ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈస్ట్రన్ రెడ్ సీ ప్రాంతంలో ఒక డ్యామ్ తెగిపోవడంతో పలువురు మృతిచెందారని, లెక్కలేనంతమంది గల్లంతయ్యారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందారని, 100 మంది గల్లంతయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎడతెగని భారీ వర్షాలకు అర్బత్ డ్యామ్ తెగిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతిచెందారనేది ఇంకా తెలియలేదు. పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. స్థానిక అధికారి ఒకరు సుడానీస్ వార్తా వెబ్‌సైట్ అల్-తాగిర్‌తో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందివుండవచ్చని, లెక్కలేంతమంది గల్లంతైవుంటారని అన్నారు. ఈ ప్రమాదం కారణంగా జరిగిన నష్టం తీవ్రవమైనదని నీటిపారుదలశాఖ అధికారి అమర్ ఇసా తాహిర్ మీడియాకు తెలిపారు.
సూడానీస్ వార్తా సంస్థ మెదామిక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు. సమీప గ్రామప్రజలు కొండలపైకి చేరుకుని తలదాచుకున్నారని తెలుస్తోంది. ఈ డ్యామ్ పోర్ట్ సూడాన్ నగరానికి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం శనివారం రాత్రి ఈ డ్యామ్ కూలిపోయింది. సూడాన్‌లో ప్రతి ఏటా వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సంభవిస్తున్న వరదలకు వందలాది మంది మృతి చెందగా, పెద్ద ఎత్తున పంటనష్టం ఏర్పడింది.
🇸🇩 SE COLAPSA PRESA DE JOR ARBAAT EN SUDÁN
Al menos 60 personas perdieorn la vida ahogadas, luego de registrarse el colpaso de la presa de #JorArbaat, ubicada al este de #Sudán, que terminó por inundar al menos 5 pueblos con 5,000 habitantes cada una.
Según reportan, la presa… pic.twitter.com/TH5eS6ePps— 𝗧𝗵𝗲 𝗠e𝘅𝗶𝗰𝗼 𝗣𝗼𝘀𝘁 (@MexicoPost) August 27, 2024
Comments
Please login to add a commentAdd a comment