శ్రీశైలం జలాశయానికి వరద జలాలు
Published Fri, Sep 23 2016 1:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి బుధవారం నుంచి గురువారం వరకు ఒక టీఎంసీ జలాలు వచ్చి చేరాయి. సెల్ఫ్ క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా, ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వరద నీరు విడుదల అవుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం సమయానికి జూరాల నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి విడుదలవుతోంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,680 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. డిమాండ్‌ను బట్టి గురువారం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో పీక్‌లోడ్ అవర్స్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంపరిసర ప్రాంతాల్లో 25.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 874.30 అడుగులుగా నమోదైంది.
Advertisement