్రియ వజ్రాసనాన్ని పోలి ఉంటుంది. ఈ క్రియ వల్ల శరీరం గట్టిపడుతుంది. 72 వేల నాడులు ఇందులో పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సలామ్ నమాజ్ పూర్తయ్యే సమయంలో తలను ఒకసారి కుడివైపు తిప్పి సలాం చేస్తారు. అనంతరం ఎడమ వైపునకు తిప్పి సలాం చేసి నమాజ్‌ను ముగిస్తారు. ఈ క్రియ వల్ల గొంతు, మెడకు మంచి వ్యాయామం. నేత్ర శక్తి పెంపొందుతుంది. మెదడు ఉత్తేజితమవుతుంది. ప్రవర్తనలో మార్పు రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం నమాజు చేయడం వల్ల వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. రంజాన్‌లో దైవ ప్రార్థనలు, ఫిత్రాదానాలు చేస్తారు. మిగిలిన రోజుల కంటే రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా నమాజ్, ఖురాన్ పఠనంలో నిమగ్నమవుతారు. పాపపరిహారాల కోసం ఇది అనువైన సమయం. మహిళలు ఇళ్లవద్దనే ఖురాన్‌ను పటిస్తూ ఐదు పూటలా నమాజ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. - హరున్ రషీద్‌ఖాన్, తాండూరు -
సినిమా దేవుళ్లు!
ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో కొలువైన దేవుళ్లకు సినిమా క్లాప్‌లు నిత్య కృత్యమయ్యాయి. ముహూర్తాల పూజలు, అర్చనలు, సినిమా హిట్ కావాలని ప్రత్యేక పూజలు ఇక్కడ సాధారణం. ఈ సన్నిధానంలో 17 మంది దేవతలు కొలువుదీరారు. వారంలో నాలుగు రోజుల పాటు తప్పని సరిగా ఏదో ఒక సినిమాకు సంబంధించి ప్రారంభోత్సవాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రముఖ హీరోలకు దైవసన్నిధానం కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. బంజారాహిల్స్: దైవసన్నిధానం సకల దేవతామూర్తుల ఆస్థానం. సినిమా వాళ్లకు ఇక్కడి దేవుళ్లు కోరిన కోర్కెలు తీచ్చే సర్వమంగళ స్వరూపులయ్యారు. ఇక్కడ క్లాప్ కొడితే సినిమా హిట్టే అని సినీ హీరోల నమ్మకం. 2002 సెప్టెంబర్ 3న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 2004 జూన్ 2న విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట - మహాకుంభాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముహూర్త బలం - స్థల ప్రభావంతో అప్పటి నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడి దేవతామూర్తులను దర్శించి వారి కోరికలు నెరవేర్చుకొని ఆనందంతో తరిస్తున్నారు. సినిమా సెట్టింగులను తలపించేలా... దైవ సన్నిధానంలో దేవతామూర్తులను ప్రతిష్టించిన తీరు ఒక సినిమా సెట్టింగ్‌ను తలపిస్తున్నది. లోనికి వెళ్లగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుని దర్శనం కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుంది. దేవతామూర్తులందరూ ఒకే చోట కొలువైన తీరు నగరంలో మరెక్కడా లేదు. ఇక్కడ శ్రీ మహావిష్ణు విశ్వరూపం ఒక అద్భుత దృశ్యంగా భక్తులకు కనిపిస్తున్నది. ఇక్కడ సినిమా తీస్తే అది సూపర్ హిట్ అనే టాక్ కూడా ఉంది. దీంతో నిర్మాతలు, హీరోలు ఇక్కడే తమ సినిమాల ముహూర్తాలను నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటి వరకు దైవసన్నిధానంలో 150 సినిమాల వరకు పూజా కార్యక్రమాలు, షూటింగ్‌లు జరుపుకొన్నాయి. చాలా మంది నిర్మాతలు తమ సినిమాలు చిన్న దృశ్యమైనా ఇక్కడ చిత్రీకరించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా షూటింగ్‌లకు కూడా ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుండటంతో చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమాల్లో ఆలయాల దృశ్యాలను చూపేందుకు దైవసన్నిధానం ఎంతో అనుకూలంగా ఉందని దృశ్యాలు కూడా పండుతాయని పలువురు నిర్మాతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలందరి సినిమాలు ఏదో ఒక దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించుకున్నవే. ఇటీవల రామ్‌చరణ్‌తేజ్ సినిమా కూడా ముహూర్త షాట్లు ఇక్కడే చిత్రీకరించుకోవడం కొసమెరుపు. -
బండెనక బండి కట్టి
ధరూరు : గత 10 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు పోతున్నారు. వర్షం కోసం ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సాయంత్రం మండల కేంద్రానికి చెందిన రైతులు దాదాపు 20 ఎద్దుల బండ్లను కట్టుకుని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నీటిని తీసుక వచ్చి ధరూరులోని శ్రీ ఆంజనేయ స్వామి, శివాలయం, కాలప్ప, వీరబద్ర స్వామి, బీరప్ప, కొండేటి ఆంజనేయుడు, పార్థసారథి, ధర్వేశెల్లి ఆలయం, సవారమ్మ, తదితర ఆలయాల్లో అభిషేకం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు నర్సింహులు, కుంటెన్న, కిష్టన్న, జయన్న, దర్శెల్లి, ఆంజనేయులు, పరుశరాం, అంజనప్ప పాల్గొన్నారు. -
నయనమనోహరం శ్రీమహావిష్ణువు అలంకారం
కనులపండువగా శ్రీవారి శాంతికల్యాణం శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు ఆలయంలో పుష్పపరిమళాల శోభ కోడూరు : ‘గోవిందా.. గోవిందా..’ నామస్మరణతో వెంకటేశ్వరస్వామివారి ఆలయప్రాంగణం ప్రతిధ్వనించింది. కోడూరులో వేంచేసియున్న శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారి శాంతి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. తిరుమలకు చెందిన కోగంటి రామానుజాచార్యులు మంత్రవచనాల మధ్య జరిగిన ఈ కళ్యాణమహోత్సవానికి కోడూరు చెందిన అద్దెపల్లి మోహన్‌బాబు, విజయవాడకు చెందిన అరపల్లి ప్రవీణ్‌కుమార్ దంపతులు కల్యాణకర్తలుగా వ్యవహరించారు. టీటీడీ ధర్మప్రచార పరిషత్ జిల్లా సభ్యులు మొవ్వ రఘశేఖరప్రసాద్ కల్యాణ ఘట్టం గురించి భక్తులకు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ముందుగా స్వామివారి మూలమూర్తులకు మంగళాశాసనం నిర్వహించి, వేదపండితుల పర్యవేక్షణలో పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో చేశారు. మల్లెపూలతో శ్రీమహావిష్ణు అలంకారం.. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శ్రీవెంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని మల్లెపూలతో శ్రీమహావిష్ణుగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు ధుంబాల శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో వివిధ రకాల పుష్పాలతో స్వామివార్లను శ్రీమహావిష్ణువుగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అలంకారంలో స్వామివారు గధ ధరించినట్లు ఏర్పాటు చేసి, బంతిపువ్వులుతో మకరతోరణాన్ని అలంకరించారు. మేల్కోట తరహాల్లో స్వామివార్లను అలంకరించినట్లు ప్రధానార్చకులు తెలిపారు. పోలీస్ అధికారులు సమకుర్చిన వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని నయనమనోహరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీవారి విద్యుత్ చిత్రపటం భక్తులను ఆకట్టుకుంది. రాత్రికి ఆలయ కల్యాణమండలంలో కోట వారి వంశీయులచే సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. దీపాలంకరణసేవలో దీపాలు వెలిగించడానికి కోడూరు, కృష్ణాపురం, యర్రారెడ్డివారిపాలెం, ఇస్మాయల్బేగ్పేట తదితర గ్రామలకు చెందిన మహిళలు పోటెత్తారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఒక్కో ప్రదక్షణకు.. ఒక్కో వాయిద్యంతో..భక్తుల హరినామ సంకీర్తనల మధ్య ద్వాదశ ప్రదక్షణాలు భక్తిప్రపత్తులతో జరిపారు. అనంతరం స్వామివార్లను ఆలయ ప్రవేశం చేయించి శ్రీపుష్పయాగం, స్వామివారికి దేవే రులతో కలిసి పవళింపు సేవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. నేటి కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ అర్చన నిర్వహిస్తారు. అనంతరం లక్ష మల్లెలతో స్వామివారికి అర్చన చేసి ఉత్సవాలు ముగించనున్నట్లు ఆలయ ధర్మకర్త కోట పద్మావతి వరప్రసాద్ తెలిపారు. -
కోదండ రాముడి ఉత్సవాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 8.58 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపజేశారు. దీనికి ముందు ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులు, ధ్వజపటము, చక్రత్తాళ్వారుతో సహా తిరువీధుల ఉత్సవం నిర్వహించారు. అనంతరం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. రాత్రి 8గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ మాట్లాడుతూ నగరవాసులు, పరిసరప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వాహన సేవల్లో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ నాలుగు మాడవీధుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్థానికులు సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహతి కళాక్షేత్రం, రామచంద్రపుష్కరిణిలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ధ్వజారోహణంతో సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు తెలిపారు. రాముడు ధర్మస్వరూపుడని, ఆయన ఆదర్శాలను భక్తులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి రఘునాథ్, వీఎస్వో హనుమంతు, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీధర్, కంకరణభట్టార్, సీతారామాచార్యులు, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. -
పెళ్లికి ముస్తాబైన రామలింగేశ్వరుడు
యనమలకుదురు(పెనమలూరు),న్యూస్‌లైన్ : యనమలకుదురులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తొలిరోజు బుధవారం శ్రీరామలింగేశ్వరస్వామి, పార్వతి అమ్మవారిని కల్యాణమూర్తులుగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాలకు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించి, పట్టు వస్త్రాలతో అలంకరించారు. రాత్రి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండస్థాపన, మృత్యంగ్రణము, అంకురార్పణ, మండపారాధన, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజావరోహణ, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూలతోరణాలతో అలంకరణ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతోరణాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఇందుకోసం గ్రామ శివారులో పెంచుతున్న పూదోట నుంచి పెద్ద ఎత్తున బంతి పూలను ఆలయానికి తరలించారు. ఆలయానికి, దేవతామూర్తులకు అలంకరించేందుకు పూలదండలను తయారుచేస్తున్నారు. పార్వతీపరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించేందుకు గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. శివరాత్రి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు పూర్తి విజయవాడ : మహా శివరాత్రిని పురస్కరించుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాదిగా భక్తులు తరలిరానుండటంతో తోపులాట జరగకుండా ఉండేందుకు స్నానఘాట్ల వద్ద పటిష్టంగా బారికేడ్లు నిర్మించారు. మరో వైపు జల్లు స్నానాలు చేసేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. వైభవంగా శివరాత్రి ఉత్సవాలు పెదకళ్లేపల్లి (మోపిదేవి) : స్థానిక దుర్గానాగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామికి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి శేషవాహనంపై స్వామిని ఊరేగించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం కృష్ణానదిలో ఫుణ్యస్నానాలు చేసే భక్తులకు కల్పించే సౌకర్యాలను అవనిగడ్డ డీఎస్పీ హరిరాజేంద్రబాబు ఆలయ ఏసీ వి.వి.ఎస్.కె.ప్రసాద్, పోలీస్ అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. అనుమతి లేనిచోట్ల భక్తులు నదిలో దిగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు అధికారులకు సూచించారు. భారీ పోలీస్ బందోబస్తు మహాశివరాత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని అవనిగడ్డ డీఎస్పీ హరిరాజేంద్రబాబు తెలిపారు. నలుగురు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు, 61 మంది కానిస్టేబుళ్లు, 53 మంది హోంగార్డులు, 13 మంది మహిళా హోంగార్డులు, స్క్వాడ్ బృందం 18 మందితో బందోబస్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సర్పంచి అరజా వెంకటసుబ్బారావు, వీఆర్వో ఎ.వెంకటేశ్వరావు, పంచాయతీ కార్యదర్శి భాస్కరావు పాల్గొన్నారు. -
పగిడిద్దరాజు తిరుగువారం
భారీగా వరం పట్టిన మహిళలు ఎదుర్కోళ్లతో స్వాగతం పలికిన భక్తులు పూనుగొండ్ల(కొత్తగూడ), న్యూస్‌లైన్ : శివసత్తుల పూనకాలు.. భక్తుల ఎదుర్కోళ్ల కోలాహలం మధ్య గురువారం పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గిరిజన పూజారులు పగిడిద్దరాజు వనం తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. గురువారం పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో వనం తెచ్చేందుకు దేవుడిగుట్టకు తరలివెళ్లారు. వనం గ్రామ పొలిమేరల్లోకి చేరే సమయానికి సంతానం కోరుకునే మహిళలకు ఎదురెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేశారు. పూజారులు వారిపై నుంచి దాటుకుంటూ వనం తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల ఆ మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. వనం తెచ్చి గద్దెపై ప్రతిష్ఠించిన తరువాత 26 మంది మహిళలు గద్దె చుట్టూ వరం పట్టారు. భారీగా తరలివచ్చిన భక్తులు తిరుగువారం పండుగ సందర్భంగా పగిడిద్దరాజును దర్శించుకుని పూజలు చేసేందుకు వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పగిడిద్దరాజును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు ఆర్డీఓ మోతీలాల్ పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడి విద్యుత్ సక్రమంగా సరఫరా అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. పూజారులు పెన్క బుచ్చిరాములు, మురళీధర్, సురేందర్, సమ్మయ్య, సూర్య ఆలయంలో పూజలు నిర్వహిం చారు. సర్పంచ్ ఈసం కాంతారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వైభవంగా స్వర్ణముఖి పుష్కరం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖినది పుష్కరం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అయితే స్వర్ణముఖినదికి ప్రతిఏటా పుష్కరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుష్కరాన్ని ఏటి ఉత్సవం, త్రిశూలస్నానం అని కూడా అంటారు. పుష్కరం సందర్భంగా శుక్రవారం శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం, చక్రస్నానం, త్రిశూల స్నానం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. స్వామి, అమ్మవారు, వినాయకస్వామి, సుబ్రమణ్యంస్వామి, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణముఖినదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు. పూజల కోసం నదిలో ప్రత్యేకంగా తవ్వించిన గుంత వద్ద వేదపండితులు పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం చక్రాలకు, త్రిశూలానికి నదిలో స్నానం చేయించారు. మాఘస్నానం నది పుష్కర విశేషాలను భక్తులకు అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. అనంతరం పట్టణంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ శాంతారామ్జేపవార్, ఇన్చార్జి ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ రామిరెడ్డి, పర్యవేక్షకుడు శ్రీనివాసులురెడ్డి, ఆలయాధికారులు హరిబాబుయాదవ్, సుదర్శన్‌నాయుడు, వెంకటేశ్వరరాజు, మణి, సాయి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. వెండి వాహనాలపై ఊరేగింపు స్వర్ణముఖినదిలో పంచమూర్తులకు సద్యోముక్తి వ్రతాన్ని నిర్వహించిన తర్వాత పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. స్వామివారు నందివాహనం, అమ్మవారు సింహవాహనం, సుబ్రమణ్య స్వామి నెమలి వాహనం, వినాయకుడు మూషిక వాహనంపై ఊరేగారు. మురుగునీటితో తప్పని అవస్థలు నదిలో పుష్కర పూజల కోసం ప్రత్యేకంగా తవ్వించిన గుంత సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో భక్తులకు అవస్థలు తప్పలేదు. అధికారుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూజలు జరుగుతున్న చోటే నదిలో కొందరు బట్టలు ఉతుకుతుండడం కనిపించింది. -
మార్మోగిన హరినామస్మరణ
మన్యంకొండ పుణ్యక్షేతం గోవింద నామస్మరణతో పులకించింది. ఆదివారం మన్యం కొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సంప్రదాయం ప్రకారం మొదటిరోజు తిరుచ్చిసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భజనలు,కోలాటాలతో భక్తులు స్వామివారిని కోటకదిరనుంచి కొండపైకి తీసుకొచ్చారు. దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యం కొండ లక్షీ్ష్మవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆది వారం రాత్రి 10 గంటలకు అం గరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మన్యంకొండ సమీపంలోని కోటకదిర ఆళహరి వంశీయుల ఇంట్లో ప్రత్యేకపూజల అనంతరం స్వామివారిని మన్యంకొండపైకి పల్లకీలో ఊరేగింపుగా (తిరుచ్చిసేవ) తీసుకువచ్చారు. స్వామివారిని గుట్టపైకి తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సం దర్భంగా ఊరేగింపులో భక్తులు భజ నలు, కోలాటాలు వేశారు. భ క్తుల హరినామస్మరణతో కోటకదిర పులకించిపోయిం ది. పురోహితుల వేదమంత్రాలు, సన్నా యి వాయిద్యాలు, బ్యాండు మేళతాళాల మధ్య స్వామివారి మధ్య పల్లకీసేవ ముం దుకు కదిలింది. ఊరే గింపులో మహిళలు పెద్దఎత్తున బొడ్డెమ్మలు వేశా రు. పెద్దఎ త్తున భక్తులు బాణాసంచా కా ల్చారు. కో టకదిర నుంచి కాలిబాటన స్వామివారి ని కాగడాల వెలుతురులో ఊరేగిస్తూ ప ల్లకీలో దాదాపు నాలుగు కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్యంకొండ గుట్టపైకి తీ సుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నేడు సూర్యప్రభ వాహనసేవ మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వా మి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో భాగం గా సోమవారం స్వామివారి సూర్యప్రభ వాహనసేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ని గర్భగుడి నుంచి మండపం వరకు సూ ర్యప్రభ వాహనంలో పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య తీసుకొస్తారు. అక్కడ ప్రత్యేక పూ జలు చేసిన అనంతరం మళ్లీ స్వామివారిని సూర్యప్రభ వాహనంలో గర్భగుడిలోకి తీసుకెళ్తారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి నారాయణస్వా మి, ఈఓ రాఘవేందర్రావు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేగా గెలవలేని సీఎం.. పార్టీ పెడతాడా
తనది హైదరాబాద్ అంటాడు.. చిత్తూరుకు నిధులు మళ్లిస్తాడు వైఎస్ స్టైల్లో మాట్లాడాలని సీఎం ఆరాటపడుతున్నాడు భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని సీఎం కిరణ్ సొంతంగా పార్టీ పెడతానని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అన్నం తింటూ గోతులు తవ్వే సీఎం.. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైతే నాలుగున్నర కోట్ల ప్రజలను కాదని బయట కాలుపెట్టగలడా అని ధ్వజమెత్తారు. తన సొంతఖర్చులతో మండలంలోని పోచన్నపేట, బచ్చన్నపేటలోని ఆటోనగర్ కాలనీ, కొడువటూరు గ్రామాల్లో వేసిన బోర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల మార్కెట్ కమిటీ చెర్మైన్ మాసపేట రవీందర్‌రెడ్డి, సర్పంచ్ గంగం సతీష్‌రెడ్డి, దాసరి రవి, లక్ష్మీనారాయణ నాయక్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, కొమ్ము నర్సింగారావు, ఆటో యూనియన్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు భాస్కర్, అయిలయ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. సిద్ధులగుట్టలో ఆలయ ఈఓ రత్నాకర్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ అకాల మరణంతో దొడ్డిదారిలో సీల్డ్ కవర్ సీఎంగా కిరణ్ అవతారమెత్తాడని విమర్శలు చేశారు. మహానేత వైఎస్ఆర్ ఏనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. బచ్చన్నపేట చౌరస్తాలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు నిధులు సమకూర్చాలని సహ చట్టం జిల్లా కోకన్వీనర్ గంగరబోయిన మహేందర్ ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్‌రెడ్డి, ఎండీ గౌస్, ఈదులకంటి వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, గుర్రపు బాల్‌రాజు, రామిని మదన్, గట్టు మల్లేశం, దిడిగ రమేష్, శ్రీనివాస్, సర్పంచ్ పిన్నింటి బాపురెడ్డి, గంగంర బోయిన మహేందర్, సుబ్బూరి కిషన్, జిల్లా రాజేశ్వర్, మల్గ సిద్దులు, కర్ణాకర్, రాము, ఆనంద్ పాల్గొన్నారు. నేనేమైనా జనగామ టికెట్ అడిగానా.. : మంత్రి వర్గీయులను ప్రశ్నించిన ఎంపీ నేనేమైనా జనగామ అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడుతున్నానా.. నా శత్రువులతో తిరుగుతున్నారు.. అంటూ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులను గట్టిగా ప్రశ్నించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఆదివారం మండలానికి వచ్చిన ఆయనను మంత్రి వర్గీయులు తమకు సమాచారమివ్వడంలేదని అడిగారు. తనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి సమాచారం అందిస్తున్నానన్నారు. నియోజకవర్గ ఎంపీగా ఉన్న తనకు ఏ పనులు ప్రారంభించినా మంత్రి సమాచారం ఎందుకివ్వడం లేదని ఎదురు ప్రశ్నించారు. -
కమనీయం.. ధ్వజారోహణం
అలంపూర్, న్యూస్‌లైన్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగవైభవంగా ఆరంభమయ్యాయి. అమ్మవారి మూలవిరాట్ వద్ద ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య హారతులు సమర్పించారు. శివసంకల్ప స్తోత్రాన్ని పఠిస్తూ ఆగమ పద్ధతులతో ఆనతి స్వీకరించారు. అర్చకస్వాములు ఉత్సవమూర్తిని మంగళవాయుద్యాల మధ్య అమ్మవారి ఆలయానికి చేర్చారు. ఈఓ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. యాగశాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఉత్సవ సంకేతంగా ధ్వజారోహణం చేశారు. -
ముగిసిన ఉర్సు
మతసామరస్యానికి ప్రతీక అయిన జాన్‌పహాడ్ దర్గా ఉర్సు శనివారం దీపారాధన (చిరాగ్)తో ముగిసింది. ఇదిలా ఉండగా ఈ నెల 23న గుసుల్ షరీఫ్‌తో ఉత్సవాలు ప్రారంభం కాగా 24న గంధం ఊరేగింపు నిర్వహించారు. ఉర్సు చివరిరోజు కూడా వేలాది మందిభక్తులు జాన్‌పహాడ్ సైదన్నను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా వద్ద ఉన్న నాగులపుట్ట వద్ద మహిళలు, పాలు, పండ్లు, గుండ్లు ఉంచి పూజలు చేశారు. పుట్ట వద్ద మహిళలు పూనకంతో పానసారం పడుకున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు హాజరయ్యారు. ఉర్సు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉర్సుకు వచ్చిన భక్తులు తమ వాహనాలలో వెనుదిరిగి వెళ్లారు. - న్యూస్‌లైన్, జాన్‌పహాడ్, (నేరేడుచర్ల) జాన్‌పహాడ్ దర్గా అభివృద్ధికి కృషి జాన్‌పహాడ్ (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ : మతసామరస్యానికి ప్రతీక అయిన జాన్‌పహాడ్ దర్గా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాననివైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన శనివారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకునాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాన్‌పహాడ్ దర్గాను పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. నేరేడుచర్ల- జాన్‌పహాడ్ రోడ్డును డబుల్‌రోడ్డుగా వేయించాలని ఆయన డిమాండ్ చేశారు. దర్గాకు ప్రతి ఏటా లక్షల్లో ఆదాయం వస్తున్నా మౌలిక వసతులు కల్పించడంలో వక్ఫ్‌బోర్డు, ప్రభుత్వం వైఫల్యం చెందాయన్నారు. అంతకు ముందు ఆయన పూజారి(ముజావర్) మొయినుద్దీన్ ఇంటి వద్ద నుంచి గంధం బిందెను నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. దర్గాలో సైదులుబాబా సమాధులపై దట్టీలు కప్పి గంధం, పూలు చల్లి ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, హుజూర్నగర్ రూరల్ మండలాల కన్వీనర్లు పోరెడ్డి నర్సిరెడ్డి, బోళ్లగాని సైదులు, ఐలా వెంకన్న గౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, నేరేడుచర్ల ఉపసర్పంచ్ పోరెడ్డి వెంకటరమణారెడ్డి, మైనార్టీ సెల్ మండల కన్వీనర్ ఎంఏ గఫార్, నాయకులు జి. మహేందర్‌రెడ్డి, ఉపేందర్, గంధమల్ల పాపయ్య, దేవులపల్లి ఉపేంద్రచారి, పోరెడ్డి రాంరెడ్డి, జ్ఞానయ్య, జార్జ్, కొణతం వెంకటరెడ్డి, షేక్. బాలసైదా, మంగ్తానాయక్, రామచంద్రనాయక్, సోమగాని మధు, పోరెడ్డి అమృతారెడ్డి, ఇంజమూరి పున్నయ్య, క్రిష్టపాటి సత్యనారాయణరెడ్డి, బోగాల చంద్రశేఖర్‌రెడ్డి, కుందూరి మట్టారెడ్డి, కొదమగుండ్ల మట్టయ్య, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య, పల్లా అంజయ్య పాల్గొన్నారు. -
మురిసిన ముక్కోటి
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయమే పెద్దఎత్తున భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఉత్తరద్వారం గుండా భగవంతుడిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయాలను నిర్వాహకులు అందంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను విద్యుద్దీపాలు, రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు. ప్రధానంగా నల్లగొండలోని రామాలయంతోపాటు యాదగిరిగుట్ట , మట్టపల్లిలలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్తరద్వార దర్శనం యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అలాగే స్వామిఅమ్మవారిని గులాబీ, మందారం, జాజిమల్లి, విరజాజి , మల్లె మొదలైన పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉదయం 6.50 గంటలకు స్వామి అమ్మవారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని తిలకించడానికి చలినిసైతం లెక్కచేయకుండా భక్తులు ఉదయం 4 గంటల నుంచే కొండపై బారులు తీరారు. ఆలయ తిరు వీధులన్నీ అశేష భక్త జనంతో నిండిపోయాయి. స్వామి అమ్మవారిని గర్భాలయం ఎదుట సుమారు అరగంట పాటు భక్తుల దర్శనార్థం ప్రత్యేక పీఠంపై అధిష్టింప జేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం, పంచోపనిషత్తులు, పంచసూక్తాల పఠనం చేశారు. అనంతరం స్వామి అమ్మవారిని ఆలయ తిరువీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ , దేవస్థానం చైర్మన్ బి. నర్సింహమూర్తి, ఈఓ కృష్ణవేణి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు గజ్వెల్ రమేశ్ బాబు, సురేందర్ రెడ్డి, రామారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో గేట్లకు తాళాలు వేయడంతో స్వామి వారి సేవకు అంతరాయం కలిగింది. స్వామి వారి ఊరేగింపు సేవలో భక్తుల మధ్య తోపులాటలు జరగడంతో ఇబ్బందులు పడ్డారు. వైకుంఠ ద్వారం ద్వారా.. మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శనివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాత:కాలార్చన, సుప్రభాతం, పంచామృతాభిషేకంతో శ్రీ స్వామి వారిని వైకుంఠ ద్వారదర్శనం గావించారు. ఈ సందర్భంగా సంస్కృత సోదరులు శ్రీనాథశర్మ, మహదేవశర్మల ఆధ్వర్యంలో లక్ష ఆరెపత్రి పూజను చేశారు. శ్రీగోదాదేవి అమ్మవారికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఊరేగించారు. ఆలయంలో వేదమంత్రపఠనం, నాదస్వర కచేరీ, పురాణకాలక్షేపం, సప్తస్వర నాట్యకళామండలివారిచే భక్తి గానలహరి, ద్రౌపదీ స్వయంవరం హరిక థ, శ్రీమట్టపల్లి క్షేత్రమహత్యం బుర్రకథ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. స్థానిక ఎన్సీఎల్ సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో అన్నదానం చేయడమేగాక మంచినీటిని సరఫరా చేశారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సాయంత్రం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరు నర్సింహారావు, ఈఓ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చిరంజీవులు, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, నాగన్నగౌడ్, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, మంజీనాయక్, అరుణాసైదులు, శ్రీను, మట్టపల్లి రావు, విజయ్ కుమార్, వెంకటాచార్యులు, కృ ష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరి, ఫణి,నర్సింహమూర్తి, అధికసంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కుడారై ఉత్సవం నల్లగొండ కల్చరల్ : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం రామగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయరుస్వామి ఆధ్వర్యంలో కుడారై ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 108 గంగాళాలలో పాయసాన్ని ఉంచి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టారు. అంతకుముందు తెల్లవారుజామున 5.30 గంటలకు స్వామివారిని ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఉంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని గావించారు. ఉదయం 10 గంటలకు నీరాటోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు సముద్రాల యాదగిరాచార్య, కృష్ణమాచార్య, శఠగోపాలాచార్య చేపట్టారు. ఏఐసీసీ పరిశీలకులు రఫీఖ్అహ్మద్, ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, డీఎస్పీ రామ్మోహన్, డీసీసీ అధ్యక్షులు తూడి దేవేందర్‌రెడ్డి, టి.కుమార్‌రావు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మనోహర్‌రెడ్డి, సభ్యులు జడల సువర్ణ, వంగరి సునీత, వేదాంతం శ్రీనివాసాచార్యులు, చకిలం వేణుగోపాల్‌రావు, వికాస తరంగిణి అధ్యక్షుడు రాజేశ్వరరావు, కార్యదర్శి సుజాత, రంగారావు, ఈశ్వరరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మెరుగుగోపి, వంగాల అనిల్‌రెడ్డి, అంబటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు -
హల్లెలూయ..!
గుంటూరు నగరంలోనూ, జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రభువుకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిల వెలుపల పేదలకు కానుకలు అందించారు. గృహాల్లో క్రిస్మస్ ట్రీలు, ఇతర అలంకరణలతో ముస్తాబు చేశారు. చర్చిలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మందిరాలను రంగులతో తీర్చిదిద్దారు. కాలనీలన్నీ క్రిస్మస్ రాకను తెలియజేసే నక్షత్రాలతో కళకళలాడాయి. జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత గల ఫిరంగిపురం, రెంటచింతల, సాగర్మాత చర్చిల్లో వేలాదిమంది భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్లో ఉన్న నార్త్ ప్యారిష్ చర్చి, ఆంధ్రా రోమ్‌గా ఖ్యాతి గాంచిన ఫిరంగిపురంలోని బాలయేసు కెథడ్రల్ దేవాలయంలోనూ బిషప్ గాలిబాలి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రెంటచింతలలోని లూథరన్ చర్చిలో పాస్టర్ జి.అన్నారావు, కానుకల మాత చర్చిలో ఫాదర్ పుట్టి సుందరరాజు, అల్లం రాయపరెడ్డి, గోవిందు బాలస్వామి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. మాచర్లలోని ఏఈఎల్ చర్చి, ముత్యాలంపాడులోని లూర్థుమాత ఆలయం, తాళ్లచెరువులోని బాలయేసు ఆలయం, రేపల్లెలోని ఏఈఎల్సీ, సత్తెనపల్లిలోని ఆర్సీఎం చర్చిలను, గుంటూరు, తెనాలి ఐతానగర్ చర్చిల్లో క్రీస్తు ప్రార్థనలు ఘనంగా జరిగాయి. గుంటూరు నగరంలోని పలు చర్చిల్లో కరుణామయుని భక్తి తన్మయత్వంతో ప్రార్ధించారు. రింగ్‌రోడ్డులోని డాన్‌బాస్కో ప్రాంగణంలో ఉన్న నిత్య సహాయ మాత దేవాలయంలో ఫాదర్ పీటర్ ప్రార్ధనలు జరిపారు. ఏసీ కళాశాల సమీపంలోని పునీత ఆగ్నేశమ్మ దేవాలయంలో ఫాదర్ ఏపూడి రాయప్ప ప్రార్ధనలు చేశారు. నగరంపాలెంలోని ఆంథోనివారి పుణ్యక్షేత్రంలో ఫాదర్ ఆంథోని ప్రార్ధనలు జరిపారు. బొంగరాలబీడులోని లూర్ధు మాత దేవాలయంలో ఫాదర్ గాలి శౌర్రెడ్డి ప్రార్ధనలు నిర్వహించారు. స్తంభాలగరువులోని బాల ఏసు పుణ్యక్షేత్రంలో ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి ప్రార్ధనలు చేశారు. గోరంట్లలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఫాదర్ వై.శౌరిరాజు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈస్ట్ ప్యారీష్ చర్చిలో రెవరెండ్ వై.ఆదాం, వెస్ట్ ప్యారీష్ చర్చిలో రెవరెండ్ విక్టర్ మోజెస్, సౌత్ ప్యారీష్ చర్చిలో రెవరెండ్ ఎ.బాలసుందరం, రెండవ సౌత్ ప్యారీష్ సెయింట్ జాన్ చర్చిలో రెవ. కె.కె.కుమార్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. -
కరుణామయుడు.. లోకబాంధవుడు
ప్రేమ, కరుణ, మానవీయ స్పర్శలతో శత్రువుల హృదయాలను సైతం జయించిన కరుణామయుడు ఏసు ప్రభువని రెవరెండ్ పాస్కల్ ప్రకాష్ తెలిపారు. క్రిస్మస్ పండగ సందర్భంగా బుధవారం స్థానిక సీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ సందేశాన్ని అందించారు. సమాజంలో పొరుగు వానిని ప్రేమిస్తూ..ఆపదలో ఉన్న వారి పట్ల కరుణ, జాలి, దయ చూపడం ద్వారా ప్రభువు ఆశించిన శాంతి సామరస్య పూర్వక సమాజాన్ని స్థాపించవచ్చునన్నారు. అనంతరం సంపత్ కుమార్, దేవదాసు.. బైబిల్ పఠనం గావించారు. ఆర్పి సజీవన్ ఆశీర్వాదం నిర్వహించగా సెలవు కీర్తనలతో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు సీసీ చర్చి ప్రాంగణంలో ప్రదర్శించిన క్రీస్తు అద్భుతములు అనే నాటిక అందరినీ ఆకట్టుకుంది. సీఎస్ఐ చర్చిలో ప్రదక్షిణలు.. సీఎస్ఐ చర్చిలో ఉదయం 7 గంటల నుండే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. రెవరెండ్ జడ్.యేసురత్నం ఆధ్వర్యంలో భక్తులు చర్చి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సులోచనమ్మ, రమేష్, సాల్మన్ ఆధ్వర్యంలో క్రీస్తు కీర్తనలు పాడారు. డీనరీ చైర్మన్లు యేసురత్నం, ప్రేంచంద్ల నాయకత్వంలో పాస్టర్లు రెవ ఎంఐడీ ప్రసాద్, రెవ రవి క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. రెవరెండ్ పుష్పలలితమ్మ క్రిస్మస్ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. బంధుమిత్రుల సందడి.. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని క్రైస్తవ కుటుంబాల్లో బంధు మిత్రుల సందడి కనిపించింది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. పండగ సందర్భంగా జిల్లాఅంతటా మతసామరస్యం వెల్లివిరిసింది. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను రెవ జెడ్.యేసురత్నం, రెవ.పుష్పలలితమ్మ ఆహ్వానం పలికారు. అలాగే భగత్‌సింగ్ కాలనీ (42వ వార్డు)లోని బెత్లహాం చర్చిలో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్‌ఖాన్ పాల్గొని క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేద వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. -
జగన్ జన్మదినోత్సవం సందర్భంగా అప్పన్నకు ప్రత్యేక పూజలు
సింహాచలం, న్యూస్‌లై న్: రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలకు తన సేవలందించాలని కోరుతూ పార్టీ జిల్లా, నగర, నియోజకవర్గాల సమన్వయకర్తలు సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ఉత్తరాంధ్ర పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం వీరంతా సింహగిరికి తరలివచ్చారు. గాలిగోపురం వద్ద బెలూన్లు ఎగురవేశారు. అమ్మవారి సన్నిధిలో 108 కొబ్బరికాయలు కొట్టారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో జగన్మోహన్రెడ్డి పేరిట అష్టోత్తర పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, భీమి లి, ఉత్తర, పశ్చిమ, గాజువాక నియోజక వర్గాల సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, జి.వి.రవిరాజు, దాడి రత్నాకర్, తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, వి.భాస్కర్, వంకాయల మారుతీ ప్రసాద్, పక్కి దివాకర్, శ్రీకాంత్, గొలగాని శ్రీనివాసరావు, వినోద్, ఈశ్వరరావు, చల్ల అప్పారావు, కొయ్య నారాయణరెడ్డి, రాకేష్ మహదేవ్, కె.జయప్రకాష్‌రెడ్డి, 72వ వార్డు నాయకులు పీతల అప్పలరాజు, పీతల విష్ణుమూర్తి, కొలుసు ఈశ్వరరావు, బోర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో... సిరిపురం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకులు మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మహిళలకు అత్యంత కీలకపదవులు, గౌరవం దక్కుతాయన్నారు. అంతకుముందు సాంస్కృతిక విభాగం కన్వీనర్ కె.రాధ అద్భుత గీతాలు ఆలపించిన అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, సీఈసీ సభ్యురాలు పిన్నింటి వరలక్ష్మి, సమన్వయకర్తలు జి.వి.రవిరాజు, కోరాడ రాజబాబు, అధికార ప్రతినిధి నీలా ఉమారాణి, నారా అమ్మాజీ తోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చీమలాపల్లిలో రక్తదాన శిబిరం చినముషిడివాడ: జీవీఎంసీ 70వ వార్డు చీమలాపల్లిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గండి బాబ్జీ కేక్ కట్ చేసి అభిమానులకు పం చిపెట్టారు. పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని బాబ్జి చేతుల మీదుగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్ చేస్తున్న పోరాటం చరిత్రాత్మకమని కొనియాడారు. పార్టీ నాయకులు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొన్నారు. పశ్చిమ పార్టీ కార్యాలయంలో... ఎన్ఏడీ జంక్షన్: ఎన్ఏడీ కూడలిలోని పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ నాయకులు జి.వి.రవిరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, నగర బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్ పాల్గొన్నారు.