
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్‌లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొంది.
సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలివీ...
హస్మత్‌పేట్, పేట్‌బషీరాబాద్ బ్యాంక్ కాలనీ, మీనాక్షి, డిఫెన్స్ కాలనీ, గౌతమ్‌నగర్, చాణక్యపురి, తిరుమల్‌నగర్, గాయత్రినగర్, అల్వాల్ మున్సిపల్ ఏరియా, లోతుకుంట, ఫాదర్ బాలయ్యనగర్, ఓయూటీ కాలనీ, రాధిక, చెర్లపల్లి, కీసర, రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, హకీంపేట్, సింగాయిపల్లి, దేవరయాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, చెర్లపల్లి, తుర్కపల్లి, అహ్మద్‌గూడ, మెస్ త్రిశూల్, గన్‌రాక్, కంటోన్మెంట్ బోర్డు, రుద్రనగర్.
Comments
Please login to add a commentAdd a comment