kondapochamma Sagar Project
-
అపూర్వం.. 30 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నీరందని ప్రాంతాలన్నింటికీ తరలిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గత నెల 23న కూడవెళ్లి వాగు ద్వారా విడుదల చేసిన కాళేశ్వరం జలాలు అప్పర్ మానేరు ను చేరడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం అలుగు దుంకుతోంది. సుమారు 30 ఏళ్ల తర్వాత నిండు వేసవిలో ప్రాజెక్టు నిండుకుండలా మారడం ఇదే తొలిసారి. కూడవెళ్లి వాగు నుంచి సుమారు 70 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు దారిలో 39 చెక్ డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరగా 11 వేల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్యాకేజీ-9 పనులు ఆలస్య మవుతున్న నేపథ్యంలో కూడవెళ్లి వాగు ద్వారా తర లించిన జలాలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. ప్యాకేజీ-9 ఆలస్యమైనా చింతలేకుండా.. అప్పర్ మానేరు ప్రాజెక్టును సుమారు 50 ఏళ్ల కింద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా పూడిక కారణంగా ప్రస్తుతం అందులో 2.20 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉంటోంది. దీని కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించొచ్చు. అయితే వర్షాకాలంలో మినహాయిస్తే జనవరి తర్వాత ఇందులో నీటి లభ్యత ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు 11.635 టీఎంసీలను తరలిస్తూ మొత్తంగా 60 వేల ఎకరాల కొత్త ఆయ కట్టు, 26 వేల ఎకరాల స్థిరీకరణ చేయాలన్న లక్ష్యం తో ప్యాకేజీ-9 పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ. 996 కోట్లతో చేపట్టగా రూ. 600 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 కి.మీ. టన్నెల్లో 7 కి.మీ. టన్నెల్ పని పూర్తవ్వగా మిగతా లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటి పంప్‌హౌస్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంగల 2 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక దాని బిగింపు పనులు పూర్తయ్యాయి. రెండో దాని పనులు మొదలుపెట్టనున్నారు. ఈ పంప్‌హౌస్ నుంచి నీళ్లు మలక్‌పేట రిజర్వాయర్‌కు... అటు నుంచి సింగసముద్రం చెరువుకు 18 కి.మీ. గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అక్కడ ఉన్న రెండో పంప్‌హౌస్‌లో 2.25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటార్ల ద్వారా 5.70 కి.మీ. ప్రెషర్ మెయిన్ నుంచి బట్టల చెరువు, అటు నుంచి 3.35 కి.మీ. గ్రావిటీ ద్వారా ప్రయాణించి అప్పర్ మానేరు చేరేలా డిజైన్ చేశారు. దీని ద్వారా అప్పర్ మానేరుకు నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్యాకేజీ-9 పనుల్లో మరో 30 శాతం మేర పనులు పూర్తికాలేదు. రెండో పంప్‌హౌస్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్యాకేజీలో 1,279 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 605 ఎకరాలు పూర్తయింది. మిగతా భూసేకరణకు రూ. 25 కోట్ల తక్షణ అవసరాలున్నాయి. వాటి విడుదలలో ప్రభుత్వ జాప్యంతో పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్... కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్రణాళికను అమల్లో పెట్టారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లే గ్రావిటీ కెనాల్ 7వ కి.మీ. వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని కూడవెళ్లి వాగులోకి తరలించేలా పనులు పూర్తి చేశారు. దీంతో గత నెల 23న మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ హరిరామ్ ఈ కాల్వ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేశారు. ఈ నీరు దారిలోని 39 చెక్‌డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరింది. మొత్తంగా 2 టీఎంసీల మేర నీరు అప్పర్ మానేరు చేరడంతో అది ప్రస్తుతం పూర్తిగా నిండి సోమవారం సాయంత్రం నుంచి అలుగు దుంకుతోంది. జూన్‌లో వర్షాలు ఆలస్యమైనా.. ప్యాకేజీ–9 పనులు పూర్తి కాకపోయినా కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరు కింది ఆయకట్టుకు ఇప్పుడు కొండంత భరోసా ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు. -
హల్దీలోకి గోదారమ్మ
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు ఎత్తిపోసిన గోదావరి నీళ్లను.. హల్దీవాగు, మంజీరా నది ద్వారా నిజాంసాగర్‌కు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే నీటిని సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దివాగుకు పైన ఉన్న బంధం చెరువులోకి విడుదల చేశారు. ఈ నీళ్లు పెద్దచెరువు, శాకారం ధర్మాయి చెరువు, కానీ చెరువులను నింపుతూ.. హల్దీవాగులోకి, అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌కు చేరనున్నాయి. గజ్వేల్‌కు నీళ్లిచ్చే ప్రాజెక్టుకూ.. అవుసులోనిపల్లి నుంచి బయలుదేరిన సీఎం.. మర్కూక్ మండలం పాములపర్తి సమీపంలో కాల్వ ద్వారా గజ్వేల్ ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు, మహిళలు గోదావరి జలాల్లో పసుపు, కుంకుమ, పూలు, నాణేలు వేసి గోదారమ్మకు స్వాగతం పలికారు. ఇక్కడ విడుదల చేసిన నీటితో పాములపర్తి చెరువు, పాతూరు, చేబర్తి, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా మొదలైన 20 చెరువులు నిండుతాయి. అవుసులోనిపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు గ్రామాల్లో పండుగ వాతావరణం గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో పండుగ వాతా వరణం నెలకొంది. ఉదయం నుంచే వర్గల్, గజ్వేల్, మర్కుక్ మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్దఎత్తున అవుసులోనిపల్లికి, పాములపర్తికి చేరుకున్నారు. తమ వెంట పసుపు, కుంకుమలు, పూలు, నాణేలు తీసుకొచ్చారు. సీఎం నీటిని విడుదల చేయగానే.. పెద్ద ఎత్తున జైతెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. గోదావరి నీళ్లలో పసుపుకుంకుమలు, పూలు చల్లారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్‌గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి జలాలను విడుదల చేస్తున్న కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్, ఈఎన్సీ హరిరామ్ వీలైనంతగా నీళ్లివ్వాలనే లక్ష్యంతో.. ‘నేను కాపోన్ని నాకు రైతుల కష్టాలు తెలుసు’అని తరచూ చెప్పే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ వరకే పరిమితం చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అందేలా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దానికితోడు యాసంగి పంటలు వేసిన రైతులు హల్దివాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే అటు హల్దివాగుకు, ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. అధికారులు కూడా వెంటనే పనుల వేగం పెంచి నీటి విడుదలకు కాల్వలు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేశారు. సీఎం మంగళవారం ఈ రెండు చోట్లా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హల్దివాగులోకి ఎన్నిరోజులకు నీరు చేరుతాయి. ఎన్ని చెక్‌డ్యామ్‌లు, ఎన్ని చెరువులు నిండుతాయి, భూగర్భ జలాల పరిస్థితి ఏమిటని మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ హరేరామ్లను అడిగి తెలుసుకున్నారు. -
కొండపోచమ్మ టు నిజాంసాగర్
-
గోదావరి జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. చదవండి: తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం జూబ్లీహిల్స్: కారుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీభత్సం -
హల్దివాగు దశ, దిశ మారుతోందా!
సాక్షి, సిద్దిపేట: సమృద్ధిగా వర్షాలు పడితేగానీ నిండుగా నీరు కనిపించని హల్దివాగు దశ, దిశ మారుతోంది. కాలంతో పనిలేకుండా రైతులకు నీళ్లు అందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి.. అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం పరిశీలించారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. పదిరోజుల్లో నిజాంసాగర్‌కు.. మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేసే గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్ డ్యామ్‌లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌లోకి చేరుతాయి. ఏర్పాట్లన్నీ సిద్ధం సీఎం కేసీఆర్ మంగళవారం గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. తర్వాత 11.15 గంటలకు మర్కూక్ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు, బందోబస్తును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. చదవండి: హాట్‌హాట్‌గా ఓటు వేట -
కొండపోచమ్మ టు నిజాంసాగర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కొత్త ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అమల్లోకి తెచ్చే కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి సింగూరుకు అటు నుంచి నిజాంసాగర్‌కు నీటిని తరలించే ప్రణాళికలు ఇప్పటికే ఉన్నప్పటికీ, భారీ టన్నెళ్ల నిర్మాణాలతో నీటి తరలింపులో జాప్యం జరుగుతుండటంతో మరో కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చి.. దాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తోంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వా యర్ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వల నుంచి హల్దీవాగు మొదలయ్యే ఖాన్ చెరువుకు లింక్ కెనాల్‌ను తవ్వి నీటి మళ్లింపు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఒకటి కాకుంటే.. ఇంకొక మార్గం కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో చాన్నాళ్లూ సందిగ్ధత ఉన్నా, చివరికి మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు మొగ్గుచూపారు. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18.62 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. ప్యాకేజీ–17లోని ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కాకుండా మల్లన్నసాగర్ నుంచి హల్దీకి, అటు నుంచి సింగూరుకు నీటిని తరలించే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయా లను ఆలోచించిన ప్రభుత్వం కొత్తగా కొండ పోచమ్మ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీకి నీటిని తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంగారెడ్డి కాల్వ 6.25వ కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఖాన్‌చెరువు మీదుగా హల్దీవాగుకు నీటిని తరలించేందుకు 1.3 కిలోమీటర్ల లింక్ కెనాల్ తవ్వాలని నిర్ణయించారు. ఈ కెనాల్ పనులు ఇప్పటికే చివరి దశలో ఉన్నాయి. మరో పది పదిహేను రోజుల్లోనే ఈ లింక్ కెనాల్ ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ లింక్ కెనాల్ పూర్తయితే కొండపోచమ్మ నుంచి తరలించే నీరు సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీ వాగులో కలిసి... అటునుంచి గ్రావిటీతో మంజీరాలో కలిసి నేరుగా నిజాంసాగర్‌కు చేరుతాయి. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇందులోంచి 1,600 క్యూసెక్కుల నీటిని లింకు కాల్వ ద్వారా నిజాంసాగర్‌కు పంపాలన్నది ప్రస్తుతం లక్ష్యంగా ఉంది. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 17.80 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం దీనికింద 2 లక్షల ఎకరాలకు అవసరమైన నీటి విడుదల జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి లభ్యత పెంచేందుకు వీలుగా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించి అటునుంచి నిజాంసాగర్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. -
