godavari water
-
‘మహా’ దాహార్తి తీర్చేందుకు..
సాక్షి, హైదరాబాద్: మహానగర తాగునీటి అవసరాల కోసం మరో 20 టీఎంసీలను గోదావరి జలాలను మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి తరలించేందుకు టెండర్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా పథకం 2, 3 దశ పనులు చేపట్టేందుకు సుమారు రూ.7,360 కోట్లను మంజూరు చేసింది. దీంతో ఈ నెల 15వ తేదీలోగా టెండర్లను ఆహ్వానించేందుకు జలమండలి కసరత్తు ప్రారంభించింది.గోదావరి జలాల్లో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా ఇప్పటికే గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. తాజాగా రెండు, మూడో దశ కింద మిగిలిన 20 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నగర ప్రాజెక్టును హైబ్రీడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) చేపట్టనున్నారు. మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించనున్నారు. ప్రభుత్వం తమ వాటా నిధులను హడ్కో వద్ద రుణం తీసుకోనుంది. ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తిచేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. రెండు వరసల పైప్లైన్లతో..కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను ఘన్పూర్ మీదుగా ఉస్మాన్‌సాగర్ వరకు తరలించనున్నారు. మొత్తం 20 టీఎంసీల్లో నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పునరుజ్జీవానికి వినియోగించనున్నారు. రెండు పైప్లైన్ల ద్వారా 3000 ఎంఎం డయాతో 50 కిలోమీటర్లు, 2,200 ఎంఎం డయాతో 58 కిలో మీటర్ల వరకు పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. ఘన్పూర్ వద్ద సుమారు 1170 ఎంఎల్డీల నీటిశుద్ధి ప్లాంట్ నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి జంక్షన్ వరకు 2400 ఎంఎం పైప్‌లైన్ 40 కిలోమీటర్ల వరకు, దాని వెంట 3000 ఎంఎం డయా రింగ్ మెయిన్‌ను కలుపుతూ పైప్‌లైన్ నిర్మాణం చేపడతారు. ఉస్మాన్‌సాగర్‌లో 120 ఎంఎల్డీ, హిమాయత్‌సాగర్‌లో 70 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మిస్తారు. -
గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు ఏపీని ఆపటం చేతకాకుంటే.. అఖిలపక్షాన్ని తీసుకుని పోవాలి. సీఎం రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారన్న అనుమానం కలుగుతుందంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.బంకచర్ల ద్వారా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే.. రేవంత్ మౌనంగా ఉండటానికి కారణమేంటి?. ప్రాజక్ట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారు. ఏపీ, కర్ణాటకలు గోదావరి జలాలు తరలించుకుపోతే దావోస్, ఢిల్లీ యాత్రల్లో బిజీగా ఉన్నారు. గోదావరి నీటిని ఏపీ.. తుంగభద్ర నీళ్లను కర్ణాటక తరలించుకుపోతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతుంటే సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందించరు?. ఇరిగేషన్ శాఖమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్. ఉత్తమ్‌కు చేతనైతే.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్ చేశారు.‘‘హక్కుగా రావాల్సిన నీటిని కూడా 13 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం సాధించలేకపోయింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 40వేల కోట్లు ఏపీకి ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా కర్ణాటక అడ్డుకుంటోన్న సీఎం స్పందించటం లేదు.’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ సీఎం చంద్రబాబు ఎత్తేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూపంలో రూ.1,100 కోట్లు వెరసి రూ.3,900 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లను చెల్లించడం లేదు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ స్వర్ణాంధ్ర విజన్–2047 పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటాకానికి తెరతీశారు. రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతిని నిర్మిస్తానని ప్రకటనలు చేస్తూనే.. రోజుకో పిట్టకథ చెబుతూ ఆ నాటకాన్ని రక్తికట్టించడం ద్వారా ప్రజలను ఏమార్చేందుకు పూనుకున్నారు.అందులో భాగంగా సోమవారం విజన్–2047 డాక్యుమెంట్లో పది సూత్రాల్లో ఒకటైన నీటి భద్రతపై వెలగపూడిలోని సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి–బనకచర్ల గోదావరి జలాలను రాయలసీమలోని బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశమయంటూ జనం చెవిలో పువ్వు పెట్టారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే నాటి సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారు. గోదావరిలో ఏటా సగటున సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను ఈ ప్రాజెక్టు ద్వారా తరలించాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)పై 2019, డిసెంబరు 20న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాప్కోస్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో కనిష్ఠ వ్యయంతో ఒడిసి పట్టి.. దుర్భిక్ష ప్రాంతాలకు తరలించడం ద్వారా కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో 2014–19 మధ్య ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కి పనులు చేపట్టడం ద్వారా నాటి సీఎం చంద్రబాబు సృష్టించిన విధ్వంసాన్ని వైఎస్ జగన్ చక్కదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా.. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు. పోలవరంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తోటపల్లి తదితర ప్రాజెక్టులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపడితే– వాటిని తానే ప్రారంభించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ రూపొందించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు కూడా తన మానసపుత్రికగా చంద్రబాబు చెప్పుకోవడంపై నీటిపారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. మూడేళ్లలో ‘బనకచర్ల’?మూడేళ్లలో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించేలా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంబర్ అవుతుందన్నారు. నదుల అనుసంధానంతో భావి తరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్‌లోని పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే మూడువేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిసిపడతామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని.. పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చని చంద్రబాబు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..వెలుగొండతో ‘ప్రకాశం’లో కరువుకు చెక్..ఇక వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రకాశం జిల్లాలో కరువును అరికట్టవచ్చు. భావితరాలకు ఉపయోగపడే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,112 కోట్లు అవసరమవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు హైబ్రీడ్ విధానంలో ప్రైవేటు సంస్థ భాగస్వామ్యం ద్వారా నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టు గురించి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించా. డీపీఆర్ పూర్తిచేసి.. పనులకు రెండు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తాం. సకాలంలో నిధులు అందితే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. గత పాలకుల అసమర్థత, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాం. క్యూఆర్ కోడ్‌తో ప్రజాభిప్రాయ సేకరణప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలను సేకరించి అందుకు తగ్గట్టుగా అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆస్పత్రులకు వచ్చే రోగుల వరకు ప్రభుత్వ సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలన్నారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో రూ.860 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులపైనా ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. తద్వారా ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేíÙంచి పనులు మెరుగుపర్చాలన్నారు. దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేస్తున్నారా.. లేదా.. అనేది జీపీఎస్ అనుసంధానం ద్వారా తెలుసుకోవాలని, మద్యం బెల్టు షాపులు ఎక్కడైనా ఉన్నాయా అన్న సమాచారాన్ని ప్రజల నుంచి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్‌లలో సీసీ కెమెరాలు, వాహనాల జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని, ఇక నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని అన్నారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలన్నారు. -
భద్రాచలంలో ఉరకలేస్తున్న గోదావరి (ఫొటోలు)
-
ఇంటింటికి గోదావరి
-
Godavari Water Level: భద్రాచలం వద్ద గోదారమ్మ మహోగ్రరూపం (ఫొటోలు)
-
తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ జలాల్లో రెండు రా ష్ట్రాలకు వాటాలు తేల్చే వరకు తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీ తరలింపు సహా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరో మారు విజ్ఞప్తి చేసింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా నీటి వాటాలు తేలాలని లేదా నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాకే కొత్త ప్రాజెక్టులకు అను మతివ్వాలని గుర్తు చేసింది. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలు తరలించేలా కాళేశ్వరం ఎత్తిపోతలకు 2018 జూన్ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపింది. ఆ అనుమతిని పునఃసమీక్షించాలని, తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని కేంద్రాన్ని కోరింది. వాటాలు తేల కుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పింది. ఏపీ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. దమ్ముగూడెం ఆనకట్టకు 200 మీటర్లు దిగువన 36.57 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బ్యారేజీ, దానికి అనుబంధంగా 320 మె.వా జలవిద్యుత్ కేంద్రం నిరి్మంచి.. రోజుకు 9 వేల క్యూసెక్కుల చొప్పున 70 టీఎంసీలను తరలించి 6.74 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ఎత్తిపోతలను తెలంగాణ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అనుమతి కోరుతూ డీపీఆర్ ను గోదావరి బోర్డుకు అందజేసింది. నీటి కేటాయింపుల్లేకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని తెలంగాణ సర్కార్‌ను బోర్డు నిలదీసింది. ఈ పథకం చేపడితే పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని బోర్డు కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో సారి కోరింది. రాష్ట్ర అవసరాలు 1238.436 టీఎంసీలు గోదావరి బేసిన్లో ఇప్పటికే పూర్తయినవి, నిర్మాణంలో ఉన్నవి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,238.436 టీఎంసీలు అవసరమని కేంద్రానికి రా ష్ట్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఇందు లో ఇప్పటికే పూర్తయి, వినియోగంలో ఉన్న ప్రాజె క్టులతోపాటు పోలవరానికి 737.156 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఉమ్మడి రా ష్ట్రం లో చేపట్టి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లకు 165.280 టీఎంసీలు అవసరం. మొత్తం 902.436 టీఎంసీలు అవసరం. బచావత్ ట్రిబ్యునల్ వరద జలాలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను, ఎగు వ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలను వాడుకునే హక్కును దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి కల్పించింది. విభజన నేపథ్యంలో బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. 336 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతామని ఇప్పటికే కేంద్రానికి ఏపీ స్పష్టం చేసింది. గోదావరి జలాలను 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని లేదంటే రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై ఒప్పందం జరగాలని పేర్కొంది. -
మల్లన్న సు‘జలం’ సిద్ధం.. 6.57 లక్షల గృహాలకు తాగునీరు
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను శుద్ధిచేసి ఆరు జిల్లాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలో 6.57లక్షల గృహాలకు తాగునీటిని అందించే బృహత్తర పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్ల వ్యయంతో 540 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. 270 ఎంఎల్డీ చొప్పున రెండు ప్లాంట్లను నిర్మించగా, ఒక ప్లాంట్ పూర్తికావడంతో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. మరో 270ఎంఎల్డీ డబ్ల్యూటీపీ పనులు ఆగస్టులో పూర్తికానున్నాయి. మల్లన్నసాగర్ నుంచి 7.26టీఎంసీల నీరు.. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ను 50టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా నిర్మించారు. ఏటా 7.26టీఎంసీల నీటిని తాగునీటిగా వినియోగించాలని నిర్ణయించారు. రా వాటర్‌ను శుద్ధి చేసేందుకు కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద ఆరు మోటార్ల ద్వారా 5.6 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో మంగోల్‌లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు చేరుస్తారు. 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సామర్థ్యంతో రెండు నీటి శుదీ్ధకరణ ప్లాంట్లు ఒక్కోటి 270 ఎంఎల్డీ చొప్పున నిర్మించారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చిన నీళ్లు మంగోల్ వద్ద శుదిŠధ్ చేసి, 3 కిలోమీటర్ల దూరంలోని లకుడారంలో 6 ఎంఎల్(మిలియన్ లీటర్లు) సామర్థ్యం కలిగిన గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్)లోకి పంపిస్తారు. ఇందుకు జీఎల్‌బీఆర్ వద్ద రెండు పాయింట్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద ఉన్న ట్యాంక్‌లోకి తరలిస్తారు. అక్కడి నుంచి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. అక్కారంలోని నాలుగు పాయింట్ల నుంచి.. కొమురవెల్లి కమాన్ నుంచి మరో పాయింట్ ద్వారా 29 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట నియోజకవర్గానికి నీటిని తరలిస్తారు. లకుడారం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోని అక్కారం వద్ద 6ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సంపులోకి పంపిస్తారు. అక్కారం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్లలో.. ఒక పాయింట్ నుంచి 33.6 కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘనపురం గుట్టకు నీటిని పంపింగ్ చేస్తారు. ఈ గుట్ట నుంచి మేడ్చల్, ఆలేరు, భువనగిరికి ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్‌తో నీటిని పంపిస్తారు. రెండో పాయింట్‌ను 5.4 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ కోమటిబండ లైన్‌కు కలుపుతారు. ఇక్కడి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాలకు ఈ జలాలు వెళ్తాయి. మూడో పాయింట్ నుంచి సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు తరలిస్తారు. నాలుగో పాయింట్‌ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి పంపింగ్ చేయనున్నారు. 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మొత్తంగా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు ఆరు జిల్లాలలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలోని 6,57,203 గృహాలకు తాగునీటిని అందించనున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4,81,217 గృహాలకు నీటి సరఫరా కానున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, మేడ్చల్, దుబ్బాక, ఆలేర్, జనగామ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుప్రాన్, మోత్కూర్, పోచంపల్లి, ఘట్కేసర్, దిండిగల్, గుండ్ల పోచంపల్లి, తిరుమలగిరి పట్టణాల్లో 1,75,986 గృహాలకు నీటిని సరఫరా చేస్తారు. జూలై నాటికి సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 439 ఆవాసాలకు, గజ్వేల్, దుబ్బాక, తుప్రాన్ మున్సిపాలిటీలకు, ఆగస్టు నాటికి మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో 611 ఆవాసాలు, ఘట్కేసర్, మేడ్చల్, దుండిగల్, గుండ్లపోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు తాగు నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నెల రోజుల్లో సరఫరా డబ్ల్యూటీపీ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్లాంట్ ద్వారా నెల రోజుల్లో పంపింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు నాటికి 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మల్లన్న సాగర్ నుంచి శుద్ధిచేసిన గోదావరి జలాలను సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
నికర జలాల మిగులు తేలాక కావేరికి గోదావరి
ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన: ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా వాటిని సోమశిల, కండలేరుకు తరలించి.. అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లాలి. ఆవిరి ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలి. దీని ప్రకారం పనులు చేపట్టాలంటే తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఏపీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సారవంతమైన భూములను సేకరించాలి. ఇది ఖర్చుతోనూ కూడుకున్నది. సారవంతమైన భూములను సేకరించడం అతి పెద్ద సవాల్. సీఎం జగన్ చేసిన ప్రతిపాదన: పోలవరం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి కృష్ణా నది మీదుగా రివర్స్ పంపింగ్ చేస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలించి.., పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా తెలుగు గంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించి.. అక్కడి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలి. దీని ప్రకారం పనులు చేపట్టడానికి తెలంగాణలో అతి తక్కువ భూమిని సేకరిస్తే సరిపోతుంది. ఏపీలో భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో గోదావరి–కావేరి అనుసంధానం చేయడమే కాదు దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయవచ్చు. సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. 75 శాతం లభ్యత (నికర జలాలు) ఆధారంగా మిగులు జలాలు ఉన్నాయని తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన టాస్క్‌ఫోర్స్ 17వ సమావేశంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కృష్ణా – పెన్నాలను అనుసంధానం చేసి దేశంలో నదుల అనుసంధానికి ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని శశిభూషణ్‌కుమార్ గుర్తు చేశారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానంలో దిగువ రాష్ట్రమైన తమ హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. కేంద్రం నిధులు ఇచ్చి సహకరిస్తే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి కుడి కాలువ ద్వారా దేశంలో అతి పెద్ద నదులైన గోదావరి, కృష్ణాను అనుసంధానం చేసి, 80 టీఎంసీలను తరలిస్తామని చెప్పారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరాం సానుకూలంగా స్పందించారు. సత్వరమే పోలవరాన్ని పూర్తి చేయడానికి సరిపడా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సూచిస్తానని హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే ఇచ్చంపల్లి వద్ద గోదావరిలో నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ ప్రతినిధులను ఆహ్వానించకుండా ఆ రాష్ట్ర కోటా నీటిని వాడుకుంటామని ప్రతిపాదించడంపై ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే అనుసంధానం చేపట్టాలని స్పష్టంచేశారు. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకునే సమయానికి గోదావరికి మహానది జలాలను తరలిస్తామని, వాటిని కావేరికి తీసుకెళ్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ చర్చలు జరుపుతారని తెలిపారు. పోలవరం నుంచి గోదావరి తరలింపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను వెదిరె శ్రీరామ్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదన మేరకు అనుసంధానం చేపడితే.. భూసేకరణ సమస్య లేకుండా, అతి తక్కువ వ్యయంతో కావేరికి గోదావరి జలాలను తరలించవచ్చని వివరించారు. దీనివల్ల ఐదు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం చేకూర్చవచ్చని చెప్పారు. సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని తెలంగాణ అధికారులు సూచించారు. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని వెదిరె శ్రీరాం చెప్పారు. -
వాటాలు తేల్చాకే కాళేశ్వరానికి మూడో టీఎంసీ
సాక్షి, అమరావతి: గోదావరి జలాల్లో నీటి వాటాలు తేలే వరకు మూడో టీఎంసీని తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులకు అనుమతి ఇవ్వకూడదని గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా నీటి వాటాలు తేలే వరకు లేదా నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గుర్తు చేసింది. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి గోదావరి జలాలను రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా కాళేశ్వరం ఎత్తిపోతలకు 2018 జూన్ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపింది. నీటి వాటాలు తేలేదాకా ఆ అనుమతిని పునఃసమీక్షించడంతో పాటు మూడో టీఎంసీకి అనుమతి ఇవ్వొద్దని గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు తెగేసి చెబుతూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. వాటాలు తేలకుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పారు. ఏపీ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత గోదావరి బోర్డుపై ఉందని గుర్తు చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైతేనే.. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ)ను కేంద్రం ఏర్పాటు చేయాలి. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో గోదావరి జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. కానీ.. ఇప్పటి దాకా ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేయలేదు. ట్రిబ్యునల్ ఏర్పాటైతేనే రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలే అవకాశం ఉంది. నీటి వాటాలు తేలకుండానే తెలంగాణ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం (రెండు టీఎంసీలు), చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశాల్లో, కేంద్ర జల్ శక్తి శాఖ సమావేశాలు, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతి లేకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల విస్తరణ (మూడో టీఎంసీ తరలింపు) పనులు చేపట్టడంపై తెలంగాణ రైతులు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను గోదావరి బోర్డు ఆపేసింది. ఈ నెల 6న ఆ డీపీఆర్‌ను పరిశీలించాలని గోదావరి బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీకి 1,238.436 టీఎంసీలు అవసరం గోదావరి పరివాహక ప్రాంతం(బేసిన్)లో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులకు 1,238.436 టీఎంసీలు అవసరమని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. ఇందులో ఇప్పటికే పూర్తయి, వినియోగంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు పోలవరానికి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 737.153 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 75 శాతం లభ్యత ఆధారంగా 165.280 టీఎంసీలు అవసరం. మొత్తంగా 75 శాతం లభ్యత ఆధారంగా 902.433 టీఎంసీలు అవసరం. వరద జలాలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను, ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన మిగిలిన నికర జలాలను వాడుకునే హక్కును దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. విభజన నేపథ్యంలో బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. 336 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతామని ఇప్పటికే కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
Hyderabad: నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల నీరు నేలపాలు
సాక్షి, హైదరాబాద్: వందల కిలో మీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల్లో నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల విలువైన తాగునీరు వృథా అవుతుండడం తీరని వ్యథ మిగులుస్తోంది. నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ, జంట జలాశయాలు, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 593 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 12 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. ఇందులో సుమారు 25 శాతం వృథా అవుతోంది. పురాతన పైపులైన్లకు తరచూ ఏర్పడుతోన్న లీకేజీలు, అక్రమ నల్లాలు, నీటి చౌర్యం ఇందుకు ప్రధాన కారణం. కాగా ఈ నీటితో శివారు ప్రాంతాల్లో 35 లక్షల మంది దాహార్తిని తీర్చే అవకాశం ఉందని తాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటివృథాను అరికట్టేందుకు నగరంలో 400కు పైగా ఉన్న స్టోరేజి రిజర్వాయర్ల పరిధిలో సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. వృథాపై పబ్లిక్ నజర్.. తాగునీటి వృథాను అరికట్టే కృషిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టనున్న మొబైల్యాప్ దోహదం చేస్తుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు ఈ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా పైపులైన్ల లీకేజీలు, రిజర్వాయర్ల వద్ద నీటివృథా, అక్రమ నల్లాల ద్వారా జరుగుతోన్న నీటిచౌర్యంపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కలి్పంచనున్నారు. అంతేకాదు నీటివృథాపై అప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఫోటో తీసి అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ సమాచారం క్షణాల్లో ఉన్నతాధికారులతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడం ద్వారా నీటివృథాకు చెక్‌పెట్టవచ్చని తెలిపారు. అక్రమ నల్లాలపై సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. కాగా ఔటర్‌పరిధిలోని 190 గ్రామాలు, నగరపాలక సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఓఆర్ఆర్ తాగునీటి పథకం ఫేజ్–1,ఫేజ్–2 పథకాలను పూర్తిచేసిన విషయం విదితమే. ఈ పథకం కింద సుమారు ఐదువేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సుమారు 200కు పైగా నూతనంగా తాగునీటి స్టోరేజి రిజర్వాయర్లను నిరి్మంచిన విషయం విదితమే. ప్రస్తుతం జలమండలి ప్రతీ వ్యక్తికి ప్రధాన నగరంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 150 లీటర్ల తాగునీటిని అందిస్తుండగా..శివారు ప్రాంతాల్లో సుమారు వంద లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. -
వరద ప్రవాహానికి మునిగిన అక్విడెక్ట్ బ్రిడ్జి
-
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
-
కాఫర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారు: మంత్రి అంబటి
-
ఏపీ: ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి జలాలు విడుదల
-
నలుపు రంగులోకి గోదావరి నీరు.. ప్రమాదం తప్పదు.. జాగ్రత్త!
బాల్కొండ/నిజామాబాద్: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితమవుతోంది. నీరు నలుపు రంగులోకి మారిందని, దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అధికంగా ఉన్నప్పుడు ఎగువ నుంచి వదిలిన వ్యర్థాలు నీటిలో కలిసి పోయి దిగువకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న నీటి నిల్వతో వ్యర్థాల ప్రభావం ఏర్పడుతోంది. ఎగువ భాగాన మహారాష్ట్రలో అధికంగా ఉన్న ఫ్యాక్టరీలు విడుదల చేసిన వ్యర్థాలు నదిలో కలిసి ఎస్సారెస్పీలోకి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీరు కలుషితమవుతుండటంతో ప్రాజెక్ట్‌లో చేపలకు ప్రమాదం పొంచి ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పాప్లెట్ రకం చేపలు మాత్రమే లభిస్తున్నాయని, అక్కడక్కడా మధ్యలో పెద్ద పెద్ద చేపలు మృతి చెందుతున్నట్లు తెలిపారు. నీటి నిల్వ తగ్గి ప్రాజెక్ట్‌లో చేపలకు ఆక్సిజన్ అందక గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ కోసం ప్రతి రోజు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. నీరు కలుషితమైతే తాగు నీటికి కూడ ఇబ్బందే అవుతుంది. ఎంత ప్యూరిఫైడ్ చేసినా రసాయానాలు కలిసిన నీరు తాగడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. పరీక్షలకు పంపుతాం.. ప్రాజెక్ట్‌లోని నీరు ప్రస్తుతం అధికంగా దుర్వాసన వస్తోంది. కొద్దిగా రంగు కూడ మారుతోంది. ఉన్నతాధికారులకు ఇది వరకే నివేదించాం. నీటిని పరీక్షలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
జలజలా.. గోదాహరి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా లక్షలాది ఎకరాల్లో రెండు పంటలకు నీరందిస్తూ.. అన్నదాతలకు తోడుగా నిలుస్తోంది గోదారమ్మ. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో ఖరీఫ్, రబీ పంటలకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. ఈ మూడు డెల్టాల్లో ఒక్క రబీలోనే 8,96,533 ఎకరాల్లో గోదావరి జలాలు గలగలా పారుతూ పసిడి పంటలు పండిస్తున్నాయి. రబీలో మూడు డెల్టాలకు ఈ నదీమతల్లి 101.739 టీఎంసీల నీరు అందిస్తోంది. తద్వారా లక్షల టన్నుల వరి సిరులు కురిపిస్తూ కోట్ల మంది ఆకలిని తీరుస్తోంది. అంతేకాదు.. అటు లక్షలాది మంది దాహార్తినీ తీరుస్తోంది. ముఖ్యంగా వేసవిలో అవిభక్త ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరే శరణ్యం. ఎండల తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని స్థానిక సంస్థల యంత్రాంగాలు గోదావరి జలాలను ఒడిసి పట్టే పనిలో బిజీగా ఉన్నాయి. ఇతర సీజన్లలో కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరి జలాలే ప్రధాన ఆధారం. వేసవి అవసరాలకు సరఫరా రబీ సీజన్ ముగియడంతో ఈ నెల 15 నుంచి పంట కాలువలకు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకూ తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు తాగునీటి నిల్వల కోసం సరఫరా చేస్తున్నారు. వేసవి అంతటికీ సరిపోయేలా తాగునీటి చెరువులు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను గోదావరి జలాలతో నింపుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, మండపేట, రామచంద్రపురం, అమలాపురం వంటి పట్టణాల్లో వేసవి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నీరే ఆధారం. కాకినాడ సిటీ, పెద్దాపురం నియోజకవర్గాల ప్రజల తాగునీటి అవసరాల కోసం సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్‌లో గోదావరి జలాలను నిల్వ చేస్తున్నారు. కాకినాడ నగరంలో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని అదనంగా అరట్లకట్ట రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేశారు. సామర్లకోటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాగార్జున ఫిల్టర్‌బెడ్‌లో కూడా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. పిఠాపురం పట్టణ ప్రజల కోసం చిత్రాడ మంచినీటి చెరువునే వేసవి రిజర్వాయర్‌గా మలచి గోదావరి జలాలతో నింపుతున్నారు. చివరకు కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి పరిధిలోని యానాం పట్టణ ప్రజలకు కూడా గోదావరి జలాలే ఆధారం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించడంతో యానాం ప్రజలకు గోదావరి జలాలు అందుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్తగా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 42.54 లక్షల గ్రామీణ జనాభా తాగునీటి అవసరాలకు గోదావరి జలాలనే వినియోగిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా రోజుకు 80 మిలియన్ లీటర్ల గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 1,600 ఓవర్‌హెడ్ ట్యాంకులను గోదావరి నీటితో నింపుతున్నారు. అలాగే 66 మంచినీటి చెరువుల్లో 0.27 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. -
హైదరాబాద్‌కు నీటి కొరత.. పంప్‌హౌస్‌లకు ముంపు ముప్పు
సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి తరలించేందుకు అందుబాటులో ఉన్న పంప్‌హౌస్‌లకు ముంపు ముప్పు పొంచి ఉంది. రాజధానికి సుమారు 110 కి.మీ దూరంలో.. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి కృష్ణా జలాలు, గ్రేటర్‌కు సుమారు 185 కి.మీ దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి జలాలను గ్రేటర్ నగరానికి తరలిస్తున్నారు. ఈ జలాలను తరలించేందుకు మార్గమధ్యలో పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలు సుమారు 20 వరకు ఉన్నాయి. వీటి వద్ద తరచూ సాంకేతిక సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతుండడం గమనార్హం. తాజాగా గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్న మల్లారం పంప్‌హౌస్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో 9 పంపులు నీట మునిగాయి. రెండు రోజులపాటు నగర తాగునీటి సరఫరాకు ఇక్కట్లు తప్పలేదు. ఈ నేపథ్యంలో పలు పంపుహౌస్‌లకు ముంపు కష్టాలు వెంటాడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: పాము కాటు విషపూరితమైనదా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ముందు జాగ్రత్త చర్యలే కీలకం.. ► గ్రేటర్ సిటీకి మంజీరా, సింగూరు జలాలను పరిమితంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో జంట జలాశయాలు, కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ఈ జలాశయాల నుంచి నిత్యం జలమండలి 430 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సేకరించి శుద్ధి చేసి నగరవ్యాప్తంగా సుమారు పది లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. ► ఈ నీటిని సిటీకి తరలించేందుకు జలమండలి భగీరథ ప్రయత్నాలే చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించేందుకు పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. నీటిని పంపింగ్ చేసేందుకు ప్రత్యేక విద్యుత్ ఫీడర్లున్నాయి. పంప్‌హౌస్‌లలో తరచూ మోటార్లు మొరాయించడం, ప్రత్యేక ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ సరఫరా ఆకస్మికంగా నిలిచిపోతోంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. చదవండి: అసత్య ప్రచారం, బెదిరింపులు: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు ► తరచూ సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పక్షంలో.. సిటీలో సుమారు 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫీడర్లు, మోటార్లు, పంప్‌హౌస్‌ల నిర్వహణను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ► తాజాగా మల్లారం పంప్‌హౌస్ నీట మునిగేందుకు సమీపంలో ఉన్న పల్లె చెరువు వరద నీరే కారణమవడంతో పంప్‌హౌస్ చుట్టూ పెద్ద పరిమాణంలో ప్రహరీ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇదే తరహాలో భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు జలాశయాలు, ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న పంప్‌హౌస్‌లు, నీటిశుద్ధి కేంద్రాల చుట్టూ ఎత్తైన, పటిష్టమైన ప్రహరీలు నిర్మించాల్సి ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచిస్తున్నారు. కొనసాగుతున్న మరమ్మతులు.. గ్రేటక్కు గోదావరి జలాలను తరలించే మల్లారం పంప్ హౌస్ నీట మునగడంతో జలమండలి అధికారులు మరమ్మతులు ముమ్మరం చేశారు. నీట మునిగిన 9 పంపుల్లో బుధవారం నాలుగింటికి మరమ్మతులు చేపట్టి నీటిని పంపింగ్ చేశామని..మరో 5 పంపులకు మరమ్మతులను గురువారం నాటికి పూర్తి చేస్తామని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి జలాల లభ్యత తగ్గిన కారణంగా సింగూరు, మంజీరా, జంట జలాశయాల నుంచి నగర అవసరాలకు అదనంగా తాగునీటిని సేకరిస్తున్నామని.. కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. -
భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి
సాక్షి, ఖమ్మం: ఎగువ నుంచి వస్తోన్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం మండలం పోలిపాక వద్ద రోడ్లపైకి గోదావరి వరద నీరు వచ్చింది. పర్ణశాల చుట్టూ వరదనీరు చేరింది. సీతమ్మ విగ్రహం, నార చీరల ప్రాంతం నీటిలో మునిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి వరద ప్రవాహం 9,81,261 క్యూసెక్కులు ఉంది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొత్తకాలనీ, సుభాష్‌నగర్ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ నంబర్లు 08744-241950, 08743-232444 డయల్ చేయాలని చెప్పారు. సాయం కోసం 9392919743 నంబరుకు ఫొటోలు వాట్సాప్ చేయాలని అధికారులు తెలిపారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడుకు రాకపోకలు నిలిచిపోయాయి. -
‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తొలిసారి కొత్త ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటివరకు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగానే ఎత్తిపోతలు కొనసాగగా.. మొదటిసారి 2.70 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి పారనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా సాగునీటి శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద సైతం 55వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందనుంది. అన్ని రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 18.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలకు గానూ లోయర్ మానేరు దిగువున ఉన్న ఆయకట్టు సుమారు 8 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరందిస్తున్నారు. మిడ్‌మానేరు దిగువున కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపినా వాటి చెరువులు నింపేందుకు మాత్రమే నీటిని వదిలారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం తొలిసారి కాళేశ్వరంలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు.. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఇటీవలే నిర్ణయించగా, దీనితో పాటు అనంతగిరి రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాలు, రంగనాయక్ సాగర్ కింద 55 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 55 వేల ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కింద 70 వేల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. 95 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తవగా, జూలై 20 నాటికి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో 50 టీఎంసీలకు గానూ మొదట 10 టీఎంసీలు నింపి, తర్వాత ప్రతి మూడు నెలలకు మరో 10 టీఎంసీలు నింపుతూ వెళ్లనున్నారు. తొలిసారిగా నింపే నీటి నుంచే సుమారు 55 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాల్వల పనులు పూర్తి చేస్తున్నారు. ఇక 15 టీఎంసీల సామర్ధ్యం గల కొండపోచమ్మ కింద తొలి ఏడాదిలో 7.8 టీఎంసీలు మాత్రమే నింపగా, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపనున్నారు. దీనికింద సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రావెల్ కోల్ వంటి కాల్వలు ఉండగా, 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటికింద కనీసంగా 70 వేల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు జరిగాయి. ఇక కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన పైప్‌లైన్‌న్ వ్యవస్థ నిర్మాణాలు పాక్షికంగా పూర్తవడంతో ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఆయకట్టుకు నీటిని ఇవ్వడంతో ఈ రిజర్వాయర్ల కింద కనీసంగా 300 వరకు చెరువులు నింపే ప్రణాళిక సైతం సిద్ధమైంది. వానాకాలం, యాసంగిలో నీటి లభ్యత పెంచేలా చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. అయితే తొలిసారిగా ఈ సీజన్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు, అనంతగిరి 20 వేల ఎకరాలు రంగనాయక్ సాగర్- 55 వేల ఎకరాలు మల్లన్న సాగర్ - 55 వేల ఎకరాలు కొండపోచమ్మ సాగర్- 70 వేల ఎకరాలు కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద - 20 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.70 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వనున్నారు. -
పోలవరం ప్రాజెక్ట్‌లో తొలి ఫలితానికి అంకురార్పణ
-
పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకఘట్టం ఆవిష్కృతం
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ ప్రాంతం అన్నివిధాలుగా సస్య శ్యామలం అవుతుందని వారి నమ్మకం. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి హాయాంలో పట్టాలెక్కిన పోలవరం ప్రాజెక్టు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం రాబోతుంది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదల కార్యక్రమానికి శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్ప్రోచ్ ఛానల్ గుండా స్పిల్ వేకు మళ్లించిన సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ అధికారులు చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, సీజీఎం రవీంద్రరెడ్డి, ఎజీఎం రాజేశ్, డీజీఎం శ్యామలరావు, మేనేజర్ మురళి పాల్గొన్నారు. గోదావరి డెల్టా సస్యశ్యామలం.. గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల చేయడం ద్వారా ఆ నీరు స్పిల్ వే.. రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు.. పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సస్య శ్యామలం చేయనుంది. సహజంగా గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు అందుతుంది. పోలవరం పూర్తయిన తరువాత స్పిల్ వే.. రివర్ స్లూయిజ్.. పవర్ హౌస్ డిశ్చార్జ్‌ల ద్వారా బ్యారేజ్‌ల నుంచి కాలువలకు చేరుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది. ఇకపై అప్రోచ్ ఛానెల్ ద్వారా నీటి విడుదల.. పోలవరం నిర్మాణంలో స్పిల్ వే తో పాటు మూడు గ్యాపులు (ఈసీఆర్ఎఫ్ 1,2,3)తో పాటు జల విద్యుత్ కేంద్రం, జల రవాణా పనులు కీలకమైనవి. ఇందులో ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా (వర్క్ మ్యానువల్, ప్రోటోకాల్) స్పిల్ వే పనిని మేఘా ఇంజనీరింగ్ ఛాలెంజ్‌గా తీసుకొని పూర్తి చేసింది. గోదావరి నీటిని అప్రోచ్ ఛానెల్ నుంచి దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదల కానుంది. దీంతో ఇక నుంచి ఏడాది పోడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలెట్ ఛానెల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు. 6.6 కిలోమీటర్ల మేర నది మళ్లింపు ఓ అద్భుతం.. గోదావరి నది నీటిని 6.6కిలోమీటర్ల మేరకు మళ్లించడం అంటే సాధారణ విషయం కాదు. ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన. దేశంలోనే రెండో పెద్ద నది అయిన గోదావరిపై ఇలాంటి ప్రయత్నం చేయడం సాహసమే. సహజంగా ప్రవహించే గోదావరిని పోలవరం వద్ద కుడి వైపునకు అంటే అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు మళ్లిస్తారు. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత కూడా అలాగే కొనసాగుతుంది. నది మధ్య భాగంలో పనులు.. నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) నిర్మించాలి. అందులో గ్యాప్-2 గా పిలిచే ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం) అతిపెద్దది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునేలా దీనిని నిర్మిస్తారు. ఈ పని ప్రారంభం కావాలంటే నీటి ప్రవాహం నిలిపివేయాలి. అందుకోసం అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించి ఈ ఏడాది వచ్చే వరదల్లో కూడా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నది మళ్లింపు చేపట్టారు. వరదలను తట్టుకునేలా అప్రోచ్ ఛానెల్ నిర్మాణం.. అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ పొడవు 6.6 కిలోమీటర్లు ఉంది. ఇవి ప్రధాన నదికి కుడివైపున సమాంతరంగా నిర్మించారు. అప్రోచ్ ఛానెల్ స్పిల్ వే వైపు 2.4 కిలోమీటర్లు వరకు నిర్మించారు. స్పిల్ వే నుంచి స్పిల్ ఛానెల్ 3.1 కిలోమీటర్లు, స్పిల్ ఛానెల్ చివరి నుంచి మళ్లీ గోదావరి తన సహజసిద్ధ ప్రవాహంలోకి కలిసే విధంగా 1.1 కిలోమీటర్లు పైలెట్ ఛానెల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం మూడు రీచ్‌లుగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఇటీవలనే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాపులను ప్రభుత్వ నిర్ణయానుసారం మేఘా ఇంజనీరింగ్ పూడ్చివేసింది. ఫలితంగా 30 లక్షల క్యుసెక్కుల వరకు వరద వచ్చినా నదిలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవాహం అప్రోచ్ ఛానెల్ మీదుగా వెళ్లిపోతుంది. రికార్డ్ స్థాయిలో పనులు చేపట్టిన ‘మేఘా’.. గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించే పనులను మేఘా ఇంజనీరింగ్ రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం కోటి 54 లక్షల 88వేల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికి కోటి 4లక్షల 88వేల ఘనపు మీటర్లు పూర్తయింది. ఇందుకోసం రేయింబవళ్లు యంత్రాంగం పని చేసింది. మొత్తం మట్టి పని 5 కోట్ల 92 లక్షల పనికి గాను 5 కోట్ల 24 లక్షల ఘనపు మీటర్ల మేర పూర్తయ్యింది. మొత్తం సిసి బ్లాకులు (స్పిల్ వే) 17 లక్షల ఘనపు మీటర్లు కాగా 15.17 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయ్యింది. హైడ్రాలిక్ గేట్లు.. ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్ వే గా త్రిగాడ్జెస్ జలాశయంకు పేరుంది. దీని కన్నా పోలవరం సామర్థ్యం మూడు లక్షల క్యుసెక్కులు అధికం. దీనిని తట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతపెద్ద గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఇందుకోసం 15.17 ఘనపు మీటర్ల కాంక్రీట్ పని పూర్తయ్యింది. గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అందులో భాగంగా 22 పవర్ ప్యాక్ లను 44 గేట్లకు అమర్చారు. 28 రేడియల్ గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో ఈ సీజన్లో వరద వచ్చినా విడుదల చేసే విధంగా 28 గేట్లను ఎత్తి ఉంచారు. చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం పోలవరం పనులపై కేంద్రం ప్రశంస -
గోదావరిలో మునిగి ఇద్దరు అమ్మాయిల మృతి
సాక్షి, భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరిలో నీటమునిగి ఇద్దరు మృతి చెందారు. పట్టణం లోని కొత్త కాలనీకి చెందిన స్వాతి శుక్రవారం బట్టలు ఉతికేందుకు గోదావరికి వెళ్లారు. కూతురు మధు, మేనకోడలు ప్రవళిక కూడా ఆమెతోపాటు వెళ్లారు. అయితే స్వాతి బట్టలు ఉతుకుతున్న క్రమంలో మధు, ప్రవళిక గోదావరి నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. -
అపూర్వం.. 30 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నీరందని ప్రాంతాలన్నింటికీ తరలిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గత నెల 23న కూడవెళ్లి వాగు ద్వారా విడుదల చేసిన కాళేశ్వరం జలాలు అప్పర్ మానేరు ను చేరడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం అలుగు దుంకుతోంది. సుమారు 30 ఏళ్ల తర్వాత నిండు వేసవిలో ప్రాజెక్టు నిండుకుండలా మారడం ఇదే తొలిసారి. కూడవెళ్లి వాగు నుంచి సుమారు 70 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు దారిలో 39 చెక్ డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరగా 11 వేల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్యాకేజీ-9 పనులు ఆలస్య మవుతున్న నేపథ్యంలో కూడవెళ్లి వాగు ద్వారా తర లించిన జలాలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. ప్యాకేజీ-9 ఆలస్యమైనా చింతలేకుండా.. అప్పర్ మానేరు ప్రాజెక్టును సుమారు 50 ఏళ్ల కింద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా పూడిక కారణంగా ప్రస్తుతం అందులో 2.20 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉంటోంది. దీని కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించొచ్చు. అయితే వర్షాకాలంలో మినహాయిస్తే జనవరి తర్వాత ఇందులో నీటి లభ్యత ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు 11.635 టీఎంసీలను తరలిస్తూ మొత్తంగా 60 వేల ఎకరాల కొత్త ఆయ కట్టు, 26 వేల ఎకరాల స్థిరీకరణ చేయాలన్న లక్ష్యం తో ప్యాకేజీ-9 పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ. 996 కోట్లతో చేపట్టగా రూ. 600 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 కి.మీ. టన్నెల్లో 7 కి.మీ. టన్నెల్ పని పూర్తవ్వగా మిగతా లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటి పంప్‌హౌస్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంగల 2 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక దాని బిగింపు పనులు పూర్తయ్యాయి. రెండో దాని పనులు మొదలుపెట్టనున్నారు. ఈ పంప్‌హౌస్ నుంచి నీళ్లు మలక్‌పేట రిజర్వాయర్‌కు... అటు నుంచి సింగసముద్రం చెరువుకు 18 కి.మీ. గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అక్కడ ఉన్న రెండో పంప్‌హౌస్‌లో 2.25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటార్ల ద్వారా 5.70 కి.మీ. ప్రెషర్ మెయిన్ నుంచి బట్టల చెరువు, అటు నుంచి 3.35 కి.మీ. గ్రావిటీ ద్వారా ప్రయాణించి అప్పర్ మానేరు చేరేలా డిజైన్ చేశారు. దీని ద్వారా అప్పర్ మానేరుకు నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్యాకేజీ-9 పనుల్లో మరో 30 శాతం మేర పనులు పూర్తికాలేదు. రెండో పంప్‌హౌస్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్యాకేజీలో 1,279 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 605 ఎకరాలు పూర్తయింది. మిగతా భూసేకరణకు రూ. 25 కోట్ల తక్షణ అవసరాలున్నాయి. వాటి విడుదలలో ప్రభుత్వ జాప్యంతో పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్... కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్రణాళికను అమల్లో పెట్టారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లే గ్రావిటీ కెనాల్ 7వ కి.మీ. వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని కూడవెళ్లి వాగులోకి తరలించేలా పనులు పూర్తి చేశారు. దీంతో గత నెల 23న మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ హరిరామ్ ఈ కాల్వ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేశారు. ఈ నీరు దారిలోని 39 చెక్‌డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరింది. మొత్తంగా 2 టీఎంసీల మేర నీరు అప్పర్ మానేరు చేరడంతో అది ప్రస్తుతం పూర్తిగా నిండి సోమవారం సాయంత్రం నుంచి అలుగు దుంకుతోంది. జూన్‌లో వర్షాలు ఆలస్యమైనా.. ప్యాకేజీ–9 పనులు పూర్తి కాకపోయినా కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరు కింది ఆయకట్టుకు ఇప్పుడు కొండంత భరోసా ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు. -
కొండపోచమ్మ టు నిజాంసాగర్
-
గోదావరి జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. చదవండి: తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం జూబ్లీహిల్స్: కారుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీభత్సం -
కూడవెల్లి వాగులోని గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు
-
హలో సీఎం సార్.. నేను హరీశ్‌ను
సాక్షి, గజ్వేల్: ‘హలో.. సీఎం సార్.. నేను హరీశ్‌ను మాట్లాడుతున్నా.. సిద్దిపేట జిల్లా కొడకండ్లలో కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు వదలాలని రైతులు కోరుతుండ్రు. ఎండలు ముదరడం వల్ల ఈ వాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి 11 వేల ఎకరాల్లో వరిపంట పొట్టకొచ్చే దశలో ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. మీరు అనుమతిస్తే కొడకండ్ల కాల్వ నుంచి గోదావరి జలాలు వదిలి కూడవెల్లి వాగును నింపుతాం. రోజుకు 500 క్యూసెక్కుల నీటిని వాగులోకి పంపే అవకాశముంటుంది. దీని ద్వారా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో 36 చెక్‌డ్యామ్‌లు నిండే అవకాశంతో పాటు, భూగర్భ జలమట్టం పెరగడం ద్వారా బోరుబావులు పుష్కలంగా నీరు పోసే అవకాశం ఉంటుంది. దీంతో పంటలు దక్కుతాయి..’ఇదీ సీఎం కేసీఆర్‌కు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఫోన్ ద్వారా చేసిన విజ్ఞప్తి. ఈ వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘హరీశ్ గో ఏహెడ్... రైతుల పంటలు కాపాడడమే మన ప్రభుత్వ లక్ష్యం. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయండి. వెంటనే కాల్వల ద్వారా కూడవెల్లిలోకి నీళ్లు వదలండి.. అంటూ ఆదేశించారు. అలాగే గజ్వేల్ కాల్వ ద్వారా చేబర్తి పెద్ద చెరువును నింపి పైన ఉన్న కూడవెల్లి వాగు మిగతా భాగంలోకి గోదావరి జలాలను తరలించాలని సూచించారు. (చదవండి: ఉద్యోగులకు పీఆర్సీ 30శాతం!) 11 వేల ఎకరాల్లో వరికి ఊపిరి సమస్య చెప్పిందే తడవుగా తమ సమక్షంలోనే సీఎంకు ఫోన్ చేసి అక్కడికక్కడే పరిష్కారానికి మంత్రి హరీశ్ చొరవ చూపడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీశ్‌కు కూడవెల్లి వాగు పరీవాహక ప్రాంతం రైతులు తమ సమస్య వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన కొడకండ్ల వద్ద ఉన్న కాళేశ్వరం కాలువ నుంచి కొడకండ్ల చెక్ డ్యామ్ ద్వారా కూడవెల్లి వాగు నింపే అవకాశముందని తెలుసుకొని, హుటాహుటిన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర నేతలు, అధికారులతో కలసి అక్కడికి వెళ్లారు. ఫోన్ ద్వారా సమస్యను సీఎంకు వివరించారు. కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఉదయం నీటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా జగదేవ్‌పూర్ మండలంలో 7, గజ్వేల్ మండలంలో 7, తొగుటలో 8, మిరుదొడ్డిలో 10, దుబ్బాకలో 5 చెక్‌డ్యామ్‌లు పూర్తిగా నిండనున్నాయి. ఫలితంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని కూడవెల్లి పరీవాహక ప్రాంతంలో కుడి, ఎడమవైపు ఉన్న 11 వేల ఎకరాల్లో వరిపంట దక్కే అవకాశం కలిగింది. ' (చదవండి: నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు') -
కొండపోచమ్మ టు నిజాంసాగర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కొత్త ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అమల్లోకి తెచ్చే కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి సింగూరుకు అటు నుంచి నిజాంసాగర్‌కు నీటిని తరలించే ప్రణాళికలు ఇప్పటికే ఉన్నప్పటికీ, భారీ టన్నెళ్ల నిర్మాణాలతో నీటి తరలింపులో జాప్యం జరుగుతుండటంతో మరో కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చి.. దాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తోంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వా యర్ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వల నుంచి హల్దీవాగు మొదలయ్యే ఖాన్ చెరువుకు లింక్ కెనాల్‌ను తవ్వి నీటి మళ్లింపు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఒకటి కాకుంటే.. ఇంకొక మార్గం కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో చాన్నాళ్లూ సందిగ్ధత ఉన్నా, చివరికి మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు మొగ్గుచూపారు. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18.62 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. ప్యాకేజీ–17లోని ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కాకుండా మల్లన్నసాగర్ నుంచి హల్దీకి, అటు నుంచి సింగూరుకు నీటిని తరలించే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయా లను ఆలోచించిన ప్రభుత్వం కొత్తగా కొండ పోచమ్మ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీకి నీటిని తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంగారెడ్డి కాల్వ 6.25వ కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఖాన్‌చెరువు మీదుగా హల్దీవాగుకు నీటిని తరలించేందుకు 1.3 కిలోమీటర్ల లింక్ కెనాల్ తవ్వాలని నిర్ణయించారు. ఈ కెనాల్ పనులు ఇప్పటికే చివరి దశలో ఉన్నాయి. మరో పది పదిహేను రోజుల్లోనే ఈ లింక్ కెనాల్ ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ లింక్ కెనాల్ పూర్తయితే కొండపోచమ్మ నుంచి తరలించే నీరు సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీ వాగులో కలిసి... అటునుంచి గ్రావిటీతో మంజీరాలో కలిసి నేరుగా నిజాంసాగర్‌కు చేరుతాయి. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇందులోంచి 1,600 క్యూసెక్కుల నీటిని లింకు కాల్వ ద్వారా నిజాంసాగర్‌కు పంపాలన్నది ప్రస్తుతం లక్ష్యంగా ఉంది. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 17.80 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం దీనికింద 2 లక్షల ఎకరాలకు అవసరమైన నీటి విడుదల జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి లభ్యత పెంచేందుకు వీలుగా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించి అటునుంచి నిజాంసాగర్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. -
వెయ్యి చెరువుల తోట.. హరిత సూర్యాపేట
నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలేమోగానీ పశువుల తాగునీటికి కటకటే. చెరువులు, వాగులు, వంకలు, బావులు ఎండిపోయి కనిపించేవి. వర్షాధార పంటలతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఆ గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయ్. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో ఆకుపచ్చ తివాచీ పరచినట్లు కనిపిస్తోంది. సాక్షి: హైదరాబాద్: జలం ఉంటేనే జీవం. పచ్చని పంటలు. గొడ్డూ గోదా. ఊరంతా కోలాహలం. రైతు కళ్లలో వెలకట్టలేని ఆనందం. సొంతూరిని నమ్ముకొని సాఫీగా సాగే బతుకులు. కాలం కాకపాయె... కలలు చెదిరిపాయె! అవన్నీ పదిహేను, పదహారేళ్ల కిందటి వరకు నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలు పక్కనపెడితే కనీసంగా పశువులకు తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితులు లేక బోసిపోయి కనిపించేవి. చెరువుల్లో నీరు లేక బావులు అడుగంటగా, బోర్లలో నీరు పాతాళానికి చేరిపోయేది. అలాంటి పరిస్థితుల్లో వర్షాధార సాగుతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. అమ్ముకుందామన్నా భూములకు ధరలు లేక...ఊళ్లకు ఊళ్లే వలసలతో బోసిపోయేవి. అలాంటి గ్రామాలకు ఇప్పుడు కొత్త మురిపెం వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో పచ్చగా కనిపిస్తోంది. వేసవి సమయంలోనూ చెరువులు అలుగు దుంకుతుండటంతో పరీవాహక పల్లెలు పులకిస్తున్నాయి. నిండిన చెరువుల కింద సాగు పెరగడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో రైతుల సంబురం అంబరాన్ని అంటుతోంది. సంబురం నింపిన గోదారి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. రూ.1,220 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కాకతీయ కాల్వల తవ్వకంతో పాటు 14 నీటి పంపిణీ కాల్వలు (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వకం చేశారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు ప్రాంతమైన సూర్యాపేట జిల్లాలో డీబీఎం–69, 70, 71 కింద 156 గ్రామాల పరిధిలో 2.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 900ల వరకు చెరువులున్నాయి. వీటిని 2019 నవంబర్ నుంచి నింపుతూ వస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌లో నీటి లభ్యత ఉండటంతో ఈ చెరువులకు నీటి విడుదల అవసరం పడలేదు. చదవండి: (‘ఎల్ఆర్ఎస్’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన) ప్రస్తుతం యాసంగి సాగు జరుగుతుండటంతో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. అందులో భాగంగానే చివరి చెరువు వరకు నీరు చేరుతోంది. చిట్టచివర ఉన్న చెరువులను మొదట నింపేలా టెయిల్–టు–హెడ్ విధానం ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులన్నీ 100% నిండుతున్నాయి. వాటి కిందే 55 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. ఇంతవరకూ గోదావరి జలాలను ఎరుగని పరీవాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వల కారణంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ కాల్వలకు లైనింగ్ చేయకపోవడం కొంత ఇబ్బందిగా మారుతోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.300 కోట్లతో కాల్వల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపినా అవి ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఈ కాల్వల లైనింగ్ పనులు పూర్తయితే పూర్తి సామర్థ్యంతో కాల్వలకు నీటిని పారించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఆనవాళ్లు కోల్పోయి... ఇప్పుడదే ఆదరువు ఈ చెరువు సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పెద్దచెరువు. కాకతీయుల కాలం నాటికి ఈ చెరువు ఫీడర్ చానళ్లు పూడుకుపోయి, పరీవాహకమంతా ధ్వంసమై పదిహేనేళ్లుగా వట్టిపోయి కనిపించేది. నీటి చుక్క కనిపించక దీని చుట్టూతా ఎడారిని తలపించేది. దీని పరిధిలోని 324 ఎకరాల ఆయకట్టులో ఎన్నడూ పదిహేను శాతం కూడా సాగైంది లేదు. అలాంటిది ఇప్పుడు 400 కిలోమీటర్ల నుంచి వస్తున్న గోదావరి జలాలతో పులకిస్తోంది. ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో ఏకంగా అలుగు దుంకుతోంది. పెద్దపెద్ద చేపలు చెరువులో సందడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ముంబైకి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయానికి పనికిరాని గుట్టలను సైతం నీళ్లొచ్చాయన్న సంతోషంతో చదును చేసి పంట సాగు మొదలుపెట్టారు. ‘ఈ చెరువు నిండక ముందు మూడెకరాల్లోనే సాగు చేసే వాణ్ని. కానీ ఇప్పుడు ఏడెకరాల్లో వరి సాగు చేశా. మొత్తం పంటకు నీరందుతోంది. బోర్లు, బావుల వాడకం పూర్తిగా తగ్గించా’అని ఆ చెరువు పరిధిలోని ఆయకట్టు రైతు అనంతుల సత్తయ్య పేర్కొన్నారు. పెద్ద చెరువును పరిశీలిస్తున్న ఇంజనీర్లు ‘సారు'ంటే.. గుండెలు పొంగేవి! ఈ చెరువు దివంగత సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్‌రావు స్వగ్రామం జాజిరెడ్డి గూడెంలోని తీగల చెరువు. పక్కనే మూసీ నది పారుతున్నా ఏనాడూ నిండింది లేదు. చిన్నపాటి లిఫ్టు ద్వారా ఈ చెరువు, దాని పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలని తలంచినా సాధ్యపడలేదు. అయితే విద్యాసాగర్‌రావు చొరవతో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులను పూర్తి చేయడంతో ఈ చెరువు ప్రస్తుతం నిండి దీని కింద ఆయకట్టు 800 ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ చెరువులోకి నీళ్లొచ్చాకే ఇక్కడ ఎకరం భూమి రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెరిగింది. ‘నిండని చెరువుతో అరకొరగా వ్యవసాయం చేసే వాళ్లంతా నీళ్లొచ్చాక రెండు పంటలు సాగు చేస్తున్నారు. కందులు, పెసలు, పత్తి సాగు చేసే వాళ్లు వరికి మళ్లారు. ఎకరాకి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గతంలో 8 బోర్లు వేసినా పడలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎస్సారెస్పీ కాల్వల లైనింగ్ జరిగితే మరింత మేలుంటుందని గ్రామానికి చెందిన రైతులు పున్న హరిప్రసాద్, చింత నర్సయ్యలు పేర్కొన్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నాగారం మండల పరిధిలో ఎస్సారెస్పీ కాల్వలకు దగ్గరగా కొత్తగా సాగులోకి వస్తున్న భూమి. కాల్వల్లో నీరు పారకం ఇకపై ఆగదన్న భరోసాతో ఇప్పటికే కొంత పొలంలో నాట్లు వేయగా, మరింత బీడు భూమిని సాగులోకి తెచ్చేలా రైతులు దున్నటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంత బీడు భూమిని సాగులోకి తెచ్చే యత్నాల్లో ఉండగా, ఇకముందే మొత్తం భూమిని సాగు చేస్తానని రైతులు చెబుతున్నారు. రావి చెరువు పక్కన కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని మాచవరం గ్రామంలోని రావి చెరువు. 0.24 టీఎంసీ సామర్థ్యం గల ఈ చెరువు 16 ఏళ్లలో ఏనాడూ నిండింది లేదు. దీని కింద 200 ఎకరాల ఆయకట్టు ఉండగా బోర్లు, బావుల కిందే ఆరుతడి పంటల సాగు జరిగేది. ఈ చెరువు కింద ఏనాడూ రెండో పంట వేసింది లేదు. వేసవి వస్తే బోర్లు పనిచేయక, తాగునీరు లేక ట్యాంకర్లు పెట్టి ఇంటింటికీ బిందెలను లెక్కగట్టి సరఫరా చేసేవారు. అలాంటి చెరువు ప్రస్తుత సమయంలోనూ నిండుకుండను తలపిస్తోంది. కాళేశ్వరం నుంచి 450 కి.మీ. దూరం దాటుకొని ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా వచ్చిన గోదారి జలాలతో కళకళలాడుతోంది. మూడుకిస్తామన్నా పోలే... ఇప్పుడు ఎకరా రూ. 30 లక్షలు నిర్ణీత ఆయకట్టుకు అదనంగా మరో 200 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. నీళ్లు నిండుగా ఉండటంతో గతంలో 15–18 మీటర్ల దిగువన ఉండే భూగర్భ జలాలు ప్రస్తుతం 3 మీటర్లలోనే లభ్యతగా ఉన్నాయి. ‘16 ఏళ్లలో ఎప్పుడూ చెరువు నిండలేదు. ఎన్నోసార్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి చెరువుల్లో చేపలు భారీగా చేరాయి. 8 నెలలు చేపలనే తింటున్నారు. ఒక్కోటి 6–8 కిలోలు ఉంటుంది’ అని గ్రామానికి చెందిన మురహరిరెడ్డి, బొబ్బయ్యలు తెలిపారు. తెలంగాణ వస్తే ఏ మొస్తుందన్న దానికి... ఈ ఊరికే చేరిన నీళ్లే తార్కాణమని ఎంపీపీ నిమ్మాది భిక్షం పేర్కొన్నారు. నీళ్ల రాకతో రూ. 3 లక్షలు కూడా రాని ఎకరా పొలం ఇప్పుడు రూ. 30 లక్షలు పలుకుతోందని చెప్పారు. తీగలచెరువు -
మడి ‘తడి’ ఆరదు
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఫిబ్రవరి లేక మార్చి నుంచి ఆరంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ సహా మిగతా రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. ఇప్పుడిప్పుడే కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్న దృష్ట్యా యాసంగి పంటల చివరి దశకు కాళేశ్వరం ద్వారా నీరందించేలా ప్రణాళిక వేసింది. ఈ సీజన్లో గరిష్టంగా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటిదాకా ఎత్తింది 12 టీఎంసీలే... రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీగా వర్షాలు కురవడంతో కాళేశ్వరం ద్వారా పెద్దగా ఎత్తిపోత అవసరం రాలేదు. మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు మొత్తంగా 12 టీఎంసీల మేర మాత్రమే నీటిని ఎత్తిపోశారు. యాసంగి సీజన్‌కు సంబంధించి కాళేశ్వరం పరిధిలో కొత్తగా 72 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు, ఎస్సారెస్పీ, ఎఫ్ఎఫ్సీ (వరదకాలువ) కింద ఉన్న పూర్తి ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి లోయర్‌మానేరు డ్యామ్ వరకు ఉన్న 4.62 లక్షల ఎకరాలు, ఎల్ఎండీ దిగువన 5.10 లక్షల ఎకరాలకు, దీంతోపాటే ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న 3.50 లక్షల ఎకరాలకు కలిపి 13 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. దీనికై మొత్తంగా 110 టీఎంసీలు అవసరమని లెక్కించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 87 టీఎంసీ, లోయర్ మానేరులో 21, మిడ్‌మానేరులో 25 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. వీటితో పాటే ఎగువన మేడిగడ్డలో 15 టీఎంసీ, అన్నారంలో 7, సుందిళ్లలో 8 టీఎంసీ మేర నీటి లభ్యత ఉంది. ఎస్సారెస్పీ కింద సాగు అవసరాలకు రిజర్వాయర్లలో డెడ్‌స్టోరేజీ, తాగునీటి అవసరాలకు నీటిని పక్కనపెట్టి, 70 టీఎంసీల మేర నీటిని సాగుకు వినియోగించే అవకాశం ఉంది. మరో 40 టీఎంసీలు మాత్రం కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయాల్సి ఉంటుంది. కాల్వలకు నీటి విడుదల ఇప్పుడే మొదలు కాగా, మార్చి వరకు ప్రతి నెలా కనీసంగా 40 టీఎంసీల అవసరాలుంటాయి. ఈ లెక్కన ప్రస్తుత లభ్యత జలాలు ఫిబ్రవరి చివరి తడుల వరకు సరిపోనున్నాయి. అనంతరం కాళేశ్వరం ద్వారా నీటిని తోడి అవసరాలకు తగ్గట్లుగా రిజర్వాయర్లకు తరలిస్తామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. మూడు బ్యారేజీల్లో ఉన్న నీటిని దిగువ రిజర్వాయర్లకు తరలిస్తూనే, గోదావరి నదిలో లభ్యతగా ఉండే నీటిని రోజుకు కనీసంగా 6 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని తోడేలా ప్రణాళికలు వేసుకున్నారు. మొత్తంగా చివరి తడులకు నీటికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే... జూన్, జులై అవసరాలకు నీటి లభ్యత ఉంచేలా ఎత్తిపోతలు ఉంటాయని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఖరారు కాని సీఎం పర్యటన.. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 5న మేడిగడ్డ ప్రాంతంలో పర్యటిస్తారని ప్రచారం జరిగినా అధికారులు ధృవీకరించడం లేదు. ఈ నెల 8న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు కూతురు వివాహానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని, అదే రోజున కాళేశ్వరం పరిధిలో పర్యటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
మా అవసరాలు తీరాకే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర నీటి అవసరాలు పూర్తిగా తీరాకే గోదావరి నీటిని కావేరికి మళ్లించాలని తెలంగాణ మరోమారు కేంద్రానికి స్పష్టం చేసింది. తమకున్న నికర జలాల వాటాను ముట్టుకోవద్దని, దీంతో పాటే భవిష్యత్తులో ఏర్పడే రాష్ట్ర అవసరాల నీటి వాటాను పక్కన పెట్టి, ఏవైనా మిగులు జలాలుంటేనే మళ్లించాలని తెగేసి చెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర జల శక్తి శాఖ పరిధిలోని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ తన వాదన వినిపిం చింది. అనుసంధాన ప్రతిపాదనను ఓకే చేసి తుది ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసే సమయంలోనే తమతో చర్చించకుండా ముందు కెళ్లరాదని కేంద్రానికి సూచించినట్లు తెలిసింది. అనుసంధానానికి 3 ప్రతిపాదనలు.. ఒడిశాలోని మహానది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరిని కలుపుతూ పెన్నా మీదుగా తమిళనాడులోని కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు కలసిన అనంతరం, ఇచ్చంపల్లికి 63 కిలోమీటర్ల దిగు వన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద నుంచి 247 టీఎంసీల నీటిని కృష్ణా మీదుగా కావేరికి తరలిస్తామని ప్రతి పాదించింది. రాష్ట్ర ప్రయోజనాలు పెద్దగా లేని ఈ ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా ఉంటుం దని వాదించింది. తెలంగాణ అభ్యంతరాల నేప థ్యంలో రెండో ప్రతిపాదనగా జనంపేట మీదుగా పైప్‌లైన్ ద్వారా నీటిని నాగార్జున సాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో ఇప్పటికే సాగులో ఉన్న ఆయకట్టు తీవ్రంగా నష్టపోతామని తెలంగాణ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో ఇఛ్చిం పల్లి నుంచి నీటి తరలింపు అంశం తెరపైకి వచ్చింది. మూసీ రిజర్వాయర్ కేంద్రంగా ఇఛ్చింపల్లి– నాగార్జునసాగర్‌ను అనుసంధానిం చాలని ప్రతిపాదించింది. అయితే దీని సాంకే తిక, ఆర్థిక అంశాలపై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్య యనం చేయాల్సి ఉంది. కృష్ణా బేసిన్‌కు గోదారి జలాలు... ఈ నేపథ్యంలో కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు గోదావరిలో తనకున్న నికర జలాల వాటా 954 టీఎంసీలను ముట్టుకో రాదని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేయగా.. కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుల అవసరాలకే ఈ నీరు సరిపోతుందని చెప్పింది. ఇక కృష్ణా బేసిన్లో తెలంగాణకు నీటి వాటాలు తక్కువని, అవసరాలు మాత్రం గణనీయమని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చేందుకు గోదావరి మిగులు జలాలే శరణ్యమని చెప్పినట్లుగా తెలిసింది. కనీసం 1,600 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని ఈ మేరకు పక్కనపెట్టాకే మిగిలిన నీరు ఏదైనా ఉంటేనే వాటిని మళ్లించాలని స్పష్టత ఇచ్చింది. అదీగాక జనంపేట ప్రతిపాదనతో తెలంగాణకు దక్కేది 39 టీఎంసీలే (17శాతం) అని, ఇచ్ఛంపల్లి ప్రతిపాదన ద్వారా కూడా 66 టీఎంసీ (27.6 శాతం) మాత్రమేనని దృష్టికి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి నీటిని మళ్లిస్తూ ఏపీకి 81 టీఎంసీ, తమిళనాడుకు 83 టీఎంసీల మేర నీటిని కేటాయించారని అభ్యంతరం చెప్పింది. ఆయకట్టు వారీగా చూసినా తెలంగాణలో కొత్తగా లక్ష హెక్టార్ల కన్నా తక్కువగానే వస్తోందని.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు 2 లక్షల హెక్టార్ల మేర లబ్ధి కలుగుతోందని పేర్కొంది. 50% డిపెండబులిటీ ఆధారంగానే... ఇక గోదావరిలో మిగులు జలాలను 50 శాతం నీటి లభ్యత (డిపెండబులిటీ) ఆధారంగానే లెక్కించాలని తెలంగాణ కోరింది. అయితే 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నీటిని గణించి అనుసంధాన డీపీఆర్ రూపొందిస్తున్నామని ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. ఇక నదుల అనుసంధాన ప్రక్రియపై మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారని, తుది ప్రత్యామ్నాయాన్ని తెలంగాణతో చర్చించిన తర్వాతే ఖరారు చేయాలని రాష్ట్రం కోరగా, దీనికి కేంద్రం అంగీకరించింది. పరీవాహక రాష్ట్రాలన్నింటికీ డీపీఆర్‌లు పంపి వారి ఆమోదం తీసుకుంటామని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. వినియోగంలో లేదని చెబుతూ ఇంద్రావతి నది నీటిని మళ్లించేందుకు ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ తుది డీపీఆర్ ఉండాలని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే తమ రాష్ట్ర అవసరాలు తీరాలంటే గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని తమిళనాడు ఈ సమావేశంలో గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. -
19 గ్రామాలకు రాకపోకలు బంద్..
సాక్షి, పశ్చిమగోదావరి: గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 24.75 మీటర్లు చేరింది. ఇప్పటికే స్పిల్ ఛానల్ కు అనుసంధానంగా ఉన్న గోదావరి గట్టు తెగిపోవడంతో స్పిల్ ఛానల్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. పోలవరం వద్ద 10.61 వరకు నీటిమట్టం నమోదయింది. ప్రాజెక్ట్ ఎగువన ఉన్న కొత్తూరు కాజ్వే పైకి 5 అడుగులు నీరు చేరడంతో సుమారు 19 గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం గోదావరికి వరద వచ్చే సమయంలో కొత్తూరు కాజ్వే పై వరద నీరు చేరడంతో గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే గోదావరి అడ్డుగా ఎగువ కాపర్ డ్యామ్ నిర్మించడంతో గోదావరి వరద తక్కువగా వచ్చిన ఉధృతి పెరిగి గిరిజన గ్రామాలను ముంచెత్తుతుంది. ప్రస్తుతం గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుండడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కొత్తూరు కాజ్వే పై రాకపోకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. గిరిజనులు ప్రయాణించేందుకు పడవలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
పల్నాటి ప్ర'జల కల'
సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ‘పల్నాటి సీమ’ను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రూ.1,750 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం, రూ.6,020 కోట్లతో వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను ‘వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్’ కింద చేపట్టి వరద జలాలను తరలించడం ద్వారా పల్నాడును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. పల్నాటి ప్రజల 70 ఏళ్ల స్వప్నం.. వరుసగా వర్షాభావంతో పల్నాడు కరవు కోరల్లో చిక్కుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. పల్నాడు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయడం, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా అందచేసి ఆ ప్రాంత తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చ డానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ఇదీ.. ► పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన జలాల్లో కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి(80 కి.మీ. వద్దకు) ఎత్తి పోస్తారు. కుడి కాలువ ఆయకట్టుకు నీటిని అందిస్తూనే పల్నాటి సీమకు గోదావరి జలాలను తరలిస్తారు. ► ప్రకాశం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను నాగా ర్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను రెండు ప్యాకేజీలుగా చేపడతారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ పనులను రూ.2,845 కోట్ల వ్యయంతో, రెండో ప్యాకేజీ పనులను రూ.3,175 కోట్ల వ్యయంతో చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం ఇదీ.. వరికపుడిశెల వాగు వరద జలాలను ఒడిసి పట్టి పల్నాటి సీమను సస్యశ్యామలం చేయాలనే ప్రతిపాదన ఏడు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల పథకానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం తొలిదశను రూ.350 కోట్లతో, రెండో దశను రూ.1,400 కోట్లతో చేపట్టే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్‌కు శ్రీకారం.. వరికపుడిశెల ఎత్తిపోతల పనులను రూ.1,750 కోట్లతోనూ, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను రూ.6,020 కోట్లతో వెరసి రూ.7,770 కోట్ల వ్యయంతో వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్ కింద చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ జలవనరుల శాఖను ఆదేశించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయడానికి నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పల్నాడులో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు ముఖ్యమంత్రిని కలిసిన పల్నాడు ప్రజాప్రతినిధులు పల్నాడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు కలిశారు. పల్నాటి ప్రజల చిరకాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 70 ఏళ్లుగా పల్నాటి ప్రజలకు కలగా మిగిలిన వరికపుడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరగా పూర్తి చేసేందుకు వైఎస్సార్ పల్నాడు దుర్బిక్ష నివారణ మిషన్‌లో విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. -
అప్పటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. పంప్‌హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్‌కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు, ఈఎన్సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్‌బాషా, ఎస్ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్ పనుల పరిశీలన.. తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ ఆనందర్‌రావు తదితరులు ఉన్నారు. -
‘గోదావరి’ కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. గోదావరి బేసిన్లో చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై తన అభిప్రాయాలను చెప్పాలని తెలంగాణను ఆదేశించింది. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కోరింది. కాళేశ్వరం, సీతారామ, గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, లోయర్ పెన్‌గంగపై నిర్మిస్తున్న రాజుపేట్, చనాకా–కొరట, పింపార్డ్, రామప్ప నుంచి పాకాల జలాల మళ్లింపు ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఈనెల 14న ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. దిగువ రాష్ట్రాల ప్రాజెక్టుల అవసరాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి వీటిని చేపడుతోందని ఏపీ.. బోర్డు దృష్టికి తెచ్చింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయాలను వెంటనే తెలియజేయాలని తెలంగాణను కోరుతూ గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ బుధవారం తెలంగాణకు లేఖ రాశారు. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలను 225 నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతలను 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతున్నారని ఏపీ లేవనెత్తిన అంశాలను లేఖలో బోర్డు ప్రస్తావించింది. ఏపీ అభ్యంతరాలు చెబుతున్న ఈ ప్రాజెక్టులపై గతేడాది ఆగస్టులోనే చర్చించామని, ప్రాజెక్టుల వివరాలు మాత్రం తెలంగాణ ఇంకా బోర్డుకు సమర్పించలేదని గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(8)(డి) ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కట్టినా బోర్డుకు ప్రతిపాదన పంపాలని, జల వివాదాల ఉల్లంఘనæ జరగడం లేదని తేలాకే బోర్డు అనుమతులు ఇస్తుందని, ఆ తరువాతే ప్రాజెక్టులపై ముందుకెళ్లాలన్నారు. పదో షెడ్యూల్ పేరా–7 ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై చేపట్టే ప్రాజెక్టులకు అపెక్స్ అనుమతి తప్పనిసరన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికైనా ఏపీ చేసిన ఫిర్యాదుపై తెలంగాణ తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. -
అన్యోన్యంగా కలిసే ఉన్నం
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పుడు కూడా (ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు) కలిసే పనిచేస్తున్నం. మాకు ఏం వివాదాలు లేవు. అన్యోన్యంగా కలిసే ఉన్నం. కలిసే ఉంటం. కొంత మందికి కళ్లు మండుతున్నాయా? వాళ్లు (నీళ్లు) తీసుకుంటామంటే మేము ఊరుకొని ఉన్నమా? కలిసి ఉందామంటే కలిసి ఉంటాం.. లేదు అంటే కొట్లాడుతం’అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ‘వాళ్ల ప్రతిపాదనలు వారిష్టం. వాటి విషయంలో మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్లు అవసరమున్నప్పుడు గోదావరి నుంచి తీసుకెళ్లండి. మాకు అభ్యంతరం లేదు. మేము తీసుకుంటాం.. మీరు కూడా తీసుకోండి అన్నాం. కాదు మేము వేరే విధంగా తీసుకుంటామంటే, మా రాష్ట్రానికి భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఉపేక్షించం. తెలంగాణ ప్రయోజనాల మీద రాజీపడే ప్రసక్తే లేదు. గోదావరి నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. చిల్లర పంచాయితీలతో సాధించేది ఏమీ లేదు. ప్రేమతో సాధించుకుందాం అని నేను అప్పుడు అన్న.. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్న. మాకు రెండు నాలుకలు లేవు’అని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘వాళ్లు కూడా ఈ రోజు (కృష్ణా గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు) లేఖ ఇచ్చినట్టు తెలిసింది. మా పాలసీ మాకు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపిన కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులను కడుతా ఉన్నం. మిగతావాళ్లు కూడా అలానే ఉండాలని కోరుతున్నం. అంతకు మించి వివాదంలోకి నేను పోదల్చుకోలేదు’అని తొలుత కేసీఆర్ బదులిచ్చారు. అయితే, దీనిపై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. ఆయన మాట్లాడారు. అప్పుడు బాబు అంగీకరించారు.. ‘నీళ్ల గురించి కేసీఆర్‌ను విపక్షాలు విమర్శించడం నాదాన్ దుష్మన్ లాంటిది. పోతిరెడ్డిపాడు మీద అరవీర భయంకరంగా పోరాడింది ఎవరు? ఆనాడు చెంచాగిరీ చేసి ఆంధ్ర ముఖ్యమంత్రుల సంచులు మోసింది ఎవరు? విషయం నా దృష్టికి వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో సమావేశం ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసినం. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అప్పట్లో వారు(చంద్రబాబు ప్రభుత్వం) సుప్రీంకోర్టులో కేసు వేశారు. అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నేను కూడా వెళ్లిన.. అప్పుడు వేరే ముఖ్యమంత్రి (చంద్రబాబు) ఉన్నడు. నేను మాట్లాడిన తర్వాత మీది మీరు కట్టుకోండి.. మాది మేము కట్టుకుంటామని చెప్పి ఆయన లేచి వెళ్లిపోయిండు. దాని ప్రకారం ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. చట్టం ప్రకారం వాటా పరిధిలో కట్టుకుంటున్నం. కాబట్టి వివాదాలకు పోవట్లేదు. ప్రజలు ఎక్కడి వారైనా బాగా ఉండాలి.. రాయలసీమకు నీళ్లు వెళ్లాలని నువ్వు అనలేదా? అనంటున్నరు.. వంద శాతం అన్నాను. ఇప్పుడు కూడా చెబుతున్న ఎందుకు పోవద్దు రాయలసీమకు నీళ్లు? గోదావరిలో సముద్రంలోకి పోతున్నయి నీళ్లు. వాటిని తీసుకుని రాయలసీమకు పొమ్మని చెప్పిన. తప్పా? మేము పిచ్చి లొల్లి పెట్టం. వీళ్ల గురించి పట్టించుకోవద్దనే ప్రజలు మాకు చెబుతున్నరు’ అని విపక్షాలపై మండిపడ్డారు. చంద్రబాబు బోగస్ పంచాయితీ.. ఏపీ సీఎం జగన్‌కు గతంలో మీరు స్నేహహస్తం ఇచ్చారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి భోజనం పెట్టి సమావేశం ఏర్పాటు చేసి బేసిన్లు లేవు. భేషజాలు లేవు అని నేనే అన్న. బ్రహ్మాండంగా (గోదావరి) నీళ్లు మీరు వాడుకోండి. మేము వాడుకుంటం. ఇరు రాష్ట్రాలు సరిపోగా ఇంకా 1000 టీఎంసీలు మిగిలి ఉంటయి అని నేను అన్న’అని సీఎం కేసీఆర్ బదులిచ్చారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించిన్రు? ఒక టీఎంసీనైనా సాధించిన్రా? మాట్లాడితే పచ్చ జెండాలు(టీడీపీ జెండాలు) పట్టుకుని కర్ణాటక సరిహద్దులోకి పోవడం.. తొడగొట్టి సుప్రీంకోర్టుకు వెళ్లడం.. చంద్రబాబు బాబ్లీ బోగస్ పంచాయితీ పెట్టిండు? ఏమైనా వచ్చిందా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి నా కంటే చిన్నవాడైనా ఏడుసార్లు ఆ రాష్ట్రానికి వెళ్లి (కాళేశ్వరం ఒప్పందం) సామరస్యంగా సాధించిన’అని కేసీఆర్ పేర్కొన్నారు. కిరికిరి పెట్టాలని చూస్తున్నరు.. అది జరగదు పోతిరెడ్డిపాడు మీద కేంద్రం జోక్యాన్ని కోరుతారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘తమ్ముడు.. నీకు కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉన్నట్టుంది.. అదేమీ జరగదు.. దురాశపడకు.. ఇక చాలు. నీ ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. నువ్వు కేసీఆర్‌తో పెట్టుకోలేవు’అని సీఎం బదులిచ్చారు. శ్రీశైలం నుంచి వృథా జలాలను వాడుకోవడానికే కొత్త ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందన్న విషయాన్ని మరో విలేకరి ప్రస్తావించగా.. ‘ఎలా నమ్ముతరండి? అందుకే మేము ఫిర్యాదు ఇచ్చినం. వారు ఇవ్వాల్సిన చోట ఆ హామీ అధికారికంగా ఇవ్వాలి కదా? మాకు అనుమానం కలిగించే పద్ధతిలో ఉంటే నిరసపన తెలుపుతాం కదా?’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘గోదావరి మీద ఇంకో కమిటీ వేశాం. గోదావరిలో మా 950 టీఎంసీల వాటా పోను 650 టీఎంసీ సర్ప్లస్ వాటా కావాలని కేంద్రాన్ని కోరుతున్నం. గతంలో కూడా కోరినం. మాట్లాడితే గోదావరి కావేరి అంటున్నరు. మాకు సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు గోదావరి తప్ప మరో దిక్కులేదు’అని కేసీఆర్ స్పష్టంచేశారు. -
రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : సముద్రం పాలయ్యే నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు. నీటి వాటాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరికి మంచి జరగాలన్నదే మా ఆశ. ప్రజల అవసరాల కోసం నీళ్లు తీసుకోవటంలో తప్పులేదు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు. చంద్రబాబు బాబ్లీ బోగస్ పంచాయితీతో ఏం వచ్చింది?. దాని వల్ల ఒక్క టీఎంసీ కూడా సాధించలేదు. ఘర్షణ వాతావరణం ఏ రాష్ట్రానికి అవసరం లేదు. మాకు రెండు నాల్కలు లేవు. గోదావరిలో మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేద’’ని స్పష్టం చేశారు. చదవండి : కేంద్రం తన పరువు తానే తీసుకుంది: కేసీఆర్ -
వర్షాకాలం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీ
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలి. మల్లన్న సాగర్ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలి. ఈ వానాకాలంలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్సారెస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది ) గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలన్నారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్‌లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రియల్ టైమ్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందకు రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్ ఎం) మ్యాన్యువల్ రూపొందించాలన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని ప్రతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే అవకాశం ఉందన్న అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంత్రులు కె. తారక రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు ⇒ వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంబించాలి. చెరువులకు నీరు అందించడానికి ఉన్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు 2–3 రోజుల్లోనే సమావేశం కావాలి. ⇒ చెరువులు నింపడం ద్వారా భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుంది. ⇒ చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఆంక్షలు పెట్టరాదు. ⇒ ఎల్ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా లేక సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి. ⇒ తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలి. ⇒ గౌరవల్లి లిఫ్టు పనులను వెంటనే పూర్తి చేసి ఈ సీజన్లోనే నీళ్లు అందించాలి. ⇒ దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బ్యారేజీ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలి. ⇒ వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి. వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ⇒ జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్రావుపేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. ⇒ భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి. అన్నీ నీటిపారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి నీటిపారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సీఈ రూ. 50 లక్షల వరకు ఎస్ఈ రూ. 25 లక్షల వరకు, ఈఈ రూ. 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వొచ్చు. ⇒ 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్‌లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్‌లు సరిగ్గా పనిచేయట్లేదు. కొత్తగా గేజ్‌లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలి. ⇒ నీటిపారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటిపారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలి. ⇒ ప్రాజెక్టుల భూములను ఆక్రమించిన వారిపై సీరియస్‌గా ఉండాలి. సేకరించిన భూమిని మ్యుటేషన్ చేయాలి. ⇒ కాల్వ కట్టలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేసేలా కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి. ⇒ ప్రాజెక్టుల నిర్వహణ కూడా ముఖ్యం. ప్రతి ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓఅండ్ఎం మ్యాన్యువల్ రూపొందించాలి. ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ⇒ ఎక్కడైనా భూసేకరణ మిగిలి ఉంటే పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
కొండ పోచమ్మకు గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గుండెకాయ వంటి కొమురవెల్లి మలన్నసాగర్ నుంచి బుధవారం నీటి విడుదల మొదలైంది. 52 టీఎంసీల నీరు నిల్వ చేయగల సామర్ధ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి విడుదలైన గోదావరి జలాలు చేరాయి. ఈ పథకంలో ఇది మానవ నిర్మిత అతిపెద్ద కట్టడం. ఇక్కడి నుంచి ఈ జలాలను కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సహ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో కొండపోచమ్మ సాగర్ భారీ రిజర్వాయర్‌ను ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా నేడు అధికారులు వెట్‌రన్ చేపట్టారు. వెట్రన్లో భాగంగా తొలుత ఒకటో నెంబర్ పంప్ నుంచి నీటి విడుదలను చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, సూచనలకు అనుగుణంగా నీటిపారుదల రంగ నిపుణుల సలహా మేరకు ఎటువంటి అటంకాలు ఎదురవకుండా నిర్మాణపనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది. వాస్తవానికి మలన్నసాగర్ రిజర్వాయర్ నింపిన తర్వాతే కొండపోచమ్మ సాగర్‌కు నీరు విడుదల కావాలి. 52 టీఎంసీల సామర్ధ్యం కలిగిన భారీ కొమురవెల్లి మలన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నీరు గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంప్‌హౌస్‌కి ఆ తర్వాత మర్కూక్ సమీపంలో నిర్మించిన మరో పంప్‌హౌస్‌కు అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు చేరుతాయి. మల్లన్న సాగర్ సర్జ్‌పూల్ నుంచి ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 8 మెషీన్లు నీటిని ఎత్తిపోస్తాయి. ఒక్కొ పంప్ 1100 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. ఇక్కడ గోదావరి జలాలు 103.88 మీటర్ల ఎత్తుకు చేరుతాయి. ఈ మార్గమధ్యలో 16.18 కి.మీ పొడవైన సొరంగం కూడా ఉంది. దాదాపు 119 కి.మీ పొడువైన 17 డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా దీనికి అనుసంధానంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందే ఆయకట్టులో ఎక్కువ శాతం మల్లన్నసాగర్ పరిధిలోనే ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక్కడి నుంచి సుదూరాన ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్‌కు కూడా నీరు ఎత్తిపోయనున్నారు. అలాగే నల్లగొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు మల్లన్నసాగర్ నుంచే అందుతాయి. ఇక్కడి నుంచి మరో స్వతంత్ర లింక్ ద్వారా నీరు సింగూరుకు చేరుతాయి. కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే మార్గంలో ఉండే అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపుతారు. -
వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేట: మరో అద్భుతం దిశగా గోదావరి జలాల ప్రయాణం మొదలైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి రాష్ట్రంలో సముద్రమట్టానికి అత్యంత ఎత్తునున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వైపు గోదారి ఉరకలెత్తుతోంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి దా ని దిగువనున్న సొరంగంలోకి (టన్నెల్) శనివారం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ నీటిని విడుదల చేయగా, రంగనాయకసాగర్ కుడి, ఎడమ కాలువల్లోకి మంత్రి హరీశ్‌రావు నీటిని వదిలారు. కాగా, సొరంగంలోకి విడుదల చేసిన నీళ్లు మూడు పంప్‌హౌస్‌లను దాటుకుంటూ మరో 15 రోజుల్లో కొండపోచమ్మసాగర్‌కు చేరనున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ బెడ్‌లెవల్ 88 మీటర్ల నుంచి నీటిని తీసుకుంటుండగా, 200 కి.మీ. మేర ప్రయాణించి 618 మీటర్ల ఎత్తున కొండపోచమ్మకు నీళ్లుచేరి అద్భుతం సృష్టించనున్నాయి. ఎత్తిపోసేందుకు అంతా సిద్ధం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఐదు రోజుల క్రితమే అనంతగిరి నుంచి గోదావరి నీటిని రంగనాయకసాగర్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. రంగనాయకసాగర్‌లో ప్రస్తుతం 3 టీఎంసీలకు గాను ఒక టీఎంసీ మేర నీటి నిల్వ ఉంది. మరో 0.50 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పంపులు నడిపిస్తున్నారు. అదే సమయంలో రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ పంప్‌హౌస్ మీదుగా నీటిని కొండపోచమ్మసాగర్‌కు పంపేందుకు శనివారం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ ఆనంద్, ఇతర ఇంజనీర్లు 16.18 కి.మీ. పొడవైన టన్నెల్‌కు నీటిని వదిలారు. అక్కడి నుంచి నీరు తుక్కాపూర్ పంప్‌హౌస్‌కు చేరనుంది. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు ఇక్కడి సర్జ్‌పూల్‌ను నింపి 43 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 మోటార్ల ద్వారా నీటిని దిగువన మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో తవ్విన 18 కి.మీ. ఫీడర్ చానల్‌కు వదులుతారు. ఇందుకు మరో వారం పట్టనుంది. అక్కడి నుంచి నీరు 6 మోటార్లు ఉన్న అక్కారం పంప్‌హౌస్‌కు, ఆపై మరో 6 మోటార్లున్న మర్కూక్ పంప్‌హౌస్‌కు చేరతాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే 3 పంప్‌హౌస్‌ల్లో మోటార్లు నడిచేలా విద్యుత్ వ్యవస్థను ట్రాన్స్‌కో సిద్ధంచేసింది. ఈనెల 15 – 18 మధ్య తేదీల్లో ఏదో రోజున నీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మకు వదిలే అవకాశాలున్నాయని తెలిసింది. శనివారం రంగనాయక సాగర్ కాలువకు నీటిని విడుదల చేసి సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ఈఎన్సీ హరిరామ్ ఆ ఎత్తుకు చేరితే అద్భుతమే.. ‘గోదావరి కొండపోచమ్మసాగర్‌కు చేరితే అద్భుతమే. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 88 మీటర్ల బెడ్‌లెవల్ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నాం. ఈ నీటిని 618 మీటర్ల ఎత్తు న ఉన్న కొండపోచమ్మకు తరలిస్తే 530 మీట ర్ల మేర నీటిని తరలించినట్టవుతుంది’అని ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. అదీగాక మేడిగడ్డ నుంచి కొండపోచమ్మకు సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయనుందని, ఈ ప్రయాణానికి మొత్తంగా 10 స్టేజీలలో నీటి ఎత్తిపోతల పూర్తికానుందని చెప్పారు. మిడ్ మానేరు దిగువన 4వ దశలో 5 ప్యాకేజీలు ఉండగా, 76 కి.మీ. గ్రావిటీ కెనాల్, 32.42 కి.మీ. టన్నెళ్లు దాటుకొని 5 పంప్‌హౌస్‌ల ద్వారా నీరు 15 రోజుల్లో కొండపోచమ్మకు చేరుతుందని తెలిపారు. సీఎం ఆదేశాలతో నీటి తరలింపు చర్యలన్నీ పూర్తి చేశామన్నారు. నీటి చింత తీరింది: మంత్రి హరీశ్ చుక్క నీటి కోసం నానా ఇబ్బందులు పడ్డ ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొ క్కుతున్నాయని, ప్రజల నీటి చింత తీరిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గత నెల 24న రంగనాయకసాగర్‌లోకి గోదావరి జలాలు చేరిన వి షయం తెలిసిందే. 3 టీఎంసీల సామర్థ్యం గల రంగనాయకసాగర్‌లోకి శనివారం ఉద యం నాటికి 1.5టీఎంసీల నీరు చేరింది. ఈ నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా సిద్దిపేట అర్బన్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని రాజగోపాల్రావుపేట, పాలమాకు ల చెరువులను నింపేందుకు మంత్రి హరీశ్‌రావు శనివారం విడుదల చేశారు. అనంత రం మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వస్తోందని, ఇక కష్టపడి మంచి పంటలు పండించాల్సిన బా ధ్యత రైతులపైనే ఉందన్నారు. మెద క్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ పాల్గొన్నారు. ఈత కొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే రంగనాయకసాగర్ ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు వదిలిన సందర్భంలో రైతులతో పాటు నాయకులు పరవశించిపోయారు. కాలువ జలాలను ఎంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తంచేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూరు, నారాయణరావుపేట ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువలో దూకి ఈత కొట్టారు. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్‌రావు సెల్ఫీలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. -
గలగలా గోదారి కదిలి వచ్చింది
సాక్షి, సిద్దిపేట : ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి అదనంగా నీరు ఇవ్వగలిగాం. నిజాంసాగర్‌ను పూర్తి చేసుకుంటున్నాం. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో జలకళ ఉట్టిపడు తుంది. సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ రైతుల కష్టాలు తీరి దేశానికే ఆదర్శవంతమైన వ్యవ సాయ కేంద్రంగా తెలంగాణ విరాజిల్లుతుంది’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మూడు టీఎంసీల సామర్థ్యం, 1,10,718 ఎకరాలకు సాగునీరు అందించేలా సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను శుక్రవారం మంత్రులు హరీశ్, కేటీఆర్ ప్రారంభించారు. తొలుత రంగనాయకసాగర్ కొండపై ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్, హరీశ్‌రావు అక్కడి నుంచి పంప్‌హౌస్ వద్దకు చేరుకొని పంపులను స్విచ్ ఆన్ చేశారు. దాదాపు 10 నిమిషాల వ్యవధిలో రంగనాయకసాగర్‌లోకి వచ్చిన గోదావరికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిదులు పసుపు, కుంకుమలు విడిచిపెట్టి స్వాగతం పలికారు. పంప్హౌస్లోంచి నీరు పైకి ఎగసిపడే క్రమంలో కేటీఆర్, హరీశ్‌పైనా నీరు చిమ్మడంతో వారు తడిసి ముద్దయ్యారు. అనంతరం గుట్టపై ఉన్న విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు భగీరథుడికన్నా గొప్పగా... ఆకాశంలో ఉన్న గంగను భూమికి తీసుకొచ్చిన భగీరథుడి గురించి అందరం చెప్పుకుంటామని, కానీ భూమిపై ఉన్న గోదావరిని ఎత్తైన ప్రదేశంలోకి తీసుకొచ్చి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్ భగీరథునికన్నా గొప్ప అన్పించుకున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మెతుకుసీమగా పిలిచే ఉమ్మడి మెదక్ జిల్లా పేరే మెతుకు అనే పేరు నుంచి వచ్చిందని, గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లాను ముద్దాడిన తర్వాత మొత్తం తెలంగాణకు బువ్వపెట్టే జిల్లాగా కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నీటివనరులు పెరిగితే ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. చదవండి: తెలంగాణకు కేంద్ర బృందం నాలుగు విప్లవాల ద్వారా ఆర్థిక అభివృద్ధి దశలవారీగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతోందని, రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాల ద్వారా తెలంగాణ గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, దేశానికే ఆదర్శంగా నిలస్తుందని కేటీఆర్ చెప్పారు. నీటి వసతులతో ఈ విప్లవాలు అనుబంధంగా ఉంటాయని చెప్పారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ ఆవిర్భవిస్తుందన్నారు. దీంతో రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతుందని చెప్పారు. చెరువులు, కుంటల్లో నీరు సంమృద్ధిగా ఉంటే మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో నీలి విప్లవం వస్తుందన్నారు. అదేవిధంగా పంటలు పండి, పచ్చటి చేలు, గడ్డితో పల్లెలు ఆహ్లాదకరంగా ఉంటే పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో శ్వేత విప్లవం వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేశామని, దీంతో మాంసం ఉత్పత్తులు పెరుగుతున్నాయని, ఈ పెరుగుదల పింక్ రివల్యేషన్కు చిహ్నమన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సంపద పెరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సర్జికల్ పంప్‌హౌస్‌లో రెండో మోటార్‌ను ప్రారంభిస్తున్న హరీశ్, కేటీఆర్. చిత్రంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హరీశ్‌రావు చరిత్ర తిరగరాశారు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు పనిచేసి చరిత్ర తిరగరాశారని కేటీఆర్ కొనియాడారు. గతంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా రేయింబయళ్లు పనిచేసి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారన్నారు. రాజకీయంగా ఆదరించిన సిద్దిపేట అంటే ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమని, సీఎం తర్వాత సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపి హరీశ్‌రావు సమర్థతను రుజువు చేసుకున్నారన్నారు. నాయనమ్మ, అమ్మమ్మ ఊర్లు మునిగాయి.. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని కేటీఆర్ కొనియాడారు. ఇతర పార్టీల వారికి నిర్వాసితుల బాధ తెలియదని విమర్శించారు. ఎగువ మానేరు నిర్మాణం సందర్భంగా తన నాయనమ్మ గ్రామం దొమకొండ మండలం పూసాన్పల్లి మనిగిపోయిందని, మధ్యమానేరు నిర్మాణంలో అమ్మమ్మ గ్రామం కొదురుపాక మునిగిపోయిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో మేజర్ కాల్వల నిర్మాణం పూర్తయిందని, ఏ గ్రామానికి ఆ గ్రామ పెద్దలు కథానాయకులుగా మారి చిన్న కాల్వల నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. అసాధ్యమన్న పనులు సుసాధ్యం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తుంటే అందరూ అసాధ్యమని విమర్శలు చేశారని, కానీ అసాధ్యమన్న పనులను సుసాధ్యం చేసి రైతులకు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ వద్ద పారే గోదావరిని 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్‌కు, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపొచమ్మ సాగర్ వరకు పంపింగ్ చేయవచ్చని రుజువు చేశారన్నారు. కరవు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణలో సాగునీటి అవసరాన్ని గుర్తించిన సీఎం... ఇంజనీర్‌గా పనిచేయడంతోపాటు అందరితో పని చేయించారన్నారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణమంటే 3–4 దశాబ్దాల కాలం పట్టేదని, కానీ సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేయించి మూడున్నర సంవత్సరాల్లోనే పనులు పూర్తి చేయించారన్నారు. కూలీలతో సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రులు అన్నదాత కష్టాలు తీరేరోజు... వర్షం, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు కాలం, కరెంట్‌తో పనిలేకుండా కాల్వల ద్వారా రెండు పంటలు పండించుకునేలా సాగునీరు అందుతుందని హరీశ్‌రావు చెప్పారు. అప్పులు చేసి బోర్లు వేసి బోర్లాపడ్డ రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకునేవారిని గుర్తుచేశారు. వర్షం ఎప్పుడొస్తుందో అని మోగులు చూసే రైతులకు గోదావరి జలాలు ఈ నేలను ముద్దాడడాన్ని చూసి సంబుర పడిపోతున్నారన్నారు. గోదావరి జలాల ద్వారా చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఉపరితల నీటివనరుల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. నీరు అభివృద్ధికి సూచిక అని, నీటివనరులు పెరిగితే మానవ మనుగడలో మార్పు వస్తుందన్నారు. ‘‘ఎకానమే కాకుండా ఎకాలజీ’’లో కూడా మార్పు వస్తుందని చెప్పారు. నా జన్మ చరితార్థం... తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమ నేత వెంట ఉండి పనిచేయడం, దేశంలోనే మహోన్నత ఘట్టం కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాను ముద్దాడే కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు తన జన్మ చరితార్థం అయిందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషం కలిగిందో రంగనాయకసాగర్ నీటిని విడుదల చేసినప్పుడూ అంతే సంతోషం కలిగిందన్నారు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సమక్షంలో లక్షల మంది మధ్య జరుపుకోవాల్సి ఉండేదని, కానీ కరోనా వైరస్‌తో తక్కువ మందితో జరుపుకుంటున్నామన్నారు. గోదావరి జలాలు రంగనాయకసాగర్‌లో పారుతుంటే ఆ జలాల్లో రైతులు పండించబోయే ధాన్యం సిరులు కన్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, బి.వెంకటేశ్వర్లు, కూర రఘోత్తంరెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ సొలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఒడితల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, ఓఎస్డీ దేశపతి శ్రీనివాసరావు, లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర సలహాదారులు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం, సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టణం నుంచి పల్లెకు మహా పయనం -
రంగనాయక సాగర్‌లోకి గోదారి జలాలు
-
‘ఆ అపవాదును తెలంగాణ చెరిపేసింది’
సాక్షి,సిద్ధిపేట: సిద్దిపేటను గోదావరి జలాలు ముద్దాడాయి. సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను శుక్రవారం మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ టన్నెల్ పంపు సెట్ స్వీచ్ ఆన్ చేసి రంగనాయక సాగర్‌లోకి నీళ్లను వదిలారు. రిజర్వాయర్‌లోకి నీళ్లు రాగానే మంత్రులు జలహారతి పట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ....‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత ఆనందపడ్డానో అంత ఆనందంగా ఉంది. సిద్దిపేటకు గోదావరి నీళ్లు అనేది దశాబ్దాల కల. ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికి దారి చూపింది. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాల నిర్మాణం అన్న దశ నుంచి రెండు, మూడు ఏళ్ళల్లోనే నిర్మించవచ్చని తెలంగాణ చూపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన కూలీలను మేము మర్చిపోలేం. ఈ ప్రాంతం ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, వలసల జిల్లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు పంటలు పండించుకోవచ్చు. నాడు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, నేడు గోదావరి జలాలతో పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. ఒక ప్రజాప్రతినిదిగా ఇంతకంటే మధురానుభూతి మరొకటి లేదు’ అని పేర్కొన్నారు. (‘ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలి’) అదేవిధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమల నిర్మాణం చేపట్టాల్సిందిగా, ఐటి హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను హరీష్‌రావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ‘ఒక చిరస్మరనీయమైన ఘట్టంలో భాగస్వాములమయ్యే భాగ్యం మాకు లభించింది. సిద్దిపేట ప్రజలు ధన్యజీవులు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే దశాబ్దాల పాటు నిర్మించేవన్న అపవాదును పారద్రోలుతూ.. కాలంతో పోటీ పడుతూ నాలుగైదు ఏళ్లలోనే ప్రాజెక్టులు నిర్మించవచ్చని నిరూపించాం. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కాబోతుంది. దేశానికే ఆదర్శవంతమైన రెండో హరిత విప్లవం ద్వారా అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయాకట్టే కాకుండా యస్ఆర్యస్పీ కాలువను సైతం పరిపుష్టం చేయబోతున్నాం. సిద్దిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రం అసూయ పడుతోంది. ఇక్కడికి ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తాయి. ఐటి హబ్ కూడా వస్తుంది’ అని అన్నారు. అదేవిధంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల రైతాంగానికి డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణానికి ముందుకు రావాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భూనిర్వాసితుల బాధలు తమకు తెలిసినంతగా ఎవరికి తెలియవు అని కేటీఆర్ పేర్కొన్నారు. (నర్సమ్మ కోసం కేటీఆర్‌కు ట్వీట్!) -
భగీరథుడికన్నా గొప్పగా...
-
రంగనాయక సాగర్‌లోకి గోదారి జలాలు
-
కరువు నేల.. మురిసే వేళ
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను రంగనాయక సాగర్‌లోకి వదిలేందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. గోదావరి నది నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న బీడు భూములు తడిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కానుంది. నేడు రంగనాయక సాగర్‌లోకి గోదావరి అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నుంచి పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను రంగనాయక సాగర్‌కు వదలనున్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఈ రిజర్వాయర్ నిర్మించారు. దీని సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్‌కు 8.6 కిలోమీటర్ల చుట్టూ భారీ కట్టను నిర్మించారు. కట్ట నిర్మాణం, దాని చుట్టూ రాతి కట్టడం, కట్టపై చమన్ ఏర్పాటుతో పాటు ఇంజనీరింగ్ అధికారుల కార్యాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనం నిర్మించారు. చదవండి: లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, దుబ్బాక, చేర్యాల, మద్దూరు కోహెడతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. ఇలా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 409 చెరువులను గోదావరి జలాలతో నింపనున్నారు. సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, సిరిసిల్ల జిల్లాలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు.. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లాకు అడుగిడిన గోదావరి జలాలను వెంటనే జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు తీసుకెళ్లేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. 24 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలకు భారీ ప్రయోజనం కలగనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణంలోని కొంత భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో అప్పటి వరకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు చేరిన నీటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి నింపడంతో పాటు, కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు 18 కిలో మీటర్ల మేరకు గ్రావిటీ కెనాల్ నిర్మించారు. దీంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్దకు చేరిన నీరు కొండపోచమ్మ సాగర్ వరకు చేరుతాయి. రంగనాయకసాగర్ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు ‘కొండపోచమ్మ’తో 2.85 లక్షల ఆయకట్టుకు నీరు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ‘కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. దీని సామర్ధ్యం 15 టీఎంసీలు. జగదేవ్‌పూర్, తుర్కపల్లి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, ఉప్పరపల్లి, శంకరంపేట, ఎం.తుర్కపల్లి మొత్తం ఎనిమిది ప్యాకేజీలతోపాటు సంగారెడ్డి కెనాల్ ద్వారా మొత్తం 2.85 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తారు. అలాగే.. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరాకు ఈ రిజర్వాయర్ ద్వారా నీరు అందిస్తారు. వీటితోపాటు బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్లతో అనుసంధానం చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట జిల్లాల వరకు సాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలం కరువు నేలకు గోదావరి జలాలు తరలించి పునీతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలితమే రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం. సాగు నీటి కోసం బోర్లు వేసి బోర్లా పడిన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఈ గడ్డకు ఉంది. స్వయానా రైతుగా కేసీఆర్ చూసిన కష్టాలను తీర్చే మార్గమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు గోదావరి జలాలు కరువు నేలను ముద్దాడాయి. ఈ ప్రాంతంలో కరువు అనేది గతం. సూర్యచంద్రులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ కీర్తి నిలుస్తుంది. ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యమైన నా జన్మ చరితార్థమైంది. – హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి -
‘అనంతగిరి’కి గోదారమ్మ
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ఎత్తిపోతల ద్వారా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి మిడ్‌మానేరు (రాజరాజేశ్వరి) రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాల ప్రయాణం కొండలు, కోనలు, వాగులు, వంకలు, కాల్వలు, సొరంగ మార్గాలు దాటుకుంటూ కాళేశ్వర గంగమ్మ (గోదావరి), అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ చేరింది. బుధవారం మిడ్‌మానేరు దిగువన పంప్‌హౌస్‌లోని ఒక మోటార్ ద్వారా నీటిని అనంతగిరి తరలించే ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతమైంది. 164.15 కి.మీ. ఎగువకు గోదావరి నీళ్లు ప్రయాణించాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీ పూర్తయినట్లయ్యింది. ఈఎన్సీ హరిరామ్, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ ఆనంద్ పర్యవేక్షణలో 106 మెగావాట్ల (1.40 లక్షల హెచ్‌పీ) సామర్థ్యంగల మోటారు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మధ్యాహ్నం 1.30 గంటలకు ఎత్తిపోసింది. ఇక్కడ నుంచి నీటిని రంగనాయక్‌సాగర్ మీదుగా ఈ నెల 25 నాటికి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరనున్నాయి. 90 మీటర్లు ఎగిసిపడిన జలాలు.. మధ్యమానేరు జలాశయం నుంచి 3.50 కి.మీ. కాలువ ద్వారా నీరు ఒబులాపూర్ చేరింది. అక్కడి నుంచి 7.65 మీటర్ల సొరంగ మార్గం ద్వారా తిప్పాపూర్ సర్జిపూల్ (మహాబావి)లోకి చేరాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్ ద్వారా 90 మీటర్ల ఎత్తునకు నీటిని ఎత్తిపోశారు. దీంతో అనంతగిరికి నీరు చేరింది. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నుంచి నీరు ఇప్పటికే ఎల్లంపల్లి చేరగా రెండో దశలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు తరలించారు. గతేడాది నవంబర్ నుంచి మిడ్‌మానేరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ నాలుగో దశ ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు తరలించాలంటే అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా అక్కడ కోర్టు కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఇటీవల నిర్వాసితుల తరలింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆగమేఘాలపై ఎస్సీ కాలనీని ఖాళీ చేయించారు. అయినప్పటికీ మరో పదిగృహాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గృహాలకు ఇబ్బంది లేకుండా 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల అనంతగిరిలోకి ప్యాకేజీ–10లోని 4 మోటార్ల ద్వారా 0.8 టీఎంసీల నీటిని తరలించాలని ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌ను ఆదేశించారు. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం 106 మెగావాట్ల సామర్థ్యంగల ఒక మోటార్ ద్వారా తొలి ఎత్తిపోతలు చేశారు. ఇది విజయవంతం కావడంతో ఆ మోటార్‌ను 10 గంటలపాటు నిరంతరాయంగా నడిపించి రాత్రికి రెండో మోటార్ ఆన్ చేశారు. గురు, శుక్రవారాల్లో మరో రెండు మోటార్లను సైతం నడిపించి మొత్తంగా 0.8 టీఎంసీ నీటిని అనంతగిరికి తరలిస్తారు. అనంతరం అనంతగిరి నుంచి ప్యాకేజీ–11లోని 134.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్ల ద్వారా నీటిని రంగనాయక్ సాగర్‌కు తరలిస్తారు. ఈ పంపులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. రంగనాయక్ సాగర్‌కు ఈ వారంలోనే నీటిని తరలించే ప్రక్రియ మొదలవుతుందని, మరో నాలుగైదు రోజుల్లో 3 టీఎంసీల ఈ రిజర్వాయర్‌ను నింపుతామని ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. 25 నాటికి కొండపోచమ్మకు.. రంగనాయక్ సాగర్ నుంచి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–12లో 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపుల్లో అన్నీ సిద్ధమయ్యాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్నసాగర్ పనులు మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–13 పనులు పూర్తవ్వగా, ప్యాకేజీ–14లో రెండు పంప్‌హౌస్‌ల్లోని ఆరేసి మోటార్లను సిద్ధం చేశారు. అయితే వాటికి విద్యుత్ కనెక్షన్ పనులు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి 15 టీఎంసీల సామర్థ్యంగల కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరతాయని, కనీసంగా 240 కిలోమీటర్ల గోదావరి తరలి రానుందని ఈఎన్సీ హరిరామ్ వెల్లడించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. గోదావరి జలాలు అనంతగిరికి చేర్చే ప్రక్రియ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనంతగిరి నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించారు. నీరు రావడంతో మిగతా వాళ్లు ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోపాలకృష్ణ, డీఈఈ దేవేందర్, తహసీల్దార్లు రాజిరెడ్డి, ప్రసాద్, ప్రాజెక్టు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే పనుల పూర్తి ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే నాలుగో దశ పూర్తయింది. ఆసియాలోనే అతిపెద్దదైన 92 మీటర్ల లోతైన సర్జ్‌పూల్ నుంచి నీటిని 101.20 మీటర్లు ఎత్తి అనంతగిరికి తరలించే ట్రయల్ రన్ బుధవారం పూర్తయింది. సీఎం సూచనల మేరకు ఈ నెలాఖరుకు కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరతాయి. – హరిరామ్, ఈఎన్సీ -
రాష్ట్ర అవసరాలు తీరాకే తమిళనాడుకు గోదావరి జలాలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలు తీరాకే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా తమిళనాడుకు గోదావరి వరద జలాలను తరలించడానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి.. పరిపాలన సంస్కరణలు, మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్ బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గత నెల 26న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తమ రాష్ట్ర అవసరాలు తీరాకే గోదావరి వరద జలాలను తమిళనాడుకు తరలించడానికి సమ్మతిస్తామని ఏపీ సర్కార్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నదుల అనుసంధానానికి సహకరించాలని కోరేందుకు తమిళనాడు మంత్రులు రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సీఎంలు ఏకాభిప్రాయానికి వస్తే, జాతీయ ప్రాజెక్టుగా ఆ అనుసంధానాన్ని చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవచ్చని ఇద్దరు మంత్రులు వివరించారు. కృష్ణా ప్రాజెక్టులకు నీటి కొరత కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. తమ రాష్ట్రానికి ఏ మేరకు గోదావరి జలాలను తరలిస్తారో ఆ దామాషా పద్ధతిలో ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని భరిస్తామని తమిళనాడు మంత్రులు ప్రతిపాదించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఈ అంశంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గుతోన్న నేపథ్యంలో పోలవరం– కృష్ణా (ప్రకాశం బ్యారేజీ)–బొల్లాపల్లి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) అనుసంధానం పనులు చేపట్టడంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గోదావరి నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను కృష్ణా నది పరీవాహక ప్రాంతానికి తరలిస్తే.. కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించవచ్చని.. అప్పుడు మిగులుగా ఉన్న జలాలను కావేరికి తరలించవచ్చని చేసిన ప్రతిపాదనతో తమిళనాడు మంత్రులు ఏకీభవించారు. కాగా, చెన్నైకి నీటిని సరఫరా చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి బకాయి పడిన రూ.348 కోట్లలో రూ.25 కోట్ల మేర చెక్కును ఆ రాష్ట్ర మంత్రులు సీఎంకు అందజేశారు. చెన్నైలో తాగునీటి ఎద్దడి నివారణకు కండలేరు జలాశయం నుంచి రెండు టీఎంసీలను విడుదల చేయాలన్న వారి ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. ఏపీ, తెలంగాణ సీఎంలతో సమావేశమవుతున్నట్టు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. -
రూ. 1,700 కోట్లతో ‘సాగర్’ పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి మూలకూ నీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం తదనుగుణంగా కార్యాచరణ శరవేగంగా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గోదావరి జలాలపై ఆధారపడి చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల ద్వారా పూర్వ ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించే ప్రణాళికకు కార్యరూపం ఇస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు రిటైర్డ్ ఇంజనీర్లు సాగర్‌లో భాగంగా ఉండే పాలేరు రిజర్వాయర్ దిగువన, ఎగువన 6.30 లక్షల ఎకరాలకు నీరందించేలా రూ. 1,700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై ఈ వారంలోనే ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎగువ నుంచి రాకున్నా ఢోకా లేదు.. సాగర్ పరిధిలో మొత్తంగా 6.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎగువ నుంచి వచ్చే కృష్ణా జలాలపైనే సాగు ఆధారపడి ఉంటోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి అక్కడి కోయినా డ్యామ్, ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండాకే శ్రీశైలం మీదుగా వరద నీరు సాగర్‌కు చేరుతోంది. అయితే ఏటా ఆగస్టు తర్వాత కానీ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి ప్రవాహాలు ఉండటం లేదు. సాగర్ పూర్తిస్థాయిలో నిండేందుకు సెప్టెంబర్, అక్టోబర్ పడుతోంది. దీంతో సాగర్ కింది ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీరు అందించడం గగనమవుతోంది. ఒకవేళ ఎగువ నుంచి ప్రవాహాలు కరువైతే ఖరీఫ్, రబీలకు నీటి సరఫరా జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు సీజన్లలోనూ సాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించేలా గోదావరి జలాల తరలింపు చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయించారు. సాగర్ ఆయకట్టు పునరుజ్జీవం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని రిటైర్డ్ ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో రిటైర్డ్ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, అనంతరాములు, వెంకట రామారావు తదితరులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి నివేదికరూపొందించారు. మొత్తంగా సీతారామ ఏడు లిఫ్ట్‌ల ద్వారా 72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి పాలేరు రిజర్వాయర్‌కు ఎగువన 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు, పాలేరు నుంచి సాగర్ రిజర్వాయర్‌కు మధ్య 3.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా పునరుజ్జీవ పథకాన్ని డిజైన్ చేశారు. నాగార్జునసాగర్ 21ఎల్ బ్రాంచ్ కెనాల్‌ను ఉపయోగించుకొని దాని పరిధిలోని 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు పాలేరు రిజర్వాయర్ వరకు గల 2.50 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టును స్థిరీకరించడానికి 80 కి.మీ. నుంచి 104 కి.మీ. లింక్ కెనాల్ తవ్వాలని, దానికి 21ఎల్ బ్రాంచ్ కెనాల్‌ను కలపాలని సూచించారు. మొత్తంగా సాగర్ కాలువపై ఆరు లిఫ్టులు, మున్నేరు వద్ద నిర్మించబోయే బ్యారేజీ వద్ద ఒక లిఫ్ట్‌తో కలిపి మొత్తం ఏడు దశల్లో నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ఇందులో పంప్‌హౌస్‌ల ఎలక్ట్రో మెకానికల్ వర్క్‌లకు రూ. 725 కోట్లు, సివిల్ పనులకు రూ. 980 కోట్లు, ఇతర పనులకు రూ. 265 కోట్లు, నాన్ కాంట్రాక్ట్ ఐటమ్స్‌కు రూ. 250 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ. 2,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా ఇప్పటికే సీతారామ కింద చేపట్టిన నిర్మాణాలను మినహాయించడంతో రూ. 1,700 కోట్ల అంచనా వ్యయం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు తేల్చారు. -
వారంలో మేడిగడ్డ ఖాళీ?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని వారంలో పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించింది. దిగువ బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యతను పెంచుతూ, మేడిగడ్డలో అవసరమైన మరమ్మతులు, ఇతర సాంకేతిక అంశాల పరిశీలనకు వీలుగా నీటినంతా దిగువకు పంపింగ్ చేయనుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి నాలుగు టీఎంసీల మేర నీటిని పంపింగ్ చేయగా, ఆది వారం సైతం ఏడు పంపుల ద్వారా ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగింది. ఈ నీరంతా దిగువ అన్నారం (సరస్వతి), అటు నుంచి సుందిళ్ల (పార్వతి) మీదుగా ఎల్లంపల్లికి చేరుతోంది. అనుకున్న దానికన్నా ముందుగానే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటినంతా ఏప్రిల్‌లో ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయిం చింది. అయితే ప్రస్తుతం కాస్త ముందుగానే ఖాళీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇసుక అవసరాలు పెరగడం, లభ్యత తగ్గిన నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొత్తం సీజన్లో 45 టీఎంసీల నీటిని దిగువకు ఎత్తిపోయగా, ఈ వారం రోజుల నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. బ్యారేజీలో 16.12 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా, కొన్నిరోజుల్లో నీటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆదివారం సైతం ఏడు మోటార్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువ అన్నారం తరలించారు. ఇదే రీతిని పంపింగ్ కొనసాగిస్తే వారంలో మేడిగడ్డ ఖాళీ కానుంది. ఇక్కడ కనీసంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర ఇసుక లభ్యత ఉంటుందని అంచనా. ఇప్పుడు ఖాళీ చేస్తేనే మార్చి నుంచి జూన్ ఆరంభం వరకు మూడు నెలలపాటు ఇసుకను తరలించవచ్చనే ప్రణాళికతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ చేసిన అనంతరం బ్యారేజీని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అవసరమైన మరమ్మతులు సైతం చేయనున్నారు. ఇక ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో అన్నారంలో లభ్యత పెరగడంతో అక్కడ 10.87 టీఎంసీలకు గానూ 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. దీంతో ఇక్కడి పంప్‌హౌస్‌లోని 8 మోటార్లతో నీటిని సుందిళ్లకు తరలిస్తున్నారు. సుందిళ్ల నుంచి మరో 4 పంపుల ద్వారా నీటిని ఎల్లంపల్లి చేరుస్తున్నారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 20.18 టీఎంసీలకు గానూ 8.30 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేసిన అనంతరం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సైతం ఖాళీ చేయనున్నారు. ఈ నీటితో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో నిల్వలను పెంచనున్నారు. అనంతరం వీలునుబట్టి నీటిని పునరుజ్జీవం ద్వారా ఎస్సారెస్పీకి పంపనున్నారు. -
తరలివచ్చిన జలతరంగిణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పెరిగిన నీటి లభ్యత, ఎగువ కాళేశ్వరం ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరీవాహకం ఉప్పొంగుతోంది. గత యాసంగి సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ఎస్సారెస్పీ–1, 2 కింద పూర్తి ఆయకట్టుకు నీరందించడంతో పాటు గరిష్టంగా 65 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. మరో 20 నుంచి 25 టీఎంసీల నీటిని మార్చి చివరి వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. కొత్తగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది చెరువులు నింపుతూ, ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియ మొదలవడంతో జోష్ మరింత పెరిగింది. చరిత్రలో తొలిసారి.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్టేజ్–1 కింద 9.6 లక్షలు, స్టేజ్–2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గతేడాది వర్షాకాల సీజన్లో కురిసిన వర్షాలతో 159 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. ఇందులోంచి ఖరీఫ్‌లో నీటి వినియోగం పెద్దగా చేయలేదు. దీంతో యాసంగి మొదలయ్యే నాటికి ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను.. 89 టీఎంసీల మేర లభ్యత ఉండటంతో స్టేజ్–1 కింద లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకున్న 4.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి గతేడాది డిసెంబర్ 25 నుంచి నిరంతరాయంగా నీటిని 4 తడుల ద్వారా విడుదల చేసి సాగునీరిచ్చారు. దీనికే ఇప్పటి వరకు 25 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు 58 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. లభ్యత నీటిలోంచి మరో 3 తడుల ద్వారా 20–25 టీఎంసీల మేర నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన స్టేజ్–1 కిందే ఉన్న మరో 5లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎల్ఎండీకి ఎత్తిపోసిన నీటితో సాగునీరిచ్చారు. స్టేజ్–1 కిందే మొత్తంగా 9.5 లక్షల వరకు ప్రస్తుతం సాగునీరందింది. ఇక స్టేజ్–2 కింద 3.97లక్షల ఎకరాలకు గానూ 2.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. దీంతోపాటే 592 చెరువులను నింపుతున్నారు. ఎల్ఎండీ దిగువన మొత్తం 44 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. టెయిల్ టు హెడ్ అనే పద్ధతిన నీరు పంపిణీ చేయడంతో ఆయకట్టు చివరి జిల్లా అయిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలానికి గోదావరి నీళ్లు చేరాయి. మొత్తంగా ఎస్సారెస్పీ కింద చరిత్రలో తొలిసారి 12 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 69 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గడిచిన పదేళ్లలో యాసంగిలో జరిగిన వినియోగాన్ని పరిశీలిస్తే గరిష్టంగా 2010–11 ఏడాదుల్లో 57.96 టీఎంసీలుగా మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే 69 టీఎంసీల మేర వినియోగం పూర్తవ్వడం, మరింత నీటి వినియోగానికి సిద్ధంగా ఉండటంతో మార్చి చివరికి 100 టీఎంసీల మార్కును దాటే అవకాశాలున్నాయి. పునరుజ్జీవంతో మరింత మేలు.. ఎస్సారెస్పీపైనే ఆధారపడిన వరద కాల్వకు సైతం పునరుజ్జీవ పథకం ద్వారా నీరందిస్తున్నారు. పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉన్న రాంపూర్, రాజేశ్వరరావుపేటలోని మోటార్లను ఆరంభించి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసి 50 చెరువులను నింపనున్నారు. దీంతో పాటే వరద కాల్వ పరిధిలో బోరు మోటార్ల ద్వారా సాగు చేసిన ఆయకట్టుకు నీటి లభ్యత పెంచనున్నారు. ఎస్సారెస్పీలో ఏప్రిల్ నాటికి యాసంగి వినియోగంతో లభ్యత పడిపోగానే ఇదే ఎగువ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేసి పునరుజ్జీవన పథకం ద్వారా మళ్లీ నింపనున్నారు. దీంతో మళ్లీ ఖరీఫ్‌లో సాగుకు నీటి కొరత లేకుండా చూసేలా ఇదివరకే ప్రణాళిక రచించారు. గత పదేళ్లలో ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీరు, వినియోగం.. (టీఎంసీల్లో) సంవత్సరం వచ్చిన వరద నీటి వినియోగం 2009–10 27.34 13.61 2010–11 308.82 57.96 2011–12 174.20 33.67 2012–13 54.73 27.38 2013–14 320 56.60 2014–15 14.77 4.11 2015–16 4.42 1.61 2016–17 356.26 43.47 2017–18 75.31 33.42 2018–19 77.17 17.10 2019–20 159 69 -
కొండపోచమ్మకు.. గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ ఏడాది నుంచే కొండపోచమ్మ సాగర్ వరకు తరలించడానికి పంపింగ్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. రాజరాజేశ్వర స్వామి (మిడ్ మానేరు) రిజర్వాయర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్ని దశల్లో పంపు హౌస్‌ల నిర్మాణం పూర్తి కావాలని, ఈ ఏడాది నుంచి నీటిని పంపు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు కాళేశ్వరం పరిధిలోని పంపుహౌస్‌లను ప్రభాకర్ రావు శుక్రవారం సందర్శించారు. నిర్మాణ పనులను తనిఖీ చేసి, అధికారులతో సమీక్ష జరిపారు. -
400 చెరువుల్లో... గోదావరి గలగలలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపిన ప్రభుత్వం చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యామ్ కింద చెరువులను నింపించిన ప్రభుత్వం..వందకు వంద శాతం చెరువులను నింపే పనిలో పడింది. వీటితో పాటే మిడ్‌మానేరు పరిధిలోని చెరువులతో పాటే, మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులకు నీళ్లందించి, వాటి కింది ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఎస్సారెస్పీ స్టేజ్–2 చెరువులకు జలకళ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసిన విషయం తెలిసిందే. దీంతో మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు గోదావరి అంతా జలకళను సంతరించుకుంది. మిడ్‌మానేరులోకి ఈ సీజన్లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యామ్‌కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న చెరువులను నింపే ప్రక్రియ గడిచిన రెండు నెలలుగా సాగుతోంది. స్టేజ్–2లో మొత్తంగా 681 చెరువులు నింపాల్సి ఉండగా, ఇప్పటికే 586 పూర్తయ్యాయి. మరో 78 చెరువులను ప్రస్తుతం నింపే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 17 నింపాల్సి ఉంది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలుగా కాగా, ఇప్పటికే నిండిన చెరువులతో వాటి నిల్వ 8.10 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత యాసంగిలో స్టేజ్–2 కింద ఉన్న 3.97 లక్షల ఎకరాల్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మిడ్‌మానేరు, లోయర్ మానేరులు నిండుగా ఉండటంతో నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. ఇక మిడ్‌మానేరు సైతం పూర్తి సామర్థ్యంతో నిండి ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్దేశించిన 80 వేల ఎకరాల ఆయకట్టులో 25 వేల ఎకరాలకు ఈ సీజన్లో నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు నీరిస్తూనే మరో 50 చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని సీఎం కేసీఆర్ సోమవారం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతగిరి ఖాళీ అయితే... ఇక దీంతో పాటే మిడ్‌మానేరు కింద ఉన్న అనంతగిరి గ్రామాన్ని త్వరగా ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ గ్రామం ఖాళీ అయితే అనంతగిరి, రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్లను నింపడంతో పాటు కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించవచ్చు. ఇలా నీటిని తరలించే క్రమంలో రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటికే నింపిన చెరువులు, కొత్తగా నింపేవి కలిపి మొత్తం వెయ్యికి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపే కసరత్తు వేగంగా జరుగుతోంది. -
ఆహా.. మిడ్ మా‘నీరు’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటి తరలింపుతో శ్రీ రాజ రాజేశ్వర రిజర్వాయర్ (మిడ్‌మానేరు) నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 25.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.11 టీఎంసీల మేర నిల్వ ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిజర్వాయర్‌లోకి 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీటి పరిమాణమే 46.46 టీఎంసీలుగా ఉంది. మరో 3.07 టీఎంసీ వరద నీరు కాగా, 2.45 టీఎంసీల నీరు ఎస్సారెస్పీ ద్వారా వచ్చింది. ఇప్పటికే మిడ్‌మానేరు ద్వారా లోయర్ మానేరు డ్యామ్‌కు 29.14 టీఎంసీల మేర నీటిని తరలించారు. ఎల్ఎండీ నుంచి ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీటిని తరలించి చెరువులు నింపారు. అయితే కాళేశ్వరంలో భాగంగా మిడ్‌మానేరు నుంచి నీటిని ప్యాకేజీ–10, 11, 12ల ద్వారా దిగువ అనంతగిరి, రంగనాయక్‌సాగర్ ద్వారా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉంది. అయితే అనంతగిరి గ్రామం ఖాళీ చేయకపోవడంతో నీటి పంపింగ్ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వాయర్ పరిధిలో చేసే పర్యటన సందర్భంగా కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిడ్‌మానేరు కుడి, ఎడమ కాల్వల కింద 75 కిలోమీటర్ల కాల్వల తవ్వకం చేయాల్సి ఉండగా, 60కిలోమీటర్లు పూర్తయింది. దీనికింద 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ యాసంగిలో 25వేల నుంచి 30వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి. -
కాళేశ్వరం నీరు... ‘కృష్ణ’కు చేరు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంతో గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించి నీటి లభ్యతను పెంచే కొత్త ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు. కాళేశ్వరంలో భాగం గా నిర్మించే బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి గోదా వరి జలాలను సాగర్ ఆయకట్టు పరీవాహకానికి తరలించి నీటి లభ్యతను పెంచడం, ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యం గా అధ్యయనం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ దిశగా అప్పుడే కసరత్తు మొదలైంది. 3.50లక్షల ఎకరాల స్థిరీకరణ.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తుతం రెండు టీఎంసీల సామర్థ్యంతో చేపట్టగా, ఇందులో మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ, ఎస్సారెస్పీ పునరుజ్జీవానికి మరో టీఎంసీ తరలించేలా ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలో ప్రతిపాదించిన బస్వాపూర్ వరకు నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు సింగూరు, నిజాంసాగర్ వరకు మరింత నీటిని అందుబాటులో ఉంచేందుకు అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకోవాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ అదనపు టీఎంసీతో నీటి లభ్యత పెరుగుతున్నందున బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించేలా చూడాలని ఆయన ఆదేశించగా రిటైర్డ్ ఇంజనీర్లు ప్రాథమిక సూచనలు చేశారు. బస్వాపూర్ నుంచి 3 కిలోమీటర్ల కాల్వ తవ్వకం ద్వారా నీటిని శామీర్‌పేట వాగుకు తరలించవచ్చని, కనిష్టంగా 4వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వను వెడల్పు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. అక్కడి నుంచి మూసీ నది, ఆసిఫ్ నహర్‌కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని తేల్చారు. అక్కడి నుంచి నేరుగా పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తే, అక్కడి నుంచి సాగర్ కింద ఉన్న 3.70 లక్షల ఎకరాల ఆయకట్టులో కనిష్టంగా 3.50లక్షల ఎకరాలకు నీరందించి స్థిరీకరించవచ్చని తేల్చారు. రేపు పర్యటించనున్న రిటైర్డ్ ఇంజనీర్లు కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేలా సమగ్ర అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దీనిపై రిటైర్డ్ ఇంజనీర్లు మంగళవారం నుంచి అధ్యయనం మొదలుపెట్టనున్నారు. ఇక దీనితో పాటు సాగర్ ఆయకట్టు పరిధిలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తోంది.ఇప్పటికే వరల్డ్‌బ్యాంకు నిధులతో సాగర్ కాల్వల ఆధునికీకరణ చేసిన నేపథ్యంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అవసరమన్న విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సాగర్ పరీవాహకంలో పర్యటించి అధ్యయనం చేయనుంది. వీటితో పాటే ఎస్సారెస్పీ పరిధిలోనూ కొత్త ఎత్తిపోతల పథకాలు అవసరమా? లేదా? అన్నది తేల్చనుంది. -
పునరుజ్జీవన వ్యయం డబుల్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ను వరద కాల్వ మీదుగా ఎస్సారెస్పీకి పంపేందుకు తలపెట్టిన పునరుజ్జీవన పథకం వ్యయంరెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్ల నుంచి సుమారు రూ.2 వేల కోట్లకు పెరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు సిద్ధమవగా, ప్రభుత్వ అనుమతి కోసం వెళ్లనుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి 2017, జూన్ 17న ప్రభుత్వం రూ.1,067 కోట్లతో అనుమతులిచ్చారు. ఈ నిధులతో 60 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్‌హౌస్‌లను ప్రతిపాదించారు. వీటి నిర్మాణాలకు మొదట 5.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరం ఉండగా.. నిర్మాణ పనుల్లో మార్పుల కారణంగా అది 6.14 లక్షల క్యూబిక్ మీటర్లకు పెరిగింది. స్టీల్ అంచనా 17,100 టన్నులకు పెరిగింది. దీంతో తొలుత వేసిన అంచనా వ్యయాన్ని ఈ ఏడాది జూన్‌లో రూ.1751.46 కోట్ల మేర పెంచుతూ నిర్ణయం జరిగింది. వీటి తర్వాత అదనంగా 2 తూముల, కార్యాలయాలు, ఇతర నిర్మాణాలు, సిమెంట్, స్టీలు, ఇంధన ధరలో మార్పులతో గతంలోనే రూ.62.68 కోట్ల మేర అంచనా పెరగ్గా, ప్రస్తుతం అది 135.94 కోట్ల మేర పెరనున్నట్లు ఇంజనీర్లు నిర్ధారించారు. మొత్తం అంచనా వ్యయం రూ.1999.56 కోట్లకు పెరగనున్నట్లు తేల్చారు. దీన్ని స్టేల్ లెవల్ స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అనంతరం ప్రభుత్వ అనుమతి కోసం సిఫార్సు చేయనున్నారు. -
చంద్రబాబు నిర్లక్ష్యం.. నీటి నిల్వకు శాపం
సాక్షి, అమరావతి: ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన కాలువలను విస్తరించడంలో, పెండింగ్ పనులను పూర్తి చేయడంలో గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో నేడు వరద నీటిని ఒడిసి పట్టలేని దుస్థితి నెలకొంది. తాగు, సాగునీటి ప్రాజెక్టుల గురించి అప్పడే కాస్త శ్రద్ధ చూపి ఉంటే ఇప్పుడు తరలిస్తున్న నీటికి రెట్టింపు తరలించి నిల్వ చేయడానికి వీలుండేది. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కనీసం కాలువల విస్తరణలో మిగిలిపోయిన చిన్న చిన్న పనులను సైతం పూర్తి చేయక పోవడం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. అరకొరగా మిగిలి ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సైతం విఫలమవడం వల్లే వరద నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే అవకాశం లేకుండా పోయిం దని సాగు నీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. అన్ని కాలువలపై శీతకన్ను శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఒడిసి పట్టి.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని అప్పట్లోనే 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. గత ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు దీనిని 80 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే శ్రీశైలానికి వరద వచ్చినప్పుడు రోజూ 7.5 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. తద్వారా కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన వెలిగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, చిత్రావతి తదితర జలాశయాలను కేవలం 40 రోజుల్లోనే నింపి ఉండవచ్చు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ, ఎస్సార్బీసీ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని కనీసం 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే నేడు తక్కువ రోజుల్లోనే అనుకున్న మేరకు నీటిని తరలించడానికి వీలయ్యేది. వెలిగోడు రిజర్వాయర్‌కు జలాలను తరలించే కాలువకు కనీసం లైనింగ్ చేయించిన పాపాన పోలేదు. గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉండింటే గోరకల్లు, అవుకు జలాశయాలను యుద్ధ ప్రాతిపదికన నింపి ఉండవచ్చు. బ్రహ్మంసాగర్‌కు నీటిని సరఫరా చేసే కాలువ, నిప్పులవాగు సామర్థ్యాన్ని పెంచే పనులను సైతం చేపట్టక పోవడం వల్ల ఇవాళ ఎంతగా నష్టపోయామో కళ్లెదుటే కనిపిస్తోంది. ముందు చూపు కరువు అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే గండికోట జలాశయాన్ని 10 రోజుల్లో నింపి ఉండవచ్చు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాలెం, మైలవరం రిజర్వాయర్లను యుద్ధ ప్రాతిపదికన నింపి ఉండటానికి వీలుండేది. గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని పెంచి ఉంటే ఆ ప్రాజెక్టు రెండో దశలో వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మిస్తున్న వేణుగోపాలసాగర్, అడవికొత్తూరు, శ్రీనివాససాగర్, పద్మసాగర్ తదితర జలాశయాలను త్వరితగతిన నింపడానికి ఉపకరించేది. నిప్పులవాగు పరిస్థితీ అంతే. దీని ప్రవాహ సామర్థ్యాన్ని 30–35 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా వచ్చే నీటిని వేగంగా తరలించడానికి అవకాశం ఉండేది. సోమశిల రిజర్వాయర్ నుంచి కండలేరు రిజర్వాయర్‌కు ప్రస్తుతం రోజుకు 0.8 టీఎంసీలకు మించి నీటిని తరలించలేని పరిస్థితి. ఆ కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వి ఉంటే ఈ పాటికి కండలేరు నిండుగా నీటితో కళకళలాడుతుండేది. వెలిగొండ ప్రాజెక్టులో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేసి ఉంటే 53 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉండేది. హంద్రీ–నీవా పరిస్థితీ అంతే.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలను తరలించడం ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు.. 30 లక్షల మందికి తాగు నీరు అందించడమే లక్ష్యంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. గత ఐదేళ్లలో ఈ కాలువను చంద్రబాబు 10–12 వేల క్యూసెక్కులకు విస్తరించి ఉంటే నేడు కృష్ణా వరద జలాలను మరింతగా ఒడిసి పట్టడానికి వీలుండేది. తద్వారా దీనిపై ఆధారపడ్డ కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల ప్రాజెక్టులను త్వరితగతిన నింపడంతో పాటు దాదాపు 1000 చెరువులను నింపి ఉండవచ్చు. మొత్తంగా కాలువలను విస్తరించడంపై చంద్రబాబు దృష్టి సారించి ఉంటే ఇప్పుడు కనీసం 200 – 250 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసి ఉండవచ్చని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 793.145 టీఎంసీలు సముద్రంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 31 నుంచి ఇప్పటి వరకు శ్రీశైలానికి ఎనిమిది దఫాలుగా వరద వచ్చినా సరైన రీతిలో ఆ నీటిని ఉపయోగించుకోలేక పోయామంటే గత సర్కారు నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. ఈ ఏడాది మే 30న అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాలువల పరిస్థితులు సక్రమంగా లేకపోయినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా వరద జలాలను తరలించి ఒక వైపు తెలుగుగంగ, ఎస్సార్బీసీ ఆయకట్టుకు నీళ్లందిస్తూనే.. వెలిగోడులో 16.42 టీఎంసీలు, గోరకల్లులో 8, అవుకులో 3.13, గండికోటలో 11.96, చిత్రావతిలో 6.48, మైలవరంలో 6.18, బ్రహ్మంసాగర్‌లో 5.01, సోమశిలలో 72.95, కండలేరులో 42.06 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సర్కార్‌తో చర్చించి.. పునరావాసం సమస్యను పరిష్కరించడం వల్ల పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. కనీసం 650 టీఎంసీలను ఉపయోగించుకోలేకపోయాం పోలవరం పూర్తయి ఉంటే 196 టీఎంసీలను నిల్వ చేసే అవకాశం ఉండేది. 301 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా 25 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అదనంగా 80 టీఎంసీలు సరఫరా చేయడం ద్వారా కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి ఉంటే 53 టీఎంసీలను మళ్లించడం ద్వారా 4.32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉండేది. ఈ సీజన్లో ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 3,727.918 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. పోలవరం, చింతలపూడి, తాడిపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి పథకాలను చంద్రబాబు పూర్తి చేసి ఉంటే.. సముద్రంలో కలిసిన జలాల్లో కనీసం 650 టీఎంసీలకుపైగా వినియోగించుకునే అవకాశం ఉండేది. బంజరు భూములు సస్యశ్యామలయ్యేవి. వంశధార స్టేజ్–2లోని ఫేజ్–2లో మిగిలిపోయిన పనులను ఐదేళ్లలో పూర్తి చేయడంలో చంద్రబాబు విఫలయ్యారు. దీంతో హీరమండలం రిజర్వాయర్‌లో 20 టీఎంసీలకు గాను కేవలం 5.61 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు గొట్టా బ్యారేజీ నుంచి వంశధార జలాలు 119.89 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే.. సముద్రంలో కలిసిన వంశధార జలాల్లో కనీసం 25 నుంచి 30 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉండేది. ఈ సీజన్లో ఏకంగా 4,640.953 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి. -
తుది నుంచే మొదలయ్యేలా..
సాక్షి, హైదరాబాద్: తాగునీరు దొరక్క..సాగునీరు లేక అల్లాడుతున్న కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలు ఊపిరిపోస్తున్నాయి. తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగు అవసరాలు తీర్చేందుకు పాతికేళ్ల కింద జీవం పోసుకున్న ఎస్సారెస్పీ–2 ప్రణాళికలు ఇప్పుడు పట్టాలెక్కి, పనులు పూర్తి చేసుకొని నీటి పరవళ్లను సంతరించుకుంటున్నాయి. ఎంత నీరు పారించినా చివరి ఆయకట్టుకు నీరే లేదన్న అపవాదును దాటేందుకు చిట్టచివరి ఆయకట్టుకే మొదట నీరిచ్చేలా కార్యాచరణ రూపొందించి దానిలో నీటిపారుదల శాఖ అధికారులు సఫలీకృతులయ్యారు. అనేక అవాంతరాలు దాటుతూ ఎస్పారెస్పీ–2 కింద నిర్ణయించిన చెరువులు నింపుతూ, పూర్తి ఆయకట్టుకు నీటి లభ్యత పెంచుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబా బాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిం చాలని నిర్ణయించారు. మొత్తంగా రూ. 1,043 కోట్లతో ఈ పనులు చేపట్టగా రూ. 1,220 కోట్లకు దీన్ని సవరించారు. నిజానికి ఈ కాల్వ పనులకు 1995–96 మధ్య కాలంలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు జీవం పోశారు. అయితే వివిధ కారణాలతో పనులు మొదలవ్వలేదు. అనంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పనుల్లో వేగం పెంచారు. 2006 ఫిబ్రవరి 27న కాకతీయ కాల్వల విస్తరణకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆయన హయాంలోనే పనులు మొదలైనా, ఆయన మరణానంతరం పనులు మళ్లీ నెమ్మదించాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తూ పనులు పూర్తి చేస్తూ వచ్చింది. చివరి నుంచి మొదటికి.. సాధారణంగా ప్రాజెక్టుల నుంచి నీటిని ముందుగా ఉన్న చెరువులు, ఆయకట్టుకు నీరిస్తూ, చివరి ఆయకట్టు వరకు సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుత విధానంతో ఏ ప్రాజెక్టుల కిందా చివరి ఆయకట్టు లేక చెరువు వరకు నీటి సరఫరా అయిన సందర్భాలు లేవు. కాల్వల పూర్తిస్థాయి సామర్ధ్యంతో నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే చివరి భూములకు, చెరువులకు నీరు చేరుతుంది. తక్కువ సామర్ధ్యంతో నీటి సరఫరా చేస్తే చివరి ఆయకట్టుకు నీరు చేరడం గగనమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం గోదావరి నీటిని ఎస్సారెస్పీ దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యామ్‌నుంచి పూర్తి స్థాయి సామర్ధ్యం 3,500 క్యూసెక్కుల నీటితో నీటిని సరఫరా చేస్తూ సూర్యాపేట జిల్లాలో చిట్టచివర ఉన్న పెన్‌పహాడ్ మండలంలోని మాచారం రాయి చెరువు నుంచి నీటిని నింపుతూ వస్తున్నారు. చిట్టచివర ఉన్న ఈ చెరువు నుంచి మొదలుకు నీటిని నింపుతూ ఇప్పటివరకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో 262 చెరువులు నింపారు. ఈ చెరువుల కిందే 22,800 ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. అనంతరం మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్ రూరల్ జిల్లాలోని చెరువులు కలిపి మొత్తంగా 592 చెరువులు నింపనున్నారు. టెయిల్ టూ హెడ్ అనే ఈ పద్ధతి ద్వారా చివరి ఆయకట్టు నుంచి తొలి ఆయకట్టు వరకు 3.97 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుంది. ఇంతవరకూ ఎన్నడూ గోదావరి జలాలను ఎరుగని పరివాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వలు చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద ఐదు ఎకరాలేశా ఈ వాన కాలంల బోరుతో ఎకరా ముప్పై గుంటలు సాగు చేసిన. బోరు అడుగంటిపోయి పొలం ఎండిపోయింది. కొన్ని రోజుల తర్వాత వర్షాలు కురవడంతో పాటు ఎస్సారెస్పీ నీటితో చెరువూ నిండింది. నాకు ఉన్న ఐదు ఎకరాలు సాగు చేసిన. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఎస్సారెస్పీ నీటితో చెరువును నింపడంతో వచ్చే యాసంగిలో కూడా ఐదు ఎకరాలు సాగు చేస్తా’. – గాయం నర్సిరెడ్డి, రైతు, ధర్మాపురం బోరు కింద వరిసాగు చేశా ఈ వాన కాలంల మంచి వర్షాలే కురవడంతో బోర్ల కింద నాకున్న 18 గుంటలు పంటలేశా. కానీ యాసంగిల మాత్రం నీళ్లు లేక పంటల సాగు చేసి ఏళ్లవుతోంది. ప్రతి యాసంగికి భూములు బీడే. ఈసారి గోదారి నీళ్లొచ్చినయ్. రాయి చెరువు నిండింది. తిండి గింజల మందం సాగు అవుతుంది’. –వీరబోయిన కృష్ణ, రైతు, మాచారం పత్తి పంటను సాగు చేశా రాయి చెరువు ఆయకట్టు కింద కౌలుకు తీసుకొని 20 ఎకరాలు పత్తి సాగు చేశాను. రాయి చెరువు నిండితే యాసంగి ఐదు ఎకరాలు వరి పంట సాగులోకి వస్తుంది. ఇప్పటికే రాయి చెరువులోకి ఎస్సార్ఎస్పీ నీరు వచ్చి కొత్త ఆశలు నింపింది. ఇక రబీకి నీటి గోస ఉండదనే అనుకుంటున్నాం’. – లాలు, రైతు, గూడెపుకుంట తండా రైతుల్లో నమ్మకం పెరిగింది ‘ఎస్సారెస్పీ–2 పరిధిలో చిట్టచివరి ఆయకట్టుకు ఎన్నడూ నీరు పారింది లేదు. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, గోదావరి జలాల లభ్యత ఎక్కువగా ఉండటంతో టెయిల్ టూ హెడ్ విధానాన్ని తీసుకొచ్చాం. ఈ విధానం ద్వారా చివరి ఆయకట్టు, చెరువు నుంచి నీళ్లిచ్చుకుంటూ మొదటికి వస్తాం. దీనివల్ల ప్రతి ఎకరాకి నీరందుతుంది. నీటి కోసం కాల్వలకు ఎక్కడా రైతులు గండ్లు కొట్టకుండా రైతులను సమన్వయ పరుస్తున్నాం. ఇంజనీర్లు, ఇతర శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్గిస్తున్నారు. రైతుకు నీళ్లొస్తాయనే నమ్మకం కలిగించాం. ఇంతటితో ఆగకుండా కాల్వల ఆధునికీకరణ జరిగితే రైతుకు మరింత మేలు జరుగుతుంది’. – నాగేంద్రరావు, ఈఎన్సీ, సీఈ, ఎస్సారెస్పీ–2 -
కరువన్నది లేకుండా..బృహత్తర ప్రణాళిక
-
గోదావరి-కృష్ణా అనుసంధానానికి బృహత్తర ప్రణాళిక
సాక్షి, అమరావతి: సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి.. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుని.. కరవు నేలను సుభిక్షం చేసే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోదావరి వరద జలాలను కరవు నేలకు మళ్లించడానికి అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో ప్రతిపాదనపై దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేయిస్తోంది. గోదావరి నది నుంచి సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల్లో రోజుకు 23 వేల క్యూసెక్కుల చొప్పున అంటే 2 టీఎంసీల నీటిని.. 105 రోజులపాటు తరలించి.. మొత్తంగా 210 టీఎంసీలను ఒడిసి పట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జునసాగర్ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలని యోచిస్తోంది. మరోవైపు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటు పులిచింతల, అటు నాగార్జున సాగర్ మీద ఆధారపడ్డ ప్రాంతాలకు బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోని నీటిని ప్రాణాధారంలా నిలపాలని భావిస్తోంది. 15 ఏళ్లుగా గోదావరిలో నీటి ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని 105 రోజుల్లో రోజుకు 1,200 క్యూమెక్కులు (35.315 క్యూసెక్కులు అయితే ఒక క్యూసెక్కు.. అంటే రోజుకు దాదాపు 3.7 టీఎంసీలు) ప్రవాహం ఉంటుందని వ్యాప్కోస్ (ప్రభుత్వ రంగ సంస్థ) అంచనా వేసింది. ఇలా వచ్చే నీటిలో గోదావరి డెల్టా అవసరాలు పోను, మిగిలిన నీరు సముద్రంలోకి పోతోంది. ఇలా సముద్రంలో కలిసిపోతున్న జలాలను కరువు, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ మేలు చేకూరుతుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వెలిగొండతోపాటు, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్ట్, ఎస్సార్బీసీ తదితర అవసరాల కోసం బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా నీరందించే అవకాశం ఉంటుంది. పోలవరం టు బనకచర్ల ప్రతిపాదన–1 పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచి రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలిస్తారు. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా పులిచింతల ప్రాజెక్టును నింపుతారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువకు తరలిస్తారు. బుగ్గవాగు ప్రాజెక్టును నింపుతారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. బొల్లాపల్లి నుంచి గ్రావిటీపై వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని అందిస్తూ.. నల్లమల అడవుల్లో ఒక టన్నెల్ తవ్వడం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలిస్తారు. ప్రతిపాదన–2 పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తి పోస్తారు. అక్కడ నుంచి బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని లిఫ్ట్ చేస్తారు. బొల్లాపల్లి నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని అందిస్తూ, మరోవైపు నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌ను తవ్వడం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీ ద్వారా, మరికొన్ని చోట్ల ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. సముద్ర మట్టానికి 37 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉంటే.. 260 మీటర్ల ఎత్తులో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ఉంది. అంటే దాదాపు 230 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. మొత్తంగా దీనికోసం 2,100 మెగావాట్ల కరెంటు అవసరం అవుతుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు విలువ రూ.60 వేల కోట్లపైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి సీఎం ఆదేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం జలవనరుల శాఖ సమీక్షా సమావేశంలో పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించే రెండు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. సముద్రంలో కలుస్తున్న ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. ప్రస్తుతం సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలను స్థిరీకరించడమే కాకుండా, నిత్యం కరువుతో, తాగునీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాలకు జలాలను తరలించి కష్టాలను తీర్చాలన్నదే తన ప్రయత్నమన్నారు. ఈ రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేసి.. డీపీఆర్ తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలపై వ్యాప్కోస్ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా పనులు చేపట్టనున్నారు. -
మిడ్‌మానేరుకు ఏమైంది..?
సాక్షి, కరీంనగర్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మిడ్‌మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు భద్రత చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులోకి నీటిని నింపడం, అక్కడి నుంచి దిగువకు వదలడం వంటి అంశాల్లో పారదర్శకంగా ఉండాల్సిన అధి కార యంత్రాంగం గుంభనంగా వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. 25.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్‌మానేరులోకి 2017 నుంచి నీటిని నింపుతున్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట తొలిసారిగా 14 టీఎంసీల నీటిని నింపారు. కానీ నింపిన నీటిని దిగువకు వదిలి 25 రోజులు కావస్తున్నా, ఇప్పటి వరకు మళ్లీ మిడ్‌మానేరులోకి గోదావరి నీటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోగా, మిడ్‌మానేరులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ, దిగువన గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు కట్ట సురక్షితం కాదనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం మిడ్‌మానేరు కట్టపైకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో చర్చించారు. మిడ్‌మానేరు కట్టపైన, కట్ట దిగువన బోరు మిషన్లతో డ్రిల్లింగ్ చేస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. మిడ్‌మానేరును ఎందుకు నింపడం లేదనే ఆయన ప్రశ్నకు అధికార యంత్రాంగం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడం గమనార్హం. మాన్వాడ, మల్లాపూర్, కొత్తపేట, బావుపేట ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరానికి గుండెకాయ మిడ్‌మానేరు కాళేశ్వరం ప్రాజక్టుకు గుండెకాయ వంటి మిడ్‌మానేరు నిండితేనే అక్కడి నుంచి ఒకవైపు లోయర్ మానేరుడ్యాం ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు, మరోవైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా మెదక్, నల్గొండ, హైదరాబాద్ వరకు కాళేశ్వరం జలాలు తరలివెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలో గత నెలలో ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని నందిమేడారం రిజర్వాయర్ ద్వారా లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ నుంచి మిడ్‌మానేరుకు వదిలారు. 25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్‌మానేరులో తొలిసారిగా 14 టీఎంసీల వరకు నీటిని నింపిన అధికారులు ఆగస్టు 30న సాయంత్రం 5 గంటలకు రిజర్వాయర్ నీటిని 10వేల క్యూసెక్కుల వరకు ఎల్ఎండీకి వదలాలని నిర్ణయించారు. అప్పటికే పొద్దుపోవడంతో హుటాహుటిన రెవెన్యూ అధికారులతో చర్చించి, పోలీసుల కాపలా మధ్య రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సిరిసిల్ల ఎస్పీతో కలిసి కరీంనగర్ ఈఎన్సీ అనిల్‌కుమార్ నీటిని విడుదల చేశారు. 5 నుంచి 10 గేట్లు ఎత్తి మిడ్‌మానేరుకు నీటిని విడుదల చేస్తారని భావించగా, తెల్లవారే సరికి ఏకంగా 25 గేట్లు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఈ క్రమంలో దిగువన ఉన్న గ్రామాల్లోని గొర్రెలు, మేకలు, కరెంటు మోటార్లు కొట్టుకుపోయాయి. రెండు మూడు రోజుల్లో ఏకంగా 10 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు వదిలేసి గేట్లు మూసివేశారు. ప్రస్తుతం మిడ్‌మానేరు ప్రాజెక్టులో కాళేశ్వరం నీరు నింపక ముందున్న 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వగా ఉంది. కాగా వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న 3,500 క్యూసెక్కుల నీటిని కూడా యధాతథంగా కిందికి వదులుతున్నారే తప్ప నిలిపే ప్రయత్నం చేయడం లేదు. మిడ్‌మానేరు కట్టకు లీకేజా... సీపేజా..? ‘కొత్త కుండ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నిండుగా నీళ్లు నింపి ఎక్కువ సేపు ఉంచరు. కుండ గట్టిపడేదాకా నీటిని నింపి వదిలేస్తుంటారు. అలాగే మిడ్‌మానేరు విషయంలో జరిగింది’ అని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఐఎస్ కోడ్ ప్రకారం రిజర్వాయర్‌ను రెండింట మూడొంతుల వరకు నీటితో నింపి ఆపేయాలని, ఏడాదికి కొంత చొప్పున నీటిని నింపాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే 2017లో ఈ ప్రాజెక్టులోకి 5.29 టీఎంసీ నీటిని నింపిన అధికారులు 2018లో 9 టీఎంసీలకు నింపారు. ఈ రెండు పర్యాయాలు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఈసారి 15 టీఎంసీల వరకు నింపినట్లు చెప్పారు. అయితే అంత మొత్తం నీటిని రాత్రికి రాత్రే వదిలేయాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. మాన్వాడ పరిధిలోని బోగంఒర్రె పూడ్చివేసి కట్ట కట్టిన ప్రాంతంలో భారీగా నీరు పైకి లేస్తుందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నీటి సాంధ్రత, గ్రావిటీని లెక్క కట్టేందుకు పీజో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏ సమస్య లేకపోతే పీజో మీటర్లను భారీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిడ్‌మానేరుకు లీకేజీ లేదని చెబుతున్న అధికారులు కేవలం సీపేజీ మాత్రమేనని దాటవేస్తున్నారు. సీపేజీ అనే సాంకేతిక పదానికి అర్థం... ఏదైనాæ ద్రవం గానీ, గ్యాస్ గానీ చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటకు వెళ్లడమే. ‘నేషనల్ రివర్స్ అథారిటీ’ ఈ సీపేజీ అనే పదాన్ని ‘ప్రమాదం నుంచి నివారించేందుకు గల అవకాశం’గా పేర్కొంది. పీజో మీటర్ ద్వారా పీడన పరీక్షలు ఏదైనా ద్రవం గ్రావిటీ కన్నా ఎత్తులో పీడనం చెందితే ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు పీజో మీటర్‌ను వినియోగిస్తారు. సివిల్ ఇంజనీరింగ్‌లో ఈ ప్రక్రియ సహజమే అయినప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణంలో గతంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలాలు లేవు. అయితే మిడ్‌మానేరు నీటిని ఎల్ఎండీకి వదిలిన తరువాత ఇరిగేషన్ అధికారులు మిడ్‌మానేరు కట్ట నాణ్యత పరీక్షల్లోనే మునిగిపోయారు. సీపేజీ జరుగుతుందని నిర్ధారణకు వచ్చిన అధికారులు కట్ట పైనుంచి 30 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి, పీవీసీ పైపుల గుండా పీజో మీటర్లను ఏర్పాటు చేసి కట్ట అడుగున నీటి సాంధ్రత, పీడనాన్ని అంచనా వేసే పనిలో మునిగిపోయారు. ఇప్పటికి కట్టకు ఇరువైపులా 8 పీజో మీటర్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కట్టకు దిగువన కూడా పీజో మీటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు జరుపుతున్నారు. కట్ట నుంచి 2.5 కిలోమీటర్ల నుంచి 2.7 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో భూ ఉపరితలం నుంచి ‘సీపేజీలు’ జరుగుతున్నాయని గుర్తించి డ్యాం సేఫ్టీ టీం పనులు చేస్తుందని ఈద శంకర్‌రెడ్డి చెప్పారు. భూ ఉపరితలం నుంచి మట్టితో కట్ట నిర్మించిందే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని, నాణ్యత లేని పనులు చేశారని కూడా ఆయన విమర్శించారు. చెరువు కట్ట నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఐడీసీ చైర్మన్ ఒప్పుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మిడ్‌మానేరు కట్ట ఎంత మేరకు సురక్షితమనే ఆందోళన దిగువనున్న గ్రామాల్లో మొదలైంది. దీనిపై అధికారులు గానీ ప్రభుత్వం గానీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
రేపు నీళ్లు బంద్..
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్‌లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొంది. సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలివీ... హస్మత్‌పేట్, పేట్‌బషీరాబాద్ బ్యాంక్ కాలనీ, మీనాక్షి, డిఫెన్స్ కాలనీ, గౌతమ్‌నగర్, చాణక్యపురి, తిరుమల్‌నగర్, గాయత్రినగర్, అల్వాల్ మున్సిపల్ ఏరియా, లోతుకుంట, ఫాదర్ బాలయ్యనగర్, ఓయూటీ కాలనీ, రాధిక, చెర్లపల్లి, కీసర, రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, హకీంపేట్, సింగాయిపల్లి, దేవరయాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, చెర్లపల్లి, తుర్కపల్లి, అహ్మద్‌గూడ, మెస్ త్రిశూల్, గన్‌రాక్, కంటోన్మెంట్ బోర్డు, రుద్రనగర్. -
జూరాలకు ఏడాదంతా నీళ్లు!
సాక్షి, గద్వాల: గోదావరి నదీ జలాలను సంగంబండ ద్వారా జూరాల జలాశయానికి అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఏడాదంతా నీటినిల్వ ఉండే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురిసి, అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిన తర్వాత రాష్ట్రంలోకి కృష్ణానది వరద వస్తేనే జూరాల ప్రాజెక్టుకు జలకళ వచ్చే పరిస్థితులు ఇన్నాళ్లు ఉండగా.. ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టు జలాశయంపై ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, గట్టు ఎత్తిపోతల పథకాలకు 64 టీఎంసీల నీళ్లు ఏటా అవసరం ఉంది. జూరాల ప్రాజెక్టు జలాశయంలో నీటి నిల్వ 9.66 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. ఖరీఫ్‌లో ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు. రైతులకు తీరనున్న నీటి కష్టాలు ఇదిలాఉండగా, కర్ణాటక నుంచి వరద రాకుంటే ఇక్కడి రైతులు తమ పంటకు విరామం ప్రకటించుకోవాల్సింది. జూరాల జలాశయంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించే అవకాశం ఉండదు. గత ఏడాది జూరాలకు ఎగువ నుంచి నీటి లభ్యత లేకపోవడంతో ఒకే పంటకు పరిమితమయ్యారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు ఆదుకోవాలని కర్ణాటకను కోరారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించి 2 టీఎంసీల నీటిని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసినా ఆ రాష్ట్రం దాటి జూరాలకు చేరింది కేవలం 0.75 టీఎంసీలు మాత్రమే. గత నాలుగు ఏళ్లుగా కర్ణాటకను తాగునీటి కోసం, పంటలను చివరి దశలో కాపాడడం కోసం వేడుకుంటేనే ఉన్నాం. సీఎం నిర్ణయంతో ఇక రైతుల నీటి కష్టాలు తీరనున్నాయి. గట్టు సామర్థ్యం పెంపునకు నిర్ణయం రైతుల పంట పొలాలు, తాగునీటి ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే గట్టు ఎత్తిపోతల జలాశయాన్ని 15 టీఎంసీల సామర్థ్యంకు పెంచాలని సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్‌లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సర్వే పూర్తయింది. వచ్చే నెలలో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కృష్ణానదికి వరద రాని కాలంలోనూ జూరాలకు గోదావరి నదీ జలాలను అందించాలని సంకల్పించామని సీఎం ప్రకటించడంతో జూరాలకు ఏడాంత నీటి లభ్యత ఉండే కాలం రాబోతుంది. గోదావరి నది నీటిని శ్రీశైలం జలాశయంకు మళ్లిస్తారు. శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ జలాశయానికి నీటిని అందిస్తారు. సంగంబండ నుంచి జూరాల జలాశయంకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గ్రావిటీ ఫ్లో ద్వారానే సంగంబండ నుంచి జూరాల జలాశయంకు నీటిని విడుదల చేసేలా లెవెల్స్ ఉన్నాయి. గోదావరి నదిలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందున కృష్ణానదికి వరద రానప్పుడు ఆదుకోవడం, వేసవిలో జూరాల అవసరాలకు కర్ణాటకను వేడుకునే పరిస్థితి శాశ్వత పరిష్కారం ఇవ్వనున్నారు. జూరాల ప్రాజెక్టుతో పాటు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలోని 6.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు పరిధిలోని రైతులు ఏటా నీళ్లు వస్తాయో లేదో అనే సంశయాన్ని వీడి పంటల సాగుకు సిద్దమయ్యే రోజులు రానున్నాయి. -
తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మంచి జరగాలనే ఆరాటంతోనే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని, మన రాష్ట్రానికి మంచి జరగదు అనుకుంటే.. అలాంటి నిర్ణయాన్ని కచ్చితంగా తీసుకుబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. గోదావరి జలాల తీరుతెన్నులు, గోదావరి నీళ్లు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశిస్తాయి? ఎన్ని వస్తున్నాయి? అందులో ఎన్ని ఉపయోగపడుతున్నాయి? అన్నది సీఎం వివరించారు. గోదావరి జలాలను రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున 120 రోజులపాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు తరలించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 480 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రైతులూ, ప్రజలూ బాగుపడతారని, సాగునీటి, తాగునీటి ఇబ్బందులు తీరుతాయని వివరించారు. నది జలాల పంపిణీ విషయంలో నీళ్లురావు అనుకుంటే ఇద్దరు సీఎంలు ఎందుకు ముందడుగు వేస్తారని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షం ఇచ్చిన సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. భావితరాల కోసం ఆలోచించే తాము అవసరమైన నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి నదిలో నాలుగు పాయలుంటే.. అందులో మూడు పాయలు తెలంగాణను దాటుకొని.. ఆంధ్రలోకి ప్రవేశిస్తాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గోదావరి నదికి చెందిన ఒక పాయ నాసిక్ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, ఈ పాయ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలో 22.23శాతం తెలంగాణకు వస్తాయని వివరించారు. అయితే, ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక చిన్న, చిన్న డ్యాములు కట్టుకుంటూ పోతుండటంతో ఈ పాయ మీద ఆధారపడిన తెలంగాణలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు నీళ్లు రాని పరిస్థితి నెలకొందని, ఈ ప్రాజెక్టు కోసం కాళేశ్వరం నుంచి రివర్స్ పద్ధతిలో నీళ్లు తరలించుకొని పోతున్నారని సీఎం వైఎస్ జగన్ వివరించారు. గోదావరి నదిలోని రెండో పాయ ప్రాణహిత నది అని.. ఇది కూడా తెలంగాణలోకి ప్రవేశిస్తోందని వివరించారు. ఈ ప్రాణహిత సబ్ బేసిన్ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలోని 35.46శాతం నీళ్లు వస్తాయని, గోదావరి పూర్తి నీటిలో దాదాపు 36శాతం ఈ పాయ నుంచే ప్రవహిస్తాయని వివరించారు. ఇక మూడో పాయ అయిన ఇంద్రావతి సబ్‌బేసిన్ కూడా తెలంగాణలోకే ప్రవేశిస్తుందని, అది మొత్తం ప్రవాహంలో దాదాపు 23శాతం ఉంటుందని వివరించారు. గోదావరి నదిలోని నాలుగు పాయల్లో మూడు పాయలు తెలంగాణను దాటిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తాయని వివరించారు. ఇక, శబరి సబ్ బేసిన్ నుంచి మాత్రమే మనకు నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోకి నీళ్లు వస్తాయని, ఎగువన ఉన్న ఛత్తీస్గడ్, ఒడిశా మీదుగా వచ్చే ఈ పాయ.. గోదావరి మొత్తం ప్రవాహంలో కేవలం 12శాతం మాత్రమే ఉంటుందని వివరించారు. తెలంగాణలో ఆశ్చర్యకరమైన పరిస్థితులు.. ‘44 ఏళ్ల సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డాటా ప్రకారం సగటు చూసుకుంటే ప్రాణహిత నది.. ప్రాణహిత సంగమం దాటిన తర్వాత కాళేశ్వరం వద్ద 1709 టీఎంసీల గోదావరి నీళ్లు ఉంటాయి. ఇక, ఇంద్రావతి నది సంగమమైన తెలంగాణలోని పేరూరు వద్దకు వచ్చేసరికి గోదావరి ఉధృతి 2,489 టీఎంసీలకు చేరుకుంటుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే.. శబరి నది దాటి శబరి నది సంగమమైన పోలవరం వద్ద 3,082 టీఎంసీలు గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఇందులో కిందకు వచ్చేవి కేవలం ఐదారు వందల టీఎంసీల నీళ్లు మాత్రమే. ఈ ఐదారు వందల టీఎంసీల నీళ్లు మాత్రమే మన రాష్ట్రం ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన గోదావరి నీళ్లు తెలంగాణ భూభాగం దాటుకొని మన ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఇదీ వాస్తవ పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 450 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకొని వెళ్లిపోతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై.. పూర్తి కూడా అయింది. ఇక, కర్ణాకటలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 514నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచబోతున్నారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నా.. ఎవరు ఆపగలుతున్నారు?’ కృష్ణానది ఎండమావి అయ్యే పరిస్థితి.. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు కృష్ణా నది ఆయకట్టు పూర్తిగా ఎండమావి అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 47 ఏళ్ల సగటు చూసుకుంటే కృష్ణా నుంచి శ్రీశైలానికి 1200 టీఎంసీల నీళ్లు వచ్చేవి. కానీ, గత పది సంవత్సరాల్లో చూసుకుంటే అది 600 టీఎంసీలకు పడిపోయింది. ఇక, గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం 400 టీఎంసీలకు పడిపోయింది. ఇక, ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524 మీటర్లకు పెంచితే.. కర్ణాటక మరో 100కుపైగా టీఎంసీలను నిల్వ చేసుకోగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలానికి 200 టీఎంసీల నీళ్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు ఎప్పుడు వెళుతాయి? నాగార్జున సాగర్‌కు ఎప్పుడు వస్తాయి? ఇది ఇది ఆలోచన చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులను గమనించాలి’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. గోదావరి నదిలోని 2480 టీఎంసీలు తెలంగాణను దాటుకొని మన ఆంధ్రలోకి రావాలి. మన అధీనంలోని శబరినది ద్వారా ఐదారు వందల టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా, పోలవరం కుడి కాలువ ద్వారా రాయలసీమకు నీళ్లు అందిద్దామంటే.. గోదావరి జిల్లాల్లో ఆందోళనలు చేసే పరిస్థితి ఉందని చంద్రబాబే చెబుతున్నారు. మరోవైఊపు మహారాష్ట్ర, కర్ణాటక మాదిరి తెలంగాణ కూడా ప్రాజెక్టులకు కట్టుకుంటుపోయి.. 2,500 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించుకొనిపోతే.. మన భూభాగంలోకి వచ్చే నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఒక్క శబరి నది నుంచి తప్ప? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లు ఇంకా డ్యాములు కట్టే పరిస్థితి లేదని అంటున్నారు. కానీ, కాళేశ్వరం పేరిట 17టీఎంసీలకు ఒక బ్యారేజీ చొప్పున బ్యారేజీ కట్టుకుంటూపోయారు. ఇకముందు కూడా తెలంగాణలో ఇలా చిన్న చిన్న బ్యారేజ్‌లతో నీళ్లు నింపుకుంటూ పోలేరా? చంద్రబాబు ఇక్కడ సీఎం ఉండగానే.. కాళేశ్వరం ద్వారా 450 టీఎంసీలు అక్కడివారు తరలించుకొని పోయారు? అదే కాళేశ్వరంలో ఇంకా లిఫ్టులు పెట్టుకొనిపోతే 150 టీఎంసీలు తీసుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వాళ్లు డ్యాములు కట్టలేరు, నీళ్లు తరలించుకుపోలేరు అని గుండెల మీద చేయి వేసుకొని నిబ్బరంగా ఎలా ఉండగలం? ఇప్పటి నుంచి పది సంవత్సరాల తర్వాత భవిష్యత్తును ఆలోచిస్తే.. ఎలా ఉంటుందో ఊహించడానికి భయం అవుతోంది? కారణం ఒకవైపు నీటి వినియోగం పెరిగిపోతోంది. మరోవైపు నీటి మీద ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. నీటి లభ్యత తగ్గిపోతోంది. నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి నెలకొంది. కృష్ణనదిలో సగటు నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయిన విషయాన్ని చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతతో ఉండటం ఎంత అవసరమో మనం అంతా ఆలోచించుకోవాలి. తెలుగువాళ్లు అంతా ఒక్కటిగా ఉండాలి.. కలిసి పనిచేసుకోవాలి.. ఒకరికి తోడు ఒకరు ఉండాలన్న వాతావరణం అవసరమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉండాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌పై మన రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు ఆధారపడి ఉండగా.. తెలంగాణలోని నాలుగు జిల్లాలు ఈ ప్రాజెక్టులపై ఆధారపడ్డాయి. ఈ రెండు ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు అల్లరి చేస్తూ.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఈర్ష్య తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. -
గోదావరి జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ
సాక్షి, అమరావతి: కృష్ణా-గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ అంశంపై ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అంశంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోనూ తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని రైతాంగం, ప్రజలు సాగునీరు, తాగునీటికి ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు తాగునీటి, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో 480 టీఎంసీల గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ద్వారా ఇరు రాష్ట్రాలకు పారించాలని భావిస్తున్నామని, ఇరు రాష్ట్రాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి ప్రయత్నానికి నాంది పలుకబోతున్నారని, దీనిని అందరూ స్వాగతించాలని కోరారు. మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ.. ఈ ద్వైపాక్షిక ప్రాజెక్టు విషయంలో ఒప్పందాలు ఉంటాయని, రైతాంగానికి, తాగునీరు భవిష్యత్తులో ఇబ్బంది పడకూదని ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నారని అన్నారు. గతంలో మీరు పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకున్నారు కాబట్టి భవిష్యత్తులోనూ గొడవలు ఉంటాయని, తెలంగాణ ప్రజలు మనకు శాశ్వత శత్రువులనే నెగటివ్ దృక్పథంతో దీనిని చూడవద్దని టీడీపీ నేతలను మంత్రి అనిల్‌కుమార్ కోరారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల డిజైన్ ద్వారా ఏపీలో సాగునీటి, తాగునీటి కొరతను నివారించడానికి ఈ చర్చను చేపట్టామని, ఈ విషయంలో అందరి సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జలదీక్ష చేపట్టేందుకు వెళ్తున్న జగ్గారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ జిల్లాకు గోదావరి జలాలను తరలించే వరకు తాను నిరహార దీక్ష చేపడతానని ఇటీవల ఆయన ప్రకటించారు. అందులోభాగంగా సోమవారం జలదీక్ష చేపట్టడానికి వెళ్తుండగా జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
కాళేశ్వర గంగ వచ్చేసింది..
మంథని: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గంగా జలాలు పెద్దపల్లి జిల్లా మంథనిని తాకాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదారమ్మ ఎదురుగా పారుతూ.. బుధవారం సాయంకాలం నాటికి మంథని మండలశివారు ప్రాంతమైన గోదావరిలో బొక్కలవాగు కలిసే ప్రాంతం దాటింది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి చేరిన నీటిని సుందిళ్లకు రివర్స్ పంపింగ్ చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.52 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 2.5 టీఎంసీల నీరుచేరింది. కన్నెపల్లి వద్ద నాలుగో పంపును ప్రారంభించడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది. ఏడు టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీకి చేరితే సుందిళ్ల పంపుహౌస్‌కు వస్తుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. గౌతమేశ్వర తీరమైన మంథనికి కాళేశ్వర గోదావరమ్మ చేరుతున్న క్రమంలో స్వాగత పూజలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు పూజలు నిర్వహించనున్నారు. ఇన్నాళ్లు ఎడారిని తలపించి తొలి ఏకాదశికి ఒక రోజు ముందే గోదారమ్మ మంథనికి చేరుకోవడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
‘అభినవ కాటన్ దొర వైఎస్ జగన్’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ‘వైఎస్ జగన్ అభినవ కాటన్ దొర’ అని పేర్కొన్నారు. కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ఆయన భగీరథ యత్నం చేస్తున్నారని తెలిపారు. గోదావరి-కృష్ణా జలాల సద్వినియోగం కరవు ప్రాంతాలకు మేలు చేస్తుందని చెప్పారు. ముఖ్యమత్రి జగన్, తెలంగాణ సీంఎం కేసీఆర్ చర్చలు తెలుగు ప్రజల నీటి కష్టాలు తీరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోపిడీ పాలన సాగించారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. టీడీపీ అవినీతి పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్‌కు సహకరించాలని హితవు పలికారు. గోదావరి నది నుంచి ప్రతి ఏటా మూడువేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని గుర్తు చేశారు. వృథా నీటిని రైతులకు ఇస్తామంటే టీడీపీ నేతలకు ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. -
గోదావరి ఎత్తిపోతలే తెలంగాణకు శరణ్యం
ఉమ్మడి రాష్ట్రంలో 1,480 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి అవకాశం వున్నదని 1980 సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ప్రధానంగా ప్రాణహిత నది తుమ్మిడిహెట్టి వద్ద గోదావరిలో కలిసిపోగా కాళేశ్వరం వద్ద శబరి కలుస్తున్నది. ప్రాణహిత కలిసిన దగ్గర నుండి గోదావరిలో నీరు పెరిగి, కాళేశ్వరంకు వచ్చేవరకు పెద్ద ప్రవాహంగా మారుతుంది. సీపీఐ, రైతు సంఘం గత 50 ఏళ్ల నుండి గోదావరి జలాలను వినియోగించుకుంటే తప్ప, తెలంగాణకు వేరే శరణ్యం లేదని అనేక సందర్భాలలో ప్రభుత్వాల దృష్టికి తేవడానికి ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహించాయి. 1990 నుండి రాష్ట్ర వ్యాపితంగా సాగునీటి సాధన ఉద్యమాలు ముమ్మరంగా సాగాయి. 2000 సంవత్సరంలో గోదావరి వాటర్ కమిషన్‌కు తక్షణమే సర్వేలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు కొల్లి నాగేశ్వరరావు ఇందిరాపార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అప్పటి ప్రభుత్వం 100 సంవత్సరాల నీటి వర్షపాతం అనుసరించి ఎక్కడెక్కడ ఎంత నీరుం దనే రిపోర్టు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం వ్యాప్కోస్ సంస్థకు సర్వే బాధ్యత అప్పగించింది. ఆ సంస్థ రిపోర్టు ఆధారంగా జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ 2006లో ఎల్లంపల్లి శ్రీపాద రిజర్వాయర్, 2008లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేపట్టడం ఉద్యమ స్ఫూర్తికి, ప్రజా ఆకాంక్షలకు నిదర్శనం. రిజర్వాయర్ తప్ప మిగతా ప్యాకేజీలు దాదాపు ప్రారంభమయ్యాయి. గోదావరి జలాలు తెలంగాణకు ఉపయోగపడాలంటే ఎత్తిపోతలు తప్ప మార్గం లేదని మొదట చెప్పింది కమ్యూనిస్టుపార్టీ. అయితే ఆనాటి ప్రభుత్వాలు ఎత్తిపోతల ద్వారా బాగా ఖర్చు అవుతున్నదని, చెల్లుబాటు కాదని దాటవేస్తూ వచ్చాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి రిజ ర్వాయర్కు శంకుస్థాపన చేసినప్పుడు హర్షం వ్యక్తమయ్యింది. శ్రీరాంసాగర్ వరద కాలువకు నిధులు బాగా కేటాయించినప్పుడు సంతృప్తినిచ్చింది. తెలంగాణ సాగునీటికి ఎత్తిపోతలు మాత్రమే శరణ్యమని చెప్పిన ప్రముఖ ఇంజనీర్ కీ.శే. శివరామకృష్ణయ్య సలహాలు తీసుకొని తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు చర్యలు చేపట్టాలని అనేక విజ్ఞప్తులు చేయడమైనది. దానికి వైఎస్సార్ స్పందించి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనకు పూనుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్య మం ఉధృతం కావడంతో 2005 నుండి ప్రభుత్వ పాలన నత్తనడకన కొనసాగింది. ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన నినాదాలతో మారుమ్రోగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఐ ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సీఎం కేసీఆర్‌కి ప్రాణహిత తుమ్మిడిహెట్టి వద్ద రిజర్వాయర్ కట్టి తక్కువ ఎత్తుతో ఎల్లంపల్లి, శ్రీపాదసాగర్ను నింపాలని అలాగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాకు ఉద్యమిద్దామని వివరించింది. అయినప్పటికి సీఎం నుండి ఎలాంటి స్పందనా రాలేదు. కాళేశ్వరం పక్కనున్న మేడిగడ్డ వద్ద రిజ ర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన చేసినప్పుడు గోదావరి నదికి అడ్డంగా ఎన్ని బ్యారేజీలు కట్టినప్పటికీ తక్కువేనని చెప్పిన పార్టీ సీపీఐ దానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా మేడిగడ్డ రిజర్వాయర్ వద్ద నుండి కన్నెపల్లి పంపుహౌజ్, అ తదుపరి సుందిళ్ల పంపుహౌజ్, అన్నారం బ్యారేజీ, మేడారం రిజర్వాయర్ లాంటి పనులు ప్రగతిలో ఉండటం మంచి పరిణామమే. దాదాపు లక్ష కోట్లతో బ్యారేజీల నిర్మాణం చేపట్టి కన్నెపల్లి పంపు హౌజ్, సుందిళ్ల పంపుహౌజ్‌లు ముచ్చటగా మూడేండ్లకే ప్రారంభానికి నోచుకోవడం శుభపరిణామం. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. 1,530 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు శరవేగంగా సాగడం మంచి పరిణామమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ విని యోగం దాదాపు 4 వేల 7 వందల మెగావాట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ ప్రాజెక్టు, భారీ అంచనాలతో ప్రారంభమైంది. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించడం లేదు. అయితే నిర్వహణ ఖర్చు తడిసిమోపెడు అయ్యే అవకాశమున్నందున భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుగాకూడదు. దానికి పరిష్కారమార్గాలను అన్వేషించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వంపైన ఉంటుంది. అందుకని ఇంజ నీరింగ్ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో ప్రత్యేక సమావేశం జరిపి శాశ్వత పరిష్కారం, విధివిధానాలు రూపొందించాలి. (సీపీఐ ఆధ్వర్యంలో మేడిగడ్డ, సుందిళ్ల తదితర ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా) వ్యాసకర్త : చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
గోదావరి వరదకు అడ్డుకట్ట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయిని అయిన గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందించే బృహత్తర ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న నికర జలాల కేటాయింపులకు అనుగుణంగా ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగిరం చేసిన ప్రభుత్వం ఇక తన దృష్టంతా గోదావరి వరద జలాలపై పెట్టింది. ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలకు అడ్డుకట్ట వేసి వాటిని నీటి లోటుతో కొట్టుమిట్టాడుతున్న కరువు ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ జిల్లాలకు పారించేలా వ్యూహం రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ, ఆ రాష్ట్ర సహకారంతో ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా గోదావరి– కృష్ణా నదుల అనుసంధానం చేయాలని భావిస్తోంది. వరదను మళ్లిస్తేనే వరమాల... రాష్ట్రంలో ఇప్పటికే నిర్మితమవుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్తవాటిని నిర్మించి.. మొత్తంగా 1.25 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గోదావరి, కృష్ణా జలాల్లో లభ్యతగా ఉన్న నీటిలో గరిష్టం ఆయకట్టుకు మళ్లించే యత్నాలు చేస్తోంది. నిజానికి గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి 1,486 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, ఇందులో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూ రు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉంది. మరింత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చేలా కాళేశ్వరం (180 టీఎంసీ), దేవాదుల (60), తుపాకులగూడెం (100), సీతారామ (60) వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఇవన్నీ వస్తే మరో 520 టీఎంసీల మేర నీరు వినియోగంలోకి రానుం ది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది నుంచే కనిష్టంగా 120 నుంచి 150 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. నికర జలాల వినియోగం పోనూ గోదావరి నుంచి ప్రతిఏటా గరిష్టంగా 6వేల టీఎంసీలు, కనిష్టంగా 1,500 టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఇందు లో గరిష్టంగా ఇంద్రావతిలోనూ 800 టీఎంసీలు, శబరిలో 550 టీఎంసీలు, ప్రాణహితలో 600 టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. వీటి లో గరిష్టంగా వెయ్యి టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చినా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. గోదావరిలో వృథాగా పోతున్న జలాలను కృష్ణా బేసిన్లో నీటి లోటు ఉన్న నల్లగొండ, పాలమూరు జిల్లా లతో పాటు ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించవచ్చని ఆయన చెబుతున్నారు. నిజానికి కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు ఉండగా ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ప్రతి ఏటా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఇరు రాష్ట్రాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. కృష్ణా బేసిన్లో తెలంగాణలో 90 లక్షల ఎకరాల సాగు చేయగల ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం కేవలం 15 లక్షల ఎకరాలకు మించి సాగవడం లేదు. ఈ నేపథ్యంలోనే గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్ ఆయకట్టుకు మళ్లించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. శ్రీశైలం, సాగర్‌కు గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి కృష్ణా బేసిన్‌కు తరలించి అక్కడ నీటి కటకటతో కొట్టుమిట్టాడుతున్న ఆయకట్టుకు నీరివ్వాలన్నది సీఎం లక్ష్యం పెట్టుకున్నారు. దీని కోసం గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించే అంశంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఆదివారం ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్ల భేటీలోనూ ఇదే అంశంపై ఎక్కువ సేపు చర్చించారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్, ఇంద్రావతి దిగువన ఉన్న తుపాకులగూడెం నుంచి లేక మరేదైనా పాయింట్ నుంచి సాగర్‌కు నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దీంతో పాటే శ్రీశైలంపై ఆధారపడిన ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత లేకుండా గోదావరి జలాలను ఎలా అనుసంధానించవచ్చనే అంశాలపైనా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. వివిధ బేసిన్ల మధ్య నీటిని బదిలీ చేసి సమతుల్యత సాధించాలని, ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం అయ్యేలా భవిష్యత్ ప్రణాళికలు ఉండాలని మార్గదర్శనం చేశారు. సీఎం సూచించిన అంశాలపై ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, అధికారుల స్థాయి భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. -
భయపెడుతున్న ఈ–కోలి భూతం
అమలాపురం: ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). అత్యంత ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వాసులను వణికిస్తోంది. ఇప్పటి వరకు గోదావరి నది..పంట కాలువల్లో మాత్రమే ఉన్న ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి ఇప్పుడు భూగర్భ జలాల్లోనూ కనిపిస్తోంది. ప్రజలకు రోగ కారకమైన దీని ఉధృతి వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశముంది. రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీరు, స్థానికంగా పేపరు మిల్లుల నుంచి వచ్చే వర్థ్య జలాలు, గోదావరి ఎగువ ప్రాంతాల్లో పలు కంపెనీల రసాయనాలు, పట్టణాలకు చెందిన మురుగునీరు కలవడం వల్ల దీని సాంద్రత రోజురోజుకు పెరుగుతోంది. గోదావరి పుష్కరాల సమయంలో నదిలో ఏకంగా ఐదు వేల కాలనీస్ (యూనిట్లు) వరకు ఈ–కోలి రికార్డు స్థాయిలో నమోదయిందంటే దీని తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నదుల నుంచి వచ్చే నీటిలోనూ, భూగర్భ జలాల్లో ఇది ఎక్కువగా ఉందని కోనసీమ కాలుష్యంపై పరిశోధన చేస్తున్న ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ పెచ్చెట్టి కృష్ణకిశోర్ అధ్యయన బృందం నిర్ధారించింది. ఈ నీటినే జిల్లాలో సుమారు 60 శాతం మంది ప్రజలు తాగునీరుగా వినియోగిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురం మున్సిపాలిటీలతోపాటు వందల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఇటీవల కాలంలో ఆక్వా సాగు విచ్చలవిడిగా పెరగడంతో వృథా అవుతున్న మేతలు, రసాయనాల వల్ల చెరువుల చుట్టుపక్కల సుమారు 2 కి.మీ. మేర నీరు ఉప్పుబారిన పడడంతో పాటు కాలుష్యం కారణంగా భూగర్భ జలాల్లో ఈ–కోలి వ్యాప్తి చెందుతోంది. గడచిన మూడేళ్లుగా ఈశాన్య రుతుపవనాలు మొఖం చాటేయడం కూడా ఈ–కోలి బ్యాక్టీరియా పెరుగుదలకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియాలోనే ‘ఈ–కోలి’ అత్యంత ప్రమాదకరం - బ్యాక్టీరియాలో అత్యంత ప్రమాదకరమైంది ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). దీనివల్ల ఆయాసం, వాంతులు, కడుపునొప్పి, అతిసార, తీవ్ర జ్వరానికి దారితీస్తోంది. - వర్షాకాలం సీజన్లో పలువురు జ్వరాల బారిన పడడానికి ఇదే కారణం. ఇది వృద్ధి చెందకుండా చర్యలు తీసుకునే అధికార వ్యవస్థ లేదు. - కొత్త నీరు వస్తున్న సమయంలో.. అంటే వర్షాకాలంలో భూగర్భ జలాల్లో సైతం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. ప్రమాదస్థాయిని దాటుతోంది.. గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ–కోలి స్థాయి 625 నుంచి 650 కాలనీస్(యానిట్లు) దాటి ఉంది. మెట్టలో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి. నీటిలో 500 కాలనీస్ దాటితే ప్రమాదం. సముద్రంలో పేరుకుపోయే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాల మీద దట్టమైన ఇసుక పేరుకుపోతోంది. ఓఎన్జీసీ తవ్వకాలతో అవి నీటిపైకి వస్తాయి. జిల్లాలో నదీ ముఖ ద్వారాలైన బలుసుతిప్ప, అంతర్వేది. ఓడలరేవు ద్వారా ఇది నదిలోకి వచ్చి, అక్కడ నుంచి భూగర్భంలోకి చేరడం, ఆక్వా చెరువుల ద్వారా విస్తరిస్తోంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
ఉభయ తారకం.. జల సౌభాగ్యం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో లభ్యతగా ఉన్న నికర, మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతా ల్లోని ప్రతి అంగుళానికీ గోదావరి నీళ్లు తీసుకెళ్లేలా పథకాలకు రూపకల్పన చేయాలని మార్గదర్శనం చేశారు. ఇరు రాష్ట్రాలు సౌభాగ్యంగా వర్ధిల్లాలన్నదే తన అభిమతమని, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నర్సింహారావు, ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, కృష్ణా, గోదావరి జలాల వినియోగం, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో వివాదాల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నదీజలాల వివాదాలకు కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిష్కారం చూపలేకపోతున్నాయని, పరస్పర చర్చల ద్వారానే వీటికి పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో తాను చర్చలు జరిపానని, నీటి లోటు ఉన్న కృష్ణా బేసిన్‌లోని నల్లగొండ, మహబూబ్‌నగర్ సహా ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను తరలిస్తే ఇరు రాష్ట్రాలు హరితవనంగా మారుతాయని జగన్‌కు చెప్పినట్లు కేసీఆర్ వివరించారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి ఏపీ ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా ఉన్నారన్న కేసీఆర్... గోదావరి జలాల వినియోగానికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో సిద్ధం చేయాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరిలో ఇరు రాష్ట్రాలకు కలిపి 3,500 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నాయని, ఈ నీటితో ఇరు రాష్ట్రాల్లోని ప్రతి ఎకరా తడిసేలా చూడాలని సూచించారు. ఎగువ కృష్ణా నుంచి దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో కృష్ణాలో లభ్యమయ్యే నీటిని శ్రీశైలం వరకే వినియోగించుకొని నాగార్జున సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో లభ్యతగా ఉన్న నీటిని వినియోగంలోకి తెస్తే రాష్ట్రంలోని ప్రతి మూలకు నీటిని ఇవ్వొచ్చని, తాగు, సాగు అవసరాలు తీర్చొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నర్సింహారావు రచించిన ‘అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జాతీయ, అంతర్జాతీయ నదీ జలాల వివాదాలకు పరిష్కారం జరిగిన తీరును రచయిత వివరించారు. 28, 29 తేదీల్లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై చర్చలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు ఈ నెల 28, 29 తేదీల్లో ప్రాథమిక చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశాల్లో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇంజనీర్లు పాల్గొంటారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల్లో ఉన్న సమస్యలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో బోర్డులు, ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్న వివాదాలు, పట్టిసీమ ద్వారా అదనంగా దక్కే నీటి వాటాలపై అభ్యంతరాలు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు తొలుత ప్రాథమికచర్చలు ప్రారంభిస్తారని, ఆ తర్వాత దీనిపై సీఎంల స్థాయిలోనూ చర్చలు జరిపి సానుకూల వాతావరణంలో నదీ జలాల వివాదాలను పరిష్కరించుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడిగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో దక్కే వాటాలు, చిన్న నీటి వనరులైన చెరువుల్లో ఇరు రాష్ట్రాల వాస్తవ వినియోగం, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో అంగీకారానికి వచ్చే అంశాలపై ముఖ్యమంత్రుల స్ధాయిలో మరో భేటీ ఉంటుందని నీటి పారుదలశాఖ వర్గాలు తెలిపాయి. -
ఉప్పొంగిన ‘మేఘా’ మేడిగడ్డ
కాళేశ్వరం: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కీలక ఘట్టం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ ప్రవాహానికి విరుద్ధంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహించింది. ఇది అరుదైన దృశ్యం. మేడిగడ్డ (కన్నెపల్లి) పంపుహౌస్‌లోని ఆరో నంబర్ యూనిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్విచ్ ఆన్ చేయడంతో మెషీన్ నుంచి 40 క్యూమెక్స్ గోదావరి జలాలు 1.053 కిలో మీటర్ ప్రెషర్ మేయిన్స్ ద్వారా ప్రయాణించి డెలివరీ సిస్టర్న్ ద్వారా కాలువలోకి విడుదలయ్యింది. ఈ దృశ్యం కనువిందు చేసింది. పుడమి తల్లిని పులకరింపజేసింది. బీడువారిన తెంగాణ భూములను పచ్చని పంటలతో బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు పంపుహౌస్ నుంచి నీళ్లు పరుగు తీశాయి. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. అందులోనూ మేడిగడ్డ నీళ్లు అన్నారం వైపు పరుగులు తీసే తొలి దృశ్యం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం కాళేశ్వరం పథకం ప్రారంభంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) సంస్థ నిర్మించిన మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి మూడు మెషీన్ల ద్వారా గోదావరి నీళ్లు ఉరకలేశాయి. ఈ కార్యక్రమంలో ఇఎన్సి వెంకటేశ్వర్లు, ఇరు రాష్ట్రాల మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేఘా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి, డైరెక్టర్ బి. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మేడిగడ్డ పంప్ హౌస్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్దదైన ఎత్తిపోతల పథకంగా విశిష్టత సంతరించుకోగా అందులో మేడిగడ్డకు మరో ప్రత్యేకత ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా అందులో మేడిగడ్డ మొదటిది కావటం విశేషం. మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఉండగా, ఒక్కో మెషీన్ 40 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసి 60 క్యుమెక్స్ నీటిని డెలివరీ సిస్ట్రన్ ద్వారా గురుత్వాకర్షణ కాలువలోకి (13.5 కిలోమీటర్స్) నీటిని విడుదల చేస్తుంది. అంతకుముందు పంప్ నుంచి (ప్రెషర్ మెయిన్) 1.53 కిలోమీటర్ల డెలివరీ మెయిన్ ద్వారా ప్రయాణించి కాలువలోకి చేరిన నీరు అన్నారం బ్యారేజ్‌లోకి చేరుతుంది. కాళేశ్వరం పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో 17 కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మిస్తున్నది. మొదటి దశ కింద లింక్-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లను నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్-2 లోని ప్రపంచంలోని అతిపెద్దదైన భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ-8 నుంచి రోజుకు 2 టిఎంసీల నీటిని పంపుచేసే విధంగా సిద్ధం చేసింది. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో ఒక్కొక్క యూనిట్ 40 మెగావాట్ల సామర్థ్యంతో 60 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించారు. 91 మీటర్ల ఎత్తున గోదావరికి ఆనుకుని నిర్మించిన ఈ కేంద్రంలో మొత్తం 660 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోయానేది లక్ష్యం. ఇందులో మొదటిదశ కింద 11 యూనిట్లతో 440 మెగావాట్ల పంపింగ్ కేంద్రం పనిచేస్తుంటుంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో అతిపెద్దదయిన ఈ ఎత్తిపోతల కేంద్రాన్ని నిర్మించడంలో ఎలక్ట్రోమెకానికల్ పనులతో పాటు సివిల్ పనులకు ప్రత్యేకత ఉంది. అప్రోచ్ కాలువ 9.75 లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతోనూ, వీటి గోడలు 51వేల ఘనపు మీటర్లతోనూ, పంప్‌హౌస్ ముందుభాగం 45.73 లక్షల ఘనపు మీటర్లతోను నిర్మించారు. ఇంత తక్కువ కాలంలో వీటిని నిర్మించడం ఎంఈఐఎల్కు మాత్రమే సాధ్యమైంది. ప్రెషర్ మెయిన్‌కు 10.56, డెలివరీ సిస్టర్న్‌కు 10.50, మొత్తం అన్నీ కలిపి 77.07 లక్షల ఘనపు మీటర్ల పనిని ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని మళ్లీ అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలోకి చేర్చడానికి అవసరమైన భారీ కాలువను కోటి యాభై లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతో పూర్తి చేసింది. గోదావరి నీటిని ఎత్తిపోయడం మేడిగడ్డ నుంచే మొదవుతుంది. పైగా భూ ఉపరితంపైన ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా భారీ ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద నిర్మితమై పాక్షికంగా వినియోగంలోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద అత్యధిక సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా భూ ఉపరితంపైన అతిపెద్ద ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద 440 మెగావాట్లతో ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కింది. ఇప్పటికే లింక్-1లోని దాదాపుగా అన్ని యూనిట్లను ఎంఇఐఎల్ పంపింగ్ కు సిద్ధం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 4627 మెగావాట్ల సామర్థ్యంతో 120 పంపింగ్ యూనిట్లు ఏర్పాటవుతుండగా అందులో 105 యూనిట్లను ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. దీనిని బట్టి కాళేశ్వరంలో ప్రధాన పాత్రను ఎంఈఐఎల్ నిర్వహిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలమ్ లాంటి ఎలక్ట్రోమెకానికల్ సంస్థలు సమకూరుస్తున్నాయి. అయితే నిర్మాణ పని మొత్తం ఎంఈఐఎల్ చేస్తోంది. ఇంతవరకూ ప్రపంచంలో ఒకేచోట 17 మెషీన్లతో పంపింగ్ కేంద్రం ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ హంద్రీనీవా ఒక్కటే అతిపెద్దది కాగా, నిర్మాణంలో వున్న దేవాదుల కూడా పెద్దదే. కాగా, వాటిలో ఏ పంపింగ్ కేంద్రంలోనూ లేనంతగా మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో మొదటిదశ ఇప్పుడు వినియోగంలోకి రాగా, రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 17 మెషీన్ల ద్వారా 868 మెగావాట్ల పంపింగ్ సామర్ధ్యం వుండటం మరో ప్రత్యేకత. మెషీన్ల సంఖ్య రీతా.. ఇంతపెద్ద పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా ఏర్పాటు కాలేదు. ఎంఈఐఎల్ ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కాళేశ్వరం సమీపంలో కన్నెపల్లి గ్రామం వద్ద నిర్మించింది. ప్రపంచంలో పెద్ద ఎత్తిపోతల పథకాలుగా పరిగణించే కొలరాడో (అమెరికా), గ్రేట్ మ్యాన్‌మేడ్ వండర్ (లిబియా) పథకాలతో పాటు దేశంలోని హంద్రీ-నీవా, కల్వకుర్తి, ఏఎమ్ఆర్పీ, దేవాదుల మొదలైన పథకాలు పూర్తి కావడానికి ఏళ్ళు పట్టింది. కొన్ని పథకాలైతే రెండు, మూడు దశాబ్దాల సమయం పట్టింది. కానీ మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కేవలం ఏడాదిన్నర సమయంలోపే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. భారీ విద్యుత్ వ్యవస్థ: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రోజుకు 3 టిఎంసీ నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్ అవసరం. మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైన్లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. తాగు, సాగునీటి అవసరా కోసం ఇంత పెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. -
