సాక్షి, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మెదక్ జిల్లాలో కాల్వల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. లాక్‌డౌన్ పరిస్థితులు, కాళేశ్వరం పనులు, పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.
కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కాల్వల పనులకు అవసరమైన భూ సేకరణలో నిధులకు ఇబ్బంది లేదని తెలిపారు. ఇతరత్రా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి కావాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు మే 15వ తేదీ వరకు పూర్తికావాలని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుంద న్నారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేం దర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నగేశ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సంబురం
Comments
Please login to add a commentAdd a comment