Dam
-
శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాల ప్రవాహం పెరిగింది. శ్రీశైలానికి జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,47,682 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో శుక్రవారం 6 గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు 1,67,076 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 212.91 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం స్పిల్‌వే, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయానికి 2,04064 క్యూసెక్కులు జలాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి 20 క్రస్ట్ గేట్లు ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,61,800 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 28,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ఏఎమ్మారీ్ప, వరద కాల్వల ద్వారా 13,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1,31,803 క్యూసెక్కులు వస్తుండగా 202 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. మిగులుగా ఉన్న 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. శాంతిస్తున్న గోదావరి ధవళేశ్వరం: ఉరకలెత్తిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.10 అడుగులకు చేరింది. గురువారం రాత్రి 11.75 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం క్రమేపీ పెరుగుతూ శుక్రవారం ఉదయానికి 12.30 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటలకు స్వల్పంగా తగ్గింది. కాటన్ బ్యారేజీ నుంచి 10,36,440 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. డెల్టా కాలువలకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ∙ఆరు గేట్ల ద్వారా 1,67,076 క్యూసెక్కులు విడుదల ∙ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,31,601 క్యూసెక్కులు సముద్రంలోకి -
డ్యామ్ తెగి 60 మంది మృతి, వంద మందికి పైగా గల్లంతు!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈస్ట్రన్ రెడ్ సీ ప్రాంతంలో ఒక డ్యామ్ తెగిపోవడంతో పలువురు మృతిచెందారని, లెక్కలేనంతమంది గల్లంతయ్యారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందారని, 100 మంది గల్లంతయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎడతెగని భారీ వర్షాలకు అర్బత్ డ్యామ్ తెగిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతిచెందారనేది ఇంకా తెలియలేదు. పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. స్థానిక అధికారి ఒకరు సుడానీస్ వార్తా వెబ్సైట్ అల్-తాగిర్తో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందివుండవచ్చని, లెక్కలేంతమంది గల్లంతైవుంటారని అన్నారు. ఈ ప్రమాదం కారణంగా జరిగిన నష్టం తీవ్రవమైనదని నీటిపారుదలశాఖ అధికారి అమర్ ఇసా తాహిర్ మీడియాకు తెలిపారు.సూడానీస్ వార్తా సంస్థ మెదామిక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు. సమీప గ్రామప్రజలు కొండలపైకి చేరుకుని తలదాచుకున్నారని తెలుస్తోంది. ఈ డ్యామ్ పోర్ట్ సూడాన్ నగరానికి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం శనివారం రాత్రి ఈ డ్యామ్ కూలిపోయింది. సూడాన్‌లో ప్రతి ఏటా వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సంభవిస్తున్న వరదలకు వందలాది మంది మృతి చెందగా, పెద్ద ఎత్తున పంటనష్టం ఏర్పడింది.🇸🇩 SE COLAPSA PRESA DE JOR ARBAAT EN SUDÁNAl menos 60 personas perdieorn la vida ahogadas, luego de registrarse el colpaso de la presa de #JorArbaat, ubicada al este de #Sudán, que terminó por inundar al menos 5 pueblos con 5,000 habitantes cada una.Según reportan, la presa… pic.twitter.com/TH5eS6ePps— 𝗧𝗵𝗲 𝗠e𝘅𝗶𝗰𝗼 𝗣𝗼𝘀𝘁 (@MexicoPost) August 27, 2024 -
శ్రీశైలం, సాగర్ జలాశయాల గేట్లు మూసివేత
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల గేట్లను సోమవారం సాయంత్రం మూసివేశారు. కృష్ణా బేసిన్లో వర్షం తగ్గడంతో జూరాలలో గేట్లను మూసివేయడంతోపాటు విద్యుత్ ఉత్పాదనను కూడా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో సుంకేసుల బ్యారేజీకి ఓవర్‌ఫ్లో ప్రవాహం పెరిగింది. సుంకేసుల నుంచి శ్రీశైలానికి 77,598 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ప్రవాహంతోపాటు దిగువకు విడుదలవుతున్న నీరు, డ్యాం గరిష్టస్థాయి నీటిమట్టాన్ని బేరీజు వేసుకుని ఇంజనీర్లు శ్రీశైలం గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం సమయానికి డ్యాం నీటిమట్టం 881.20 అడుగులు కాగా, 194.3069 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా నాగార్జునసాగర్ జలాశయంలో 588.80 అడుగులు నీటిమట్టంతో 308.4658 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 47,035 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి మళ్లీ సాగర్ రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది.‘తుంగభద్ర గేటుకు వెంటనేమరమ్మతులు చేయాలి’ సాక్షి, అమరావతి: తుంగభద్ర ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు, సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి, కౌలు రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి నీరంతా వృథాగా పోతుండడంతో ఈ రెండు జిల్లాల్లోని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. -
భారత్‌పై చైనా వాటర్ బాంబ్!
బీజింగ్: చైనా మనపై మరో కుయుక్తికి దిగుతోంది. తన అధీనంలోని టిబెట్ గుండా భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్కేంద్రం, డ్యామ్‌ను నిర్మించాలని తలపోస్తోంది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు తాగు, సాగు నీటి కష్టాలు తప్పవు. అంతేకాదు, యుద్ధమే వస్తే డ్యామ్‌ను నింపేసి ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తి భారత్‌లో పలు ప్రాంతాలను వరదతో ముంచెత్తే కుట్ర ఇందులో దాగుందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడివంది. ‘జల రాజకీయాలు: భారత్, చైనా భద్రతా పోరులో బ్రహ్మపుత్ర పాత్ర’ పేరిట ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. ‘‘బ్రహ్మపుత్ర జలాలు అరుణాచల్ వద్ద భారత్‌లోకి మహోధృతంగా ప్రవహిస్తాయి. అక్కడే భారీ డ్యామ్‌కు చైనా ప్లాన్ చేస్తోంది. విద్యుదుత్పత్తి కోసమని చెబుతున్నా ప్రాజెక్టు నీటిమట్టం, నిల్వ, కిందకు వదిలే సమయం, పరిమాణం వంటి సమాచారాన్ని భారత్‌తో చైనా పంచుకునే అవకాశాల్లేవు. కనుక ఒక్కసారిగా వచ్చిపడే వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు, తగు ఏర్పాట్లు చేసుకునేందుకు భారత్‌కు అస్సలు సమయం ఉండదు. ఇలా డ్యామ్‌తో భారత్‌పైకి వాటర్‌బాంబ్‌ను చైనా గురిపెడుతోంది’’ అని పేర్కొంది. -
3 గేట్లు ఎత్తిన అధికారలు
-
మహారాష్ట్రలో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం
పుణె: మహారాష్ట్రలో ప్రముఖ పర్యాటక ప్రాంతం భూషీ ఆనకట్ట దిగువన ఉన్న జలపాతంలో వద్ద ఒక కుటుంబం కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో వరదనీటి ప్రవాహం జలపాతం వద్ద పోటెత్తింది. హదాప్సార్ నుంచి వచి్చన అన్సారీ కుటుంబం ఇదే సమయంలో జలపాతం వద్ద ఉంది. ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 36 ఏళ్ల శహిష్ట అన్సారీ, 13 ఏళ్ల అమీమీ, ఎనిమిదేళ్ల ఉమేరాల మృతదేహాలను దిగువన కనుగొన్నారు. ఇద్దరి జాడ గల్లంతైంది. -
నేడు తెలంగాణకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది. మళ్లీ 9న హైదరాబాద్‌లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది. ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్‌లపై శ్రీరామ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్‌పూల్‌తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్‌ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
పాక్‌కు రావి నది నీటిని ఆపేసిన భారత్
పాకిస్తాన్ వైపు వెళ్లే రావి నది నీటిని ఎట్టకేలకు భారత్ నిలిపివేసింది. డ్యామ్‌ను నిర్మించి, రావి నది నీటి ప్రవాహం పాకిస్తాన్ వైపు వెళ్లకుండా భారత్ నిలువరించింది. ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో 1960లో సంతకం చేసిన ‘ఇండస్ వాటర్ ట్రీటీ’ ప్రకారం రావి జలాలపై భారతదేశానికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోని షాపూర్ కంది బ్యారేజీ.. జమ్ము కశ్మీర్, పంజాబ్ మధ్య వివాదం కారణంగా నిలిచిపోయింది. ఫలితంగా గత కొన్నేళ్లుగా భారత్‌కు చెందిన నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌కు వెళుతోంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉండగా, సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నాయి. 1979లో పంజాబ్, జమ్ము కశ్మీర్ ప్రభుత్వాలు రంజిత్ సాగర్ డ్యామ్‌తో పాటు దిగువన ఉన్న షాపూర్ కంది బ్యారేజీని నిర్మించడానికి, పాకిస్తాన్‌కు జలాలను ఆపడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై నాటి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా, అతని పంజాబ్ కౌంటర్ ప్రకాష్ సింగ్ బాదల్ సంతకం చేశారు. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి దీనిని పూర్తి చేయాలని భావించారు. 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాగా, షాపూర్ కంది బ్యారేజీని నిర్మించలేక పోవడంతో రావి నది నీరు పాకిస్తాన్లోకి ప్రవహిస్తూనే ఉంది. షాపూర్ కంది ప్రాజెక్టును 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా, 2013లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్ మధ్య వివాదాల కారణంగా 2014లో ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఆగిపోయింది. 2018లో కేంద్రం మధ్యవర్తిత్వం వహించి, ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని తర్వాత డ్యాం పనులు ప్రారంభమై, ఎట్టకేలకు పూర్తయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబాలకు ఇకపై సాగునీరు అందనుంది. ఇన్నాళ్లూ ఈ నీరు పాకిస్తాన్‌కు తరలిపోయింది. ఇకపై 1,150 క్యూసెక్కుల సాగునీరు 32,000 హెక్టార్ల భూమికి అందనుంది. జమ్ముకశ్మీర్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్‌లకు కూడా ఈ డ్యామ్ నీరు ఉపయోగపడనుంది. -
నేడు రాష్ట్రానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం
-
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. -
‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. లోపాలు ఉంటే మూడు సీజన్లు తట్టుకునేది కాదు కదా!. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం’’ అని ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద శబ్దంతో కుంగుబాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ శనివారం రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం ఆందోళన రేకెత్తించింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఆపై కేంద్రం తరపున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. -
ఆల్మట్టిలో పెరిగిన వరద ఉద్ధృతి
సాక్షి,అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్‌లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్‌లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్‌లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నేరు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బ్యారేజ్‌కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సంగమేశ్వరుడి సన్నిధికి.. కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. -
ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి
ప్రస్తుతం భారత్‌లోని ఉత్తరాది ప్రాంతం భారీ వర్షాలకు, వరదలకు వణుకుతుండగా, చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్ సిటీ నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదేవిధంగా చైనాలోని చోంగ్‌కింగ్ నగర పరిధిలో 9,700 మంది తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మీడియా ఏజెన్సీ షిన్హువా తెలిపిన వివరాల ప్రకారం చోంగ్‌కింగ్ పరిధిలోని 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వాన్‌ఝోవూలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాన్‌ఝోవూ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 300 హెక్టార్లలోని పంటపొలాలు నీట మునిగాయి. ఇళ్లు నీట మునగడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని రెస్క్యూ బృందాలు కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇది కూడా చదవండి: ‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు! -
‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
టిబెట్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్‌ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా.. ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై.. బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్‌లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు). ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ.. ‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’ యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్‌ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్‌లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్‌లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ.. ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్‌లోని మబ్జా జాంగ్బో (త్సాంగ్పో) నదిపై భారత్-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్‌కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్‌కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. చైనా ధోరణిపై భారత్ అప్రమత్తం 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్‌తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్‌తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! -
అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..
అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్, ఛిరంజ్, ధేమాజీ, దిబ్రుగర్హ్, కోక్రజార్హ్, నల్బరి, టిన్సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అయితే.. తూర్పు భూటాన్‌లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది. దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. The Royal Government of Bhutan has informed us that tonight there will be an excess release of water from the Kurichu Dam. We have alerted our district administrations to remain vigilant and assist the people in every possible way in case the water breaches the Beki and Manas… — Himanta Biswa Sarma (@himantabiswa) July 13, 2023 అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు. ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
ఉక్రెయిన్‌లో కూలిపోయిన భారీ డ్యామ్.. పలు ప్రాంతాలు జలమయం (ఫొటోలు)
-
Russia-Ukraine war: ఆగని కన్నీటి వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): నీపర్ నదిపై కఖోవ్కా డ్యామ్ పేలుడుతో కొత్త మలుపు తీసుకున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న జనం ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో పొట్టచేతపట్టుకుని ప్రాణభయంతో పరుగుపెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం జనాలను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్ వ్లాదిమిర్ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్ ఫోన్ నెట్వర్క్ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వండి: జెలెన్స్కీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్లైన్లో ఒక డిమాండ్ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ చెప్పారు. నీపర్ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది. ఇది విధ్వంసకర దాడే: మేక్రాన్ ‘డ్యామ్‌ను కూల్చేయడం ముమ్మాటికీ విధ్వంసకర దాడే. అరాచక చర్య ఇది’ అని ఏ దేశాన్నీ ప్రస్తావించకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్‌చేశారు. వాటర్ ప్యూరిఫయర్లు, 5,00,000 ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, శుభ్రతా కిట్లు పంపిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ‘డ్యామ్ కూలడానికి మూడు రోజుల ముందు 200 సైనిక వాహనాలు, 2,000 మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామ్‌ను ఉక్రెయినే కూల్చింది’ అని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆరోపించారు. -
ఉక్రెయిన్ను ముంచెత్తిన వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దురాక్రమణకు దిగాక ఇన్నాళ్లూ బాంబుదాడులకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని వలసపోయిన జనం ఇప్పుడు వరదరూపంలో వచ్చిన జలఖడ్గం దాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీపర్ నదీ ప్రవాహంపై నిర్మించిన కఖోవ్కా ఆనకట్ట, జలవిద్యుత్ ప్లాంట్‌పై బాంబుల వర్షం నేపథ్యంలో డ్యామ్ బద్దలై వరదనీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరు ఇళ్లపైకి ఎక్కి అక్కడే గడిపారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ మొదలుపెట్టి స్థానిక పాలనా యంత్రాంగాలు పౌరులను వేరే చోట్లకు హుటాహుటిన తరలిస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ఆవిష్కతమయ్యాయి. దొరికింది తీసుకెళ్తూ ఏదో ఒకదాంట్లో వలసపోతూ.. చేతికందినంత నిత్యావసర వస్తువులు తీసుకుని మిలటరీ ట్రక్కులు, రాఫ్ట్‌లపై ఎక్కి జనం ఓవైపు వలసపోతుంటే శతఘ్ని పేలుళ్ల చప్పుళ్లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఇంకొందరు బస్సుల్లో, రైళ్లలో వెళ్లిపోయారు. డ్యామ్ కుప్పకూలి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దాడికి కారకులు ఎవరో తెలియరాలేదు. మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యాలు పరస్పర దూషణలు మాత్రం ఆపట్లేవు. కొంతకాలంగా రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న ఈ డ్యామ్ పరిసరాల్లో తరచూ బాంబు దాడులు జరుగుతున్నాయి. రణక్షేత్రంగా మారిన ఈ ప్రాంతంపై ఇరుపక్షాల్లో ఒకరు పొరపాటున భారీ దాడి చేసిఉంటారని, నిర్లక్ష్యం కూడా అయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగకుండా వస్తున్న వరదనీటితో దిగువ ప్రాంతాల్లో వచ్చే 20 గంటల్లో మరో మూడు అడుగులమేర నీరు నిలుస్తుందని అధికారుల ఆందోళన వ్యక్తంచేశారు. విస్తారమైన ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రిజర్వాయర్లలో కఖోవ్కా డ్యామ్ కూడా ఒకటి. గత ఏడాది రష్యా ఆక్రమించిన ఖేర్సన్ ప్రాంతంలోనే ఈ డ్యామ్ ఉంది. ఖేర్సన్ సిటీకి కేవలం 44 మైళ్లదూరంలో ఈ డ్యామ్ ఉండటంతో ఇప్పటికే వరదనీరు సిటీలోకి ప్రవేశించింది. వరదనీటి మట్టం పెరిగితే ఖేర్సన్కు కష్టాలు పెరుగుతాయి. డ్యామ్ పూర్తిగా పాడవలేదని, ఇంకా చాలా నీరు నిల్వ ఉందని, కొద్దిరోజుల్లో మొత్తం డ్యామ్ నేలమట్టమైతే మరో దఫా వరద ఖాయమని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా అప్డేట్లో పేర్కొంది. ఈ శాఖ తరచూ యుద్ధసమాచారాన్ని అందరితో పంచుకుంటోంది. తాగేందుకు నీరే లేదు: జెలెన్స్కీ ‘కుట్ర పన్ని రష్యా ఈ డ్యామ్‌ను నేలమట్టం చేసింది. వేలాది మంది ప్రజలకు కనీసం తాగు నీరు లేకుండా పోయింది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ఇది రష్యా పనే: అమెరికా మేథో సంస్థ ‘నీపర్ దిగువ ప్రాంతాలను వరదమయం చేస్తే రష్యాకే మేలు. ఉక్రెయిన్ సేనలు మళ్లీ ఆప్రాంతాలను చేజిక్కించుకోకుండా ఆలస్యం చేయడం రష్యా ఎత్తుగడ. అందుకే తమకు కొంచెం నష్టం జరుగుతుందని తెల్సికూడా ఇలా డ్యామ్‌ను పేల్చేసింది’ అని రక్షణ, విదేశీవ్యవహారాల విశ్లేషణ మేథోసంస్థ, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని ‘స్టడీ ఆఫ్ వార్’ వ్యాఖ్యానించింది. పొంచి ఉన్న ధరాఘాతం గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె, ఇతర ఆహార ఉత్పత్తుల్ని భారీ స్థాయిలో పండిస్తూ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చడంలో ఉక్రెయిన్ కీలక భూమిక పోషిస్తోంది. డ్యామ్ వరదనీటితో పంట నష్టం వాటిల్లి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు తగ్గి డిమాండ్ పెరిగి ధరలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. డ్యామ్ కూలిన ఈ కొద్ది గంటల్లోనే గోధుమ ధరలు 3 శాతం ఎగబాకాయి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని కొన్ని దేశాలు ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులపై ఆధారపడు తున్నాయి. డ్యామ్ కూల్చివేత కారణంగా కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. డ్యామ్‌ను బాగుచేసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఈ యుద్ధతరుణంలో ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. -
ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన.. డబ్బు చెల్లించమంటూ లేఖ!
చత్తీస్‌గఢ్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ ఫోన్ కోసం రిజర్వాయర్ నీటిని ఎత్తిపోయించడంతో సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఫోన్ కోసం నీటిని వృధా చేసినందుకు గానూ అతడి జీతం నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదంటూ సబ్ డివిజనల్ అధికారి ఆర్కే ధివర్‌కు ఈనెల 26న లేఖ రాశారు. వృధాగా పోయిన 21 లక్షల నీటి కోసం ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ వేతనం నుంచి డబ్బు వసూలు చేయండని అని లేఖలో పేర్కొన్నారు. వేసవిలో సాగు నీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని ఆ లేఖలో తెలిపారు. అయితే సదరు ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ తన ఫోన్లో అధికారిక డిపార్టమెంటల్ డేటా ఉన్నందున దాన్ని తిరిగి పొందేందుకు యత్నించినట్టు తెలిపాడు. నిజానికి ఆ నీరు ఆ నిరుపయోగంగానే ఉందంటూ వాదిస్తున్నాడు. తాను వారాంతం కావడంతో తన స్నేహితులతో కలిసి కాంకేర్ జిల్లాలోని ఖేర్‌కట్టా డ్యామ్ వద్ద స్నానం చేయడానికి వెళ్లానని, సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఫోన్ డ్యామ్ నీటిలో పడిపోయిందని చెప్పాడు. స్థానికులు ప్రయత్నించి విఫలమయ్యారు. అందులోని నీరుని రెండు నుంచి మూడడుగులు తోడిస్తే ఫోన్ దొరుకుతుందని అక్కడి వారు చెప్పడంతో.. ఎస్డీఓకి కాల్ చేసి అభ్యర్థించానని చెప్పుకొచ్చాడు. ఆయన అదేమంతా సమస్య కాదనడంతో ముందుకెళ్లానని చెబుతున్నాడు. మూడు, నాలుగు అడుగుల నీటిని తోడించగానే తన ఫోన్ దొరికేసిందని రాజేష్ చెప్పారు. ఎక్కువ మొత్తంలో నీరు ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే కేవలం మూడు లేదా నాలుగు అడుగుల నీటిని తోడించేందుకు అంగీకరించానని, అందుకు స్థానికుల సాయం కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా జలవనరుల శాఖ అధికారి మాత్రం తాను ఐదడుగులు నీటిని తీసేందుకే పర్మిషన్ ఇచ్చానని చెబుతుండటం గమనార్హం. (చదవండి: రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్‌లో నీటిని ఎత్తిపోశాడు.. తీరాచూస్తే..) -
రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్‌లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే..
అసలే ఎండాకాలం. నీటి ఎద్దడి సమస్యను చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. డబ్బుల లాగే నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. నీటిని కానీ ఓ అధికారి తన సెల్‌ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్‌లోని నీటిని బయటకు ఎత్తిపోశారు. తన స్వార్థం కోసం వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేశాడు. ఏం అని ప్రశ్నిస్తే.. ఆ నీరు వాడుకకు పనికిరానిదని, కలెక్టర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నాడు. అసలు ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో చుద్దాం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కంకారా జిల్లాలోని కొల్లిబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరాఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవు దినాన్ని సరదాగా గడపడానికి ఖేర్కట్ట డ్యామ్‌కు వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్‌ఫోన్ రిజర్వాయర్‌లో జారిపడింది. స్థానిక ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. డ్యామ్ దాదాపు 15 అడుగుల లోతు ఉంటుందని, నీరు 10 అడుగుల లోతు ఉన్నాయని భావించారు. దీంతో 30హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను మూడు రోజులపాటు ఉపయోగించి 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. ఈ నీటితో దాదాపు 1500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోసినట్లు అధికారులు చెప్పారు. అయితే చివరికి రాజేష్‌కు తన ఫోన్ లభించింది. కానీ అది మూడు రోజులు వాటర్‌లో ఉండటం వల్ల పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనంతరం శుక్రవారం సదరు అధికారిని సస్పెండ్ చేశారు.దీనిపై స్పందించిన నెటిజన్లు ఫుడ్ ఆఫీసర్‌పై మండిపడుతున్నారు. ఒక ఫోన్ కోసం వందల ఎకరాలకు ఉపయోగపడే నీటిని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విలువ తెలిసిన వారు ఇలా చేయరని హితవు పలుకుతున్నారు. అతనిని చట్టం ప్రకారం శిక్షించాలని సూచిస్తున్నారు. చదవండి: Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు దీనిపై ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ మాట్లాడుతూ.. ‘నేను స్నేహితులతో డ్యామ్‌లో ఈతకొట్టడానికి వెళ్లాను. ఈ క్రమంలో ఫోన్ నీటిలో పడిపోయింది. అందులో అధికారిక సమాచారం ఉంది. ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నాలుగు అడుగుల మేర నీటిని ఎత్తిపోస్తే ఫోన్‌ను కనిపెట్టోచ్చని అన్నారు. దీంతో స్థానిక నీటి వనరుల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. నా ఫోన్ దొరికింది. ఈ నీరు సాగుకు పనికి రాదు. నా చర్య వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు.’ అని తెలిపారు. మరోవైపు రాజేశ్ విశ్వాస్ అనే అధికారికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని నీటి వనరుల అధికారులు పేర్కొన్నారు. కేవలం వర్బల్గానే అనుమతి పొందారని తెలిపారు. నాలుగు అడుగుల మేర నీటిని మాత్రమే ఎత్తిపోయడానికి అనుమతి ఇచ్చామని, అంతకంటే ఎక్కువ నీటిని ఎత్తిపోశారని అధికారులు తెలిపారు. #Chhattisgarh के अंतागढ़ में फूड इंस्पेक्टर ने अपना मोबाइल खोजने के लिए बहा दिया परलकोट जलाशय का 21 लाख लीटर पानी! फोन मिल गया फूड इंस्पेक्टर का कहना है - उन्होनें कुछ गलत नहीं किया, वहीं मंत्री @amarjeetcg कार्रवाई की बात कह रहे है।@ZeeMPCG @mohitsinha75 @RupeshGuptaReal pic.twitter.com/c0qcPpOUrd — कुलदीप नागेश्वर पवार Kuldeep Nageshwar Pawar (@kuldipnpawar) May 26, 2023 -
గోదారమ్మ మణిహారంలో కలికితురాయి
పోలవరం జలవిద్యుత్కేంద్రం నుంచి సాక్షి ‘ప్రత్యేక’ ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు: గోదారమ్మ మణిహారంలో మరో కలికితురాయి ఒదగనుంది. పోలవరం జాతీయ బహుళార్ధక సాధక ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలవిద్యుత్కేంద్రాలలో ఇదే అతి పెద్దది కావడం గమనార్హం. జలాశయం పనులు పూర్తయ్యేలోగా జలవిద్యుత్కేంద్రం పనులనూ పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలవరం జలవిద్యుత్కేంద్రం పూర్తయితే రాష్ట్ర విద్యుత్ ముఖచిత్రంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని విద్యుత్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–1కి ఎడమవైపున కొండను తొలచి 960 మెగావాట్లు (1280) సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించే డిజైన్‌ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. రివర్స్ టెండరింగ్‌తో రూ.405.23 కోట్లు ఆదా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టులో మిగిలిన రూ.3,302 కోట్ల విలువైన పనులను 2018 ఫిబ్రవరి 27న నామినేషన్ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టిన టీడీపీ సర్కార్ రూ.3,216.11 కోట్ల వ్యయంతో జలవిద్యుత్కేంద్రం పనులను కూడా అదే సంస్థకు కట్టబెట్టింది. ఆ సంస్థ నుంచి నాటి సీఎం చంద్రబాబు భారీగా ముడుపులు వసూలు చేసుకున్నారు. ఈ అక్రమాలపై నిపుణుల కమిటీతో విచారణకు ఆదేశించిన సీఎం వైఎస్ జగన్.. కమిటీ సిఫార్సుల మేరకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. జలవిద్యుత్కేంద్రం పనులను రూ.2,810.88 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.405.23 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు అక్రమాల బాగోతాన్ని రివర్స్ టెండరింగ్ బట్టబయలు చేసింది. శరవేగంగా పనులు.. టీడీపీ హయాంలో జలవిద్యుత్కేంద్రం పనుల్లో ఎలాంటి ప్రగతి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం జలవిద్యుత్కేంద్రం నిర్మాణానికి వీలుగా గోదావరి ఎడమ గట్టుపై ఉన్న కొండను తొలిచే పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. – జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్లు(సొరంగాలు) తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. 150.3 మీటర్ల పొడవు, 9 వ్యాసంతో కూడిన 12 టన్నెళ్లను తవ్వారు. – ప్రెజర్ టన్నెళ్లలో ఫెరోల్స్ అమర్చి లైనింగ్ పనులను చేపట్టారు. ఇప్పటికే ఏడు టన్నెళ్లలో ఫెరోల్స్ అమర్చి లైనింగ్ పనులను దాదాపుగా పూర్తి చేశారు. సొరంగాల ద్వారా నీరు సక్రమంగా వెళ్లేందుకు లైనింగ్ తోడ్పడుతుంది. – ఒక్కో టన్నెల్లో 52 ఫెరోల్స్ చొప్పున 12 టన్నెళ్లలో 624 ఫెరోల్స్‌ను అమర్చనున్నారు. 