HCU Land Issue
-
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్‌మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు. స్మితా సబర్వాల్.. అప్పుడు ఏం చేశినవ్? - గజ్జెల కాంతంకేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశినవ్అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ఇది కరెక్టు కాదని ఎందుకు ఖండించలేదు?IAS అధికారి స్మితా సబర్వాల్‌పై రెచ్చిపోయిన… pic.twitter.com/FrHZkWO2dA— Telugu Galaxy (@Telugu_Galaxy) April 23, 2025 -
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐతో రూపొందించిన ఓ ఫేక్ ఫోటోను ‘హాయ్ హైదరాబాద్’ అనే హాండిల్ గత మార్చి 31న సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేయగా, ఈ పోస్టును స్విత సబర్వాల్ షేర్ చేశారు.హెచ్‌సీయూలో ఉన్న మష్రూమ్ రాక్, దాని ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు నెమలి, రెండు జింకలతో ‘గిబీ్ల ఆర్ట్’ తరహాలో ఏఐతో రూపొందించిన ఆ చిత్రానికి ‘సేవ్ హెచ్‌సీయూ..సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ’ వంటి నినాదాలను జోడించి ‘హాయ్ హైదరాబాద్’ పోస్టు చేయగా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి స్మిత సబర్వాల్ పోస్టు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఈ వ్యవహారంలో గచ్చిబౌలి పోలీసులు ఆమె నుంచి వివరణ కోరుతూ ఈ నెల 12న నోటిసులు జారీ చేయగా, ఆమె తగ్గేదే లే అంటూ తన సోషల్ మీడియా యాక్టివిజాన్ని కొనసాగిస్తున్నారు. ‘చట్టానికి కట్టుబడి ఉండే పౌరురాలిగా గచ్చిబౌలి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాను. భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్) చట్టం కింద ఇచి్చన నోటిసులకు నా స్టేట్మెంట్ను ఈ రోజు ఇచ్చారు.ఆ పోస్టును 2వేల మంది షేర్ చేశారు. వారందరిపై ఇదే తరహాలో చర్యలకు ఉపక్రమించారా? అని స్పష్టత సైతం కోరిన. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే, కొందరిని లక్ష్యంగా చేసుకోడం ఆందోళనకలిగించే అంశం. చట్టం ముందు సమానత్వం, తటస్థట వంటి సూత్రాల విషయంలో రాజీపడినట్టు అర్థం అవుతుంది.’ అని ఆమె శనివారం ‘ఎక్స్’ వేదికగా కొత్త పోస్టు పెట్టడంతో మరింత వేడి రాజుకుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు సంబంధించిన వార్తను సైతం కొన్ని రోజుల ముందు షేర్ చేశారు.‘ప్రభుత్వం ధ్వంసం చేసిన 100 ఎకరాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికతో రండి. లేకుంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదు’ అని సుప్రీం కోర్టు చేసిన తీవ్రమైన వాఖ్యాలు ఆ వార్తలో ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంలో తనకు పోలీసులు నోటిసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ‘ఎక్స్’ వేదికగా కొందరు చేసిన పోస్టులను సైతం ఆమె షేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో ఓ వృద్ధుడు దూషిస్తున్న వీడియో పోస్టు చేసినందుకు గాను ఇటీవల అరెస్టై విడుదలైన ‘యూట్యూబ్’ మహిళా జర్నలిసు్ట రేవతి సైతం స్మిత సబర్వాల్‌కు మద్దతుగా ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టగా, దానిని సైతం ఆమె షేర్ చేశారు. ఈ మొత్తానికి ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్ పంతం వీడకుండా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండడం గమనార్హం. ఆమెకు బీఆర్ఎస్ మద్ధతుదారులు మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్ మద్దతుదారులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.వివాదాలు కొత్త కాదు... స్మితా సబర్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిజంతో తరుచూ వార్తల్లో ఉంటున్నారు. బిల్కీస్ బాను సామూహిక అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆమె చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. బీజేపీ మద్ధతుదారులు ఆమెకు వ్యతిరకంగా అప్పట్లో తీవ్రంగా ట్రోల్ చేశారు. ఇక నకిలీ వికలాంగ సర్టిఫికేట్‌తో పూజా ఖేద్కర్ అని యువతి ఐఏఎస్ కావడం ఇటీవల తీవ్ర వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల నియామకాల్లో వికలాంగుల కోటాను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టులను చాలా మంది తప్పుబట్టారు. ఐఏఎస్‌లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని, వికలాంగులతో సాధ్యం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయగా, వికలాంగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆమెకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేయగా, ఆమె వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యాలకు చర్యలు తీసుకోలేమని కోర్టు కొటి్టవేసింది.ఓడిన వారి కోసమేనా ఏడ్పు..? : సీఎం సీపీఆర్వో ప్రశ్నస్మిత సబర్వాల్ వ్యవహారంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్వో) బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. స్మిత సబర్వాల్ పేరును ప్రస్తావించకుండా ఆమె వైఖరీని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ‘ఆ ఐఏఎస్ అధికారి ‘దృష్టికోణం’లో మార్పు ఎందుకు వచ్చినట్టు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారోచ్చా? అప్పుడు(బీఆర్ఎస్ హయాంలో) ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికించి, వన్యప్రాణులను తరమింది వీరే.ఇప్పుడు తప్పుబట్టడంలో మర్మం ఏందో ?. అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన(బీఆర్ఎస్) వారి కోసమా?’ అని బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ జరిగిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 25లక్షల చెట్టను నరికివేశారని, పర్యావరణ అనుమతులు లేకుండా మిషన్ భగీరథ పనులు చేపట్టారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా షేర్ చేస్తూ ఆమె ద్వంద వైఖరీని ప్రశ్నించారు. ఆమె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.-మహమ్మద్ ఫసియుద్దీన్, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి -
వాళ్లందరిపైనా ఇలాగే చర్యలు తీసుకుంటారా?: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్మాల్ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్‌లో ఆమె విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపై తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. ‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు. హాయ్ హైదరాబాద్ పోస్టును రీట్వీట్ చేశా. 2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. .. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్?. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా?’’ అని అన్నారామె. ఇదిలా ఉంటే.. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈనెల 12నే నోటీసులు జారీ అయ్యాయి. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫొటోలను ఆమె సోషల్‌మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే నోటీసులు అందుకున్నాక కూడా ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని రీట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. -
ప్రధానిగారూ.. చిత్తశుద్ధి నిరూపించుకోండి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. ‘‘కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli Land Issue) ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం.దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి’’ అని కేటీఆర్(KTR) కోరారు.ఇటీవల హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని.. ఇదే కాంగ్రెస్ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ మర్చిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. -
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్లు చేస్తున్నారు.కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు. కానీ ఐఏఎస్ స్మిత సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
రేవంత్.. ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయ్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి హెచ్‌సీయూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం తలకెక్కి, అధికార మదంతో విర్రవీగి చక్రవర్తులం అని భావిస్తే.. న్యాయ వ్యవస్థ ముందు అహంకారం తగ్గక తప్పదు. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సీఎం రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉంది రేవంత్ రెడ్డి. ఆయన అన్ని పట్టించుకోని వ్యక్తి. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది విద్యార్థుల, అధ్యాపకుల, సపోర్ట్ చేసిన అందరి విజయం’ అని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ టాక్స్ అని , హెచ్‌సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని మోదీ మాట్లాడటం కాదు. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జీతో ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ కమిటీతో విచారణ చేయాలి. రాహుల్ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటా అన్నారు. కానీ, ఇక్కడ మాత్రం పత్తా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ ఆరాటపడుతోంది. భారత ప్రభుత్వం డైలాగులు కొడితే సరిపోదు. గుంట నక్కలు అని డైలాగ్ కొట్టిన ముఖ్యమంత్రికి సుప్రీంకోర్ట్ వాతలు పెట్టింది. కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు వారు కూడా ఊచాలు లెక్కబెట్టాల్సి వస్తుంది. సుప్రీంతీర్పును స్వాగతిస్తున్నాము. రేవంత్ అధికారులను బలి పశువులను చేస్తున్నారు. అంతా మంచి జరిగితే క్రెడిట్ నాది అంటారు రేవంత్. ఏదైనా జరిగితే అధికారులది తప్పు అంటున్నారు.రెండు జాతీయ పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల మాటలు వింటే చెవుల నుండి రక్తం కారుతుంది. ప్రజలే తిరగబడి బాంగ్లాదేశ్ లాగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లు సీఎంగా ఉండాలి ఆ తర్వాత వచ్చే 20ఏళ్ళు కాంగ్రెస్‌కు ఒక్కరు కూడా ఓటు వేయరు. రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘కంచ’లోనే లోపలేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టీన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ’పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అభివృద్ధి చేసేందుకే.. అంతకుముందు అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్ అండ్ ట్రీ (వాల్టా) యాక్ట్ ఉందంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ ’తరుఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? ‘చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది. -
కంచ గచ్చిబౌలి భూములపై సర్కారు వితండవాదం తగదు
ఢిల్లీ, సాక్షి: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వితండవాదాన్ని మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ తరుణంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి చెట్ల నరికివేతకు ఆదేశాలు ఇచ్చారు. కొంపలు మునిగిపోతున్నట్లుగా ఫ్లడ్‌లైట్లు పెట్టి మరి చెట్లు నరికారు. పర్యావరణ విషయంలో నాపై పోలీసులు కేసులు పెడతానంటే..రెడీ. హైదరాబాదులో ఒక్క చెట్టు కొట్టాలన్న వాల్టా చట్టం కింద అనుమతి తప్పనిసరి. ప్రభుత్వాలు నడిపేందుకు భూములు అమ్మితే భవిష్యత్తు తరాలు క్షమించవు’ అని వ్యాఖ్యానించారు. -
చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది. -
కంచె లేకపోవడం వల్లే.. కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్
న్యూఢిల్లీ, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరగనుంది. ఈ భూముల్లో జరుగుతున్న అన్ని కార్యాకలాపాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఇంతకుముందు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 16లోపు(ఇవాళ) అఫిడవిట్ సమర్పించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే.. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ‘‘కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగానే హెచ్‌సీయూ భూముల్లోని పక్షులు ఇక్కడికి వచ్చాయి’’ అని కౌంటర్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి( CS Shanti Kumari), తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలుచేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత’’గత వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయిన జస్టిస్ గవాయ్ -
హెచ్‌సీయూ వివాదం.. ఫేక్ పోస్టులపై ఇన్‌డెప్త్ ఇన్వెస్ట్‌గేషన్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియోలు, AI ఫేక్ ఫోటోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్పోస్ట్లపై పోలీసులు నిఘా పెట్టడంతో ఆ పోస్ట్‌లను పలువురు సెలబ్రిటీలు డిలీట్ చేశారు. ఫేక్ పోస్టులు పెట్టీ వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఫేక్ పోస్ట్‌లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతా యూఆర్ఎల్తో సహా పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టులు తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. 25 మంది సెలబ్రెటీలు పోస్ట్‌లు తొలగించినట్లు పోలీస్ శాఖ గుర్తించారు. -
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వివాదంపై 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో ముందుగానే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని తెలంగాణ సర్కార్ అంటోంది. దీనిని అనుసరించే కౌంటర్ దాఖలు చేసింది. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల అక్కడ పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కొనలేదనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ భూములకు ఎలాంటి కంచలేదని, కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశామని, ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని కౌంటర్ లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎల్లుండి(బుధవారం, ఏప్రిల్ 16వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణకు లోపే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండటంతో న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఓ క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ భూముల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ సర్కారుకు గట్టిగానే మొట్టికాయలు వేసింది. గత విచారణ సందర్భంగా భూముల్ని తదుపరి విచారణ వరకూ కొట్టివేయొద్దని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చెట్లు నరికివేతపై తీవ్రంగా స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాను హడావుడి చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా, దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా అంటూ పలు ప్రశ్నలను సంధించింది. -
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు135వ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా రాష్ట్రం, యమునా నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలనని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదంప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది. ఈ తరుణంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు. -
రెండ్రోజులు ఢిల్లీలో సీఎస్ మకాం
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గత విచారణలో భాగంగా కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అలాగే ఆ భూములను సందర్శించి ఈ నెల 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తోపాటు మరో 10 మంది అధికారులతో కలిసి శనివారం ఢిల్లీ చేరుకున్న సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఐదు గంటలపాటు అధికారులతో సమాలోచనలు చేశారు.సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా మరికొందరు న్యాయవాదులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలేమిటి? క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ప్రభుత్వం నివేదిక సమర్పించాక న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? వంటి విషయాలపై న్యాయవాదుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. -
ఆ రూ. 5,200 కోట్లు కేటీఆర్ పద్దు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూకి చెందిన భూముల విలువ రూ. 5,200 కోట్లని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారని.. కానీ అది భూముల విలువ కాదని.. కేటీఆర్ ముడుపుల పద్దు అని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. ఐఎంజీ భారత్ సంస్థ ముసుగులో హెచ్‌సీయూ భూముల్ని కాజేయజూసిన బిల్లీరావుతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ. 5,200 కోట్లని దుయ్యబట్టారు.శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఆమేర్అలీ ఖాన్, ఎమ్మెల్యే శ్రీగణేశ్, టీజీఎంఆర్ఈఐఎస్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీలతో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. బిల్లీరావుతో ఒప్పందం ప్రకారం హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలను ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తే ఆ భూమి విలువలో 30 శాతం కమీషన్ కేటీఆర్‌కు ముట్టేదన్నారు. అయితే కేటీఆర్ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.టీడీపీ హయాంలో బిల్లీరావుకు ఇచి్చన ఆ భూముల్ని నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ కాపాడితే సుప్రీంకోర్టులో పోరాడి ఆ భూముల్ని రేవంత్‌రెడ్డి వెనక్కి తెచ్చారని చెప్పారు. ‘రూ. 5,200 కోట్లు నీ ఫిగర్. మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి లేకుంటే ఆ భూములు బిల్లీరావుకు ఎప్పుడో వెళ్లిపోయేవి. ఇప్పుడు ఆ భూములు అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఇంత కడుపు మంట ఎందుకు? ఉద్యోగాలు రాకూడదా? రుణమాఫీ చేయకూడదా?’అని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ హయా ంలో ప్రభుత్వ భూములు అమ్మినప్పుడు కోకాపేటలో ఎకరం రూ. 100 కోట్లు పలికితే.. ఐఎస్బీ, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్, యాక్సెంచర్ లాంటి సంస్థల సమీపంలో అమెరికన్ కాన్సులేట్‌కు ఆనుకొని ఉన్న భూమి రూ. 75 కోట్లు పలకదా? అని ప్రశ్నించారు. ఆ భూమిపై రూ.10 వేల కోట్ల రుణ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ఇచ్చి రూ. 10 వేల కోట్లను బాండ్ల రూపంలో ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకుందని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీ, సన్న ధాన్యానికి బోనస్ కోసం ఉపయోగించిందన్నారు. కేటీఆర్ ఆరోపించిన రూ. 175 కోట్ల విలువైన టెండర్లు పిలిచి కన్సల్టెన్సీకి ఇచ్చామని.. అందులో కుంభకోణం ఎక్కడిదన్నారు. ఆనవాయితీగా టెండర్లు పిలిచి అధికారికంగా వైట్‌మనీ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఇచ్చామని చెప్పారు. సీబీఐ విచారణ జరపాల్సింది కేటీఆర్‌పైనే సీబీఐ విచారణ జరపాల్సింది నిజంగా కేటీఆర్ మీదేనని, దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కు వ ప్రజాధనాన్ని దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబమేనని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు
-
గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్.. పదివేల కోట్ల కుంభకోణం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాపు రూ.10వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందన్నారు. అటవీ భూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్థిక నేరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కాం చేస్తున్నారు. వాల్టా, ఫారెస్ట్ యాక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త గోల్‌మాల్‌కు తెర తీసింది.15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 3D మంత్రాను పెట్టుకున్నారు. HCUలో పర్యావరణ విధ్వంసం, హననం జరుగుతోంది. ఐఎంజీ కుంభకోణంపై ఆనాడు 2014 వరకు ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ కొట్లాడింది. ఈ భూముల వెనుక రూ.10వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. HCU చుట్టూ ఉన్న 400 ఎకరాలు అటవీ భూమి ఉంది. అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు.. అన్ని రాష్ట్రాల హై కోర్టులకు ఇచ్చింది. 1980 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అటవీ భూమి తాకట్టు పెట్టడానికి అమ్మేందుకు ప్రభుత్వానికి హక్కు ఉండదు.పోడు యాక్ట్ ప్రకారం ఆది అటవీ భూమి అని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. భూమిని అమ్మడానికి ముఖ్యమంత్రి దగ్గరికి బీజేపీ ఎంపీ ఒక ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ బ్రోకర్‌ను తెచ్చారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్త ద్వారా చట్టాలను, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. మ్యుటేషన్ కాలేదని ప్రభుత్వమే అంటుంది. TGIIC 400 ఎకరాలకు యజమాని కాదు. కేవలం ఒక GO ఆధారంగా TGIIC యజమాని అని ప్రభుత్వం చెబుతోంది. తనది కానీ భూమిని TGIIC తాకట్టు పెట్టే కుట్ర చేసింది.బ్రోకర్ ద్వారా కుమ్మకై లోన్..400 ఎకరాలకు యాజమాన్య పత్రాలు లేవు.. రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. 26.6.2024 GO-54 ఒక్కటే ఉంది.. తప్ప ఏమీలేదు. 400 ఎకరాలకు కమిషన్ టైటిల్ కూడా లేదు. కంచెలో గజం విలువ 26900 వందలు ఉంది.. 400 ఎకరాలకు 5239 కోట్ల విలువ మాత్రమే. అక్కడ ఎకరాకు 75 కోట్లకు అమ్మడానికి రెవెన్యూ శాఖ GO విడుదల చేసింది. రూ.5239 కోట్ల విలువైన భూమిని 30,000 వేల కోట్లుగా చిత్రీకరించారు. ప్రభుత్వం.. బ్రోకర్ ద్వారా కుమ్మకై బ్యాంకులో లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.75 కోట్లు అని బ్యాంకుల దగ్గరకు పోయి.. 15కోట్లకు అమ్మే కుట్ర చేశారు. రూ.169 కోట్లు బ్రోకర్‌కు కమీషన్ ఇచ్చారు. కోకాపేటలో భూములను చూపించి 75 కోట్లు ఎకరా అని ప్రభుత్వమే ధర చూపించారు. ఐదు నెలల్లో వ్యాల్యువేషన్ రివైజ్ చేసి 52 కోట్లకు తగ్గించారు. మళ్ళీ మూడోసారి 42 కోట్లకు కుదించారు. రూ.30వేల కోట్లు అని మొదట చెప్పి 16వేల కోట్లకు తగ్గించారు. ఢిల్లీ బ్రోకర్‌కు తనకా పెట్టే ప్రయత్నం చేశారు’ అని విమర్శలు చేశారు.బీకర్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థను ఏ బేసిస్ ప్రకారం ఎంపిక చేశారు?. బీజేపీ ఎంపీ చెప్పారని వడ్డీకి పావుచెరుగా అమ్మే కుట్ర చేశారు. నేను ఉరికే ఆరోపణలు చెయ్యడం లేదు.. దీన్ని వదిలిపెట్టను. RBI గవర్నర్, సెబీ, SFIO, సెంట్రల్ విజిలెన్స్, CBI, మా పార్టీ తరపున ఫిర్యాదు చేయబోతున్నాం. బీజేపీ ఎంపీ పేరు తర్వాత ఎపిసోడ్లో బయటపెడతాం. 10 వేల కోట్లకు ప్రభుత్వానిది కానీ భూమిపై ICICI బ్యాంకు లోన్ ఇచ్చారు.కేంద్రం స్పందించాలి..భూమిని ఫీల్డ్ పై చూడకుండా ICICI బ్యాంక్ ఇచ్చింది. 10వేల కోట్లు ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. రైతుభరోసా అన్నారు అది ఇవ్వలేదు. నేను రాసిన లేఖలపై కేంద్రం స్పందించకపోతే ఊరుకోం. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా జరిగింది అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే విచారణ మొదలు పెట్టాలి. సెబీ, సెంట్రల్ విజిలెన్స్, CBI విచారణ మొదలు పెట్టాలి. భూమిని చూడకుండా 10వేల కోట్లు లోన్ బ్యాంకు ఎలా ఇస్తుంది. HMDA భూములు 60వేల కోట్లు అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం. అవసరం అయితే ప్రధాని కలుస్తాం.. లోక్ సభలో లేవనెత్తుతాం’ అని కామెంట్స్ చేశారు. -
సర్కారు బరితెగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో వేలాది చెట్లను నరికి, జింకలను చంపి జీవ వైవిధ్యా న్ని విధ్వంసం చేస్తున్న తీరు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభు త్వం బరితెగింపు వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వందల ఎకరాల్లో చెట్ల నరికివేతకు బాధ్యులైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర సాధికార కమిటీ చైర్పర్సన్ సిద్దాంత్దాస్, సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్‌ను హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం కలిసింది. పర్యావరణ విధ్వంసంపై వినతిపత్రం సమర్పించింది. అనంతరం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవీ ప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు మీడి యాతో మాట్లాడారు.రేవంత్ మూడు జింకల చావుకు కారణమయ్యారు.. ‘హెచ్‌సీయూ భూముల్లో ఏడు చట్టాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది. వరుస సెలవు దినాలను అడ్డుపెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేసిన తీరును 11 పేజీల వినతిపత్రంలో వివరించడంతోపాటు 200 పత్రాలను కమిటీకి అందజేశాం. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు టీజీఐఐసీ పోలీసు విభాగానికి తప్ప ఏ ఒక్క ప్రభుత్వ శాఖకూ దరఖాస్తు చేయలేదు. పోలీసుల రక్షణలో జరిగిన విధ్వంసంతో మూడు జింకలు చనిపోగా, అనేక జంతువులు ఆవాసం కోల్పోయాయి. గతంలో జింకను వేటాడిన కేసులో సినీ నటుడు సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లాడు. మరి మూడు జింకల చావుకు కారణమైన రేవంత్‌పై ఏ తరహా చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.సుప్రీం తీర్పులను ఉల్లంఘించడమే‘అటవీ స్వభావం కలిగిన భూముల వివరాలు ఇవ్వాలని ఓ వైపు సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ భూ ములను తెగనమ్మే ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పట్ల కూడా రేవంత్‌కు భయం లేకుండా పోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా కంచ గచ్చిబౌలి భూములు టీజీఐఐసీకి చెందినవే అని బోర్డులు పె ట్టారు. గతంలో కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో గ్రీన్ ట్రిబ్యున ల్లో ఫిర్యాదు చేసి ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసిన రేవంత్ ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలి. పర్యావరణ విధ్వంసాన్ని ప్రశ్నించిన విద్యార్థులను పది రోజులుగా జైల్లో పెట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.169.84 కోట్లు బ్రోకర్‌కు చెల్లించింది’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ గురువారం కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద 400 ఎకరాల భూమిని సందర్శించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో టీఎన్జీవోల కాలనీకి వెళ్లే రోడ్డు మీదుగా లోపలికి వెళ్లిన కమిటీ..చదును చేసిన భూమి విస్తీర్ణం, చెట్ల కూల్చివేత, వన్యప్రాణులు, జీవ వైవిధ్యానికి జరిగిన నష్టానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులపై ఆయా విభాగాల అధికారులతో ఆరా తీసింది. రెండు గంటల పాటు అక్కడ పర్యటించింది. హెచ్‌సీయూలోని పీకాక్, బఫెల్లో లేక్ వరకు కమిటీ వెళ్లినట్లు సమాచారం. కాగా ఆ తర్వాత నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పర్యావరణవేత్తలు, పౌరసమాజం నుంచి వినతిపత్రాలు స్వీకరించింది. అనంతరం తాజ్‌కృష్ణ హోటల్లో..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యింది. బీఆర్ఎస్ నేతలు, బీజేపీ ఎంపీల నుంచి వినతిపత్రాలను స్వీకరించింది. ఈ నెల 16న సుప్రీంకోర్టులో ఈ భూములకు సంబంధించిన కేసు విచారణకు రానున్న నేపథ్యంలో..వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీ రాష్ట్రానికి వచ్చింది. ఫొటోలు, వీడియోలు తీసిన కమిటీ ! కమిటీ చైర్మన్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారి సిద్ధార్థ దాస్, సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్, సునీల్ లేహమనయ్య, చంద్రదత్లు భూములు సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్, సభ్యులు.. చెట్ల నరికివేతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకున్నట్టు తెలిసింది. ఉదయం 11.30 గంటల వరకు కమిటీ అక్కడ ఉంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఐఏఎస్ అధికారి శశాంక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు రాకేష్ కుమార్ డోబ్రియాల్, ఏలూసింగ్ మేరు, ప్రియాంక వర్గీస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్థన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హెచ్ఎండబ్ల్యూఎస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు వారి వెంట ఉన్నారు. అక్కడ వారిని హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పౌర సమాజానికి చెందిన వారు కలుసుకునేందుకు పోలీసులు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎంసీహెచ్ఆర్డీలో విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలతో కమిటీ సమావేశమయ్యింది. వాదనలు వినిపించిన విద్యార్థులు, ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో చెట్లను నరికేశారని, వన్యప్రాణులకు నష్టం జరుగుతోందని వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, అధ్యాపకులు కమిటీ దృష్టికి తెచ్చారు. కాగా వివాదం నెలకొన్న భూమి హెచ్‌సీయూది కాదని, ప్రభుత్వ భూమి అని, అటవీ ప్రాంతం కాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కమిటీకి పలు డాక్యుమెంట్లను సమర్పించినట్టు తెలిసింది. పీకాక్, బఫెల్లో లేక్‌లు 400 ఎకరాల్లో లేవని చెప్పినట్లు తెలిసింది. గతంలో యూనివర్సిటీ నుంచి భూములు తీసుకుని ఐఎంజీ భారత్‌కు కేటాయించడం, ఆ తరువాత సుదీర్ఘ న్యాయ పోరాటం, న్యాయస్థానాలు ఆ భూమి ప్రభుత్వానిదేనని తీర్పులిచ్చిన విషయాన్ని సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు కమిటీకి వివరించారు.కాగా చెట్లు నరకడానికి అనుమతులు తీసుకున్నారా? అని కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది. అడవికి సంబంధించిన వివరాలు కచ్చితంగా చూపించకపోవడంపై అటవీ అధికారులను కమిటీ తప్పుపట్టినట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా కమిటీ ముందు వేర్వేరుగా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వాదనలు విని్పంచారు. హెచ్‌సీయూ లోని 400 ఎకరాల భూమిని పరిరక్షించాలని, అక్క డున్న చెట్లు, జీవవైవిధ్యాన్ని కాపాడే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తాము మరోసారి ఈ భూముల పరిశీలనకు వస్తామని, ఇదే చివరిసారి కాదని కమిటీ చెప్పినట్టు విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. కమిటీకి ఆ భూముల్లో ఉన్న పక్షులు, జంతువులు చెట్ల వివరాలు ఇచ్చామని హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎ.ఉమేష్ అంబేడ్కర్ తెలిపారు. తాము చెప్పినవి అక్కడ ఉన్నట్టుగా కమిటీ సభ్యులు అంగీకరించారని చెప్పారు. ఈ భూముల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీ కి అందజేశామని ఏబీవీపీ నేత బాలకృష్ణ తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్లో సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ జయేుశ్ రంజన్, డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజనతో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు కమిటీతో సమావేశమయ్యారు. -
జింకల మృతికి కారణమైన వారిపై చర్యలేవీ?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నియమ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని ఆధారాలతో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులతో సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశామన్నారు. రైతు ఒక్క చెట్టు కొడితే కేసు నమోదు చేస్తున్నారు.. రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా?’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘కంచె చేను మేసినట్టిగా ప్రభుత్వం వేలాది చెట్లు నరికివేసింది. వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టా యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించింది. మూడు జింకలు చనిపోయాయి. వన్య ప్రాణుల గూడును చెదరగొట్టారు. జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ? పర్యావరణ విధ్వoసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా?. ప్రైవేట్ భూమి అయినా అందులో చెట్లు పెరిగితే అందులో వన్య ప్రాణులు గూడు ఏర్పాటుచేసుకుంటే అది అటవీ భూమిగా పరిగణిస్తారు. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. అందులో చెట్లు ఉంటే అది అటవీ భూమిగానే పరిగణిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కంచ గచ్చిబౌలిలో చెట్లు నాటారు’’ అని హరీష్‌రావు గుర్తు చేశారు.హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సెలవు దినాలు చూసుకుని మరి జేసీబీలతో చెట్లు నరికివేశారు. కంచ గచ్చి బౌలి భూములు హెచ్‌సీయూ అధీనంలో ఉందని గతంలోనే ఆర్డీవో, కలెక్టర్ కలెక్టర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ ఈ భూమిని మాడ్యూగేట్ చేసి 10 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్‌కు 169 కోట్ల 83 లక్షలు చెల్లించారు. ఈ భూములను అమ్మి సీఎం రేవంత్ 40 వేల కోట్లు తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నం’’ అంటూ హరీష్‌రావు ఆరోపించారు.సుప్రీoకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతుంది. నిన్న సాయంత్రం టీజీఐఐసీ భూమి అని బోర్టులు ఏర్పాటు చేశారు. కంచ భూముల విధ్వంసంలో పోలీస్ శాఖ పాత్ర కూడా ఉంది. గతంలో కొత్త సచివాలయం నిర్మించే సమయంలో చెట్లు నరకొద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్లిన రేవంత్‌కు ఇన్ని చెట్లు నరకొద్దూ అని తెలియదా?. యూనివర్సిటీ భూములు తమకే చెందాలని విద్యార్థులు అడిగితే వారిపై కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం శాశ్వతo కాదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా హెచ్‌సీయూ భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు.అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల, మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ను కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరికివేతకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాంటి పోస్టులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరగా, కౌంటర్ దాఖలు చేస్తే పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వంతోపాటు, అటవీ, రెవెన్యూ, పోలీసు విభాగాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని ఆపాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటవీ శాఖ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి హాజరై.. ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చేలా తప్పుడు ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని చెప్పారు. కృత్రిమమేధ (ఏఐ)తో ఫేక్ ఫొటోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియాలో పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు పిటిషనర్ కాదు కదా.. ప్రతివాది కనుక, మీ వాదనలతో కౌంటర్ దాఖలు చేయండి.. పరిశీలించి ఆదేశాలు జారీ చేస్తాం’అని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇతర ప్రతివాదులను కౌంటర్ వేయాలని చెప్పింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేస్తోందని, తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసిందని చెప్పారు. ఒకేసారి ఇరుకోర్టులు విచారణ జరపడం సరికాదని, వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం పాత పిల్లకు అటాచ్ చేసింది. -
గచ్చిబౌలి భూములు.. ప్రతివాదులకు హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్బంగా ఈనెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు వ్యాజ్యంలో కోరారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్ఎస్ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.1975లో రాష్ట్ర ప్రభుత్వమే 2300 ఎకరాలు కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని ‘ఐఎమ్జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు.ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్‌లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్‌లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్‌జెడ్ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్‌లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హెచ్‌సీయూ వివాదం.. కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ రక్షణకు చేతులు కలపాలంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీరును లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.‘‘ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తోంది. విద్యార్థుల నిరసనకు సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూని "ఫోర్త్ సిటీ"కి తరలిస్తామని హెచ్చరిక తప్పు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడుతామని పార్టీ నుంచి హామీ హామీ ఇస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఫేక్ ప్రచారంపై కోర్టుకెళ్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వివాదం తరహాలో ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైం విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏఐతో తయారైన ఫేక్ కంటెంట్‌ను పసిగట్టేలా అధునాతన ఫోరెన్సిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. సమాజాన్ని తప్పు దోవ పట్టించేలా ఉన్న ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించడంపై ఈ భేటీలో ఆందోళన వ్యక్తమైంది. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా... ‘ఏఐ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడంతో కంచ గచ్చి»ౌలి భూముల వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో దేశమంతా వైరల్ కావడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లు ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీసినట్లు నకిలీ ఫొటోలు, వీడియోలు తయారు చేశారు. ప్రముఖులు సైతం వాటిని నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా టండన్ లాంటి వాళ్లంతా ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టులను చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారు. ఈ భూములపై తొలుత నకిలీ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కాసేపటికే పోస్టును తొలిగించి క్షమాపణ చెప్పారు. మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారు’అని అధికారులు సీఎంకు వివరించారు. ఏఐతో ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు: పోలీసులు ‘కంచ గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్ విసిరింది. భారత్–పాక్, భారత్–చైనా సరిహద్దుల్లో వివాదాలు, ఘర్షణలకు దారితీసేలా ఇదే తీరిలో సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంటుంది. ఏఐతో తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారి లాంటివి’అని పోలీసు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు లేని వివాదం ఇప్పుడెందుకు? ‘కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని భూముల్లో గత 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్బీతోపాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు భవంతులు, అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలు నిర్మించారు. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదు’అని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందన్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. -
