అమ్మవారి సేవలో సినీ నటుడు మోహన్‌బాబు | film actor mohanbabu seeking blessings at basara | Sakshi
Sakshi News home page

అమ్మవారి సేవలో సినీ నటుడు మోహన్‌బాబు

Published Sat, Jul 26 2014 12:53 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

అమ్మవారి సేవలో సినీ నటుడు మోహన్‌బాబు - Sakshi

అమ్మవారి సేవలో సినీ నటుడు మోహన్‌బాబు

బాసర : శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని శుక్రవారం ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు వారికి ఆలయాధికారులు ఘనస్వాగతం పలికారు. మోహన్‌బాబు, ఆయన భార్య, పెద్ద కుమారుడు మంచు విష్ణు, కోడలు, మనుమరాళ్లు అరియాన, విరియానా వచ్చారు. మనుమరాళ్లకు అక్షరాభ్యాసం చేయించారు. కుటుంబమంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు, అమ్మవారి ప్రతిమ అందజేసి ఆశీర్వదించారు. ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్ మోహన్‌బాబు కుటుంబాన్ని శాలువాలతో సన్మానించారు. వారిని చూసేందుకు అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈవో ముత్యాలరావు, ఏఈవో అశోక్, సూపరింటెండెంట్ సాయిలు, జ్యోతిష్యులు దైవగ్న, బాసర, లోకేశ్వరం, ముథోల్ ఎస్సైలు నాగరాజు, వెంకటేశ్, రాజన్న, శ్యాంసుందర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement