శ్రీశైలంలో 97.6 టీఎంసీల నీరు
Published Wed, Jan 18 2017 12:13 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయంలో మంగళవారం సాయంత్రం సమయానికి 97.6076 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన జరుగుతుండడంతో నీటినిల్వలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. డిమాండ్‌ను బట్టి రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.320 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.529 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 9,444 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 1,000 క్యూసెక్కులు, హంద్రీనివా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 420 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ నీటిమమట్టం 857.10 అడుగులుగా నమోదైంది.
Advertisement
Advertisement