తెలంగాణ తాజా పరిస్థితులపై ఏఐసీసీ ఫోకస్.. రంగంలోకి మీనాక్షి నటరాజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాజా పరిస్థితులపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మంత్రుల కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మీనాక్షి చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్‌కు మీనాక్షి నివేదిక ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, హెచ్‌సీయూ భూముల అంశంపై ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలతో కమిటీ వేశామని తెలిపారు. మంత్రివర్గ కమిటీతో ఇదే అంశం మీద చర్చిస్తున్నామని చెప్పారు. ఏకపక్షంగా కాకుండా అందరి వాదనలు వింటామని.. ఏం చేయాలనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి అనే వివరాలు ప్రకటిస్తామని ఆమె తెలిపారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని.. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. -
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది.కంచ గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్ లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్‌లను నిర్మించారని.. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వచ్చారు.అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు సీఎంకి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు.ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందని చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు -
వర్సిటీ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు
-
పనులు ఆపేయండి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా స్టే విధించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని అమికస్ క్యూరీ పరమేశ్వర్ గురువారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. వారాంతం సెలవులను సద్విని యోగం చేసుకుని అధికారులు చెట్లను నరికివేయడంలో తొందరపడ్డారని అభిప్రాయపడింది. తక్షణమే ఆ భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతను అనుమతించకూడదని సీఎస్‌ను ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక అందిన అనంతరం 3.45 గంటలకు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది గౌరవ్ అగర్వాల్, భూముల విషయంలో ఆందోళన చేస్తున్న వారి తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్ వాదనలు వినిపించారు. అటవీ ప్రాంతం కాదు: ప్రభుత్వ న్యాయవాది కంచ గచ్చిబౌలిలో ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రదేశం అటవీ ప్రాంతం కాదని, 30 సంవత్సరాలుగా ఆ భూమి వివాదంలో ఉందని గౌరవ్ అగర్వాల్ చెప్పారు. అటవీ భూమి అని చెప్పేందుకు ఆధారాలు లేవని అన్నారు. దీంతో.. ‘ఒకవేళ అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేందుకు అనుమతి తీసుకున్నారా? కేవలం 2, 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్ల నరికివేత తీవ్రమైన అంశం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా చట్టానికి అతీతం కాదు.’ అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికీ విచారణ జరుగుతోందన్నారు. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని గోపాల్ శంకర నారాయణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నెలరోజుల్లో నిపుణుల కమిటీ వేయాలి చెట్ల నరికివేతపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) సమర్పించిన నివేదికలోని అంశాలపై ధర్మాసనం ది్రగ్బాంతి వ్యక్తం చేసిసింది. ‘పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేసి, భారీ యంత్రాలను ఉపయోగించి వందలాది ఎకరాలను అస్తవ్యస్తం చేశారు. ఈ విధ్వంసకాండ వల్ల నెమళ్లు, జింకలు ఈ ప్రాంతం నుంచి పారిపోయినట్లు చూపించే చిత్రాలు నివేదికలో ఉన్నాయి. దీనికి తోడు అక్కడ ఒక చెరువు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రిపోర్టులో పొందుపర్చిన చిత్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఈ ప్రాంతం అడవి జంతువుల నివాసానికి అనువుగా ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. అటవీ భూములు గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేయకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సివస్తుందంటూ..ఓ కేసులో మార్చి 4న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నామని ధర్మాసనం గుర్తుచేసింది. అటవీ భూములను గుర్తించే చట్టబద్ధమైన కసరత్తు ఇంకా ప్రారంభం కానప్పుడు, చెట్లను నరికివేసేందుకు ఉన్న ‘అంత ఆందోళనకరమైన ఆవశ్యకత’ ఏంటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో నెలరోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఆ కమిటీ ఆరు నెలలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే.. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి ఈ నెల 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘ఆ ప్రాంతంలో చెట్లను తొలగించడం వంటి కార్యకలాపాలను చేట్టపట్టాల్సిన అవసరం ఏంటి? చెట్ల నరికి వేత కోసం అటవీ అధికారుల నుంచి కానీ మరేదైనా స్థానిక చట్టాల కింద కానీ అనుమతులు తీసుకున్నారా? నరికివేసిన చెట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?..’ తదితర ప్రశ్నలకు జవాబులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల ‘కంచ గచ్చి బౌలి’ భూమిని, రేవంత్ రెడ్డి సర్కార్ వేలానికి పెట్టింది. వేలం వద్దని విద్యార్థులు జేఏసీగా ఏర్పడి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉగాది పండగ రోజున ఆ ప్రాంతపు చెట్లను తొలగించి, మట్టిని చదును చేయడానికై 50 భారీ బుల్డోజర్లు, పొక్లైన్లతో, వందలాది మంది పోలీసులు ఆ భూమిలోకి వెళ్లారు. వాటిని అడ్డుకోవడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. జుట్టు పట్టి ఈడ్చి వాహనాల్లో పడేశారు. 200 మందిని, 4 పోలీస్ స్టేషన్లకు తరలించారు. చివరికి ఈ వ్యవహారం దేశ అత్యు న్నత న్యాయస్థానానికి చేరడంతో జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఆదేశాలు జారీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను 100 కోట్లకు ఎకరం అమ్మింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి పూనుకున్న కంచ గచ్చి బౌలి భూమి ఎకరాకు 100 కోట్ల పైమాటే. 400 ఎకరాలను వేలం వేస్తే 40 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం దృఢంగా భావించింది.అందుకే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తీవ్ర హింసకు పూనుకుంది. తద్వారా ఎన్నికల ప్రణాళి కలో ఇచ్చిన 7వ హామీ ‘ప్రజాస్వామ్య హక్కుల రక్షణను పాతిపెట్టినట్లే’!‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బడా సంపన్నుల సమష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే’ అని ఒక జర్మన్ తత్వ వేత్త అంటారు. అంటే సామాన్య మెజారిటీ ప్రజలు కేంద్రంగా ప్రభుత్వాలు పనిచేయవని ఉద్దేశం. హెచ్‌సీయూ భూములను అమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ పరిశ్రమ లను అమ్ముతున్న మోదీ ప్రభుత్వ విధానాలకు పైవాక్యం సరిగ్గా సరిపోతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ లను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు అమ్ముతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను బడా కార్పొరేట్లకు అమ్మకానికి పూనుకుంది. ఇది ఈ దేశ విద్యార్థుల వైజ్ఞానిక భవిష్యత్తుకు విద్రోహం తలపెట్టడమే! ఉన్న ప్రభుత్వ వనరులను తెగనమ్మడానికి బదులు.... ప్రత్యామ్నాయంగా మోదీ–రేవంత్ బడా సంపన్నులపై ‘ప్రగతిశీల పన్ను’ ఎందుకు వేయకూడదు? అవినీతి సొమ్మును, లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రజల ప్రయోజనం కొరకు వెలికి తీసి, ఎందుకు వినియోగించకూడదు?పాలకులు ప్రజల ఆస్తులు అమ్మడమే ఏకైక పనిగా సాగుతున్నారు. దశాబ్దాలుగా పథకం ప్రకారం విశ్వవిద్యాలయం భూములకు కోత విధిస్తున్నారు. కేసీఆర్... ప్రభుత్వ భూములను అమ్మితే దునుమాడిన రేవంత్ రెడ్డి... అదే పనికి ఇప్పుడు పూనుకున్నారు. ఈ చర్య అక్కడి జీవా వరణ – పర్యావరణ స్థితిని నాశనం చేస్తుంది. హెచ్‌సీయూ వెల్లడించిన సమాచారం ప్రకారం 734 రకాల పూల మొక్కలు, 10 క్షీరద జాతులు, 15 రకాల సరీసృపాలు, నెమళ్లు లాంటి 220 రకాల పక్షులు, రెండు చెరువులు ఇక్కడ ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పోలి ఉండే ప్రకృతి సిద్ధమైన భారీ బండరాళ్ల అమరికలు ఈ 400 ఎకరాలలో ఉన్నాయి. ఈ ప్రకృతి వైవిధ్యాన్నీ, దేశ భవిష్యత్తునూ ప్రభుత్వం విధ్వంసం చేయతల పెట్టింది. విశ్వవిద్యాలయ భూమిలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని బుకాయిస్తోంది. ఇటీవలే చైనాలో మన హెచ్‌సీయూ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులే ‘డీప్ సీక్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను, అతి చౌకగా ఆవిష్కరించారు. అమెరికా టెక్ ఆధిపత్యాన్ని కూల్చారు. భూములను అమ్మడం కంటే, ప్రపంచ ప్రమాణా లతో కూడిన, ఆధునిక మానవ అవసరాలను నెరవేర్చే చదు వులు మరింత భారీ డబ్బును సమీకరిస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో నెలకొల్పుదామనే ప్రపంచ కంపెనీలు, ఈ విశ్వ విద్యాలయాల్లో చదివిన విద్యా ర్థులు సృష్టించే సంపద కంటే గొప్పవేం కాదు. ‘అక్కడ పులులు జింకలు లేవు. కొన్ని నక్కలు మాత్రమే అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తున్నాయి. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చ గొడుతున్నాయ’ని ముఖ్య మంత్రి మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. గురువారం (ఏప్రిల్ 3వ తేదీ) సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం అసలు అది అటవీ భూమికాద’ని బుకాయించడమూ తెలిసిందే. ప్రభుత్వ విలువైన భూములను, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారా దత్తం చేయకూడదని 2012 సెప్టెంబర్ 14న విడుదలైన జీఓఎమ్ఎస్ నం. 571 స్పష్టంగా చెబుతోంది. వనరుల సమీకరణ కొరకు ప్రభుత్వ భూములను అమ్మడం, వేలం వేయడం వల్ల భూమి తీవ్రంగా తగ్గిపోయి అన్యాక్రాంతమవు తుంది. దీనివల్ల సమాజ భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఈ జీవో పేర్కొంటున్నది. ప్రభుత్వ భూముల వినియోగం, అత్యంత శాస్త్రీయంగా న్యాయబద్ధంగా ఉండాలని ఈ జీఓ చెబుతోంది. ప్రజల ప్రయోజనం కొరకే భూములను కేటాయించాలి. ఆ భూమి వల్ల వచ్చే భవిష్యత్ ప్రయోజనాలన్నీ ప్రజలకే చెందాలి. ప్రజా ప్రయోజనాలకు ఇవ్వ వలసి వస్తే బంజరు భూములను, డ్రై ల్యాండ్స్‌ను మాత్రమే కేటాయించాలి. రెండు పంటలకు సాగు నీటి వసతి గల భూములను అసలు కేటాయించడానికి వీలు లేదు. పర్యావరణపరంగా సున్నితమైన భూములను, ట్యాంక్ బెడ్స్‌ను, రివర్ బెడ్స్‌ను, కొండలను, అడవులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు. ప్రభుత్వ భూము లను, నిధుల సమీకరణ కొరకు, ఎట్టి పరిస్థితులలో వేలం వేయరా దని ఈ జీఓ స్పష్టం చేస్తోంది.హెచ్‌సీయూ భూమి పర్యావరణపరంగా సున్నితమైంది. హైదరాబాద్ మహానగరానికి ఊపిరితిత్తి లాంటిది. నీరు ఇంకడానికి భూగర్భ నీటిమట్టాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడుతోంది. ఇంత విలువైన భూములను, ప్రైవేట్ బడా కంపెనీలకు ధారాదత్తం చేయడం భావ్యమా? ఈ సంగతులన్నింటినీ గ్రహించింది కాబట్టే సుప్రీం కోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఈ భూముల్లో ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలనూ నిర్వహించకుండా స్టే విధించింది. ఈ నెల 16న తిరిగి ఈ కేసుపై వాదనలు వింటామనీ, అప్పటికి ఈ భూములపై సమగ్ర నివేదికను తయారుచేసి తమకు సమర్పించాలనీ ఆదేశించింది. ఈ ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని వేరే చెప్పనవసరం లేదు కదా!నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ ‘ 97013 81799 -
HCU విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం: భట్టి
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దుందుడుకుగా వ్యవహరించవద్దని సూచనలు చేశారు. అలాగే, హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘గతంలో చంద్రబాబు బిల్లి రావుకు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెట్టాడు. భారత్ ఐఎంజీ బోగస్ కంపెనీ అని నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ భూములను రద్దు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడారు. ఆ వెంటనే భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకుండా, ప్రైవేటు వారికి లాభం కలిగేలా ఉపేక్షించింది. ప్రైవేటు వారికే ఆ భూములు కట్టబెట్టేలా బీఆర్ఎస్ పని చేసింది. మేం అధికారంలోకి రాగానే హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాటం చేసి 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగింది. ఆ భూములతో హైటెక్ సిటీ ప్రాజెక్టును విస్తరించి ఐటీ కంపెనీలకు అప్పగిస్తాం. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా మేము తీసుకోము. పర్యావరణాన్ని, జీవజాలాన్ని కాపాడుతాం. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తాం. విద్యార్థులపై పోలీసులు అనుచితంగా వ్యవహరించవద్దు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడున్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారు. అభివృద్ధి కోసమే భూములను వినియోగిస్తాం. హెచ్సీయూకు ఇప్పటికే వేరే భూములను బదలాయించారు’ అని చెప్పుకొచ్చారు. -
విద్యార్థుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదు
-
HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్ క్యూరీని రిట్ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది.