నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పెనుమత్స సాంబశివరాజు పార్టీ నాయకులతో కలిసి శనివారం రామతీర్థం శ్రీరామ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. జగన్‌పేరిట అర్చన చేయించారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడిందన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ప్రజలకేం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో హింస పెరిగిపోయిందన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కోలేకే హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన కొద్ది సేపటికే రాష్ట్ర డీజీపీ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని భావిస్తున్నామన్నారు. ఏ ఎన్నికల్లో కూడా గెలవలేకపోయిన మంత్రి సోమిరెడ్డి హత్యాయత్నాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్న విధానం సరికాదన్నారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులే విచారణను పక్కదారి పట్టిస్తున్నారని, ఈ దాడిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు చనమళ్లు వెంకటరమణ మాట్లాడుతూ వెన్నుపోటు, హత్యా రాజకీయాలు చంద్రబాబు నైజమన్నారు.
జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు మాట్లాడుతూ అత్యంత జనాదరణ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజాదరణ కలిగిన నాయకులపై దాడులు చేయించడం టీడీపీకి కొత్తేమీ కాదన్నారు. వంగవీటి మోహన రంగాను హత్య చేయించిన రాజకీయ చరిత్ర టీడీపీదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాంబార్కి రామారావు, సత్యం, సంచాన సూరిబాబు, తర్లాడ దుర్గారావు, అట్టాడ అప్పలనాయుడు, తర్లాడ రామస్వామి, మహంతి రామారావు, పతివాడ రామారావు, చిట్టోడు, రెడ్డి రామదాసు, సూరప్పడు, పల్లి క్రిష్ణ, ఆర్.రామారావు, బి.సత్యం, పిన్నింటి శ్రీనివాసరావు, పరిసినాయుడు, కంచరాపు రాము, యరకయ్య, రాములు, మీసాల నారాయణరావు, మోహనరావు, రామ్మోహనరావు, లెంక శివ, ఆబోతుల శ్రీరాములు, ఇప్పిలి అప్పలనాయుడు, అట్టాడ రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
జగన్ త్వరగా కోలుకోవాలని పూజలు
చీపురుపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం వెనుక టీడీపీ హస్తం ఉందని మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ బెల్లాన శ్రీదేవి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు త్వరగా కోలుకుని ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించాలని కోరుతూ బెల్లాన శ్రీదేవి ఆధ్వర్యంలో మేజర్ పంచాయతీకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు శనివారం పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ దత్తసాయి మందిరంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఈ పరిస్థితులు బాగుపడాలంటే జగన్ త్వరగా కోలుకునేలా భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరారు. ఆయనపై హత్యాయత్నం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు.
అవేం మాటలు..
తెలుగుదేశం ఎంపీలు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ను మట్టుబెట్టాలన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు. సాటి మనిషికి గాయమైతే కనీస సానుభూతి చూపించడం మానవ ధర్మమని అలాంటిది రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగితే ప్రభుత్వం, సీఎం కనీసం సానుభూతి ప్రకటించకపోవడం దుర్మార్గపు పరిపాలనకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
2003లో చంద్రబాబుపై బాంబు దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సానుభూతి ప్రకటించడమే కాకుండా తిరుపతిలో నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపిన సంఘటన గుర్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇప్పిలి సుధారాణి, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పతివాడ రాజారావు, యువజన విభాగం అధ్యక్షుడు ఇప్పిలి తిరుమల, పార్టీ నాయకులు ఇప్పిలి గోవింద్, మహంతి ఉమ, అప్పికొండ ఆదిబాబు, మల్లెంపూడి శ్రీను, పీతల మురళి, సతివాడ అప్పారావు, మీసాల రాజగోపాలనాయుడు, రెడ్డి జగదీష్, సుంకరి చంద్రశేఖర్‌గుప్త, మహంతి లక్ష్మణ, బలగ రమేష్, ఎస్‌విజి.శ్రీనివాసరావు, సువ్వాడ శ్రీను, కొమ్ము చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment