అమ్మవారి సన్నిధిలో 108 కొబ్బరికాయలు కొట్టారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి పేరిట అష్టోత్తర పూజను నిర్వహించారు.
సింహాచలం, న్యూస్‌లై న్: రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలకు తన సేవలందించాలని కోరుతూ పార్టీ జిల్లా, నగర, నియోజకవర్గాల సమన్వయకర్తలు సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ఉత్తరాంధ్ర పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం వీరంతా సింహగిరికి తరలివచ్చారు. గాలిగోపురం వద్ద బెలూన్లు ఎగురవేశారు.
అమ్మవారి సన్నిధిలో 108 కొబ్బరికాయలు కొట్టారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి పేరిట అష్టోత్తర పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, భీమి లి, ఉత్తర, పశ్చిమ, గాజువాక నియోజక వర్గాల సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, జి.వి.రవిరాజు, దాడి రత్నాకర్, తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, వి.భాస్కర్, వంకాయల మారుతీ ప్రసాద్, పక్కి దివాకర్, శ్రీకాంత్, గొలగాని శ్రీనివాసరావు, వినోద్, ఈశ్వరరావు, చల్ల అప్పారావు, కొయ్య నారాయణరెడ్డి, రాకేష్ మహదేవ్, కె.జయప్రకాష్‌రెడ్డి, 72వ వార్డు నాయకులు పీతల అప్పలరాజు, పీతల విష్ణుమూర్తి, కొలుసు ఈశ్వరరావు, బోర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో...
సిరిపురం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకులు మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మహిళలకు అత్యంత కీలకపదవులు, గౌరవం దక్కుతాయన్నారు. అంతకుముందు సాంస్కృతిక విభాగం కన్వీనర్ కె.రాధ అద్భుత గీతాలు ఆలపించిన అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, సీఈసీ సభ్యురాలు పిన్నింటి వరలక్ష్మి, సమన్వయకర్తలు జి.వి.రవిరాజు, కోరాడ రాజబాబు, అధికార ప్రతినిధి నీలా ఉమారాణి, నారా అమ్మాజీ తోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
చీమలాపల్లిలో రక్తదాన శిబిరం
చినముషిడివాడ: జీవీఎంసీ 70వ వార్డు చీమలాపల్లిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గండి బాబ్జీ కేక్ కట్ చేసి అభిమానులకు పం చిపెట్టారు. పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని బాబ్జి చేతుల మీదుగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్ చేస్తున్న పోరాటం చరిత్రాత్మకమని కొనియాడారు. పార్టీ నాయకులు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొన్నారు.
పశ్చిమ పార్టీ కార్యాలయంలో...
ఎన్‌ఏడీ జంక్షన్: ఎన్‌ఏడీ కూడలిలోని పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ నాయకులు జి.వి.రవిరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, నగర బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్ పాల్గొన్నారు.