
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ ఏడాది నుంచే కొండపోచమ్మ సాగర్ వరకు తరలించడానికి పంపింగ్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. రాజరాజేశ్వర స్వామి (మిడ్ మానేరు) రిజర్వాయర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్ని దశల్లో పంపు హౌస్‌ల నిర్మాణం పూర్తి కావాలని, ఈ ఏడాది నుంచి నీటిని పంపు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు కాళేశ్వరం పరిధిలోని పంపుహౌస్‌లను ప్రభాకర్ రావు శుక్రవారం సందర్శించారు. నిర్మాణ పనులను తనిఖీ చేసి, అధికారులతో సమీక్ష జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment