
పల్లె గడపతొక్కిన గోదారమ్మ..
నీళ్లొచ్చిన వేళ.. చిన్నాపెద్ద అంతా ఆనంద సాగరంలో మునిగిపోయారు. పల్లెగడప తొక్కిన గోదారమ్మను ముద్దాడారు. మిషన్ భగీరథలో భాగంగా మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం వడ్డెపల్లి వద్ద నిర్మించిన ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా దుబ్బాకలోని మాల కుంట సంపు వరకు శనివారం ఉదయం 11.15 గంటలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చారు. గోదారమ్మకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 101 కొబ్బరి కాయలు కొట్టారు. మండుటెండల్లో నీళ్లు చెంత కు చేరడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. - దుబ్బాక