గోదావరి జలాలతో తెలుగు నేల తడవాలి
సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల అభివృద్ధి.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉమ్మడిగా, కలివిడిగా చర్చలు జరిపారు. విభజన నేపథ్యంలో ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 9, 10వ షెడ్యూళ్లలోని 142 సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం దగ్గర నుంచి గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవటం వరకూ పలు అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. కర్ణాటకలో ఆల్మట్టి జలాశయం ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గుతుందని, దీన్ని అధిగమించాలంటే గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలించడం ఒక్కటే మార్గమని ఇరువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించడం ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, అటు తెలంగాణలో పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చని చర్చించుకున్నారు. కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను గవర్నర్ నేతృత్వంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు చర్చించి పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ బృందానికి వైఎస్ జగన్ నివాసంలో విందు విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు సోమవారం విజయవాడకు వచ్చిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తొలుత నేరుగా కనకదుర్గ దేవాలయానికి చేరుకుని పూజలు చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి వచ్చారు. అంతకుముందు కేసీఆర్‌కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే శాసనసభ సమావేశాలు ముగించుకుని ఇంటికి చేరుకున్న సీఎం జగన్.. కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావులతోపాటు వారి వెంట వచ్చిన ప్రతినిధి బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్‌కు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్పగుచ్ఛం ఇవ్వగా... కేసీఆర్ జగన్‌ను శాలువతో సత్కరించారు. ఇంటిలోకి చేరుకున్న అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తొలుత వైఎస్ జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ బృందానికి వైఎస్ జగన్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం సుమారు 1.30 గంటలపాటు ఇరువురు ముఖ్యమంత్రులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై ఏకాంతంగా చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్లు గడిచినా విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూలులో పేర్కొన్న 142 సంస్థల ఆస్తుల పంపకంపై ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదే అంశంపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 142 సంస్థల ఆస్తులను సామస్యరంగా పంచుకోవాలని చర్చించుకున్నారు. ఒకే వాహనంలో ఇద్దరు సీఎంలు.. చర్చలు ముగించుకున్న తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సాయంత్రం 5.10 గంటలకు కృష్ణా నదీ తీరంలో నిర్వహించిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ ముగింపు ఉత్సవంలో పాల్గొనడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వాహనంలో వెళుతున్నపుడు దారిపొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడి చేతులూపుతూ అభినందనలు తెలిపారు. వారు కూడా వినమ్రంగా అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని రాత్రి విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. కేటీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ గోదావరి జలాలతోనే సుజలాం.. సుఫలాం ఆల్మట్టి జలాశయం ఎత్తును కర్ణాటక సర్కారు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో కృష్ణా వరద జలాలు తెలుగు రాష్ట్రాలను చేరుకోవడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని దాదాపు గంటన్నరకుపైగా జరిగిన తాజా సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్‌లు అభిప్రాయడ్డారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల కృష్ణాలో నీటి లభ్యత మరింత తగ్గిపోయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి ఇబ్బందులు ఏర్పడతాయనే ఆందోళన వ్యక్తమైంది. ఏటా గోదావరి నది నుంచి మూడు నుంచి నాలుగు వేల టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయని వీటిని గరిష్ఠంగా వినియోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సస్యశ్యామలం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఉమ్మడిగా గోదావరి జలాలను వినియోగించుకోవడంపై ప్రాథమికంగా చర్చించారు. గోదావరి జలాలను సోమశిల, కండలేరు, నాగార్జునసాగర్‌కే కాకుండా శ్రీశైలం జలాశయం వరకూ తీసుకెళ్లగలిగితే నీటి కరువు తీరుతుందనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా గోదావరి జలాలను వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై మరో దఫా సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. కేసీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ సామరస్యంగా కృష్ణా జలాల వివాదం.. కృష్ణా జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంది. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. గవర్నర్ నరసింహన్ సారధ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు సమావేశమై సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల కృష్ణా జలాల వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో చర్చలు.. తీక్షణమైన ఎండలతో ఉడికిపోతున్న విజయవాడ పరిసరాలు సోమవారం ఒక్కసారిగా చల్లబడ్డాయి. జగన్ నివాసంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురిశాయి. రాత్రి వరకూ ఇదే వాతావరణం కొనసాగింది. కేసీఆర్ వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి ఉన్నారు. విందు కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీని పరిశీలిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి తదితరులు ప్రకాశం బ్యారేజీపై ఆగిన కేసీఆర్ సాక్షి అమరావతి బ్యూరో: విజయవాడ పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. కనకదుర్గమ్మ దర్శనం అనంతరం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్తూ దారిలో ప్రకాశం బ్యారేజీ వద్ద కేసీఆర్ తన కారును కొద్దిసేపు ఆపారు. కిందకు దిగి బ్యారేజీనీ, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. సోమవారం విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో సీఎం కేసీఆర్ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఆయనకు దుర్గ గుడి వద్ద స్వాగతం పలికారు. మహామండపం మీదుగా కొండపైకి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పౌర్ణమి సందర్భంగా స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించిన అమ్మవారిని కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి గతంలో కేసీఆర్ కానుకగా సమర్పించిన వజ్రాల ముక్కుపుడకను అర్చకులు అలంకరించారు. సీఎంలను ఆశీర్వదించిన మంత్రాలయం పీఠాధిపతులు సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావులను మంత్రాలయం రాఘవేంద్రస్వామి పీఠాధిపతులు ఆశీర్వదించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇద్దరు సీఎంలకు స్వామి వారి ప్రసాదాలను అందజేసి రాఘవేంద్రస్వామి చిత్ర పటాలను బహూకరించారు. ఈ సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి బుడగ జంగాల కుల ధృవీకరణకు సంబంధించిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణమే దీనికి సంబంధించిన జీవోను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నీరు విడుదల
-
పాలమూరు, డిండికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: నీటి కొరతను ఎదుర్కొంటున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని మళ్లించాలన్న ఆలోచనలకు ప్రభుత్వం పదును పెడుతోంది. గరిష్ట నీటిలభ్యత, సముద్రంలో ఏటా వృథాగా పోతున్న గోదావరిజలాలను మళ్లించి కృష్ణాబేసిన్ లోని పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు తరలించడం ద్వారా నీటికొరతను అధిగమించవ చ్చని భావిస్తోంది. దీనిపై ఇంజనీర్లు ఇదివరకే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచగా, తాజాగా 100 టీఎంసీల గోదావరినీటిని పాలమూరు, డిండిలకు తరలించే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. దీనితో ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయి నీటి లభ్యత అందుబాటులో ఉంచవచ్చని పేర్కొన్నారు. గోదావరి పరిష్కారం.. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 120 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 90 టీఎంసీ నీటిని పాలమూరు–రంగారెడ్డికి, మరో 30 టీఎంసీ డిండికి మళ్లించాలని నిర్ణయించారు. పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల నీటితో 12.3 లక్షల ఎకరాలకు, డిండికి 30 టీఎంసీ నీటితో 3.41లక్షల ఎకరా లకు నీరివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు మించి నీరివ్వడం సాధ్యంకాదు. ఈ నేపథ్యం లో 90 టీఎంసీలతో 12.3 లక్షల ఎకరాలకు నీరివ్వ డం దాదాపు అసాధ్యం. కృష్ణాలో 120 వరద రోజుల ఆధారంగా లెక్కలు కట్టగా, కృష్ణాబేసిన్‌లో వరద 30 రోజులకు మించి ఉండట్లేదు. ఈ వరద రోజుల్లో 60 టీఎంసీలకు మించి నీటిని తీసుకోలేం. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు 100 టీఎంసీల మేర నీటి కొరత ఏర్పడుతోంది. ఈ నీటి కొరతను గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా మళ్లించడం ద్వారానే తీర్చుకోగలమని హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం తేల్చింది. ఇలా మళ్లించొచ్చు.. కాళేశ్వరంలో భాగంగా ఉన్న సంగారెడ్డి కెనాల్ కాల్వ నుంచి పాలమూరు లో భాగంగా ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌కు రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజనీర్ల సంఘం పేర్కొంది. దీనికోసం 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని సూచించింది. దీనిద్వారా కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద నిర్ణయించిన 4.13 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరి వ్వొచ్చని పేర్కొంది. కాళేశ్వరంలో చివరిదైన బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించొచ్చని సూచించింది. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపింది. ఏదుల నుంచి పాత డిండి వరకు కృష్ణా నీటిని తరలించే పనులకు అయ్యే వ్యయం కన్నా, శివన్నగూడెం ద్వారా డిండి ఎత్తిపోతలకు గోదావరి నీటిని తరలించే వ్యయం తక్కువగా ఉంటుందని తేల్చిచెప్పింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి, చర్చించాక నిర్ణయం చేసే అవకాశం ఉంది. -
కాళేశ్వరంలో ‘మోటార్’ రేస్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించే ప్రక్రియకు గడువు ముంచుకొస్తోంది. గోదావరిలో వరద మొదలయ్యేందుకు మరో నెల రోజులకు మించి సమయం లేకపోవడంతో ఆలోగా పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. మే నెలాఖరుకే అన్ని పంప్‌హౌస్‌లలో మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నా వేసవి తాపం, మధ్యలో కురిసిన వర్షాలు కొంత అవాంతరం సృష్టించాయి. దీంతో జూన్‌లో అన్ని మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేసి జూలైలో వరద పుంజుకునే నాటికి గోదావరి నీటిని ఎత్తిపోసేలా ప్రస్తుతం అధికారులు పనులు ముమ్మరం చేశారు. - సాక్షి, హైదరాబాద్ జూన్‌లో వెట్‌రన్.. జూలై నుంచి ఎత్తిపోతలు ప్రస్తుతం మేడిగడ్డ మినహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులన్నీ పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లకుగాను 35 గేట్లను ఇప్పటికే అమర్చగా మిగతా గేట్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మేడిగడ్డ పరిధిలో గోదావరిలో కలిసే చిన్నచిన్న వాగులు, వంకలన్నీ బ్యారేజీ వెనుక భాగంలో కలుస్తున్నాయి. దీంతో వరద అధికంగా ఉంటే బ్యారేజీ వెనుక భాగంలో ముంపు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాగులు, వంకల నీటిని డైవర్షన్ చానల్ నిర్మించి బ్యారేజీ ముందుకు మళ్లించేలా చూడాలని సీఎం సూచించారు. ఈ పనులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకుగాను 6 మోటార్లు అమర్చే ప్రక్రియ పూర్తికాగా అన్నారంలో 8కిగాను 5, çసుందిళ్లలో 8కిగాను 6 మోటార్ల అమరిక పూర్తయింది. మిగతా మోటార్లలో వీలైనన్ని ఈ నెలాఖరుకు, మిగతావి జూన్ తొలి లేదా రెండో వారానికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుంది. లేనిపక్షంలో కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీని వరద ఉండే అన్ని రోజుల్లో ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇప్పటికే సిద్ధమైన మోటార్లకు జూన్‌లో వెట్‌రన్ నిర్వహించనుండగా జూలై నుంచి గోదావరి వరద నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో 7 మోటార్లకుగాను 4 సిద్ధమవగా ఇందులో రెండింటికి ఇప్పటికే వెట్‌రన్ నిర్వహించగా మరో రెండింటికి బుధవారం వెట్‌రన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయింది. మిగతా మోటార్లను వచ్చే నెల మొదటి వారానికి సిద్ధం చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇక ప్యాకేజీ–8లోనూ7 మోటార్లకుగాను 6 ఇప్పటికే సిద్ధమవగా వాటికి జూన్‌లో వెట్‌రన్ నిర్వహించే అవకాశం ఉంది. పంప్‌హౌస్‌ల పనులన్నీ పాత ఏజెన్సీకే... గోదావరి నుంచి అదనంగా మరో టీఎంసీ నీటిని సైతం ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం... అందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లలో అదనపు పంపులు, మోటార్లు బిగించే ప్రక్రియను పాత ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పంప్‌హౌస్‌లకు సంబంధించి రూ. 7,962 కోట్ల మేర పనులను మేఘా ఏజెన్సీకి అప్పగించారు. తదనంతరం ఈ పనుల్లో అదనపు మోటార్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను జత చేసి వ్యయ అంచనాను రూ. 12,324 కోట్లకు సవరించారు. ప్రస్తుతం ఎస్‌ఏఎస్‌ఆర్ ప్రకారం ఈ రేట్లను రూ. 12,392 కోట్లకు సవరించారు. అదనంగా మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 15 మోటార్లను ఏర్పాటు చేయనుండగా ఈ పనులకు కొత్తగా టెండర్లు పిలిస్తే మూడు నెలలు పట్టే అవకాశం ఉండటం, మళ్లీ మోటార్లను విదేశాలను తెప్పించేందుకు మరింత జాప్యం కానుండటం వంటి కారణాల నేపథ్యంలో ఈ పనులను పాత ఏజెన్సీకే కట్టబెట్టాలని మంగళవారం జరిగిన నీటిపారుదలశాఖ ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
గోదారి..ఎడారి
నిర్మల్: బాసర క్షేత్రం వద్ద గోదారమ్మ చుక్క నీరు లేకుండా ఎండిపోతోంది. పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు నదిలో అక్కడక్కడ ఉన్న బురదగుంటల్లోని నీళ్లనే చల్లుకుంటున్నారు. పవిత్ర నదిలో తమవారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు వచ్చిన వారికి ఇక్కడా కన్నీళ్లే మిగులుతున్నాయి. పారే నీళ్లు లేకపోవడంతో బురద నీళ్లలోనే నిమజ్జనం చేసి, చేతులు జోడిస్తున్నారు. సరస్వతీ అమ్మవారికి గోదావరి జలాలతో పూజలు చేసే పరిస్థితి లేదు. బాసర పుణ్యక్షేత్రంతో పాటు ఇక్కడి ట్రిపుల్ఐటీ, సమీప గ్రామాలకూ నీటి కష్టాలు మొదలవుతున్నాయి. తాగునీటితో పాటు సాగు నీటి కోసం గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు నీరందడం లేదు. అడుగంటిన నీళ్లు గోదావరి నది మహారాష్ట్ర నుంచి బాసర వద్ద మన రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. నదికి ఓ వైపు నిర్మల్ జిల్లా, మరోవైపు నిజామాబాద్ జిల్లా ఇలా రెండు వైపులా మన రాష్ట్రం సరిహద్దుగా ఉండేది ఇక్కడే. దిగువన సుమారు 55 కి.మీ. దూరంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఉన్నందున బాసర వద్ద గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండేవి. ఎంత ఎండా కాలమైనా కనీసం చిన్న పాయలా గోదావరి పారుతుండేది. కానీ ఈసారి.. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకపోవడం.. దిగువన ఎస్సారెస్పీలో 7 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోవడంతో గోదావరి ఎడారిలా మారింది. ఎగువన 25–30 కి.మీ దూరంలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు నుంచి బాసర దిగువన మరో 25 కి.మీ దూరం వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడక్కడ నీటిగుంటలు తప్ప గోదావరంతా అడుగంటిన నీళ్లతో ఎడారిని తలపిస్తోంది. గొంతెండుతోంది.. గోదావరిలో నీళ్లు లేకపోవడంతో సరిహద్దు గ్రామాల గొంతెండుతోంది. ఎస్సారెస్పీ నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కలిపి 20కిపైగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పైనే ఆధారపడి ఇవి నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఇప్పుడు చుక్కనీరు లేకపోవడంతో పథకాలన్నీ మూలనపడ్డాయి. బాసర గోదావరి వద్ద నుంచే స్థానిక ట్రిపుల్ ఐటీకి నీటిని సరఫరా చేస్తారు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నన్ని రోజులూ ఈ పథకం ద్వారా తమ క్యాంపస్ పరిధిలోని చెరువులో నింపుతారు. ప్రస్తుతం ట్రిపుల్ఐటీ చెరువులో సరిపడా నీళ్లున్నాయి. కానీ మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడి వేల మంది విద్యార్థులకూ నీటికష్టాలు తప్పవు. గోదావరి సరిహద్దు గ్రామాలపైన నీటి ప్రభావం పడుతోంది. మత్స్యకారులకు పెద్దదెబ్బ గంగమ్మపైనే ఆధారపడి బతుకుతున్న వేలాది మత్స్యకార కుటుంబాలకూ కష్టాలు మొదలయ్యాయి. అక్కడక్కడ ఉన్న చిన్నగుంటల్లో రోజంతా వల వేసి కూర్చున్నా.. ఒకట్రెండు చేపలకు మించి దొరకడం లేదంటున్నారు. బాసర ఘాట్ల వద్ద చాలామంది పడవలను వదిలేసి కూలి పనులకు వెళ్తున్నారని, ఉన్న కాస్త నీటి గుంటలోనే పడవ నడుపుతున్న గంగారాం చెబుతున్నారు. మత్స్యకారులు, పడవలు నడిపే వారితో పాటు భక్తులు స్నానాలు ఆచరించిన తర్వాత గోదావరిలో వేసే నాణేలను సేకరించుకుని పొట్టపోసుకునే మహిళల పరిస్థితీ దీనంగా మారింది. ఇంత దూరమొస్తే.. మాది మహారాష్ట్రలోని పర్భణి. బాసర వస్తే అమ్మవారి దర్శ నంతో పాటు గోదావరిలో పవిత్ర స్నానం చేయ వచ్చని భావించాం. అంత దూరం నుంచి ఇక్కడి వస్తే.. చుక్క నీళ్లు లేవు. ఇంటిల్లిపాది గోదావరిలో ఉన్న బురదనీళ్లనే చల్లుకున్నం. ఆలయం వాళ్లు పెట్టిన షవర్లు కూడా పని చేస్తలేవు. –పవార్, పర్భణి, మహారాష్ట్ర ‘కాళేశ్వరం’తోనే ‘పునరుజ్జీవం’ కాళేశ్వరం పథకం పూర్తయితేనే గోదావరి ఆయకట్టుకు, నదిపై ఆధారపడ్డ గ్రామాలకూ నీళ్లందే పరిస్థితులు ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్నీ చేపడుతోంది. కాళేశ్వరం పథకంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే పైపులైన్ వరద కాలువ (ఎస్సారెస్పీ నుంచి 102 కి.మీ వద్ద) మీదుగా వెళ్తుంది. ఇక్కడే పైపులైన్‌ను ఓపెన్ చేసి నీటిని వరదకాల్వలోకి మళ్లిస్తారు. ఆ నీటిని ఎస్సారెస్పీలోకి చేర్చడానికి వరద కాలువలో క్రాస్ రెగ్యులేటర్ గేట్లను బిగిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద వరదకాలువలో పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. వాటిలో చేరిన నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి శ్రీరాంసాగర్‌లోకి తరలిస్తారు. కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ పద్ధతిలో ఎస్సారెస్పీకి తరలిస్తారు. అరవై రోజుల్లో 60 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు రూ.1067 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితేనే గోదావరిపై ఆధారపడ్డ రైతాంగం, మత్స్యకారులతో పాటు బాసర భక్తులకూ ఇక్కట్లు తీరనున్నాయి. తెప్ప విడువడానికి వస్తే.. గోదావరిలో తెప్ప విడువడం మా ఆనవాయితీ. ప్రతీ ఏడాది బాసరకు వచ్చి గంగలో తెప్ప విడిచి గంగమ్మకు నైవేద్యం పెట్టి పూజలు చేస్తుంటం. ఈసారీ అట్లనే బాసరకు వచ్చినం. కానీ ఇక్కడ నీళ్లు లేవు. చేసేది లేక బురదనీళ్లలోనే తెప్పను విడిచి పెట్టాల్సి వస్తుంది. - రాహుల్, ఎగ్డోలి, మం.కోటగిరి, కామారెడ్డిజిల్లా బతుకులు ఎండుతున్నయ్ గంగమ్మను నమ్ముకున్న గంగపుత్రులం. పొద్దున్నుంచి నీళ్లలోనే ఉండేటోళ్లం. ఇప్పుడు గంగలో నీళ్లు లేక మా బతుకులు కూడా ఎండుతున్నయ్. అక్కడక్కడ ఉన్నబురదగుంటల్లో చేపలు పడుతున్నం. ఎండకు ఆ నీళ్లు కూడా ఎండిపోతున్నయ్. –సాయిలు,మత్స్యకారుడు, బాసర్ -
కాళేశ్వరం ట్రయల్ రన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానం బుధవారం మొదలుకానుంది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే గోదావరి జలాలను పంట పొలాలకు తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. పూర్తయిన నిర్మాణ పనులన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పంప్‌హౌస్‌లలో మోటార్ల డ్రైరన్ నిర్వహించిన ఇంజనీర్లు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో తొలిసారిగా గోదావరి నీటితో వెట్ రన్ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. తొలి పరిశీలనలో భాగంగా బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారంలోని ప్యాకేజీ–6కి నీటిని విడుదల చేయడానికి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ పనులతో కాళేశ్వరం ప్రస్థానానికి పునాది పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 0.25 టీఎంసీతో వెట్‌రన్.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న 8.46 టీఎంసీల నీటిలో 0.25 టీఎంసీల నీటిని వినియోగించి బుధవారం ట్రయల్ రన్ చేయడానికి ఇంజనీర్లు అంతా సిద్ధంచేశారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా, వీటిలో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్‌కు నీటి ని తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యాసం కలిగిన జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6లోని సర్జ్పూల్కు నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ల ద్వారా ప్యాకేజీ–7కు నీటిని తరలించాలి. అయితే ఈ ప్యాకేజీలో టన్నెల్, గ్రావిటీ కాలువ పనులు పూర్తవగా.. ఐదు మోటార్లు సిద్ధమయ్యాయి. మరో రెండు మోటార్ల పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెట్ రన్లో భాగంగా 0.25 టీఎంసీ నీటిని గ్రావిటీ కాలువ, టన్నెల్ ద్వారా వదిలి సర్జ్‌పూల్‌ను నింపుతారు. అయితే, సర్జ్‌పూల్‌ను ఒకేసారి కాకుండా విడతలవారీగా నింపుతారు. ముందుగా 10శాతం వరకు, తర్వాత 25 శాతం వరకు, ఆ తర్వాత 50శాతం వరకు.. ఇలా వంద శాతం వరకు నింపుతూ వెళతారు. ప్రతిసారీ సర్జ్‌పూల్‌లో కానీ, టన్నెళ్లలో కానీ ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయోమోనని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ ఒక్కో మోటార్‌ను ఆన్ చేసి పరిశీలిస్తారు. ఈ పంపుల్లో మెకానికల్, ఎలక్ట్రికల్ ఇబ్బందులేవైనా ఉంటే గుర్తించేందుకు ఈ ట్రయల్ రన్ దోహదపడనుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియకు మొత్తం రెండు నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అనంతరం ప్యాకేజీ–7లోని టన్నెళ్ల నిర్మాణం పూర్తయ్యాక ప్యాకేజీ–8లోని పంపులను కూడా ఇదే విధంగా పరిశీలిస్తారు. 2020 జూన్‌కు మల్లన్నసాగర్.. ఇక ప్రాజెక్టులో అత్యంత కీలకంగా మారిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని 2020 జూన్ నాటికే సిధ్దం చేయాలని సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం అన్ని పనులు సమాంతరంగా జరగాలని స్పష్టంచేశారు. నిజానికి మల్లన్నసాగర్ రిజ్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు మల్లన్న సాగర్ నుంచే నీటిని తరలించాలని ప్రణాళిక వేశారు. సింగూరు ప్రాజెక్టుకు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్నసాగర్ నుంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. మొత్తం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఈ రిజర్వాయరే గుండెకాయగా ఉండనుంది. ఈ రిజర్వాయర్ కింద మొత్తం 13,970 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. మూడున్నరేళ్లుగా భూసేకరణ పనులు జరుగుతున్నా, నిర్వాసితుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ గ్రామాల పరిధిలోని నిర్వాసితులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో వెయ్యి ఎకరాలకు గానూ 910 ఎకరాలను ఎకరం రూ.7.75 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కేవలం మరో 90 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. అయితే సహాయ పునరావాస పనుల్లో నిర్వాసితుల నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. చట్ట ప్రకారం ఇక్కడ అర్హులకు 250 గజాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎకరానికి రూ.7.50లక్షలు, ఒకవేళ డబుల్ బెడ్రూం ఇల్లు వద్దనుకుంటే రూ.5.04 లక్షలను నేరుగా నిర్వాసితులకు చెల్లిస్తున్నారు. దీంతోపాటే ఇంటి నిర్మాణాన్ని బట్టి దానికి ధర చెల్లిస్తున్నారు. అయితే నిర్వాసితులు ప్రభుత్వం భూమికి నిర్ణయించిన పరిహారాన్ని పెంచాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం అందేవరకు భూమి ఇవ్వలేమని చెబుతున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లిలో వసతుల కల్పన లేదని చెబుతున్నారు. బలవంతపు సేకరణను నిరసిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్, తొగుట, వేములఘాట్ ప్రజలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పనులు ముందుకు కదలడంలేదు. రిజర్వాయర్ పనులను రూ.6,805కోట్లతో 4 రీచ్‌లుగా చేపట్టగా.. కేవలం ఒక రీచ్‌లో మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. మొత్తం 13 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరగాల్సి ఉండగా, కేవలం 2 కోట్ల క్యూబిక్ మీటర్ల పనే జరిగింది. ఈ నేపథ్యంలో కేసుల పరిష్కారానికి తగిన చొరవ చూపాలని, చట్టపరంగా తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని సీఎం కేసీఆర్.. కలెక్టర్లు, ప్రభుత్వలాయర్లు, ఇంజనీర్లకు సూచించారు.