
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాలు తీసింది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో యువకులు గల్లంతయ్యారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు.
మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)గా గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే. మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థుల గల్లంతుపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్‌రావు
కొండపోచమ్మ సాగర్ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
Comments
Please login to add a commentAdd a comment