9 మీటర్ల వ్యాసం, 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన ఇనుప రేకులతో వీటిని తయారు చేశారు. ఫెరోల్స్ తయారీకి మొత్తం 8520 టన్నుల స్టీల్‌ను వినియోగించారు. – ఈ టన్నెళ్లకు చివర తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. టర్బైన్ల పునాది పనులను వేగవంతం చేశారు. – వర్టికల్ కెప్లాన్ టర్బైన్ల తయారీని భోపాల్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈల్కు అప్పగించారు. ఈ టర్బైన్లు ఆసియాలోనే అతి పెద్దవి కావడం గమనార్హం. హిమాలయ జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా.. – గోదావరి నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహమంతా పోలవరం ప్రాజెక్టు మీదుగానే ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతోంది. – జలవిద్యుత్కేంద్రంలో ఒక సొరంగం (యూనిట్) ద్వారా 80 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే రోజుకు 331 క్యూమెక్కులు (11,690 క్యూసెక్కులు) నీటిని విడుదల చేయాలి. ఈ లెక్కన 12 సొరంగాలలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలంటే 1,40,280 క్యూసెక్కులు (12 టీఎంసీలు) అవసరం. – పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు వద్దకు జూలై నుంచి అక్టోబర్ రెండో వారం వరకూ ఏడాదికి సగటున 100 నుంచి 120 రోజుల వరకూ 1.50 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద ప్రవాహం వస్తుంది. అంటే ఏడాదికి సుమారు వంద నుంచి 120 రోజులు పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. – ఆ తర్వాత వరద ప్రవాహం తగ్గిన మేరకు విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. గోదావరి డెల్టాకు రబీ పంటలకు పోలవరం నుంచే నీటిని విడుదల చేయాలి. వాటిని విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తారు. అంటే ఏడాది పొడవునా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. – అందువల్ల హిమాలయ నదులపై ఏర్పాటు చేసిన జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి అవుతుందిన అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఛత్తీస్‌గఢ్: కొండగావ్ జిల్లాలో విషాదం.. డ్యామ్‌లోకి స్నానానికి దిగిన నలుగురు విద్యార్థుల గల్లంతు
-
మానవుడు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ
-
ఒక డ్యామ్.. భూమిని స్లో చేసింది
ప్రపంచంలోనే అతి భారీగా.. చైనాలోని యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్‌ను నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యామ్.. 2.33 కిలోమీటర్ల పొడవునా 181 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీనితో 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుందని అంచనా. రోజు పెరిగింది.. భారీ డ్యామ్, రిజర్వా యర్‌లో నిలిచే నీటి బరువు ఓవైపు.. డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరు 150 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంటే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్ప డిందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భూమి భ్రమణవేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని.. రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు. అంతేకా దు ఈ భారీ డ్యామ్ వల్ల.. భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏమిటీ ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’? వేగంగా, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు జడత్వం (ఇనెర్షియా) నెలకొని.. సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి.. భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి పొరల కదలికలు కూడా ప్రభావితమయ్యాయని, చిన్న స్థాయిలో భూకంపాలు వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ డ్యామ్‌ను పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. త్రీగోర్జెస్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్.. భూమ్మీద మనుషులు నిర్మించిన డ్యామ్‌లలో అదీ ఒకటి అంతేకదా అంటారా.. కాదు.. అది అన్నింటిలో ఒకటి కాదు.. ఏకంగా భూమి తిరగడాన్నే స్లో చేసేసింది. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్