తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం దత్తత గ్రామం ఎర్రవల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం చేయాలన్నారు. వర్షాలతో చెరువులు, డ్యామ్లు కళకళలాడుతున్నాయన్నారు. భవిష్యత్లో ఇక నీటి సమస్య ఉండదని కేసీఆర్ అన్నారు.