
పులివెందులలో ప్రత్యేక పూజలు
మూడు రోజుల జలదీక్ష చేపట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నుంచి కర్నూలు బయల్దేరారు.
మూడు రోజుల జలదీక్ష చేపట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నుంచి కర్నూలు బయల్దేరారు. అంతకుముందు ఆయన పులివెందుల అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ దీక్షను చేపడుతున్న విషయం తెలిసిందే.
దిగువ కృష్ణా డెల్టాకు నీరు రాకుండా అడ్డుపడే ఈ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఈ దీక్ష చేపడుతున్నారు. ఈనెల 17వ తేదీన అన్ని మండల కేంద్రాలలో పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టనున్నాయి.