temple chairman
-
అదిగదిగో.. యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలయానికి ఒక రూపు వచ్చింది. రాజగోపురాల పనులు పూర్తయ్యాయి.ప్రధానాలయంలో నగిషీలు చెక్కుతున్నారు. శివాలయం, భారీ కల్యాణ మండపం, విష్ణుపుష్కరిణి, వ్రత మండపం రూపుదిద్దుకుంటున్నాయి. 2020 సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎనిమిది మార్లు పర్యటించి ఆలయ పనులను పరిశీలించారు. సాక్షి, యాదాద్రి : యాదాద్రి ఆలయం పనులు పూర్తి కావొస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ఈ పనులను నిర్ణీత గడువు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డి యాదాద్రి పనులను పర్యవేక్షించి మరిన్ని సూచనలు చేశారు. నాణ్యత తగ్గకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి అని అయన అధికారులను ఆదేశించారు. స్పష్టమైన తేదీ చెప్పనప్పటికి వర్షాకాలం ముగిసేనాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎనిమిది సార్లు సీఎం కేసీఆర్ పర్యటన సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవాన్ని ఆషామాషీగా కాకుండా మహోన్నతంగా నిర్వహించడానికి ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. యాదాద్రి అభివృద్ధిపై దాదాపు 135ప్రణాళికలు, 266సమీక్షలు, 8మార్లు సీఎం కేసీఆర్ పర్యటనలు, సీఎంఓ భూపాల్‌రెడ్డి 78 సమీక్షలు నిర్వహించారు. వైటీడీఏ అధికారులు, స్థపతులు, ఆర్కిటెక్చర్లు, శిల్పులు ఇలా పలు విభాగాలకు చెందిన ప్రతినిధులు ఆలయ అభివృద్ధి రూపురేఖలు తీర్చిదిద్ధే ప్రణాళికల కోసం చైనా, సింగపూర్, బెంగళూరు, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని బెంగళూరు, తంజావూరు, తిరువనంతపురం పలు ప్రాంతాలను పర్యటించారు. వంద శాతం పూర్తయిన రాజగోపురాల పనులు ప్రధానాలయానికి అద్భుతమైన శోభను తెచ్చిపెడుతున్న సప్తరాజగోపురాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయం అంతర్గతంగా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పూర్తి చేసే పనిలో ఉన్నారు. అంతర్గతంగా విద్యుదీకరణ, శానిటేషన్ వంటి పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం పనులు 70శాతం పూర్తి కావచ్చాయి. సత్యనారాయణ వ్రతం, కల్యాణకట్ట, ప్రసాద విక్రయశాల మండపం, పుష్కరిణి పనులు వేగంగా జరుగుతున్నాయి. మినీట్యాంక్ బండ్ పనులు జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణ పనులు 50 శాతం పనులను ఇప్పటి వరకు పూర్తి చేశారు. యాదాద్రి కొండ చుట్టూ పచ్చదనాన్ని పర్చే విధంగా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడక్కడ భక్తులు సేదదీరడానికి పార్క్‌లు సిద్ధం చేస్తున్నారు. చివరి దశకు పనులు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నూతన ప్రధానాలయం నిర్మాణం, అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2020 బ్రహ్మోత్సవాల నాటికి పనులన్నింటినీ పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. గడువు విషయం ప్రకటించనప్పటికీ అంతర్గతంగా వి«ధించుకున్న టార్గెట్ ప్రకారం పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధానాలయం శిల్పిపనుల్లో భాగంగా రాజగోపురాలు, గర్భాలయం, గర్భాలయం లోపల ఉన్న ఆళ్వార్ల విగ్రహాలు, ఆలయ ప్రాకారాలు పూర్తయ్యాయి. గర్భాలయం గోడలపై ప్రహ్లాద చరిత్రను చెక్కుతున్నారు. గర్భాలయంలోని ధ్వజస్తంభం పనులతోపాటు ఆలయ తిరుమాడ వీధుల్లోని ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవ మండపం, శివాలయం వైపు ఈశాన్యంలో రోడ్డు పనులు చేయనున్నారు. చకాచకా శివాలయం పనులు ప్రధానాలయంతో పాటుగా హరిహరక్షేత్రంగా పేరుగాంచిన రామలింగేశ్వరాలయం(శివాలయం)లో యాగశాలకు వైటీడీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ యాగశాల, నవగ్రహ మండపాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. శివాలయం చుట్టూ ప్రాకారాలకు సుమారుగా 25 నంది విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలోకి ప్రవేశించే త్రితల రాజగోపురానికి ఎదురుగా ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. శివాలయంలో హైరోప్ పనులు నడుస్తున్నాయి. శివాలయం గర్భాలయంలోని ముఖ మండపంలో సుమారు 16 అందమైన స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 8 బాల పాదాలని, మరో 8 చిత్ర కంఠ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా యాగశాలకు సహజత్వం ఉట్టి పడే శోభాయమానంగా అలంకారం చేయబడిన మరో 16 కృష్ణ శిలలతో కూడిన రాతి స్తంభాలు అమరుస్తారు. ఈ ఆలయంలో నవగ్రహాలు, ఆంజనేయస్వామి మండపం ఉంటాయి. కొండపైన గల శివాలయానికి రామలింగేశ్వర స్వామి ఆలయంగా పేరున్నందున రామాలయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వివిధ ఆకృతులు గల శిల్పాలతో నిర్మాణం జరుగుతోంది. ప్రతి సంవత్సరం జరగనున్న శ్రీరామనవమి రోజున కల్యాణానికి సుమారు 500 మంది కూర్చొని తిలకించే విధంగా బ్రహ్మోత్సవ కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు. తుదిదశకు చేరిన సప్తతల రాజగోపురాల పనులు -
మహిళతో ఆలయ కమిటీ చైర్మన్ వివాహేతర సంబంధం
-
చైర్మెన్ పదవి బరిలో నలుగురు నేతలు
► రెండేళ్ళుగా ఎదురుచూస్తున్న ఆశావాహులు ► నలుగురు మధ్య ఉన్న పోటీ ఇద్దరికే పరిమితం ► కమిటీ నియామకంపై దృష్టిసారించని ఎమ్మేల్యే చిగురుమామిడి: మండలంలోని సుందరగిరి శ్రీవెంకటేశ్వరస్వామి చైర్మెన్ పదవి కోసం ఆశావాహులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు కావస్తున్నా ఆలయ అభివృద్ది కమిటీపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోతోంది. ఫలితంగా సుందరగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పలు అభివృద్ది పనులు నిలిచిపోతున్నాయి. చైర్మెన్ పదవి కోసం నలుగురు టీఆర్ఎస్ నాయకులు పోటీపడ్డారు. ఇందులో జంగ రమణారెడ్డి, బత్తిని సత్తయ్య, తాల్లపల్లి సంపత్, మిడివెల్లి వెంకటయ్యలు పోటీలో ఉన్నారు. వీరిలో తాల్లపల్లి సంపత్ గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బత్తిని సత్తయ్యగౌడ్ సుందరగిరి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షపదవిలో కొనసాగుతున్నారు. ఇక ఉన్నది ఇద్దరు మాత్రమే అయినప్పటికి ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. వీరిలో మిడివెల్లి వెంకటయ్యకు చిగురుమామిడి మండల జెడ్పీటీసీ సబ్యుడు వీరమల్ల చంద్రయ్య ఆశీస్సులతో, జంగ రమణారెడ్డి జెడ్పీ వైఎస్ చైర్మెన్ రాయిరెడ్డి రాజిరెడ్డి ఆశీస్సులతో పోటీలో ఉన్నారు. వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఒక దశలో అధ్యక్ష పదవి తనకే వచ్చినట్లు రమణారెడ్డి ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. గత సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించిన ఉత్తరద్వార దర్శన కార్యక్రమంలో ముగ్గురు కమిటీ సబ్యులతో ఆయన సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఇక అధికారికంగా ప్రకటన వెలువడటమే మిగిలిందనే వాదనలున్నాయి. ఏదిఏమైనా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి పాలకమండలిని ప్రభుత్వం నియమించకపోవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మేల్యే వొడితెల సతీష్‌కుమార్ కమిటీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆలయ చైర్మన్‌పై నిర్భయ కేసు
ఎల్బీనగర్ : హైదరాబాద్ లోని ఎల్బీనగర్లో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ రాజేష్‌పై శుక్రవారం నిర్భయ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. తనకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడని ఓ యువతి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో రాజేష్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజేష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
అమ్మవారి సేవలో సినీ నటుడు మోహన్‌బాబు
బాసర : శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని శుక్రవారం ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు వారికి ఆలయాధికారులు ఘనస్వాగతం పలికారు. మోహన్‌బాబు, ఆయన భార్య, పెద్ద కుమారుడు మంచు విష్ణు, కోడలు, మనుమరాళ్లు అరియాన, విరియానా వచ్చారు. మనుమరాళ్లకు అక్షరాభ్యాసం చేయించారు. కుటుంబమంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు, అమ్మవారి ప్రతిమ అందజేసి ఆశీర్వదించారు. ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్ మోహన్‌బాబు కుటుంబాన్ని శాలువాలతో సన్మానించారు. వారిని చూసేందుకు అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈవో ముత్యాలరావు, ఏఈవో అశోక్, సూపరింటెండెంట్ సాయిలు, జ్యోతిష్యులు దైవగ్న, బాసర, లోకేశ్వరం, ముథోల్ ఎస్సైలు నాగరాజు, వెంకటేశ్, రాజన్న, శ్యాంసుందర్ పాల్గొన్నారు. -
‘నామినేటెడ్’ పోస్టులపై...
- పదవుల కోసం నాయకుల చుట్టూ చక్కర్లు - ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు - బయోడేటాలు సమర్పిస్తున్న ఆశావహులు సాక్షి, మంచిర్యాల : ‘నాతో కలిసి, పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గుర్తుపెట్టుకుంటా. వీలైనంత వరకు అందరికీ పదవులు వస్తాయి’అని ఆచార్య జయశంకర్ మూడో వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు గులాబీ దండులో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. తాజా ప్రకటనతో నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇన్నాళ్లు ఉద్యమంలో భాగంగా కీలక పాత్ర పోషించిన తమకు పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పదవి ఇస్తే సముచితంగా ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రధానంగా జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్, ఆలయాల చైర్మన్‌తోపాటు గ్రంథాలయ చైర్మన్ వంటి పదవులు నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. వీటికోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ కారణంగా పోటీకి దూరంగా ఉన్న నాయకుల్లో ఆసక్తి జోరందుకుంది. ఈ పదవులే కాకుండా రాష్ట్రస్థాయి పాలకమండలిల్లో తమను సభ్యుడిగా నియమించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా నుంచి పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున్నే పార్టీ న్యాయం చేస్తుందనే భరోసా సదరు నాయకుల్లో ఉంది. కాగా, ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెలరోజులు కావస్తుండం, నామినేటెడ్ పోస్టులను భర్తీచేసే అవకాశం ఉండటంతో నాయకులు పార్టీ అధినేతలను కలుస్తున్నారు. పార్టీలోకి కొత్త నేతల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకమాట చెప్పి ఉంచితే బాగుంటుందని భావిస్తున్నారు. ఆశావహులు కొందరు హైదరాబాద్ వెళ్లి మంత్రులు, రాష్ట్రప్రతినిధులను కలిసి తమ బయోడాటాలు ఇస్తున్నారు. అందులో తమ రాజకీయ జీవితంతోపాటు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తమ భాగస్వామ్యాన్ని పేర్కొంటున్నారు. వీటికే నియామకాలుజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తోపాటు జిల్లాలోని మార్కెటు యార్డులు, దేవాలయాలకు చెందిన పాలకమండళ్లు నియామకం జరగనున్నాయి. జిల్లాలో 17 మార్కెట్ యార్డులుండగా ఇందులో 13 యార్డులకు పాలకమండళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్, జైనథ్, నిర్మల్, సారంగాపూర్, కుభీర్, ఖానాపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, బోథ్, వీటికి పాలకమండళ్లు కొనసాగుతున్నాయి. మూడేళ్ల వీరి పదవీకాలం ఇంకా ముగియలేదు, ప్రభుత్వం నుంచి తొలగింపు ఆదే శాలు రాలేదు. ఈ నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. అయితే ఈ నియామకాలను రద్దుచేస్తూ కొత్త వారిని నియమించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే సదరు నియామకాలు చేసే అవకాశాలుంటాయని ఆశావహులు భావిస్తున్నారు. బెల్లంపల్లి, ఇంద్రవెల్లి, జైనూర్, భైంసాల కమిటీల నియామకం కాలేదు. వీటిని కూడా సంబంధిత నామినేటెడ్ సమయంలో భర్తీ చేసే అవకాశం ఉంది. జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వ స్తూ పాలకమండళ్లు ఉ న్న దేవాలయాలు26. ఇందులో ఏడు దేవాలయాలకు పాలకమండళ్లు ఉ న్నాయి. 16 దేవాలయాలకు లేవు. మరో రెండు మఠాలు, ఒక ధర్మశాలల కు పాలకమండలి నియామకం ఉండదు. పాలకమండళ్లు ఉన్న దేవాలయా లు అడెల్లి పోచమ్మ(సారంగాపూర్), లక్ష్మీదేవి ఆలయం (చింతగూడ), నా గోబా(కేస్లాపూర్), లక్ష్మీనరసింహస్వామి(కాల్వ), లక్ష్మీవెంకటేశ్వస్వామి ఆలయం (నిర్మల్), విశ్వనాథ ఆలయం(మంచిర్యాల), కత్తెరసాల మల్లన్న ఆలయం(చెన్నూర్), మదనపోచమ్మ ఆలయం(చెన్నూర్), బాలాజీ వెంకటేశ్వర ఆలయం(గంగాపూర్), జగన్నాథస్వామి ఆలయం(చెన్నూర్). -
నయనానందంగా శ్రీరామ రథోత్సవం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామ దివ్య రథోత్సవాన్ని నయనానందపర్వంగా నిర్వహించారు. ముందుగా సముద్రాల యాదగిరాచార్య, శఠగోపాలాచార్య, సంపత్కుమారాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. భక్తాంజనేయస్వామి భజన మండలి ఆధ్వర్యంలో భజ న, దుర్గా భవాని మహిళా మండలి గోదా కోలాట బృందాలు, పాలబిందెల బాలు నృత్యాలు, పెంటయ్య బ్యాండు భక్తి గీతాలాపనలతో రథోత్సవం పురవీధుల్లో సాగింది. ఈ సందర్భంగా అడుగడుగునా భక్తులు హారతులతో నీరజనాలు పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మనోహర్‌రెడ్డి, టుటౌన్ ఎస్ఐ బాషా, కమిటీ సభ్యులు జడల సువర్ణ, సునీతవేమన, శ్రీనివాసాచార్యులు, భక్తులు చకిలం వేణుగోపాలరావు, అర్చకులు పాల్గొన్నారు.