
కంచ గచ్చిబౌలిలో జీవ విధ్వంసం చేసింది
సీఎం రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
కేంద్ర సాధికార కమిటీతో బీఆర్‌ఎస్ బృందం
పర్యావరణ ఉల్లంఘనలపై హరీశ్‌రావు తదితరుల నివేదిక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో వేలాది చెట్లను నరికి, జింకలను చంపి జీవ వైవిధ్యా న్ని విధ్వంసం చేస్తున్న తీరు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభు త్వం బరితెగింపు వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వందల ఎకరాల్లో చెట్ల నరికివేతకు బాధ్యులైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర సాధికార కమిటీ చైర్‌పర్సన్ సిద్దాంత్‌దాస్, సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్‌ను హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ బృందం గురువారం కలిసింది. పర్యావరణ విధ్వంసంపై వినతిపత్రం సమర్పించింది. అనంతరం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, దేవీ ప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు మీడి యాతో మాట్లాడారు.
రేవంత్ మూడు జింకల చావుకు కారణమయ్యారు..
‘హెచ్‌సీయూ భూముల్లో ఏడు చట్టాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది. వరుస సెలవు దినాలను అడ్డుపెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేసిన తీరును 11 పేజీల వినతిపత్రంలో వివరించడంతోపాటు 200 పత్రాలను కమిటీకి అందజేశాం. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు టీజీఐఐసీ పోలీసు విభాగానికి తప్ప ఏ ఒక్క ప్రభుత్వ శాఖకూ దరఖాస్తు చేయలేదు. పోలీసుల రక్షణలో జరిగిన విధ్వంసంతో మూడు జింకలు చనిపోగా, అనేక జంతువులు ఆవాసం కోల్పోయాయి. గతంలో జింకను వేటాడిన కేసులో సినీ నటుడు సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లాడు. మరి మూడు జింకల చావుకు కారణమైన రేవంత్‌పై ఏ తరహా చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సుప్రీం తీర్పులను ఉల్లంఘించడమే
‘అటవీ స్వభావం కలిగిన భూముల వివరాలు ఇవ్వాలని ఓ వైపు సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ భూ ములను తెగనమ్మే ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పట్ల కూడా రేవంత్‌కు భయం లేకుండా పోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా కంచ గచ్చిబౌలి భూములు టీజీఐఐసీకి చెందినవే అని బోర్డులు పె ట్టారు. గతంలో కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో గ్రీన్ ట్రిబ్యున ల్‌లో ఫిర్యాదు చేసి ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసిన రేవంత్ ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలి. పర్యావరణ విధ్వంసాన్ని ప్రశ్నించిన విద్యార్థులను పది రోజులుగా జైల్లో పెట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.169.84 కోట్లు బ్రోకర్‌కు చెల్లించింది’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.