
బండెనక బండి కట్టి
గత 10 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు పోతున్నారు. వర్షం కోసం ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ధరూరు : గత 10 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు పోతున్నారు. వర్షం కోసం ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సాయంత్రం మండల కేంద్రానికి చెందిన రైతులు దాదాపు 20 ఎద్దుల బండ్లను కట్టుకుని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నీటిని తీసుక వచ్చి ధరూరులోని శ్రీ ఆంజనేయ స్వామి, శివాలయం, కాలప్ప, వీరబద్ర స్వామి, బీరప్ప, కొండేటి ఆంజనేయుడు, పార్థసారథి, ధర్వేశెల్లి ఆలయం, సవారమ్మ, తదితర ఆలయాల్లో అభిషేకం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు నర్సింహులు, కుంటెన్న, కిష్టన్న, జయన్న, దర్శెల్లి, ఆంజనేయులు, పరుశరాం, అంజనప్ప పాల్గొన్నారు.