ఎందుకు.. ఏమిటి.. ఎలా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం చేపడుతున్న పనులపై కేంద్రం లేఖాస్త్రం సంధించింది. ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించి ఒక్కో అంశాన్ని ఆరా తీస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, పర్యావరణ అనుమతులు, వ్యయా లపై వరుసగా లేఖలు సంధిస్తున్న కేంద్రం, రెండ్రోజుల కిందట ఆయకట్టు వివరాలు కోరగా, తాజాగా గురువారం అదనపు టీఎంసీ పనులను గత పనులకు భిన్నంగా చేపట్టడంపై వివరణ కోరుతూ లేఖ రాసింది. ఒక్కొక్కటిగా వివరాల సేకరణ... కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్, గంధమల్ల, బస్వాపూర్, వాటి కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. రెండు టీఎంసీల తరలింపు పనులకు కేంద్రం రూ.80,190 కోట్లకు అనుమతులు ఇవ్వగా, ఇందులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ పనులు కొనసాగుతుండగానే, కృష్ణా బేసిన్లో నీరందని ప్రాంతాలకు సైతం కాళేశ్వరం ద్వారానే గోదావరి జలాలు అందించేలా అదనపు టీఎంసీ పనులు చేపడుతోంది. ఈ పనులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు సైతం దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. డీపీఆర్‌లపై బోర్డు, కేంద్రం రాసినా స్పందన లేకపోవడంతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేరుగా లేఖలు రాశారు. ఇందులో రెండు టీఎంసీల నీటిని తరలింపునకే కేంద్రం అనుమతి ఇచ్చిందని, అదనపు టీఎంసీ పనులకు అనుమతి లేదన్న అంశాన్ని లేవనెత్తారు. దీనికి కొత్తగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ మరో లేఖ రాయగా, అనంతరం ప్రాజెక్టుకు తొలుత నిర్ధారించిన అంచనా వ్యయం, సవరించిన అంచనా వ్యయాలు, ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలను సమర్పించాలని కోరింది. ఈ లేఖ రాసిన వారం రోజుల వ్యవధిలో మూడు రోజుల కిందటే తాము 98 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 195 టీఎంసీల ఎత్తిపోతలకు అనుమతిచ్చామని, దీనికి అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన చేశారో, లేదో తెలపాలని కోరుతూ లేఖ రాసింది. అదనపు టీఎంసీతో అదనంగా సాగులోకి వచ్చే ఆయకట్టు లేక స్థిరీకరణ ఆయకట్టు, జిల్లాల వారీగా ఆ ఆయకట్టు వివరాలు చెప్పాలని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. ఇది రాసిన రెండ్రోజులకే గురువారం మరో లేఖ రాసింది. ఇప్పటికే చేపట్టిన రెండు టీఎంసీల నీటి తరలింపునకు గ్రావిటీ కెనాల్, టన్నెళ్ల వ్యవస్థల ద్వారా నీటి తరలింపు చేపట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం అదనంగా టీఎంసీ నీటిని తీసుకునేందుకు చేపట్టిన పనులను మాత్రం పాత విధానంలో కాదని, పైప్‌లైన్ ద్వారా ప్రెషర్‌మెయిన్ వ్యవస్థ ఏర్పాటు చేసి తరలించడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. ప్రెషర్ మెయిన్ వ్యవస్థను ఎంచుకునేందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర వరుస లేఖల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్ని వివరాలను సేకరించి పెట్టుకుంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేక జాతీయ సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం (ఏఐబీపీ)లో చేర్చి ఆర్థికసాయం చేయాలని పదేపదే కోరుతున్నా స్పందించని కేంద్రం, అదనపు టీఎంసీ పనుల వివరాలపై లేఖలు రాయడం మాత్రం విస్మయానికి గురి చేస్తోందని జల వనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘ప్రాజెక్టులు రైతుల కోసమా.. కేసీఆర్ కోసమా ’
సాక్షి, సిద్ధిపేట : కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన నెల రోజుల్లోనే కాలువలకు గండి పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కాలువకు గండి పడ్డ ప్రాంతాన్ని ఉత్తమ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం రైతుల కోసమా ? లేక కేసీఆర్ కోసమా ? అనేది అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై రాష్ట్ర స్థాయిలో నిలదిస్తామని దీనిపై పోరాడుతామని తెలిపారు. కాలువలకు గండి పడటం సహజం అంటున్న ఈఎన్సీ హరి రామ్ అసలు ఇంజనీర్ అవునా కాదా అన్న అనుమానం కలుగుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. (కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి) గండ్లు పడే ప్రాజెక్టులు, కాలువలు నిర్మిస్తున్నారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. గండ్లు సహజం అంటున్న ఈఎన్సీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలువకు గండి పడితేనే ఇలా ఉంటే.. ప్రాజెక్టులకు గండి పడితే పరిస్థితి మరెంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రజలే గుర్తించాలని సూచించారు. కాలువ గండి పడి నష్టపోయిన శివారు వెంకటాపూర్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్ట పోయిన ప్రాంతాన్ని పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డికి సమయం లేదా అని నిలదీశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే కాలువకు గండి పడ్డదంటే నిర్మాణ లోపాలు తేట తెల్లం అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటి వరకు చెక్కు చెదర లేదని పేర్కొన్నారు. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు) -
కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి
-
కొండపోచమ్మ కాల్వలకు వర్షం దెబ్బ
గజ్వేల్: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కాల్వలకు వర్షం దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కాల్వల సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. మట్టి కుంగిపోయి లీకేజీలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. గోదావరి జలాలు మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి తుక్కాపూర్ గ్రావిటీ కెనాల్ ద్వారా 24 కిలోమీటర్లు ప్రయాణం చేసి గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యులేటరీ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడి గేట్లు ఎత్తిన తర్వాత కాల్వల ద్వారా అక్కారం పంపుహౌజ్ వైపు మరో 6 కిలోమీటర్లు తరలివెళ్తాయి. అక్కడి నుంచి మరో 6.5 కిలోమీటర్ల మేర మర్కూక్–2 పంపుహౌజ్‌కు, ఆ తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరుతాయి. మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి కొడకండ్ల వరకు ఉన్న ఈ కాల్వ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు. ఇది నాగార్జునసాగర్ కాల్వల సామర్థ్యం కంటే కూడా పెద్దది. ఇంతటి కీలకమైన కాల్వ వర్షాలకు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద సిమెంట్ లైనింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల మట్టి కుంగిపోయి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడే ప్రమాదం నెలకొన్నది. మర్కూక్ సమీపంలోనూ కాల్వ సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. దీంతో కాల్వ నాణ్యత ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖ ఈఈ బద్రీనారాయణ వివరణ కోరగా, భారీ వర్షాల కారణంగానే నీటి ప్రవాహం పెరిగి కాల్వ దెబ్బతిన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని స్పష్టం చేశారు. -
కొండపోచమ్మ రిజర్వాయర్‌కు సీఎం
సాక్షి, సిద్దిపేట/ మర్కూక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి మధ్యాహ్నం బయలుదేరిన ఆయన, తన వాహనంపై 15 కిలోమీటర్ల పొడవున ఉన్న కట్ట చుట్టూ తిరుగుతూ.. కట్ట నిర్మాణం, నీటి నిల్వ, కాల్వల ద్వారా నీటి విడుదల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్‌తో సీఎం మాట్లాడారు. రిజర్వాయర్ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కట్టపై ఇరువైపులా పచ్చని చెట్లు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తేనే జలపాతాన్ని మించిన శోభ కనిపిస్తోందని, ఇక రిజర్వాయర్‌కు ఉన్న ఆరు పంపుల ద్వారా నీరు విడుదల చేస్తే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రిజర్వాయర్‌ను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే సందర్శకుల తాకిడి అధికం అవుతుందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా భద్రతను కూడా పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, పర్యాటకులు కట్టపైన ఇష్టానుసారంగా తిరగకుండా చూడాలని, అవసరమైన చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వాయర్‌పై వెళ్తూ ఉంటే ఆనందంగా ఉందని అన్నారు. రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపితే ఈ ప్రాంతంలోని ఇంచు భూమి కూడా వృథా పోకుండా సాగులోకి వస్తుందన్నారు. అప్పుడు చుట్టూరా పచ్చటి పొలాలు, మధ్య లో అందమైన రిజర్వాయర్ పర్యాటకులకు మరింత కనువిందు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన చిన్ననాటి స్నేహితుడు జహంగీర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
కొండపోచమ్మ: సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ
సాక్షి, మర్కుక్ (సిద్దిపేట) : మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీఎం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి వచ్చారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలవడానికి, చూడటానికి భారీగా తరలివచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టపై తిరుగుతూ గోదావరి జలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నాయా అని అధికారులను, స్థానికులను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సాగర్‌లో స్నానానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతిని ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు. కొండపోచమ్మ దిగువన ఉన్న రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అక్కడి రైతులను కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగర్ నిర్మాణంలో జరుగుతున్న పనులపై అధికారులు సీఎంకు వివరించారు. సాగర్‌నుంచి మల్లన్న సాగర్ కాలువ పనుల గురించి ఆరా తీశారు. కొండపోచమ్మ కుడి, ఎడమ కాలువల పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. (త్వరలో రైతులకు శుభవార్త..) -
సీఎం కేసీఆర్ మాట తప్పారు
-
కాళేశ్వరంలో ‘మేఘా’ పవర్!
సాక్షి, హైదరాబాద్: లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని కీలకమైన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ప్రాజెక్టులోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి ఎంఈఐఎల్ మరోమారు తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాన్ని చాటుకుంది. మొత్తం ప్రాజెక్టులో 4,680 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు, మోటార్లు ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 3,840 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్ల పనులను చేపట్టిన ఎంఈఐఎల్.. అతి తక్కువ సమయంలోనే 3,767 మెగా వాట్ల పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసి సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. ‘కొండ పోచమ్మ’తో కీర్తి శిఖరాలకు.. కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. అందులో 15 పంపింగ్ కేంద్రాల్లో 89 పంపులు, మోటార్లను 3,840 మెగావాట్ల సామర్థ్యంతో మేఘా సంస్థ నిర్మిస్తోంది. ఇక రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసే విధంగా మేఘా సంస్థ నిర్మించిన కేంద్రాల్లో 9 వినియోగంలోకి వచ్చాయి. మరో 4 పంపింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, మరో రెండు పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పనులు ప్రారంభించిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మొదటి దశలోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు రెండో దశ ఎత్తిపోతలో గాయత్రి (ప్యాకేజీ–8), నాలుగో దశలో మిడ్‌మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్నపూర్ణ (ప్యాకేజీ–10), రంగనాయక సాగర్ (ప్యాకేజీ–11), మల్లన్నసాగర్ (ప్యాకేజీ –12) కేంద్రాలను సంస్థ వినియోగంలోకి తేగా.. శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆరంభించిన అక్కారం, మర్కూక్ (ప్యాకేజీ–14) మోటార్లతో సంస్థ వినియోగంలోకి తెచ్చిన పంపుల సామర్థ్యం 3,767 మెగావాట్లకు చేరింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌కు నీటిని పంపింగ్ చేయడంలో ఎంఈఐఎల్ కీలక పాత్ర పోషించి కీర్తి దక్కించుకుంది. అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉండగా, ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్‌మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ–నీవా ఎత్తిపోతల పథ కం పెదద్ది కాగా ఆ పథకంతో పోలిక లేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా ప్రస్తుతం కాళేశ్వరం ప్రపంచా న్ని ఆకర్షిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4,680 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో అత్యధికంగా 3,840 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సా మర్థ్యం 3,916 మెగావాట్లైతే కాళేశ్వరంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థకు దాదాపు సమానంగా ఉంది. సీఎం పట్టుదలతోనే.. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు, బీడు భూములను సస్యశ్యామ లం చేసేందుకు ప్రపంచంలో అత్యు త్తమ ఇంజనీరింగ్ సంస్థలతో కలసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం. సీఎం చంద్రశేఖర్‌రావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం..’ – బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ -
త్వరలో రైతులకు శుభవార్త..
సాక్షి, సిద్దిపేట : ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో రైతులకు శుభవార్త వినిపిస్తా. ఆ వార్త విని దేశమే అబ్బుర పడుతుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ సాగును లాభదాయకం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుం టోందన్నారు. ఇప్పటికే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు రూ. వందల కోట్ల విద్యుత్ ఖర్చవుతుందని, అయినా రైతులపై ఒక్క రూపాయి కూడా నీటి తీరువా విధించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా ద్వారా రైతులకు చేయూతనిస్తున్నామని చెప్పారు. నియంత్రిత సాగు విధానంతో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శం కానున్నారన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత చిత్తశుద్ధి్దతో ముందుకెళ్తుందన్నారు. రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంటుందని... ఆ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. అంతవరకు సస్పెన్స్‌గా ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. -
ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది
సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టం ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. తలాపున పారుతున్న గోదావరి.. మన చేలు, మన బతుకు ఎడారి అని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణలోని ఎత్తైన ప్రాంతం కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఎత్తిపోశాం. ఇక ఈ ప్రాంతం సాగునీటి కష్టాలు తీరినట్టే. ఇలా ఉద్యమ లక్ష్యాలను ఒకొక్కటిగా నెరవేర్చుకుంటూ పరాయి పాలనలో ఆగమైన తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను చినజీయర్ స్వామితో కలసి విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నిర్వాసితులకు ఇళ్లు, ఉపాధి.. ప్రాజెక్టులు కడితే సాగునీరు వస్తుంది. ఇదే సందర్భంలో గ్రామాలు, భూములు కోల్పోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి త్యాగానికి వెలకట్టలేం. వారికి ప్రభుత్వం మంచి ప్యాకేజీలు ఇచ్చింది. అయినా వారు గూడులేని పక్షులుగా మారిపోయారు. ఇలా త్యాగం చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్పొరేట్‌కు దీటుగా వారికి ఇళ్లు కట్టిస్తున్నాం. అదేవిధంగా వారికి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి కోసం నూతనంగా ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. ఆరేళ్లలోనే పురోగతి... పరాయి పాలనలో ఆగమైన తెలంగాణ... స్వరాష్ట్రం సాధించిన ఆరు సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తోంది. గతంలో కరెంట్ కోతలు, నీటి కష్టాలు ఉండేవి. ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా అందుతోంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నాం. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమాను అమలు చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ కూడా అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది రూ. 1,300 కోట్లు విడుదల చేశాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, వికలాంగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే. సంక్షేమ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చాం. 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు« ధాన్య రాసులకు నిలయంగా మారింది. దేశం మొత్తంమీద 83 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే ఒక్క తెలంగాణ నుంచే 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం మనం సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ విషయం నేను చెప్పేది కాదు.. ఎఫ్‌సీఐ సీఎండీ వీవీ ప్రసాద్ చెప్పిన మాటలివి. సాగునీటి ఇబ్బందులు తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. 35 టీఎంసీల సామర్థ్యంతో సీతారామ, 7.5 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క–సారక్క, గౌరవెల్లి, గండిపల్లి మొదలైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ బంగారు పంటలు, భాగ్యరాసులు, పసిడి పంటలు పండే తెలంగాణగా విరజిల్లనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్యారేజీల్లో 40 టీఎంసీలు, రిజర్వాయర్ల ద్వారా 125 టీఎంసీలు మొత్తం 165 టీఎంసీలను నిల్వ చేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని విధాలుగా మొత్తం 530 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం పొందాం. రంగనాయక సాగర్ ద్వారా ఇప్పటికే చెరువుల్లోకి జలకళ సంతరించుకుంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్‌తో హల్దీ వాగుకు నీటిని విడుదల చేస్తాం. కామారెడ్డి, గుజ్జులు, కాయగల్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాం. ఇకపై పచ్చటి పొలాల తెలంగాణ... ప్రాజెక్టుల నిర్మాణం ఒక ఎత్తయితే పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో ఎత్తు. ఇటువంటి కీలక సమస్యను అధిగమిస్తూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాజనీతిజ్ఞతకు నిదర్శనం. వారిని మెప్పించడమే కాకుండా భూమిపూజకు అక్కడి ముఖ్యమంత్రిని ఆహ్వానించాం. తెలంగాణ అంతా సస్యశ్యామలం చేయాలని నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లతోపాటు రూ. 4 వేల కోట్లతో 1,250 చెక్ డ్యాంలు నిర్మించాం. వ్యవసాయం లాభసాటి చేయాలనే ఆలోచనతో నియంత్రిత సాగు విధానం ప్రవేశపెట్టాం. ఇది నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు. ఇంజనీర్లకు సెల్యూట్.. తెలంగాణ వారు అంటే తెలివితక్కువ వారని చులకన చేసేవారు. అటువంటి తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి చూపించారు. ప్రాజెక్టు ప్రారంభంలో విమర్శలు, శాపనార్థాలు పెట్టినవారు కూడా ఇప్పుడు మౌనంగా ఉండేలా చూపించారు. సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపొచమ్మ సాగర్‌కు జలాలు ఎత్తిపోసేలా ఆవిష్కరణ చేసి చూపించిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్. ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి, ఇతర ఇంజనీర్ల మేధాశక్తితో దశాబ్దాలుపట్టే ప్రాజెక్టులను కేవలం నాలుగు సంవత్సరాల్లోనే నిర్మించి సత్తా చాటారు. ఇందుకు సహకరించిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు ధన్యవాదాలు. అదేవిధంగా 48 డిగ్రీల ఎండలోనూ పనులు చేసిన వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వందనాలు తెలుపుతోంది. 400 మెగావాట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం పదేళ్లు పట్టేది. కానీ నాలుగు సంవత్సరాల్లోనే 480 మెగావాట్ల విద్యుత్ వినియోగం కోసం 400 కేవీ సబ్స్టేషన్లు ఆరు, 220 కేవీ సబ్స్టేషన్లు ఏడు, 135 కేవీ సబ్ స్టేషన్లు రెండు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం వేగంగా భూసేకరణ చేసిన రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందికి, ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. -
ఉవ్వెత్తున గోదారి
సాక్షి, సిద్దిపేట : కరువు నేలను గోదారమ్మ ముద్దాడింది. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి ఎగిరి దుంకింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మర్కూక్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గోదావరి ఉత్తుంగ జలవాహినిలా కొండపోచమ్మ రిజ ర్వాయర్‌లోకి ప్రవహించింది. పంప్‌హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు, నవధాన్యాలు, పూలు, పండ్లను నీటి ప్రవాహంలో వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు తన్నీరు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఫారూక్ హుస్సేన్, బి. వెంకటేశ్వర్లు, శేరి శుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సొలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సతీష్‌కుమార్, మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. కొండపోచమ్మ ఆలయంలో తీర్థం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు పూజలతో కార్యక్రమానికి శ్రీకారం... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు చండీయాగం చేపట్టగా కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వరదరాజుపూర్లోని వరదరాజుల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చినజీయర్ స్వామితో కలిసి.. ఏ కార్యక్రమం చేపట్టినా యజ్ఞ, యాగాలు నిర్వహించే ఆనవాయితీ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి ముందు కూడా మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న సీఎం దంపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చినజీయర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం నిర్వహించారు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారందరికీ చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అక్కడి నుంచి నేరుగా పంప్‌హౌస్ వద్దకు చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ వెళ్లి పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి కొండపొచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జాలలను వదిలారు. శుక్రవారం కొండపోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన చండీయాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు సతాయించిన రెండో మోటార్ మర్కూక్, జగదేవ్‌పూర్ (గజ్వేల్): కొండపోచమ్మసాగర్ పంప్‌హౌస్ ప్రారంభంలో రెండో మోటార్ కొంతసేపు సతాయించింది. పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను ప్రారంభించేందుకు మర్కూక్ కట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకొని మోటార్లను స్విచ్ ఆన్ చేయగా మొదటి మోటార్ వెంటనే ప్రారంభమైంది. కానీ సాంకేతిక కారణాలతో రెండో మోటార్ ఆన్ కాలేదు. దాన్ని రిపేర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో కేసీఆర్, మంత్రులు అక్కడి నుంచి వరదరాజుపూర్లోని వరదరాజస్వామి దేవాలయానికి వెళ్లారు. అరగంట తర్వాత మోటార్‌ను బాగు చేశాక సీఎం కేసీఆర్ తిరిగి పంప్‌హౌస్ వద్దకు చేరుకొని రెండో మోటార్‌ను ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, చినజీయర్‌స్వామి తదితరులు సుదర్శనయాగంలో నవ దంపతులు మర్కూక్ (గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శనయాగంలో పాల్గొనే అదృష్టం మర్కూక్ మండల ఎంపీపీ తాండ పాండుగౌడ్ నూత న దంపతులకు లభించింది. పాండుగౌడ్‌కు ఈ నెల 27న మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన మేఘనతో వివా హం జరగ్గా పెళ్ల యిన రెండో రో జే అంటే శుక్రవా రం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సుదర్శనయాగంలో నూ తన దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో కలసి ఈ అరుదైన ఘట్టంలో పాలుపంచుకున్నారు. అలాగే త్రి దండి చినజీయర్‌స్వామి నుంచి ఆశీర్వాదాలు తీసుకు న్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పాండు గౌడ్ దంపతులను మా ఎంపీపీ దంపతులు అంటూ పరిచయం చేయడంతో వారు ఉప్పొంగిపోయారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో తమకు అవకాశం దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. -
‘కొండ’నెక్కిన గోదారి గంగమ్మ!
-
కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు..
-
రైతులకు అతి త్వరలోనే అతిపెద్ద తీపి కబురు
-
వారం రోజుల్లోనే పెద్ద తీపి కబురు చెప్తా: కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రైతులకు వారం రోజుల్లోనే పెద్ద తీపికబురు చెబుతానని ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు కోసం భూములు ఇచ్చినవారి త్యాగాలు వెలకట్టలేనివని సీఎం పేర్కొన్నారు. భూములు కోల్పోయినవారందరికీ పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వచ్చాయని అన్నారు. నిర్వాసితుల త్యాగాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. (చదవండి: కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం.. ) కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు.. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం ఉజ్వల ఘట్టమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామో ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ అపురూపమైన ప్రాజెక్టు అని సీఎం వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే దుమ్ముగూడెం దగ్గర సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టు కోసం సమ్మక్క సాగర్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. హుస్నాబాద్ దగ్గర గౌరవెళ్లి, గండిపెల్లి ప్రాజెక్టు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ పేరుతెచ్చుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం కష్టాల పాటలు పాడుకున్న తెలంగాణ ఇప్పుడు పసిడి పంటల రాష్ట్రంగా మారిందని కేసీఆర్ వెల్లడించారు. (చదవండి: తెలంగాణ సాగునీటి కల సాకారం) -
కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణికి నీరందించడమే లక్ష్యంగా.. కేసీఆర్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్ట్‌లో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్(మర్కూక్) పంప్‌హౌస్‌ను కేసీఆర్ ప్రారంభించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు. కేసీఆర్.. తన పేరును K-కాల్వలు, C-చెరువులు, R-రిజర్వాయర్లు సార్థకం చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.(చదవండి : కొండపోచమ్మకు గోదావరి జలాలు..) మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని చేరవేశామని కేటీఆర్ తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. త్వరలోనే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. దూరదృష్టితో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.(చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు) K కాల్వలు C చెరువులు R రిజర్వాయర్లు పేరు సార్థకం కాగా...🙏 మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు... 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు 🙏 World’s largest multi-stage lift irrigation project 💪 completed in 3 years by India’s youngest state #Telangana #KaleshwaramProject pic.twitter.com/IQcoi46xSX — KTR (@KTRTRS) May 29, 2020 -
తెలంగాణ సాగునీటి కల సాకారం
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ నేడు రికార్డులకు కెక్కించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి కోసం కొట్లాడిన ప్రాంతం నేడు జలకళతో సస్యశ్యామలమైంది. నిధులు.. నీళ్లు.. ఉద్యోగాలే ఏజెండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నీటికోసం భగీరథ ప్రయత్నం చేశారు. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నో ఇంజనీరింగ్ కంపెనీలు ముందుకొచ్చినా ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది మాత్రం మేఘా (MEIL). ఈ కంపెనీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసింది. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. పుష్కలంగా గోదావరి జలాలు.. ఒకప్పుడు నీటిగోసను అనుభవించిన తెలంగాణ నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి ఆలోచనకు తోడు ఎంఈఐఎల్ అహోరాత్రుల కృషి ఫలితంగానే ఇది సాధ్యపడింది. నీటి ప్రాజెక్టులు కట్టాలంటే దశబ్దాలు పడుతాయన్న అపఖ్యాతిని దూరంచేసేలా మేఘా కంపెనీ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్ కేంద్రాలను పూర్తిచేసి తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్‌హౌస్‌లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్ ద్వారా వినియోగంలోకి(ఆపరేషన్, మెయిన్టెనెన్స్) తీసుకొచ్చింది. రికార్డు స్థాయిలో పూర్తి.. మేఘా సంస్థ దీనిని ఓ నీటి ప్రాజెక్టుగా కాకుండా తమకు దక్కిన గౌరవంగా భావించి ఓ సవాల్‌గా తీసుకొని పూర్తి చేసింది. కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోని అతి భారీనీటి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి పట్టుదలకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబిబి, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ భారీస్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్1, లింక్2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. ఇంజనీరింగ్ చరిత్రలో అద్భుతం కాళేశ్వరం.. ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే మేఘా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా నిలిచింది. తాజాగా ప్యాకేజ్14లోని పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా 3,763మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి రానుంది. నీటి పారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసేలా భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్‌మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వేరపోయేలా రికార్డు సమయంలో కాళేశ్వరం పనులు పూర్తయ్యాయి. భూగర్భంలో కొత్త లోకం మొత్తం పంపింగ్ కేంద్రాల్లో అత్యధిక భాగం భూగర్భంలో నిర్మించినవే. అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్8), అన్నపూర్ణ (ప్యాకేజ్10), రంగనాయక సాగర్ (ప్యాకేజ్11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్12) భూగర్భంలో నిర్మించినవే. ప్రధానంగా గాయత్రి పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3ఘనపు మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్‌పూల్, అదనపు సర్జ్‌పూల్స్ కూడా ప్రపంచంలోనే పెద్దవి. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్‌హౌస్‌లను 28మిషన్లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు. వీటిన్నింటిని భూగర్భంలో నిర్మించి సరికొత్త ఆ ప్రాంతంలో సరికొత్త లోకాన్ని సృష్టించింది. భూగర్భంలో గాయత్రి నిర్మాణం.. ఆ తర్వాత ప్యాకేజ్8 పంపింగ్ కేంద్రం గాయత్రి. భూగర్భంలో మేఘా నిర్మించిన ఒక్కో పంపింగ్ కేంద్రం ఒక్కో అద్భుతాన్ని సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2టిఎంసీల నీటి పంపింగ్‌కుగాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తున్న 89మిషన్లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తోంది. మేఘాకు దక్కిన గౌరవం ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టమని మేఘా సంస్థ ప్రతినిధి బీ.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం తమకు దక్కిన జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో చర్చించి ప్రోత్సహించడం వల్లనే త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని బీ.శీనివాస్ రెడ్డి తెలిపారు. -
కొండపోచమ్మకు గోదావరి జలాలు..
-
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
సాక్షి, సిద్ధిపేట : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్‌ను(మర్కూక్) సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్ స్వామితో కలిసి ఆయన మోటార్ ఆన్ చేశారు. దీంతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రని లిఖించినట్టయింది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు) అంతకుముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్ వద్ద సుదర్శన యాగం ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్ ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మర్కూక్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పుర్ణాహుతిలో కేసీఆర్, చినజీయర్ స్వామి పాల్గొన్నారు.