ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ఎర్రవల్లికి చేరుకున్నారు.మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం చివరి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఎర్రవల్లికి చేరుకున్న చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.